preferences
-
కస్టమర్‌కు ప్రాధాన్యం ఇవ్వండి
ముంబై: వినియోగదారు ఆధారిత ప్రాధాన్య విధానాన్ని అనుసరించాలని బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ జే స్వామినాథన్ సూచించారు. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని బలోపేతం చేయవచ్చన్నారు. బ్యాంకుల కస్టమర్ సరీ్వస్ ఇన్‌చార్జ్‌లు, ఎండీ, ఈడీ తదితర ఉన్నతాధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. కస్టమర్ల ఫిర్యాదులను కచి్చతంగా పరిష్కరించడం, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని క్రమబదీ్ధకరించడం, కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు, మోసాల నివారణ, నష్టాలను తగ్గించుకునేందుకు టెక్నాలజీని వినియోగించుకోవడంపై సమావేశంలో చర్చ జరిగినట్టు ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థ పట్ల నమ్మకం, విశ్వాసాన్ని పెంచడంతో కస్టమర్ సేవలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా స్వామినాథన్ పేర్కొన్నారు. కస్టమర్ సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదులకు అసలు మూల కారణాలు, స్వీకరించిన అధికారే నేరుగా పరిష్కరించడం తదితర ఐదు అంశాలపై దృష్టి పెట్టాలని కోరారు. -
వాటాదారులకే ప్రాధాన్యత ఇవ్వాలి
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ సొంత వాటాదారులకే ప్రాధాన్యత ఇవ్వాలని కార్పొరేట్ పాలన పరిశోధన, సలహాదారు సంస్థ ఎస్ఈఎస్ ఒక నివేదికలో పేర్కొంది. గ్రూప్‌పై ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ కంపెనీలలో వాటాదారుకాదని తెలియజేసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల తదుపరి గ్రూప్ మార్కెట్ క్యాప్(విలువ) భారీగా పతనమైన నేపథ్యంలో ఖాతాలపై థర్డ్‌పార్టీ ఆడిట్ ద్వారా వాటాదారుల ఆందోళనలకు చెక్ పెట్టవచ్చని సలహా ఇచ్చింది. గ్రూప్ రుణాలపై అవసరానికి మించి ఆందోళనలు తలెత్తినట్లు అభిప్రాయపడింది. స్వతంత్ర థర్డ్‌పార్టీ ఆడిట్ ద్వారా గ్రూప్ విశ్వాసాన్ని( క్రెడిబిలిటీ) తిరిగి పొందవచ్చని సూచించింది. యూఎస్ షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీలలో అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. దీంతో సుమారు 140 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైంది. అయితే మంగళవారం(28న) ట్రేడింగ్‌లో పలు కౌంటర్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. క్యాష్ ఫ్లోలు ఓకే అదానీ గ్రూప్‌లోని ప్రతీ కంపెనీ రుణ చెల్లింపులకు తగిన క్యాష్ ఫ్లోలు సాధించగలిగే స్థితిలో ఉన్నట్లు ఎస్ఈఎస్ అభిప్రాయపడింది. వెరసి గ్రూప్ రుణభారంపై అధిక స్థాయి ఆందోళనలు సరికాకపోవచ్చని పేర్కొంది. గ్రూప్‌లోని చాలా కంపెనీలు రుణ చెల్లింపులకు తగిన నగదు రాకను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. అదానీ ట్రాన్స్మిషన్ అధిక రుణ–ఈక్విటీ నిష్పత్తిని కలిగి ఉన్నట్లు పేర్కొంది. అయితే విద్యుత్ ప్రసారం బిజినెస్ ద్వారా ఫిక్స్డ్ రిటర్న్ సాధించగలమని కంపెనీ విశ్వసిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఆందోళన లు సరికాదని పేర్కొంది. ఇక అదానీ గ్రీన్ అధిక రు ణ భారాన్ని కలిగి ఉన్నప్పటికీ రుణ చెల్లింపుల్లో ఎ లాంటి సమస్యలనూ ఎదుర్కోలేదని వివరించింది. -
ఫేస్ బుక్... యూజర్లకు కొత్త సదుపాయం
