Profit-booking
-
ప్రాఫిట్‌బుకింగ్ తో బుక్కయిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఆరంభంలో వరుసగా రెండో రోజుకూడా లాభాల్లో,రికార్డ్ స్థాయిల్లో మురిపించిన మార్కెట్లు చివరికి నీరసించాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్ 145 పాయింట్లు క్షీణించి 28,840 వద్ద , నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 8,900 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా, యూరప్ మార్కెట్లు ప్రతికూలంగా మారంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో మేజర్ సెక్టార్లు నష్టపోయాయి. ముఖ్యంగా రియల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, బ్యాంక్ నిఫ్టీ,ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు క్షీణించగా, ఫిబ్రవరి నెల అమ్మకాల జోష్ తో ఆటో సెక్టార్ లాభపడింది. డీఎల్ఎఫ్ ఇండియాబుల్స్, శోభా, యూనిటెక్ షేర్లలో భారీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. ఇక మిగిలిన షేర్ల విషయానికి వస్తే..బీపీసీఎల్, ఐడియా, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, యస్‌బ్యాంక్, బీవోబీ, భారతీ, డాక్టర్ రెడ్డీస్, ఎంఅండ్ఎం నష్టపోగా టాటా మోటార్స్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్, హీరోమోటో, టీసీఎస్, హిందాల్కో, సిప్లా, కోల్ ఇండియా. విప్రో పుంజుకున్నాయి. అటు ఫారెక్స్ మార్కెట్ లో డాలర్ మారకంలో ఇండియన్ కరెన్సీ 0.10పైసలు లాభపడి రూ. 66.72 వద్ద ఉంది. బులియన్‌మార్కెట్ లో వెండి ధరలు బాగా బలపడగా, ఎంసీఎక్స్ మార్కెట్ లో బంగారం పది గ్రా. 44 రూ క్షీణించి రూ. 29,373 వద్ద ఉంది. -
ఒడిదుడుకులున్నా పటిష్టమే..!
భారీగా పెరిగిన పసిడి నుంచి లాభాల స్వీకరణ శుక్రవారంతో ముగిసిన రెండవ వారంలోనూ వరుసగా కొనసాగింది. డాలర్ పటిష్టత, ఈక్విటీ మార్కెట్ల స్వల్ప సానుకూలతలు, ఇప్పటికే భారీగా పెరిగిన మెటల్స్ నుంచి లాభాల స్వీకరణ నేపథ్యంలో పసిడి స్వల్పకాలంలో కొంత తగ్గినా... దీర్ఘకాలంలో ఈ మెటల్ బులిష్‌గానే ఉందని ఈ రంగంలోని పలువురు విశ్లేషిస్తున్నారు. బులిష్ ధోరణికి కారణాలు... ప్రధానంగా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ (బ్రెగ్జిట్) విడివడ్డం, అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడరల్ బ్యాంక్ 0.50 శాతం పైకి ఫెడ్ ఫండ్ రేటును పెంచలేని పరిస్థితులను విశ్లేషకులు కారణంగా చూపుతున్నారు. ఇక బ్రెగ్జిట్ సమస్యపై తక్షణం దృష్టి సారించకుంటే, మరింత క్లిష్ట పరిస్థితులు తప్పవని ఈవారంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ క్రిస్టినా లెగార్డ్ హెచ్చరించారు. ఇక బ్రెగ్జిట్ కారణాన్నే ప్రధానంగా చూపుతూ 2016, 2017 సంవత్సరాల్లో గ్లోబల్ వృద్ధి రేటును 10 బేసిస్ పాయింట్లు కుదిస్తూ... 3.1 శాతం, 3.4 శాతానికి ఐఎంఎఫ్ ఇదే వారంలో తగ్గించింది. ఇవన్నీ దీర్ఘకాలంలో పసిడి పటిష్టతకు సానుకూల అంశాలేనని నిపుణులు భావిస్తున్నారు. స్వల్పంగా తగ్గిన రేట్లు... ఇదిలావుండగా శుక్రవారంతో ముగిసిన సమీక్షా వారంలో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి కాంట్రాక్ట్ ధర న్యూయార్క్ కమోడిటీ మార్కెట్-నెమైక్స్‌లో స్వల్పంగా ఔన్స్‌కు (31.1గ్రా)కు ఏడు డాలర్లు తగ్గి, 1,322 డాలర్లకు దిగింది. ఇక దేశీయంగా ప్రధాన బులియన్ మార్కెట్లో పసిడి ధర 99.9, 99.5 స్వచ్ఛత 10 గ్రాములకు స్వల్పంగా రూ.100 తగ్గింది. ఈ ధరలు వరుసగా రూ.30,985, రూ.30,835 వద్ద ముగిశాయి. ఇక వెండి కేజీ ధర రూ.730 తగ్గి రూ.46,820కి పడింది. -
సమీప భవిష్యత్తులో 1425 డాలర్లు!
పసిడిపై నిపుణుల అంచనా.. న్యూఢిల్లీ: పసిడి ధర సమీప భవిష్యత్తులో మరింత ముందుకు దూసుకుపోవడం ఖాయమన్న అంచనాలు బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులే దీనికి ప్రధాన కారణమన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఏబీఎన్ ఆమ్రో గ్రూప్ కమోడిటీ స్ట్రేటజీ విభాగం గ్లోబల్ హెడ్ జార్జిట్ బోలే ఈ మేరకు తన అభిప్రాయాలను వెల్లడిస్తూ... వచ్చే మూడు నెలల్లో న్యూయార్క్ కమోడిటీ మార్కెట్ నెమైక్స్ కాంట్రాక్ట్ ధర 1,425 డాలర్లకు చేరుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.1,425 డాలర్లకు చేరిన తర్వాత లాభాల స్వీకరణ జరిగే వీలుందని , ఫెడ్ ఫండ్ రేటు పెరిగే పరిస్థితుల్లో ఈ లాభాల స్వీకరణ ధోరణి మరింత దూకుడుగా ఉండవచ్చని ఆయన అన్నారు. కాగా, శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి ధర అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా భారీగా పెరిగింది. అంతర్జాతీయంగా ధర వారం వారీగా 24 డాలర్ల లాభంతో 1,368 డాలర్ల వద్ద ముగిసింది. దేశీయంగా ముంబై ప్రధాన మార్కెట్లో శుక్రవారంతో ముగిసిన వారంలో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల పసిడి ధర రూ.460 పెరిగింది. రూ.31,355 వద్ద ముగిసింది. వెండి ధర వారంలో భారీగా కేజీకి రూ.1,435 ఎగసి రూ.46,515 వద్ద ముగిసింది. -
పసిడికి ‘డాలర్’ బూస్ట్
లాభాల స్వీకరణ ఉంటుందంటున్న నిపుణులు ముంబై: డాలరు బలహీనత, అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను యథాతథంగా అట్టిపెట్డడం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు... వెరసి పసిడికి బలం చేకూర్చుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు విలువ దిగజారడం గతవారం ప్రపంచ మార్కెట్లో పసిడి ర్యాలీకి కారణమయ్యింది. డాలరు బలపడితే పసిడిని విక్రయించడం, డాలరు క్షీణిస్తే బంగారాన్ని కొనడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో సమీపకాలంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా... పసిడి మెరుపులు కొనసాగుతాయని నిపుణులు అంచనావేస్తున్నారు. అయితే ఇప్పటికే రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరడంతో సమీప కాలంలో లాభాల స్వీకరణ జరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కానీ ఇప్పట్లో పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రా)కు 1,200 డాలర్ల దిగువకు పడిపోయే పరిస్థితి లేదని వారి అంచనా. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ నెమైక్స్‌లో గడచిన శుక్రవారం నాటికి పసిడి వారం వారీగా చురుగ్గా ట్రేడవుతున్న జూన్ డెలివరీ ఔన్స్ ధర 70 డాలర్లు ఎగసి 1,290.50 డాలర్లకు చేరింది. దేశీయంగానూ పరుగు.. అంతర్జాతీయ పటిష్ట ధోరణితోపాటు దేశీయంగా పెళ్లిళ్లు, పండుగల సీజన్ పసిడికి డిమాండ్ పెంచింది. వరుసగా నాల్గవవారమూ లాభపడింది. ధరలు రెండేళ్ల గరిష్ట స్థాయికి ఎగశాయి. ప్రధాన స్పాట్ మార్కెట్- ముంబైలో 99.5 ప్యూరిటీ 10 గ్రాముల ధర వారం వారీగా రూ.465 పెరిగి రూ.29,820కి చేరింది. ఇక 99.9 ప్యూరిటీ ధర సైతం అంతే స్థాయిలో ఎగసి 29,970కి ఎగసింది. ఒక దశలో ధర రూ.30,000 దాటడం గమనార్హం. వెండి కేజీ ధర రూ.1,075 పెరిగి రూ.41,875కు చేరింది. -
పసిడి ధర మళ్లీ వెనక్కి!
