Pet Basheerabad
-
మల్లారెడ్డికి మరో షాక్.. భూకబ్జా కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికు మరో షాక్ తగిలింది. పేట్‌బషీర్‌బాద్ పోలీసులు ఆయనపై భూకబ్జా కేసు నమోదు చేశారు. మొత్తం ఏడు సెక్షన్లతో మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపైనా కేసు నమోదయినట్లు సమాచారం.పేట్ బషీర్‌బాద్‌లో 32 గుంటల భూమిని కబ్జా చేశారని, ఆ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారని సాఫ్ట్వేర్ ఉద్యోగి శేరి శ్రీనివాస్‌రెడ్డి పేట్‌బషీర్‌బాద్ పోలీసులను ఆశ్రయించారు. శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది.ఆ వివాదం మరిచిపోకముందే..ఇటీవలె సుచిత్ర సర్కిల్ సమీపంలోని మిలటరి కాంపౌండ్ వాల్ రోడ్డులో మల్లారెడ్డికి ఇతరులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం విదితమే. కుత్బుల్లాపూర్ మండలం, జీడిమెట్ల సర్వే నెంబర్ 82లోని భూమిలో గత నెల 18వ తేదీన మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి జోక్యంతో పెద్ద వివాదమే చోటు చేసుకుంది. ఆ సమయంలో మల్లారెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు మల్లారెడ్డిని అరెస్ట్ చేసి పేట్ బషీర్బాద్ జైలుకు సైతం తరలించారు. మరోవైపు.. ఈ భూవివాదం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా సంచలనం సృష్టించింది కూడా. దీంతో ఈ వివాదాస్పద భూమిలో అధికారులు ఒకటికి రెండుసార్లు సర్వే చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. సర్వే ఆధారంగా రెవెన్యూ అధికారులు 33 గుంటలు మల్లారెడ్డి ఆధీనంలోనే ఉన్నట్లు తేల్చారు. సర్వే నెంబరు 82లోని 33 గుంటల భూమిని ఆయన కబ్జా చేసినట్లు కోర్టుకు నివేదిక అందజేశారు. ఇక.. అయితే ఈ వివాదంలో 33 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారంటూ రెవెన్యూ అధికారులు చివరకు.. మేడ్చల్ కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈలోపే మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదు కావడం గమనార్హం. -
స్నేహితుడి భార్యపై కన్నేసిన దుర్మార్గుడు.. అత్యాచారం, వీడియోలు తీసి!
సాక్షి, హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గాజుల రామారంలోని నెహ్రూ నగర్‌కు చెందిన ప్రశాంత్ జీడిమెట్ల భాగ్యలక్ష్మీ కాలనీలో ఉంటున్న స్నేహితుడి ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. ఈ క్రమంలో స్నేహితుడి భార్యపై కన్నేశాడు. తనను ప్రేమించకపోతే చచ్చిపోతానంటూ స్నేహితుడి భార్యను ప్రశాంత్ వేధింపులకు గురిచేశాడు. ఇదే క్రమంలో వివాహితపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా లైంగిక దాడికి సంబంధించిన వీడియోలు రికార్డ్ చేశాడు. చదవండి: అన్నం పెట్టడం లేదని కొడుకుతో చెప్పిన తల్లి.. కోడలు క్షణికావేశంలో.. వీడియోలు చూపించి మళ్లీ అత్యాచారానికి ఒడిగడుతూ వచ్చాడు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే ఆమెను, ఆమె పిల్లలు, భర్తను చంపేస్తానని బెదిరించాడు. వీడియోలను అడ్డుపెట్టి డబ్బులు ఇవ్వాలని వివాహితను డిమాండ్ చేశాడు. లేదంటే వీడియోలు వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. ఈ నేపథ్యంలో బాధితురాలి నుంచి ఇప్పటి వరకు రూ. 16 లక్షలు వసూలు చేశాడు. అయినా వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడు ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: రెండేళ్లుగా సహజీవనం.. కూతురుపై తల్లి ప్రియుడు లైంగిక దాడి.. -
హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం
-
‘యశోద’ డాక్టర్ అనుమానాస్పద మృతి!
సాక్షి, హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోదావరి హోమ్స్ గాయత్రి నగర్లో సుభాష్ (32) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఆయన యశోద ఆస్పత్రిలో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్నట్టు తెలిసింది. డాక్టర్ సుభాష్ది మంచిర్యాల జిల్లా తంగూర్ గ్రామంగా వెల్లడైంది. ఆయన 2017లో నేరేడ్మెట్ నివాసి డాక్టర్ లాస్యను ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. రెండేళ్లుగా స్థానికంగా ఉన్న గాయత్రి నగర్‌లోని పద్మావతి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అయితే, కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యభర్తలు కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నట్టు తెలిసింది. ఈక్రమంలోనే ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సుభాష్ జ్వరంగా ఉందని నిన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు సమాచారం. కాగా, అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో సుభాష్ విగత జీవిగా పడున్నట్లు శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సుభాష్ మృతికి సంబంధించిన వివరాల కోసం ప్రయత్నించగా అతని బంధువులు నిరాకరించడం గమనార్హం. -
ఆ నాలుగు గంటలే కీలకం
► సీసీ కెమెరాల పుటేజీ అధ్యయనం ► మూడు బృందాలుగా దర్యాప్తు.. కుత్బుల్లాపూర్: పేట్ బషీరాబాద్ ఎన్సిఎల్ కాలనీలో జరిగిన రూ. 11 లక్షల చోరీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 17న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య దొంగతనం జగినట్లు గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలపై దృష్టి సారించారు. ఈ నేపధ్యంలో రెండు రోజులుగా ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను సేకరించి ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. ఆదివారం అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు సమాచారం. ఏసీపీ అందె శ్రీనివాస్‌రావు, సీఐ రంగారెడ్డి, పాత నేరస్తులపై ఆరా తీశారు. సీసీఎస్, ఎస్ఓటీ, క్రైం పార్టీ పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
‘లాకప్ హింస లైవ్’ ఎస్సై సస్పెన్షన్
-
‘లాకప్ హింస లైవ్’ ఎస్సై సస్పెన్షన్
⇔ మరో ముగ్గురు కానిస్టేబుళ్లపైనా వేటు ⇔ బాధితుడి కేకలు విని సంతోషించిన అనిల్ ఎవరనేదానిపై ఆరా ⇔ మంగళవారం మధ్యాహ్నమే బెయిల్ పొందిన కోటేశ్వరరావు కుత్బుల్లాపూర్: ఓ వ్యక్తిని లాకప్‌లో చితకబాదుతూ.. ప్రత్యర్థికి ఫోన్లో లైవ్ వినిపించిన పేట్ బషీరాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావుపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు. అతనితో ఈ ఘటనతో సంబంధమున్న ముగ్గురు కానిస్టేబుళ్లు రవికుమార్, బాలకృష్ణ, యు.సతీశ్‌కుమార్‌లను బుధవారం సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. విచ్చలవిడిగా దాష్టీకం అప్పు తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు లంచంగా తీసుకుని.. అతడికి అప్పు ఇచ్చిన శివప్రదీప్ అనే వ్యక్తిని ఎస్సై కోటేశ్వరరావు హింసించిన విషయం తెలిసిందే. శివప్రదీప్‌ను తాను పనిచేస్తున్న పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన ఎస్సై కోటేశ్వరరావు.. థర్డ్ డిగ్రీ ప్రయోగించి, హింసించాడు. తాను చితకబాదడంతోపాటు కొందరు కానిస్టేబుళ్లతోనూ కొట్టించాడు. ఈ లాకప్ హింసను అప్పు ఎగ్గొట్టిన రవీంద్ర స్నేహితుడు అనిల్‌కు లైవ్‌లో వినిపించాడు. రికార్డు చేసుకొమ్మనీ సూచించాడు. అంతేగాకుండా ‘చాలా.. హ్యాపీయా..’అని కూడా అడగడం గమనార్హం. కొందరి ద్వారా లీకైన ఈ ఆడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది కూడా. ఇక తనను హింసించడంపై శివప్రదీప్ సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు ఫిర్యాదు చేయగా.. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. రాత్రి కేసు నమోదు.. మరుసటి రోజు మధ్యాహ్నమే బెయిల్ ఎస్సై కోటేశ్వరరావుపై సోమవారం రాత్రే పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. వెంటనే అప్రమత్తమైన ఎస్సై మంగళవారం మధ్యాహ్నమే కొంపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులను జమానతుగా పెట్టుకుని బెయిల్ తీసుకున్నాడు. అంతేకాదు మంగళవారం సాయంత్రం పోలీసు యూనిఫారం వేసుకుని తిరిగి విధుల్లో పాల్గొనడం గమనార్హం. అయితే బెయిల్‌కు జమానతుగా ఉన్న ఓ వ్యక్తి ఎస్సై కోటేశ్వరరావుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేవాడని, ఇంతకుముందు ఆయుధ నిరోధక చట్టం కింద పలుమార్లు జైలుకు వెళ్లొచ్చాడని సమాచారం. సాధారణంగా పోలీసులు కేసు నమోదైతే సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తారు. కానీ ఎస్సై కోటేశ్వరరావుపై ఐపీసీ 385, 342, 323, 506 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినా.. మేడ్చల్ కోర్టులో హడావుడిగా బెయిల్ పొందగలగడం గమనార్హం. అనిల్ ఎవరు? లాకప్ హింసను లైవ్‌లో విని, రికార్డు చేసుకున్న అనిల్ అనే వ్యక్తి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అప్పు తీసుకుని ఎగ్గొట్టిన రవీంద్ర అనే వ్యక్తికి అతను స్నేహితుడని భావిస్తున్నారు. ఎస్సై బాధితుడిని కొడుతున్న క్రమంలో కేకలు, అరుపులు విని సంతోషపడిన అనిల్‌పై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ఓ రాష్ట్ర మంత్రి బంధువుకు తెలిసిన వ్యక్తి ద్వారా ఎస్సై కోటేశ్వరరావుకు అనిల్ పరిచయమయ్యాడని సమాచారం. ఈ కేసులో పూర్తి వివరాలను సేకరించి నివేదిక అందజేయాలని బాలానగర్ డీసీపీ సాయి శేఖర్‌ను సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య ఆదేశించారు. -
లాకప్ హింస లైవ్
-
లాకప్ హింస లైవ్
అప్పు తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తికి వంతపాడుతూ ఎస్సై దాష్టీకం అప్పు ఇచ్చిన వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి దాడి ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ కేకలను ఫోన్లో ప్రత్యర్థికి వినిపిస్తూ ‘లైవ్’ ‘చాలా.. హ్యాపీయా’ అంటూ రెచ్చిపోయిన వైనం పేట్‌బషీరాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు దుర్మార్గం సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు బాధితుడి ఫిర్యాదు సీపీ ఆదేశాల మేరకు అదే పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు పరారీలో కోటేశ్వరరావు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియో కుత్బుల్లాపూర్: ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే.. ప్రజలకు, బాధితులకు కాదు.. డబ్బులు తీసు కుని ఎగ్గొట్టినవారికి ఫ్రెండ్లీ అనేలా ప్రవర్తిం చాడో ఎస్సై. అప్పు ఇచ్చినవారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. నోటికొచ్చిన బూతులు తిడుతూ ‘థర్డ్’డిగ్రీ ఇంటరాగేషన్ చేశాడు. అసలు అప్పు ఇవ్వ డానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటూ చావబాదాడు..అంతేకాదు వారి అరుపులు, ఆర్తనాదాలను ఫోన్లో అవతలి పార్టీకి లైవ్‌లో వినిపించాడు. ‘చాలా.. హ్యాపీయా’అంటూ సిబ్బందితోనూ కొట్టించాడు.. మొత్తంగా పోలీసులు తలదించుకునేలా ప్రవర్తించాడు. హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ ఎస్సై కోటేశ్వరరావు నిర్వాకమిది.. ఏం జరిగింది? కేపీహెచ్‌బీ కాలనీ శాతవాహననగర్‌కు చెందిన శివప్రదీప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. శివప్రదీప్‌కు 2015లో తన స్నేహితుడు బాబు ద్వారా రవీంద్ర ప్రసాద్ పరిచయమయ్యాడు. తాను మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నానని, రియల్ ఎస్టేట్, రంగురాళ్ల వ్యాపారాలు కూడా చేస్తున్నానని రవీంద్ర ప్రసాద్ చెప్పాడు. తనకు వ్యాపారం కోసం డబ్బులు కావాలని అతను కోరగా.. శివప్రదీప్ 2015 నుంచి 2016 మధ్య రూ.25 లక్షలు, రూ.45 లక్షలు, ఐదు లక్షలు.. మొత్తం రూ.75 లక్షలు అప్పుగా ఇచ్చాడు. కొద్దిరోజుల తర్వాత డబ్బులు తిరిగివ్వాలని శివప్రదీప్ కోరితే.. రవీంద్ర ప్రసాద్ ఏవో కారణాలు చెబుతూ వాయిదావేస్తూ వచ్చాడు. దీంతో శివప్రదీప్ బాలానగర్ డీసీపీని సంప్రదించగా.. పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ వద్దకు వెళ్లమన్నారు. అక్కడికి వెళితే ఇది సివిల్ అంశం, కోర్టులో ఫిర్యాదు చేయాలని సూచించారు. తర్వాత శివప్రదీప్ తన అప్పు తీర్చాల్సిందిగా రవీంద్ర ప్రసాద్‌పై మళ్లీ ఒత్తిడి తెచ్చాడు. దాంతో రుణానికి ష్యూరిటీగా సిద్దిపేటలోని 1.17 గుంటల భూమి, 1.18 గుంటల మరో స్థలం, ఓల్డ్ సఫాయిగూడలోని రెండు స్థలాల ఒరిజినల్ సేల్ డీడ్ డాక్యుమెంట్లను ఇచ్చాడు. అయితే రవీంద్రప్రసాద్ మార్చి 31న శివప్రదీప్‌కు ఫోన్ చేసి.. రూ.పది లక్షలు ఇస్తానని, పేట్ బషీరాబాద్‌లోని బాలాజీ ఆస్పత్రికి రమ్మని పిలిచాడు. అది నమ్మి శివప్రదీప్ అక్కడికి వెళ్లాడు. అప్పటికే అక్కడ సివిల్ డ్రెస్‌లో ఉన్న ఎస్సై కోటేశ్వరరావు శివప్రదీప్‌ను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాడు. లాకప్‌లో బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. ఠాణాలోని సిబ్బందితో కొట్టించాడు. ఈ సమయంలో బాధితుడి కేకలు, అరుపులు, కొడుతున్న చప్పుళ్లను.. ఫోన్లో ప్రత్యర్థి రవీంద్ర ప్రసాద్ స్నేహితుడు అనిల్‌కు వినిపించాడు. ‘ఇక చాలా.. హ్యాపీయా..’అంటూ మరింతగా రెచ్చిపోయాడు. ఇలా ఎస్సై కోటేశ్వరరావు కొందరిని చిత్ర హింసలకు గురి చేస్తూ ప్రత్యర్థులకు ఫోన్ చేసి మరీ వినిపించిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదుతో.. బాధితుడు శివప్రదీప్ తనను పోలీసులు ఇబ్బందులకు గురిచేసిన ఘటనపై సైబరా బాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం బయటకు వచ్చింది. కోటేశ్వరరావు వ్యవహా రాలపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. వాటిపై గతంలో పత్రికల్లో కథనాలు కూడా వచ్చినా.. కోటేశ్వరరావుకు డీసీపీ స్థాయిలోని అధికారి వెన్నుదన్నుగా ఉండటంతో విచారణ జరప కుండానే వదిలేశారు. తాజాగా సొంత పీఎస్‌లోనే ఎస్సైపై కేసు నమోదైంది. దీంతో కోటేశ్వరరావు తన సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారయ్యాడు. ఆయనపై ఐపీసీ 385, 342, 323, 506 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యా యి. ఈ ఘటనలో ఎస్సైతో పాటు నలుగురు సిబ్బందికి ప్రమేయమున్నట్లు తెలిసింది. కమి షనర్ ఆదేశాల మేరకు పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు ఈకేసును దర్యాప్తు చేస్తున్నారు. చాలా.. హ్యాపీయా..? అప్పు ఇచ్చానని చెబుతున్న శివప్రదీప్.. ఆ అప్పు వసూలు చేసుకోవడానికి అంతకుముందు కొందరి ద్వారా ప్రయత్నించాడు. దీంతో అప్పు తీసుకున్న రవీంద్ర ప్రసాద్, అతడి స్నేహితుడు అనిల్‌లు ఎస్సై కోటేశ్వరరావును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శివప్రదీప్‌ను, మరికొందరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి చితకబాదారు. వారిని కొడుతున్న తీరును ఫోన్ చేసి మరీ ప్రత్యర్థికి వినిపించడం, ఆడియో రికార్డు చేసుకొమ్మని చెప్పడం ఎస్సై దాష్టీకాన్ని స్పష్టంగా చూపుతోంది. అనిల్ చేసిన ఫోన్‌కాల్ రికార్డు మెల్లగా ఇతర స్నేహితుల ద్వారా సోషల్ మీడియాలోకి చేరి చక్కర్లు కొడుతోంది. ‘అప్పు ఇచ్చేందుకు నీకు అన్ని డబ్బులు ఎక్కడివి’అని శివప్రదీప్‌ను కొడుతూ మొదలైన సంభాషణ.. బాధితుడిని కొడుతున్న చప్పుళ్లు.. అరుపులు.. ఎస్సై బూతులు.. ‘నువ్వు శాటిస్ఫై అయ్యావు కదా..’అని ప్రత్యర్థి అనిల్‌ను అడగడం.. అతను నవ్వుతూ ‘వారిని వదలొద్దంటూ’సలహాలివ్వడం దాకా ఆ ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. -
అజ్ఞాతంలో షేట్ బషీరాబాద్ ఎస్ఐ
హైదరాబాద్ : అప్పు ఇచ్చినవారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ కోటేశ్వరరావు అజ్ఞాతంలో ఉన్నాడు. తన సర్వీస్ రివాల్వర్తోనే అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రెండ్రోజులు క్రితం ఎస్ఐ తనను చిత్రహింసలకు గురి చేశాడని ఓ వ్యక్తి సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎస్ఐపై కేసు నమోదు చేయాలని సీపీ సందీప్ శాండిల్య ఆదేశించారు. అంతేకాకుండా ఎస్ఐని ఇప్పటికే సీపీ సస్పెండ్ చేశారు. కాగా ఎస్ఐ కోటేశ్వరరావు వ్యవహా రాలపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. వాటిపై గతంలో పత్రికల్లో కథనాలు కూడా వచ్చినా.. కోటేశ్వరరావుకు డీసీపీ స్థాయిలోని అధికారి వెన్నుదన్నుగా ఉండటంతో విచారణ జరపకుండానే వదిలేశారు. తాజాగా సొంత పీఎస్‌లోనే ఎస్ఐపై కేసు నమోదైంది. దీంతో కోటేశ్వరరావు తన సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారయ్యాడు. అతడిపై ఐపీసీ 385, 342, 323, 506 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో ఎస్ఐతో పాటు నలుగురు సిబ్బందికి ప్రమేయమున్నట్లు తెలిసింది. కమిషనర్ ఆదేశాల మేరకు పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
పేట్ బషీరాబాద్‌లో కార్డన్ సెర్చ్
హైదరాబాద్ : హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ జరిగింది. వాజ్‌పేయ్ నగర్లో ఆదివారం వేకువజామున 200 మంది పోలీసులు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువ పత్రాలు లేని 2 ఆటోలు, 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 18 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
ప్రాణం తీసిన ‘మిస్డ్ కాల్’
