Projects Construction
-
ఎల్లో పత్రిక కుళ్లు రాతలు
-
ఏపీలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు ఇవే..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో రూ.10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ) గ్రౌండ్స్‌లో శనివారం జరిగే బహిరంగ సభా వేదికగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొననున్నారు. ప్రాజెక్టుల వివరాలు.. ► రూ. 460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ► రూ. 3,778 కోట్లతో రాయిపూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ హైవే ► రూ. 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు రోడ్డు నిర్మాణం ► రూ. 152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు ► రూ. 2658 కోట్లతో గెయిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంగుల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు నిర్మాణ పనులకు శంకుస్థాపన ► రూ. 211 కోట్లతో నరసన్నపేట పాతపట్నం రహదారి అభివృద్ధి పనులు జాతికి అంకితం ► రూ. 2,917 కోట్లతో నిర్మించిన ఓఎన్జీసీ యు ఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ జాతికి అంకితం ఇదీ చదవండి: ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన సీఎం జగన్ -
ప్రాజెక్టులకు సహకరించని రాష్ట్ర సర్కారు..కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కోసం కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల ఏర్పాటు విషయంలో ఏమాత్రం సహకరించట్లేదని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడే టీఆర్ఎస్ నాయకులు.. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఇప్పటివరకు ఎందుకు తిరిగి ప్రారంభించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు నాణ్యత సరిగా లేకనే కేంద్రం అక్కడ కర్మాగారం ఏర్పాటు చేసేందుకు విముఖత చూపుతోందని చెప్పారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. భూసేకరణలో రాష్ట్ర సర్కారు విఫలం రాష్ట్రానికి కేంద్రం ప్రాజెక్టులు కేటాయించినా.. అవసరమైన భూమిని సేకరించి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమౌతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎట్టకేలకు వరంగల్ జిల్లాలోని ములుగులో గిరిజన వర్సిటీకి స్థలాన్ని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్ సైన్స్ సిటీతో పాటు వరంగల్‌లో సైనిక్ స్కూల్‌కు భూమి కేటాయించలేదని ఆరోపించారు. ఎంఎంటీఎస్ అభివృద్ధికీ సహకరించట్లేదన్నారు. చర్లపల్లిలో రైల్వే మూడో టెరి్మనల్ కోసం భూకేటాయింపు చేయలేదన్నారు. గిరిజనబంధు కూడా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత దళిత బంధు పథకానికి అతీగతీ లేదని.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ తెరపైకి తెచి్చన గిరిజన బంధు పథకానికి కూడా ఉప ఎన్నిక తర్వాత అదే గతి పడుతుందని విమర్శించారు. కర్తవ్యపథ్‌లో బతుకమ్మ సంబురాలు ఆజాదీకా అమృత్ మహోత్సవ్, హైదరాబాద్ విమోచన దినోత్సవంలో భాగంగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దనున్న కర్తవ్యపథ్‌లో మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. చదవండి: రాజస్థాన్ సంక్షోభంపై రాహుల్ సమీక్ష -
ప్రాజెక్టులను చంద్రబాబు పట్టించుకున్న దాఖలాలు లేవు: మంత్రి అంబటి
