ఏరోజు ఎక్కడంటే..
బుధ, గురువారాల్లో : బొంతపల్లి, గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలు
సోమ, మంగళవారాల్లో: బొల్లారం పారిశ్రామిక వాడ
జిన్నారం : వారానికి ఒక రోజు పరిశ్రమలకు పవర్ హాలీడే ఇస్తామని నెలరోజుల క్రితం ప్రకటించిన సర్కార్, తాజాగా పరిశ్రమలకు రెండు రోజులు విద్యుత్ సరఫరా ఉండదని తేల్చిచెప్పింది. ఇందుకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో బుధవారం నుంచే పరిశ్రమలకు పవర్‌ను కట్ చేశారు. వారంలో రెండు రోజుల విద్యుత్ సరఫరా నిలిపివేతతో పరిశ్రమల యాజమాన్యాలు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నాయి. జిన్నారం మండలంలోని బొల్లారం, బొంతపల్లి, ఖాజీపల్లి, గడ్డపోతారం పారిశ్రామిక వాడల్లో చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు నాలుగు వందలకు పైగా ఉన్నాయి. వీటిల్లో 50 శాతం వరకు రసాయన పరిశ్రమలు ఉన్నాయి. రసాయన పరిశ్రమలను నడిపేందుకు విద్యుత్ తప్ప మరో మార్గం లేదు. ఈ నేపథ్యంలో వారంలో రెండురోజుల పాటు కరెంటు సరఫరా నిలిచిపోతే పరిశ్రమలను మూసివేయడమే మేలని కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్నాయి.
అయితే ప్రత్యామ్నాయం..లేకపోతే మూత
సర్కార్ ఆదేశాల మేరకు బొంతపల్లి, గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడల్లో ప్రతి బుధ, గురువారాల్లో, బొల్లారం పారిశ్రామిక వాడలో ప్రతి సోమ, మంగళవారాల్లో విద్యుత్ హాలీడే ఉంటుంది. ఈ మేరకు బుధవారం నుంచే అధికారులు పవర్ హాలిడే అమలు చేస్తున్నారు. గత ఏడాది కాలంగా సరిపడా విద్యుత్ లేకపోవటంతో పరిశ్రమలను నడటమే భారంగా మారిందని, ఈ సమయంలో వారంలో రెండు రోజులు విద్యుత్ సరఫరా లేకపోతే ఎలా అంటూ పరిశ్రమల యజమానులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని బహుళజాతి పరిశ్రమలు మాత్రం ప్రైవేటుగా విద్యుత్‌ను కొనుగోలు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇంకొన్ని చిన్న చిన్న పరిశ్రమల యాజమాన్యాలు విద్యుత్ సమస్యను అధిగమించేందుకు జనరేటర్లు ఉపయోగించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. కానీ జనరేటర్‌ల వి నియోగం వల్ల వ్యయభారంతో పాటు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని యాజ మాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మూతపడుతున్న పరిశ్రమలు
రెండు రోజుల పవర్ హాలిడేతో పరిశ్రమలను నడపటం భారంగా మారటంతో యాజమాన్యాలు పరిశ్రమలను మూసివేస్తున్నాయి. బొల్లారంలో 250 పరిశ్రమలు ఉండగా, విద్యుత్ సంక్షోభంతో గత రెండేళ్లు కాలంలో సుమారు 50 వరకు పరిశ్రమలు మూతపడ్డాయి. గడ్డపోతారం, ఖాజీపల్లి, బొంతపల్లి పారిశ్రామికవాడల్లో సుమారు 20 పరిశ్రమలు మూతపడ్డాయి.
వీధిన పడనున్న కార్మికుల కుటుంబాలు
మండలంలోని వివిధ పరిశ్రమల్లో 30 వేల వరకు కార్మికులు వివిధ రంగాల్లో విధులను నిర్వహిస్తుంటారు. వీరిలో కాంట్రాక్టు కార్మికులు పదిహేనువేలకుపైగా ఉంటారు. పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు పవర్ హాలీడే ఇస్తుండటంతో పరిశ్రమలు మూతపడి పడే ప్రమాదం ఉంది. ఒకవేళ పరిశ్రమలు నడిచినా నెలలో 8 రోజుల పాటు కార్మికులకు హాలీడే ఇవ్వనున్నడంతో వేతనాలు సరిపోక కుటంబ పోషణ భారంగా మారనుంది.
కోతలతో పరిశ్రమలు విలవిల
Published Thu, Oct 9 2014 4:36 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement