prevention measures
-
Breast cancer బ్రెస్ట్ కేన్సర్ ఎందుకు వస్తుంది? ఎలా గుర్తించాలి!
ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో 157 దేశాల్లో మహిళల్లో రొమ్ము కేన్సర్ అత్యంత సాధారణంగా కనిస్తున్న కేన్సర్. 2022లో ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల 70వేల మంది ఈ కేన్సర్ కారణంగా మృత్యువాత పడ్డారు. 2.3 మిలియన్ల మంది మహిళలు బాధ పడుతున్నారు. యుక్తవయస్సు తర్వాత ఏ వయస్సులోనైనా మహిళల్లో ఇది కనిపించవచ్చు. పురుషుల్లో కూడా ఈ తరహా కనిపిస్తున్నప్పటికీ చాలా తక్కువ (దాదాపు 0.5–1 శాతం) కనిపిస్తోంది.అమెరికాలో 8 మంది మహిళల్లో ఒకరు జీవితకాలంలో రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నారు. 2024లో, 310,720 మంది మహిళలు, 2,800 మంది పురుషులు ఇన్వాసివ్ బ్రెస్ట్ కేన్సర్‌కు గురయ్యారని అంచనా. అసలు రొమ్ము కేన్సర్ లేదా బ్రెస్ట్ కేన్సర్ ఎందుకు వస్తుంది. దీన్ని ఎదుర్కోవడం ఎలా అంశాలపై డా. శ్రీకాంత్ మిర్యాల ఎక్స్‌లో ఒక ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన వివరాలు మీకోసం యథాతథంగా..ఆడవాళ్లలో చర్మ కేన్సర్(విదేశీయుల్లో) తప్పితే అత్యంత ఎక్కువగా వచ్చే క్యాన్సరు రొమ్ము కేన్సరు. ఇప్పుడు వస్తున్న కొత్త పద్ధతుల ద్వారా దీన్ని ముందుగానే కనిపెట్టడం అలాగే, చికిత్స వల్ల గత ముఫ్ఫైఏళ్లలో మూడోవంతు మరణాల్ని తగ్గించగలిగాం.సాధరణంగా 50ఏళ్ల కంటే వయసు ఎక్కువున్న వాళ్లలో వస్తుంది, కానీ ఇరవై నుంచి నలభై మధ్యలో కూడా రావటం అరుదు కాదు. 12 ఏళ్లకంటే ముందుగా రజస్వల అయిన వాళ్లలో, 35ఏళ్ల వరకూ ఒక్కసారి కూడా నిండు గర్భిణీ కానివాళ్లలో రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే వీళ్లలో ఈస్ట్రోజన్ హార్మోన్ కి రొమ్ములు ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం వలన. అయితే గర్భం ఎప్పడు వచ్చినప్పటికీ పిల్లలకి ఎక్కువరోజులు పాలివ్వటం వలన తల్లిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి.ఆసియా దేశాల్లో, వ్యయసాయం చేసే ఆడవాళ్లలో పట్టణాల్లో, అమెరికావంటి దేశాల్లో ఉండే మహిళల కంటే పదివంతులు తక్కువగా వస్తుంది. గ్రామాలనుంచి పట్టణాలకి చిన్నప్పుడే వలస వెళ్లిన అమ్మాయిలలో మళ్లీ పట్టణాల్లో వచ్చేంత స్థాయిలోనే రొమ్ము కేన్సర్ వస్తుంది.గర్భనిరోధక మాత్రలు వాడటం వలన రొమ్ముకేన్సర్ వచ్చే అవకాశాలు పెరిగినప్పటికీ అవాంఛిత గర్భాన్ని నివారించటంతో పాటు, అండాశయ, గర్భాశయ కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి.బహిష్టు ఆగిపోయిన తర్వాత వాడే హార్మోన్ రీప్లేసెమెంట్ థెరపీ వలన రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.స్థూలకాయం, మధుమేహం, మద్యం సేవించటం వల్ల కూడా ఈ న్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే కుటుంబంలో ఇంకెవరికైనా ఉంటే ఆ జన్యువుల వలన వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఎలా నివారించాలి?జన్యుపరమైన కారణాలున్నవాళ్లలో కచ్చితంగా వస్తుంది కాబట్టి ముందుగానే రొమ్ములు శస్త్రచికిత్స చేసి తొలగించటం. ఇది అందర్లో కాదు, జన్యులోపాలు ఉన్నవాళ్లలో మాత్రమే. మంచి ఆహారం, వ్యాయామం.అనవసరంగా హార్మోన్ థెరపీ వాడకుండా ఉండటం.స్క్రీనింగ్- అన్నిటికంటే ముఖ్యమైనది. ప్రతిఒక్కరూ వాళ్ల రొమ్ముల్ని అద్దం ముందు అనాచ్ఛాదితంగా నిలబడి పరీక్ష చేసుకోవాలి. ముందుగా రెండిటినీ గమనించాలి. వాటి రూపులో, పరిమాణంలో మునుపటికంటే తేడాలు ఏమైనా ఉంటే చూడాలి. చనుమొనలు ముందులానే ఉన్నాయా? వెనక్కి వెళ్లాయా? రక్తం, చీము, నీరు లేదా బాలింత కాకుండా పాలు ఏమైనా వస్తున్నాయా చూడాలి. చర్మంలో మార్పులు - పుళ్లు, పగుళ్లు, దళసరి అవ్వటం, నారింజ చర్మంలా గుంతలు కనపడటం ఏమైనా ఉందా చూడాలి. తర్వాత ఒకచెయ్యి నాలుగు వేళ్లతో రొమ్మును నాలుగు భాగాలుగా ఊహించి ప్రతీభాగంలో గుండ్రంగా తిప్పుతూ గడ్డలు ఏమైనా తగులుతున్నాయేమో అని చూడాలి, అలాగే పైకి వెళ్లి చంక భాగంలో కూడా చూడాలి. అలాగే రెండో రొమ్ము కూడా పరీక్షించాలి.ఇలా నెలకొకసారి పరీక్ష చేయించుకోవాలి.అలాగే మామ్మోగ్రాం అని ఎక్స్ రే పరీక్ష ఉంటుంది, యాభై ఏళ్లు దాటిన వాళ్లలో ప్రతి రెండేళ్లకి చెయ్యాలి. బిగుతైన రొమ్ములున్నవాళ్లకి కొన్నిసార్లు ఎమ్మారై అవసరం అవుతుంది.ఎలాంటి గడ్డలైనా వైద్యుడికి చూపించాలి. దాన్ని బయాప్సీ చేయించాలి. తద్వారా తర్వాత చికిత్స అవసరమా లేదా అన్నది తేలుస్తారు.ఇప్పటికే కుటుంబంలో రొమ్ము కేన్సర్ వచ్చినవాళ్లు (అమ్మమ్మ, అమ్మ, అక్కా చెల్లెళ్లు) ఉంటే జన్యుపరీక్ష చేయించుకుని, ఎప్పటికప్పుడు వైద్యుడితో రొమ్ములను పరీక్షించుకోవాలి.రొమ్ము కేన్సర్ నుంచి బయటపడటం అది యే దశలో గుర్తించారన్నదాన్ని బట్టి ఉంటుంది. -
కేవైసీ అప్డేట్ చేస్తున్నారా?! పొరపాటున ఇలా చేశారో..
