టెస్టు జట్టులో గంభీర్ కు చోటు
ముంబై: టీమిండియా బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్ మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. ఏడాదిన్నర తర్వాత అతడికి జట్టులో చోటు దక్కింది. టెస్టు జట్టులో గంభీర్ కు స్థానం కల్పించారు. ఇంగ్లండ్ తో జరగనున్న టెస్టు సిరీస్ కు ఎంపిక చేసిన 18 మంది ఆటగాళ్లలో గంభీర్ కూడా ఉన్నాడు.
వెటరన్ బౌలర్ జహీర్‌ఖాన్ కు మొండిచేయి చూపారు. గాయం కారణంగా అతడిని పక్కనబెట్టారు. ఆరుగురు ఫాస్ట్ బౌలర్లకు చోటు కల్పించారు. రాజస్థాన్ కు చెందిన పొడగరి పేసర్ పంకజ్ సింగ్ కు కూడా పిలుపువచ్చింది. జూలై 19 నుంచి ఇంగ్లండ్ తో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది.
జట్టు: ధోని(కెప్టెన్), విజయ్, ధావన్, గంభీర్, పూజారా, రహానే, కోహ్లి, రోహిత్ శర్మ, జడేజా, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, షమీ, ఈశ్వర్ పాండే, ఇషాంత్ శర్మ, స్టువార్ట్ బిన్నీ, ఆరోన్, సాహా, పంకజ్ సింగ్.