Power Holiday
-
Fact Check: రామోజీ రాతల్లోనే ‘కోతలు’.. బాబు పాలనలోనే ‘చీకట్లు’
సాక్షి, అమరావతి : ‘‘పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు పవర్ హాలిడే అమలు చేస్తున్నాం. వారంతపు సెలవుతో కలిపి వారంలో మూడు రోజులు పరిశ్రమలకు విద్యుత్ ఉండదు.’’ ‘‘గ్రామాల్లో ఎనిమిది గంటలు..పట్టణాల్లో ఆరు గంటలు..నగరాల్లో నాలుగు గంటలు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ విధిస్తున్నాం.’’‘‘వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ ఇవ్వడం కష్టం..నాలుగు గంటలు రెండు విడతల్లో ఇస్తాం..క్రాప్ హాలిడే తీసుకుంటే ఇంకా మంచిది.’’ ...ఇదీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి..బాబు హయాంలో రాష్ట్రాన్ని చీకటి మయం చేశారు. రైతులు అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక పొలాల్లోనే పడిగాపులు కాసేవారు. ఆ సమయంలో పాముల బారినపడి ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు. గ్రామాల్లో పగలూ రాత్రీ గంటల తరబడి కోతలు విధించేవారు. కొన్ని సీజన్ల పంటలకు విద్యుత్ సరఫరా లేక రైతులు క్రాప్ హాలిడే పేరుతో పంటలు వేయకుండా చేలను బీడు భూములుగా వదిలేసేలా అప్పటి పాలకులు ప్రోత్సహించారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల నుంచి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసింది. రైతులకు ఉచితంగా పగటి పూటే 9 గంటల విద్యుత్‌ను అందిస్తోంది. భారీ విద్యుత్ డిమాండ్, తీవ్ర విద్యుత్ కొరత ఉండే వేసవిలోనూ ఎలాంటి కోతలు లేకుండా, లోడ్ రిలీఫ్ అవసరం రాకుండా, క్రాప్ హాలిడే విధించకుండా, పవర్ హాలిడే పెట్టకుండా అన్ని వర్గాల ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందిస్తోంది. కానీ దీనిని చూసి బాబు తోక పత్రికైన ఈనాడు కుళ్లుకుంటోంది. ఇలాంటి పాలనకు ప్రజలు ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టనున్నారని గ్రహించి, తప్పుడు రాతలతో జనాన్ని నమ్మించాలని చూస్తోంది. అందులో భాగంగానే ‘కంటి మీద కునుకు లేకుండా చేస్తారా జగన్?’ అంటూ ఈనాడు మంగళవారం ఓ అబద్దాన్ని అచ్చేసింది. రామోజీ రాస్తున్న రాతల్లో అన్నీ కోతలేనని, వాస్తవాలను పరిశీలిస్తే ఎవరికైనా అర్ధమవుతుంది. ♦ శ్రీకాకుళం జిల్లా గార మండలం జల్లువలస, జఫ్రా బాద్, రాఘవాపురం, వాదాడ, తోనంగి శాలి హుండం గ్రామాల పరిధిలో సోమవారం ఉదయం 05:34 నుండి సాయంత్రం 04:15 గంటల వరకు కరెంటు లేదు అన్నది వాస్తవం కాదు. ఎందుకంటే ఆ రోజు బలమైన ఈదురు గాలులు వచ్చిన కారణంగా కళింగపట్నం, చల్లపేట, అతులుగు సబ్ స్టేషన్ పరిధిలోని 11కేవీ ఫీడర్స్పై చెట్టు కొమ్మలు పడి ట్రిప్ అయి కొంత విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ♦ రాజమహేంద్రవరం జిల్లా గండేపల్లి మండలం, కె. సూరపాలెం గ్రామీణ ఇండస్ట్రియల్ ఫీడర్ పరిధిలో సోమవారం ఉదయం 07:15 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచింది. రాజమహేంద్రవరం తాడితోట సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 8.55 నుంచి సాయంత్రం 04:15 గంటల వరకు సరఫరా నిలిచింది అన్నది కూడా వాస్తవం కాదు. ఈదురు గాలుల వల్ల 33/11 కేవీ గండేపల్లి సబ్ స్టేషన్లో 11కేవీ సూరంపాలెం ఇండస్ట్రియల్ పరిధిలో చెట్లు కొమ్మలు, వెదురు చెట్లు లైన్ మీద పడి బ్రేక్ డౌన్ అయ్యింది. కొమ్మలు, చెట్లు తొలగించి మధ్యాహ్నం 1 గంటకు సరఫరా పునరుద్ధరించారు. అలాగే 33/11కేవీ తాడితోట సబ్ స్టేషన్ పరిధిలోగల 11కేవీ ఇన్నిస్ పేట ఫీడర్ పైన నక్కలగూడెం వద్ద గల వీటి కాలేజ్ దగ్గర చెట్టు కొమ్మలు పడటంతో సరఫరాలో అంతరాయం కలిగింది. తెగిన విద్యుత్ లైన్ పున రుద్ధరించి 09:59 గంటలకు సరఫరా ఇచ్చారు. ♦పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, అలవద్ద, కురుపాం, మండలం భర్తంగి గ్రామాల పరిధిలో ఉదయం 09:24 గంటలకు 33/11కేవీ గుమ్మలక్ష్మీపురంలోని 11కేవీ గుమ్మలక్ష్మీపురం–ఆర్కే బాయ్ ఫీడర్ పరిధిలో అల్లవరం గ్రామం వద్ద చెట్లు కొమ్మలు లైను మీద పడి విద్యుత్ అంతరాయం కలిగింది. వాటిని తొలగించి 09:48 గంటలకు సరఫరా యధావిధిగా కొనసాగించారు. ♦ కడపలోని 220 కెవి సబ్‌స్టేషన్‌లో బ్యాటరీల మరమ్మతుకు గురై సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యుత్తు సరఫరా పునరుద్ధరించారు. ♦ కర్నూలు సర్కిల్ పరిధిలోని గుండ్లకొండ సబ్‌స్టేషన్, అనంతపురం సర్కిల్ పరిధిలోని రాయదుర్గం, తిరుపతి సర్కిల్ పరిధిలోని పూతలపట్టు సబ్ స్టేషన్లలో బ్రేక్‌డౌన్ కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ ఆయా సబ్స్టేషన్ల పరిధిలో లైటింగ్ సప్లైలో మాత్రం ఎటువంటి అంతరాయం లేదు. -
పరిశ్రమలకు వారానికి ఒకరోజు పవర్ హాలిడే
సాక్షి, అమరావతి: గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు పరిశ్రమలకు పవర్ హాలిడే అమలుకు అనుమతించాలని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన విజ్ఞప్తికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అంగీకారం తెలిపింది. రేపటి (ఈ నెల 5వ తేదీ) నుంచి 15వ తేదీ వరకు షరతులతో కూడిన పవర్ హాలిడేకి అనుమతిస్తూ ఆదివారం ఆదేశాలు జారీచేసింది. ఏపీఈఆర్సీ ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఐ.పృథీ్వతేజ్, జె.పద్మాజనార్ధనరెడ్డి, కె.సంతోషరావు తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. గృహ, పారిశ్రామిక రంగాలతోపాటు వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్తు పంపిణీ సంస్థలు, ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఏర్పడిన విద్యుత్ కొరత కొంత ఇబ్బందికరంగా ఉంటోంది. రాష్ట్రంలో రోజువారీ అవసరాలకు ప్రస్తుతం 230 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. థర్మల్, హైడల్, గ్యాస్, పవన, సోలార్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 190 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇంకా 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. తక్కువ వర్షపాతం కారణంగా వ్యవసాయానికి బోర్లపై ఆధారపడిన వారికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలను సమర్పించాయి. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, డిమాండ్ స్థితి, ఎక్సే్ఛంజీల నుంచి విద్యుత్ కొనుగోళ్ల పరిమాణం, వాటి ప్రస్తుత ధరలను పరిశీలించిన కమిషన్.. రాష్ట్రంలోని పరిశ్రమల విద్యుత్ వినియోగంపై కొన్ని నియంత్రణ చర్యలను చేపట్టేందుకు అనుమతించింది. ఇందులో భాగంగా డిస్కంల పరిధిలోని పరిశ్రమలకు వారానికి ఒకరోజు పవర్ హాలిడే అమలు చేయనున్నారు. విధిలేని పరిస్థితుల్లో మాత్రమే పవర్ హాలిడే అమలు చేస్తున్నామని, విద్యుత్ లభ్యత మెరుగైతే పవర్ హాలిడే ఎత్తివేస్తామని సీఎండీలు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై వినియోగదారులు టోల్ ఫ్రీ నంబరు 1912కు ఫోన్‌చేసి తెలియజేయవచ్చని వారు సూచించారు. ఇవీ నిబంధనలు ♦ పరిశ్రమలు ప్రస్తుతం అమలు చేస్తున్న వారానికోరోజు వారాంతపు సెలవులకు అదనంగా ఒకరోజు పవర్ హాలిడే అమలు చేయాలి. ♦ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు ఒక షిఫ్ట్ మాత్రమే పనిచేయాలి. ♦ సాయంత్రం 6 గంటల తరువాత విద్యుత్ వినియోగానికి అనుమతించేది లేదు. ♦ పరిశ్రమలు రోజువారీ విద్యుత్ వినియోగంలో 70 శాతం వినియోగించుకునే విధంగా ఆయా పరిశ్రమలు అవసరమైన చర్యలు చేపట్టాలి. ♦ ఈ పవర్ హాలిడేని జిల్లాల వారీగా రెగ్యులేట్ చేస్తారు. ♦ ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రెండు వారాలు పవర్ హాలిడే అమల్లో ఉంటుంది. ♦ నియంత్రణ చర్యలు పాటించని పరిశ్రమలపై కమిషన్ నిర్దేశించిన జరిమానా చార్జీలు విధిస్తారు. ♦ ఈ నియంత్రణ చర్యల నుంచి బల్క్‌డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, వైద్య ఆక్సిజన్ ప్లాంట్లు, రైస్ మిల్లింగ్ యూనిట్లకు సంబంధించిన పరిశ్రమలకు మినహాయింపు ఉంది. ♦ రోజూ విద్యుత్ సరఫరా తీరును సమీక్షించి వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా కోసం అధికారులు తగిన నిర్ణయం తీసుకుంటారు. -
ఏపీలో నిరంతరాయంగా విద్యుత్ పంపిణీ
-
ఏపీలో ఇక నిరంతరాయ విద్యుత్ సరఫరా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కానుంది. మరోవైపు పరిశ్రమలకు విద్యుత్ కోతల వేళలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మే 9 నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే ఉపసంహరణ కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఈ నెల 16వ తేదీ నుంచి పరిశ్రమలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా ఇస్తున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు కొరత వలన కొద్దిరోజుల పాటు పరిశ్రమలకు విద్యుత్ పంపిణీ లో సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడటంతో అన్ని రంగాల వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. -
పరిశ్రమలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం కారణంగా ఏర్పడిన విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమలకు ఏప్రిల్ 8వ తేదీనుంచి విధించిన పవర్ హాలిడేను ఎత్తివేసినట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. అమరావతి సచివాలయంలో మంగళవారం ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్‌తో కలిసి మంత్రి విలేకరులతో మాట్లాడారు. చదవండి: మత్స్యకార భరోసా 13వ తేదీకి వాయిదా పరిశ్రమలపై విద్యుత్ ఆంక్షలను మరోసారి సడలిస్తూ వారంలో అన్ని రోజుల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేసిందని మంత్రి చెప్పారు. నిరంతరం విద్యుత్ వినియోగించే పరిశ్రమలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజు వారీ డిమాండ్‌లో 70 శాతం విద్యుత్‌ను వినియోగించు కోవడానికి అనుమతించిందన్నారు. మిగతా సమయంలో 50 శాతం వినియోగించు కోవచ్చన్నారు. ఈ నిబంధనలు మంగళవారం నుంచే అమలులోకి వస్తాయని మంత్రి స్పష్టం చేశారు. పగటిపూట పరిశ్రమలకు ఒక షిఫ్టుకే.. పగటిపూట పనిచేసే పరిశ్రమలకు వారంలో ఒక రోజు ఉన్న పవర్‌హాలిడేను తొలగించిందని, అయితే రోజుకి ఒక షిఫ్టు మాత్రమే నడపాలని, సాయంత్రం 6 గంటల తరువాత అనుమతిలేదని ఏపీఈఆర్సీ స్పష్టం చేసిందని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. మిగతా రాష్ట్రాల్లో ఇలా లేదు.. మన రాష్ట్రంలో కంటే దేశంలోని చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలను పెద్ద ఎత్తున విధించడం వల్ల పరిశ్రమలను మూసేసుకున్నారని, అటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో తలెత్తలేదన్నారు. విద్యుత్ సరఫరాలో నష్టాన్ని, చౌర్యాన్ని నియంత్రించేందుకు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను బిగించే పైలట్ ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించామని మంత్రి తెలిపారు. వ్యవసాయ బోర్లకు స్మార్ట్ మీటర్ల వల్ల ఎవరికీ నష్టం లేదని మీటర్లు పెట్టేది, సబ్సిడీ ఇచ్చేదీ కూడా ప్రభుత్వమే అయినప్పటికీ ఏదో జరిగిపోయినట్లు ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. వారెవరితో పొత్తుపెట్టుకుంటే ఏంటి.. గెలవలేనని తెలిసి చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడుతున్నారని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనల్లో పొంతన ఉండటంతో ఇద్దరూ పొత్తు పెట్టుకుంటున్న విషయాన్ని బహిరంగంగా చెప్పాలని తాము అడిగామన్నారు. కాలుష్య కారక సంస్థలపై కఠిన చర్యలు రాష్ట్రంలో కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, ఇంధన, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పర్యావరణం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ.. నిరంతర పర్యవేక్షణ చేయాలని కోరారు. నారాయణ అరెస్టులో కక్ష ఏముంది? టీడీపీ మాజీమంత్రి నారాయణ అరెస్టు కక్ష పూరితంగా చేసిందేమీ కాదని మంత్రి పెద్ది రెడి స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. పేపర్ మాల్‌ప్రాక్టీస్ విషయంలో దాదాపు 60 మందిని అరెస్ట్ చేశారన్నారు. ఇదంతా నారాయణ కాలేజీల్లోనే జరిగిందని తేలిందని, అందువల్లనే నారాయణను అరెస్టు చేసుంటారని, దీనిలో తప్పేముందని మంత్రి ప్రశ్నించారు. -
పరిశ్రమలకు వారానికో రోజు పవర్ హాలిడే
సాక్షి, తిరుపతి రూరల్: ఎస్పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో పరిశ్రమలకు వారానికి ఒక రోజు పవర్ హాలిడే అమలు చేయనున్నట్లు ఆ సంస్థ సీఎండీ హరనాథ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో పుత్తూరు డివిజన్‌ను మినహాయించి, మిగతా అన్ని డివిజన్లలో శుక్రవారం పవర్ హాలిడే అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో గృహ వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం పరిశ్రమలకు వారానికోరోజు వారాంతపు సెలవులను అమలు చేస్తున్నాయని, దీనికి అదనంగా ఒకరోజు పవర్ హాలిడేను అమలు చేయాలని పారిశ్రామిక వినియోగదారులకు సూచించారు. ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు రెండు వారాలపాటు పవర్ హాలిడే అమలులో ఉంటుందన్నారు. ప్రస్తుతం కోవిడ్–19 పరిస్థితుల నుంచి బయటపడుతున్న నేపథ్యంలో పరిశ్రమలు, వాణిజ్య విద్యుత్ వినియోగం అధికమైందన్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన స్థాయిలో బొగ్గు లభ్యత లేకపోవడం, పవర్ ఎక్స్చేంజ్లలో డిస్కమ్‌లకు 14వేల మెగావాట్ల విద్యుత్తు అవసరం కాగా కేవలం 2వేల మెగా వాట్ల విద్యుత్ మాత్రమే ఉన్నందున సమస్యకు కారణమవుతోందన్నారు. విద్యుత్ కోతల నివారణకు చర్యలు చేపడుతున్నామని.. విద్యుత్ సరఫరా తీరును ప్రతిరోజూ సమీక్షించి, మెరుగై నసరఫరాకు తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. చదవండి: (Nandyal District: నెరవేరబోతోన్న రేనాటి ప్రాంత వాసుల కల) -
పవర్ హాలిడే ఉంటే ఎవరొస్తారు?
మండలిలో ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ విద్యుత్ రాయితీలపై స్పష్టత ఉండాలి: షబ్బీర్ పారిశ్రామికవాడల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకూ కోటా: మంత్రి కేటీఆర్ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం బిల్లుకు మండలి ఆమోదం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమలకు పవర్ హాలిడే కొనసాగితే భవిష్యత్‌లో ప్రభుత్వం సప్తరంగుల కార్పెట్ పరిచినా పారిశ్రామికవేత్తలెవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు. నూతన పారిశ్రామిక విధానం బిల్లుపై శుక్రవారం మండలిలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీ రేయాన్స్తోపాటు పలు మూతపడిన పరిశ్రమలను తెరిపించే విధానాలకు కూడా కొత్త బిల్లులో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలకు కేటాయించే భూమిలో బీసీలు, మైనార్టీలు, స్థానికులకు వెయిటేజీ ఇచ్చి ప్లాట్లు, భూములు కేటాయించాలని కోరారు. విద్యుత్ రాయితీలు ఇచ్చే విషయమై బిల్లులో స్పష్టత ఉండాలని సూచించారు. పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. నూతన పారిశ్రామిక విధానంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయాలన్నారు. టీడీపీ సభ్యుడు నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ అనుమతులు, పర్యావరణ, అటవీ అనుమతుల మంజూరుపై బిల్లులో స్పష్టత ఉండాలన్నారు. మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ.. పారిశ్రామిక వేత్తలకు కేటాయించే భూమిని ఈక్విటీ రూపంలో పరిగణించాలన్న సలహాను బిల్లులో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. పారిశ్రామిక వాడల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విధిగా కోటా ఉంటుందన్నారు. స్థానికులకు కూడా కోటా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అనంతరం మండలి మూజువాణి ఓటుతో పారిశ్రామిక విధానం బిల్లుకు ఆమోదం తెలిపింది. -
తగ్గిన విద్యుత్ డిమాండ్
విస్తారంగా కురుస్తున్న వర్షాలే కారణం సాగర్‌లో తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత అవసరమైతే మళ్లీ ఉత్పత్తి ప్రారంభిస్తామన్న అధికారులు శ్రీశైలంలో కొంతసేపు నిలిపివేసి.. తిరిగి ప్రారంభం రిజర్వాయర్‌లోకి స్వల్పంగా చేరుతున్న వరద విద్యుత్ కోతలను ఎత్తివేయాలని ప్రభుత్వ నిర్ణయం పరిశ్రమలకు పవర్ హాలిడేను ఒకరోజుకు కుదించే యోచన హైదరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, తగ్గిపోయిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో... తెలంగాణలో విద్యుత్ డిమాండ్ తగ్గింది. కొద్దిరోజులుగా దాదాపు 150 మిలియన్ల దాకా చేరిన విద్యుత్ డిమాండ్.. ఏకంగా ఆదివారం 40 మిలియన్ యూనిట్ల మేర తగ్గి, 110 నుంచి 115 మిలియన్ యూనిట్లకు చేరినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తున్న విద్యుత్ కోతలను ప్రభుత్వం ఆదివారం నుంచి ఎత్తివేసింది. గత వారం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ దాదాపు 150 నుంచి 160 మిలియన్ యూనిట్లకు చేరింది. ఎక్ఛేంజీ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసినా.. రోజూ 10 నుంచి 20 మిలియన్ యూనిట్ల కొరత ఎదురైంది. కానీ తాజాగా డిమాండ్ తగ్గడంతో.. తాత్కాలికంగా నాగార్జునసాగర్‌లో జల విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం నిలిపివేసినట్లు జెన్కో వర్గాలు తెలిపాయి. శ్రీశైలం ప్రాజెక్టులో మాత్రం ఆదివారం పగలంతా ఉత్పత్తి నిలిపివేసిన అధికారులు... తిరిగి సాయంత్రం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. రెండు జనరేటర్ల నుంచి 290 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా... 14,832 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2.098 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఇందుకు 0.7 టీఎంసీల నీటిని వాడారు. అయితే వర్షాల నేపథ్యంలో ఆదివారం రోజా గేజింగ్ పాయింట్ నుంచి 8,800 క్యూసెక్కుల స్వల్ప వరదనీటి ప్రవాహం విడుదలైంది. ఈ జలాలు సోమవారం సాయంత్రానికి శ్రీశైలం డ్యామ్‌కు చేరుతాయి. దీంతోపాటు కర్నూలు జిల్లాలోనూ వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి స్వల్పంగా నీరు చేరుతోంది. ఆదివారం పగలంతా విద్యుత్ ఉత్పత్తి చేయకపోవడం, వర్షాలతో నీరు చేరుతుండటంతో సాయంత్రానికి నీటి మట్టం అతి స్వల్పంగా పెరిగింది. ఆదివారం ఉదయానికి 856.4 అడుగుల నీటిమట్టం ఉండగా.. సాయంత్రానికి 856.5 అడుగులుగా నమోదయింది. కోతలు ఎత్తివేత.. ఖరీఫ్ పంట కాలం ముగిసే సీజన్ కావడంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఊరట కలిగించాయి. దీంతో వీలైనంత మేరకు కోతలను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా పరిస్థితిపై సమీక్షించేందుకు ఆదివారం సీఎం కేసీఆర్‌తో టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో చైర్మన్, ఎండీ ప్రభాకర్‌రావు సమావేశమయ్యారు. ఇప్పుడున్న డిమాండ్, సరఫరాపై చర్చించారు. రాష్ట్రంలోని పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు కొనసాగుతున్న పవర్ హాలిడేను.. ఒక రోజుకు కుదించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పరిస్థితి మెరుగైతే ఆ ఒక్క రోజు పవర్ హాలిడేను కూడా ఎత్తేయాలని నిర్ణయించారు. కాగా.. శనివారం శ్రీశైలం నుంచి 3.11 మిలియన్ యూనిట్లు, నాగార్జునసాగర్ నుంచి 6.83 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు జెన్కో వెల్లడించింది. డిమాండ్ తగ్గిన కారణంగా ఆ రెండు ప్లాంట్లతో ఆదివారం ఉదయం నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపేశామని అధికారులు చెప్పారు. అవసరాన్ని బట్టి మళ్లీ ఉత్పత్తి చేస్తామని తెలిపారు. -
కోతలతో పరిశ్రమలు విలవిల
ఏరోజు ఎక్కడంటే.. బుధ, గురువారాల్లో : బొంతపల్లి, గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలు సోమ, మంగళవారాల్లో: బొల్లారం పారిశ్రామిక వాడ జిన్నారం : వారానికి ఒక రోజు పరిశ్రమలకు పవర్ హాలీడే ఇస్తామని నెలరోజుల క్రితం ప్రకటించిన సర్కార్, తాజాగా పరిశ్రమలకు రెండు రోజులు విద్యుత్ సరఫరా ఉండదని తేల్చిచెప్పింది. ఇందుకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో బుధవారం నుంచే పరిశ్రమలకు పవర్‌ను కట్ చేశారు. వారంలో రెండు రోజుల విద్యుత్ సరఫరా నిలిపివేతతో పరిశ్రమల యాజమాన్యాలు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నాయి. జిన్నారం మండలంలోని బొల్లారం, బొంతపల్లి, ఖాజీపల్లి, గడ్డపోతారం పారిశ్రామిక వాడల్లో చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు నాలుగు వందలకు పైగా ఉన్నాయి. వీటిల్లో 50 శాతం వరకు రసాయన పరిశ్రమలు ఉన్నాయి. రసాయన పరిశ్రమలను నడిపేందుకు విద్యుత్ తప్ప మరో మార్గం లేదు. ఈ నేపథ్యంలో వారంలో రెండురోజుల పాటు కరెంటు సరఫరా నిలిచిపోతే పరిశ్రమలను మూసివేయడమే మేలని కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. అయితే ప్రత్యామ్నాయం..లేకపోతే మూత సర్కార్ ఆదేశాల మేరకు బొంతపల్లి, గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడల్లో ప్రతి బుధ, గురువారాల్లో, బొల్లారం పారిశ్రామిక వాడలో ప్రతి సోమ, మంగళవారాల్లో విద్యుత్ హాలీడే ఉంటుంది. ఈ మేరకు బుధవారం నుంచే అధికారులు పవర్ హాలిడే అమలు చేస్తున్నారు. గత ఏడాది కాలంగా సరిపడా విద్యుత్ లేకపోవటంతో పరిశ్రమలను నడటమే భారంగా మారిందని, ఈ సమయంలో వారంలో రెండు రోజులు విద్యుత్ సరఫరా లేకపోతే ఎలా అంటూ పరిశ్రమల యజమానులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని బహుళజాతి పరిశ్రమలు మాత్రం ప్రైవేటుగా విద్యుత్‌ను కొనుగోలు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇంకొన్ని చిన్న చిన్న పరిశ్రమల యాజమాన్యాలు విద్యుత్ సమస్యను అధిగమించేందుకు జనరేటర్లు ఉపయోగించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. కానీ జనరేటర్ల వి నియోగం వల్ల వ్యయభారంతో పాటు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని యాజ మాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మూతపడుతున్న పరిశ్రమలు రెండు రోజుల పవర్ హాలిడేతో పరిశ్రమలను నడపటం భారంగా మారటంతో యాజమాన్యాలు పరిశ్రమలను మూసివేస్తున్నాయి. బొల్లారంలో 250 పరిశ్రమలు ఉండగా, విద్యుత్ సంక్షోభంతో గత రెండేళ్లు కాలంలో సుమారు 50 వరకు పరిశ్రమలు మూతపడ్డాయి. గడ్డపోతారం, ఖాజీపల్లి, బొంతపల్లి పారిశ్రామికవాడల్లో సుమారు 20 పరిశ్రమలు మూతపడ్డాయి. వీధిన పడనున్న కార్మికుల కుటుంబాలు మండలంలోని వివిధ పరిశ్రమల్లో 30 వేల వరకు కార్మికులు వివిధ రంగాల్లో విధులను నిర్వహిస్తుంటారు. వీరిలో కాంట్రాక్టు కార్మికులు పదిహేనువేలకుపైగా ఉంటారు. పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు పవర్ హాలీడే ఇస్తుండటంతో పరిశ్రమలు మూతపడి పడే ప్రమాదం ఉంది. ఒకవేళ పరిశ్రమలు నడిచినా నెలలో 8 రోజుల పాటు కార్మికులకు హాలీడే ఇవ్వనున్నడంతో వేతనాలు సరిపోక కుటంబ పోషణ భారంగా మారనుంది. -
పరిశ్రమలపై మరో పిడుగు!
నేటి నుంచి వారానికి రెండు రోజులు పవర్ హాలీడే సిటీబ్యూరో: అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పారిశ్రామిక రంగంపై తాజాగా మరో పిడుగు పడింది. ప్రస్తుతం వారానికి ఒక్క రోజు పవర్ హాలీడే ఉండగా.. దాన్ని రెండు రోజులకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కోతలు బుధవారం నుంచి అమలులోకి వస్తాయని దక్షిణ తెలంగాణ విద్యుత్ కంపెనీ ప్రకటించింది. రంగారెడ్డి నార్త్, రంగారెడ్డి ఈస్ట్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ నార్త్ సర్కిళ్ల పరిధిలో ఆది, సోమవారాల్లో పవర్ హాలీడే ఉండగా.. రంగారెడ్డి సౌత్‌లో శుక్ర, శనివారాల్లో ఈ కోతలు అమలులో ఉంటాయి. గృహాలకు నిత్యం ఉదయం 2, మధ్యాహ్నం 2 గంటల చొప్పున విద్యుత్ కోతలు యధావిధిగా కొనసాగుతాయి. విద్యుత్ సరఫరా, డిమాండ్‌కు మధ్య పెరిగిన వ్యత్యాసం వల్లే కోతల వేళలు పెంచాల్సి వచ్చిందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. తాజా విద్యుత్ కోతలపై పారిశ్రమిక వర్గాలు, గృహ వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. కోతల పెంపుతో పరిశ్రమల్లో ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడనుంది. -
టెక్స్టైల్ పార్క్‌కు కరెంట్ షాక్
వారంలో రెండు రోజులు పవర్ హాలీడే రోజుకు 1.51 లక్షల మీటర్ల వస్త్రోత్పత్తికి బ్రేక్ వ్యాపారులకు నష్టం.. కార్మికులకు కష్టం సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల శివారులోని టెక్స్టైల్ పార్క్‌కు కరెంట్ షాక్ తగిలింది. సర్కారు వారానికి రెండు రోజులు పవర్ హాలీడే ప్రకటించింది. దీంతో శని, ఆదివారాల్లో రెండు రోజులు కరెంటు సరఫరాను నిలిపివేశారు. ఫలితంగా టెక్స్టైల్ పార్క్‌లో వస్త్రోత్పత్తి నిలిపోవడంతో పాటు నేత కార్మికులకు ఉపాధి కరువవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ లోటు ఏర్పడడంతో ఆ ప్రభావం సిరిసిల్ల నేతన్నలపైనా పడింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి వైఎస్సార్ సర్కారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు విద్యుత్ కోతల నుంచి మినహాయింపునిచ్చింది. వస్త్రపరిశ్రమకు 24 గంటల పాటు కరెంటు సరఫరా చేసేందుకు ప్రత్యేక జీవో జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కొరత వల్ల సర్కారు పవర్ హాలిడే ప్రకటించింది. దీనికితోడు సిరిసిల్ల పట్టణంలోని పవర్లూమ్ పరిశ్రమకు రోజుకు మూడు గంటలు విద్యుత్ కోత ఉంది. అనధికారికంగా మరో రెండు గంటలు కరెంటు సరఫరా నిలిచిపోతోంది. వస్త్రోత్పత్తికి విఘాతం టెక్స్టైల్ పార్క్‌లో 130 పరిశ్రమలు పనిచేస్తుండగా, 1,515 పవర్‌లూమ్స్ నడుస్తున్నాయి. ఆధునిక మగ్గాలపై సూటింగ్, షర్టింగ్ ఉత్పత్తి చేస్తున్నారు. ఒక్కో మగ్గంపై రోజుకు వంద మీటర్ల వస్త్రం తయారవుతుంది. పవర్ హాలిడేతో రోజుకు 1.51 లక్షల మీటర్ల వస్త్రోత్పత్తికి విఘాతం కలుగుతోంది. రెండు రోజుల పాటు పవర్ హాలిడే ప్రకటించడంతో మూడు లక్షల మీటర్ల గుడ్డ ఉత్పత్తి నిలిచిపోతోంది. పారిశ్రామికవేత్తలకు రూ. 51.50 లక్షల నష్టం వస్తోంది. కార్మికులకు సైతం కూలీలో రూ. 800 కోత పడుతోంది. దీంతో రెండువేల మంది కార్మికులు రూ.32 లక్షల మేర కూలీ కోల్పోతున్నారు. ఆటుపోట్ల మధ్య సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. ఇప్పటికే పూర్తిస్థాయిలో పరిశ్రమలు రాక అరకొర వసతులతో నెట్టుకొస్తున్న పార్క్‌ను కరెంటు కష్టాలు దెబ్బతీస్తున్నాయి. 2002లో టెక్స్టైల్ పార్క్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేశాయి. 220 పరిశ్రమలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్దేశించగా, ప్రస్తుతం 130 పరిశ్రమలు పనులు ప్రారంభించాయి. రెండువేల మంది కార్మికులు, రెండు షిఫ్టుల్లో పార్క్‌లో పనిచేస్తున్నారు. మరో ముప్పై పరిశ్రమలు నిర్మాణంలో ఉన్నాయి. టెక్స్టైల్ పార్క్‌లో రూ.150 కోట్ల పెట్టుబడులు పెట్టారు. పార్క్‌లో ఆధునిక రాపియర్ లూమ్స్‌పై వస్త్రోత్పత్తి చేస్తున్నారు. కార్మికులకు సగటున రోజుకు రూ.400 చొప్పున కూలి లభిస్తోంది. రెండు రోజులు హాలిడే.. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్‌కు పవర్‌హాలిడే అమలవుతోంది. ఈ మేరకు ఎన్పీడీసీఎల్ అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. విద్యుత్ లోటును అధిగమించేందుకే రెండు రోజులు పవర్ హాలిడే విధిస్తున్నారు. వీక్లీ హాఫ్‌గా ఒకరోజు, పవర్ హాలిడేగా మరో రోజు కోత తప్పదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇది అమలవుతోంది. - రామకృష్ణ, సెస్ ఎండీ మినహాయింపు ఇవ్వాలి టెక్స్టైల్ పార్క్‌కు పవర్ హాలిడే నుంచి మినహాయింపు ఇవ్వాలి. మౌలిక వసతులు లేక ఇప్పటికే పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమలు పూర్తిగా రాలేదు. ఉన్న వాటికి కరెంటు ఇవ్వకుంటే పరిశ్రమ సంక్షోభంలో పడుతుంది. ఇప్పటికే పార్క్‌లోని పరిశ్రమలకు విద్యుత్ రాయితీ రావడం లేదు. ఇలాగైతే పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు. - అన్నల్దాస్ అనిల్, పారిశ్రామికవేత్త -
చీకట్లు
జిల్లాలో అప్రకటిత కరెంట్‌కోత అన్నివర్గాల ప్రజలకు గుదిబండగా మారింది. చీకటిపడితే చాలు పట్టణాల్లో అంధకారం అలుముకుంటోంది. ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో నీటిఎద్దడి తీవ్రరూపం దాల్చింది. చిరువ్యాపారులు, పారిశ్రామికవర్గాల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు వరుణుడు కరుణించకపోవడం.. విద్యుత్ కోతలు మొదలు కావడంతో ఖరీఫ్ వరిసాగు ముందుకు సాగడం లేదు. రైతన్న రోడ్డెక్కి గగ్గోలుపెడుతున్నా.. గోడు వినేవారు లేరు. - జిల్లాలో ఎడాపెడా విద్యుత్‌కోతలు - అవసరం 15 మి.యూ.. - సరఫరా 10 మి.యూ - సంకటస్థితిలో రైతన్నల ఖరీఫ్ సాగు - ఇబ్బందుల్లో వ్యాపారులు, పరిశ్రమలు సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లాలో విద్యుత్ వాడకం పెరగడం.. సరఫరా తగ్గిపోవడంతో కోతలు మరింత ఉధృతమవుతున్నాయి. పట్టణాలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 12 గం టల కోతలు అమలవుతున్నాయి. తద్వారా తాగునీటికి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణవాసులు దోమలతో కుస్తీపడుతూ కునుకులేకుండా గడుపుతున్నారు. వ్యవసాయరంగానికి ఆరుగంటల విద్యుత్ అందిస్తున్నామని అధికారు లు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు పూర్తిభిన్నంగా ఉంది. కనీసం మూడుగంటలు కూడా కరెంట్ సరఫరా కావడం లేదు. అధికారులు రెండు గ్రూపులుగా కరెంట్‌ను సరఫరా చేస్తున్నారు. గ్రూప్-‘ఏ’ ప్రకారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 దాకా తిరిగి రాత్రి 10.00 నుంచి తెల్లవారుజామున 1.00 వ రకు, గ్రూప్-‘బీ’ ప్రకారం మధ్యాహ్నం 1.00 నుంచి సాయంత్రం 4.00 దాకా, మళ్లీ తెల్లవారుజామున 1.00 నుంచి 4.00 వరకు సరఫరా చేయాలని చార్ట్ తయారుచేశారు. ఇదిలాఉండగా, సంబంధిత సమయాల్లో జిల్లాకు కరెంట్ సరఫరా ఉంటేనే రైతులకు అందుతోంది.. లేదంటే అంతే సంగతులు. కోతలు.. వాతలు కరెంట్ సరఫరా లేకపోవడం వల్లే కోతలు విధించాల్సి వస్తోందని విద్యుత్ అధికారులు తేల్చేస్తున్నారు. జిల్లా అవసరాలకు 15 మిలియన్ యూనిట్లు అవసరం కాగా, ప్రస్తుతం 10.5 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోంది. డిమాండ్, సరఫరాకు అంతరాయం ఉండటంతో కోతలే అనివార్యమని చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉదయం 7.30 నుంచి 10.00 గంటల వరకు విద్యుత్‌ను నిలిపేస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు కోత విధిస్తున్నారు. అలాగే మునిసిపాలిటీల్లో ఉదయం 6.00 నుంచి 10.00 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4.00 వరకు పవర్‌కట్ ఉంటుంది. మండలకేంద్రాల్లో ఉదయం 8.00 నుంచి 12.00 గంటల వరకు. తిరిగి మధ్యాహ్నం 2.00నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు విద్యుత్‌కోత విధిస్తున్నారు. పరిశ్రమలకు వారంలో ఒకరోజు మొత్తం పవర్‌హాలిడే ప్రకటించారు. అదే అదనుగా భావించిన విద్యుత్‌శాఖ అధికారులు లోటును పూడ్చుకోవడానికి ఉచిత క రెంట్‌కు కోత విధిస్తున్నారు. తద్వారా వ్యవసాయానికి రెండుగంటలు కూడా సక్రమంగా అందకపోవడంతో నారుమళ్లు ఎండిపోతున్నాయి. కోతల కారణంగా చిరువ్యాపారులు, చిన్న పరిశ్రమలు కుదేలవుతున్నాయి. అడ్డూఅదుపులేని కోతల కారణంగా చేతినిండా పనిలేక కార్మికులు అల్లాడుతున్నారు. దీంతో వెల్డింగ్, జిరాక్స్ మిషన్లు, రిపేరింగ్ షాపులు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. కరెంట్ లేక వచ్చినా ఆర్డర్లను సమయానికి ఇవ్వలేకపోతున్నామని చిన్న పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నా రు. జనరేటర్లు పెట్టి నడిపిస్తే లాభం రాకపోగా.. తీవ్రం గా నష్టపోవాల్సి వస్తోందని దిగులుచెందుతున్నారు. -
కోతప...వాత
ప్రమాణ స్వీకారం చేయకముందే బాబు పాలన సెగ తగులుతోంది. జిల్లాలో కరెంటు దెబ్బ పరిశ్రమల యజమానులకు షాక్ ఇస్తోంది. పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. పైగా మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు... పీక్ అవర్స్‌లో విద్యుత్ వినియోగిస్తే భారీ జరిమానా లంటూ భయపెడుతున్నారు. ప్రభుత్వ విధానం పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వందల కోట్ల విలువైన ఉత్పత్తికి విఘాతం కలుగుతోంది. రాష్ట్రంలో మళ్లీ చీకటి పాలనకు ఇది ఆరంభ సూచకమా..? సాక్షి, గుంటూరు: పరిశ్రమలకు పవర్‌హాలిడే లేదంటూనే విద్యుత్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. విద్యుత్ లోటు కారణంగా పరిశ్రమలకు కేటాయించే కరెంటుకు కోత పెడుతున్నారు. ప్రతి రోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కేవలం పరిశ్రమలు లైటింగ్ మాత్రమే వాడాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. పరిశ్రమల యజమానులు డెడికేటెడ్ ఫీడర్లు ఏర్పాటు చేసుకున్నా, సరఫరా అరకొరగానే ఉంటుందని వారు వాపోతున్నారు. ప్రస్తుతం స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమలకు సీజను. ఈ సమయంలో ఎడాపెడా అమలవుతున్న కోతలతో పరిశ్రమల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ విధిగా హెచ్‌టీ వినియోగదారులకు కోతలు అమలుచేయాల్సిందేనని పీక్ అవర్స్‌లో కరెంటు వినియోగిస్తే భారీ జరిమానా విధించాలని ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. జిల్లాకు ప్రతి రోజూ 11 మిలియన్ యూనిట్లు కేటాయిస్తున్నారు. జిల్లాలో 973 హెచ్‌టీ సర్వీసులు, ఎల్టీ సర్వీసులు 11,324 ఉన్నాయి. ఇటీవల కాలంలో జిల్లాలో ఇండస్ట్రియల్ లోడు గణనీయంగా పెరిగింది. ఇందుకు తగ్గట్టు కరెంటు కోటా కేటాయించడం లేదు. సెంట్రల్ పవర్ గ్రిడ్ నుంచి ఎస్పీడీసీఎల్కు దక్కే వాటా మొన్నటి వరకు 22 శాతం ఉంది. రాష్ట్ర విభజనతో సీపీడీసీఎల్ పరిధిలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను ఎస్పీడీసీఎల్లో కలిపారు. రెండు జిల్లాలను కలిపినా కేటాయింపు మాత్రం పెద్దగా పెరగలేదు. వినియోగం ఆధారంగా కేటాయించారని చెబుతున్నా, పారిశ్రామికంగా జిల్లాకు పెద్ద పీట వేయాలని, జిల్లా నుంచే హెచ్‌టీ సర్వీసుల ద్వారా రూ.97 కోట్లు ప్రతి నెలా వసూలవుతోందని పరిశ్రమల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఆన్లైన్లో కచ్చితంగా ప్రతి నెలా బిల్లులు చెల్లిస్తున్నా, ఎస్పీడీసీఎల్ పరిశ్రమలకు అందిస్తున్న సేవలు నామమాత్రంగానే ఉంటున్నాయని చెబుతున్నారు. కరెంటు కోతలతో రూ.వందల కోట్లలో ఉత్పత్తులకు ఆటంకాలు ఏర్పడుతున్నట్టు పలువురు పరిశ్రమల యజమానులు చెబుతున్నారు. ప్రతి ఏడాది కరెంటు కోతలు ఉండవని సమావేశాలు పెట్టి మరీ చెప్పే ఉన్నతాధికారులు ఆచరణకొచ్చేసరికి కోతలు అమలు చేస్తున్నారని వాపోతున్నారు. వ్యవసాయానికి కరెంటు సరఫరా కారణంగానే పరిశ్రమలకు గంటల పాటు కోతలు అమలు చేయాల్సి వస్తోందని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు. ప్రతి శుక్రవారం పవర్‌హాలిడే అమలు చేస్తున్నారు. అయితే సరఫరా మెరుగ్గా ఉన్నప్పుడు పవర్‌హాలిడే ఎత్తేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
కోతల్స్..ఉక్కపోతల్స్..!
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: విద్యుత్ ఎప్పుడు వస్తుందో..ఎప్పుడు పోతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ప్రకటించిన సమయాలకంటే రెట్టింపు కోతలు విధిస్తున్నారు. వేసవి తీవ్రతకు తోడు అప్రకటిత విద్యుత్ కోతలతో జనం విలవిల్లాడుతున్నారు. ఒంగోలు నగరంలో రోజుకు నాలుగు గంటల పాటు విద్యుత్ కోత విధిస్తున్నట్లు నాలుగు రోజుల క్రితం ఆ శాఖాధికారులు ప్రకటించారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు కోత విధిస్తామని చెప్పారు. అయితే అందుకు భిన్నంగా రోజులో 7 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. ఏరియాల వారీగా గంటలకొద్దీ తీసేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు భాగ్యనగర్ ప్రాంతంలో సరఫరా నిలిపేస్తే.. శుక్రవారం రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు మరికొన్ని ప్రాంతాల్లో కరెంటు తీసేశారు. మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో పగటి వేళల్లో ఆరు గంటలు మాత్రమే విద్యుత్ కోత విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు కోతలు విధిస్తామన్నారు. అయితే అందుకు విరుద్ధంగా పగటిపూట 10 గంటలపాటు, రాత్రి వేళల్లో కనీసం నాలుగైదు గంటలపాటు రెండు మూడు దఫాలుగా విద్యుత్ లేకుండా చేస్తున్నారు. పరిస్థితి వర్ణనాతీతం. పగలు కనీసం రెండు, మూడు గంటలు కూడా విద్యుత్ ఉండటం లేదు. ఒక్కో మండలాన్ని నాలుగు గ్రూపులుగా విభజించి ఒక్కో వారంపాటు ఒక్కో ప్రాంతానికి రోజుకు వ్యవసాయానికి ఏడు గంటలపాటు విద్యుత్ ఇస్తామని చెప్పారు. కనీసం రెండు నుంచి మూడు గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదు. దీంతో గ్రామాల్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టుకోవాలన్నా నానా అవస్థలు పడే పరిస్థితి. ఏ, బీ, సీ, డీలుగా విభజించి పగలు, రాత్రి విద్యుత్‌ను ఇవ్వాల్సి ఉన్నా ప్రస్తుతం అది అమలు కావడంలేదు. నగరాలు, మున్సిపాలిటీల్లో వ్యాపారాలు సున్నా తీవ్రమైన విద్యుత్ కోతలతో జిల్లాకేంద్రం ఒంగోలు నగరంతోపాటు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో వ్యాపారాలు శూన్యంగా మారాయి. పూర్తిగా విద్యుత్‌పైనే ఆధారపడ్డ వ్యాపారస్తులు నెలవారీ ఖర్చులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేక అల్లాడిపోతున్నారు. పిండి మిల్లులు, రీవైండింగ్, వెల్డింగ్, ఫౌండ్రీల నిర్వాహకుల పరిస్థితి చేతులు కట్టేసినట్లు అయిపోయింది. విద్యుత్ సక్రమంగా లేకపోయినప్పటికీ నెల వచ్చే సరికి బిల్లు మాత్రం కరెంటు షాక్ కొట్టేంత పనిచేస్తుందని వారు వాపోతున్నారు. పరిశ్రమల పరిస్థితి మరీ అధ్వానం.. పరిశ్రమలకూ విద్యుత్ కోతల బెడద తప్పలేదు. మే 13న గతంలో ఇచ్చిన పవర్ హాలిడేకు మినహాయింపు ఇస్తూ ఎత్తి వేశారు. దీంతో పారిశ్రామికవేత్తలు వీక్లీ ఆఫ్ పేరుతో ఒక రోజు మాత్రమే విద్యుత్ లేకుండా పోవడం వల్ల కార్మికులకు ఇచ్చే సెలవు రోజు కలిసి వస్తుందని సంబరపడ్డారు. కానీ పేరుకు మాత్రమే పవర్ హాలిడేకు మినహాయింపునిచ్చారు. విద్యుత్ శాఖాధికారులు మాత్రం అనధికారికంగా రాత్రివేళల్లో పరిశ్రమలు నడుపరాదంటూ పారిశ్రామికవేత్తలకు నోటి మాటగా హుకుం జారీ చేశారు. ఈనెల 18 నుంచి పరిశ్రమలు రాత్రివేళల్లో నడుపరాదంటూ మౌఖిక ఆదేశాలిచ్చారు. వాస్తవానికి పగటి కంటే రాత్రి వేళల్లోనే పరిశ్రమల ఉత్పత్తి సామర్ధ్యం ఎక్కువగా ఉంటుంది. రాత్రివేళల్లో పరిశ్రమలను నడపరాదని విద్యుత్ శాఖాధికారులు చెప్పడంతో వాటిని మూత వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
పవర్‌హాలిడే
