Premature rains
-
టమాటా మోత..మరో రెండు నెలలు!
న్యూఢిల్లీ: అకాల వర్షాలు, అధిక వర్షాలతో కూరగాయల ధరలకు ముఖ్యంగా టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో రూ.100 వరకు ఉన్న టమాటా ధర ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని క్రిసిల్ అంచనా వేస్తోంది. మరో రెండు నెలల వరకు టమాటా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదని క్రిసిల్ అధ్యయనం చెబుతోంది. దేశంలో టమాటా అత్యధికంగా పండించే రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో సాధారణ వర్షపాతానికి మించి 105%, ఆంధ్రప్రదేశ్‌లో సాధారణానికి మించి 40%, మహారాష్ట్రలో 22% అధికంగా వానలు నమోదయ్యాయి. దీంతో, అక్టోబర్–డిసెంబర్ కాలంలో కీలక సరఫరాదారులైన ఈ మూడు రాష్ట్రాల్లో చేతికొచ్చిన టమాటా పంట నేలపాలైందని క్రిసిల్ అంటోంది. దీంతో, నవంబర్ 25 నాటికి 142% మేర ధరలు పెరిగాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల నుంచి టమాటా పంట చేతికందే వచ్చే జనవరి వరకు ధరల్లో ఇదే తీరు కొనసాగుతోందని క్రిసిల్ అంచనా వేస్తోంది. కొత్తగా పంట వస్తే టమాటా ధర 30% మేర తగ్గుతుందని చెబుతోంది. అయితే, టమాటా అధిక ధరల ప్రభావం డిసెంబర్ నుంచి తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి టమాటా తాజా పంట మార్కెట్లోకి రావడం మొదలైతే ధరలు దిగివస్తాయని పేర్కొంది. ఉల్లి ధరలు కూడా మరో 10–15 రోజుల తర్వాతే తగ్గుతాయని క్రిసిల్ తెలిపింది. అత్యధికంగా సాగయ్యే మహారాష్ట్రలో తక్కువ వర్షపాతంతో ఆగస్ట్‌లో సాగు ఆలస్యమైంది. దీంతో, పంట ఆలస్యం కావడంవల్ల ధరలు 65% పెరిగాయని తెలిపింది. -
రబీ కోతల వేళ అకాల వర్షాలు
సాక్షి, అమరావతి: రబీ కోతలు జోరుగా సాగుతున్న తరుణంలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతులను కొంత ఇబ్బందికి గురిచేశాయి. వీటి ప్రభావంతో చేలమీద ఉన్న పంటలు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ దిగుబడులకు ఇబ్బందిలేదని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ రెండో వారంలో వర్షాలు, ఈదురుగాలులకు రాష్ట్ర వ్యాప్తంగా 7,243.6 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వీటిలో అత్యధికంగా 4,488.4 ఎకరాల్లో వరి, 2,416.1 ఎకరాల్లో మొక్కజొన్న, 87.5 ఎకరాల్లో పత్తి, 61.3 ఎకరాల్లో మినుము, 58.8 ఎకరాల్లో బాజ్రా, 55.1 ఎకరాల్లో పెసలు, 32 ఎకరాల్లో నువ్వులు, 25 ఎకరాల్లో కొర్రలు, 12.4 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 7 ఎకరాల్లో రాగులు పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఇక జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా పశ్చిమగోదావరిలో 3,111.3 ఎకరాలు, వైఎస్సార్‌లో 1,517.5, విజయనగరంలో 878, శ్రీకాకుళంలో 693.6, నెల్లూరులో 380, కర్నూలులో 305, అనంతపురంలో 248.7, ప్రకాశంలో 102, విశాఖలో 7.5 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ సాక్షికి తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం తుది నివేదిక తయారు చేస్తామని చెప్పారు. రెండురోజులు మోస్తరు వర్షాలు మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తర, దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ద్రోణి కొనసాగుతోంది. మరట్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు తీరప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ద్రోణి వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా వ్యాపిస్తోంది. ఇది మరట్వాడా, ఉత్తర కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం వరకు వ్యాపించి ఉందని, దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖలోని వాతావరణ శాఖ అధికారులు శనివారం తెలిపారు. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలతోపాటు రాయలసీమలోని పలు చోట్ల వర్షాలు కురిసే వీలుందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలోని పాములపాడు, కొత్తపల్లి, జూపాడుబంగ్లా, ఓర్వకల్లు, మిడుతూరు మండలాల్లో శనివారం అకాల వర్షాలు పడ్డాయి. నందికొట్కూరు మండలం నాగటూరులో పిడుగుపాటుతో ఓ మహిళ మృతిచెందింది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజవొమ్మంగి మండలంలోని తంటికొండ గ్రామ సమీపాన ఈదురుగాలులతో కురిసిన వర్షానికి భారీ వృక్షం కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. -
ఖమ్మంలో కడగండ్లు.. రంగారెడ్డిలో వడగళ్లు
సాక్షి, నెట్వర్క్: ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలను గురువారం అకాల వర్షం ముంచెత్తింది. తెల్లవారుజామున కురిసిన వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చర్ల, పాల్వంచ, ఇల్లెందు, జూలూరుపాడు, బూర్గంపాడు మండలాల్లో కల్లాల్లో ఆరబోసిన మిర్చి రాశుల్లోకి నీళ్లు చేరి మిరపకాయలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల పట్టాలు కప్పి ఉంచినప్పటికీ కింది నుంచి జలాలు చేరి తడిశాయి. వరిపంట నేలవాలింది. బూర్గంపా డు మార్కెట్ యార్డు, వైరా, తల్లాడ మండలాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. నీటి ఉధృతికి రాశులు కొట్టుకుపోవడంతో రైతులు కాపాడుకునేందుకు అరిగోస పడ్డారు. కారేపల్లిలో ఈదురుగాలులకు వరిపంట నేలవాలగా, మామిడికాయలు రాలిపోయాయి. మధిర మండలం మల్లారంలో గొర్రెలను మేపుతున్న నర్సింహ యాదవ్ (45) పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో..: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని యాచారం, చేవెళ్ల మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. ఆయా గ్రామాల్లో వంద ఎకరాల్లోని వరిపంట నేలవాలింది. ఇంకా 50 ఎకరాల్లో మామిడితోటలు, మరో 50 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పరిగి మండలంలోని పలు గ్రామాల్లో 800కుపైగా ఎకరాల్లోని వివిధ పంటలు దెబ్బతిన్నాయి. రెండో రోజూ తీరని నష్టం.. మహబూబ్‌నగర్ జిల్లాలో రెండోరోజూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రైతుల్ని బెంబేలెత్తించింది. నవాబుపేట మండలం కొల్లూర్‌లో ఈదురుగాలులకు రైస్‌మిల్లు పైకప్పు పూర్తిగా దెబ్బతిని బియ్యం, ధాన్యం తడిసిపోయాయి. గండేడ్‌లో ఇటుకబట్టీలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో అత్యధికంగా నవాబుపేట మండలంలో 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లా మాగనూరు, మరికల్ మండలాల్లో వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. మరికల్లో దాదాపు 650 ఎకరాల్లో వరిపంటలు దెబ్బతిన్నాయి. -
ఆంధ్రప్రదేశ్‌లో 10 రోజులు అకాల వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు, ఉత్తర బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అధిక పీడన ప్రాంతాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 10 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా అకాల వర్షాలు ఎక్కువగా పడే సూచనలున్నాయి. ముఖ్యంగా రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బుధవారం నుంచి అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాయలసీమతో పాటు గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు పడతాయని తెలిపారు. ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతాలకు మాత్రమే వర్షసూచన ఉందన్నారు. సముద్రతీర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపారు. జార్ఖండ్, ఒడిశాల మీదుగా ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించి ఉంది. దీంతోపాటు తేమగాలుల ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. -