బ్యాంక్/ ఆధార్ కార్డ్ /పాన్కార్డ్ల కేవైసీ అప్డేట్ చేయమంటూ మన ఫోన్లకు మెసేజ్‌లు వస్తుంటాయి. లేదంటే, ఆ ఖాతాలు క్లోజ్ అవుతాయంటూ ఆ మెసేజ్ సూచిస్తుంటుంది. దీంతో అది నిజమే అని నమ్మి ఆ లింక్‌పై క్లిక్ చేసి, మన వివరాలను ఫిల్ చేస్తుంటాం. ఇటీవల కేవైసీ అప్డేట్ అనే మెసేజ్‌ల లింక్స్ వల్ల చాలా మంది ఆర్థికంగా మోసపోతున్నట్టు సైబర్ నివేదికలు చూపుతున్నాయి. కేవైసీతో పాటు క్యాష్‌బ్యాక్, క్రెడిట్‌కార్డ్ రివార్డ్ పాయింట్ల గడువు ముగిసిందని, వివరాలను ఇవ్వమంటూ మోసగాళ్లు మెసేజ్‌ల రూపంలో మోసాలకు పాల్పడుతున్నారు. దేశం మొత్తం నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకుపోతోందన్న విషయం మనకు తెలిసిందే. UPI అనేది డిజిటల్‌గా చెల్లింపులు చేయడానికి వేగవంతమైన పద్ధతిగా అపారమైన ప్రజాదరణను పొందుతోంది. వినియోగదారుడు నగదు/ చెక్కు చెల్లించడానికి మాత్రమే కాదు ఇతరత్రా బ్యాంక్ లావాదేవీలకు ఇంటర్నెట్ ద్వారా లాగిన్ అవడం అన్ని విధాలుగా సమయాన్ని ఆదా చేయడమే ఈ వేగానికి కారణమైంది. అయితే, సౌలభ్యం ఎప్పుడైనా దానికి సంబంధించిన బాధ్యతల వాటాతో వస్తుందన్నది నిజాన్నిగుర్తించాలి. అప్పుడే జరిగే అనర్థాలకు అడ్డుకట్ట వేయగలం. UPI యాప్‌లు అంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్‌లు నగదు లావాదేవీలలో పటిష్టమైనవి, సాంకేతికంగా అత్యంత సురక్షితమైనవిగా పేరొందాయి. అయితే ఫిషింగ్, విషింగ్, స్మిషింగ్, మాల్వేర్, ఐఎమ్ క్లోన్, ఇతర మార్గాలను ఉపయోగించి డబ్బును దొంగిలించడానికి స్కామర్లు సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలతో దాడి చేస్తున్నారు, జాగ్రత్త వహించండి. మోసాలు పలు విధాలు.. బ్యాంక్/ఆధార్ కార్డ్/ పాన్ కార్డ్.. KYCని అప్డేట్ చేయమని వినియోగదారులను కోరుతూ సంక్షిప్త లింక్‌లతో కూడిన ఇ–మెయిల్ లేదా టెక్ట్స్ మెసేజ్ ఎవరికైనా రావచ్చు. తెలియక ఆ లింక్‌పై క్లిక్ చేసి, వివరాలను పూరించవచ్చు. అంతేకాదు, కొందరు బాధితులు OTP వివరాలను కూడా పూరిస్తారు. దీంతో పాటు బాధితుడి అన్ని వివరాలు స్కామర్ల ఫోన్‌కు ఫార్వర్డ్ అవుతాయి. తర్వాత వారు బాధితుడి ఖాతా నుండి నగదును సులువుగా బదిలీ చేసుకుంటారు. రివార్డ్ పాయింట్స్ స్కామర్లు రీఫండ్ / క్యాష్ బ్యాక్/ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల గడువు ముగియడం, వారి వివరాలను ఇవ్వడం వంటి సమస్యల కోసం వినియోగదారులను సంప్రదించేలా మోసగిస్తారు. మోసం చేసే విధానం.. 1. మోసగాళ్ళు సాధారణంగా తమ దృష్టిని ఆకర్షించడానికి ఫోన్ కాల్ చేస్తారు. వారు తమను తాము బ్యాంక్ ప్రతినిధుల్లా చెప్పుకుంటూ, కేవైసీ అప్డేట్లు, బోనస్ పాయింట్ల రిడెంప్షన్, క్యాష్ బ్యాక్‌ల వంటి సాధారణ సమస్య కోసం కాల్ చేస్తారు. 2. కాల్ని చట్టబద్ధంగా చేయడానికి, వారు అసలైన బ్యాంక్ ప్రక్రియను అనుకరిస్తారు. వారు మీ పుట్టిన తేదీ, పేరు, మొబైల్ నంబర్ వంటి ధృవీకరణ ప్రశ్నలను అడగడం కొనసాగిస్తారు. 3. స్కామర్లు సాధారణంగా ఒక తప్పుడు కథనాన్ని సృష్టిస్తారు. సమస్యను పరిష్కరించడానికి బాధితుడు తమ వ్యక్తిగత డేటాను ఇస్తుంటారు. 4. స్కామర్ బాధితుడిని ఒప్పించిన తర్వాత, వారు తమ ఫోన్లో అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేయమని అడుగుతారు. అవి, ఎనీ డెస్క్.. వంటి అత్యంత సాధారణ స్క్రీన్ షేరింగ్ యాప్స్ అయి ఉంటాయి. ఇవి ప్లే స్టోర్ / యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. 5. AnyDesk లేదా మరేదైనా స్క్రీన్ షేరింగ్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసిన తర్వాత, ఇది సాధారణ యాప్ లాగా వినియోగదారు గోప్యతా అనుమతిని అడుగుతుంది. ఈ యాప్‌లు మీ ఫోన్ లోని ప్రతిదానిని యాక్సెస్ చేయగలవని దయచేసి గమనించండి. 6. స్కామర్లు బాధితుడిని వారి ఫోన్ కు వచ్చిన OTP అడుగుతారు. బాధితుడు కోడ్ చెబితే ఆ తర్వాత హ్యాకర్ ఫోన్ నుండి యాక్సెప్ట్ చేయమని కూడా అడుగుతాడు. 7. యాప్ అవసరమైన అన్ని అనుమతులను పొందినప్పుడు, కాలర్ బాధితుడి ఫోన్‌పై వారికి తెలియకుండానే పూర్తి నియంత్రణను పొందడం ప్రారంభిస్తాడు. మీ ఫోన్‌కు పూర్తి యాక్సెస్ పొందిన తర్వాత, స్కామర్ పాస్‌వర్డ్‌లను దొంగిలించి, బాధితుడి UPI ఖాతాతో లావాదేవీలు చేయడం ప్రారంభిస్తాడు. 8. స్కామర్లు డబ్బును దొంగిలించడానికి ఉపయోగించే ప్రత్యామ్నాయ పద్ధతులు ఇవి.. ఎ) మోసగాళ్లు ఎస్సెమ్మెస్ పంపి, దానిని మరొక నంబర్‌కు ఫార్వర్డ్ చేయమని బాధితుడిని అడుగుతారు. సందేశం పంపితే UPI ద్వారా బాధితుడి మొబైల్ నంబర్ లేదా ఖాతాను వారి మొబైల్‌కి లింక్ చేయడానికి స్కామర్‌కి యాక్సెస్ లభిస్తుంది. బి) మోసగాళ్లు గూగుల్ ఫారమ్‌లతో ఉన్న ఎసెమ్మెస్‌లను పంపుతారు. వినియోగదారు పేరు / పాస్వర్డ్ మరియు OTP / UPI వివరాలను పూరించమని అడుగుతారు. సి) ప్రత్యామ్నాయంగా గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎమ్ మొదలైన యాప్‌లలో స్కామర్ (కొనుగోలుదారుల వలె నటించడం) మీ వర్చువల్ చెల్లింపు చిరునామాకు (క్యూ ఆర్ కోడ్) పేమెంట్ రిక్వెస్ట్ పంపుతాడు. స్కామర్ల నుంచి కాపాడుకోవాలంటే... 1. OTP ఎవరికీ షేర్ చేయవద్దు. 2. ఇతరుల నుంచి డబ్బును పొందడానికి మనం OTP చెప్పాల్సిన అవసరం లేదు 3. డబ్బు తీసుకోవడానికి క్యూఆర్ కోడ్లనూ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు 4. మీ స్మార్ట్‌ఫోన్ లో అనుమానాస్పద యాప్‌లను ఉపయోగించవద్దు 5. అధికారిక కస్టమర్ సర్వీస్ నంబర్లను మాత్రమే సంప్రదించండి 6. కార్డ్ నంబర్, CVV, గడువు తేదీలను ఎప్పుడూ ఎవరికీ షేర్ చేయవద్దు ఇతర జాగ్రత్తలు సురక్షితమైన ఆన్ లైన్ లావాదేవీ కోసం https:// లాక్ చిహ్నం కోసం సెర్చ్ చేయండి కాల్లో ఉన్నప్పుడు డబ్బును ఎప్పుడూ బదిలీ చేయవద్దు లేదా పొందవద్దు. తెలియనివారి నుంచి వచ్చిన మెసేజ్‌లలో షార్ట్ లింక్స్ ఫారాలని ఎప్పుడూ పూరించవద్దు. పొరపాటున మోసానికి గురైతే www.cybercrime.gov.in కు రిపోర్ట్ చేయచ్చు. మోసం జరిగిన గంట లోపల హెల్ప్‌లైన్ 1930కి కాంటాక్ట్ చేస్తే మీరు జరిపిన లావాదేవీల ఖాతాలను బ్లాక్ చేస్తారు. ఆ తర్వాత న్యాయం జరిగే దిశగా అడుగులు వేయడానికి ఆస్కారం ఉంటుంది. చదవండి: Cyber Crime Prevention Tips: జాబ్ కోసం వెతుకుతున్నారా..? జాగ్రత్త.. లింక్డ్ ఇన్ ప్లాట్‌ఫారమ్‌లో.. Cyber Crime Prevention Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్ ఉందా?! ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే సంగతులు -
చర్మం మీద మార్పులతో... క్యాన్సర్స్
మన శరీరంలోని అతి పెద్ద అవయవం మన చర్మం. శరీరాన్నంతటినీ కప్పి రక్షణ కవచంలాగా ఉండటమే కాకుండా, శరీర ఉష్ణోగ్రతను కాపాడుతూ నీటిని, కొవ్వును నిల్వ ఉంచుతూ... విటమిన్ ‘డి’ తయారీకి ఉపయోగపడుతుంది. చర్మానికి వచ్చే ఇతర సమస్యలతో పాటు చర్మ క్యాన్సర్... నివారణ పద్ధతులు, చికిత్సలాంటి అంశాలను తెలుసుకుందాం. చర్మం పైన హెచ్‌పీవీ వైరస్ వల్ల ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వ్యాపించే పులిపిరికాయలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి కొంతమందిలో వాటంతట అవే రాలిపోయినా మరికొంతమందిలో శాశ్వతంగా ఉండిపోయి ఇంకా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. పులిపిరికాయలను కలిగించే హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) క్యాన్సర్ కారకం కాదు. అలాగే సెక్సువల్ కాంటాక్ట్స్ వల్ల మర్మావయవాల వద్ద వచ్చే పులిపిరికాయలు కూడా క్యాన్సర్‌కు దారితీయవు. కానీ... హెచ్‌పీవీ 16, 18 మొదలైన వైరస్ రకాను అంకోవైరస్లుగా పేర్కొనవచ్చు. ఇవి ఎలాంటి పులిపిరికాయలను కలగజేయవు గానీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఎక్కువ. అధిక బరువు వల్లనో, జన్యుపరమైన కారణాల వల్లనో ఏ వయసులోవారికైనా కనిపించే స్కిన్‌ట్యాగ్స్ వల్ల సాధారణంగా ఎటువంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. అయినప్పటికీ అవి పెద్దసైజులో ఉండి, బాగా బయటకు కనిపించే భాగాల్లో ఉంటే తీసివేయించుకోవడమే మంచిది. సాధారణంగా పెసర గింజంత ఉండే ఈ స్కిన్‌ట్యాగ్స్ గోల్ఫ్‌బాల్ సైజుకూ పెరగవచ్చు. చాలా అరుదుగా వీటి రంగులో మార్పు, రక్తం కారడం వంటి లక్షణాలు కనిపించి, స్కిన్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. పుట్టుకతో వచ్చే మచ్చలు కాకుండా... 20 ఏళ్ల తర్వాత మచ్చలు వచ్చి అవి సరైన ఆకారంలో లేకుండా రంగుమారుతూ, రక్తం కారుతూ, ఉబ్బెత్తుగా ఉంటే క్యాన్సర్ అని అనుమానించాల్సి ఉంటుంది. శరీరంలో అనేక ప్రాంతాలలో సాఫ్ట్టిష్యూలతో ఏర్పడే కొవ్వు గడ్డలనే లైపోమా అంటారు. ఇవి అక్కడక్కడ ఒకటీ రెండూ లేదా శరీరమంతా ఉండవచ్చు. ఎడిపోజ్ టిష్యూలతో ఏర్పడే ఈ ప్రమాదకరం కాని ఈ గడ్డలు... ఒకవేళ శరీరం లోపలి అవయవాల మీద కూడా ఏర్పడితే జాగ్రత్తగా గమనించాలి. చర్మం కిందగానీ, రొమ్ములోగానీ, గడ్డలు మెత్తగా కదులుతూ, కొద్దివారాలుగా ఎలాంటి మార్పులేకుండా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. కానీ... మనం చేతితో తాకినప్పడు గట్టిగా రాయిలాగా ఉండటం, గడ్డలో ఏవైనా మార్పులు గమనిస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా వాటిని అనుమానించాలి. రంగు మారడం కనిపిస్తే జాగ్రత్త: గడ్డ అయినా, పుట్టుమచ్చ అయినా మార్పులకు గురవుతూ, రంగు మారుతూ, గట్టిగా ఉండి, రక్తస్రావం కనిపిస్తే... నిర్లక్ష్యం చేయకూడదు. లైపోమాలు ఎటువంటి నొప్పినీ కలగజేయవు. క్యాన్సర్ కణుతులు కూడా తొలిదశలో అస్సలు నొప్పి ఉండవు. కానీ పెరిగే కొద్దీ నరాలు, ఇతర వ్యవస్థల మీద ప్రభావం చూపించడం వల్ల తీవ్రమైన నొప్పిని కలగజేయటంతో పాటు చికిత్సకు అంత తొందరగా లొంగవు. శరీరం మీద ఎక్కడైనా... అంటే... ముఖ్యంగా ఎండకు గురయ్యే శరీరభాగాల్లో చర్మం రంగులో మార్పుతో పాటు మానని పుండు, స్కిన్ప్యాచ్లా ఉండి రక్తస్రావం అవుతూ ఉంటే పరీక్షలు చేయంచుకోవడం మంచిది. మన దేశవాసుల్లో మెలనిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ. పూర్తిగా నయం చేయదగిన ఈ క్యాన్సర్ ప్రధానంగా ‘బేసల్‌సెల్ కార్సినోమా’, ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ అని రెండు రకాలుగా ఉంటుంది. దాదాపు 90 శాతం బేసల్‌సెల్ కార్సినోమా రకానికి చెందినవే ఉంటాయి. చికిత్స: స్కిన్క్యాన్సర్స్ దాదాపు 100 శాతం నయమవుతాయి. క్యాన్సర్ వచ్చిన ప్రదేశాన్ని శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా తొలగించడమే కాకుండా మిగిలి ఉన్న క్యాన్సర్ కణాలనూ చంపివేయడానికి క్రయోవిధానంలో లేదా లేజర్‌తో చికిత్సలు చేస్తుంటారు. రేడియేషన్, కీమోథెరపీలను అవసరాన్ని బట్టి ఇస్తారు. క్యాన్సర్ వచ్చిన భాగంలో మాత్రమే ఆయింట్మెంట్ రూపంలో పూతమందుగా కీమోథెరపీనీ ఇస్తారు. సర్జరీ చేసి చర్మాన్ని చాలా ఎక్కువగా తొలగించాల్సివచ్చినప్పుడు... ఇతర భాగాలనుంచి చర్మాన్ని సేకరించి, తొలగించిన చోట గ్రాఫ్టింగ్ చేస్తారు. నివారణ ఇలా... ఎండ నేరుగా తగిలే భాగాల్లో పై పూతగా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం, శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులూ, ఎండలోకి వెళ్లేటప్పుడు లేత రంగు దుస్తులూ, గొడుగు, చలువ కళ్లద్దాలు, టోపీలు ధరించడం, వీలైనంతవరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉండే ఎండలో బయటకు తిరగకుండా ఉండటం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ క్యాన్సర్‌ను కొంతవరకు దూరంగా ఉంచగలిగినవాళ్లం అవుతాం. క్యాన్సర్ నివారణకే గాక ... మామూలుగా కూడా చర్మసంరక్షణకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి. -డా. సీహెచ్ మోహన వంశీ -
Cyber Crime Prevention Tips: ఫ్యాషన్ జ్యువెల్రీ నచ్చడంతో ఆర్డర్ చేస్తే.. ఆఖరికి..
సాధన (పేరు మార్చడమైనది) బిటెక్ చదివింది. ఉద్యోగిని. ఆన్లైన్లో ఒక ఫ్యాషన్ జ్యువెల్రీని చూసి, నచ్చడంతో ఆర్డర్ బుక్ చేసింది కార్డ్ పేమెంట్ ద్వారా. పది రోజులు దాటాయి. కానీ, ఆ వస్తువు తనను చేరలేదు. ఏమిటీ అని మరోసారి చెక్ చేసింది. తనకు వచ్చిన లింక్‌ను వెరిఫై చేస్తే తప్పుడు యుఆర్ఎల్ అని తేలింది. మోసపోయినట్టు గుర్తించింది. ఆన్లైన్లో ఓ ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నారనే వార్తను చూసింది సాధన. అప్పటికి ఆ కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్న ఆలోచనను విరమించుకుంది. వారం తర్వాత పరిచయమైన వ్యక్తి ద్వారా ‘అలాంటి వార్త నిజం కాదని. కంపెనీ మంచి లాభాలలో ఉందని తెలిసి’ ఆశ్చర్యపోయింది. ఏది నిజం.. ఏది అబద్ధం? అనేవి నిర్ధారించుకోకుండా నిర్ణయాలు ఆన్లైన్ సమాచారం ద్వారా తీసుకోవడం సరికాదని అర్ధం చేసుకుంది. సాధనలాగే ఎంతోమంది డిజిటల్ ప్రపంచం గురించి తెలుసుకోకుండా రకరకాల మోసాలబారిన పడుతున్నారు. ఈ మోసాల గురించి ప్రతి రోజూ మనం వార్తల్లో వింటూనే ఉన్నాం. గతంలో మనిషి మేధోస్థాయిని వారి తెలివితేటలు, చదువు, వికాసాన్ని బట్టి తెలుసుకునేవారు. అలాగే సమాచారాన్ని పేపర్లలో చదివి, రేడియోలు, టీవీల ద్వారా విని గ్రహించేవారు. ఇప్పుడు సమస్తం డిజిటల్లో చేరింది. అందుకే, ఇప్పుడు మన మేధోస్థాయి కూడా మార్పులు చెందుతోంది. కాలప్రవాహంలో కొట్టుకువచ్చే సమాచారంలో మనమూ మునిగిపోతున్నాం. అందుకే, డిజిటల్ జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను నేటి కాలం పరిచయం చేస్తోంది. ఈ టెక్నాలజీ యుగంలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది నిర్ధారించుకునే వివేకం ఉండాలి. మనకు మనంగా మన మేధాశక్తిని తప్పనిసరి కొలుచుకోవాల్సిన కాలం ఇది. మనిషిని అత్యంత శక్తిమంతుడిగా చూపుతున్న డిజిటల్ ప్రపంచంలో మనమెలా ఉండాలో తెలుసుకోవడం అత్యవసరం. ∙∙∙ ఈ డిజిటల్ యుగంలో నైపుణ్యాలు, ప్రొఫైల్స్‌ను అభివృద్ధి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా మేధావులు గుర్తించిన ఎనిమిది ప్రాథమిక నియమాలు (1) ఆరోగ్యకరమైన ఆన్లైన్ గుర్తింపు (2) స్వీయ పర్యవేక్షణతో స్క్రీన్ టైమ్ వినియోగం (3)వేధింపుల పరిస్థితులను గుర్తించి తమ భద్రతను కాపాడుకోవడం (4) రక్షణ చర్యలు తీసుకోవడం (5) వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, అలాగే తెలివిగా పంచుకోవడం 6) నిజం, అబద్ధాల మధ్య తేడా గుర్తించడం (7) ఆన్లైన్ ఉనికిని బాధ్యతాయుతంగా నిర్వహించడం, దీర్ఘకాలిక పరిణామాలను తెలుసుకోవడం (8)మీ గురించి, మీ భావాలను నైపుణ్యంగా పంచుకోవడం. మన దైనందిన జీవితంలో కుప్పలు తెప్పలుగా వస్తున్న సమాచారానికి లెక్కలేదు. దీంట్లో ప్రతిదీ శోధించాలనుకుంటే కష్టమే. కానీ, మన గుర్తింపును ఎలా కాపాడుకోవాలి, భద్రత పరిస్థితి ఏంటి, వ్యక్తిగతమైన వివరాలను గోప్యంగా ఎందుకుంచాలి.. అనే విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకమైనవి. వీటితో పాటు మనలోని భావవ్యక్తీకరణ సోషల్ మీడియాలో ఎలా ఉంది, దీని వల్ల వచ్చే పర్యవసనాలు ఏంటి అనేది కూడా ఆలోచించాలి. నీవు ఏవి ఇస్తే, అలాంటివే నీకు తిరిగి వస్తుంటాయి అనేది కూడా గ్రహించాలి. నిన్ను కొడితే ఎలా బాధ కలుగుతుందో, అవతలి వాడికి కూడా అలాగే బాధ కలుగుతుంది అనే విషయాన్ని అర్ధం చేసుకొని హద్దుల్లో ఉండాలి. కొన్ని డిజిటల్ ఇంటెలిజెన్స్ సాధనాలు: ఎక్సోడస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్లను విశ్లేషిస్తుంది. ఇది పొందుపరిచిన ట్రాకర్ల కోసం వెతుకుతుంది. దీని విశ్లేషణ సాంకేతికత పూర్తిగా చట్టబద్ధమైనది. https://reports.exodus-privacy.eu.org/en/ మీ ఇ–మెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్ లీక్ అయ్యిందా అని నిర్ధారించడానికి https://amibeingpwned.com ద్వారా శోధించవచ్చు. OSINT ద్వారా ఉచితం అని వచ్చే వనరులను కనుక్కోవడంలో ప్రజలకు సహాయపడుతుంది. https://osintframework.com చందాదారులు తమ రిజిస్టర్డ్ నంబర్లను నిర్ధారించడానికి, వారికి తెలియకుండా రిజిస్టర్ చేసిన నంబర్లను తీసివేయడానికి టెలికాంను అనుమతించడం. https://tafcop.dgtelecom.gov.in మీ కంప్యూటర్ లేదా మీ ప్రైవేట్ డేటాకు హాని కలగవచ్చని ఆందోళన ఉంటే.. తనిఖీ చేయడానికి www.unshorten.it ద్వారా ఒక మార్గం ఉంది బెదిరింపులు, వైరస్ల నుండి మీ గుర్తింపు, డేటా, కంప్యూటర్ను రక్షించడంలో మీకు సహాయం చేస్తుంది https://isitphishing.org/ వీడియో అసలైనదా, నకిలీదా అని నిర్ధారించడానికి తగిన ప్లాట్‌ఫారమ్.. https://platform.sensity.ai/ deepfake-detection - అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Priyanka Nanda: బాలీవుడ్లో అడుగుపెట్టాలనుకుంది.. కానీ గ్లామర్ ప్రపంచాన్ని వదిలి గ్రామానికి.. సర్పంచ్‌గా పోటీ! Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? -
పసి మనసుకు ఎందుకింత కష్టం.. లోపం తల్లిదండ్రులదా? చిన్నారులదా?
సాక్షి, విశాఖపట్నం: ఏ కష్టం వచ్చిందో ఏమో.. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి పద్మనాభంలోని బీసీ బాలుర వసతి గృహం సమీపంలో బుధవారం ఉదయం ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో అమ్మా నాన్న కొడుతున్నారనే భయంతో.. ఓ చిన్నారి ట్రైన్ ఎక్కి పారిపోతుండగా.. ఇటీవలే విశాఖ రైల్వే పోలీసులు పట్టుకొని చైల్డ్ లైన్‌కు అప్పగించారు. ఈ రెండు ఘటనల్లోనూ పసి మనసులు చివుక్కుమన్న కారణాలే. వీరే కాదు.. అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టారనో.. ఇంటి నుంచి పారిపోతున్న చిన్నారుల సంఘటనలు నిత్యం ప్రతి చోటా తారసపడుతుంటాయి. అసలు పసి మనసుకు ఎందుకింత కష్టం కలుగుతోంది. ఎవరిది లోపం.? పెంచుతున్న తల్లిదండ్రులదా.? వారిని అర్థం చేసుకోలేక అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్న చిన్నారులదా? పసిపిల్లల మనసులో పిచ్చిగీతలు రాయకుండా.. అందమైన అనుభవాల అక్షరాల్ని లిఖిస్తే వారి జీవితం వికసిస్తుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. మెరుపు మెరిసినా.. వాన కురిసినా.. ఆకాశంలో హరివిల్లు విరిసినా.. తమకే అనుకునే చిన్నారుల ఎదుగుదల గురించి చాలా మంది తల్లిదండ్రులు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు. ఎందుకంటే అది వారి బాధ్యత. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు అవగాహన లేకపోతే.. నష్టపోయేది పిల్లలే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇదే సమయంలో తమ చిన్నారులకు మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వకుండా.. పూర్తిగా కట్టడి చేయకుండా పెంచాల్సిన అవసరం ఉంది. పిల్లలకు ఇష్టం లేకపోయినా.. తమ ఆలోచనలకు తగ్గట్లుగా మసలుకోవాలనుకునే తల్లిదండ్రులు.. ఈ క్రమంలోనే చిన్నారుల మనసుల్ని గాయపరిచేస్తున్నారు. చదవండి: Health Tips: లేత మాంసం, కోడిగుడ్లు తిన్నపుడు విడుదలయ్యే హార్మోన్ల వల్ల.. మీ పిల్లలు సంతోషంగా ఉన్నారా.? మీ పెంపకంలో చిన్నారులు సంతోషంగా జీవిస్తున్నారా.? ఈ ప్రశ్నకు సమాధానాన్ని తల్లిదండ్రులే నిశితంగా గమనిస్తే తెలుసుకోగలరు. సంతోషంగా ఉన్న పిల్లలు బాగా నవ్వుతారు. ఆడుకుంటారు. కొత్త వస్తువుల పట్ల కుతూహలం చూపిస్తారు. ఇతర పిల్లలతో త్వరగా కలిసిపోతుంటారు. అంటే మనం ఆడించకపోయినా ఆనందంగానే కనిపిస్తుంటారు. మనసులో ఉత్సాహం, ఉల్లాసం లేని పిల్లలు ఇందుకు పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తుంటారు. ఎదుటివారితో అస్సలు కలవరు. ముభావంగా మాట్లాడతారు. తిండి కూడా సరిగా తినరు. ఏ ప్రశ్నలూ వెయ్యరు. ఇలాంటి వారిని అక్కున చేర్చుకొని వారి ముభావానికి కారణం తెలుసుకొని వారిలో సంతోషం నింపాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. లేదంటే రేపటి పౌరుల జీవితం అగమ్యగోచరంగా మారిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎదుటి వారితో పోలికెందుకు.? చాలా మంది పిల్లల్లో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం ఎదుటి పిల్లలతో పోల్చడం. పోలికలోంచే పోటీ తత్వం, పట్టుదల. తపన ఎలా మొదలవుతాయో.. అందులోంచే.. ద్వేషం, కసి, అసూయ, కోపం అనే లక్షణాలూ పెరుగుతాయి. పక్కింటి అబ్బాయి ఎంత చురుగ్గా ఉన్నాడు.? వాడిని చూసి నువ్వు నేర్చుకో.. ఈ మాటలు చాలా ఇళ్లల్లో వినిపిస్తుంటాయి. ఇలాంటి పోలికలు పిల్లలను