political analyst
-
మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగేదెప్పుడు?
తెలుగునాట జాతీయ కాంగ్రెస్‌ను సవాలు చేస్తూ నలభై ఏళ్ళ క్రితం ‘తెలుగుదేశం’ (1982) ప్రాంతీయ పార్టీగా ఏర్పడితే, అప్పటి నుంచి వరసగా ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (2001) ‘ప్రజా రాజ్యం’ (2008) ‘వైఎస్సార్ కాంగ్రెస్’ (2011) ‘జనసేన’ (2014) ప్రాంతీయ పార్టీలుగా ఏర్పడ్డాయి. రాష్ట్ర విభజన (2014) జరిగాక, మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి ‘టీఆర్ఎస్’, రెండో ఎన్నికల్లో ‘టీడీపీ’ని ఓడించి ‘వైఎస్సార్సీపీ’ రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చాయి. అయితే, ఇప్పుడవి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, వాటికి ఒక సొంత రాజకీయ జాగా (పొలిటికల్ స్పేస్) ఉంది. దాన్ని– కాంగ్రెస్, కమ్యూనిస్టు, తెలుగుదేశం నుంచి అవి తీసు కున్నాయి. ఈ కాలంలో ఉత్తర భారత దేశంలో పలు రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీ. కులాలు ముస్లిం మైనార్టీతో కలసి కొన్ని ప్రభుత్వాలు ఏర్పడడం చూశాం. కానీ ఇక్కడ ఈ వర్గాలు తమదైన జాగాను సృష్టించుకోలేకపోయాయి.అయితే, 1991లో దేశంలో మొదలైన ఆర్థిక సంస్కరణలతో వచ్చిన– సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకర ణలలో నుంచి వచ్చిన అస్తిత్వ వాదన దళిత స్పృహకు తోడై 1994 నాటికి రాష్ట్రంలో ‘మాదిగ దండోరా’ ఉద్యమం మొదలయింది. ఇలా ‘ప్రాంతాల’ విభజన ఉద్యమాల మధ్య, ఉప–కులాల విభజన ‘డిమాండ్’ వచ్చింది. తొంభై దశకంలో మొదలైన ‘మండల్’ తర్వాత వరసగా కనిపిస్తున్న చిన్న రాష్ట్రాలు, వర్గీకరణ వంటి ‘డిమాండ్ల’ ఒత్తిడి మధ్య 2004 నాటికే కాంగ్రెస్ సంకీర్ణ రాజకీయాలతో ఉనికిలో నిలవడానికి సిద్ధమయింది. చివరికి రాష్ట్ర విభజనతో ఏపీకి పరి మితమైన ‘టీడీపీ’ది కూడా ఇప్పుడు అదే పరిస్థితి.అలా చంద్రబాబు నాయుడు వంటి సీనియర్ నాయకుడికి,మరో రెండు పార్టీలతో కలిసి అధికారాన్ని పంచుకునే సర్దుబాటుతో సంకీర్ణ ప్రభుత్వానికి సిద్ధమైతేగాని, చిన్న రాష్ట్రంలో కూడా గెలుపు సాధ్యం కాలేదు. రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ళలోనే కాంగ్రెస్, కమ్యూనిస్టులు తమ ఉనికిని కోల్పోయారు. ఈ రాజకీయ శూన్యత పూరించడానికి సిద్ధమైన మూడవ ప్రత్యామ్నాయం ఏది? మండల్ తర్వాత బీసీల రాజకీయ సర్దుబాటు అంటే, దాన్ని కొంతమేర అర్థం చేసుకోవచ్చు. కానీ, 80లలో దళిత మహాసభ, 90లలో ‘మాదిగ దండోరా’ రెండూ అప్పటి అధికార పక్షాల మీద పోరాటం చేసికూడా అవి తమదైన రాజకీయ జాగాను ఎందుకు ఇప్పటికీ స్థిరపర్చుకోలేక పోయాయి? సరే, అవి విఫలమైతే, ఆ ‘జాగా’ ఇప్పుడు ఎవరి స్వాధీనంలో ఉన్నట్టు? ఇది ఒక అంశం అయితే, ‘దండోరా’కు సుప్రీం కోర్టు తీర్పు పరిష్కారం ఇచ్చాక అయినా, మాల–మాదిగలు కలసి తమ ఎదురుగా కనిపిస్తున్న ‘రాజకీయ జాగా’ను పసిగట్టి, అందుకు అనుగుణంగా వ్యూహాలు ఎందుకు మార్చుకోలేపోతున్నారు? అందుకు సిద్ధం కావడానికి 2029 వరకూ ఉన్న వ్యవధి వీళ్ళిద్దరికీ చాలదా? లేకతెలంగాణలో కాంగ్రెస్ ద్వారా ఇప్పటికే మల్లు భట్టి విక్రమార్క (ఎస్సీ – మాల) ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు, ఇదే తమ వ్యూహం, రేపు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రూపంలో తమకు అప్పగిస్తుంది అనే ఆశ వారికి ఉన్నదా? అనే సందేహాలు కలుగుతాయి. అయినా ఎన్నికలు ముగిసిన అరు నెలలకే ఇటువంటివి ఆలోచించడానికి కారణం లేకపోలేదు. దక్షిణాదిలోకి ప్రవే శానికి భారతీయ జనతా పార్టీ హైదరా బాద్ ‘సిటీ’ ద్వారా... తెలంగాణను ఇప్పటికే లక్ష్యం చేసుకుంది. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో 2024 నాటికి ‘సంకీర్ణం’ పేరుతో టీడీపీ గరిష్ఠ స్థాయిలో సర్దుబాటు చేసుకుని సరిపెట్టుకోవలసిన పరిస్థితిని ‘ఎన్డీఏ’ స్వయంగా పర్యవేక్షించింది.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా ఐదేళ్ళ వ్యవధి ఉన్నప్పటికీ, ఢిల్లీ నుంచి పెరుగుతున్న రాజకీయ ఒత్తిడితో కావొచ్చు, పరిపాలనకంటే, రాజకీయ క్రియాశీలతను పెద్దదిగా చూపడానికిప్రాధాన్యత కని పిస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల వచ్చిన ‘ఎస్సీ’ వర్గీకరణ ఒక్కటే కాకుండా, నియోజకవర్గాల పునర్వర్గీకరణ వీరికి పొంచి ఉన్న మరో రాజకీయ అనివార్యత అయింది. ఈ నడుమ జనాభా లెక్కల సేకరణ పూర్తి అయితే, వర్ధమాన రాజకీయ ఆశావహులకు తాజా ‘డేటా’ వారి డిమాండ్‌కు కొత్త కొలమానం అవుతుంది. వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
రియల్ ఎగ్జిట్ పోల్స్ ఇవే..గెలిచేది మళ్లీ జగనే
-
అది కింగ్‌మేకర్ ప్రాంతం.. గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటు ఖాయం?
మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టేవారికి ‘మాల్వా-నిమాడ్’ ప్రాంతం ఎంతో ముఖ్యమైనది. 230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఈ ప్రాంతం ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమని చెబుతుంటారు. మాల్వా-నిమాడ్ ప్రాంతంలోని 15 జిల్లాల్లో మొత్తం 66 సీట్లు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత మాల్వా-నిమాడ్ మధ్యప్రదేశ్‌లో కింగ్‌మేకర్‌గా మారిపోయింది. ఈ ప్రాంతంలో తమ జెండాను ఎగురవేసిన పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. గత ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మాల్వా-నిమాడ్ ప్రాంతం కీలకంగా కనిపించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి మాల్వా-నిమాడ్లో విజయం సాధించడమే ప్రధాన కారణమంటారు. ఇక్కడి 35 స్థానాలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేవలం 28 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భోపాల్ సింహాసనాన్ని అధిష్టించేందుకు కాంగ్రెస్‌కు మాల్వా-నిమాడ్ విజయం ఎంతగానో సహాయపడింది. 2013 అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే మాల్వా-నిమాడ్లో బీజేపీ 57 సీట్లు గెలుచుకుని ప్రకంపనలు సృష్టించింది. నాడు కాంగ్రెస్ కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితమైంది. మాల్వా-నిమాడ్ సీట్లలో విజయం సాధించిన కారణంగా 2013లో బీజేపీ ప్రభుత్వం, 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అందుకే ఈసారి కూడా ఈ ప్రాంతంపై రెండు పార్టీలూ దృష్టిపెట్టాయి. ఇది కూడా చదవండి: అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం! -
కోటంరెడ్డి.. ఆనంరెడ్డి.. ఏ రెడ్డి వెళ్లినా.. ప్రజారెడ్లు జగన్ వెంటే..
శివరాత్రి వచ్చేస్తుంది. అప్పుడే ఎండలు మండిపొతున్నాయి. శివరాత్రి వెళ్లాక చలి కూడా శివ..శివ అంటూ వెళ్లిపోతుందట..!!. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కూడా మండే ఎండలతో పోటీ పడుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ తీరం వెంట రాజకీయ వేడి గాలులు వీస్తున్నాయి. ఆ వేడి గాలులతో ఏర్పడిన బంగాళాఖాతంలో ఏర్పడిన రాజకీయ అల్పపీడనం తీవ్ర తుఫాన్‌గా మారి నెల్లూరు జిల్లాలో తీరం దాటింది. ఎటువంటి హెచ్చరికలు లేకుండానే 'కోటంరెడ్డి' తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించాలని ప్రయత్నించింది. 'కోటంరెడ్డి'తుఫాన్ వెంట వచ్చిన 'ఆనంరెడ్డి' తుఫాన్ తీరాన్ని టచ్ చేసి తుస్ మంటే.. 'కోటంరెడ్డి' తుఫాన్ మాత్రం 'ఎల్లో గాలుల' సహయంతో విధ్వంసాన్ని సృష్టించాలని చూసింది. కానీ.. రాజకీయ వాతావరణవేత్తలు అంచనాలను, ఎల్లో వ్యూహకర్తల అంచనాలను 'కోటంరెడ్డి' నెరవేర్చలేకపోయారు. నెల్లూరు జిల్లాలో ప్రకంపనలు 'కోటంరెడ్డి' తుపాన్ సృష్టిస్తుందని చంద్రబాబు వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. గత కొన్ని నెలలుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబు, లోకేష్.. అలానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో టచ్‌లో ఉన్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణ ఆరోపణ కాదు నిజం కావొచ్చు. ఎందుకంటే..అమరావతి పాదయాత్రికులకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సపర్యలు చేశారు. భోజనం పెట్టారు, మంచినీళ్లు ఇచ్చారు. ఇదంతా చేసింది మానవతాదృక్పథంతో అనుకోవడానికి వీళ్లేదు. దీనిలో రాజకీయ వ్యూహం, కోణం ఉన్నాయి. తన పార్టీ ఫిరాయింపుకు కోటంరెడ్డి ఆ రోజు నుంచే పునాదులు వేసుకుంటున్నాడు. కోటంరెడ్డి ప్రతి అడుగు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే వేశాడు. 'జగనన్న మాట గడప గడపకూ కోటంరెడ్డి బాట' పేరుతో కోటంరెడ్డి పాదయాత్ర చేసినా ఆ పాదయాత్ర తన రాజకీయ స్వార్ధంతో చేసిందే. తన పరపతి పెంచుకోవడానికి చేసిందే తప్పితే పార్టీ, ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ కోసం చేసింది కాదు. వైఎస్ఆర్ సీపీ స్థాపించక ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక సామాన్య కార్యకర్త. అటువంటి కోటంరెడ్డి ఇప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యే. వైఎస్ఆర్ సీపీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటో పెట్టుకుని రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన మొదటి సారి టికెట్ తెచ్చుకోవడానికి ఎన్ని తంటాలు పడ్డాడో నెల్లూరులో అందరికీ తెలుసు.. రెండోసారి టికెట్ ఇవ్వొద్దని నెల్లూరు రూరల్ నుంచే ఎన్నో వినతలు కానీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి గెలిపించుకున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మొదటి నుంచి ఆ జిల్లా నేతలు, కార్యకర్తలకు అనుమానమే కానీ..సీఎం వైఎస్ జగన్ తన మనిషిగానే కోటంరెడ్డిని చూశారు. 