ఏప్రిల్ 16 నుంచి ఏపీలో అకాల వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాతావరణం క్రమంగా మారుతోంది. ఎన్నడూ లేని విధంగా నడి వేసవిలో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా.. ఎండలు పెరిగి అకాల వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఇవన్నీ.. నైరుతి రుతుపవనాల రాకకు ముందస్తు సంకేతాలని భావిస్తున్నారు. మధ్య బంగాళాఖాతంలో అధికపీడనం కొనసాగుతోంది. దీనికి తోడు దక్షిణ బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు రాష్ట్రంపై విస్తరిస్తున్నాయి. ఈ తేమ గాలులు క్రమంగా దిగువకు వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో.. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 16 నుంచి రాయలసీమలోని కర్నూలులో వర్షాలు ప్రారంభమై క్రమంగా మిగిలిన జిల్లాలకు విస్తరిస్తాయని, అదేవిధంగా.. కోస్తాంధ్రలోనూ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ నెల 22 వరకు వర్షాలు పడే సూచనలున్నాయని, దీని వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంపై తక్కువ ఎత్తులో ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో నేడు, రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కురుపాంలో 3.1 సెం.మీ., గుమ్మలక్ష్మీపురంలో 2.7, చింటూరులో 2.1, రుద్రవరం, బుట్టాయగూడెంలలో 1.7, పెదకూరపాడులో 1.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
అకాల వర్షాలు.. 8,314 హెక్టార్లలో పంట నష్టం
సాక్షి, తూర్పుగోదావరి : రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా పాడైన రబీ పంటలను వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నాబాబు పరిశీలించారు. కాకినాడ రూరల్‌లో సోమవారం పర్యటించిన మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 7,455 వరి దెబ్బతిన్నట్లు తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. మొక్కజొన్న 539 హెక్టార్లలో, నువ్వులు 275, వేరు శెనగ 23, సన్‌ఫ్లవర్ 5 హెక్టార్లలో.. మొత్తం 8,314 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2266 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయన్నారు. (అయ్యా బాబోయ్.. ఈ స్టంట్ ఎప్పుడూ చూడలేదు) తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాలని, దాన్ని కూడా పరిశీలిస్తున్నామని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతు ఆందోళనలో ఉన్నాడని ఎవరైనా తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. తక్షణమే బొండాలు రకం ధాన్యం కొనుగోలు చేయమని మిల్లర్లను కోరుతున్నామన్నారు. కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశామని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. (ఇక ఎప్పటికీ ఇంటి నుంచి పనిచేసే హక్కు! ) -
‘ప్రభుత్వం చేతకానితనం వల్లే ఈ కష్టాలు’
సాక్షి, హైదరాబాద్ : అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవైపు తెలంగాణలో అకాల వర్షాల కారణంగా రైతులు కష్టాలపాలవుతుంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు చేసుకోవాటం సిగ్గుచేటుని అన్నారు. సోమవారం ఎంపీ మాట్లాడుతూ.. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తూ 6 నెలల పంటను నీటిపాలు చేశారని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షంతో తడిసి ధాన్యాన్ని చూస్తే గుండె తరుక్కుపోతుందని, వర్షాల కారణంగా చేతికి వచ్చిన ధాన్యం నీళ్ల పాలు అవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. (‘లూడో’లొ ఓడించిందని భార్యను.. ) 15 రోజులుగా ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో రైతులు పడిగాపులు కాస్తున్న పట్టించుకునే నాధుడే లేడని, ప్రభుత్వం చేతకానితనం వల్లే రైతులకు ఈ కష్టాలు వచ్చాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రైతులకు నష్టం వచ్చినందుకు ప్రభుత్వం భాద్యత వహిస్తూ వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చండూరు, నాంపల్లి, పోచంపల్లి, చింతపల్లి, పలు మండలాల్లో ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసిపోయిందని, రైతులను ఇబ్బంది పెట్టకుండా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కాన్వాయిలతో ప్రచారం చేయటం తప్ప రైతులకు చేసిన మేలు ఏమి లేదని విమర్శించారు. (లాక్డౌన్ సడలింపా.. అదేం లేదు: సీఎం ) టీఆర్ఎస్ పార్టీకి ప్రచారం తప్ప సేవ చేసే తత్వం లేదని, ప్రజల కష్టాలను గాలికి వదిలేసి సంబరాలు జరుపుకోవడం విడ్డురంగా ఉందన్నారు. జెండాలు ఎగురవేసి సంబరాలు జరుపుకునే సమయం ఇది కాదని, ప్రజలు కష్టాల్లో ఉన్నారని గుర్తు చేశారు. వారం రోజుల్లో రైతులకు న్యాయం జరగకపోతే ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల వద్ద ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. బత్తాయి కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం ఒక్క రైతు దగ్గర కూడా బత్తాయిలను కొనుగోలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బత్తాయి, నిమ్మ, మామిడి పండ్లను ప్రభుత్వమే కొనుగోలు చేసి పేదవాళ్లకు పంచాలని సూచించారు. లాక్డౌన్ కారణంగా అంతరాష్ట్రాల ఎగుమతులు నిలిచిపోయిన కారణంగా పండ్లను కొనుగోలు చేయటానికి ఎవరు ముందుకు రావడం లేదని, కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 400 కోట్ల మామిడి,నిమ్మ,బత్తాయి పంట ఉంటుందన్నారు. ప్రభుత్వం ఈ పంటను కొనుగోలు చేసి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందించాలని, మే 7 లాక్ డౌన్ తరువాత రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ తరుపున పెద్ద ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. (సామాజిక దూరం.. స్టంట్ అదిరింది గురూ! ) -
రైతులను ఆదుకుంటాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని నష్ట పోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. వరి పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేసి రైతులకు పరిహారం ఇవ్వాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. కొన్ని చోట్ల వరి తడిసినట్టు తమ దృష్టికి వచ్చిందని, దాని గురించి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని, ముఖ్యమంత్రితో మాట్లాడి, తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు భరోసా ఇచ్చారు. దీంతో వరి పంట నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో వరి, మొక్కజొన్న, నువ్వులు, వేరుశనగ, 4579 హెక్టార్లలో, అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలకు 490 హెక్టార్లలో మొత్తం 5069 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. ఆహార పంటలకు జరిగిన నష్టం.. గడిచిన 48 గంటల్లో అకాల వర్షాలకు ఏడెనిమిది జిల్లాల్లో పంటలకు స్వల్ప నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 4579 హెక్టార్లలో ఆహార పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో వరి, మొక్కజొన్న, నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 19 హెక్టార్లలో పొగాకు కూడా దెబ్బతిన్నట్టు అంచనా. తూర్పు గోదావరి జిల్లాలో 9 వేల హెక్టార్లకు పైగా వరి పంట నేలకొరిగింది. అయితే ఇదంతా నష్టం కాదని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ చెప్పారు. ఉద్యాన పంటలకు నష్టం ఇలా అకాల వర్షాలకు మొత్తం 490 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్టు ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌధురి తెలిపారు. ► వెఎస్సార్ కడప జిల్లాలో 9 మండలాలలో 316 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో మామిడి 122 హెక్టార్లు, అరటి 155.5 హెక్టార్లు, జామ 1.50, నిమ్మ 3, బొప్పాయి 27.50 హెక్టార్లుగా అంచనా. ► అనంతపురం జిల్లాలో 9 మండలాలలో 32.80 హెక్టార్ల లో అరటి, తమలపాకు, విజయనగరం జిల్లాలో 30 హెక్టార్లలో అరటి తోటలకు నష్టం వాటిల్లింది. ► కర్నూలు జిల్లాలో 63.2 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మునగ పంటలు దెబ్బతిన్నాయి. ► చిత్తూరు జిల్లాలో వరి పంట నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాల్లో పంట నష్టం అంచనా కృష్ణాజిల్లాలో 3564 హెక్టార్లలో ఆహార పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా. ప్రధానంగా 13 మండలాల్లో వరి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 9,334 హెక్టార్లలో వరి పంట నేలకొరిగినట్లు అంచనా. వరి పనలు, ధాన్యం కుప్పలు తడిసినట్టు రైతులు చెప్పారు. అనంతపురం జిల్లాలో రూ. 3 కోట్లకుపైగా పంట నష్టం అంచనా వేయగా, మొక్కజొన్న, వరి పంటలు 200 హెక్టార్లలో దెబ్బతినడంతో రూ.1.80 కోట్లు పంట నష్టం జరిగినట్లు అంచనా. కర్నూలు జిల్లాలో రూ.2.56 కోట్ల పంట నష్టం అంచనా. విజయనగరం జిల్లాలో మొక్కజొన్న 200 హెక్టార్లలో, వరి 64 హెక్టార్లలో, నువ్వు 60 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. విశాఖ జిల్లాలో 51.81 హెక్టార్ల వరి తడిసింది. 98.20 హెక్టార్లలో నువ్వు, 5 హెక్టార్లలో పొద్దు తిరుగుడు, వేరుశనగ పంటలకు నష్టం వాటిల్లింది. -