సాక్షి, నంద్యాల: టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడు ప్రాజెక్టులను పట్టించుకోలేదు. చంద్రబాబు లాగా మాకు ప్రాజెక్ట్‌లపై ద్వంద వైఖరి ఉండదు. మాది రైతుల ప్రభుత్వమని ఏపీ జల వనురుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంత్రి అంబటి రాంబాబు మంగళవారం నంద్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ రాయలసీమకు వరం. పోలవరంను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. చంద్రబాబు ఏనాడు ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కానీ, ప్రతీ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయం. రాష్టంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల వద్ద గేట్లకు మరమ్మతులు చేపడుతున్నాము. చంద్రబాబు లాగా మాకు ప్రాజెక్టులపై ద్వంద వైఖరి ఉండదు. మాది రైతుల ప్రభుత్వం. వైఎస్సార్ కుటుంబం ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుంది. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కరువుతో రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. నేడు వర్షం కోసం రైతులు ఎదురుచూడాల్సిన పనిలేదని అన్నారు. -
పాత స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: ప్రాపర్టీలు, ప్రాంతం.. ఈ రెండింటికీ మధ్య దగ్గరి సంబంధం ఉంది. లొకేషన్ మీద ఆధారపడే రియల్ బూమ్ ఉంటుంది. ఇక, విద్యా, వైద్యం, వినోదం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే రియల్ ప్రాజెక్ట్లొస్తే? ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా చాలా వరకు నిర్మాణ సంస్థలు రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు చేస్తున్నాయి. పాత ఇళ్ల స్థలాల్లో కొత్తగా నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నాయి. రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు చేయాలంటే నివాస సముదాయాలకైతే వెయ్యి గజాల వరకు స్థలం అవసరం ఉంటుంది. మెయిన్ రోడ్డుకు ఉన్న ఇళ్ల స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన నగరంలో స్థల విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపు సగానికి పైగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కిందే ఉంటాయి. డెవలపర్‌కు, స్థల యజమానికి మధ్య 50:50 అగ్రిమెంట్ ఉంటుంది. పంజగుట్ట, సోమాజిగూడ, నల్లకుంట, హిమాయత్‌నగర్, బేగంపేట, అమీర్‌పేట్, బర్కత్‌పుర, తార్నాక, మారెడ్‌పల్లి, పద్మారావు నగర్ వంటి పాత రెసిడెన్షియల్ స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన నగరంలో నిర్మిస్తున్న వాటిల్లో 70 శాతం రీ–డెవలప్మెంట్ ప్రాజెక్టులే. ఎవరికేం లాభమంటే? స్థల యజమాని: తన పాత స్థలంలో కొత్త భవనం రావటంతో పాటూ ముందస్తుగా కొంత సొమ్ము వస్తుంది. పైగా డెవలప్మెంట్ ఒప్పందం కింద తన వాటాగా కొన్ని ఫ్లాట్లూ వస్తాయి. నిర్మాణ సంస్థ: అభివృద్ధి చెందిన ప్రాంతం కావటంతో విక్రయాలు త్వరగా పూర్తవుతాయి. దీంతో తక్కువ సమయంలో పెట్టిన పెట్టుబడి, లాభం వస్తుంది. కొనుగోలుదారులు: మెరుగైన రవాణా సదుపాయాలతో పాటూ విద్యా, వైద్యం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతంలో న్యాయపరంగా ఎలాంటి చిక్కుల్లేని సొంతిల్లు ఉంటుంది. నిర్మాణ వ్యయం 15 శాతం ఎక్కువ.. రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌ల స్థలాల టైటిల్స్ క్లియర్‌గా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైంది డాక్యుమెంటేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి నిర్మాణ అనుమతులూ త్వరగానే వచ్చేస్తాయి. శివారు ప్రాంతాలతో పోలిస్తే ప్రధాన నగరంలోని నిర్మాణంలో నాణ్యత కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్మాణ వ్యయం 10–15 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. పైగా చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ లిఫ్ట్, ట్రాన్స్ఫార్మర్, మోటార్ వంటి ఏర్పాట్లూ ఉంటాయి. ఫ్లాట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కామన్ వసతుల వ్యయం తగ్గుతుంది. ఆయా ప్రాజెక్ట్లల్లో ఫ్లాట్ల అమ్మకాలకు పెద్దగా ఇబ్బంది కాబట్టి నిర్మాణం కూడా త్వరగా పూర్తవుతుంది. బేసిక్ వసతులుంటాయ్.. స్థలం కొరత కారణంగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లల్లో బేసిక్ వసతులను మాత్రమే కల్పిస్తుంటారు. సోలార్ వాటర్, వీడియో డోర్ ఫ్లోర్, టెర్రస్ పైన గార్డెనింగ్, పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లిఫ్ట్, జనరేటర్ బ్యాకప్ వంటి వసతులుంటాయి. అపార్ట్మెంట్ కమ్యూనిటీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఫ్లాట్ యజమానులతో పెద్దగా ఇబ్బందులుండవు. కొత్త ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. నగరంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు వీలుగా 24 గంటల పాటు రవాణా సౌకర్యాలుంటాయి. షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, అంతర్జాతీయ విద్యా కేంద్రాలుంటాయి. పాత స్థలాల్లో కమర్షియల్ కూడా.. ప్రధాన నగరంలో నిర్మిస్తున్న రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లల్లో వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నాయి. మెయిన్ రోడ్డుకు ఉండే పాత ఇళ్లు, చిన్న చిన్న హోటళ్లు, పాత థియేటర్లున్న ప్రాంతాల్లో కమర్షియల్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. గతంలో రోడ్డు మీదుండే హోటళ్లు, పాత ఇళ్లు మెట్రో పిల్లర్ల కారణంగా కొంత ఇరుకుగా మారాయని దీంతో ఆయా స్థలాల యజమానులు రీ–డెవలప్మెంట్కు ముందుకొస్తున్నారని తెలిపారు. స్థానికంగా ఉన్న రోడ్డు వెడల్పు, మున్సిపల్ నిబంధన ప్రకారం రీ–డెవలప్మెంట్ కమర్షియల్ నిర్మాణాలుంటాయి. రీ–డెవలప్మెంట్ ఎందుకంటే? సాధారణంగా ప్రధాన నగరంలో ఖాళీ స్థలాల కొరత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు మాత్రమే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇల్లు పాతపడిందనో లేక స్థల యజమాని ఆర్థిక పరిస్థితుల కారణంగానో రీ–డెవలప్మెంట్ కోసం ముందుకొస్తారని ఓ డెవలపర్ తెలిపారు. ఇవే కాకుండా.. ♦ తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచుకోవాలంటే స్థలం కొద్దిగా ఉంటుంది. అందుకే రీ–డెవలప్మెంట్కి ఇచ్చి అందులో వచ్చిన ఫ్లాట్లను స్థల యజమాని వారసులు తలా ఒకటి తీసుకుంటారు. ♦ పాత ఇళ్ల నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్‌లు ప్రస్తుత భవన నిర్మాణ నిబంధనల ప్రకారం ఉంటాయి. పైగా ఇప్పటికి ట్రెండ్స్‌కు తగ్గట్టు భవన నిర్మాణం, ఎలివేషన్, వసతులుంటాయి. ♦ రీ–డెవలప్మెంట్కు ముందుకొచ్చే స్థల యజమానికి డెవలపర్ నుంచి మార్కెట్ విలువ 10–15 శాతం వరకు నాన్ రీఫండబుల్ కింద కొంత సొమ్ము వస్తుంది. కాబట్టి వ్యక్తిగత అవసరాలకు పనికొస్తాయి. ♦ స్థల యజమానికి వచ్చే ఫ్లాట్ల నుంచి ప్రతి నెలా అద్దె వస్తుంది. ఒకవేళ ఫ్లాట్‌ను విక్రయించుకుంటే మంచి ధర పలుకుతుంది. ♦ స్థలం, అసెట్స్ విలువ పెరుగుతుంది. ఆయా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. -
1,100 ఎకరాలు 19 ప్రాజెక్ట్‌లు
నిర్మాణంలో నాణ్యత, గడువులోగా కొనుగోలుదారులకు అప్పగింత.. ఇవే వ్యాపార లక్ష్యంగా చేసుకొని నివాస సముదాయాలను నిర్మిస్తోన్న ప్రణీత్ గ్రూప్... నగరం నలువైపులా విస్తరణకు ప్రణాళికలు చేపట్టింది. గతంలో బాచుపల్లి, బీరంగూడ వంటి ప్రాంతాలకే పరిమితమైన ఈ సంస్థ... అన్ని ప్రధాన ప్రాంతాలలో ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. కొల్లూరు, దుండిగల్, పటాన్చెరు, అన్నోజిగూడ, బీఎన్ రెడ్డి నగర్, ఖాజాగూడ, మియాపూర్ వంటి ప్రాంతాలలో సుమారు 1,100 ఎకరాలలో 19 ప్రాజెక్ట్‌లను నిర్మించనున్నట్లు కంపెనీ ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్రకుమార్ కామరాజు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. సాక్షి, హైదరాబాద్: ఇటీవలే 14 వసంతాలు పూర్తి చేసుకున్న ప్రణీత్ గ్రూప్.. ఇప్పటివరకు 1.1 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 22 ప్రాజెక్ట్‌లలో సుమారు 5 వేల గృహాలను నిర్మించింది. ప్రస్తుతం 75 లక్షల చ.అ.