parentes
-
భర్తను వదిలేసి రావాలన్న తల్లిదండ్రులు.. వివాహిత తీవ్ర నిర్ణయం..!
భూదాన్‌పోచంపల్లి: కుటుంబ కలహాలతో వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం భూదాన్‌పోచంపల్లి మండలంలోని జిబ్లక్‌పల్లి గ్రామంలో చోటు చేసుకొంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జిబ్లక్‌పల్లి గ్రామానికి చెందిన కొండపల్లి నర్సింహ, చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన తన మేనమామ కుమార్తె కప్పెర సంతోష(18)ను ప్రేమించి 8 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కాగా సంతోష తల్లి మల్లమ్మకు ఈ పెళ్లి ఏ మాత్రం ఇష్టం లేదు. ఇదే విషయమై సంతోష తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతుండేవారు. అంతేకాక కుమార్తె సంతోషకు తల్లి మల్లమ్మ ప్రతి రోజూ ఫోన్ చేసి భర్తను వదిలేసి వస్తే మంచి సంబంధం చూసి తిరిగి పెళ్లి చేస్తానని చెప్పేది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంతోష సోమవారం భర్త నర్సింహ బయటికి వెళ్లగా, మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్‌రెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు
కర్నూలు(హాస్పిటల్): దేవనకొండ మండలం నల్లచెలిమల గ్రామంలో త్వరలో జరగబోయే బాల్యవివాహాలను స్త్రీ,శిశు సంక్షేమ అధికారులు సోమవారం అడ్డుకున్నారు. గ్రామంలో 15 సంవత్సరాలు, 17 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు బాలికలకు వారి తల్లిదండ్రులు మార్చి 2, 3వ తేదీల్లో వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందింది. విషయం తెలుసుకున్న వెంటనే ఐసీపీఎస్ డీపీసీవో శారద, ఐసీడీఎస్ పత్తికొండ సీడీపీవో టి. విద్య గ్రామానికి వెళ్లి బాలికల తల్లిదండ్రులతో మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి, చట్టం గురించి వివరించారు. బాలికలకు మైనార్టీ(18 సంవత్సరాలు వచ్చేంత వరకు) తీరేంత వరకు పెళ్లి చేయబోమని వారితో అంగీకార పత్రాలు తీసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామాంజనమ్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుచరిత, చైల్డ్‌లైన్ టీమ్ మెంబర్ అనిత ఉన్నారు.