'శ్రీధరన్న' అని ఆప్యాంగా పిలిచేవారు. ఆ మంచి మనసుకు , ఆ మంచి మాటకు కోటంరెడ్డి వెన్నుపోటు పొడిచాడు. రాజకీయాల్లో "హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి'. వైఎస్ఆర్ సీపీని వదిలేసి టీడీపీలోకి వెళ్లాలనే కోటంరెడ్డి నిర్ణయం 'రాజకీయ ఆత్మహత్య'. దీనిలో సందేహం లేదు. వైఎస్ఆర్ సీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను లాక్కున్నాడు. నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఏమైందీ...ఆ 23 మంది, ముగ్గురు ఎంపీలు ఎక్కడున్నారు..? కోటంరెడ్డి ఆలోచన చేసుకోవాలి. పదవులు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం. నడిపించే నాయకుడు ముఖ్యం. కోటంరెడ్డిలో పదవి కాంక్ష ఎంతగా పెరిగిపోయిందంటే చంద్రబాబును చీకట్లో కలిసే అంతగా పెరిగిపోయింది. కోటంరెడ్డికి పదవిపై ప్రేమ ఎంతగా పెరిగిందంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో డిన్నర్ చేసే అంతగా..!!. జగనన్నను ఎంతగానో అభిమానిస్తానని చెప్పుకునే కోటంరెడ్డి.. చంద్రబాబును ఎందుకు కలిశాడు..? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో కలిసి ఎందుకు డిన్నర్ చేశాడు..? వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పినట్లు 'కోటంరెడ్డి ఫోన్ కాల్ ట్యాప్ చేయలేదు.. చంద్రబాబు ట్రాప్‌లో కోటంరెడ్డి పడ్డారు". కాకాణి మాటలు అక్షర సత్యం. " పార్టీ లేదు బొక్కా లేదు" అని అచ్చెన్నాయుడు కామెంట్ చేశారు. "రోజు రోజుకు పార్టీ నిర్వీర్యమైపోతుందని" చంద్రబాబు స్వయంగా అన్నారు. కుప్పంలో తన పరిస్థితి బాగోలేక పక్క జిల్లాల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తే బాగుంటుందో అని చంద్రబాబు సర్వేలు చేయించుకుంటున్నారు. కుప్పంలో కూర్చొని పక్క చూపులు చూస్తున్నారు. లోకేష్‌కు మంగళగిరిలో పోటీ చేసే ధైర్యం లేదు. హిందూపూర్‌లో బాలయ్య ఓడిపోతాడనే టాక్ గట్టిగా వినిబడుతోంది. నా దృష్టిలో టీడీపీ సోషల్ మీడియాలోనే బతుకుతుంది. క్షేత్రస్థాయిలో టీడీపీ పాడె మీద ఉంది. పాడె మీద ఉన్న టీడీపీలోకి పోయి కోటంరెడ్డి ఏం సాధించాలని..?!!. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి.. ఏ రెడ్డి అయినా పదవి కాంక్షతో కాకుండా వాస్తవ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. చంద్రబాబు కౌగిలి విష కౌగిలి, దృతరాష్ట్ర కౌగిలి అని కోటంరెడ్డి, ఆనంరెడ్డి గ్రహించాలి. మిమ్మల్ని రాజకీయంగా వాడుకుంటాడు..తరువాత కరివేపాకులా పడేస్తాడు. ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన బాబుకు కోటంరెడ్డి, ఆనంరెడ్డి ఓ లెక్కా..?. నెల్లూరు జిల్లాలో కావాలనే అసంతృప్తిగా ఉన్న రెడ్లను టార్గెట్ చేశాడు చంద్రబాబు. అనుకున్నదే తడువుగా రాధాకృష్ణను రంగంలోకి దింపాడు. కోటంరెడ్డి గాలం వేశారు. ఆనంను కదిలించారు. ఎందుకు..? నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ కంచు కోట. 2019లో నెల్లూరు జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు, లోక్ సభ సీటు వైఎస్ఆర్ సీపీ గెల్చుకుంది. నెల్లూరు జిల్లాలో రాజకీయ తుఫాన్ అలజడి అటు రాయలసీమ రెడ్లలోనూ..ఇటూ ప్రకాశం, పల్నాడు రెడ్లలోనూ ఉంటుంది అనేది చంద్రబాబు అంచనా. కానీ..కోటంరెడ్డి వెనుక కార్పొరేటర్ కూడా పోవడానికి సిద్దంగా లేడు. ఇదీ కోటంరెడ్డి బలం. సోనియాతో కలిసి చంద్రబాబు, ఎల్లో మీడియా వైఎస్ఆర్ కుటుంబాన్ని, జగనన్నను ఎంత ఇబ్బంది పెట్టారో గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబు, ఎల్లో మీడియా రెడ్లకు సహజ శత్రువులు. చంద్రబాబు బతికి ఉన్నంత కాలం, ఎల్లో మీడియా ఉన్నంత కాలం ఆ శత్రత్వం కొనసాగుతూనే ఉంటుంది. పదేళ్లు ప్రాణాలు ఫణంగా పెట్టి జగనన్న జెండా ఎగిరేలా కష్టపడ్డాం. జగనన్నను సీఎం సీటు మీద చూసుకున్నాం. మన అంచనాలకు మించి జగనన్న పరిపాలన చేస్తున్నారు. దేశమే కాదు, ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తున్నారు. ఎల్లో రాక్షసులతో మహా యుద్ధమే చేస్తున్నారు. ఆ మహా యుద్ధంలో జగనన్నకు మనమంతా తోడుగా ఉండాలి. అండగా నిలబడాలి. జగనన్న చేతిలో మనమే ఆయుధాలమై ఎల్లో రాక్షసుల నీచ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి. అంతేకాని..పదవుల కోసం జగనన్నను వదిలేసి వెళ్లకూడదు. 10 ఏళ్లు కష్టపడ్డాం..జగనన్న మాకేం చేయలేదనే రెడ్లు ఒక్కటీ ఆలోచించాలి. జగనన్న ఆలోచనను అర్థం చేసుకోవాలి. జగనన్న కళ్లతో భవిష్యత్తును సందర్శించాలి. గాంధీ జీ, అంబేద్కర్ కలల సాధకుడు సీఎం వైఎస్ జగన్. పదవుల కోసం ఆశపడే వారే జగన్‌ను విడిచి వెళ్తారు.. చరిత్రలో నిలిచి, చరిత్ర సృష్టించాలి అనుకునేవారు వైఎస్ జగన్‌తో ఉంటారు.. మళ్లీ ఆయనను సీఎం చేసుకుంటారు. అంటే..ప్రజారెడ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటారు. 'కోటంరెడ్డి' తుఫాన్లు ఎన్ని వచ్చినా తీరం కూడా దాటనీయకుండా అడ్డంగా అడ్డుపడతారు. భవిష్యత్తు దివిటీలై వెలుగుతారు. ::: వెంకటేశ్వర్ పెద్దిరెడ్డి, రాజకీయ.. సామాజిక విశ్లేషకులు -
ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్? పీకే సమాధానమిదే..!
పట్నా: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెటుతున్నట్లు కొద్ది నెలల క్రితం విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన ఓ పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఇప్పటి వరకు దానిపై స్పష్టత లేదు. ఇప్పుడు మరోమారు ఈ అంశం తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు ఇన్నాళ్లు మౌనం పాటించిన ఆయన సస్పెన్స్‌ను బ్రేక్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. బిహార్ వ్యాప్తంగా ప్రజలను కలిసేందుకంటూ ‘జన్ సూరాజ్ అభియాన్’ ఏర్పాటు చేసిన క్రమంలో ఆయనకు ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఓ ఇంటర్వ్యూలో మీరు ఎన్నికల బరిలో నిలుస్తున్నారా? అని అడిగి ప్రశ్నకు సమాధానంగా.. ‘నేను ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి? నాకు అలాంటి ఆకాంక్షలు లేవు’ అని తేల్చేశారు ప్రశాంత్ కిషోర్. ఈ సందర్భంగా జేడీయూ, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. తాను స్వతంత్రంగా ఉండేందుకు నిర్ణయించుకున్న తర్వాత జేడీయు నేతలు తనను తిట్టేందుకు ఇష్టపడుతున్నారని ఆరోపించారు. తనకు రాజకీయ అవగాహన లేకపోతే నితీశ్ కుమార్ వెంట రెండేళ్లు ఏం పని చేశానో ఆయననే ప్రశ్నించాలని సూచించారు. జేడీయూ-ఆర్జేడీ కూటమి ప్రభుత్వం ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని తోసిపుచ్చారు ప్రశాంత్ కిషోర్. వారు ఇచ్చిన హామీని నెరవేరుస్తే తన పాదయాత్రను ఆపేస్తానని సవాల్ చేశారు. బిహార్‌లో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నారు కిషోర్. ఈ సందర్భంగా జన్ సూరాజ్ కార్యక్రమం పార్టీగా మారనుందా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక.. 'మునుగోడు' వేడి చల్లారకముందే.. -
భారత్ జోడో... కాంగ్రెస్‌కు తాడో పేడో
పన్నెండు రాష్ట్రాల గుండా 150 రోజుల పాటు సాగేలా కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ చేస్తోంది. బీజేపీ హిందుత్వ రాజకీయాల నుంచి దేశాన్ని రక్షించేందుకు దీన్ని చేపట్టినట్టుగా పార్టీ చెబుతోంది. కానీ ప్రజాస్వామ్య ప్రస్తుత పోకడలను చర్చకు పెట్టడం... తద్వారా బీజేపీ ఇమేజ్ను దెబ్బతీసి రాజకీయ ప్రయోజనాలను పొందడం; బీజేపీని ఓడించాలంటే ఏ కూటమికైనా తమ మద్దతు తప్పనిసరన్న సంకేతాలను పంపడం; కాంగ్రెస్‌ను గద్దెనెక్కించడం రాహుల్ గాంధీకి మాత్రమే సాధ్యమన్న భ్రమను కార్యకర్తల్లో కల్పించడం అనే మూడు లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. పడిపోతున్న రాజకీయ గ్రాఫ్ మళ్లీ ఎగబాకడం మాత్రం పార్టీ వ్యవస్థ ఎంత సమర్థంగా వ్యవహరిస్తుందన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ సరైన దిశగానే వెళుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రాల ఎన్నికల్లో వరుస ఓటములతో కుదేలైన పరిస్థితుల్లో కాంగ్రెస్ ఈ భారత్ జోడో యాత్రతో తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే పనిలో పడింది. దేశంలోని మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గుండా వెళ్లే ఈ పాదయాత్ర భారతీయ జనతా పార్టీ ‘హిందుత్వ’ అజెండా నుంచి దేశాన్ని రక్షించేందుకని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. బీజేపీ ప్రభుత్వ విధానాలు, ఆ పార్టీ హిందుత్వ అజెండా రెండూ భారత సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఏటికేడాదీ క్షీణిస్తున్న తన ప్రాభవాన్ని పౌర సమాజం, మేధోవర్గం సాయంతో మళ్లీ పొందేందుకు జరుగుతున్న ప్రయత్నమే కాంగ్రెస్ చేస్తున్న ఈ భారత్ జోడో యాత్ర అని చెప్పక తప్పదు. స్థానిక ఎన్జీవోలు, ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీపై వారిలో నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ పాలన మొత్తం నిరంకుశ ధోరణితోనే నడిచిందనీ, అత్యవసర పరిస్థితులను తలపించేదేననీ కాంగ్రెస్ చెబుతోంది. తద్వారా 1978 నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాన్ని సృష్టించే ప్రయత్నం జరుగు తోంది. ఎంతో ముందుచూపుతో, పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ ఈ ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టినా... పడిపోతున్న రాజకీయ గ్రాఫ్ మళ్లీ పైకి ఎగబాకడం మాత్రం ఆ పార్టీ నాయకత్వం, పార్టీ వ్యవస్థ ఎంత సమర్థంగా వ్యవహరిస్తాయన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. నిరాసక్త నేత... పాదయాత్ర! కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లేమి ఉందన్నది నిర్వివాద అంశం. 