పీబీసీ పనులను పరిశీలించిన సతీశ్ రెడ్డి
లింగాల: వైఎస్ఆర్ జిల్లా లింగాల కుడికాలువ, పులివెందుల బ్రాంచి కెనాల్ (పీబీసీ) పనులను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి బుధవారం సాయంత్రం పరిశీలించారు. అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఇంజనీరింగ్ విభాగానికి చెందిన రిటైర్డ్ సీఈలు సత్యనారాయణరెడ్డి, రెహ్మాన్, హైదరాబాద్‌కు చెందిన సీఈ గిరిధర్‌రెడ్డి, కడప సీఈ వరదరాజు, ఎస్ఈ గోపాల్‌రెడ్డి, డీఈ రవీంద్రనాథ్ గుప్తా తదితరులు ఉన్నారు.