అకాల వర్షాలు: పంట నష్టంపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, పంట నష్టంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట నష్టం వివరాలను వెంటనే నమోదు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, యుద్ధ ప్రతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పిడుగుపాటు, బోటు ప్రమాదాల్లో మరణించినవారికి 24 గంటల్లో పరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్లను సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, హెల్త్ చీఫ్ స్పెషల్ సెక్రటరీ హాజరయ్యారు. ఇక పంటలు చేతికొచ్చి కోయాల్సిన సమయంలో అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట నేలపాలయ్యింది. ఈదురు గాలులతో కూడిన వాన రైతుల్ని అతలాకుతలం చేసింది. వందల ఎకరాల్లోని పంటలు నేలకొరిగాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అకాల వర్షం: రెండు గ్రామాల్లో పెనువిషాదం
కృత్తివెన్ను(పెడన): గంగపుత్రులకు ఆధారం సాగరం.. సాయమందించేది వల.. కడుపునింపేది వేట. ఉవ్వెత్తున ఎగసే అలలతోనే నిత్యం పోరాటం చేస్తారు.. కష్టమైనా, నష్టమైనా.. రాత్రయినా, పగలైనా బతుకు పోరు సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటారు. అదే ఆశతో వలలు పట్టుకుని కడలిలోకి వెళ్లారు కృత్తివెన్ను మండల పరిధిలోని మత్స్యకారులు. వేట ముగిసింది. ఇక తిరిగెళ్లి పోదాం అనుకుంటున్న తరుణంలో.. అనుకోని విపత్తు వారి ఆశలను చిదిమేసింది. పెనుగాలి రూపంలో సాగరం మధ్యలో తాండవమాడి వారిని కడలి ఒడిలోకి లాగేసుకుంది. వారి కుటుంబ సభ్యులను శాశ్వత శోకంలో నింపేసింది. మండల పరిధిలోని మత్య్సకార గ్రామాలైన పల్లెపాలెం, ఒర్లగొందితిప్పలకు చెందిన ఆరుగురు గంగపుత్రులు వేటకు సముద్రంలోకి వెళ్లి గల్లంతయ్యారు. వీరిలో నలుగురి మృత దేహాలు లభ్యం కాగా.. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్‌లు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు.. ఒర్లగొందితిప్ప గ్రామానికి చెందిన జల్లా వెంకటేశ్వరావు (52) అతని కుమారులు దావీదు (23), ఏసురాజు.. వెంకటేశ్వరరావు సోదరుడు జల్లా పెద్దిరాజులు (60) ఇతని కుమారుడు మత్యాలరాజులు బుధవారం రాత్రి సమీపంలోని సముద్రపు ముఖద్వారం వద్దనున్న వలకట్టు వద్ద చేపలవేటకు వెళ్లారు. రాత్రంతా చేపల వేట సాగించి తెల్లవారు జామున ఇంటికి బయలు దేరుతుండగా ఒక్కసారిగా ఉప్పెనలా పొంగిన సముద్రం, ఆపై పెనుగాలులు, వడగండ్ల వర్షంతో ఒక్కసారిగా వారి పడవలు బోల్తాపడ్డాయి. వెంకటేశ్వరరావు, అతని కుమారుడు దావీదు, సోదరుడు పెద్దిరాజులు సముద్రంలో గల్లంతవగా, ముత్యాలరాజు తాటిపట్టెసాయంతో బయటపడ్డాడు. ఏసురాజు సముద్రం లోపలకి పోగా అదృష్టవశాత్తు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. సోదరులైన వెంకటేశ్వరరావు, పెద్దిరాజుల మృతదేహాలు లభ్యం కాగా వెంకటేశ్వరరావు కుమారుడు దావీదు ఆచూకి తెలియాల్సి ఉంది. వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయక.. కృత్తివెన్ను పల్లెపాలెంకు చెందిన వారిది మరోగాథ. ఇక్కడ నుంచి 15 మంది బుధవారం రాత్రి గ్రామానికి సమీపంలోని సముద్రపు పాయలో వలకట్లు వద్దకు చేపలకోసం వెళ్లారు. వీరంతా తమ పని పూర్తి చేసుకుని తెల్లవారుజామున తిరుగుపయనమవ్వగా ఒక్కసారిగా పెనుగాలులు వీచడంతో వారి పడవ నీటిలో బోల్తాపడిపోయింది. దీంతో వారంతా నీటిలో మునిగిపోగా 12 మంది ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా వనమాలి వెంకటేశ్వరరావు (61), మోకా నాగేశ్వరరావు (64), బలగం నరసింహమూర్తి (62)లు నీటిలో మునిగి గల్లంతయ్యారు. వీరిలో రెండు మృతదేహాలు లభ్యం కాగా నరసింహమూర్తి కోసం గాలింపు కొనసాగుతోంది. చనిపోయిన వారు ముగ్గురు 60 ఏళ్లు పైబడిన వారే.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వృద్ధాప్యంలో కూడా వారు సాహసించి ప్రాణాలను ఫణంగా పెట్టి వేటకు వెళ్లి మరణించిన ఘటన అందరిని కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండ.. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుంటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే జోగి రమేష్‌తో కలసి కృత్తివెన్ను, ఒర్లగొందితిప్ప గ్రామాలను సందర్శించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఏసురాజు, ముత్యాలరాజులను ప్రమాద ఘటన గురించి వివరాలడిగి తెలుసుకున్నారు. మరణించిన ఒక్కొక్క కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థికసాయం ప్రభుత్వం నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, ఫిషరీష్ జాయింట్ డైరెక్టర్ లాల్‌మహ్మద్, డీడీ రాఘవరెడ్డి, డీఎస్పీ మహబూబ్‌బాషా, బందరు ఆర్డీవో ఖాజావలీ, పార్టీ మండల కని్వనర్ గంగాధర్, పార్టీ నాయకులు ఉన్నారు. -
ఉద్యాన పంటల నష్టం రూ.29.74 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ మొదటి వారం నుంచి రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, బలమైన ఈదురు గాలులతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతినగా.. అరటి, బొప్పాయి, మిరప, నిమ్మ, కూరగాయలు సాగు చేసిన రైతులు నష్టపోయారు. జిల్లాల వారీగా అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక నివేదిక రూపొందించారు. పెద్దపల్లి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, జనగామ తదితర జిల్లాల్లో ఉద్యాన పంటలు ఎక్కువ విస్తీర్ణంలో దెబ్బతిన్నాయి. ప్రాథమిక నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 41,383 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 38,653 ఎకరాల (93 శాతం) విస్తీర్ణంలో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. నిమ్మ, బత్తాయి తోటలతో పాటు మిరప, సపోట, బొప్పాయి పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఏప్రిల్ 7 నుంచి 24 మధ్య ఉద్యాన పంటలకు జరిగిన నష్టం రూ.29.74 కోట్ల మేర ఉంటుందని ఉద్యాన శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. జిల్లాల వారీగా ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించిన నేపథ్యంలో, ప్రభుత్వం నుంచి అందే ఆదేశాల మేరకు ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై గ్రామాలు, రైతుల వారీగా పూర్తి వివరాలు సేకరిస్తామని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు చాలా చోట్ల ఉద్యాన పంటల నష్టం మొత్తం సాగు విస్తీర్ణంలో 33 శాతం లోపు ఉన్నట్లు ప్రాథమిక నివేదిక వెల్లడిస్తోంది. -
అకాల వర్షాల బీభత్సం