న్యూయార్క్/ముంబై: పసిడి ధర తాజాగా వెలవెలబోతోంది. అంతర్జాతీయంగా మార్కెట్లో లాభాల స్వీకరణ దీనికి ప్రధాన కారణం. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లోనూ కనబడుతోంది. స్టాకిస్టులు, ఇన్వెస్టర్లు తమ నిల్వలను తగ్గించుకోవడం, కొనుగోళ్ల మద్దతు కొరవడ్డం వంటి అంశాలూ దేశీయంగా ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ నెమైక్స్ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న ఏప్రిల్ కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రాములు) ధర బుధవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి మంగళవారం ముగింపుతో పోల్చితే 29 డాలర్లు తక్కువగా 1,220 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో సైతం కొనసాగుతోంది. రాత్రి కడపటి సమాచారం అందే సరికి 10 గ్రాముల కాంట్రాక్ట్ రూ.500కు పైగా నష్టంతో రూ.28,542 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ ధర సైతం రూ.1,000కిపైగా నష్టంతో రూ.36,772 వద్ద ట్రేడవుతోంది. కాగా ఇక్కడి స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల ధర భారీగా రూ.350 తగ్గింది. 99.9 స్వచ్ఛత ధర రూ.28,510, 99,5 స్వచ్ఛత ధర రూ.28,360కు దిగివచ్చింది. వెండి కేజీ ధర సైతం రూ.535 తగ్గి రూ.37,900కు చేరింది. -
ఫెడ్ ప్రకటనపై ముందు జాగ్రత్త
114 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ - లాభాల స్వీకరణ మరో కారణం - నిఫ్టీ నష్టం 37 పాయింట్లు - 8,700 దిగువకు నిఫ్టీ - మార్కెట్ అప్డేట్ వడ్డీరేట్లపై ఫెడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఇన్వెస్టర్ల ముందు జాగ్రత్త కారణంగా స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాలపాలయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచితే భారత్ వంటి వర్థమాన దేశాల నుంచి నిధులు తరలివెళతాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) అధినేత క్రిస్టిన్ లగార్డే వ్యాఖ్యలు ప్రతికూల ప్రభావం చూపాయి. భారత్ కాలమాన ప్రకారం బుధవారం అర్థరాత్రి ఫెడ్ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు దిగారు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 114 పాయింట్లు, నిఫ్టీ 37పాయింట్లు చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ 8,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ సూచీలు 0.4 శాతం చొప్పున క్షీణించాయి. ఎఫ్ఎంసీజీ, మౌలిక, టెక్నాలజీ, కొన్ని ఎంపిక చేసిన వాహన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బుధవారం నాటి ముగింపు(28,736 పాయింట్లు)తో పోల్చితే బీఎస్ఈ సెన్సెక్స్ 31 పాయింట్ల లాభంతో 28,767 వద్ద ప్రారంభమైంది. విదేశీ నిధుల వరదతో పటిష్టమైన కొనుగోళ్ల కారణంగా 28,807 పాయింట్ల గరిష్ట స్థాయికి (71 పాయింట్లు లాభం)ఎగసింది. ఆ తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో 28,547(189 పాయింట్లు నష్టం) పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇక నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 8,686 పాయింట్ల వద్ద ముగిసింది. 3 శాతం నష్టపోయిన ఎన్టీపీసీ 30 సెన్సెక్స్ షేర్లలో 18 షేర్లు నష్టాల్లో, 12 షేర్లు లాభాల్లో ముగిశాయి. 10 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించనున్నదన్న వార్తలతో ఎన్టీపీసీ 3 శాతం పతనమైంది. గత నెలలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ హోల్‌సేల్ విక్రయాలు 1 శాతం తగ్గడంతో టాటా మోటార్స్ 2 శాతం తగ్గింది. రూపాయి బలపడడంతో ఐటీ షేర్లు పతనమయ్యాయి. 