Oracle Company
-
టెక్ డీల్స్- యూఎస్ మార్కెట్ల జోరు
టెక్నాలజీ రంగంలో డీల్స్, కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్‌పై అంచనాలు సోమవారం యూఎస్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో డోజోన్స్ 328 పాయింట్లు(1.2%) ఎగసి 27,993 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 43 పాయింట్లు(1.3%) లాభపడి 3,384 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 203 పాయింట్లు(2%) జంప్‌చేసి 11,057 వద్ద స్థిరపడింది. కారణాలేవింటే? కోవిడ్-19 కట్టడికి బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై మళ్లీ అంచనాలు పెరిగాయి. సైడ్‌ఎఫెక్ట్స్‌పై సందేహాలతో తాత్కాలికంగా నిలిపివేసిన మూడో దశ క్లినికల్ పరీక్షలను ఆస్ట్రాజెనెకా తిరిగి ప్రారంభించింది. అంతేకాకుండా అక్టోబర్‌కల్లా పరీక్షల డేటా విశ్లేషణను అందించగలమని పేర్కొంది. ఫార్మా దిగ్గజం పైజర్ సీఈవో ఆల్బర్ట్ సైతం డిసెంబర్‌కల్లా వ్యాక్సిన్‌ను విడుదల చేయగలమని తాజాగా ప్రకటించారు. దీంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. 21 బిలియన్ డాలర్లతో ఇమ్యునోమెడిక్స్ను కొనుగోలు చేయనున్నట్లు ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ పేర్కొంది. తద్వారా క్యాన్సర్ చికిత్సను మరింత విస్తరించనున్నట్లు తెలియజేసింది. ఒరాకిల్ చేతికి టిక్‌టాక్ చైనీస్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు తాజాగా సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ రేసులోకి వచ్చింది. ప్రతిపాదిత డీల్ ప్రకారం టిక్‌టాక్ ప్రమోటర్ బైట్‌డ్యాన్స్‌కు ఒరాకిల్ సాఫ్ట్వేర్ భాగస్వామిగా నిలవనుంది. తద్వారా యూఎస్ వినియోగదారుల డేటాను నిర్వహించనుంది. అంతేకాకుండా టిక్‌టాక్ యూఎస్ విభాగంలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుంది. మరోవైపు 40 బిలియన్ డాలర్లు వెచ్చించడం ద్వారా పీఈ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ నుంచి ఆర్మ్ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా తాజాగా వెల్లడించింది. జోరు తీరు.. మార్కెట్లకు సోమవారం పలు బ్లూచిప్ కౌంటర్లు దన్నుగా నిలిచాయి. ఆర్మ్ హోల్డింగ్స్‌ను సొంతం చేసుకోనున్న ఎన్విడియా 6 శాతం జంప్‌చేయగా.. టిక్‌టాక్‌పై కన్నేసిన ఒరాకిల్ 4.3 శాతం ఎగసింది. ఈ ప్రభావంతో చిప్ కంపెనీలు ఏఎండీ, మైక్రాన్, స్కైవర్క్స్ సైతం 2-1 శాతం మధ్య బలపడ్డాయి. ఇక కొద్ది రోజులుగా దిద్దుబాటుకులోనైన ఐఫోన్ల దిగ్గజం యాపిల్ 3 శాతం పుంజుకోగా.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా 13 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో మైక్రోసాఫ్ట్ 0.7 శాతం లాభపడగా.. ఫార్మా బ్లూచిప్స్ ఫైజర్ 2.6 శాతం, ఆస్ట్రాజెనెకా 0.6 శాతం చొప్పున ఎగశాయి. -
టిక్‌టాక్ యూఎస్‌పై ఒరాకిల్ కన్ను!