మానసికంగా కుంగుబాటుకు గురిచేస్తుంటాయి. దాన్నుంచి బయట పడేందుకు మనం ఏం చెయ్యాలని ఆలోచించకుండా.. పదేపదే పోల్చడం, వారిని ఈ విషయంలో కొట్టడం, తిట్టడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. మేము బతికుండి ఏం ఉపయోగం అనే స్థితికి వచ్చేస్తుంటారు. అన్ని విషయాలలోనూ నిరాశ నిస్పృహలకు లోనైపోతుంటారు. నలుగురిలో రావడానికి ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంటుంది. ఎదుటి వారితో పోల్చకుండా.. సర్ది చెప్పే ప్రయత్నం చెయ్యండి. మార్కుల విషయంలోనూ చదువు, చురుకుదనం.. విషయమేదైనా.. తన సామర్థ్యం మేరకు కష్టపడుతున్నావంటూ కితాబిస్తూ ఉంటే.. ఏదో ఒకరోజున నంబర్ వన్‌గా మారిపోవడంలో ఎలాంటి సందేహం లేదు. చదండి: Sridhar Bevara: ఆకలినీ.. అవనినీ.. అవమానాలనూ జయించాడు మనసెరిగి మసలుకోరు పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని, వారికి సంతోషాన్ని, ఆనందాన్ని పంచాలని ప్రతి తల్లీ, తండ్రీ భావిస్తారని అనుకుంటాం. కానీ చాలా మంది తల్లిదండ్రులు పిల్లల మనసెరిగి మసలుకోరని ఓ అధ్యయనంలో తేలింది. పిల్లల ఇష్టాలు, అయిష్టాలేంటో తెలుసుకోకుండా తమకు నచ్చిందే పిల్లల మీద రుద్దేస్తుంటారు చాలా మంది అమ్మానాన్నలు. 46 శాతం మంది తల్లిదండ్రులు తమకు నచ్చిందే పిల్లలకు అందిస్తారని తేలింది. 31 శాతం మంది పిల్లలకు నచ్చిందే చేస్తారని ప్లే ఇంట్రెస్ట్ వైజ్ కంపెనీ చేసిన సర్వేలో వెల్లడైంది. 23 శాతం మంది తల్లిదండ్రులు పిల్లలకు నచ్చింది చెయ్యకుండా, తమకు నచ్చిందీ చెయ్యకుండా, చివరి క్షణంలో ఏదో ఒకటి పిల్లలపై రుద్దేస్తుంటారని సర్వేలో తేలింది. వారి కోసం సమయం కేటాయించాలి పిల్లలకు ఎన్నో నేర్పించాలనుకుంటాం. కానీ వాళ్లు ఓ పట్టాన వినరు. అలాంటప్పుడు వాళ్ల దారిలోనే వెళ్లి వారికి ఆదర్శంగా నిలిచేలా చూసుకోవాలి. పిల్లలపై మనకు ప్రేమ ఉన్నా.. వ్యక్తం చేస్తే ఎక్కడ మొండికేస్తారో అని ఆలోచించి మౌనంగా ఉండిపోతుంటారు కొంతమంది తల్లిదండ్రులు. కానీ నిపుణులు మాత్రం వాళ్లపై మీకున్న ప్రేమను ఏదో ఒక విధంగా తెలియజేయండని చెబుతున్నారు. పిల్లలతో తరచూ మాట్లాడుతుంటాలి. దాని వల్ల వారి గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోగలుగుతారు. వారికున్న సమస్యలూ అర్థం చేసుకోవచ్చు. పిల్లలంటే కేవలం చదివించడం, వారికి నచ్చింది కొనిచ్చేయడం, వాళ్ల అభిరుచులను సానబెట్టడం మాత్రమే కాకుండా వాళ్లతో కలిసి ఆడిపాడాలి. ప్రతి అణువూ నిశితంగా పరిశీలించాలి.. పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టడమనేది ప్రతి ఇంట్లోనూ చాలా కామన్‌గా జరిగే విషయం. అయితే ఆ దండనలోనూ తల్లిదండ్రుల ముఖంలో పిల్లలకు ప్రేమే కనిపించాలి తప్ప.. కోపం కనిపించకూడదు. అప్పుడే వారు అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా పెద్ద నిర్ణయాలు తీసుకునే ఆలోచనలు 12 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు వస్తుంటాయి. చాలా మంది పిల్లలు పేరెంట్స్‌పై పగ తీర్చుకోవడానికి వాళ్లకి తెలిసినట్లుగానే ఆత్మహత్యయత్నాలు చేస్తుంటారు. అప్పటి నుంచి తన బిడ్డను తిడితే.. ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనన్న భయంతో పూర్తిగా వదిలేస్తుంటారు చాలా మంది తల్లిదండ్రులు. ఇక్కడే అసలు తప్పు మొదలవుతుంది. అలా కాకుండా నేను ఇంటి నుంచి వెళ్లిపోతా, చచ్చిపోతా అని పిల్లలు అన్నప్పుడే అమ్మానాన్న అలెర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆ పదం వారికి పరిచయం అయ్యిందంటే వారు సంతోషంగా లేరని, ఏదో డిప్రెషన్లో ఉన్నారని అర్థం చేసుకొని దాన్ని అధిగమించేలా పిల్లల్ని తీర్చిదిద్దాలి. – డా.సునీత, మానసిక నిపుణురాలు -
విశ్వ నగరాలు.. శాస్త్రీయ విధానాలు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో నిండా మునకేస్తోంది మన గ్రేటర్ సిటీ. ఈ దుస్థితిని నివారించేందుకు విశ్వనగరాల్లో అమలవుతున్న అత్యున్నత శాస్త్రీయ విధానాలు భాగ్యనగరంలోనూ అమలుచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచంలో లండన్, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, పారిస్ నగరాల్లో భారీ వర్షం, విపత్తులు సంభవించినపుడు ప్రధాన రహదారులు, కాలనీలు మునగకుండా వరద, మురుగు నీరు సాఫీగా వెళ్లేందుకు వేర్వేరుగా ఏర్పాట్లు ఉండడం విశేషం. ఆయా నగరాల్లో అమలు చేస్తున్న అత్యున్నత విధానాలను నగరంలోనూ అమలు చేస్తే ముంపు సమస్యలను నివారించడం సాధ్యపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బార్సిలోనాలో.. బెంగళూరులో ఇంజెక్షన్ వెల్ సాంకేతికత ఇలా.. బెంగళూరు నగరంలో ప్రధాన రహదారులను ముంచెత్తుతున్న వరద నీటిని అరికట్టేందుకు భారీ సంఖ్యలో అండర్‌పాస్‌లు, ప్రధాన రహదారులపై ఇంజెక్షన్ వెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. భూమిపైనుంచి బోర్వెల్ యంత్రంతో 150 నుంచి 200 అడుగుల లోతు వరకు బోరుబావి(ఇంజెక్షన్ వెల్) తవ్వుతారు. ఈ బావిలోకి 12 ఎంఎం పరిమాణం చిల్లులున్న కేసింగ్ పైపును