కొత్తగూడెంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
ఖమ్మం జిల్లా కొత్తడూడెంలోని సింగరేణి ప్రకాశం స్టేడియం మైదానంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. సైన్యంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో రాష్ట్రంలోని 10 జిల్లాలకు చెందిన నిరుద్యోగులు పాల్గొంటున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి నిరుద్యోగులు ప్రకాశం స్టేడియం వద్ద బారులు తీరారు. గురువారం తెల్లవారుజాము నుంచి అభ్యర్థులను స్టేడియంలోకి అనుమతించి శరీర దారుఢ్య పరిక్షలు నిర్వహిస్తున్నారు.