చైనీస్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు తాజాగా సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ రేసులోకి వచ్చింది. ఇటీవల టిక్‌టాక్ యూఎస్ కార్యకలాపాలను సొంతం చేసుకునేందుకు వాల్‌మార్ట్‌తో జత కట్టిన ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చలు నిర్వహించింది. అయితే ఈ చర్చలు విఫలమైనట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. దీంతో టిక్‌టాక్ యూఎస్ విభాగాన్ని దక్కించుకునేందుకు ఐటీ కంపెనీ ఒరాకిల్ పావులు కదుపుతున్నట్లు విదేశీ మీడియా పేర్కొంది. ప్రతిపాదిత డీల్ ప్రకారం టిక్‌టాక్ ప్రమోటర్ బైట్‌డ్యాన్స్‌కు ఒరాకిల్ సాఫ్ట్వేర్ భాగస్వామిగా నిలవనుంది. తద్వారా యూఎస్ వినియోగదారుల డేటాను నిర్వహించనుంది. అంతేకాకుండా టిక్‌టాక్ యూఎస్ విభాగంలో వాటాను కొనుగోలు చేయనుంది. కాగా.. మరోపక్క టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌తో నిర్వహించిన చర్చలు ఫలప్రదంకాలేదని మైక్రోసాఫ్ట్ తాజాగా వెల్లడించింది. అయితే టిక్‌టాక్ వినియోగదారులకు సంబంధించి జాతీయ భద్రతను కాపాడుతూనే ప్రైవసీ, ఆన్లైన్ సెక్యూరిటీ తదితర అంశాలలో పటిష్ట చర్యలు తీసుకోగలమని వెల్లడించింది. దీంతో ఇప్పటికే తమ ప్రతిపాదనలపట్ల నమ్మకంగా ఉన్నట్లు తెలియజేసింది. దేశీ విభాగం ? చైనీస్ వీడియో యాప్ టిక్‌టాక్ యూఎస్ విభాగం కొనుగోలుకి యూఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలయితే మేలని ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో టిక్‌టాక్ టేకోవరకు సాఫ్ట్వేర్ కంపెనీలయితే ప్రభుత్వ అనుమతి లభించగలదని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. యూఎస్ విభాగాన్ని కొనుగోలు చేయడంతోపాటు టిక్‌టాక్ ఇండియా కార్యకలాపాలను సైతం చేజిక్కించుకోవాలని మైక్రోసాఫ్ట్ భావిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. డేటా భద్రత విషయానికి సంబంధించి ఇప్పటికే దేశీయంగా టిక్‌టాక్ యాప్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం విదితమే. -
గర్ల్ ఫ్రెండ్ కోసం భార్య హత్య: ఒరాకిల్ ఉద్యోగి అరెస్ట్
బెంగళూరు: అతికిరాతకంగా భార్యను హత్య చేసి 15 సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న ఓ ప్రబుద్ధుడికి పోలీసులు చెక్ పెట్టారు. పేరు మార్చుకుని ప్రముఖ ఐటీ కంపెనీ ఒరాకిల్‌లో ఉద్యోగం వెలగబెడుతూ, సంవత్సరానికి రూ. 22 లక్షల జీతంతో దర్జాగా బతుకుతున్న తరుణ్ కుమార్ జినారాజ్, అలియాస్ ప్రవీణ్ (42) చివరకు కటకటాల వెనక్కి వెళ్లాడు. వివరాల్లోకి వెళ్లితే.. అహ్మదాబాద్ వాసి తరుణ్‌కు, బ్యాంకు ఉద్యోగి సాజ్నితో నవంబరు 15, 2002న వివాహం జరిగింది. కానీ పెళ్లయిన నాలుగు నెలలకే (2003 ఫిబ్రవరి,14) ఆమెను చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. పైగా చోరీకి వచ్చిన దొంగలు ఆమెను హత్య చేసారని అత్తమామలు సహా అందర్నీ నమ్మించాడు. అయితే ఎన్నాళ్లనుంచో ఇతగాడికోసం గాలిస్తున్న పోలీసులు ఇటీవల తరుణ్ తల్లి అన్నమ్మని విచారించారు. ఆమె తరచూ బెంగళూరుకు