న్యూఢిల్లీ/జైపూర్/భోపాల్/అహ్మదాబాద్: రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలను మంగళవారం రాత్రి భారీ అకాల వర్షాలు కుదిపేశాయి. దీంతో నాలుగు రాష్ట్రాల్లో కలిపి 53 మంది మరణించారని అధికారులు బుధవారం వెల్లడించారు. రాజస్తాన్, గుజరాత్‌ల్లో భారీగా ఆస్తి, పంట నష్టం కూడా సంభవించిందన్నారు. వర్షం కారణంగా అత్యధికంగా రాజస్తాన్‌లో 25 మంది, మధ్యప్రదేశ్‌లో 15 మంది, గుజరాత్లో 10 మంది, మహారాష్ట్రలో ముగ్గురు చనిపోయారు. గుజరాత్లో అకాల వర్షాలు, తద్వారా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి నుంచి గుజరాత్లో మృతుల కుటుంబీకులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేíషియా ప్రకటించారు. దీంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు చనిపోతే మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ గురించి మాత్రమే పట్టించుకుంటున్నారనీ, ఆయన దేశానికి ప్రధానా లేక గుజరాత్‌కు మాత్రమేనా అని ప్రశ్నించారు. అనంతరం ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ట్వీట్ చేస్తూ మధ్యప్రదేశ్, రాజస్తాన్, మణిపూర్‌ల్లోనూ చనిపోయిన వారి బంధువులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు సాయం అందించనున్నట్లు ప్రకటించింది. రాజస్తాన్ మరో రూ. 4 లక్షల సాయం.. వర్షాల వల్ల మరణించిన వారి బంధువులకు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున రాజస్తాన్ ప్రభుత్వం రూ. 4 లక్షలు, గుజరాత్ ప్రభుత్వం రూ. 2 లక్షల నష్ట పరిహారం ప్రకటించాయి. రాజస్తాన్‌లో పంటనష్టాన్ని అంచనా వేస్తున్నామనీ, కొన్ని పశువులు కూడా మరణించాయని అధికారులు చెప్పారు. పంట నష్టానికి కూడా ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని బీజేపీ ఎమ్మెల్యే ఓం బిర్లా డిమాండ్ చేశారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ మృతులకు ట్విట్టర్లో సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు గుజరాత్లో భారీ వర్షాలకు గాలి దుమారం కూడా తోడైంది. పలుచోట్ల వడగళ్ల వాన కూడా కురిసింది. హిమ్మత్‌నగర్ పట్టణంలో మోదీ సభ కోసం ఏర్పాటు చేసిన సామగ్రి కూడా దెబ్బతింది. పంట నష్టంపై సర్వే చేసి నిర్ణయం తీసుకుంటామని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మరణించారు. ప్రభావిత ప్రాంతాలకు చేతనైన సాయం చేస్తామని హోం మంత్రి రాజ్‌నాథ్ హామీనిచ్చారు. 24 గంటల్లో ఉత్తర భారతంలో వర్షాలు.. రానున్న 24 గంటల్లో ఉత్తర భారతదేశంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం అంచనావేసింది. మరోవైపు, అరేబియా సముద్రంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల పంజాబ్, హరియాణా, ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్, బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. వాయవ్య భారతంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఆ విభాగం పేర్కొంది. వర్షాలపై రాజకీయాలొద్దు: మోదీ వర్షాల కారణంగా నాలుగు రాష్ట్రాల్లో మరణాలు సంభవించినా మోదీ గుజరాత్‌కు మాత్రమే సాయం చేస్తున్నారంటూ కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. అకాల వర్షాలపై రాజకీయాలు చేయవద్దని ఆయన పార్టీలను కోరారు. గుజరాత్‌లోని సబర్‌కాంఠా జిల్లాలో మోదీ మాట్లాడుతూ ‘ఈ విషాద సమయాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని నేను పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. విషాదంలో ఉన్నవారికి మనం సాయం చేయాలి. వర్షాల వల్ల నష్టపోయిన వారికి సాంత్వన చేకూర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి’ అని అన్నారు. అస్సాంలో రైలుపట్టాలపై పడిన చెట్లను తొలగిస్తున్న స్థానికులు -
వర్షార్పణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చాయి. కళ్లాల్లో, మార్కెట్ యార్డుల్లోని పంట ఉత్పత్తులు ధ్వంసమయ్యాయి. మిర్చి, సోయాబీన్, కందులు, వేరుశనగ వర్షానికి తడిసిపోయాయి. కరీంనగర్, పెద్దపల్లి, వనపర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 14 మండలాల్లోని 104 గ్రామాల్లో వేసిన పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఆయా జిల్లాల్లో 3,845 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తెలిపింది. 2,077 మంది రైతులు నష్టపోయినట్లు నివేదిక వెల్లడించింది. ప్రధానంగా 2,708 ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతిన్నది. మొక్కజొన్న పంటకు 679 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. 220 ఎకరాల్లో వరి నీట మునిగింది. అయితే వ్యవసాయశాఖ నష్టాన్ని అంచనా వేయడానికి అంతగా ఆసక్తి చూపించడంలేదు. ఈ కొద్దిపాటి దానికి ఎందుకు హంగామా అన్న ధోరణి ప్రదర్శిస్తుందన్న ఆరోపణలున్నాయి. అనధికారిక అంచనా ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల ఎకరాలకు పైనే పంట నష్టం జరిగి నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతో 200 ఎకరాల సోయాబీన్, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న.. 100 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా రైతులకు రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. వరంగల్ రూరల్ జిల్లాలో 2,250 ఎకరాల్లో, భూపాలపల్లి జిల్లాలో వందలాది ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లింది. భారీ వర్షాలతో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. లేత కంకులు విరిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఏరిన మిర్చిని కళ్లాల్లో పెట్టిన రైతులకు మాత్రం ఈ వర్షాలు కడగండ్లు మిగిల్చాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొన్నిచోట్ల కళ్లాల్లోని మిర్చి వర్షం నీటిలో కొట్టుకుపోయింది. అలాగే మార్కెట్ యార్డుల్లో విక్రయానికి తీసుకువచ్చిన కందులు, వేరుశనగ కూడా తడిసిపోయాయి. కొన్నిచోట్ల కంది చేలు దెబ్బతిన్నట్లు, వర్షానికి కాయ రాలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. చివరితీతలో ఉన్న పత్తి కూడా ఈ వర్షానికి దెబ్బతిన్నది. నేడూరేపు పొడి వాతావరణం... హిందూ మహాసముద్రం దాన్ని ఆనుకుని ఉన్న అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. అయితే మంగళ, బుధవారాల్లో మాత్రం పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా గత 24 గంటల్లో రాష్ట్రంలో అనేకచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లా కొణిజర్లలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చండ్రుగొండలో 6 సెంటీమీటర్లు, ఆర్మూరు, డోర్నకల్, తల్లాడ, నల్లగొండ, దేవరకొండ, సూర్యాపేటలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లాలో పత్తి పూర్తిగా తడిసిపోయింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా పడిపోయాయి. సాధారణం కంటే రెండు నుంచి తొమ్మిది డిగ్రీల వరకు తగ్గిపోయాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణానికి అటుఇటుగా నమోదయ్యాయి. మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలు నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పలుచోట్ల జనం చలితో ఇబ్బందిపడ్డారు. నగరంపై పొగమంచు పంజా... రాజధానిపై మరో రెండురోజులపాటు పొగమంచు దుప్పటి కమ్మేసే అవకాశాలున్నట్లు బేగం పేటలోని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో నగరంలో గత మూడు రోజులుగా ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైన విషయం విదితమే. అయితే ప్రస్తుతానికి అల్పపీడన ద్రోణి బలహీనపడినప్పటికీ మంగళ, బుధ వారాల్లో ఆగ్నే య, దక్షిణ దిశ నుంచి వీస్తున్న తేమ, వేడి గాలులతో తెల్లవారుజామున ఆకాశం మేఘావృతమై పొగమంచు దుప్పటి కమ్ముకునే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులు, ఉబ్బసం వ్యాధిగ్రస్తులు, చిన్నారులు, వృద్ధులు బయటికి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళ పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయన్నా రు. కాగా సోమవారం నగరంలో గరిష్టంగా 21.2, కనిష్టంగా 17.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 94 శాతం గా నమోదైంది. సాధారణం కంటే 9 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం, గాలిలో తేమ అనూహ్యంగా పెరగడంతో ప్రజలు చలితో ఇబ్బందిపడ్డారు. -
మబ్బే.. ముసురేసిందిలే..
