PADERU area
-
ఇంటింటికి సౌర సిరులు
మనకు సూర్యుడున్నాడు.వద్దన్నా రోజూ ఉదయిస్తాడు.సిస్టమ్ ఉంటే పవర్‌ఫుల్‌గా పనిచేస్తాడు.కరెంట్ కష్టాలకు చెల్లు చీటి ఇస్తాడు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఘనంగా 75 ఏళ్ల ఉత్సవాలను కూడా చేసుకున్నాం. కానీ ఇప్పటికీ దేశంలో కరెంటు దీపం వెలగని గ్రామాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు, చుట్టుపక్కల గ్రామాలు కూడా. ఇలాంటి గ్రామాల్లో వెలుగులు నింపారు ఈ హైదరాబాద్ ఇంజనీర్. వాహనం వెళ్లడానికి దారి లేని పాడేరు కొండలను కాలినడకన చుట్టి వచ్చిన రాధికా చౌదరి అక్కడి యాభై గ్రామాల్లో సౌరశక్తితో దీపాలు వెలిగించారు. కోటి ఇళ్లకు సౌర వెలుగులను అందించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఆమె నాలుగు లక్షల ఇళ్లకు సర్వీస్ అందించారు. సోలార్ ఎనర్జీలో కెరీర్‌ని నిర్మించుకున్న రాధిక... పీఎం సూర్య ఘర్ యోజన పథకం ద్వారా లబ్ది పొందమని సూచిస్తున్నారు.మూడు తర్వాత బయటకు రారుపాడేరు కొండల్లో నివసించే ఆదివాసీలు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బయటకు రారు. బయటకు వెళ్లిన వాళ్లు సూర్యుడు అస్తమించేలోపే తిరిగి ఇల్లు చేరాలి కాబట్టి మధ్యాహ్నం మూడు తర్వాత ఇల్లు కదలేవాళ్లు కాదు. అలాంటి వాళ్లకు సౌరశక్తితో దీపం వెలుతురును చూశారు. మన పాడేరు వాసులే కాదు, కశ్మీర్‌లోయలోని లధాక్, లేప్రాంతాలు కూడా సౌర వెలుగును చూశాయి. కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ జిల్లాలతో సహా మొత్తం 27 రాష్ట్రాల్లో 50 పట్టణాల్లో సేవలు అందించారామె. సోలార్ ఉమన్రాధికకు యూఎస్‌లో ఎమ్ఎస్ న్యూక్లియర్ ఇంజనీరింగ్‌లో ఫ్రీ సీట్ వచ్చింది. సోలార్ పవర్‌తో శాటిలైట్లను పనిచేయించడం అనే అంశంలో కోర్సు చేయడానికి నాసా స్పాన్సర్ చేసింది. యూఎస్‌లో కొంతకాలం విండ్ ఎనర్జీలో ఉద్యోగం, మరికొన్నేళ్లు స్వీడిష్ కంపెనీకి పని చేశారామె. ఆల్టర్నేటివ్ ఎనర్జీ సెక్టార్లో అడుగు పెట్టడం నుంచి సోలార్ పవర్ విభాగంలో పని చేయడంలో ఆసక్తి పెంచుకున్నారు రాధిక. ఇండియాలో సర్వీస్ ఇచ్చే అవకాశం రాగానే 2008లో ఇండియాకి వచ్చేశారు. ఆ తర్వాత ఆరేళ్లకు సోలార్ ఎనర్జీలో పని చేసిన సౌరవ్‌తో కలిసి ఫ్రేయర్ ఎనర్జీ ప్రారంభించారు. ‘‘నలుగురు వ్యక్తులం, ఓ చిన్న గది. ఆరు నెలలు జీతం తీసుకోలేదు. ఆ తర్వాత కూడా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని విస్తరించాం. ఇప్పుడు 450 మంది ఉద్యోగులతో పని చేస్తోంది మా సంస్థ’’ అన్నారామె. మనదేశంలో సోలార్ ఎనర్జీ విభాగంలో ఇంత భారీ స్థాయిలో సర్వీస్ అందిస్తున్న ఏకైక మహిళ రాధిక. ఏ వ్యాపారానికైనా ఇండియా చాలా పెద్ద మార్కెట్. కాబట్టి ఇండియా మొత్తాన్ని కవర్ చేయాలన్న కేంద్రప్రభుత్వం విధానాలతో కలిసి పనిచేస్తూ దేశాన్ని సౌరవెలుగులతో నింపడమే ప్రస్తుతానికి ఉన్న ఆలోచన’’ అన్నారామె. ప్రత్యామ్నాయం ఇదిబొగ్గు నిల్వలు తగ్గుతున్నాయి. విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి బొగ్గు గనుల మీద ఆధారపడడం తగ్గించి ఆల్టర్నేటివ్ ఎనర్జీని వినియోగంలోకి తెచ్చుకోవాలి. విండ్ పవర్ అనేది వ్యవస్థలు చేపట్టాల్సిందే కానీ వ్యక్తిగా చేయగలిగిన పని కాదు. ఇక మిగిలింది సోలార్ పవర్. సౌరశక్తిని వినియోగించుకోవడం సాధ్యమే. నిజమే... కానీ ఒక ఇంటికి సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది? దాదాపు లక్ష అవుతుంది. సగటు మధ్య తరగతి నుంచి ‘అమ్మో ఒక్కసారిగా అంత ఖర్చా మా వల్ల కాదు’ అనే సమాధానమే వస్తుంది. అలాంటి వాళ్లకు రాధిక ఇచ్చే వివరణే అసలైన సమాధానం.