2019 లోక్‌సభ ఎన్నికల ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ప్రభావం రాహుల్‌గాంధీ యాత్రపై కూడా పడే అవకాశం ఉంది. అలాగే ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్‌కు పెద్దగా ప్రయోజనం చేకూరదనేందుకు రెండు కారణాలు కనిపిస్తు న్నాయి. మొదటిగా చెప్పుకోవాల్సింది, అధ్యక్ష పదవిని మళ్లీ చేపట్టే విషయంలో రాహుల్ గాంధీ చూపిన మొండితనం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలన్న పార్టీ సీనియర్ నేతలు పదేపదే చేస్తున్న విజ్ఞప్తులను తోసిపుచ్చుతూండటం కూడా రాహుల్ గాంధీ నేతృత్వంపై అనుమానాలను రేకెత్తిస్తోంది. రాహుల్ ఆలోచనా ధోరణి ఫలితంగా రాజకీయంగా అతడికి నష్టం చేకూర్చేదిగా పరిణ మిస్తోంది. ఇక రెండో కారణం... తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగడం వల్ల పార్టీలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. ఇది పార్టీ కార్యకర్తల్లోనూ, సంప్రదాయ మద్దతుదారుల్లోనూ కొంత గందరగోళాన్ని ఏర్పరుస్తోంది. పూర్తిస్థాయి నేతగా బాధ్యతలు చేపట్టే విషయంలో రాహుల్ గాంధీ ఇప్పటికీ విముఖంగా ఉండటం, అధికార బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఏదీ లేకపోవడం కూడా రాహుల్‌గాంధీని మాటల నేతగానే మార్చాయే తప్ప... ప్రజలను భారీ ఎత్తున ఆకర్షించే చరిష్మా ఉన్న నేతగా, పార్టీకి అట్టడుగు స్థాయి నుంచి మద్దతు కూడగట్టగల స్థాయి గలవాడిగా మార్చలేక పోయాయి. నేతృత్వం విషయాన్ని కాసేపు పక్కనబెట్టినా భారత్ జోడో యాత్ర స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించే వనరులు, దానికి తగ్గ ప్రతిష్ఠ కూడా కాంగ్రెస్‌కు లేవనే చెప్పాలి. 2014 ఎన్నికల తరువాత రాజకీయంగా తన ఆధిపత్యాన్ని సాంతం కోల్పోయేందుకు ఉన్న కారణాల్లో ఒకటి వారసత్వ రాజకీయాలు కొనసాగడమైతే... రెండోది మైనార్టీలను బుజ్జగించే విధనాలు. రాజకీయంగా, సైద్ధాంతికంగా ఏర్పడ్డ స్తబ్ధత, పట్టూవిడుపుల్లేని పద్ధతి, పార్టీ వ్యవస్థ కుప్పకూలడం, కీలక నేతలు తండోపతండాలుగా ఇతర పార్టీలకు వెళ్లిపోవడం వంటివి ఇతర కారణాలు. దేశాద్యంతం ఆధిపత్యం చలాయించగలిగే స్థాయిని కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. సమాజానికీ, పార్టీకీ మధ్య ఉన్న సమాచార వ్యవస్థ కూడా కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో 150 రోజుల పాటు సాగే సుదీర్ఘ పాదయాత్ర ఒకటి చేపట్టే ప్రయత్నం చేయడం కొంచె అమాయకంగానూ, మరికొంచెం అవాస్తవంగానూ అనిపించక తప్పదు. బీజేపీని ఎదుర్కోగలదా? భారత్ జోడో యాత్ర ప్రజా ఉద్యమం అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. పార్టీ లోపలా, బయటా ఉన్న మేధావులు, ఎన్జీవోల మద్దతుతో సాగుతోందని కూడా చెబుతోంది. ఇలాంటి ప్రకటనలే పౌర సమా జపు నిష్పాక్షికత, స్వతంత్రతలపై అనుమానాలు రేకెత్తిస్తాయి. లెఫ్ట్ లిబరల్ పార్టీలతో అంటకాగుతూండే ఎన్జీవోలు, విద్యావేత్తల ముసుగులు తొడుక్కున్న నేతలు కొందరు రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొంటూండటం వారి కృత్రిమత్వాన్ని బయటపెడుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణే లక్ష్యంగా వీరు పని చేస్తు న్నారు. తద్వారా అధికారాన్ని, వ్యక్తిగత ప్రయోజనాలను పొంద వచ్చునని వీరు భావిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా ఎన్జీవోల జాతకాలు బట్టబయలయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఎన్జీవోలు కొన్ని మనీలాండరింగ్‌కు, ఇతర ఆర్థిక అపసవ్యతలకు, భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమైంది. అలాంటి సంస్థలిప్పుడు భారత్ జోడో యాత్రకు మద్దతుగా నిలవడం కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న మర్యాదను మరింత తగ్గించేదిగా మారుతుంది. అది రాజకీయంగా మరింత దిగజారేలా చేస్తుంది. సగం భారతదేశాన్ని చూసేందుకు రాహుల్‌గాంధీ యాత్ర చేపట్టిన సమయమూ అంత ఉచితంగా ఏమీ లేదు. ఎందుకంటే సొంతింట్లో బోలెడన్ని సమస్యలున్నాయి మరి. వాటిని చక్కదిద్దుకోకుండానే... కాసుల కట్టలతో కళకళలాడుతున్న... విస్తృత స్థాయి కార్యకర్తల మద్దతున్న బీజేపీని ఎదుర్కునేందుకు సిద్ధవమవడం ఎంతవరకూ సబబు? పోనీ రాజకీయంగా అందరినీ ఆకర్షించే విధానం, కథనం ఏదైనా ఉందా అంటే అదీ లేదు. అందరికీ ఆమోదయోగ్యమైన నేత, కాషాయ పార్టీకి చెక్ పెట్టగల వ్యవస్థాగత నిర్మాణం, అన్ని వర్గాల ఓట్లను కూడగట్టగలిగే చాతుర్యమూ కరవే. రాహుల్ ఇమేజ్ పెంచేందుకే... ఆధిపత్య ధోరణలు, ఈగోలపై ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీకృతమై ఉంది. భారత్ జోడో యాత్ర మొత్తాన్నీ కొంచెం నిశితంగా పరిశీలిస్తే కాంగ్రెస్ మూడు అంశాలను చెప్పేందుకు ప్రయత్నిస్తోందని అర్థమవుతుంది. ఒకటి.. భారతీయ ప్రజాస్వామ్య ప్రస్తుత పోకడలనూ, పెరిగిపోతున్న ఒంటెత్తు పోకడలనూ అంతర్జా తీయ స్థాయిలో చర్చకు పెట్టడం... తద్వారా భారతీయ జనతా పార్టీ ఇమేజ్ను దెబ్బతీసి రాజకీయ ప్రయోజనాలను పొందడం. రెండోది... మీడియా సాయంతో క్షేత్రస్థాయిలో తనకు మద్దతు పెరుగుతోందన్న భ్రమ కల్పించడం ద్వారా... బీజేపీని ఓడించాలంటే ఏ పార్టీ, కూటమికైనా తమ మద్దతు తప్పనిసరి అన్న సంకేతాలను పంపడం. కార్యకర్తల్లో రాహుల్‌గాంధీకి ఉన్న ఇమేజ్ను పెంచడం, అందుకోసం ప్రజామద్దతును ఉన్నదానికంటే ఎక్కువ చేసి చూపడం, కాంగ్రెస్ పార్టీని మళ్లీ గద్దెనెక్కించడం రాహుల్‌కు మాత్రమే సాధ్యమన్న భ్రమను కార్యకర్తల్లో కల్పించడం మూడో ఉద్దేశం. అయితే నాయ కత్వం పరంగా ఇప్పటివరకూ ఏమీ సాధించని రాజకీయ వారసుడు రాహుల్ గాంధీ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను చేపట్టడం ఏమంత సత్ఫలితాలు ఇవ్వకపోగా... నష్టం చేకూర్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి! వ్యాసకర్త: ప్రవీణ్ రాయ్, రాజకీయ విశ్లేషకులు, సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, న్యూఢిల్లీ -
ప్రియాంకతో కాంగ్రెస్ నిధుల సమస్య తీరొచ్చు!