1,585 షేర్లు నష్టాల్లో, 1,262 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ ఎన్ఎస్ఈలో రూ.18,204 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,32,303 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.457 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.883 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. సింగపూర్, దక్షిణ కొరియాలు మినహా మిగిలిన అన్ని ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ల నుంచి నిధుల సమీకరణకు వీలు కల్పించండి సెబీకి ఈకామర్స్ కంపెనీల వినతి పెద్ద సంఖ్యలో వస్తున్న ఈకామర్స్ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు నిధుల సమీకరణ కోసం క్యాపిటల్ మార్కెట్ల బాట పట్టాలని యోచి స్తున్నాయి. ఇందుకోసం ఐపీవో నిబంధనలు సడలించాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని కోరుతున్నాయి. దీనికి సంబంధించి ఇటీవలే పలువురు పరిశ్రమ ప్రముఖులు, వెంచర్ క్యాపిటలిస్టులు .. సెబీ చైర్మన్ యూకే సిన్హాను, ఇతర ఉన్నతి అధికారులను కలిశారు. సెబీ ససేమిరా..! కాగా ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సెబీ మాత్రం ఈకామర్స్ కంపెనీల కోసం ఐపీవో నిబంధనల సడలింపుపై అంత సానుకూలంగా లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
28,690 దిగువన అమ్మకాల ఒత్తిడి
మార్కెట్ పంచాంగం అమెరికాలో జూన్ నెలలో వడ్డీ రేట్లు పెరగవచ్చన్న అంచనాలు ఇటీవల ఊపందుకోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడి మార్కెట్లో లాభాల స్వీకరణకు శ్రీకారం చుట్టినట్లు కన్పిస్తున్నది. దేశీయ మార్కెట్‌కు సంబంధించి, రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించడం, పార్లమెంటులో బీమా బిల్లు ఆమోదం పొందడం వంటి రెండు సానుకూల వార్తలు ఈ నెలలోనే వెలువడ్డాయి. ఈ వార్తలు వచ్చిన రెండు సందర్భాల్లోనూ స్టాక్ సూచీలు గరిష్టస్థాయి నుంచి పతనమయ్యాయి. అనుకూల సమయాల్లో జరుగుతున్న అమ్మకాలను లాభాల స్వీకరణగా పరిగణించవచ్చు. ఇన్వెస్టర్ల పెట్టుబడి శైలికి సంబంధించి ఇది సహజ పరిణామమే. ఆందోళనకారకం కాదు. సెన్సెక్స్ సాంకేతికాంశాలు..., మార్చి 13తో ముగిసిన వారం తొలిరోజున 29,321 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరిరోజున 28,448 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 946 పాయింట్ల భారీనష్టంతో 28,503 పాయింట్ల వద్ద ముగిసింది. కొద్దివారాల నుంచి ఈ కాలమ్స్‌లో ప్రస్తావిస్తున్న 28,880-28,690 పాయింట్ల కీలక మద్దతుశ్రేణిని సెన్సెక్స్ కోల్పోయినందున, వెనువెంటనే ఈ శ్రేణిపైకి పెరగలేకపోతే, అమ్మకాల ఒత్తిడి కొనసాగే ప్రమాదం వుంటుంది. ఈ వారం 28,690 పాయింట్ల దిగువనే సూచీ స్థిరపడితే, వచ్చే కొద్దిరోజుల్లో క్రమేపీ 27,827 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. డిసెంబర్ 17 నాటి కనిష్టస్థాయి 26,469 పాయింట్ల నుంచి మార్చి 4నాటి రికార్డుస్థాయి 30,025 వరకూ జరిగిన ర్యాలీలో 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయే ఈ 27,827 పాయింట్లు. అమెరికా మార్కెట్ శుక్రవారం బలహీనంగా ముగిసిన ప్రభావంతో ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో భారత్ మార్కెట్ మొదలైతే 28,250 పాయింట్ల సమీపంలో తాత్కాలిక మద్దతు పొందవచ్చు. ఆ దిగువన 28,040 స్థాయివరకూ పతనం కావొచ్చు. ఆ లోపున క్రమేపీ పైన ప్రస్తావించిన 27,827 స్థాయికి తగ్గవచ్చు. తొలిస్థాయి వద్ద మద్దతు పొందగలిగితే 28,690 స్థాయివకరూ తొలుత పెరగవచ్చు. తదుపరి నిరోధస్థాయిలు 28,840, 28,970 పాయింట్లు. మార్కెట్లో తిరిగి అప్‌ట్రెండ్ నెలకొనాలంటే 29,184 స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో దాటి ముగియాల్సివుంటుంది. నిఫ్టీ తక్షణ మద్దతు 8,540 ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,891 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 8,632 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమై చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 290 పాయింట్ల నష్టంతో 8,648 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం గ్యాప్‌డౌన్‌తో నిఫ్టీ ప్రారంభమైతే 8,540 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 8,470 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఆ లోపున క్రమేపీ 8,403 పాయింట్ల స్థాయికి (7,961 నుంచి 9,119 వరకూ జరిగిన ర్యాలీలో ఇది 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి) కొద్దిరోజుల్లో క్షీణించవచ్చు. ఈ వారం తొలిస్థాయి వద్ద మద్దతు పొందితే 8,670 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 8,755 స్థాయికి పెరగవచ్చు. అటుపైన 8,790 పాయింట్ల అవరోధస్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ తిరిగి అప్ట్రెండ్లోకి ప్రవేశించాలంటే 8,850 స్థాయిని అధిగమించి, స్థిరపడాల్సివుంటుంది. -
లాభాల స్వీకరణకు అవకాశం
⇒పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలపై దృష్టి ⇒రూపాయి మారక విలువ,ముడి చమురు ధరలూ కీలకమే... ⇒ఈ వారం మార్కెట్ కదలికలపై నిపుణుల విశ్లేషణ న్యూఢిల్లీ: ఇటీవల సరికొత్త రికార్డులను తాకుతూ సాగుతున్న మార్కెట్లో ఈ వారం లాభాల స్వీకరణ జరిగే అవకాశముందని స్టాక్ నిపుణులు అంచనా వేశారు. గడిచిన వారం కూడా అమ్మకాలతో మార్కెట్ కొంతమేర వెనకడుగు వేసిన నేపథ్యంలో తాజా విశ్లేషణకు ప్రాధాన్యత ఏర్పడింది. 6 వారాల తరువాత మళ్లీ సెన్సెక్స్ గత వారం 236 పాయింట్లు కోల్పోయి 28,458 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, అక్టోబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) తోపాటు, నవంబర్‌లో రిటైల్‌ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు ఈ వారం విడుదల కానున్నాయి. ఈ అంశాల నేపథ్యంలో మార్కెట్ హెచ్చుతగ్గులను చవిచూసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ నెల 12న (శుక్రవారం) అక్టోబర్ నెలకు ఐఐపీ, నవంబర్ నెలకు సీపీఐ గణాంకాలు వెలువడనున్నాయి. వీటితోపాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు. నవంబర్ 24న మొదలైన శీతాకాల సమావేశాలు ఈ నెల 23న ముగియనున్నాయి. ఈ సమావేశాల ఫలితాలకు ప్రాధాన్యత ఉన్నదని జయంత్ తెలిపారు. విదేశీ పెట్టుబడులు దేశీ మార్కెట్లను ముంచెత్తుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు, ఐదేళ్ల కనిష్టానికి దిగివచ్చిన ముడిచమురు ధరలు సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపుతాయని అత్యధిక శాతం మంది నిపుణులు విశ్లేషించారు. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి కదలికలు కూడా కీలకంగా నిలవనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి వెలువడనున్న మరిన్ని విధాన ప్రకటనలపై ఇన్వెస్టర్లు ఆసక్తితో ఉన్నట్లు క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ సీఎంటీ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. ఇప్పటికే వేడెక్కిన పార్లమెంట్ సమావేశాలు, ఇకపై ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సంస్కరణలు వంటి అంశాలు సమీప కాలంలో మార్కెట్లను నియంత్రిస్తాయని గుప్తా పేర్కొన్నారు. మరో రెండు సెషన్లు...: ప్రభుత్వ విధానాలు, సంస్కరణలపై దృష్టిపెట్టిన ఇన్వెస్టర్లు ఈ వారం కూడా కొంతమేర అమ్మకాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశముందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అంచనా వేశారు. ఇప్పటికే లాభాల స్వీకరణవైపు మొగ్గిన ఇన్వెస్టర్లు రానున్న ఒకటి రెండు సెషన్లపాటు అమ్మకాలు కొనసాగించవచ్చునని అభిప్రాయపడ్డారు. అయితే స్టీల్ రంగ దిగ్గజం సెయిల్‌లో ప్రభుత్వం చేపట్టిన డిజిన్వెస్ట్‌మెంట్ విజయవంతంకావడం సెంటిమెంట్‌కు జోష్నిస్తుం దని నిపుణులు పేర్కొన్నారు. ఇది మార్కెట్‌పట్ల రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తిని తెలియజేస్తున్నదని వ్యాఖ్యానించారు. ఆర్థిక వృద్ధిపై ఆశావహ అంచనాలు, ఎఫ్ఐఐల పెట్టుబడుల జోరు వంటి అంశాలు మార్కెట్లకు అండగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా రెట్టింపు ఇక డిజిన్వెస్ట్మెంట్లో 20% వాటా న్యూఢిల్లీ: రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చేపట్టనున్న ప్రభుత్వ సంస్థల వాటా ఉపసంహరణలో రిటైల్ ఇన్వెస్టర్లకు 20%ను కేటాయించనుంది. దీంతో ప్రస్తుతం అమలవుతున్న 10% కోటా రెట్టింపుకానుంది. ఈ అంశాన్ని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. గత వారం చివర్లో నిర్వహించిన సెయిల్ డిజిన్వెస్ట్మెంట్కు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి లభించిన స్పందన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం వెలువడటం గమనార్హం. తదుపరి దశలో ప్రభుత్వం ఓఎన్జీసీ, కోల్ ఇండియా వంటి బ్లూచిప్స్‌తోపాటు, ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఎన్‌హెచ్‌పీసీ వంటి దిగ్గజాలతో సైతం వాటాల విక్రయాన్ని చేపట్టనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఓఎన్జీసీలో 5%, కోల్ ఇండియాలో 10% చొప్పున వాటాలు విక్రయించనుంది. రూ. లక్ష కోట్లకు విదేశీ పెట్టుబడులు వరుసగా మూడో ఏడాది... న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లో మరో విశేషం చోటుచేసుకుంది. ఈ ఏడాది(2014) జనవరి 1 మొదలు డిసెంబర్ 5 వరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈక్విటీలలో నికరంగా రూ. లక్ష కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఇందుకు రికార్డులు సృష్టిస్తూ సాగుతున్న మార్కెట్లు, సంస్కరణలతో అండగా నిలుస్తున్న ప్రభుత్వం, పుంజు కుంటున్న ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలు కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. జనవరి నుంచి ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో 16.57 బిలియన్ డాలర్లను(రూ. లక్ష కోట్లు) ఇన్వెస్ట్ చేశారు. వీటిలో డిసెంబర్ తొలి వారంలో లభించిన రూ. 4,032 కోట్ల పెట్టుబడులు కలసి ఉన్నాయి. ఇక మరోవైపు ఇదే కాలంలో ఎఫ్‌పీఐలు డెట్ మార్కెట్లో మరింత అధికంగా రూ. 1.55 లక్షల కోట్లను(25.6 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. వెరసి దేశీ క్యాపిటల్ మార్కెట్లో ఎఫ్‌పీఐల మొత్తం పెట్టుబడులు రూ. 2.55 లక్షల కోట్లను(42 బిలియన్ డాలర్లు) తాకాయి! కాగా, ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో 2013లో రూ. 1.13 లక్షల కోట్లు, 2012లో రూ. 1.28 లక్షల కోట్లు చొప్పున కుమ్మరించారు. 2010లో మాత్ర మే వీటిని మించుతూ రికార్డు స్థాయిలో రూ. 1.33 లక్షల కోట్లను ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేశారు. -