దింపుతారు. పైపులోనికి రాళ్లు చేరకుండా చుట్టూ సన్నటి జాలీని ఏర్పాటు చేస్తారు. ఈ బోరుబావి చుట్టూ రెండు మీటర్ల లోతు, మరో 1.5 మీటర్ల పొడవు, వెడల్పుతో గుంత ఏర్పాటు చేస్తారు. ఈ గుంతలో ఒక మీటరు మందం వరకు 40 ఎంఎం పరిమాణం ఉన్న బెందడి రాళ్లు వేస్తారు. మరో 0.5 మీటర్ల మేర 20 ఎంఎం పరిమాణం ఉన్న గులకరాళ్లను నింపుతారు. మరో 0.3 మీటర్ల మేర మందం ఇసుకతో నింపుతారు. పార్కు లేదా కమ్యూనిటీ హాలు లేదా లోతట్టు ప్రాంతాల నుంచి వర్షపునీరు వచ్చి ఈ ఇంకుడు గుంతపై కొద్దిసేపు నిలిచే ఏర్పాటు చేస్తారు. ఈ నీరు ఇంకుడు గుంత నుంచి, దానికి మధ్యలో రంధ్రాలున్న కేసింగ్ పైపు ద్వారా దశలవారీగా భూమి లోపలి పొరల్లోకి ఇంకుతుంది. దీంతో వర్షపునీరు భూమి అంతరాల్లో ఉన్న ఆయా పొరల్లోకి పాకుతుంది. దీంతో ఆయా పొరల్లోకి సమృద్ధిగా నీటి ఊట చేరి సమీపంలో కిలోమీటరు పరిధిలో ఉన్న బోరుబావులు త్వరగా రీఛార్జీ అవుతాయి. సాధారణ ఇంకుడు గుంత కంటే ఇంజెక్షన్ వెల్ సాంకేతికత ఆధారంగా నిర్మించే రీఛార్జి పిట్స్‌తో ఫలితాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఒక్కో ఇంజెక్షన్ వెల్‌కు సుమారు రూ.40 వేల అంచనా వ్యయం కానుందని అంచనా. మన నగరంలోని కుత్బుల్లాపూర్ ఉమామహేశ్వర కాలనీ దుస్థితి ఇదీ.. విశ్వ నగరాల్లో చర్యలివే.. ఆయా నగరాల్లోని అన్ని ప్రధాన, సర్వీసు రహదారులకు ఇరువైపులా వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు వీలుగా వరదనీటి కాల్వలను ఏర్పాటు చేశారు. కాల్వల్లో మురుగు నీరు చేరకుండా చర్యలు చేపట్టారు. మురుగునీటి పారుదల వ్యవస్థకు ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థ. ఆయా రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో రెయిన్‌గేజ్, స్మార్ట్‌బాల్ టెక్నాలజీ ఆధారంగా వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు శాస్త్రీయ అంచనాతో ముంపు నివారణ. వరద నీటి కాల్వలపై ఆక్రమణలు పూర్తిగా నిషిద్ధం. లోతట్టు ప్రాంతాల్లో భారీ పరిమాణంలో ఉండే ఇంకుడు కొలనుల ఏర్పాటుతో వరదనీరు నేలగర్భంలోకి సులువుగా ఇంకేలా చర్యలు. పార్కులు, ఫుట్‌పాత్‌లు, రహదారులకు ఇరువైపులా, నగరంలో ఖాళీస్థలాల్లో భారీగా గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయడంతో కాంక్రీట్ విస్తీర్ణం తగ్గి వర్షపు నీరు నేలగర్భంలోకి చేరుతుండడంతో తప్పుతున్న ముంపు అవస్థలు. ప్రతి ఇల్లూ, భవనం, కార్యాలయం, వాణిజ్య సముదాయంపై కురిసిన వర్షాన్ని నిల్వ చేసేందుకు అందుబాటులో విధిగా రీఛార్జింగ్ పిట్. దీంతో రహదారులపైకి వచ్చే వరద సుమారు 60 శాతం తగ్గుతోంది. భవన విస్తీర్ణంలో సగభాగం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడటంతో వరద ముప్పు తప్పుతోంది. ఇక ఫిలడెల్ఫియా (అమెరికా), బార్సిలోనా మహానగరాల్లో ఇంకుడు గుంతలను విస్తృతంగా తవ్వడంతో 80 శాతం వర్షపు నీటిని ఒడిసిపడుతున్నారు. ఉదాహరణకు 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటికి బోరుబావికి ఆనుకొని రెండు మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతున ఇంకుడు గుంత ఏర్పాటు. గుంత పూడకుండా చుట్టూ లోపలి వైపు నుంచి బండ రాళ్లు లేదా ఇటుకలతో మధ్యలో సన్నటి ఖాళీలుంచి పేర్చాలి. గుంతపై ఆర్సీసీ సిమెంటుతో తయారు చేసిన జాలీ ఏర్పాటు. జాలీకి ఉన్న పెద్ద రంధ్రాల నుంచి వర్షపునీరు గుంతలోకి మళ్లేలా ఏర్పాటు చేయాలి. ఇంటి పైకప్పుపై చేరిన వర్షపునీరు నేరుగా ఈ గుంతలోకి చేరేలా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే రోజుకు సుమారు 50 నుంచి 80 మి.లీటర్ల వర్షపాతాన్ని బోరుబావికి సమీపంలో ఇంకించవచ్చు. సీజన్లో నిల్వ చేసిన ఈ నీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి మూడు నెలల అవసరాలకు సరిపోతాయి. లోతట్టు ప్రాంతాలు, పార్కులో పెద్ద విస్తీర్ణంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే వాటికి సమీప ప్రాంతాల్లో బోరుబావులు రీఛార్జీ అవుతాయి. వర్షపునీటిని ఎక్కడికక్కడే ఇంకింపజేస్తే రహదారులను ముంచెత్తే వర్షపునీరు సైతం తగ్గుముఖం పడుతుంది. మన పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ నగరంలో తరచూ వరదనీరు నిలిచే ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో భారీ పరిమాణంలో ఉండే ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. దీంతో వరదనీరు నేలగర్భంలోకి చేరి భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగినట్లు టీఎస్‌డీపీఎస్ గుర్తించింది. ఈ నమూనా గ్రేటర్ పరిధిలోనూ అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. -
30ఏళ్లు నిండితే ఆ పరీక్షలు: ప్రభుత్వం
