లాభాల్లో స్టాక్ మార్కెట్లు | Sensex opens higher, Nifty eyes 9200 | Sakshi
Sakshi News home page

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Published Tue, Apr 11 2017 9:44 AM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

Sensex opens higher, Nifty eyes 9200

సిరియా ఆందోళనలు, నాలుగో క్వార్టర్ ఫలితాలు ప్రకటన నేపథ్యంలో సోమవారం నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. బ్యాంకులు, టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మద్దతుతో ట్రేడింగ్ ప్రారంభంలో నిఫ్టీ 9200 లెవల్ కు దగ్గర్లో ట్రేడైంది.. ప్రస్తుతం 12.50 పాయింట్ల లాభంలో 9193 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ సైతం స్వల్పంగా 74.74 పాయింట్లు లాభపడుతూ 29,650 గా నమోదవుతోంది. ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. అంచనావేసిన దానికంటే మెరుగ్గానే ఇన్ఫీ ఫలితాలను ప్రకటిస్తుందని అంచనాలు వస్తుండటంతో ఈ కంపెనీ షేర్లు లాభాలు పండిస్తున్నాయి.
 
ఫెడరల్ రిజర్వు రేట్లు పెంచుతుందనే అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోతూ వస్తోంది. నిన్న 28 పైసలు క్షీణించిన రూపాయి, నేడు మరింత కిందకి  35 పైసల నష్టంలో ట్రేడవుతోంది. ఆసియన్ ఈ‍క్విటీలు కూడా ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత పరిస్థితుల ఆందోళనలు కొనసాగుతూ ఉండటంతో వాల్ స్ట్రీట్ కూడా కిందకే క్లోజైంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర 72 రూపాయలు పెరిగి 28,756గా నమోదవుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement