వివాహిత ఆత్మహత్య
పాణ్యం: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన మాధవి (22) కి అదే గ్రామానికి చెందిన ఈశ్వరయ్య (26) తో ఏడాది క్రితం వివాహమైంది.
కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో ఇద్దరి మధ్య కలతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రోజు ఈశ్వరయ్య వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన మాధవి ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.