Power Control Board
-
ఏపీలో ‘థర్మల్’ ధగధగ
నాడు రాష్ట్రంలో విద్యుత్తు కోతలు... పారిశ్రావిుక రంగంలో వెతలు, జనం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, విద్యుత్తు కార్యాలయాల ముందు ధర్నాలు. రాత్రీ, పగలూ ఒకటే యాతన. ఇటు వ్యవసాయ రంగం, అటు పారిశ్రామిక రంగం కుదేలు. ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమల కష్టాలు చెప్పనవసరం లేదు. పవర్ హాలీడేలతో నరక యాతనే. నేడు కరెంటు కష్టాలు లేవు...కోతలు అసలే లేవు. జనంలో అప్పటి మాదిరిగా ఆగ్రహోద్వేగాల జాడే లేదు. పారిశ్రామికం, వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్తు సరఫరా కావడంతో ఆయా రంగాల్లో ఉత్పత్తి భేషుగ్గా నమోదవుతోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకుల మోముల్లో దరహాసం కనిపిస్తోంది. దీనికి కారణం సీఎం జగన్ తీసుకున్న చర్యలు.. దూర దృష్టి. సాక్షి, అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చూపు ఫలితంగా రాష్ట్రంలో గత ఐదేళ్లుగా విద్యుత్ వెలుగులీనుతోంది. విద్యుదుత్పత్తికి ఎలాంటి అవరోధాలు లేకపోవడంతో వినియోగదారులకు, పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడానికి జగన్ ముందు చూపే కారణం. చంద్రబాబు హయాంలో ముఖ్యంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు సామరŠాధ్యనికి తగ్గట్టుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేని దుస్థితిలో ఉండేవి. అవే ప్లాంట్లు జగన్ పాలనలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అదనపు సామరŠాధ్యన్ని జోడించుకుని పురోగతిని సాధించాయి. రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో దాదాపు 45 శాతం ఏపీ జెన్కో థర్మల్ ప్రాజెక్టుల నుంచే సమకూరుతోందంటే రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాçßæమే ప్రధాన కారణం. అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైందని ఆ రంగ నిపుణులే చెబుతున్నారు. గత ప్రభుత్వ అసమర్థత శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం)లో రూ.8,432 కోట్ల అంచనా వ్యయంతో స్టేజ్ 1ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, 2012లో ఒక యూనిట్ 800 మెగావాట్లు, 2013లో మరో 800 మెగావాట్ల యూనిట్‌ను పూర్తి చేయాలని నిర్ధేశించారు. కానీ అలా జరగలేదు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నడిచే మొదటి ప్రాజెక్ట్ ఇది. విదేశీ తయారీదారుల నుంచి సాంకేతికతను బదిలీ చేయడంలో అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ప్రాజెక్ట్ ప్రారంభించడంలో జాప్యం చోటుచేసుకుంది. తర్వాత అంచనా వ్యయం రూ.12,230 కోట్లకు పెంచారు. అయితే స్టేజ్ 1 నిర్మాణం కోసం తీసుకున్న రూ.12942.28 కోట్ల అప్పులకు వడ్డీలు, వాయిదాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. అవన్నీ కలిపి మొత్తంగా రూ.20 వేల కోట్లకు చేరాయి. వీటిలో గత ప్రభుత్వం అసమర్ధత కారణంగా రూ.4200 కోట్లను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి గుర్తించలేదు. అప్పులతోపాటు రూ.2106.75 కోట్ల నష్టాల్లోకి ప్లాంటు వెళ్లిపోయింది. జగన్ సర్కారు సమర్ధత అలాంటి ప్లాంటులో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణానికి చేయూతనందించింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు త్వరితగతిన పనులు పూర్తి చేయించి, గతేడాది మార్చిలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితం చేశారు. అక్కడితో ఆగలేదు. ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణంపైనా దృష్టి సారించించారు. గతేడాది డిసెంబర్లో దానినీ అందుబాటులోకి తెచ్చారు. బొగ్గు కొరతకు చెక్ దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడినప్పుడు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు జగన్ సర్కారు ప్రణాళికలు అమలు చేస్తోంది. గతంలో ఒక్క రోజు నిల్వలకే అప్పటి ప్రభుత్వం నానా తంటాలు పడేది. ఉత్పత్తి లేక విద్యుత్ కోతలు విధించేది. ► ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో థర్మల్ విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు సమకూర్చుకుంటున్నాయి. ►సాధారణంగా 65 శాతం నుంచి 75 శాతం వరకు ఉండే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ వద్ద 1000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి 3.5 నుంచి 4 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ►ఈ మేరకు వీటీపీఎస్‌లో రోజుకి 28,500 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 1,12,350 మెట్రిక్ టన్నులు నిల్వ చేశారు. ►ఆర్టీపీపీలో 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి వస్తే అక్కడ 1,28,715 మెట్రిక్ టన్నులు తెచ్చి ఉంచారు. కృష్ణపట్నంలో 29 వేలు ఉత్పత్తికి వాడాల్సి ఉంటే 9,0971 మెట్రిక్ టన్నులు అందుబాటులో పెట్టారు. ►ఈ నిల్వలు వారం రోజుల వరకూ విద్యుత్ ఉత్పత్తికి సరిపోతాయి. బొగ్గును వినియోగిస్తూ థర్మల్ విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. ► కేంద్ర బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు, సకాలంలో చెల్లింపులు చేస్తూ స్వదేశీ బొగ్గు కేటాయింపులను పొందడంతోపాటు, టెండర్ల ద్వారా విదేశీ బొగ్గును రప్పించుకుంటున్నాయి. ►శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్), స్టేజ్–2లోని యూనిట్–3కి ఏటా 35.48 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) అంగీకరించేలా ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. ►ఇది కాకుండా థర్మల్ కేంద్రాలకు ఎంసీఎల్ నుంచి ఏటా 17.165 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంటీపీఏ), సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) నుంచి 6.88 ఎంటీపీఏ బొగ్గు సరఫరా కోసం ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్ఎస్ఏ) చేసుకుంది. ►ఈ ఒప్పందం ప్రకారం ఎంసీఎల్, ఎస్‌సీసీఎల్‌లు డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా.ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్టీపీపీ)కు రైలు, సముద్ర మార్గంలో బొగ్గును సరఫరా చేస్తున్నాయి. -
పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2.64
సాక్షి, అమరావతి: పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సిన టారిఫ్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఖరారు చేసింది. ఉత్పత్తి సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకుని పదేళ్లు దాటిన తరువాత యూనిట్ రూ.2.64 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. 11వ సంవత్సరం నుంచి 20 ఏళ్ల వరకు ఇదే టారిఫ్ వర్తిస్తుందని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. 2,100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు చెందిన 22 పీపీఏలకు ఆ సంస్థలు సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం ఏపీఈఆర్సీ ఈ టారిఫ్‌ను నిర్ణయించింది. అదే విధంగా ప్రాజెక్టు జీవిత కాలాన్ని 25 ఏళ్లుగా సంస్థలు ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. కానీ దానిని 30 ఏళ్లుగా ఏపీఈఆర్సీ పరిగణించింది. ప్రాజెక్టు ఏర్పాటుకు మెగావాట్‌కు ఐదెకరాల చొప్పున ఆ సంస్థలు ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్నాయి.పీపీఏ గడువు ముగిసేనాటికి వాటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఏపీఈఆర్సీ అంచనా వేసింది. దానిని పరిగణనలోకి తీసుకుని యూనిట్ ధరను ఖరారు చేసినట్లు కమిషన్ వెల్లడించింది. మీరు అడిగినంత ఇవ్వలేం మొదటి పది సంవత్సరాలకు యూనిట్‌కు రూ.3.43 చెల్లించాలని గతంలోనే ఏపీఈఆర్సీ ఆదేశాలిచ్చింది. అయితే ప్రస్తుత మార్కెట్ ధరల మేరకు 11 ఏళ్లు దాటిన తరువాత 20 ఏళ్ల వరకూ యూనిట్‌కు రూ.3.50 టారిఫ్ సెట్ చేయాలని పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏపీఈఆర్సీని కోరాయి. ఏపీఈఆర్సీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మొదటి పదేళ్ల టారిఫ్ రూ.3.43గా నిర్ణయించామని, ఆ సమయంలో సుంకం కూడా యూనిట్‌పై రూ.2.4 తగ్గించామని, కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినందున ఆ ధరలే ఇవ్వమనడం కుదరదని తేల్చి చెప్పింది. 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు యూనిట్‌కు రూ.2.64గా నిర్ధారించింది.20 ఏళ్లు దాటిన తరువాత పీపీఏలను రద్దు చేసుకునేందుకు డిస్కంలకు అవకాశం కల్పించింది. కొనసాగితే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థల పరస్పర అంగీకారంతో టారిఫ్‌ను నిర్ణయించుకోవచ్చని, దానిని కమిషన్‌కు నివేదించి ఆమోదం పొందాలని సూచించింది. వృద్ధికి అనుగుణంగా.. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 10,785.51 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. ఈ మొత్తంలో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 4096.65 మెగావాట్లు. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పెరుగుదల నమోదు చేసుకుంది. వాతావరణ మార్పులకు ప్రభుత్వ చర్యలు తోడవడంతో ఏపీలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయొరాలజీ (పూణె)కి చెందిన పరిశోధకులు వారి అధ్యయనంలో వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాలపై గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ)తో ఆర్థికంగా కుదేలవుతున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఊరట కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పవన విద్యుత్ ధరలను నిర్ణయించింది. -
ప్రజాధనానికి పంగ‘నామా’లు
-
రూ.21 వేల కోట్ల ప్రజాధనానికి పంగ‘నామా’లు
సాక్షి, అమరావతి: మరో ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. సింహపురి విద్యుత్ సంస్థ నుంచి ఏకంగా 400 మెగావాట్ల కరెంటును కొనేందుకు అనుమతించింది. ఈ సంస్థ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుది కావడం విశేషం. అందుకే మార్కెట్లో ఎక్కడా లేని విధంగా యూనిట్‌కు రూ.4.80 చొప్పున చెల్లించేందుకుప్రభుత్వం ఏమాత్రం వెనుకాడలేదు. అంతేకాదు ఏకంగా 12 ఏళ్ల కాలపరిమితితో విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్)పై దాదాపు రూ.21 వేల కోట్ల అదనపు భారం పడనుంది. సింహపురి సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని డిస్కమ్‌లు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్రంలో ఇప్పటికే మిగులు విద్యుత్ ఉందని, ఇంకా కొనాల్సిన అవసరం ఏమిటని విద్యుత్ రంగ నిపుణులు విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ముందు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఏపీఈఆర్సీ హడావుడిగా గురువారం హైదరాబాద్‌లో ప్రజాభిప్రాయ సేకరణ తంతు ముగించింది. ఈ నెల 10వ తేదీన పీపీఏకు సంబంధించిన ఆదేశాలు ఇస్తామని ప్రకటించింది. సింహపురితో లాలూచీ రాష్ట్రంలో భారీగా పరిశ్రమలొస్తాయని, విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని డిస్కమ్‌లు అతిగా అంచనా వేశాయి. ఇబ్బడిముబ్బడిగా ప్రైవేటు ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేశాయి. ఇందులో భాగంగానే 2016 జనవరిలో 2,400 మెగావాట్ల కొనుగోలుకు టెండర్లు పిలిచాయి. 400 మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్ రూ.4.35కు అందించేందుకు సింహపురి ఎనర్జీస్ సంస్థ ముందుకొచ్చింది. అయితే, అప్పటికే రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ రేటు పడిపోయింది. ఈ నేపథ్యంలో సింహపురికి అత్యధికంగా చెల్లించడంపై సర్వత్రా విమర్శలొచ్చాయి. ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా సింహపురి విద్యుత్‌పై అభ్యంతరాలు తెలిపాయి. ఏపీఈఆర్సీ జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో 2017 నవంబర్‌లో ప్రభుత్వం తరపున ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి సింహపురి విద్యుత్‌పై పునరాలోచించుకుంటామని ఏపీఈఆర్సీకి లేఖ రాశారు. అప్పటి నుంచి ఈ వ్యవహారం ముందుకు సాగలేదు. వారం రోజుల క్రితం ఉన్నట్టుండి ఇంధనశాఖ మనసు మార్చుకుంది. బిడ్డింగ్‌లో వచ్చిన సింహపురి విద్యుత్‌ను తీసుకోవాల్సిందేనంటూ కమిషన్‌కు లేఖ రాసింది. బిడ్డింగ్‌లో యూనిట్ రూ.4.35 ఉంటే... ఇప్పుడు యూనిట్ రూ.4.80 చొప్పున కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. దీంతో కమిషన్ గుట్టుచప్పుడు కాకుండా ప్రజాభిప్రాయ సేకరణ ముగించి, ఆదేశాలివ్వడానికి సిద్ధపడింది. కొనుగోలు అవసరమా? రాష్ట్రంలో ఇప్పటికే విద్యుత్ లభ్యత ఏడాదికి 67,948 మిలియన్ యూనిట్లుగా ఉంది. కానీ, డిమాండ్ ఏడాదికి 57,018 మిలియన్ యూనిట్లు మాత్రమే. అంటే ప్రస్తుతం 10 వేల మిలియన్ యూనిట్ల మేర మిగులు కరెంటు ఉంది. కాబట్టి 8,700 మిలియన్ యూనిట్ల మేర జెన్కో ఉత్పత్తిని నిలిపివేస్తామని, మిగిలిన కరెంటును బహిరంగ మార్కెట్లో విక్రయిస్తామని డిస్కమ్‌లు తెలిపాయి. కానీ, ఇంతవరకూ ఒక్క యూనిట్ కూడా బయట అమ్మలేదు. తక్కువ ధరకు లభించే ఏపీ జెన్కో కరెంటును నిలిపివేసి మరీ ప్రైవేటు విద్యుత్ కొనుగోలును ప్రోత్సహిస్తున్నారు. తాజాగా సింహపురి నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రోజూ 10 మిలియన్ యూనిట్ల మేర జెన్కో ఉత్పత్తికి బ్రేక్ పడుతుంది. సింహపురికి అత్యధికంగా చెల్లించడమే కాదు... ఏపీ జెన్కో విద్యుత్ ప్లాంట్లు ఉత్పత్తి ఆగిపోయి మరింత అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. లబ్ధి ఇలా.. సింహపురి విద్యుత్ సంస్థతో గతంలో డిస్కమ్‌లకు ఎలాంటి కొనుగోలు ఒప్పందాలు లేవు. రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్నప్పుడు కూడా ఈ సంస్థ ఎక్కువ ధరలకు బయటి మార్కెట్లో కరెంటును అమ్ముకుంది. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు గణనీయంగా పడిపోయాయి. సింహపురి సంస్థ పూర్తిగా విదేశీ బొగ్గుతో నడుస్తుంది కాబట్టి ఉత్పత్తి వ్యయం ఎక్కువ. దీంతో ఆ సంస్థ విద్యుత్‌ను అమ్ముకోలేని పరిస్థితి ఉంది. సంస్థ యాజమాని రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్నిహి తుడు కావడం వల్ల నేరుగా ప్రభుత్వంతో డీల్ కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింహపురి సంస్థ నుంచి రోజుకు కనీసం 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తుంది. యూనిట్ రూ.4.80 చొప్పున రోజుకు రూ.4.80 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.1,752 కోట్లు అవుతుంది. 12 ఏళ్ల ఒప్పందం కాబట్టి మొత్తం రూ.21,024 కోట్లు చెల్లించక తప్పదు. -
‘వార్దా’ కారిడార్ రద్దు?
సాక్షి, హైదరాబాద్: నవంబర్ నుంచి రాష్ట్రానికి అందుబాటులోకి రానున్న1000 మెగావాట్ల వార్దా–డిచ్పల్లి ట్రాన్స్మిషన్ కారిడార్‌ను వదులుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో మరో 1000 మెగావాట్ల కారిడార్ అవసరం లేదని తెలంగాణ ట్రాన్స్‌కోకు చెందిన అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో తీవ్ర విద్యుత్ కొరత నెలకొని ఉండేది. కొనుగోలు చేద్దామన్నా దక్షిణాదిన ఎక్కడా విద్యుత్ లభ్యత లేదు. ఉత్తర భారత దేశంలో పెద్దఎత్తున మిగులు విద్యుత్ ఉన్నా, అక్కడి నుంచి తరలించుకోవడానికి విద్యుత్ లైన్లు లేవు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టు కున్న రాష్ట్ర ప్రభుత్వం 2015లో ‘‘వార్దా–డిచ్ పల్లి 765 కేవీ డబుల్ సర్క్యూట్ పవర్ ట్రాన్స్ మిషన్ కారిడార్’’లో 2000 మెగావాట్ల లైన్లను 12 ఏళ్ల కాలానికి రాష్ట్ర అవసరాల కోసం ముందస్తుగా బుక్ చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లకోసం ఏడాది కాలంగా 1000 మెగావాట్ల సరఫరా లైన్లను వినియోగించుకుం టుండగా, మిగిలిన 1000 మెగావాట్ల లైన్లను వచ్చే నవంబర్ నుంచి వినియోగించుకోవాల్సి ఉంది. ఛత్తీస్‌గఢ్ నుంచే మరో 1000 మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు చేయాలని అప్పట్లో మరో కారిడార్‌ను బుక్ చేసుకుంది. అయితే, ప్రస్తుతం పరిస్థితుల్లో పూర్తి మార్పు వచ్చింది. గత మూడేళ్లల్లో పెద్దఎత్తున కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం పూర్తి కావడంతో దక్షిణాదిన అవసరమైనంత విద్యుత్ లభ్యత ఏర్పడింది. ఇక ఉత్తర భారతదేశం నుంచి విద్యుత్ కొను గోలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేస్తున్న 1000 మెగావాట్ల విద్యుత్‌కు సంబంధించిన ధరలను భారీగా పెంచాలని ఆ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ ఇటీవల అక్కడి విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదించిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేయాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించు కుంది. ఇదే కోవలో వార్దా కారిడార్‌నూ రద్దు చేసుకోవాలని యోచిస్తోంది. వదులుకుంటే నష్టమే ! ఉత్తర–దక్షిణ భారతదేశాన్ని అనుసంధానం చేస్తూ 4,350 మెగావాట్ల విద్యుత్ సరఫరా సామర్థ్యంతో వార్దా–డిచ్పల్లి పవర్ ట్రాన్స్ మిషన్ కారిడార్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీజీసీఎల్) నిర్మించింది. విద్యుత్ సరఫరా లైన్ల కేటాయింపు జరిగాక రద్దు చేసుకుంటే కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) మార్గదర్శకాల ప్రకారం పీజీసీఎల్‌కు భారీ జరిమా నాలు కట్టాలి. ఒకసారి ట్రాన్స్మిషన్ కారిడార్ కేటాయింపులు జరిగిన తర్వాత అందులో కనీసం 66% సామర్థ్యాన్ని తప్పని సరిగా వినియోగిం చుకోవాల్సి ఉంటుంది. కారిడార్‌ను రద్దు చేసుకున్నా 66 శాతం విద్యుత్ సరఫరాకు సంబంధించిన సరఫరా చార్జీలను పీజీసీఎల్‌కు జరిమానాగా చెల్లించక తప్పదని ప్రస్తుత నిబంధనలు పేర్కొంటున్నాయి. వార్దా–డిచ్పల్లి కారిడార్‌లో రాష్ట్రానికి కేటా యించిన వెయ్యి మెగావాట్ల లైన్ల ద్వారా రాష్ట్రానికి ఏటా 876 కోట్ల యూనిట్ల విద్యుత్ సరఫరాకు వీలు కలిగింది. ఈ లైన్లను వినియోగించుకోకపోయినా 876 కోట్ల యూని ట్లలో 66 శాతమైన 578.6 కోట్ల యూనిట్ల విద్యుత్‌కు సంబంధించిన ట్రాన్స్మిషన్ చార్జీ లను పీజీసీఎల్‌కు జరిమానాగా చెల్లించాల్సి ఉండనుంది. విద్యుత్ సరఫరా చార్జీలు యూని ట్‌కు 55పైసల నుంచి 65 పైసల వరకు కానున్నాయి. యూనిట్‌కు సగటున 60 పైసలను సరఫరా చార్జీలుగా చెల్లించినా 578.6 కోట్ల యూనిట్ల విద్యుత్‌కు సంబంధించి ఏటా రూ.346.8 కోట్లు చొప్పున 12 ఏళ్ల పాటు పీజీసీఎల్‌కు రాష్ట్ర విద్యుత్ సంస్థలు రూ.4,161 కోట్లకు పైగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. వార్దా–డిచ్పల్లి కారిడార్‌లోని రెండో 1000 మెగావాట్ల కారిడార్‌ను రద్దు చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని ట్రాన్స్ కోకు చెందిన సీనియర్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రద్దు చేసుకుంటే జరిమానాలు వసూలు చేయాలా? వద్దా? అన్న అంశంపై అధ్యయ నం కోసం సీఈఆర్సీ గతంలో ఓ కమిటీని నియమిం చిందని, సాంకేతికంగా జరిమానాలు వసూలు చేయడం సాధ్యం కాదని ఆ కమిటీ నివేదిక ఇచ్చిందని ఆ అధికారి స్పష్టం చేశారు. వార్దా– డిచ్పల్లి కారిడార్‌ను రద్దు చేసుకున్నా జరిమానాలు చెల్లించాల్సి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఎన్నికల తర్వాత ‘విద్యుత్’ వాత!
సాక్షి, హైదరాబాద్: రానున్న సాధారణ ఎన్నికలు ముగిశాక ప్రజలపై భారీగా విద్యుత్ చార్జీల భారం పడే ప్రమాదముందని విద్యుత్‌రంగ నిపుణులు, పారిశ్రామిక, రైతు, వినియోగదారుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రూ. 9,970.98 కోట్లకు ఎగబాకిన రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ఆదాయ లోటు అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా అని ప్రశ్నించాయి. దీన్ని పూడ్చుకోవడానికి డిస్కం లు ఎన్నికలయ్యాక ‘ట్రూ అప్’పేరుతో చార్జీలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తే అనుమ తించొద్దని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి. గత రెండేళ్లుగా డిస్కంలు కావాలనే రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించలేదని, దీనివల్ల ఉత్పన్నమైన భారీ ఆదాయ లోటును పూడ్చుకోవడానికి ట్రూ అప్ల పేరుతో చార్జీలు పెంచడానికి డిస్కంలకు అధికారం లేదని స్పష్టం చేశాయి. 2018–19కి సంబం ధించి డిస్కంలు ప్రతిపాదించిన వార్షిక ఆదా య అవసరాల (ఏఆర్ఆర్) నివేదికపై సోమ వారం హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యుత్ నియం త్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) నిర్వహించిన బహిరంగ విచారణలో వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొని తమ అభ్యంతరాలు, సలహాలు, సూచలను తెలియజేశారు. సర్‌చార్జీల వాత పెడితే పెట్టుబడులు కష్టం: ఫ్యాప్సీ క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ, అదనపు సర్‌చార్జీల పేరుతో వేస్తున్న కోట్లాది రూపాయల భారాన్ని పరిశ్రమలు భరించలేకపోతున్నా యని, ఇలా అయితే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కష్టంగా మారుతుందని తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఫ్యాప్సీ) స్పష్టం చేసింది. ఓపెన్ యాక్సెస్ పద్ధతి కింద బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు జరిపే పరిశ్రమలపై యూనిట్‌కు రూ. 2.06 పైసలు చొప్పున అదనపు సర్‌చార్జీలు విధించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించింది. కొత్త విద్యుత్ చట్టం అమల్లోకి రాక ముందే ఓపెన్ యాక్సెస్ కొనుగోళ్లు ఉండేవని, ఇప్పుడు కొత్తగా అదనపు సర్‌చార్జీలను విధించడం సరికాదని ఫ్యాప్సీ ప్రతినిధి టి.