వాషింగ్టన్: ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ద్వారా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందనేది ఇప్పటి వరకు స్పష్టం కానప్పటికీ.. ఆమె రంగప్రవేశంతో ఆ పార్టీ వనరులు, నిధుల లేమి నుంచి బయటపడే అవకాశముందని నిపుణులు అంటున్నారు. నిధుల విషయంలో అధికార బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ చాలా వెనుకబడి ఉందని వారు చెబుతున్నారు. ‘కాంగ్రెస్‌లో కొత్తగా ప్రచార బాధ్యతలు చేపట్టిన ప్రియాంక ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. కానీ, ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన నిధుల కొరత తీర్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి’ అని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు మిలన్ వైష్ణవ్ అంటున్నారు. ప్రఖ్యాత ‘ఫారిన్ పాలసీ’ మేగజైన్‌కు రాసిన తాజా వ్యాసంలో ఆయన ఈ విషయం పేర్కొన్నారు. ‘కాస్ట్స్ ఆఫ్ డెమోక్రసీ: పొలిటికల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా’ పుస్తకం సహ రచయిత కూడా అయిన వైష్ణవ్.. ‘ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి నిధులు అందకపోవడంతో రాష్ట్ర విభాగాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. 2014 ఎన్నికల తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో చాలా తక్కువ విజయాలు సాధించిన ఆ పార్టీ తీవ్ర నిరాశలో కూరుకుపోయి ఉంది. దేశ రాజకీయాలకు కీలక బిందువైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పట్టించుకోకుండా ముఖ్యమైన ఎస్పీ–బీఎస్పీ పార్టీల కూటమి ఏర్పడటం మరో దెబ్బ. ఎంతో కీలకమైన ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 41 లోక్‌సభ సీట్లున్న తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. మిగతా పక్షాలతో కలిసి ఎన్నికల్లో బీజేపీపై పైచేయి సాధించటానికి ఆ పార్టీకి అవకాశం వచ్చింది. అయితే, శ్రేణుల్లో ఉత్తేజం నింపడం, మిత్రుల్ని సంపాదించుకోవడం మాత్రమే కాదు ఎన్నికల్లో గెలుపునకు డబ్బు ఎంతో కీలకం. ఆ పార్టీకి నిధుల కొరత ఉంది. ప్రియాంక రాకతో అది తీరే అవకాశం ఉంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
విభిన్న రాజకీయం
సాక్షి, వరంగల్ రూరల్:ఉమ్మడి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాలు ఏర్పడిన నాటి నుంచి విభిన్నమైన రాజకీయ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. 1952 నుంచి 2009 వరకు పలుమార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 1952లో శాసనసభకు మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎన్ యతిరాజారావు ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి జెన్నారెడ్డి జనార్దన్‌రెడ్డి, డోర్నకల్ నుంచి ధరంసోత్ రెడ్యానాయక్, నర్సంపేట నుంచి మద్దికాయల ఓంకార్, వర్ధన్నపేట, పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు వీరంతా ఐదుసార్లు విజయం సాధించారు. డోర్నకల్ నుంచి నూకల రామచంద్రారెడ్డి, రామసహాయం సురేందర్ రెడ్డి నాలుగుసార్లు విజయకేతనం ఎగురవేశారు. చేర్యాల నుంచి నిమ్మ రాజిరెడ్డి, జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పాలకుర్తి 2009 నియోజకవర్గాల పునర్విభజనలో చెన్నూరు నియోజకవర్గం రద్దుచేశారు. అదే స్థానంలో పాలకుర్తి నియోజకవర్గం ఏర్పాటు చేశారు. పాలకుర్తి నియోజకవర్గం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజయం సాధిస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి నాలుగు సార్లు, టీడీపీ నాలుగు సార్లు, టీఆర్ఎస్ ఒకసారి గెలుపొందారు. రాష్ట్రంలో ఏడు సార్లు గెలుపొందిన అతికొద్ది మంది నేతల్లో ఒకరైన ఎన్ యతిరాజారావు చెన్నూరు నుంచి గెలుపొందారు. మహబూబాబాద్ మహబూబాబాద్‌కు మొత్తం 12 మార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, కాంగ్రెస్ఐ ఆరు సార్లు, టీడీపీ రెండుమార్లు, సీపీఐ రెండు మార్లు, టీఆర్ఎస్ ఒకసారి గెలుపొందారు. 1972 నుంచి 1989 వరకు ఐదు సార్లు జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన మాలోత్ కవిత ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. డోర్నకల్ 1957 సంవత్సరంలో నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి నుంచి 14 సార్లు ఎన్నికలు జరిగితే 13 సార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ఐ గెలిచాయి. ఒకసారి టీడీపీ గెలిచింది. 1972లో నూకల రామచంద్రారెడ్డి, ఆయన అకాల మరణం తరువాత 1974లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్ సురేందర్ రెడ్డి ఏకగ్రీవంగా గెలవడం విశేషం. నూకల మొత్తం నాలుగుసార్లు గెలిచారు. ఆయన తరువాత రామసహాయం సురేందర్ రెడ్డి మరో నాలుగు మార్లు, తదనంతరం రెడ్యానాయక్ ఐదు మార్లు గెలుపొందారు. 2014 ఎన్నికల సమయంలో పోటీ పడిన రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్ ఇద్దరూ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. జనగామ జనగామ నియోజకవర్గం నుంచి అత్యధిక సార్లు పొన్నాల లక్ష్మయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీపీసీసీ అధ్యక్షుని హోదాలో 2014లో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (టీఆర్ఎస్) చేతిలో ఓటమిపాలయ్యారు. జనగామ నియోజకవర్గంలో ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా ఎనిమిది సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. పరకాల పరకాలలో ఇప్పటివరకు 14 మార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ) కలిసి ఆరుసార్లు విజయం సాధించాయి. భారతీయ జనసంఘ్, బీజేపీలు కలిసి మూడు సార్లు గెలిచాయి. టీడీపీ, టీఆర్ఎస్ రెండు సార్లు, సీపీఐ ఒక్క సారి గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో, 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 2014లో టీడీపీ నుంచి గెలుపొందిన చల్లా ధర్మారెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. 