కుత్బుల్లాపూర్: వేకువజామున వచ్చిన ఓ మిస్డ్ కాల్ మహిళ మృతికి కారణమైంది. ఈ సంఘటన పేట్‌బషీరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవీందర్రావు, బాధితులు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా దుబ్బాక మండలం, ఎనగుర్తికి చెందిన కనకవ్వ(30)కు అదే మండలం ఆకారం గ్రామానికి చెందిన నర్సింహ(36)తో 2005లో వివాహం జరిగింది. ఎనిమిదేళ్ల పాటు స్వగ్రామంలోనే ఉన్న వీరు కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మండలం, గుండ్లపోచంపల్లికి వచ్చి ఉంటున్నారు. కనకవ్వ స్థానికంగా ఉన్న ఓ సీడ్స్ కంపెనీలో పనికి వెళ్తుండగా, నర్సింహ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి కుమార్తె నవ్వ(8) ఉంది. భార్యపై అనుమానంతో నర్సింహ తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటలకు కనకవ్వ సెల్‌ఫోన్‌కు మిస్డ్ కాల్ వచ్చింది. దీంతో నర్సింహ ఆ కాల్ ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవడు చేశాడంటూ ఆమెను తీవ్రంగా చితకబాదాడు. పక్కనే ఉంటున్న అత్తగారి ఇంటికి తరిమి కొట్టాడు. దెబ్బలకు తాళలేక కనకవ్వ స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెను పేట్ బషీరాబాద్‌లోని ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించగా తలకు తీవ్ర గాయాలు కావడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నర్సింహను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సమయంలో వచ్చి న మిస్డ్ కాల్ నంబరుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
8మంది నిందితులను గుర్తించిన పోలీసులు
హైదరాబాద్ : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఇద్దరు ఎస్ఐలపై చేయి చేసుకున్న కేసుపై పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం సమావేశం అయ్యారు. సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఎనిమిదిమంది నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించినట్లు అల్వాల్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చిరించారు. కాగా పూటుగా మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు నిరాకరించడంతో అతన్ని స్టేషన్‌కు తీసుకువెళ్లారు .. ఇక అంతే.. తనపై పోలీసులు దాడి చేశారని హడావిడి చేసి అందరినీ తప్పుదోవ పట్టించాడు. ఈక్రమంలో కొంత మంది ఆదివారం రాత్రి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌పై రాళ్లతో దాడి చేసి అడ్డొచ్చిన ఇద్దరు ఎస్సైలపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా ఎనిమిదిమందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి అల్వాల్ ట్రాఫిక్ ఎస్సై పురుషోత్తం సిబ్బందితో కలిసి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ సమీపంలో డ్రంకన్ డ్రైవ్ విధి నిర్వహణలో ఉన్నారు. ఈ క్రమంలో రాత్రి 10.30 గంటలకు ఎర్రగడ్డకు చెందిన జగదీష్ తయార్(50) మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అతన్ని బ్రీత్ ఎనలైజ్ పరీక్ష చేసేందుకు యత్నించగా అందుకు నిరాకరించాడు. దీంతో లా అండ్ ఆర్డర్ ఎస్సై తిరుపతి సిబ్బందితో అక్కడికి చేరుకుని బలవంతంగా జగదీష్‌కు పరీక్ష చేయగా మోతాదుకు మించి మద్యం తాగినట్టు నమోదైంది. అయితే, జగదీష్ తన పేరుకు బదులు పక్క సీట్లో కూర్చున్న సురేష్ అగర్వాల్ పేరును తన పేరుగా చెప్పాడు. అంతే కాకుండా తనపై పోలీసులు దాడి చేస్తున్నారని.. వచ్చి కాపాడండంటూ కొంపల్లి థోలారిధనిలో ఉన్న బంధువులు, స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఇక అంతే.. నాలుగు బస్సుల్లో తిరుగు ప్రయాణంలో ఉన్న వారంతా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని రాళ్లతో దాడి చేసి అడ్డుకున్న ఎస్సై పురుషోత్తం, తిరుపతిపై దాడికి దిగారు.