వెళ్లి రావడంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె ఫోన్‌కాల్స్‌పై నిఘా పెట్టారు. ఇక్కడే బాబు పోలీసులకు చిక్కాడు. బెంగళూరు ఒరాకిల్ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ ద్వారా అన్నమ్మకు వచ్చిన ఫోన్ కాల్స్ పోలీసులు కూపీ లాగగా విషయం వెలుగులోకి వచ్చింది. అయితే విచారణ అధికారి కిరణ్ చౌదరికి ఒరాకిల్ ఆఫీసులో తరుణ్ ఆచూకీ అంత ఆషామాషీగా దొరకలేదు. చివరకు పాత ఫోటోల ద్వారా గుర్తించి, నాటకీయంగా డైరెక్టుగా తరుణ్ (ప్రవీణ్) క్యాబిన్ దగ్గరి కెళ్లి.."హలో తరుణ్, నీ కథ ముగిసింది ...లెట్స్ గో" అనడంతో ప్రవీణ్ అవాక్కయ్యాడు. మొదట్లో తిరస్కరించినా చివరికి నేరాన్ని అంగీకరించక తప్పలేదు. అంతేకాదు తన భార్య(నిషా)కు ఫోన్ చేసి తన అసలు స్వరూపాన్ని కూడా వివరించాడట. ఎలా తప్పించుకున్నాడు? మధ్యప్రదేశ్‌లోని మండౌరుకు చెందిన తన పాతస్నేహితుడి సర్టిఫికెట్లను దొంగిలించి ప్రవీణ్ భాట్లీగా అవతరించాడు. ఎవరూ గుర్తు పట్టలేనంతగా పూర్తిగా మారిపోయాడు. నకిలీ సరిఫికెట్లతో ముందు కొంతకాలం పుణేలో కాల్ సెంటర్లో పనిచేశాడు. అక్కడే 2009లో నిషాను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బెంగళూరు ఓరాకిల్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగంలో చేరాడు. నైట్ షిఫ్ట్‌లు మాత్రమే చేస్తూ తన గుట్టు ఎవరికీ తెలియకుండా గోప్యతను పాటించాడు. తల్లిదండ్రులు, తమ్ముడు కారు యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పి నమ్మించి మరీ నిషా పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సాజ్ని తల్లితండ్రులు కృష్ణన్, రమణి కేరళలోని త్రిసూర్‌కు చెందినవారు. ఆ తరువాత వారు అహ్మదాబాద్‌లో సెటిల్ అయ్యారు. అక్కడే పుట్టి పెరిగిన సాజ్ని బ్యాంకులో పని చేస్తున్నారు. వీరి పరిచయం నాటికి అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో వాలీబాల్ కోచ్ గా పని చేసేవాడు తరుణ్. అప్పటికే సాజ్ని పనిచేస్తున్న బ్యాంకు పనిమీద ఒకటి రెండు సార్లు సాజ్ని ఇంటికి వచ్చాడు తరుణ్. ఈ క్రమంలో పెద్దల అంగీకారంతోనే సాజ్నిని పెళ్లి చేసుకున్నాడు. తరుణ్ అరెస్ట్‌పై కృష్ణన్, తరుణ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ బిడ్డ చనిపోయిన తరువాత తమ జీవితం శూన్యంగా మారిపోయిందనీ, ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ బతికామని చెప్పారు. మొదట్లో మర్యాద ప్రవర్తనతో సాజ్ని భర్త, ఆ తరువాత పోలీస్ దర్యాప్తులో పోలీసులు తమను తప్పుదారి పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. తరుణ్ గొప్ప నటుడు అనీ, అతని ప్రవర్తన తమకు ఎపుడూ అనుమానాస్పదంగా కనిపించలేదని, తమని చూడగానే లేచి నిలబడుతూ చాలా నెమ్మదిగా, సంస్కారవంతంగా ఉండేవాడని తెలిపారు. అప్పటికే మరో మహిళతో సంబంధమున్న సంగతి కూడా తమకు తెలియదన్నారు. కానీ పెళ్లి తరువాత అనుకున్నంత అతను మంచివాడు కాదంటూ తన కూతురు బాధపడిందనీ, తన డబ్బంతా తరుణ్ బలవంతంగా లాగేసుకుంటున్నాడని వాపోయిందని కూడా గుర్తు