సాక్షి, హైదరాబాద్: రోజంతా మబ్బు.. ఉదయమే చీకటైనట్లు.. రోజంతా సన్నగా వర్షం.. ఆకాశానికి లీకేజీ పడ్డట్లు.. రెండ్రోజులుగా రాష్ట్రంలో వర్షాలు.. వాటికి చలిగాలులు తోడవడంతో జనం గజగజలాడుతున్నారు. అటు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి.. ఇటు తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం.. దీంతో ఈ ఆవర్తనం నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి బలహీన పడింది. వీటి ప్రభావాల కారణంగా తెలంగాణలో రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట జిల్లా నంగనూరులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌లో పలుచోట్ల 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లోనూ 3 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో శనివారం సాయం త్రం నుంచి మొదలైన చిరు జల్లులు ఆదివారం కూడా కొనసాగాయి. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పగలు తగ్గి.. రాత్రి పెరిగి.. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పడిపోగా, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం ఎక్కువగా నమోదయ్యాయి. ఖమ్మంలో రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా 24 డిగ్రీలు నమోదైంది. అక్కడే పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు తగ్గి 28 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా 18 డిగ్రీలు నమోదు కాగా, పగటి ఉష్ణోగ్రత 3 డిగ్రీలు తక్కువగా 27 డిగ్రీలు రికార్డయింది. రామగుండంలో పగటి ఉష్ణోగ్రత 9 డిగ్రీలు తక్కువగా 22 డిగ్రీలు నమోదైంది. అక్కడ రాత్రి ఉష్ణోగ్రత 2 డిగ్రీలు ఎక్కువగా 18 డిగ్రీలు నమోదైంది. నిజామాబాద్‌లోనూ పగటి ఉష్ణోగ్రత 8 డిగ్రీలు తక్కువగా 24 డిగ్రీలు నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రత 2 డిగ్రీలు ఎక్కువగా 18 డిగ్రీలు నమోదైంది. రబీ పంటలకు ఊతం.. ఈ వర్షాలకు రబీ పంటలతో మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ పేర్కొంది. వరి, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటలకు ప్రయోజనం ఉం టుందని ఆ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయకుమార్ తెలి పారు. భూగర్భ జలాలు పెరిగి వరికి మరింత ఊతమిస్తుందని విశ్లేషించారు. రబీ సీజన్లో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 20.26 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు చేశారు. అందులో ఆహార పంటలు ఇప్పటివరకు 16.08 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 10.2 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. మొక్కజొన్న 2.47 లక్షల ఎకరాల్లో సాగైంది. వేరుశనగ ఇప్పటివరకు 2.61 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇప్పటివరకు రబీ సీజన్లో సాగు కాని చోట్ల ప్రస్తుత వర్షాలతో పుంజు కుంటుందని అధికారులు అంటున్నారు. తడిసిన ధాన్యం, మిర్చి.. రబీధాన్యం, మిర్చి పంటలు కొన్నిచోట్ల మార్కెట్లోకి వచ్చాయి. ముందు జాగ్రత్తలు తీసుకోని చోట్ల అక్కడక్కడ వరి, మిర్చి పంటలు తడిసిపోయాయని మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఎంతమేరకు తడిసిందో ఇంకా సమాచారం రాలేదని అంటున్నారు. కొందరు రైతులు మార్కెట్లోనే ఉంచి పోవడంతో తడిసి ఉంటుందని పేర్కొంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో మిర్చిపంట దెబ్బతిన్నది. దుగ్గొండి, నర్సంపేట, పరకాల, దామెర, ఆత్మకూరు, భూపాలపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో మొత్తం ఆరు వేల ఎకరాల్లో చపాటా రకం మిరప పంట సాగుచేశారు. విదేశాలకు ఎగుమతి చేసే ఈ చపాటా రకం పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో అక్కడక్కడా ఇటీవల వేసిన మొక్కజొన్న పంట నేల వాలిన ట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. పెద్దపల్లి మం డలం రాఘవాపూర్‌లో 8 మంది పెంపకందారులకు చెందిన 96 గొర్రెలు వర్షానికి మృత్యువాత పడటంతో వారికి లక్షల్లో ఆర్థిక నష్టం జరిగింది. -
ఉత్తరాదిపై ఉరిమిన తుపాను
పట్నా/లక్నో: ఉత్తరాది రాష్ట్రాలపై ప్రకృతి కన్నెర్ర చేసింది. భారీ వర్షాలు, పిడుగుపాట్లు, పెనుగాలులు బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లలో బీభత్సం సృష్టించాయి. ఈ 4 రాష్ట్రాలో 54 మంది మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో చెట్లు కూలకూలాయి. ఇళ్లు, గుడిసెలు నేలమట్టమయ్యాయి. సోమవారం రాత్రి నుంచి తుపాను తీవ్రరూపం దాల్చింది. బిహార్‌లో 19 మంది, ఉత్తరప్రదేశ్‌లో 17 మంది, జార్ఖండ్‌లో 12 మంది, మధ్యప్రదేశ్‌లో నలుగురు, పశ్చిమ బెంగాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. ఈ నెలలో అకాల వర్షాలకు దేశవ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 290కి చేరింది. బిహార్‌లో బెంబేలెత్తించిన పిడుగులు.. తుపాను ప్రభావం అధికంగా ఉన్న బిహార్‌లో గంటకు 70 కి.మీ.కు పైగా వేగంతో పెనుగాలులు వీచాయి. గయ, ఔరంగాబాద్ జిల్లాల్లో సోమవారం రాత్రి ఐదుగురు చొప్పున మృతిచెందినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. ఇంకా ముంగర్, కతియార్, నవాడా జిల్లాల్లోనూ ప్రాణనష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఔరంగాబాద్‌లో పిడుగుపాటుకు మృతిచెందినవారిలో ఇద్దరు మహిళలున్నారు. గయలో ఇంటి పైకప్పులు, చెట్లు కూలిపోవడంతో మరణించినవారిలో ఇద్దరు మహిళలు, బాలుడు, బాలిక ఉన్నారు. ఇదే జిల్లాలో ఇద్దరు బాలికలు, బాలుడు గాయపడ్డారు. ముంగర్‌లో పిడుగుపాటుకు ముగ్గురు పిల్లలు సహా నలుగురు చనిపోయారు. నవాడా జిల్లాలో పిడుగుపాటు 16 ఏళ్ల బాలిక, 45 ఏళ్ల వ్యక్తిని బలితీసుకుంది. కతియార్‌లో విరిగిపడిన చెట్టు కింద నలిగి 70 ఏళ్ల వృద్ధుడు, 11 ఏళ్ల బాలిక, 45 ఏళ్ల మహిళ మరణించారు. ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసిన బిహార్ సీఎం నితీశ్‌కుమార్ బాధిత కుటుంబాలకు పరిహారం పంపిణీలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. యూపీలో 17 మంది మృత్యువాత.. యూపీలో 17 మంది మృతిచెందగా, మరో 10 మంది గాయపడినట్లు సీనియర్ అధికారి చెప్పారు. అందులో ఉన్నావ్‌లో ఆరుగురు పిడుగుపాటు, వర్షానికి బలికాగా, రాయ్‌బరేలీలో ముగ్గురు, కాన్పూర్, పిలిబిత్, గోండా జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించినట్లు తెలిపారు. తుపాను ధాటికి రాయ్‌బరేలీ, ఉన్నావ్ జిల్లాల్లో పలు గుడిసెలు నేలకూలినట్లు చెప్పారు. హర్దోయ్–ఉన్నావ్ రహదారిపై చెట్లు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. బాధితులకు సాధ్యమైనంత త్వరగా ఉపశమనం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు ప్రిన్సిపల్ కార్యదర్శి(సమాచార శాఖ) అవినాశ్ అవస్తి తెలిపారు. మరోవైపు, పశ్చిమబెంగాల్లోని మాల్డా జిల్లాలోనూ భీకర గాలులకు ఇళ్లు కూలిపోవడంతో ఇద్దరు మరణించారు. కర్ణాటకలో బీభత్సం మంగళూరు: కర్ణాటకలోని పలు ప్రాంతాలను మంగళవారం వర్షాలు ముంచెత్తాయి. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో వరుసగా మూడోరోజూ భారీ వర్షాలు కురవడంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్ణాటక ప్రభుత్వానికి కేంద్రం నుంచి అవసరమైన సాయం అందించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. మంగళూరులో పరిస్థితిని సమీక్షించామనీ, సహాయక చర్యల్లో పాల్గొనేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) నుంచి అదనపు బృందాలను అక్కడకు పంపుతున్నామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా మంగళూరు నగరంలో వర్షం కురిసిందనీ, అనేక ప్రాంతాల్లో భవనాలు సగం వరకు మునిగాయని అధికారులు చెప్పారు. ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో విద్యాసంస్థలకు బుధవారం సెలవు ప్రకటించారు. పాఠశాలలో చిక్కుకున్న పిల్లలను పడవల సాయంతో సిబ్బంది కాపాడారు. వందకుపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. మంగళూరులో వరద ప్రాంతాల నుంచి విద్యార్థులను తరలిస్తున్న సిబ్బంది -
తాపం తగ్గించకుంటే శాపమే!