కేన్సర్ వ్యాధిని నివారించేందుకు భారత ప్రభుత్వం నడుంబిగించింది. ఇందుకోసం స్క్రీనింగ్ అండ్ మేనేజ్ మెంట్ ఆఫ్ కేన్సర్ కింద ప్రభుత్వం కొన్ని సూచనలను విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్ నుంచి 30ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా నోటి, గర్భాశయ ముఖద్వార, రొమ్ము కేన్సర్ల పరీక్షలను చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్ణయించింది. మొదటగా దేశంలో 100 ఎంపికచేసిన జిల్లాల్లో ప్రయోగత్మకంగా కేన్సర్ నివారణ ప్రోగ్రాంను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ ఏడాది నవంబర్ లో అగర్తలా నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది. తగ్గించడం కంటే నివారణే మేలు: కేన్సర్ ను ముందుగానే గుర్తించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వీలవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దీంతో ఎన్నో ప్రాణాలను రక్షించుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. డయాబెటిస్, గుండె జబ్బులు లాంటి వాటితో కలిసి కేన్సర్ మరింతగా మానవశరీరాన్నికుంగదీస్తుందని తెలిపారు. ప్రజలందరూ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం వల్ల వ్యాధిపై అవగాహన ఏర్పడుతుందని అన్నారు. రొమ్ము, గర్భాశయ ముఖద్వార, నోటి కేన్సర్లు భారత్ లో ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కేన్సర్ వ్యాధుల నమోదులో వీటికి 34 శాతం భాగస్వామ్యం ఉన్నట్లు చెప్పారు. గుండె సంబంధిత, డయాబెటిస్ వ్యాధులకు సంబంధించి మాత్రమే దేశంలో ప్రత్యేక సూచనలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేన్సర్ వ్యాధి నివారణకు నిర్ధష్ట ప్రణాళికను తయారుచేయాలని సూచించడంతో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చినట్లు నడ్డా వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ(డబ్ల్యూహెచ్ఓ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కేన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్(ఎన్ఐసీపీఆర్)లతో కూడా ఈ అంశాన్ని చర్చించినట్లు చెప్పారు. నిపుణుల సూచనల మేరకే సబ్ సెంటర్లు, ప్రాథమిక కేంద్రాల స్ధాయి నుంచి ఈ మూడు కేన్సర్ల స్క్రీనింగ్ టెస్టులను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
అటవీ భూములన్నీ ఆక్రమణలోనే
నూజివీడు డివిజన్లో 31,686 ఎకరాలు ప్రభుత్వ భూముల వివరాలన్నీ సేకరణ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోండి సబ్‌కలెక్టర్ చక్రధర్‌బాబు నూజివీడు : నూజివీడు డివిజన్లో 31,686ఎకరాల ప్రభుత్వ, అటవీభూములున్నాయని, వాటిలో దాదాపు 26వేల ఎకరాలున్న అటవీ భూములన్నీ ఆక్రమణలోనే ఉన్నాయని నూజివీడు సబ్‌కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు స్పష్టం చేశారు. ఆయన కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ డివిజన్లో ఉన్న అన్నిశాఖల ప్రభుత్వ భూముల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. దీనిపై ప్రతి రోజూ ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షిస్తున్నానన్నారు. ఇరిగేషన్‌కు చెందిన చెరువులు, వాగులు ఆక్రమణలకు గురైనట్లు తెలుస్తుందని, మొత్తం వివరాలు సేకరించిన తరువాత ఆ ఆక్రమణలను తొలగించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్షేత్రస్థాయిలో తగినంతమంది సిబ్బంది లేకపోవడం వల్లనే అటవీభూములు , ఇరిగేషన్ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని సంబంధిత శాఖ అధికారులు చెపుతున్నారని తెలిపారు. అలాగే గ్రామాలలో, పట్టణాలలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, ఆ భూముల్లో ఏమైనా ఆక్రమణలుంటే వాటినీ తొలగిస్తామన్నారు. ప్రభుత్వభూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు గానూ గ్రామస్థాయిలో వీఆర్వోతో పాటు ఆ మండల అధికారులతో కమిటీలు వేశామన్నారు. నూజివీడు, ముసునూరు, చాట్రాయి, రెడ్డిగూడెం, బాపులపాడు మండలాల్లో అటవీభూములు ఎక్కువగా ఉన్నాయని, ఇవన్నీ దాదాపు ఆక్రమణకు గురవ్వడమే కాకుండా పండ్లతోటలు పెంచుతున్నారని చెప్పారు. డివిజన్లో పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్డీడ్ల పెండింగ్ ఎక్కువగా ఉందని, ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని సబ్‌కలెక్టర్ వివరించారు.. ఈ పెండింగ్‌ను తగ్గించేందుకు చర్యలు చేపట్టానన్నారు. డివిజన్లో మీసేవా కేంద్రాల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మీ సేవా కేంద్రాల వద్ద ధరల పట్టికను ప్రదర్శించాలని, ఆ పట్టికలో పేర్కొన్న ఫీజును మాత్రమే ప్రజలు చెల్లించాలన్నారు. అలాగే ఆధార్‌కార్డు కోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, గతంలో ఆధార్‌కార్డు తీసుకుని అందులో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేయించుకోవడానికి మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వ్యాధులు నివారించండి... వర్షాకాలం వచ్చినందున వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో మండల అధికారులు వ్యాధుల నివారణా చర్యలు తీసుకోవాలని సబ్‌కలెక్టర్ ఆదేశించారు. డ్రైనేజీల్లో పూడికను తొలగించడం, మంచినీటి ట్యాంకుల క్లీనింగ్, నీటిని క్లోరినేషన్ చేయడం, నివేశన ప్రాంతాల్లో, ఇంటి ఆవరణలో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.