ప్రఖ్యాత సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్.. ఇప్పుడు ఖాతాదారులకు కొత్త సదుపాయాన్ని కల్పిస్తోంది. వినియోగదారుల అభిరుచులను సేకరిస్తున్న ఈ సామాజిక మాధ్యమం... యూజర్ల ఆసక్తికి అనుగుణంగా 'యాడ్ ప్రిఫరెన్సెస్' టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఫేస్ బుక్ పేజీలో వినియోగదారులకు ఇష్టమైన ప్రకటనలను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఫేస్ బుక్ పేజ్ లో యూజర్లు ఎక్కువగా చూసే విషయాల ఆధారంగా సంబంధిత మాచారాన్ని సేకరించి ఆయా ప్రకటనలకు చెందిన పూర్తి సమాచారాన్ని వారికి అందుబాటులో ఉంచుతుంది. సాధారణంగా ఏ వెబ్ పేజీ తెరచినా పక్కనే అనేక ప్రకటనలు కనిపించడం మనం చూస్తుంటాం. అయితే ఫేస్ బుక్ ఇప్పుడు వినియోగదారులకు ఇష్టమైన ప్రకటనలు అందుబాటులో ఉంచేందుకు ముందుకొచ్చింది. ప్రధానంగా మీ వయసు, ఫేస్ బుక్ వినియోగించే తీరు, ఇష్టాలను పరిగణనలోకి తీసుకొని.. మీరు క్లిక్ చేసిన బటన్స్ ను బట్టి మీకేం కావాలో అంచనా వేస్తుంది. సైట్ నుంచి మీరు లాగౌట్ అయిపోయినా సమాచారం మాత్రం సేకరించి ఉంచుతుంది. ముఖ్యంగా ఈ టూల్... ఫేస్ బుక్ పేజీ శీర్షిక ఆధారంగా మీక్కావలసిన అంశాన్ని గుర్తిస్తుంది. వైవాహిక జీవితం, రాజకీయాలు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని మీ ప్రాధాన్యతను అంచనా వేస్తుంది. క్లాత్, గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి ప్రకటనలను వాటికి సంబంధించిన ఫొటోలతో సహా పూర్తి సమాచారాన్ని మీ ముందుంచుతుంది. పేజీలో మీరు సబ్జెక్ట్ ను మార్చినప్పుడల్లా ఆయా విషయాలకు సంబంధించిన ప్రకటనలు పేజీలో మారుతుండటం ఈ 'యాడ్ ప్రిఫరెన్సెస్' ప్రత్యేకత. అంతేకాక ఈ సమయంలో కొత్త ప్రకటనలను వినియోగదారులకు పరిచయం చేసి ప్రోత్సహించేందుకు కూడా ఫేస్ బుక్ ప్రయత్నిస్తుంది. -
బుల్ ధనా ధన్
సార్వత్రిక ఎన్నికలలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అంచనాలు, డాలరుతో రూపాయి పుంజుకోవడం, ఎఫ్ఐఐల పెట్టుబడులు ఇన్వెస్టర్లలో జోష్‌ను పెంచుతున్నాయి. వెరసి ఉదయం నుంచీ కొనుగోళ్లు ఊపందుకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో సెన్సెక్స్ తొలిసారి 22,000 పాయింట్ల ఎగువన ముగిసింది. ఇది ఒక విశేషంకాగా, ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టం 22,074ను తాకింది. ఇక నిఫ్టీ కూడా తొలిసారి 6,591ను చేరడం మరో ప్రత్యేకత! ఇందుకు వచ్చే నెల మొదట్లో చేపట్టనున్న సమీక్షలో ఆర్బీఐ సరళ విధానాన్ని అనుసరిస్తుందన్న అంచనాలు కూడా తోడ్పడ్డాయని నిపుణులు చెప్పారు. గురువారం(27న) డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల ముగింపు కారణంగా మార్కెట్లలో లావాదేవీలు పుంజుకున్నట్లు తెలిపారు. ఎఫ్ఐఐల జోరు... ఇటీవల దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడుల దూకుడును చూపుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) సోమవారం ఒక్క రోజులో రూ. 1,466 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే దేశీ ఫండ్స్ రూ. 770 కోట్ల విలువైన అమ్మకాలను చేపట్టాయి. కాగా, ఈ నెల 21 వరకూ ఎఫ్ఐఐలు రూ. 17,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం చెప్పుకోదగ్గ అంశం! బీఎస్ఈలో ప్రధానంగా బ్యాంకింగ్, ఆయిల్ రంగాలు 2.5%పైగా జంప్ చేయగా, హెల్త్‌కేర్, ఐటీ ఇండెక్స్‌లు మాత్రమే స్వల్పంగా నష్టపోయాయి. ఫార్మా దిగ్గజాలు డాక్టర్ రెడ్డీస్, సిప్లా, సన్ ఫార్మాలతోపాటు, విప్రో, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ 1.4-0.4% మధ్య బలహీనపడ్డాయి. అయితే మరోవైపు ప్రభుత్వ రంగ ఈటీఎఫ్‌లో భాగమైన పీఎస్‌యూ షేర్లకు డిమాండ్ కనిపించింది. ఇతర విశేషాలివీ... బ్యాంకింగ్, ఆయిల్ ఇండెక్స్‌లలో అన్ని షేర్లూ లాభపడటం విశేషంకాగా, మధ్యంతర డివి డెండ్ను