గుంటూరు: జిల్లాలో 1,150 హెచ్‌టీ కనెక్షన్ల ద్వారా డిస్కమ్‌కు రూ.97 కోట్లు నెలకు వసూలవుతుంది. అధికారికంగా ఇప్పుడు వారానికి రెండు రోజులు పవర్‌హాలిడే ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ వారం నుంచే ప్రతి శుక్రవారం పవర్‌హాలిడే అమలు కానుంది. అయితే ఈ లోగానే మరో రోజు పవర్‌హాలిడే ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పవర్హాలిడేలకు సంబంధించిన సమాచారం కానీ, మామూలు సమయాల్లో కరెంటు వాడుకున్నందుకు డిస్కం అధికారులు విధించే పెనాల్టీ(అపరాధ రుసుం) గురించి సరుకులన్నీ నాసిరకం.. పథకం ప్రారంభం నుంచే తాలు మిరపకాయల నుంచి తయారు చేసిన కారంపొడి సరఫరా చేస్తున్నారు. బర్మా కందిపప్పు, బియ్యం పొడి కలిపిన పసుపు, విత్తనాలతో కూడి నల్లగా ఉన్న చింతపండు, పొట్టుకలిసిన గోధుమ పిండి, ముక్కిపోయిన గోధుమలు సరఫరా చేయడం వల్ల కార్డుదారులు ఒకటి, రెండు సార్లు తీసుకుని ఆ తరువాత పూర్తిగా మానేశారు. అంతేకాకుండా ఈ వస్తువులపై కేవలం 25 పైసలు మాత్రమే కమీషన్ రావడంతో డీలర్లు కూడా అమ్మహస్తం సరుకులు తీసుకువచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇలా ఈ పథకం పూర్తి స్తాయిలో విఫలమైందని చెప్పవచ్చు. ఉదాహరణకు వినుకొండ నియోజకవర్గ పరిధిలో కొన్ని నెలలుగా అమ్మహస్తం సరుకులు అందడం లేదు. కొన్ని సరఫరా లేకపోగా మరికొన్ని నాసిరకంగా ఉండటం వల్ల తెచ్చేందుకు డీలర్లు ఆసక్తి చూపడం లేదు. పామాయిల్, దేశవాళి కందిప్పుకు డిమాండ్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో సరఫరా లేక పథకం పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. గత అక్టోబర్ నుంచి అన్ని రకాల వస్తువులు కార్డుదారులకు అందడం లేదని అంటున్నారు. ఈ విషయమై వినుకొండ పట్టణంలోని గోదాముల ఇన్చార్జి రమణను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఈ నెలలో పంచదార, కందిపప్పు, పామాయిల్ ఇవ్వనున్నట్టు తెలిపారు. మిగిన వస్తువులు కూడా సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. -
ఇకపై పరిశ్రమలకు మరింత పవర్ కట్
-
అప్పుడే పవర్రీస్!
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: వేసవి ప్రారంభానికి ముందే విద్యుత్ కోతలు తీవ్రమవుతున్నాయి. దీంతో జిల్లా వాసులకు ఈ ఏడాది కూడా కరెంట్ కష్టాలు తప్పేటట్టు లేవు. జాతీయ గ్రిడ్‌తో సదరన్ గ్రిడ్‌ను అనుసంధానం చేయడం వల్ల విద్యుత్ కోతలుండవని అధికారులు గొప్పగా ప్రకటించినా అవన్నీ వట్టి ‘కోత’ లుగానే మిగిలిపోతున్నాయి. ఒక వైపు జిల్లా కేంద్రంలో నాలుగు గంటల పాటు విద్యుత్‌కోతను విధించడానికి సిద్ధమవుతూనే పరిశ్రమలకు సోమవారం పవర్ హాలీడే ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకూ జిల్లాలో పరిశ్రమలకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. డెడికేటెడ్, ఎక్స్‌ప్రెస్ ఫీడర్లు ఉన్న పరిశ్రమలకు ఇది వర్తిస్తుంది. పెరుగుతున్న అనధికార కోతలు మరో వైపు జిల్లాలో అనధికారిక విద్యుత్ కోతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో తలెత్తుతున్న విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా పలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా సుమారు 500 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కోతలు పెరిగినట్టు చెబుతున్నారు. దీంతో గత కొద్ది రోజుల వరకు గృహావసర విద్యుత్ కనెక్షన్లకు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట కోతలు విధిస్తున్న విద్యుత్ శాఖ, పరిశ్రమలకు అందుకు మినహాయింపు ఇవ్వలేదు. పరిశ్రమల్లో పనులు స్తంభించి అటు కార్మికులు, ఇటు యాజమాన్యాలకు అవస్థలు మొదలయ్యాయి. వాస్తవానికి గృహావసరాల విద్యుత్ కనెక్షన్లకు జిల్లా కేంద్రంలో కేవలం రెండు గంటలు మత్రమే అనధికారిక కోత విధిస్తుండగా... గత రెండు రోజుల్లో ఆ సమయం నాలుగు గంటలకు పెరిగింది. ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈఎల్ఆర్ విధిస్తున్నారు. అదేవిధంగా మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పగటి పూట పరిస్థితి ఎలా ఉన్నా రాత్రి వేళల్లో సైతం రెండు నుంచి నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా పరిశ్రమలకు ఈఎల్‌ఆర్‌ను అమలు చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో అధికంగా విద్యుత్ వినియోగించే ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమలకు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈఎల్ఆర్ పేరిట సరఫరా నిలిపివేస్తున్నారు. కేవలం పరిశ్రమల ఆవరణలో ఉన్న లైటింగ్‌కు మాత్రమే విద్యుత్ సరఫరాను వినియోగించుకునేందుకు అనుమతిస్తున్నారు. తగ్గుతున్న కేటాయింపులు ఇదిలా ఉండగా జిల్లాకు అవసరమయ్యే విద్యుత్ కేటాయింపులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. జిల్లాలో ఉన్న విద్యుత్ కనెక్షన్లకు సుమారు 5 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరం ఉంటుందని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతుండగా ప్రస్తుతం కేటాయింపు 4.772 ఎంయూ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ తరుణంలో ఈఎల్ఆర్ అమలు చేస్తున్న 4.488 ఎంయూ వినియోగం రోజులో జరుగుతున్నట్లు చెబుతున్నారు. కేటాయింపులు మెరుగుపడితే కాని సరఫరా మెరుగుపడే అవకాశాలు ఉండవని, పరిస్థితి రెండు రోజుల్లో అదుపులోకి వస్తుందని ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ దత్తి సత్యనారాయణ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.