సమకాలీనం కావాలని కళ్లు మూసుకొని, ‘వాతావరణ మార్పు’ను అంగీకరించేందుకు అమెరికా వంటి అగ్రరాజ్యాలు నిరాకరిస్తున్నాయి. ఈ అనర్థానికి వారే తొలి దోషులవడం అందుకు కారణం. అజ్ఞానం, బాధ్యతా రాహిత్యంతో ‘మార్పు’ అంగీకరించడానికి మనమూ నిరాకరిస్తే.... ప్రథమ బాధితులం మనమే! ఈ ముప్పు అనివార్యమవడంతో, అభివృద్ధి చెందిన దేశాలన్నీ విరుగుడు చర్యలతో దూసుకుపోతున్నాయి. మన ప్రభుత్వాలే బాధ్యత వహించాలంటే చాలదు. నిజమే! వారి వైఖరి మారాలి. కార్పొరేట్లు దీన్నొక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. తమ స్థాయిలో ప్రతి చిన్న చర్యతో భూతాపోన్నతి తగ్గిస్తామని పౌరులు పూనికవహించాలి. పిడుగుపాటుకు మను షులు చనిపోతారని విన్నాం కానీ, ఇంత మందా? ఒకేరోజు 13 మంది! ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు నెలల్లో 62 మంది పిడుగుపాటుకు గురై చనిపోగా, ఉత్తర కోస్తాలోనే 37 మంది మరణిం చారు. పొరుగున ఉన్న ఒడిశాలో కిందటేడు 36 గంటల వ్యవధిలో 34 మంది చనిపోయారు. ఈ సంవత్సరం ఏపీలో పదమూడు గంటల వ్యవధిలో 36,749 పిడుగుపాట్లు చోటుచేసుకున్నాయి. (కొన్ని భూమివైపొచ్చి పిడుగులయ్యాయి, మరికొన్ని మేఘాల మధ్యే మెరుపులుగా ముగిసాయి). ఇదంతా ఏమిటి? అంటే, నిపుణులు కూడా ‘ఏమో...! ఇదైతే అసాధారణమే!!’ అంటున్నారు. కొందరు శాస్త్రవేత్తలు భూతాపం పెరగటం వల్ల వచ్చిన ‘వాతావరణ మార్పుల (క్లైమెట్ చేంజ్) కారణంగానే’ అంటే... చాలా మంది నమ్మట్లేదు. ‘ఆ.. మీరు అన్నిటికీ వాతావరణ మార్పు కారణం అంటారులే’ అన్నట్టు ఓ అపనమ్మకపు చూపు చూస్తున్నారు. గత రెండేళ్లుగా పెచ్చు మీరిన వడదెబ్బ చావులయినా, అకాలవర్షాలు–వరదలతో ముప్పైనా, ఇప్పుడీ పిడుగుపాటు మరణాలయినా, ఉత్తరాదిని హడలెత్తిస్తున్న ఇసుక తుపాన్లు–వేడిగాలి దుమార మైనా..... అంత తీవ్రత చూపడానికి వాతావరణ మార్పే కారణం అని పర్యావరణ వేత్తలు వెల్లడిస్తు న్నారు. పారిస్ సదస్సులో ప్రపంచ దేశాలు ఆందో ళన చెందినట్టు, భూతాపోన్నతి వల్ల ప్రమాదం ముంచుకొస్తుందనే విషయాన్ని అందరూ అంగీ కరించినా, ఇంత త్వరగా ఈ ప్రతికూల ప్రభావం ఉంటుందని ఎవరూ అనుకోలేదు. అందుకే, చాలామంది దాన్నంత తీవ్రంగా పరిగణించలేదు. భవిష్యత్ పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయనే ధ్యాస కూడా లేదు. రాబోయే పెనుప్రమాదాలకి ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ స్పష్టమైన సంకేతాలే! ‘వాతావరణ మార్పు’ అన్నది కేవలం పర్యావరణానికే పరిమిత మైన అంశం కాదు. అనేకాంశాల సంకలనం! మార్పు లకు వేర్వేరు కారకాలున్నట్టే, ప్రభావం వల్ల పుట్టే విపరిణామాలకూ వైవిధ్యపు పార్శా్వలున్నాయి. ప్రభుత్వ విధానాలు, మనుషుల సంస్కృతి, ఆహా రపు అలవాట్లు, జీవనశైలి, ప్రకృతి పట్ల నిర్లక్ష్యం, ఎల్లలెరుగని స్వార్థం–సౌఖ్యం... ఇవన్నీ కారకాలు– ప్రభావితాలు అవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యం కొంతయితే, మానవ తప్పిదాలు పెచ్చుమీరి ప్రమా దస్థాయిని ఎన్నోరెట్లు పెంచుతున్నాయి. వాటిని నియంత్రించే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేదు. స్వచ్ఛంద సంస్థలకు తగు చొరవ–ప్రాతినిధ్యం కరువైంది. పౌరులు పూనికవహించడం లేదు. వెరసి సమస్య జటిలమౌతోంది. తీవ్రత గుర్తించి అప్రమత్త మయ్యేలోపే పరిస్థితులు చేయి దాటుతున్నాయి. తెలివితో ఉంటే మంచిది వాతావరణ మార్పు, మెళ్లో పెద్ద బోర్డు తగిలించు కొని వచ్చే భౌతికాకారం కాదు. ఈ రోజు (గురు వారం) హైదరాబాద్‌లో కురిసిన వర్షాన్నే తీసు కోండి. మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్మలాకాశం, నగరమంతా చిట్టుమని కాసిన ఎండ. అరగంటలోనే ఏమైందో అన్నట్టు ఉరుకులు పరుగులతో కమ్ము కొచ్చిన మబ్బులు. ఆకాశమంతా నల్ల టార్పాలిన్ కప్పేసినట్టు, నిమిషాల్లో కుండపోతగా వర్షం. రోడ్లన్నీ జలమయం! ఇదీ క్యుములోనింబస్ మేఘాల దెబ్బ. ‘సాధారణాన్ని మించిన ఉష్ణోగ్ర తలు నమోదయినపుడు ఇది జరుగుతూ ఉంటుం ద’ని నిపుణులు చెబుతున్నారు. వాటి రాకను, ఆ మేఘాల ద్వారా వచ్చే వర్షపాతాన్ని, సగటును అంచనా వేయడం కూడా కష్టం. ఇవే మెరుపులు, ఉరుములు తద్వారా పిడుగుల్ని కురిపిస్తాయి. భూతా పోన్నతి ప్రత్యక్ష ప్రభావమే ఈ పిడుగుపాట్లు! మన దేశంలో పిడుగుపాటు మరణాల పరిస్థితి దారుణం. జాతీయ నేర నమోదు బృందం (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం గత దశాబ్ది, ఏటా సగటున 2000 మంది పిడుగుపాటుతో మరణించారు. తుపాన్లు, వరదలు, వడదెబ్బ, భూకంపాలు... ఇలా ఏ ఇతర ప్రకృతి వైపరీత్యపు మరణాలతో పోల్చినా పిడుగుపాటు మరణాలే ఎక్కువ. గత మూడేళ్లతో పోల్చి చూసినా ఈ సంవత్సరం పరిస్థితి అసాధారణంగా ఉందని వాతావరణ అధికారులే చెబుతున్నారు. ఏ అభివృద్ధి చెందిన సమాజంలో నైనా ఈ మరణాల రేటు తగ్గుతుందే కాని పెరగదు. అమెరికాలో, పిడుగుపాటు మరణాల్ని కచ్చితంగా లెక్కించడం మొదలైన ఈ 75 ఏళ్లలో అతి తక్కువ మరణాలు, కేవలం 16 గత సంవత్సరం నమోద య్యాయి. 2013లో నమోదయిన 23 మరణాల సంఖ్య మీద ఇది రికార్డు! ప్రతి పది లక్షల మంది జనాభాకు పిడుగుపాటు మృతుల నిష్పత్తి అమె రికాలో సగటున 0.3 అయితే, ఐరో పాలో 0.2 గా నమోదవుతోంది. భారత్‌లో ఇది 2గాను, జింబా బ్వేలో 20 గాను, మాలవిలో 84 గాను ఉంది. పిడుగుపాటు మరణాలు అమెరికాలో తగ్గటానికి కారణాలేమిటి? అని ఓ అధ్యయనం జరిగింది. ప్రజల్లో అవగాహన పెరగటం, పిడుగు నిరోధక నిర్మాణాలు, సకాలంలో వాతావరణ హెచ్చరికలు, వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే మనుషుల సంఖ్య తగ్గడం ప్రధాన కారణాలుగా తేలింది. ఆ తెలివిడి మనకూ ఉండాలి. వేడి తగ్గించుకుంటే, చెట్లు సమృ ద్ధిగా ఉంటే పిడుగులు మనుషుల జోలికీ, ఏ ఇతర జీవుల జోలికీ రావు. ఒత్తిడి పెంచుతున్నాం! భూపర్యావరణంలో ఉష్ణోగ్రత అసాధారణమైనపుడు మేఘాలపై ఒత్తిడి పెరిగి పైకి, పైపైకి అతి శీతలంవైపు వడివడిగా సాగుతాయి. ఫలితంగా మేఘాల్లో అంతర్గతంగా ఆ తాడనంలో పుట్టే మెరుపు నిజానికొక విద్యుత్ విడుదల! అత్యధిక సందర్భాల్లో ఇది మేఘాల మధ్యే జరిగి మనకొక మెరుపులా కన బడుతుందంతే! కానీ, తీవ్రంగా ఉన్నపుడు అట్టడు గున ఉండే మేఘ వరుసవైపునకు వస్తూ రుణావేశం (నెగెటివ్ చార్జ్)గా పనిచేస్తుంది. వర్షపు మేఘం– భూమి మధ్య అసమతౌల్యతను సవరించే క్రమంలో ఈ రుణావేశం, కిందికి పయనించి... భూమిపైని ధనావేశం (పాజిటివ్ చార్జ్)తో కరెంట్‌గా కలిసి పిడు గవుతుంది. ఇది సాధారణంగా మనిషిని యాంటెన్నా చేసుకోదు. భూమ్మీద టవర్లనో, ఎల్తైన నిర్మాణాలనో, చెట్లనో, కడకు భూమినో వాహకంగా ఎంచుకుం టుంది. అందుకే చెట్ల కింద, రక్షణ లేని టవర్ల వద్ద, ఇంటి బాల్కనీల్లో, ఆరు బయట నిలబడొద్దంటారు. పరంపరగా మెరుపులొస్తున్నపుడు సెల్‌ఫోన్, ల్యాండ్ ఫోన్ మాట్లాడొద్దంటారు. భూమితో ‘ఎర్తింగ్’ అయ్యేలా ఉండొద్దంటారు. మేఘాల్లో పుట్టే ఈ నెగెటివ్ చార్ఎ్జ సగటున గంటకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో భూమివైపు వస్తుంటుంది. గాలి బలహీన వాహకం అవడం వల్ల మెరుపు పుట్టినపుడు ఉద్భవించే ఉష్ణం ఆ గాలిని అత్యంత వేగంగా వ్యాపింప/కంపింప చేయడం వల్లే ఆకాశంలో పెద్ద శబ్దాలతో ఉరుములు పుడతాయి. ఈ మెరుపు ఓ బలహీన వాహకం (గాలి)లో పుట్టించే ఉష్ణం (53,540 డిగ్రీల ఫారెన్హైట్) సూర్యుని ఉపరితల ఉష్ణం(10,340 డిగ్రీల ఫారెన్హైట్) కన్నా అయిదు రెట్లు అధికం! అందుకే, ఈ కరెంటు ఒక చెట్టులోకి వ్యాపించినపుడు పుట్టే ఉష్ణం ఆ చెట్టులో ఉండే మొత్తం తేమను లాగి మోడు చేస్తుంది. పిడుగు స్థాయిని బట్టి కొన్నిసార్లు బతికి, మనుషులు ఏదో రకమైన వైకల్యానికి గురవుతారు. ఇక మన తెలుగు భూభాగంపై ఈసారి పిడుగుల తాకిడి పెరగటానికి ఓ కారణాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అరేబియా సముద్రం నుంచి వచ్చే శీతల మేఘాలు, ఉత్తర భారతం నుంచి వేడిగాలులు కలవడంతో కరెంట్ వల్ల 124 మైళ్ల మేర మేఘాచ్ఛాదనం ఏర్పడిందని, అదే ఇందుకు కారణమై ఉండవచ్చని ఓ అభి ప్రాయం. నియంత్రిస్తేనే మనుగడ తెలిసి తెలిసీ... మనం మన దైనందిన చర్యల ద్వారా భూతాపోన్నతికి కారణమౌతున్నాం. పారిస్ ఒప్పం దంలో భాగంగా పెద్ద హామీలిచ్చి వచ్చాక కూడా మన ప్రభుత్వ విధానాలు మారలేదు. వివిధ సంస్థల నిర్వాకాలు, కార్పొరేట్ల కార్యకలాపాలు, వ్యక్తుల ప్రవర్తన, జీవనశైలి... దేనిలోనూ మార్పు రాలేదు. శిలాజ ఇంధన వినియోగం తగ్గలేదు. జలరవాణా