చేసుకున్నారు. పకడ్బందీగా హత్య దొంగతనం జరిగినట్టుగా ఇల్లంతా చిందర వందర చేశాడు. బీరువాలోని వస్తువులన్నీ లాగి పడేశాడు. సాజ్ని మెడలోని బంగారం గొలుసును రెండు ముక్కలు చేశాడు. విమాన టికెట్లను, కొంత సొమ్మును కూడా కింద పడేశాడు. (మరునాడు ఆమె ట్రైనింగ్ కోసం బయలుదేరాల్సి ఉంది). ఆమె చున్నీతోనే ఉరిబిగించి చంపేసినట్టుగా సీన్ క్రియేట్ చేశాడు. గాయాలు, షాకుకు గురయ్యాననే పేరుతో సమీపంలోని ఆసుపత్రి ఐసీయూలో చేరాడు. అనుమానం ఎక్కడ మొదలైంది మరునాడు పోస్ట్‌మార్టం అనంతరం ఇంటికి తీసుకొచ్చిన సాజ్ని మృతదేహాన్ని చూసి ఆసుపత్రి నుంచి వచ్చిన తరుణ్ బోరున విలపిస్తూ మరోసారి తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించాడు. కానీ సాజ్నీ మెడలోని చున్నీని వాసన చూసిన స్నిఫర్ డాగ్స్ మాత్రం అతగాడి వాసన పసిగట్టాయి. గట్టిగా అరవడం మొదలు పెట్టాయి. దీంతో అప్పటివరకూ సంస్కారవంతమైన అల్లుడిగా భావించిన కృష్ణన్ , రమణలకు అనుమానం మొదలైంది. తమ కూతురు చెప్పిన సంగతులు గుర్తొచ్చాయి. అంతేకాదు..ఇక్కడ బోరున ఏడ్చి కారెక్కిన తరువాత నవ్వుతున్నాడంటూ అక్కడున్నవారు గొణుక్కోవడం కూడా సాజ్ని తల్లి చెవిన పడింది. దీంతో వారు తరుణ్‌పై కేసు నమోదు చేశారు. కానీ అప్పటినుంచి తరుణ్ పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు. 15సంవత్సరాల తరువాత కేసును ఎలా ఛేదించారు నిజానికి ఈ హత్య కేసు పదిహేను సంవత్సరాల తరువాత ఛేదించడమే విశేషం. ఇందుకు సాజ్ని తల్లి దండ్రులు పెద్దపోరాటమే చేశారు. తరుణ అరెస్ట్ అనంతరం మాట్లాడుతూ రాజకీయాల్లో చేరకు ముందు నుంచే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాగా తెలుసుననీ, ఆయన తరచుగా తమ ఇంటికి కూడా వచ్చేవారని రమణి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సాజ్ని హత్య జరిగాక దాదాపు ఆరేళ్ల తరువాత తమకు అత్యంత సన్నిహితుడి ద్వారా మోదీని పలుమార్లు కలిసి, తమకు న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించామని కృష్ణన్, రమణి దంపతులు వివరించారు. దీంతో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎకె శర్మ , డీసీపి హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో 6 సంవత్సరాల సుదీర్ఘ విచారణ ప్రారంభమైంది. ఆ తరువాత డీసీపీ దీపన్ భద్రాన్ ఆధ్వర్యంలోని బృందం చాకచక్యంగా తరుణ్ ఆట కట్టించింది. తరుణ్ తల్లికి వచ్చిన దాదాపు లక్ష ఫోన్ కాల్స్‌ను పరిశీలించామని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక పోలీసు కమిషనర్ జేకే భట్ చెప్పారు. వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా ఫిబ్రవరి 14న హత్య గర్ల్ఫెండ్కు వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా భార్య హత్య చేసినట్టుగా పోలీసులు విచారణలో తేలింది. భార్యను హత్య చేసిన అనంతరం గర్ల్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేశాడు తరుణ్. కానీ హంతకులతో తనకు స్నేహం అక్కరలేదని ఖరాకండిగా తేల్చి చెప్పిందట ఆమె. -
సదువైన బందు చేస్త గాని, బాసరకు పొయ్యేది లేదు..