నాలుగేళ్ల్ల బిల్ కడితే ఇరవై ఏళ్లు ఫ్రీ పవర్ సోలార్ సిస్టమ్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే పాతికేళ్లు పని చేస్తుంది. నెలకు రెండువేల రూపాయలు కరెంటు బిల్లు కట్టే ఇంటికి రెండు కిలోవాట్ల కెపాసిటీ ΄్లాంట్ అవసరమవుతుంది. దాని ఖర్చు లక్షా నలభై వేలవుతుంది. ప్రభుత్వం నుంచి 60 వేల సబ్సిడీ వస్తుంది. వినియోగదారుడి ఖర్చు 80 వేలు. ఏడాదికి 24 వేల రూపాయలు కరెంటు బిల్లు కట్టే వాళ్లకు నాలుగేళ్లలోపు ఖర్చు మొత్తం వెనక్కి వచ్చినట్లే. ఇక కనీసంగా ఇరవై ఏళ్లు సోలార్ పవర్‌ని ఫ్రీగా పొందవచ్చు. సోలార్ పవర్‌ను పరిశ్రమలకు కూడా విస్తరిస్తే కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గుతుంది.– రాధికా చౌదరి,కో ఫౌండర్, ఫ్రేయర్ ఎనర్జీ– వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోహనాచారి -
వింత వాతావరణం.. ఏజెన్సీలో రోజూ వర్షాలే..!
పాడేరు: ఏజెన్సీలో వింత వాతావరణం నెలకొంది. వేసవిలో కూడా రోజూ వర్షాలు కురుస్తుండడంతో పాటు ఉదయం పొగమంచు, సూర్యోదయం తర్వాత ఎండ తీవ్రత అధికంగా ఉంటున్నాయి. దీంతో ఏజెన్సీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారం రోజుల నుంచి అరకులోయ, పాడేరు నియోజకవర్గాల పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంచంగిపుట్టు, జి.మాడుగుల, అరకులోయ, పాడేరు, హుకుంపేట మండలాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. గెడ్డల్లో నీటి ప్రవాహం పెరిగింది. పర్యాటక ప్రాంతాలైన చాపరాయి, కొత్తపల్లి జలపాతాలకు వర్షం నీటితో జలకళ ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, డుంబ్రిగుడ మండలాల్లో భారీ వర్షం కురవడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా ఏర్పడిన నష్టాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని రెవెన్యూ యంత్రాంగానికి సబ్ కలెక్టర్ వి.అభిషేక్ ఆదేశించారు. నాలుగు ఇళ్లు ధ్వంసం జి.మాడుగుల: మండలంలో శుక్రవారం సాయంత్రం ఈదుర గాలులతో కూడిన వర్షానికి నాలుగు రేకుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. కోరాపల్లి పంచాయతీ వయ్యంపల్లిలో కోరాబు వెంకటరావు, మర్రి కృష్ణారావు, మర్రి కామేశ్వరరావు, కొర్రా సన్యాసిరావులకు చెందిన ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్ల పై కప్పు రేకులు ఎగిరి పడడంతో ధ్వంసమయ్యాయి. నాలుగు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. ధాన్యం, బియ్యం, ఇతర వస్తువులు పాడయ్యాయని బాధితులు తెలిపారు. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు వారు తెలిపారు. శంకులమిద్దెలో ఆదివారం కురిసిన వర్షానికి ఓ చెట్టు.. మినీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై పడడంతో అది నేల కూలింది. పిడుగుపాటుతో మహిళకు గాయాలు హుకుంపేట : పిడుగుపాటుకు ఓ గిరిజన మహిళ తీవ్ర గాయాలపాలైంది. మండలంలోని కొట్నాపల్లి పంచాయతీలోని లొపొలం గ్రామంలో వంతాల నీలమ్మ అనే మహిళ ఇంటి వద్ద ఆదివారం సాయంత్రం పిడుగుపడింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న నీలమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆటోలో హుకుంపేట ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ఆస్పత్రిలో కోలుకుంటున్నట్టు కుటుంసభ్యులు తెలిపారు. -
అంతులేని విషాదం!