2004 సంవత్సరంలో టీఆర్ఎస్ పక్షాన గెలుపొందిన శారారాణి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్‌కు విరుద్ధంగా జ్ఞానేశ్వర్‌కు మద్దతు ఇచ్చినందుకు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అన ర్హురాలిని చేస్తూ స్పీకర్ సురేష్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ములుగు ములుగుకు 15 మార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడుసార్లు విజయం సాధించాయి. టీడీపీ నాలుగు సార్లు, టీఆర్ఎస్ ఒక సారి, పీడీఎఫ్ రెండు సార్లు గెలుపొందాయి. ఒకసారి ఇండిపెండెంట్ గెలుపొందారు. 2014, 1994లో రెండుసార్లు మంత్రిగా చందూలాల్ పనిచేశారు. ఇక్కడ నుంచి మూడు మార్లు గెలిచిన జగన్నాయక్ కూడా మంత్రి పదవి చేపట్టారు. వర్ధన్నపేట వర్ధన్నపేటలో నియోజకవర్గానికి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 1994, 1999 ,2004 వరుసగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఇప్పటివరకు మూడు మార్లు టీడీపీ, మూడు మార్లు కాంగ్రెస్, బీజేపీ రెండు మార్లు, పీడీఎఫ్ రెండు మార్లు, ఎస్టీపీఎస్ ఒక సారి, టీఆర్ఎస్ ఒకసారి గెలుపొందారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కొంత కాలం ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. నర్సంపేట నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 13 మార్లు ఎన్నికలు జరిగాయి. ఐదుసార్లు మద్దికాయల ఓంకార్ గెలుపొందారు. మూడు మార్లు సీపీఎం నుంచి రెండుసార్లు ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కలేదు. ఇప్పటివరకు నర్సంపేట నుంచి మహిళ ఎమ్మెల్యేగా 1957లో కనరత్నమ్మ మాత్రమే గెలుపొందింది. రేవూరి ప్రకాష్ రెడ్డి టీడీపీ నుంచి మూడు మార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల పునర్విభజన తరువాత హన్మకొండ రద్దయి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఏర్పడింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 2009లో ఏర్పడినప్పటి నుంచి మూడు మార్లు వరుసగా దాస్యం వినయ్‌భాస్కర్ గెలుపొందారు. హన్మకొండ నియోజకవర్గం 1952 నుంచి 2004 వరకు పది మార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఐ మూడు మార్లు, టీడీపీ మూడు మార్లు, బీజేపీ ఒకసారి, టీఆర్ఎస్ ఒక సారి, పీడీఫ్ రెండు సార్లు గెలిచారు. స్టేషన్ ఘన్పూర్ రిజర్వుడ్ స్థానమైన స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇప్పటి వరకు 15 సార్లు జరిగాయి. ఐదుసార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు టీడీపీ గెలుపొందాయి. తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి చెరో మూడుసార్లు గెలుపొందారు. గతంలో ఇదే నియోజకవర్గ ప్రాతినిథ్యం వహించిన కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి క్యాబినెట్లో రాజయ్య ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాల పునర్విభజన తరువాత వరంగల్‌కు బదులు వరంగల్ తూర్పు నియోజకవర్గంగా 2009లో ఏర్పడింది. ఇప్పటి వరకు 14 మార్లు ఎన్నికలు జరగగా ఎనిమిది సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. మూడుమార్లు ఎమ్మెల్యేగా బస్వరాజు సారయ్య గెలుపొంది ఒక్కసారి మంత్రిగా పని చేశారు. టీడీపీ మూడు సార్లు, ఇండిపెండెంట్లు రెండు మార్లు, ఒకసారి టీఆర్ఎస్ గెలుపొందాయి. భూపాలపల్లి నియోజకవర్గాల పునర్విభజన తరువాత శాయంపేట రద్దయింది. దాని స్థానంలో భూపాలపల్లి నియోజకవర్గం 2009లో ఏర్పడింది. భూపాలపల్లిలో 2014లో మధుసూదనాచారి, 2009లో గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపొందారు. 2014లో గెలుపొందిన మధుసూదనాచారి తొలి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించారు. 2009లో గెలుపొందిన వెంకటరమణ రెడ్డి ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. శాయంపేట నియోజకవర్గంలో ఏడు మార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ నాలుగు సార్లు గెలిస్తే, టీడీపీ, బీజేపీ, జనతా పార్టీలు ఒక్కొక్కసారి గెలిచాయి. -
నటుడు చో రామస్వామి కన్నుమూత
-
చో రామస్వామి కన్నుమూత
- ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖుల సంతాపం చెన్నై: తమిళుల్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన అమ్మ మరణం నుంచి అక్కడి ప్రజలు కోలుకోకముందే... తమిళ ప్రజలు విపరీతంగా అభిమానించే రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ నటుడు, పత్రికా సంపాదకుడు, చో రామస్వామి కన్నుమూశారు. 82 ఏళ్ల ఈ కురు వృద్ధుడు బుధవారం ఉదయం 4.40 గంటల ప్రాంతంలో స్థానిక అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొద్ది కాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 29వ తేదీన తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆయన్ను స్థానిక అన్నాశాలై రోడ్డు, గ్రీమ్స్ రోడ్డులో గల అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆ సమయంలో దివంగత ముఖ్యమంత్రి, ఆయన్ని రాజకీయ గురువుగా భావించే జయలలిత అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె తుది శ్వాస విడిచిన సంగతి చో రామస్వామికి తెలియదు. తనకు అత్యంత ఆప్తురాలైన జయలలిత కన్ను మూసిన మూడవ రోజే చో రామస్వామి వైద్య చికిత్స పొందుతూ కన్ను మూయడం గమనార్హం. రాష్ట్ర ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగరరావు, ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం, డీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంకే.స్టాలిన్, కనిమొళి, అళగిరి, ఎండీఎంకే నేత వైగో, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయకాంత్, సూపర్‌స్టార్ రజనీకాంత్, అజిత్, సూర్య, కార్తీ, తదితర ప్రముఖులు చో రామస్వామి భౌతిక కాయానికి నివాళులర్పించారు. చో రామస్వామి పార్థివ దేహానికి బుధవారం సాయంత్రం 4.30 ప్రాంతంలో స్థానిక బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రామస్వామి ప్రముఖ నటి రమ్యకృష్ణకు మేనమామ కూడా. జయలలితతో పాటు ఎంజీఆర్, శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులతో కలసి పలు సినిమాల్లో నటించారు.14 చిత్రాల్లో హీరోగాను, మరికొన్ని చిత్రాల్లో ప్రతినాయకుడిగాను నటించారు. పలు నాటకాలు వేశారు. మహాభారతం, వాల్మీకి రామాయణం, నానేరాజా రచనలు ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి. వి.కృపలానీ, ఇందిరాగాంధీ, మొరార్జీదేశాయ్, కరుణానిధి, చరణ్ సింగ్, కామరాజర్, ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్, వాజ్‌పేయి, అద్వానీ, మోదీ వంటి రాజకీయ నేతలతోనూ చో కు సత్సంబంధాలున్నాయి. ప్రముఖుల సంతాపం: ‘చో రామస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎవ్వరికీ భయపడని వ్యక్తి. ఆయన కుటుంబ సభ్యులకు, తుగ్లక్ పాఠకులకు నా ప్రగాఢ సంతాపం’అని ప్రధాని మోదీ ట్వీటర్లో పేర్కొన్నారు. చో రామస్వామి మృతికి జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్ : ప్రఖ్యాత జర్నలిస్టు చో రామస్వామి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సంతాపాన్ని ప్రకటించారు. అవినీతికి వ్యతిరేకంగా రామస్వామి చేసిన రాజీలేని పోరాటం, నాటక రచనలో ఆయన ప్రతిభ, జర్నలిస్టుగా పదునైన వ్యంగ్యపూరిత వ్యాఖ్యలు ఆయన జీవితంలో కలికి తురారుు వంటివని జగన్ నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. చో గురించి సంక్షిప్తంగా.. పేరు: శ్రీనివాస అయ్యర్ రామస్వామి జన్మస్థలం: చెన్నైలోని మైలాపూర్ పుట్టిన తేదీ: అక్టోబర్ 5, 1934 విద్యాభ్యాసం: మద్రాస్ యూనివర్సిటీ భార్య: సౌందర్య సంతానం: శ్రీరామ్, సింధుజ తొలి వృత్తి: న్యాయవాది (1957-1962) బహుముఖ ప్రజ్ఞ: రచన, నటన, దర్శకత్వం, జర్నలిజంలలో ప్రతిభ పేరు ప్రతిష్టలు తెచ్చిన నాటకం: తుగ్లక్ స్థాపించిన పత్రిక: తుగ్లక్ (1970) అవార్డులు: భగవాన్‌దాస్ గొయెంకా రాజ్యసభ సభ్యత్వం: 2005-2009 -
'ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాల్సిందే'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అమలు చేయాల్సిందే అని విశ్రాంత న్యాయమూర్తి, జన చైతన్య వేదిక కన్వీనర్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి.. కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీతో ఎలాంటి ఉపయోగం ఉండదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్సైట్ (http://www.apspecialstatus.in)ను ఆయన ప్రారంభించారు. ప్రత్యేక హోదాతోనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని, అందుకు ఉద్యమించడమే మార్గమన్నారు. ఉద్యమం ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమవుతుందని దీనికి యువత ముందు వరుసలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ పాత్రికేయుడు తెలకపల్లి రవి మాట్లాడుతూ... పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని రాజకీయ ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రత్యేక హోదా కేంద్రం భిక్ష కాదు.. ఏపీ ప్రజల హక్కు అని లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. -
పచ్చని పొలాల్లో చిచ్చు పెడతారా..?
ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి తాడేపల్లి రూరల్ : తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి, తూళ్ళురు మండలం వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం గ్రామాల్లో జరిగిన సంఘటనలను ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి తీవ్రంగా ఖండించారు. ఆగ్రామాలను సందర్శించిన ఆయన పచ్చని పొలాల్లో రాజధాని చిచ్చు రాజేసిన పాపం రాష్ట్ర ప్రభుత్వందేనని విమర్శించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వ హించి రైతులకు నష్ట పరిహారం అందించడంతో పాటు భవిష్యత్‌లో ఇటువంటివి జరగకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తలపెట్టిన భూ సమీకరణను వ్యతిరేకించిన గ్రామాల్లోనే ఇవి జరగడం గమనించాలన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానం రైతులకు నష్టదాయకమన్నారు. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఎటువంటి ప్యాకేజి ప్రకటించక పోవడం పట్ల రైతులతో పాటు సామాన్య ప్రజలు కూడా అసంతృప్తి చెందుతుందన్నారు. రైతులను భయభ్రాంతులకు గురి చేయడానికే ఇలాంటి సంఘటనలు సృష్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు. గ్రామాలలో రైతుల మధ్య గొడవలు పెట్టి ప్రభుత్వం తాను అనుకున్నది సాధించాలనుకుని ఇలాంటి చర్యకు పూనుకున్నట్లు రైతులు అనుమానిస్తున్నారన్నారు. దీని వల్ల గ్రామాల్లో శాంతి, భద్రతల సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగుకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. శాంతియుత వాతావరణం కోసం కృషి చేయాలని ఆయన అన్నారు. ఆదివారం ఆర్ధరాత్రి నుంచి జరిగిన సంఘటనలో 5చోట్ల పాక లు, 20వేల బొంగులు కాలి బూడిద య్యాయని నష్టం లక్షల రూపాయల్లో ఉంటుందని రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాశం రామారావు, కౌలు రైతు సంఘం నాయకులు వై.వి.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.