ఊసే లేదు! ఆశించిన స్థాయిలో థర్మల్ విద్యుదు త్పత్తి తగ్గలేదు. పైగా భూగర్భ గనుల కన్నా ఉప రితల గని తవ్వకాల్నే ప్రోత్సహిస్తూ కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాం. బొగ్గుతో విద్యుదుత్పత్తిలో ‘సూపర్ క్రిటికల్’ వంటి ఆధునిక సాంకేతికతకు మారకుండా, పాత ‘సబ్–క్రిటికల్’ పద్ధతిలోనే సాగి స్తున్నాం. కార్బన్‌డయాక్సైడ్‌ను విరివిగా విడుదల చేయడమే కాక జలాన్ని విస్తారంగా దుర్వినియో గపరుస్తున్నాం. సౌర–పవన విద్యుత్తు వాటా పెద్దగా పెరగలే! ఇకపై ప్రతి కొత్త వాహనం విద్యుత్ బ్యాటరీతో నడిచేదే రావాలన్న మాట గాలికి పోయింది. అడవుల విస్తీర్ణ శాతం పెంచాలన్నది ఉట్టి మాటయింది. పైగా, 1988 జాతీయ అటవీ విధా నానికి తూట్లు పొడుస్తూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రూపొందించిన తాజా ముసాయిదా ఇప్పుడు ప్రజాభిప్రాయం కోసం వారి ముందుంది. దీన్ని నిశి తంగా ఖండిస్తూ ప్రజలు, పౌరసంఘాలు చేతన పొంది కేంద్ర ప్రభుత్వంపై ఏ మేరకు ఒత్తిడి తెస్తాయో చూడాలి! చేయీ చేయీ కలిపితేనే.... కావాలని కళ్లు మూసుకొని, ‘వాతావరణ మార్పు’ను అంగీకరించేందుకు అమెరికా వంటి అగ్రరాజ్యాలు నిరాకరిస్తున్నాయి. ఈ అనర్థానికి వారే తొలి దోషు లవడం అందుకు కారణం. అజ్ఞానం, బాధ్యతా రాహి త్యంతో ‘మార్పు’ అంగీకరించడానికి మనమూ నిరా కరిస్తే.... ప్రథమ బాధితులం మనమే! ఈ ముప్పు అనివార్యమవడంతో, అభివృద్ధి చెందిన దేశాలన్నీ విరుగుడు చర్యలతో దూసుకుపోతున్నాయి. మన ప్రభుత్వాలే బాధ్యత వహించాలంటే చాలదు. నిజమే! వారి వైఖరి మారాలి. కార్పొరేట్లు దీన్నొక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. తమ స్థాయిలో ప్రతి చిన్న చర్యతో భూతాపోన్నతి తగ్గిస్తామని పౌరులు పూనికవహించాలి. ఉన్నొక్క సజీవ గ్రహాన్ని కాపాడుకుందాం! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
అకాల వర్షాల బాధితులను కేంద్రం ఆదుకోవాలి
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రైతులకు తగినంత నష్ట పరిహారాన్ని చెల్లించడానికిగాను ప్రత్యేకంగా నిధులను ఇచ్చి ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీటర్లో ట్వీట్ చేశారు. ‘‘రాష్ట్రంలో అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుని తగినంత నష్టపరిహారం చెల్లించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను రాష్ట్రానికి విడుదల చేయాలి. అదే సమయంలో బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు అన్నివిధాలా ప్రయత్నించాలి’’ అని ఈ ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. ప్రాణనష్టం విషాదకరం.. అకాల వర్షాలు, ఉరుములు, పిడుగుల కారణంగా రాష్ట్రంలో ప్రాణనష్టం జరగడం పట్ల జగన్ విచారం వెలిబుచ్చారు. అలాగే పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన మరో ట్వీట్ చేశారు. ‘‘ఏపీలో అకాల వర్షాలకు ప్రాణనష్టం జరగడం అత్యంత విషాదకరం. ఈ వర్షాల కారణంగా భారీగా పంటలు నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించి వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే బాధితులకు పరిహారాన్ని తక్షణం చెల్లించాలి’’ అని ఈ ట్వీట్లో ఆయన కోరారు. -
తడిసిన పంటను కొనుగోలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: వడగళ్ల వర్షాలతో తడి సిన పంటను ప్రభుత్వ మే కొనుగోలు చేయా లని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శించాలని కాంగ్రెస్ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. భారీగా కురిసిన వర్షాలతో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారని, వరితో పాటు మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా దాదాపు 10 మంది రైతులు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా లక్షలాది ఎకరాల్లో పంటలు నష్టపోవడమే కాకుండా మార్కెట్లోకి వచ్చిన వరి, ఇతర వ్యవసాయ ఉత్పత్తు లు తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ప్రభు త్వం వెంటనే గ్రామాల్లోకి అధికారులను పంపి పంట నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం తరహాలో రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. పిడుగుపాటుతో మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. -
రాష్ట్రంలో ప్రచండ గాలుల బీభత్సం
సాక్షి నెట్వర్క్: పట్టపగలే కారుమబ్బులు.. వందల ఏళ్లనాటి వృక్షాలను కూకటివేళ్లతో కూల్చేసే ప్రచండ గాలులు.. ఉరుము లేని పిడుగులా కాలం కాని కాలంలో కుండపోత! గురువారం ఒక్కసారిగా కురిసిన అకాల వర్షం రాష్ట్రాన్ని ఆగమాగం చేసింది. అనేక జిల్లాల్లో చేతికొచ్చిన పంట నేలపాలైంది. చాలాచోట్ల మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మామిడి నేలరాలింది. గుడిసెలు, రేకుల ఇళ్లు, పెంకుటిళ్లు ధ్వంసమయ్యాయి. వర్షం, పిడుగుల ధాటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, నల్లగొండ జిల్లాలో ఇద్దరు, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒకరు మరణించారు. వరంగల్ అతలాకుతలం వర్షానికి వరంగల్ అతలాకుతలమైంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పలుమార్లు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. 163 జాతీయ రహదారిపై చెట్లు కూలిపోవడంతో సుమారు గంట పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగరంలో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా నిలిచిపోయింది. వరంగల్ రైల్వే స్టేషన్లో కరెంటు వైర్లపై గాలికి కొట్టుకువచ్చిన రేకులు, ఫ్లెక్సీలు పడ్డాయి. దీంతో నిప్పులు చెలరేగాయి. చెట్టు కూలి పడడంతో స్టేషన్లో సిగ్నలింగ్ గది కూలిపోయింది. దీంతో గంటన్నర పాటు రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలో సుమారు ఐదు వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో టూరిస్టు బస్సుపై పిడుగు పడటంతో బస్సు అద్దాలు పగిలాయి. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భూపాలపల్లి జిల్లాలో రెండో షిప్టులో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రైతుల కష్టం వర్షార్పణం అకాల వర్షం రైతులను నిండా ముంచింది. పండించిన పంటను రైతులు వ్యవసాయ మార్కెట్లు, ఐకేపీ కేంద్రాలు, జీసీసీ కేంద్రాలకు తెచ్చారు. కొనుగోలు ప్రక్రియ ఆశించినంత వేగంగా లేకపోవడంతో అన్నిచోట్ల ఆరు బయటే ధాన్యం ఆరబోశారు. చాలినన్ని టార్ఫాలిన్ కవర్లు లేవు. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ధాన్యం అంతా తడిసింది. చాలాచోట్ల వరదలో కొట్టుకుపోయింది. ఏనుమాముల మార్కెట్లో భారీ షెడ్డు కూలిపోవడంతో ఆరబోసిన మక్కలు తడిశాయి. పైకప్పు కూలే సమయంలో రైతులు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. ఒక్క ఈ మార్కెట్లోనే పది వేల మిర్చి బస్తాలు తడిశాయి. పరకాల వ్యవసాయ మార్కెట్లో మక్కలు, వడ్లు కలిపి సుమారు రూ.కోటి వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కేశంపేట, మాడ్గుల, షాబాద్ తదితర మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. వికారాబాద్ జిల్లా పరిగి, కుల్కచర్ల, మోమిన్‌పేట, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లో వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. జగిత్యాల జిల్లావ్యాప్తంగా 3,500 హెక్టార్లలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్లో ఆరపోసిన 10 వేల క్వింటాళ్ల మొక్కజొన్న తడిసిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల మార్కెట్ యార్డులో ఎనిమిది వేల బస్తాల వరి ధాన్యం తడిసింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన ధాన్యం తడిసింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు, బెల్లంపల్లిలో మామిడి రైతులు నష్టపోయారు. నల్లగొండ మార్కెట్లో కాంటా వేసిన ధాన్యం తడిసిపోయింది. జనగామ జిల్లా వ్యాప్తంగా 55,000 వరి ధాన్యం బస్తాలు తడిశాయి. వరంగల్ ఏనుమాముల మార్కెట్లో గాలివాన ధాటికి కూలిన షెడ్ -
అకాల వర్షం.. కన్నీటి సేద్యం!