పాడేరులో విషాదం నెలకొంది. రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు యువకులు కొద్ది గంటల తేడాలోనే తనువుచాలించారు. వీరిలో ఓ యువకుడు చనిపోయిన విషయాన్ని తట్టుకోలేక నాన్నమ్మ గుండెపోటుతో మరికొద్ది గంటల్లో మృతి చెంది కుటుంబీకులను విషాదాన్ని మిగిల్చింది. సాక్షి, పాడేరు : పాడేరు పట్టణానికి చెందిన కోట దీపు (25), సుండ్రుపుట్టు వీధికి చెందిన మనతుల అశోక్ (28) ఈనెల 19వ తేదీన స్నేహితుడు ఇచ్చిన విందులో పాల్గొని రాత్రి 10 గంటల సమయంలో గొందూరు నుంచి పాడేరుకు ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తుండగా ఐటీడీఏ పీవో బంగ్లా సమీపంలోని మలుపు వద్ద అదుపుతప్పి గోతిలో పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన వీరిని స్థానికులు పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్య చికిత్స అనంతరం అత్యవసర వైద్యం కోసం విశాఖపట్నంలోని ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరిలో దీపు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందగా అశోక్ బుధవారం మృతి చెందాడు. దీపు మరణవార్త విని నాన్నమ్మ రమణమ్మకు గుండెపోటు వచ్చి బుధవారం ఉదయం ఇంట్లో కుప్పకూలి కన్నుమూసింది. ఈ ఘటన వీరి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దీపు తండ్రి రమణ విద్యుత్ శాఖలో లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. దీపును నాన్నమ్మ రమణమ్మ ఎంతో అల్లారముద్దుగా చూసుకునేది. ఆయన మరణవార్త వినడంతో ఒక్కసారిగా గుండె ఆగి తిరిగిరాని లోకానికి చేరింది. దీపు డిగ్రీ చదువుతున్నాడు. ఇక అశోక్ తండ్రి రమణ కార్పెంటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇంటర్, ఐటీఐ వరకు చదువుకున్న అశోక్ వెల్డింగ్ షాపు నిర్వహిస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. బైక్ ప్రమాదంలో ఒక్కోగనొక్క కొడుకు అశోక్ మృతి చెందటంతో తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. వీరి అంత్యక్రియలు బుధవారం వేర్వేరు చోట్ల నిర్వహించారు. -
రూ. 1.30 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
సాక్షి, పాడేరు(విశాఖపట్టణం) : గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టయింది. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది శుక్రవారం విశాఖ ఏజెన్సీలో తనిఖీలు నిర్వహించి వాహనాల్లో తరలించుకుపోతున్న రూ. 1.30 కోట్ల విలువైన 675 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాలను సీజ్ చేయడంతోపాటు నలుగురిని అరెస్టు చేశారు. మరికొంతమంది పరారైనట్టు అధికారులు తెలిపారు. గూడెంకొత్త వీధి మండలం సీలేరు పోలీసు స్టేషను పరిధిలోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఐచర్వ్యాన్లో కొబ్బరిబొండాల కిందన బస్తాల్లో గంజాయి ఉన్నట్టు గుర్తించారు దీంతో వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా బస్తాల్లో ఉంచిన 570 కిలోల గంజాయి లభ్యమైంది. మావోయిస్టు అమరుల వారోత్సవాల్లో భాగంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతుండగా గంజాయి పట్టుబడింది. దీని విలువ కోటి రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా నిందితులు వ్యాన్‌ను విడిచిపెట్టి పరారైనట్టు పోలీసులు చెప్పారు. వీరి కోసం గాలిస్తున్నామని.. గంజాయిని చింతపల్లి ప్రాంతం నుంచి తెలంగాణా రాష్ట్రానికి తరలించేందుకు ప్రయత్నం చేసినట్టు తెలిసిందన్నారు. గుట్టు రట్టు! విశాఖ ఏజెన్సీ పెదబయలు ప్రాంతం నుంచి ముంబాయికి గంజాయి తరలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను ఎక్సైజ్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనకాపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్.శ్రీనివాసరావు తెలియజేశారు. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర గంజాయి ముఠాలు విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం మారుమూల ప్రాంతాల నుంచి ఖరీదైన శీలవతి రకం గంజాయిను కొనుగోలు చేసి ముంబాయి, విశాఖపట్నం, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తూ అమ్మకాలు చేస్తున్నట్లు పాడేరు ఎక్సైజ్ సీఐ డి.అనిల్‌కుమార్‌కు సమాచారం అందింది. దీంతో అనిల్‌కుమార్ తన సిబ్బందిని వెంటపెట్టుకొని గురువారం రాత్రి పెదబయలు మండలం చుట్టుమెట్ట, పాడేరు మండలం గుత్తులపుట్టు సంత బయలు జంక్షన్లో కాపు కాశారు. పెదబయలు ప్రాంత నుంచి వేర్వేరు నంబర్లు ఉన్న (ముందున ఎంహెచ్ 17ఎజెడ్317, వెనుక వైపు ఏపీ 31సిక్యూ2772) కలిగిన కారును చుట్టుమెట్ట వద్ద, ఏపీ 31 బీయూ 2375 నంబర్ గల కారును సంతబయలు వద్ద పోలీసులు నిలిపివేసి తనిఖీలు నిర్వహించారు. వీటిలో గంజాయి ఉన్నట్లు నిర్ధారించి పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ధన్‌రాజ్ జాదవ్, సచిన్ శావంకి, ఒడిశా రాష్ట్రం పాడువాకు చెందిన పేరొందిన స్మగ్లర్ సంజాయ్ లక్ష్మణ్రాయ్ అలియాస్ సంజాయ్ జవహార్‌లాల్, ఆనంద్ పెలమాల్లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 105 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకొని కార్లకు సీజ్ చేశారు. పట్టుకున్న గంజాయి, కార్ల విలువ రూ. 30 లక్షలు ఉంటుంది. అరెస్టయిన వారిని రిమాండ్‌కు తరలించినట్లు అనకాపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు విలేకరులకు చెప్పారు. గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్టు కశింకోట: గంజాయిని ఆటోలో తరలిస్తున్న యువకుడిని అరెస్టు చేసినట్టు ఎస్సై ఎ.ఎస్.వి.ఎస్.రామకృష్ణ తెలిపారు. ఇతని నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. రావికమతం మండలం గొంప గ్రామానికి చెందిన కంట్రెడ్డి శివ అదే గ్రామం నుంచి ఆటోలో గంజాయిని తీసుకొని వెళ్తుండగా కశింకోట నూకాంబిక ఆలయ సమీపంలో జాతీయ రహదారిపై ఆకస్మికంగా దాడి చేసి పట్టుకున్నామన్నారు. మరో నలుగురు పరారైనట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
పాడేరు సమీపంలో రోడ్డు ప్రమాదం
-
హంతకులెవరైనా శిక్ష తప్పదు : నారా లోకేష్