వర్ధెల్లి అరుణాకృష్ణ, సాక్షి, సూర్యాపేట తండ్రి రోజు కూలీగా పని చేశాడు... కొడుకు మాత్రం మట్టిలో మాణిక్యంలా మెరిశాడు. తాను తెచ్చుకున్న మార్కులకు ట్రిపుల్ ఐటీలో ఉచిత సీటు వస్తుందన్నా వద్దన్నాడు. ఇష్టపడి చదివి మరీ, ఐఐటీలో అఖిల భారత స్థాయిలో 229వ ర్యాంకు సాధించాడు. చదువు పూర్తి అయ్యీ కాకుండానే క్యాంపస్ సెలక్షన్లో ఒరాకిల్ కంపెనీ దాదాపు ఎనభై లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఆస్ట్రేలియాలోని తన సంస్థలో ఉద్యోగమిచ్చేలా చేసుకున్నాడు నసీర్. అక్షర కృషీవలుడైన నసీర్‌ను ప్రయోజకుడిని చేసేందుకు తల్లితండ్రులు జమాలుద్దీన్- రహిమున్నీసాలు తాము పడ్డ కష్టాలను వివరించారిలా... ‘‘మాది నల్గొండ జిల్లా అర్వపల్లి మండలం కోడూరు. ఊరిలో కొద్దిగా కొండ్ర ఉంది. కాని, అందుల పంట తీసే పరిస్థితి లేదు. అందుకే 1992లో పొట్ట చేతబట్టుకుని సూర్యాపేట చేరుకున్నాం. నేను, నా భార్య, ముగ్గురు పిల్లలమూ కలిసి ఒక చిన్న ఇంట్లో కిరాయికి ఉన్నం. దినసరి కూలీగా ఓ పూట పస్తులుంటూ, మరో పూట పెడుతూ, మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదని వాళ్లని ఎట్లాగో అట్లా బళ్లో వేశా. నసీర్ చిన్నప్పటి సంది బాగా సదివేటోడు. గది చూసి వాడి ఇస్కూలు మేస్టర్లే వాడిని నవోదయ ఇస్కూల్లో ఏసిండ్రు. కష్టపడి సదివి పదో తర్గతిల 587 మార్కులు తెచ్చుకున్నడు. ఆ మార్కుల్కి బాసర ఐఐటీ కాలేజీల ఉచిత సీటు వస్తదన్నరు సార్లు. కాని, ఆడు అందుకు ఒప్పుకోలా. సదువైన బందు చేస్త గాని, బాసరకు పొయ్యేది లేదన్నడు. మొదుల్నించి ప్రోత్సహిస్తా వచ్చిన లింగారెడ్డి సారే ఆడిని తీస్కపోయి, హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీల చేర్పించిండు. వాళ్లు సుతా నసీరుకు సానా టెస్టులయ్యీ పెట్టి, అందులో నె గ్గినంక ఇంటర్ నుంచి ఐఐటీ-జేయీయీల ఫిరీ సీటిచ్చిన్రు. నసీరు ఏనాడూ నాకు అవ్వి కావాలనీ, ఇవ్వి కావాలనీ సతాయించెటోడు కాదు. ఆస్టల్ల ఏది పెడితే అది తినెటోడు. లింగారెడ్డి సారే, ఆడికి కావలసిన కితాబులు కొనిచ్చెటోడు. కష్టపడి సద్వి ఇంటర్ల 969 మార్కులు దెచ్చుకుండు. అది అయిపోతల్నే, ఐఐటీ టెస్టు రాసి, అందుల సుత మంచి ర్యాంకు తెచ్చుకున్నడు. కాని, సదివిపిచ్చేటందుకు