ఆశలన్నీ పంటల మీదే పెట్టుకున్న అన్నదాత కలలను అకాల వర్షాలు పేకమేడల్లా కూల్చేస్తున్నాయి. పంట చేతికొచ్చే దశలో వడగళ్లు ఉసురుపోసుకుంటున్నాయి. వాతావరణంలో చోటుచేసుకున్న పెనుమార్పుల బారినపడి కుదేలైన రైతన్నకు సత్వర పరిహారంతో సాంత్వన చేకూర్చాలి. సేద్యాన్ని నిలబెట్టేందుకు ముందుచూపుతో నిర్మాణాత్మక చర్యలు అవసరమంటున్నారు - డాక్టర్ జె. సురేష్. పెరుగుతున్న భూతాపం వల్ల ఇటీవలి కాలంలో వాతావరణంలో సంభవిస్తున్న పెనుమార్పులు వ్యవసాయాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.ఈ పరిణామం ఆహార భద్రతను ప్రమాదంలోకి నెట్టి ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అభివృద్ధి పేరుతో ప్రబలిన అవాంఛనీయ ధోరణుల వల్ల సహజవనరులపై ఒత్తిడి అధికమైంది. ఈ నేపథ్యంలో మానవాళిపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. గత రెండు నెలల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అకాల వర్షాలు పంటలను తుడిచి పెట్టటాన్ని ఈ పూర్వరంగంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంది. ఉత్తరాదిలో 1.1 కోట్ల హెక్టార్లలో.. మార్చిలో కురిసిన అకాల వర్షాలు ఉత్తర భారతదేశాన్ని కుదిపేసి అన్నదాతను నిలువునా ముంచాయి. తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో సుమారు కోటీ 10 లక్షల హెక్టార్లలో చేతి దాకా వచ్చిన పంటలు నీటి పాలై అన్నదాతలకు అపార నష్టం మిగిల్చాయి. అసలే రుతుపవనాలు సకాలంలో రాక, వర్షపాతం తక్కువై ఖరీఫ్ కలసి రాలేదు. దీంతో రైతులు రబీపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆరుగాలం శ్రమించి ఇబ్బడిముబ్బడిగా పెట్టుడులుపెట్టి పైరు చేతికొచ్చే దశలో వరుణుడు సృష్టించిన విలయంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తెలంగాణలో 2.24 లక్షల ఎకరాల్లో.. ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో పంటలపై విరుచుకుపడిన అకాల వర్షాల పుణ్యమా అని రైతాంగం కుదేలైంది. తెలంగాణలో 2.24 లక్షల ఎకరాల్లో చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. రూ. వందలాది కోట్ల మేరకు వరి, మొక్కజొన్న, పత్తి, జొన్న, సజ్జ, మిరప, పసుపు, కూరగాయ పంటలు, పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. పశువులు, గొర్రెలు, మేకలు మృత్యువాతపడ్డాయి. కోత కోసి కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. మార్కెట్ యార్డుల్లో నిల్వ సదుపాయాలు లేక ఆరుబయట పెట్టిన ధాన్యం తడిసింది. ప్రకృతికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట పెనుశాపంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని 6 జిల్లాలను అకాల వర్షాలు ముంచెత్తాయి. వేల హెక్టార్లలో మామిడి, కొబ్బరి, అరటి, వరి తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కరవు బారిన పడిన తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల గత వర్షాకాలంలో కన్నా అధిక వర్షపాతం నమోదవడం కలవరపరిచే విషయం. విపత్తుల దెబ్బ సేద్యానికే ఎక్కువ ప్రకృతి విపత్తులతో పంటలు భారీగా నాశనమవడం ఏటికేడు పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. గత దశాబ్దకాలంలో విపత్తులు పెచ్చుమీరిన తీరును ప్రపంచ ఆహార సంస్థ(ఎఫ్ఏవో) తాజా అధ్యయనం ఎత్తిచూపింది. 2003-13 మధ్య కాలంలో 48 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 78 సార్లు విరుచుకుపడిన కరవులు, వరదలు వంటి ప్రకృతి విపత్తుల నష్టాన్ని విశ్లేషించింది. అత్యధికంగా 22% మేరకు నష్టపోయింది వ్యవసాయం, అనుబంధ రంగాలేనని ఎఫ్ఏవో లెక్కతేల్చింది. రైతులతోపాటు వ్యవసాయంపై ఆధారపడిన రైతు కూలీలు, గ్రామీణ పేదలు, బీమా సౌకర్యం లేని బడుగు జీవులు సుమారు 250 కోట్ల మంది విపత్తుల ధాటికి అల్లాడారు. ఈ దశాబ్దంలో సుమారు రూ. 7 వేల కోట్ల డాలర్ల మేరకు పంటలకు, పశుసంపదకు తీరని నష్టం వాటిల్లింది. ఆసియా దేశాల్లో అత్యధికంగా 2,800 కోట్ల డాలర్లు, ఆఫ్రికా దేశాల్లో 2,600 కోట్ల డాలర్ల మేరకు నష్టం జరిగిందని అంచనా. భూసేకరణ ఆర్డినెన్స్‌పై జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అకాల వర్షాలకు కుదేలైన రైతుల పట్ల మరింత సానుభూతితో స్పందించే ప్రయత్నం చేశారు. పంట నష్టపోయిన రైతులకిచ్చే పరిహారం మొత్తాన్ని 50 శాతం పెంచారు. పరిహారమిచ్చే నిబంధనను సైతం సడలించారు. ఇకపై 33 శాతం నష్టపోయినా పరిహారమిస్తామని తెలిపారు. ఇది గతంలో 50 శాతంగా ఉండేది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి తెచ్చారు. అస్థిర వాతావరణ పరిస్థితుల్లో బాధిత రైతులను ఆదుకోవటానికి ఈ చర్యలు చాలవు. పరిశోధనలకు పదునుపెట్టాలి అకాల వర్షాలు, వడగండ్ల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రైతును కేంద్రంగా తీసుకొని పంటల బీమా సదుపాయంతో పటిష్ట రక్షణ కల్పించాలి. నివేదికల పేరుతో కాలయాపన చేయకుండా.. సాధ్యమైనంత త్వరగా రైతుకు పరిహారం అందిస్తే సాంత్వన కలుగుతుంది. వాతావరణ మార్పుల ప్రభావంపై పరిశోధనలను వేగిరం చేయాలి. దీనికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన కల్పించటం ద్వారా నష్టాన్ని తగ్గించే వీలుంది. ఇందుకు ఖర్చుపెట్టే ప్రతి డాలరుకు 4 రెట్ల మేరకు విపత్తు నష్టం తగ్గుతుందంటున్న ఎఫ్ఏవో తోడ్పాటు తీసుకోవాలి. కష్టాల కడలిలో కన్నీటి సేద్యం చేస్తున్న అన్నదాతలకు ప్రభుత్వాలు నిండుమనసుతో బాసటగా నిలవాల్సిన సమయమిది! (వ్యాసకర్త : సహాయ ఆచార్యులు, ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం.మొబైల్: 93976 68770) -
అన్నదాతల ఆగ్రహం
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయూలని ఆందోళన న్యూస్‌లైన్ నెట్వర్క్: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతూ కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో రైతులు శనివారం ఆందోళనలు నిర్వహించారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని రోజుల తరబడి తూకం వేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకంలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు వీణవంక-కరీంనగర్ రహదారిపై ధర్నా చేశారు. రామడుగు మండలం వెదిరలో, కోరుట్ల మండలం యెఖీన్‌పూర్‌లో రైతులు ధర్నా, రాస్తారోకో చేశారు. అకాల వర్షాలకు నీటిపాలైన వరితో పాటు తడిసిన విత్తన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలని మానకొండూర్ మండలం చెంజర్ల, గట్టుదుద్దెనపల్లి, హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామాల రైతులు గట్టుదుద్దెనపల్లిలోని సీడ్ గోదాం ఎదుట ధర్నా నిర్వహించారు. వరంగల్ జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్ ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మహబూబాబాద్ నియోజకవర్గంలోని కేసముద్రం గ్రామంలోని కొనుగోలు కేంద్రం ఎదుట రైతులు రాస్తారోకో చేపట్టారు. ఆగిన అన్నదాత గుండె అకాల వర్షంతో జరిగిన నష్టానికి ఇద్దరు రైతులు గుండె ఆగి మరణించారు. వరంగల్ జిల్లా కేసముద్రం మండలం ధన్నసరి గ్రా మంలో కొండ వెంకటయ్య(65)కు రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఈ రబీలో మరో ఎకరం కౌలుకు తీసుకుని వరి, పసుపు వేశాడు. శుక్రవారం కురిసిన అకాల వర్షం వరి మెదలను, పసుపును తడిపేసింది. శనివారం వాటిని చూసి వెంకటయ్య తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో కుప్పకూలాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన గంకిడి మల్లారెడ్డి(65) తనకున్న రెండెకరాల్లో వరి ధాన్యాన్ని పొలం వద్ద కల్లంలో ఆరబోయగా శుక్రవారం కురిసిన వర్షానికి తడిసింది. దీంతో మనోవేదనతో గుండె ఆగి చనిపోయాడు.