పాడేరు/అరకులోయ: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమల హత్యకు కారణమైన వారిని విడిచిపెట్టేది లేదని, ఎవరైనా శిక్ష తప్పదని మంత్రి నారా లోకేష్ అన్నారు. బుధవారం ఆయన పాడేరులోని కిడారి, అరకులో సీవేరి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ నెల 14న అరకులో నిర్వహించనున్న కిడారి, సోమల స్మారక సం తాప కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిడారి, సోమ ల హత్యల వెనుక ఎవరున్నారో బయటకు వస్తుందని, దీనిపై సిట్ విచారణ కొనసాగుతోందన్నారు. సొంత పార్టీలోని వ్యక్తులే ఈ హత్యలకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయని, దీనివల్లే సిట్ నివేదిక బయటకు రాకుండా చేస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. సొంత ఎమ్మెల్యేను చంపుతారా.. అంటూ నివేదిక రాకుండా మాట్లాడడం, అర్థంపర్థం లేని ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నివేదిక రాకుండా దీనిపై మాట్లాడటం సబబు కాదన్నారు. హోంమంత్రి చినరాజప్ప, మంత్రి నక్కా ఆనందబాబు పాడేరు, అరకు ప్రాంతాల్లో రోడ్డు మార్గంలో పర్యటించారు. -
బ్యాట్‌తో కొట్టిన స్నేహితులు: యువకుడు మృతి
పాడేరు: విశాఖ జిల్లా పాడేరు మండలం ఈరాడపల్లి గ్రామంలో క్రికెట్ మ్యాచ్‌లో ఘర్షణ ఒకరి నిండు ప్రాణాలు బలిగొంది. ఓ యువకుడిని అతడి స్నేహితులే క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి, తమ్ముడికి నిప్పు పెట్టాడు
పాడేరు రూరల్: తనను కాదని తమ్ముడికి పెళ్లి సంబంధం కుదిర్చారనే ఉక్రోషంతో తల్లిదండ్రులతోపాటు రక్తం పంచుకు పుట్టిన సోదరుడిని మట్టుబెట్టేందుకు ఓ జులాయి ప్రయత్నించాడు. నిందితుడి తండ్రి అనుగూరి పోతురాజు తెలిపిన వివరాలు.. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం చాపగెడ్డ గ్రామానికి చెందిన అనుగూరి శ్రీనుబాబు జల్సాలకు, మద్యానికి అలవాటు పడ్డాడు. తన కంటే ముందు తన తమ్ముడికి పెళ్లి సంబంధం కుదిర్చారన్న కోపంతో కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకున్నాడు. గురువారం రాత్రి భోజనం అనంతరం తల్లి చిట్టమ్మ, తమ్ముడు చంటిబాబు నిద్రకు ఉపక్రమించగా తండ్రి పోతురాజు బయటకు వెళ్లాడు. దీంతో శ్రీనుబాబు తన వెంట తెచ్చుకున్న బాటిల్లోని పెట్రోల్‌ను తల్లి, తమ్ముడిపై పోసి నిప్పంటించాడు. విషయం తెలుసుకుని వచ్చిన తండ్రి పోతురాజు అడ్డుకోగా అతని చేతిని కొరికి గాయపరిచి పారిపోయాడు. తీవ్రగాయాల పాలైన చిట్టమ్మ, చంటిబాబు, స్వల్పగాయాలైన పోతురాజు పాడేరు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుండపోతగా వర్షం
జలమయమైన రోడ్లు జనజీవనానికి తీవ్ర అంతరాయం పాడేరు రూరల్ : పాడేరు ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం కుండపోతగా వర్షం కురిసింది. వారం రోజులుగా ఏజెన్సీలో మబ్బులు, చిరుజల్లులే పడుతున్నాయి. కొన్ని రోజులుగా మబ్బువాతావరణం కొనసాగిన మన్యంలో మధ్యాహ్నం వరకు ఎండకాసింది. అనంతరం ఒక్క సారిగా మార్పు చోటుచేసుకుంది. ఒంటి గంట నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం పడింది. సుమారు ఆరు గంటలపాటు ఏకధాటిగా వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జనజీవనానికి ఆటంకం ఏర్పడింది. సుదూర ప్రాంతాల నుంచి పాడేరు వచ్చినవారు స్వగ్రామాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంటపొలాల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. మండలంలోని ఇరడాపల్లి, పాడేరు-పెదబయలు మండలాల సరిహద్దులోని పి.కోడాపల్లి వద్ద మత్య్సగెడ్డపొంగి ప్రవాహించింది. రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తున్నారు. సాగుకు ఈ వర్షం మేలు చేస్తుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.