సమచ్చరాన్కి లక్షా ఇర్వై వేలు అయితదన్నడు. నా కాడ అన్ని పైసల్లేవని చేతులెత్తేసిన. లింగారెడ్డి సారు వచ్చి, మీడియా ద్వారా దాతల సాయం కోరేందుకు ప్రయత్నిస్తనని చెప్పిండు. గట్లనే నాల్గు సంవత్సరాలు దాతల సాయంతోనే ఐఐటీ కాన్పూర్‌ల సద్వు పూర్తి చేసిండు. అంద్ల కూడ మంచి ర్యాంకు తెచ్చుకుండు. క్యాంపస్ సెలక్షన్ల గదేదో ఒరాకిలు కంపెనీ అంట. అంద్ల సమచ్చరానికి డెబ్బయి తొమ్మిది లక్షల జీతమిచ్చే నౌకరి దెచ్చుకుండు. అంతా వాడి కష్టం.. భగమంతుని దయ! ప్రతిభ ఉన్నవారికి పేదరికం ప్రతిబంధకం కాదన్నది నా నమ్మకం. దాన్ని రుజువు చేస్తూ నన్ను మొదటినుంచీ ప్రోత్సహిస్తూ వచ్చారు నవోదయ స్కూలు కరస్పాండెంటు మారం లింగారెడ్డి సార్, మరికొందరు మంచి మనుషులు. వారికి జీవితాంతం రుణపడి ఉంటా! ఈ సమాజం నాకిచ్చిన సహకారాన్ని గుర్తుచేసుకొని తిరిగి సమాజానికిస్తా. ప్రతిభ ఉండీ పేదరికంతో ఉన్నత చదువులకు దూరం అవుతున్న నాలాంటి పేద విద్యార్థులకు తప్పక సాయం చేస్తా! - షేక్ నసీర్ -
సూర్యాపేట విద్యార్థికి రూ.79.18 లక్షల వేతనం
ఒరాకిల్ కంపెనీకి ఎంపిక సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెంది న విద్యార్థి షేక్ నజీర్‌బాబా రూ.79.18 లక్షల వార్షిక వేతనానికి అమెరికాలోని ఒరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఎంపికయ్యాడు. నజీర్‌బాబా ఐఐటీ కాన్పూర్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల ఒకటవ తేదీన ఒరాకిల్ కంపెనీ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించగా.. నజీర్బాబాను అప్లికేషన్ ఇంజీనీర్గా ఎంపిక చేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కాలిఫోర్నియా రెడ్వుడ్సిటీలో ఉద్యోగం చేయనున్నాడు. నజీర్‌బాబా సూర్యాపేటలోని నవోదయ హైస్కూల్లో 2008-09 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదివి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. 2011లో ఐఐటీ ప్రవేశపరీక్షలో 239 ర్యాంకు సాధించి ఐఐటీ కాన్పూర్‌లో సీటు సంపాదించాడు. జమాలుద్దీన్-రహిమున్నీసాలకు ముగ్గురు సంతానం కాగా నజీర్‌బాబా రెండోవాడు, ఇద్దరు కుమార్తెలు. తండ్రి గ్రానైట్ కంపెనీలో కూలీ, తల్లి టైలర్.