ప్రకటించనుందన్న వార్తలతో ఓఎన్జీసీ 4% పైగా ఎగసింది. ఈ బాటలో గెయిల్, ఐవోసీ, ఇంద్రప్రస్థ గ్యాస్ 5-3% మధ్య పురోగమించగా, ఆర్ఐఎల్ సైతం దాదాపు 2% బలపడింది. బ్యాంకింగ్‌లో ఐసీఐసీఐ దాదాపు 4% జంప్‌చేయగా, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్, కొటక్ మహీంద్రా, పీఎన్బీ, హెచ్డీఎఫ్సీ 5-2.5 మధ్య ఎగశాయి. ఈ బాటలో యాక్సిస్, కెనరా, బీవోబీ, ఎస్బీఐ సైతం 1.5% స్థాయిలో లాభపడ్డాయి. తాజాగా పీఎస్‌యూ షేర్లకు డిమాండ్ కనిపించింది. బీఈఎంఎల్, ఇంజనీర్స్, ఎంవోఐఎల్, కంటెయినర్ కార్పొరేషన్, చెన్నై పెట్రో, మంగళూర్ రిఫైనరీ, ఐవోసీ, ఎన్ఎండీసీ, కోల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, పీఎఫ్సీ, ఆర్ఈసీ తదితరాలు 8-3% మధ్య దూసుకెళ్లాయి. వీటిలో అధిక శాతం ఈటీఎఫ్‌లో భాగమైన షేర్లుకావడం గమనార్హం! బీఎస్ఈలో మొత్తం 155 షేర్లు ఏడాది గరిష్టాలను తాకాయి. ఈ జాబితాలో టీవీఎస్ మోటార్, వోల్టాస్, జెన్‌టెక్ వంటి మిడ్క్యాప్స్తోపాటు మారుతీ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి దిగ్గజాలున్నాయి. సెన్సెక్స్ ఇంతక్రితం ఈ నెల 10న 21,935 వద్ద ముగియగా, 18న ఇంట్రాడేలో 22,040ను తాకింది. ఇవి చరిత్రాత్మక గరిష్ట స్థాయిలుకాగా, ప్రస్తుత బుల్ జోరుతో ఇవి చెదిరిపోయి సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. వడ్డీ తగ్గింపు అంచనాలతో ఆటో రంగ షేర్లు సైతం ర్యాలీ చేశాయి. అశోక్ లేలాండ్, హీరో మోటో, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం, మారుతీ, టాటా మోటార్స్ 4-0.6% మధ్య లాభపడ్డాయి. టీవీఎస్ మోటార్ రూ. 101 వద్ద కొత్త గరిష్టాన్ని తాకినప్పటికీ చివర్లో 3% నష్టంతో రూ. 96 వద్ద ముగిసింది. ఎఫ్ఎంసీజీ షేరు హవేల్స్ 4% జంప్ చే సి రూ. 900 వద్ద కొత్త గరిష్టాన్ని తాకగా, ఐటీసీ 1% బలపడింది. మార్చి నెలలో చైనా తయారీ రంగం మందగించిన సంకేతాలు వెలువడినప్పటికీ, చైనాసహా తైవాన్, ఇండొనేసియా, జపాన్, దక్షిణ కొరియా తదితర ఆసియా స్టాక్ మార్కెట్లు 0.5-2% మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ... లాంగ్ రోలోవర్స్ దాదాపు 2 వారాలపాటు చిన్నశ్రేణికి పరిమితమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ హఠాత్ ర్యాలీకి కారణం ఈ నెల ఆప్షన్ కాంట్రాక్టుల్లో షార్ట్ కవరింగ్...వచ్చే నెలకు లాంగ్ రోలోవర్స్ జరగడమేనని తాజా డేటా సూచిస్తున్నది. షార్ట్ కవరింగ్ ఫలితంగా ఈ నెల 6,500 కాల్ ఆప్షన్ నుంచి 10.95 లక్షల షేర్లు, 6,600 కాల్ ఆప్షన్ నుంచి 8.15 లక్షల షేర్లు కట్ అయ్యాయి. 6,500 పుట్ ఆప్షన్లో 8.49 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మార్చి డెరివేటివ్ కాంట్రాక్టులు మరో మూడు రోజుల్లో ముగియనున్నప్పటికీ, స్పాట్ నిఫ్టీతో పోలిస్తే మార్చి నిఫ్టీ ఫ్యూచర్ 15 పాయింట్ల ప్రీమియంతో ముగిసింది. ఏప్రిల్ నెలకు లాంగ్ రోలోవర్స్ను సూచిస్తూ ఆ నెల ప్రీమియం క్రితం ట్రేడింగ్ రోజుతో పోలిస్తే 66 పాయింట్ల నుంచి 73 పాయింట్లకు పెరిగింది. ఏప్రిల్ నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో 23 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ 62 లక్షల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో క్షీణత సంభవిస్తే 6,500 స్థాయి నిఫ్టీకి మద్దతునివ్వవచ్చని, 6,600 స్థాయిని అధిగమించగలిగితే మరింత ర్యాలీ సాధ్యమని ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది. ఏప్రిల్ నెలలో మార్కెట్ పట్ల ఇన్వెస్టర్లు బుల్లిష్‌గా వున్నారని, వచ్చే నెలకు ట్రేడవుతున్న భారీ ప్రీమియం సూచిస్తున్నది.