రూ.33 వేలకు బంగారం ధర?
న్యూఢిల్లీ: పసిడి ధర ఈ ఏడాది రూ. 33 వేలను (10 గ్రాములు) తాకే అవకాశముందని రిద్ధి సిద్ధి బులియన్స్ (ఆర్ఎస్బీఎల్) ఎండీ పృథ్వీరాజ్ కొఠారి మంగళవారం తెలిపారు. ప్రస్తుత సంవత్సరంలో బంగారం సగటు ధర సుమారు రూ. 28 వేలు ఉండవచ్చని అన్నారు.
‘2014లో బంగారం బేస్ ధర ఔన్సుకు 1,375 డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. దేశీయ మార్కెట్లో ఇది రూ. 25 వేల నుంచి రూ. 33 వేల శ్రేణిలో ఉండవచ్చు. వెండి సగటు బేస్ ధర కిలోకు రూ. 45 వేల వరకు ఉండవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో పన్నెండేళ్ల బుల్న్న్రు ముగిస్తూ పుత్తడి ధర గతేడాది 28 శాతం క్షీణించింది. ఈ స్థాయిలో రేటు తగ్గడం 1981 తర్వాత ఇదే ప్రథమం. కరెంటు అకౌంటు లోటు(క్యాడ్) అదుపునకు కేంద్ర ప్రభత్వుం, రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ)లు బంగారంలో పెట్టుబడులను తగ్గించే చర్యలు చేపట్టడంతో భారత్లో డిమాండు మందకొడిగా ఉంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఈ లోటు రికార్డు స్థాయిలో 8,800 కోట్ల డాలర్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 5 వేల కోట్ల డాలర్లకు తగ్గవచ్చు. 13 అంకెను చాలామంది అశుభంగా భావిస్తారు. బంగారం విషయంలోనూ ఆ సెంటిమెంటు నిజమైంది’ అని గతేడాది (2013) డిమాండును ఉద్దేశించి కొఠారి అన్నారు.