ఎగసి పడిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ చరిత్రలో రెండోసారి సెన్సెక్స్ 25,000 పాయింట్లను అధిగమించింది. ఇందులో విశేషమేవిటంటే... సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజు(మే 16)నాటి ట్రేడింగ్‌ను పోలి మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులను చవిచూడటం! దేశ 15వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో తొలుత లాభాలతో మొదలయ్యాయి. కొనుగోళ్లు పుంజుకోవడంతో ఉదయం 12కల్లా సెన్సెక్స్ 25,175ను తాకింది. ఇది దాదాపు 500 పాయింట్ల లాభం! అయితే చివరి గంటలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకోవడంతో లాభాలను కోల్పోవడమేకాకుండా 24,434 పాయింట్ల కనిష్టస్థాయికి జారింది. 250 పాయింట్లకుపైగా నష్టమిది!చివరికి స్క్వేరప్ లావాదేవీల కారణంగా 23 పాయింట్ల లాభంతో 24,717 వద్ద ముగిసింది. ఈ బాటలో నిఫ్టీ కూడా ఒక దశలో 130 పాయింట్లు ఎగసినప్పటికీ చివరికి 8 పాయింట్ల నష్టంతో 7,359 వద్ద స్థిరపడింది. బీజేపీకి మెజారిటీ లభించిందన్న వార్తలతో మే 16న కూడా సెన్సెక్స్ తొలుత 1,500 పాయింట్లు ఎగసినప్పటికీ తుదకు 215 పాయింట్ల లాభంతో ముగిసిన సంగతి తెలిసిందే. భెల్ డౌన్, ఎంఅండ్ఎం అప్ బీఎస్ఈలో ప్రధానంగా రియల్టీ 5%పైగా పతనంకాగా, పవర్ 3% క్షీణించింది. రియల్టీ షేర్లు డీబీ, అనంత్‌రాజ్, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్, ఒబెరాయ్, ఫీనిక్స్ 10-5% మధ్య దిగజారాయి. ఈ బాటలో పవర్ షేర్లు జేపీ, అదానీ, ఎన్‌హెచ్‌పీసీ, పీటీసీ, టొరంట్, టాటా పవర్ 8-4% మధ్య తిరోగమించాయి. ఇక సెన్సెక్స్ దిగ్గజాలలో బీహెచ్ఈఎల్ 5% నీరసించగా, గెయిల్, హిందాల్కో, ఎన్టీపీసీ, ఆర్ఐఎల్, ఎస్బీఐ, టాటా స్టీల్ 4-2% మధ్య నష్టపోయాయి. అయితే మరోవైపు ఎంఅండ్ఎం 6.2% జంప్‌చేయగా, సెసాస్టెరిలైట్, విప్రో, టాటా మోటార్స్, ఎల్అండ్టీ 4-2% మధ్య పుంజుకున్నాయి. చిన్న షేర్లు డీలా మార్కెట్లలో ఏర్పడ్డ ఒడిదుడుకుల కారణంగా చిన్న షేర్లు డీలాపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 2%పైగా క్షీణించగా, ట్రేడైన షేర్లలో 1,660 నష్టపోయాయి. 1,362 మాత్రమే లాభపడ్డాయి. మిడ్ క్యాప్స్‌లో ఉషా మార్టిన్, చెన్నై పెట్రో, కేఎస్కే ఎనర్జీ, స్పైస్ జెట్, జిందాల్ స్టెయిన్లెస్, ఐవీఆర్సీఎల్, ల్యాంకో ఇన్ఫ్రా, గీజాంజలి, జీవీకే, రెయిన్, ఆర్కిడ్, హెచ్‌సీసీ, నాల్కో, బీజీఆర్, బాంబే డయింగ్, ఎస్సార్ పోర్ట్స్, శ్రేఈ ఇన్ఫ్రా, బజాజ్ హిందుస్తాన్, డెల్టా కార్ప్, మ్యాగ్మా ఫిన్, ఈరోస్ 12-8% మధ్య పతనమయ్యాయి. 28 వేల పాయింట్లకు సెన్సెక్స్ డాయిష్ బ్యాంక్ అంచనా వచ్చే డిసెంబరుకు సెన్సెక్స్ 28,000 పాయింట్లను చేరుతుందని డాయిష్ బ్యాంక్ పునరుద్ఘాటించింది. దేశీయ మార్కెట్ల రేటింగ్‌ను గత వారంలో ‘న్యూట్రల్’ స్థాయికి సంస్థ తగ్గించింది. కేంద్రంలో ఏక పార్టీ పాలన రావడం, ఆర్థిక అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ కట్టుబడి ఉండడం, దేశ ప్రజానీకం మార్పును కోరుతుండడంతో ఇన్వెస్టర్లలో సందేహాలు తొలగిపోతాయని విశ్వసిస్తున్నట్లు డాయిష్ బ్యాంక్ సోమవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. -
నిన్న లాభాలు, నేడు కష్టాలు