సుజాత పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక కేటగిరీ సృష్టించి తక్కువ చార్జీలు విధించాలని సూచించారు. ఓపెన్ యాక్సెస్ విద్యుత్ కొనుగోళ్లపై అదనపు సర్‌చార్జీలను దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఇంజనీర్ జీవీ మల్లికార్జునరావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఏపీలో రైల్వేకు తక్కువ విద్యుత్ చార్జీలున్నాయని, అందువల్ల తెలంగాణలోనూ చార్జీలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అదనపు విద్యుత్ కొనుగోళ్లు ఎందుకు మిగులు విద్యుత్ ఉందంటూనే మళ్లీ అదనపు విద్యుత్ కొనుగోళ్లు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తోందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్, సీనియర్ జర్నలిస్టు ఎం.వేణుగోపాల్‌రావు ప్రశ్నించారు. రూ. వేల కోట్లకు సంబంధించిన ఈ వ్యవహారంపై డిస్కంలు వివరణ ఇవ్వాలన్నారు. జెన్కోలో విద్యుదుత్పత్తి సామర్థ్యం (పీఎల్ఎఫ్) 70 శాతానికి తగ్గిందని, ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ల కోసమే జెన్కోలో ఉత్పత్తి తగ్గిస్తున్నారని ఆరోపించారు. దేశంలోనే అత్యధికంగా 2,300 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేస్తున్నామని ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకోవడం వెనక చీకటి కోణాలున్నాయని..అధికారంలో ఉన్న వారికి, ప్రైవేటు డెవలపర్లకు దోచి పెట్టడానికే ఈ సౌర విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని మండిపడ్డారు. రూ.2.50 నుంచి రూ.3లకు యూనిట్ చొప్పున సౌర విద్యుత్ విక్రయించేందుకు డెవలపర్లు ముందుకు వస్తున్నా రాష్ట్రంలో రూ. 6 నుంచి రూ. 6.50 ధరతో కొనుగోళ్ల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. దీంతో 25 ఏళ్లపాటు ప్రజలు దోపిడీకి గురికానున్నారన్నారు. రైతుల పొలాల్లో బలవంతంగా టవర్లు పరిహారం చెల్లించకుండానే రైతుల పొలాల్లో బలవంతంగా విద్యుత్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారని కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ పాలకులు తెచ్చిన టెలిగ్రాఫ్ చట్టాన్ని సాకుగా చూపి పొలాల్లో భారీ విద్యుత్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. విద్యుత్ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, పరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉందని ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ తెలిపారు. కలెక్టర్లు పరిహారం ఇప్పించకపోతే రైతులు ఈఆర్సీలో అప్పీల్ చేసుకోవచ్చన్నారు. -
విద్యుత్ వాత
- అన్ని కేటగిరీల వినియోగంపై 3.6 శాతం పెంపు - వ్యవసాయానికి మినహాయింపు - 200 యూనిట్లలోపు వినియోగదారులకు ఊరట - జిల్లాపై రూ.4.2 కోట్లు భారం - పరోక్షంగా ప్రజలపై మరికొంత ఆర్థికభారం - పెరిగిన చార్జీలు నేటి నుంచి అమలు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు మరోమారు వాతపెట్టింది. వ్యవసాయానికి మినహా మిగతా అన్ని కేటగిరీల వినియోగదారులపై 3.6 శాతం పెంచుతూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మూడో సారి విద్యుత్ చార్జీలు పెంచింది. విద్యుత్ చార్జీల పెంపుతో జిల్లా ప్రజలపై సగటున రూ.4.2 కోట్ల భారం పడుతుండగా, పరోక్షంగా మరికొంత పడే అవకాశం ఉంది. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న వారికి మాత్రం ఊరట లభించింది. శనివారం నుంచి పెంచిన చార్జీలు అమలులోకి రానున్నాయి. నెల్లూరు (టౌన్): జిల్లాలో మొత్తం 12 లక్షల 97 వేల సర్వీసులు ఉన్నాయి. వాటిలో 9,82,234 గృహాలకు, వ్యవసాయానికి 1,67వేలు, వాణిజ్యానికి 89,549 కనెక్షన్లు, పరిశ్రమలకు 42,247 సర్వీసులు.. కాటేజీ, చిన్న పరిశ్రమలకు 661, వీధిలైట్లు, వాటర్ కనెక్షన్లకు 10,562, హెచ్‌టీ సర్వీసులు 515, ఇతర సర్వీసులు 10,562 వరకు ఉన్నాయి. వీటికి సంబంధించి రోజుకు 1.20 లక్షల యూనిట్లు వరకు వినియోగం జరుగుతోంది. లోటెన్షన్ సర్వీసుల ద్వారా రూ.54 కోట్లు, హైటెన్షన్ ద్వారా రూ.61 కోట్లు రెవెన్యూ వస్తుంది. రూ. 4.2 కోట్ల్లకు పైగా భారం విద్యుత్ నియంత్రణ మండలి వ్యవసాయ వినియోగాదారులను మినహాయించి మిగిలిన సర్వీసులకు 3.6 శాతం మేర చార్జీలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. నెలకు 200 యూనిట్లలోపు వినియోగిస్తున్న వినియోగదారులపై చార్జీలను పెంచలేదు. అయితే మిగిలిన వినియోగదారులపై పెంచిన చార్జీలు శనివారం నుంచి అమలులోకి రానున్నాయి. చార్జీల పెంపుతో వినియోగదారులపై ఏడాదికి రూ.48.24 కోట్లు భారం పడనుంది. అయితే గృహ సర్వీసులకు సంబంధించి నెలకు 200 యూనిట్లకుపైగా వినియోగిస్తున్న వారిపై ఎంత పెంచారనేది ఇంకా విడుదల చేయలేదు. దీంతో పాటు వాణిజ్యం, పరిశ్రమలు తదితర వినియోగదారులపై భారం పడనుంది. ప్రస్తుతం హైటెన్షన్ సర్వీసులకు సంబంధించి కేటగిరి–1 యూనిట్‌కు రూ.6.14, కేటగిరి–2లో రూ.7.40 వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం 3.6 శాతం పెంపుతో కేటగిరి–1లో రూ.6.35 , కేటగిరి–2లో రూ.7.68లకు పెరగనుంది. లోటెన్షన్ సెక్షన్లో కేటగిరి–2 కింద దుకాణాలు, షాపులు, కేటగిరి–3 కింద దేవాలయాలు, రొయ్యల సర్వీసులు, తాగునీటి, పాఠశాల సర్వీసులు ఉన్నాయి. వీటి మీద ప్రస్తుతం యూనిట్‌కు రూ. 6.38 వసూలు చేస్తున్నారు. పెంచిన చార్జీలు ప్రకారం యూనిట్ ధర రూ. 6.62లకు పెరగనుంది. ప్రజలపై పరోక్ష భారం విద్యుత్ చార్జీల పెంపుతో సామాన్య ప్రజలపై భారం పడనుంది. దుకాణాలు, పరిశ్రమలపై విద్యుత్ చార్జీలు ప్రభుత్వం పెంచడంతో ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న వస్తువులు ధరలు పెరిగే అవకాశం ఉంది. దుకాణాలు, చిన్నషాపులపై చార్జీలు పెంచడంతో వారు కూడా ప్రతి వస్తువుకు ధర పెంచి వసూలు చేసే అవకాశం ఉంది. దీని వల్ల సామన్య ప్రజలపై పరోక్ష భారం పడనుంది. ఇప్పటికే అన్ని రకాల వస్తువులు ధరలు పెరిగి సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, నిత్యావసర సరకులు ధరలు ఆకాశనంటుతున్నాయి. తాజా చార్జీల పెంపుతో అన్ని తరగతుల ప్రజలు ఇబ్బందులు పడుతారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకా ఉత్తర్వులు అందలేదు చార్జీల పెంపుపై ఇంకా ఉత్తర్వులు అందలేదు. వ్యవసాయ సర్వీసుల మినహాయించి మిగిలిన వాటిపై 3.6 శాతం పెంచినట్లు తెలిసింది. ఇంకా అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. – వెంకటేశ్వర్లు, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ -
విద్యుత్ వినియోగదారులకు ట్రూ–అప్ షాక్!
రూ. 887 కోట్ల అదనపు భారం సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగ దారులకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 2015–16 సంవత్సరంలో ఆమోదించిన దానికన్నా ఎక్కువైన ఖర్చు (ట్రూ–అప్)ను రాబట్టేందుకు డిస్కమ్‌లు ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు ఇచ్చాయి. ఈ అదనపు భారం రూ.887 కోట్లు. 2017–18లో ఈ మొత్తాన్ని వినియోగదారుల నుంచి రాబట్టేందుకు అనుమతించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు ఏపీఈఆర్సీని కోరాయి. కమిషన్ దీనికి అనుమతిస్తే ఏప్రిల్ నుంచి పెరిగే కొత్త విద్యుత్ చార్జీల్లో దీన్ని కలుపుతారు. ఇప్పటికే రూ. 859 కోట్లను ప్రజల నుంచి రాబట్టేందుకు డిస్కమ్‌లు అనుమతి కోరాయి. విద్యుత్ నియంత్రణ మండలి సూచించిన దానికన్నా ఎక్కువ మొత్తంలో ప్రైవేటు విద్యుత్‌ను కొనడం వల్లే అదనంగా రూ. 887 కోట్ల భారం పడిందని డిస్కమ్‌లు తమ ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. 2015–16 సంవత్సరంలో 54,225 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని అంచనా వేశారు. -
చార్జీల పెంపు ఏపీలో ఎంత?
కన్సల్టెన్సీతో కలసి తెలంగాణ డిస్కంల అధ్యయనం అయినా ఇంకా కొలిక్కి రాని టారిఫ్ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్ : పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏ మేరకు విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించింది? మనమెంత పెంపునకు ప్రతిపాదించాలి? అన్న అంశాలపై తెలంగాణ విద్యుత్ సంస్థ(డిస్కం)లు క్షుణ్ణంగా పరిశీలించాయి. ఏపీలో రూ.859 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు గత బుధవారం అక్కడి డిస్కంలు ఆ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించిన విషయం తెలిసిందే. ఏ రంగాల వినియోగదారుల పై ఎంతమేర చార్జీల పెంపునకు ఏపీ డిస్కంలు ప్రతి పాదించాయి? తెలంగాణలో ఎంత వరకు పెంచవ చ్చు? అనే అంశాలపై తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంల ఉన్నతాధికారులు, ప్రపంచ బ్యాంక్ కన్సల్టెన్సీ ‘కేపీఎంజీ సంస్థ’ నిపుణులు తాజాగా హైదరాబా ద్లో సమావే శమై పరిశీలించారు. చార్జీల పెంపు అమలు చేసినా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు ఏపీకి మించకుండా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, రెండు రాష్ట్రాల్లో విద్యుత్ చార్జీల మధ్య వ్యత్యాసం ఎక్కువ కాకుండా చూసేందుకు ఈ సమావేశం నిర్వహించారని తెలిసింది. ప్రధానంగా పారిశ్రామిక రంగ వినియోగ దారులపై చార్జీల పెంపు ఏపీకి మించకుండా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ఉజ్వల్ డిస్కం అష్యురెన్స్ యోజన (ఉజ్వల్) పథకంలో ఇటీవల తెలంగాణ డిస్కంలు చేరడంతో మారిన పరిస్థితులపై సైతం ఈ సమావే శంలో అధ్యయనం చేసినట్లు తెలిసింది. ప్రతి ఏటా వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)/ టారిఫ్ ప్రతిపాదనల రూపకల్పనతోపాటు ఇతరత్రా అవసరాలకు రెండు రాష్ట్రాల డిస్కంలూ కేపీఎంజీ సంస్థ సేవలను వినియోగించుకుంటున్నాయి. చార్జీల పెంపు ప్రతి పాదనలు ఓ కొలిక్కి వచ్చినా అధికారులు ఇంకా ఖరారు చేయలేదు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించిన అనంతరం ఆయన సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని అధికారవర్గాలు తెలిపాయి. నెలాఖరుకే ప్రతిపాదనలు... విద్యుత్ చట్టం నిబంధనల ప్రకారం డిస్కం లు విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను గత నవంబర్‌లోగా ఈఆర్సీకి సమర్పించాల్సి ఉండగా, డిస్కంల విజ్ఞప్తి మేరకు డిసెంబర్ వరకు ఈఆర్సీ గడువు పొడిగించింది. ఆ తర్వాత కూడా డిస్కంల కోరిక మేరకు జనవరి 16 వరకు రెండోసారి, ఆ తర్వాత జనవరి 23 వరకు మూడోసారి గడువును ఈఆర్సీ పొడిగించింది. అయినా, చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు ఇంకా ఖరారు చేయలేక పోయాయి. దీంతో సోమవారం ఈఆర్సీకి కొత్త టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించే అవకాశం లేదని ట్రాన్స్‌కో అధికారవర్గాలు పేర్కొన్నాయి. నెలాఖరు వరకు నాలుగోసారి గడువు పొడిగింపు కోరాలని డిస్కంలు నిర్ణయించినట్లు తెలిసింది. -
పోలీసు పహారా, తనిఖీలు ఎందుకు?
♦ ఈఆర్సీ బహిరంగ విచారణ తీరుపై ప్రజా సంఘాల నేతలు, ♦ విద్యుత్ నిపుణుల ఆగ్రహం ♦ చార్జీల పెంపుపై అభిప్రాయ సేకరణ రసాభాస సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపుపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్వహిస్తున్న బహిరంగ విచారణ తీరును ప్రజా సంఘాల నేతలు, విద్యుత్ నిపుణులు తీవ్రంగా తప్పుబట్టారు. విద్యుత్ శాఖ ఉద్యోగన్న సాకుతో ఆ రంగ నిపుణుడు రఘును హాజరుకాకుండా నియంత్రించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్న సమావేశ మందిరం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి, తనిఖీలు చేపట్టి భయోత్పాత వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరమేమిటని నిలదీశారు. విచారణ సందర్భంగా అభిప్రాయాలు చెబుతున్న వారి పట్ల ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ వ్యవహార శైలిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుతోనే తెలంగాణ వచ్చిందని, ఇక్కడ కూడా పారదర్శకత లేకపోతే ఎలాగని ప్రశ్నించారు. తొలిరోజు రసాభాస... విద్యుత్ చార్జీల పెంపుకోసం విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) చేసిన ప్రతిపాదనలపై ఈఆర్సీ బుధవారం బహిరంగ విచారణ ప్రారంభించింది. తొలిరోజున హైదరాబాద్‌లోని తెలంగాణ ఫ్యాప్సీభవన్‌లో నిర్వహించిన విచారణకు పలు ప్రజా సంఘాలు, సంస్థల నాయకులు, విద్యుత్ రంగ నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ విచారణకు హాజరుకావద్దంటూ ఈఆర్సీ జారీచేసిన అడ్వెయిజరీపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. విద్యుత్ రంగాన్ని మెరుగుపరిచేందుకు ఉద్యోగుల సహకారం కూడా తీసుకుంటే నష్టమేమిటని, రఘును విచారణలో పాల్గొనకుండా చేయడం సరికాదని పీపుల్ మానిటరింగ్ గ్రూప్ ఆన్ ఎలక్ట్రిసిటీ సభ్యుడు దొంతిరెడ్డి నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యం పెరిగేలా చూడాలన్నారు. ఈఆర్సీ పారదర్శకతను పాటించాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (తెలంగాణ ఎన్ఆర్ఐఎస్) నాయకుడు డి.పాండురంగారెడ్డి సూచించారు. పబ్లిక్ హియరింగ్‌లో అందరినీ భాగస్వాములను చేయాలని, రఘును విచారణకు అనుమతించకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఈఆర్సీ ప్రభుత్వ నియంత్రణకు అతీతంగా పనిచేయాలని సూచించారు. విచారణకు రాకుండా రఘును అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామని టీజేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఈ విధంగా జరగడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రశ్నించే గొంతుతోనే తెలంగాణ వచ్చిందని, ఇప్పుడు కూడా పారదర్శకత లేకపోతే ఎలాగని నిలదీశారు. ఇక బహిరంగ విచారణ ప్రాంగణాన్ని పోలీసు బందోబస్తుతో నింపేయడాన్ని, విచారణకు వచ్చినవారిని తనిఖీ చేశాకే లోపలికి పంపడాన్ని ఆప్ నేత పీఎల్ విశ్వేశ్వరరావు ప్రశ్నించారు. ఏది వాగితే అది వినాలా..?: ఈఆర్సీ చైర్మన్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై బహిరంగ విచారణలో సీనియర్ జర్నలిస్టు వేణుగోపాలరావు (సెంటర్ ఫర్ పవర్ స్టడీస్) పలు అంశాలను వివరించారు. ఏఆర్‌ఆర్‌లో పేర్కొన్న మిగులు విద్యుత్ యదార్థం కాదని, స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లపై అనుమానాలున్నాయని పేర్కొన్నారు. ఏపీ నుంచి చౌకగా విద్యుత్ తీసుకునే అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఈఆర్సీ చైర్మన్ తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘ఏపీ ఇవ్వకపోతే ఏం చేస్తారు.. తెలంగాణకు పరిమితమై మాట్లాడండి..’’ అని పేర్కొన్నారు. ఈ దశలో వేణుగోపాల్‌కు వెంకటరెడ్డి (టీ జేఏసీ), పీఎల్ విశ్వేశ్వరరావు మద్దతుగా నిలుస్తూ... చైర్మన్ మాట్లాడే పద్ధతి, వ్యవహారశైలి బాగోలేదని, భారీగా పోలీసులను ఎందుకు మోహరించారని నిలదీశారు. దీనిపైనా చైర్మన్ తీవ్రంగా స్పందించారు. ‘ఆయన (వేణుగోపాల్) ఏది వాగితే అది వినాలా?..’ అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. కొన్ని శక్తులు రాకూడదనే పోలీసులున్నారని, వారు ఎట్లా వస్తారో ఎవరికి తెలుసని వ్యాఖ్యానించారు. -
విద్యుత్ ఉద్యోగులపై నియంత్రణ ఎత్తేయాలి
ఈఆర్సీని కోరిన టీజేఏసీ చైర్మన్ కోదండరాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ముందు విద్యుత్ ఉద్యోగులు హాజరుకాకుండా నియంత్రించాలని కోరుతూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు జారీ చేసిన అడ్వయిజరీని ఉపసంహరించుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఈఆర్సీకి విజ్ఞప్తి చేశారు. టీజేఏసీ ప్రతినిధి బృందంతో కలసి శుక్రవారం ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు వేదికగా పనిచేయాల్సిన ఈఆర్సీ వివాదాలకు వేదికగా మారకూడదన్నారు. విద్యుత్ ఉద్యోగులను నియంత్రించాలని గత నెల 9న ఈఆర్సీ జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా ట్రాన్స్‌కో యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసిందన్నారు. చట్టబద్ధమైన ఈఆర్సీ ముందు విద్యుత్ ఉద్యోగులు హాజరై తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు అందించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై విసృ్తత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. సర్వీసు రూల్స్ పేరుతో ఉద్యోగులను చర్చల్లో అనుమతించకపోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. వారిని ఉద్యోగులుగా కాకపోయినా వినియోగదారుల హోదాలోనైనా చర్చలో పాల్గొనేందుకు అనుమతించాలని కోరారు. లేదంటే బహిరంగ విచారణ హేతుబద్ధత కోల్పోతుందన్నారు. చైర్మన్‌ను కలసిన వారిలో తెలంగాణ విద్యుత్ జేఏసీ కన్వీనర్ కె.రఘు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ, టీజేఏసీ సీనియర్ నేత వెంకట్‌రెడ్డి ఉన్నారు. -
కార్డు రాస్తే చాలు.. కష్టాలు తీరుస్తాం
ఆంధ్రప్రదేశ్ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ గ్రంథి భవానీప్రసాద్ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖ వల్ల ఇబ్బంది ఎదురైతే విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి కార్డు ద్వారా ఫిర్యాదు చేసినా తక్షణమే స్పందిస్తామని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ గ్రంథి భవానీప్రసాద్ చెప్పారు. విద్యుత్ పంపిణీ సంస్థలు గడువులోగా ఏఆర్‌ఆర్‌లు సమర్పించకపోతే, కమిషనే సుమోటోగా తీసుకుని వినియోగదారులకు భారం కాని రీతిలో టారిఫ్‌లు ఖరారు చేయొచ్చని చెప్పారు. ఏపీఈఆర్సీ చైర్మన్‌గా గత అక్టోబర్‌లో బాధ్యతలు చేపట్టిన జస్టిస్ భవానీ ప్రసాద్ గతంలో విద్యుత్ సంస్కరణల రూపకల్పనలో కీలక భూమిక పోషించారు. ఈ 3 నెలల వ్యవధిలోనే విద్యుత్ సంస్థల పటిష్టతకు పలు నిర్ణయాలు తీసుకున్న జస్టిస్ భవానీప్రసాద్‌ను ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. క్షేత్రస్థాయి కమిటీలు: నాణ్యమైన విద్యుత్ సేవలందించేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరం కాబట్టి రాష్ట్రస్థాయి సలహా సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఇది ఇచ్చే సలహాలు, సూచనలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది. మీ మీటర్లు మీ ఇష్టం: పంపిణీ సంస్థలిచ్చే మీటర్లపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విద్యుత్ మీటర్లను వినియోగదారులే కొనుక్కునే వెసులుబాటు కల్పించాం. ప్రజలు తమ సమస్యలపై కార్డు రాసి కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. విశిష్ట అధికారాలు: విద్యుత్ నియంత్రణ మండలికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. అవతకవకలేమైనా కమిషన్ దృష్టికి వస్తే సుమోటోగా విచారణకు ఆదేశించవచ్చు. ఈఆర్సీ ఆదేశాలను అమలు చేయకపోతే ఒక్కో వివాదానికి రూ.లక్ష వరకు పెనాల్టీ వేసే అధికారం ఉంది. అప్పటికీ తప్పును సరిచేసుకోకుంటే రోజుకు రూ.6 వేల చొప్పున పెనాల్టీ వేయవచ్చు. చట్టసభలకు జవాబుదారి: ఈఆర్సీ ప్రభుత్వానికిచ్చే వార్షిక నివేదికను అసెంబ్లీ, శాసనమండలి ముందుంచుతారు. విద్యుత్ రంగంలో ప్రైవేటు ఉత్పత్తి, పంపిణీ సంస్థలను కమిషన్ నియంత్రించే వీలుంది. జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల పరిధిలో నిఘా వ్యవస్థలున్నా.. వీటన్నింటిపైనా దృష్టి పెట్టడం, నియంత్రించడం కమిషన్ బాధ్యత. పంపిణీ సంస్థలు నష్టపోకుండా, వినియోగదారులు కష్టపడకుండా మధ్యేమార్గంగా చార్జీలను రూపొందించడం ఈఆర్సీ లక్ష్యం. విద్యుత్ పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ, అవసర నివేదిక (ఏఆర్ఆర్)లు గడువులోగా సమర్పించాలి. తరువాత కమిషన్ మరోనెల గడువు ఇస్తుంది. అప్పటికీ నివేదికలివ్వకపోతే సుమోటోగా తీసుకుని అందుబాటులో ఉన్న సమాచారం మేరకే విద్యుత్ చార్జీలు నిర్ణయిస్తాం.