లలో 8 ప్రాజెక్ట్‌లు, సుమారు 3,500 యూనిట్లు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. వచ్చే ఏడాది కాలంలో 1,600 గృహాలను డెలివరీ చేయడంతో పాటు సుమారు 5 వేల ఫ్లాట్లను ప్రారంభించనున్నాం. ►మల్లంపేటలో 30 ఎకరాలలో లీఫ్ ప్రాజెక్ట్‌ను నిర్మి స్తు న్నాం. 10 లక్షల చ.అ.లలో ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 502 విల్లాలుంటాయి. ధర చ.అ.కు రూ.7,500. విల్లాల డెలివరీ మొదలైంది. ఈ డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. ►బాచుపల్లిలో 6 ఎకరాలలో టౌన్‌స్క్వేర్ అపార్ట్మెం ట్. 7 లక్షల చ.అ.లలో మొత్తం 527 యూనిట్లుం టాయి. 2.5, 3 బీహెచ్‌కే ఫ్లాట్లు. ధర చ.అ.కు రూ.5 వేలు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి అప్పగింత మొదలవుతుంది. ►బహుదూర్‌పల్లిలో 4.5 ఎకరాలలో ఫ్లోరా ప్రాజెక్ట్. 5 లక్షల చ.అ.లలో రెసిడెన్షియల్, కమర్షియల్ రెండు రకాల నిర్మాణాలుంటాయి. 2, 2.5, 3 బీహెచ్‌కే మొత్తం 392 యూనిట్లుంటాయి. ధర చ.అ.కు రూ.4,200. ఇందులో 31 వేల చ.అ.లలో కమర్షియల్ స్పేస్ కూడా ఉంటుంది. వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి డెలివరీ మొదలవుతుంది. ►కొల్లూరులో 2.5 ఎకరాలలో ఎలైట్ ప్రాజెక్ట్. 2.65 లక్షల చ.అ.లలో మొత్తం 144 యూనిట్లుంటాయి. అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే. ధర చ.అ.కు రూ.4,800. ఈ ఏడాది డిసెంబర్ నుంచి డెలివరీ మొదలవుతుంది. ►బీరంగూడలో 30 ఎకరాలలో నైట్వుడ్స్ విల్లా ప్రాజెక్ట్. 150–250 గజాల మధ్య మొత్తం 460 విల్లాలుంటాయి. ధర చ.అ.కు రూ. 7 వేలు. 2023 జూలై నుంచి డెలివరీ మొదలవుతుంది. 3 నెలల్లో ప్రారంభం.. ►హైదర్‌నగర్‌లో 5 ఎకరాలలో జైత్ర పేరిట జీ+14 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నాం. 12.2 లక్షల చ.అ.లో మొత్తం 576 యూనిట్లుంటాయి. 2024 జూలై నుంచి డెలివరీ మొదలవుతుంది. ధర చ.అ. రూ.6,500. బాచుపల్లిలో 5 ఎకరాలలో సాలిటైర్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 12 లక్షల చ.అ.లలో మొత్తం 668 ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.5,500. బెంగళూరులో తొలి ప్రాజెక్ట్.. ►మల్లంపేట దగ్గర్లోని శంభీపూర్లో 4 ఎకరాలలో డఫోడిల్స్ ప్రాజెక్ట్. 4 లక్షల చ.అ.లలో మొత్తం 300 యూనిట్లుంటాయి. ధర చ.అ.కు రూ.4,500. ►ఘట్కేసర్ దగ్గర్లోని అన్నోజిగూడలో 6.5 ఎకరాలలో, 12 లక్షల చ.అ.లలో హైరైజ్ అపార్ట్మెంట్ రానుంది. ఇందులో 700 యూనిట్లుంటాయి. చ.అ.కు రూ.4,500. ►కొల్లూరు దగ్గర్లోని వెలిమల ప్రాంతంలో 11 ఎకరాలలో నవనీత్ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నాం. మొత్తం 20 లక్షల చ.అ.లు కాగా.. ఫేజ్–1 కింద 12 లక్షల చ.అ.లలో 650 యూనిట్లను నిర్మించనున్నాం. ఫేజ్–2లో 8 లక్షల చ.అ.లను అభివృద్ధి చేస్తాం. ధర చ.అ.కు రూ.5 వేలు. ►వచ్చే ఏడాది బెంగళూరులో తొలి ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. సజ్జాపూర్ రోడ్లో 17 ఎకరాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్, ఐటీ స్పేస్‌ను అభివృద్ధి చేయనున్నాం. గ్రోవ్ పార్క్‌లో బోటింగ్ హైదరాబాద్‌లో తొలిసారిగా బోటింగ్ సౌకర్యంతో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. లగ్జరీ వసతులు, గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యమిస్తూ కొనుగోలుదారులకు సరికొత్త అనుభూతులను అందించే లా డిజైన్స్లను ఎంపిక చేస్తున్నాం. దుండిగల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి 1.5 కి.మీ దూరంలో గాగిళ్లపూర్లో గ్రోవ్పార్క్ పేరిట ఇంటిగ్రేటెడ్ గ్రూప్ హౌసింగ్ విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నాం. వెంచర్ మధ్యలో సరస్సు కొలువై ఉండటం దీని ప్రత్యేకత. మొత్తం 78 ఎకరాల ప్రాజెక్ట్ కాగా.. ఇందులో 62 ఎకరాలలో మాత్రమే విల్లాలుంటాయి. 7 ఎకరాలలో లేక్ పోగా.. 9 ఎకరాల స్థలాన్ని ల్యాండ్ స్కేపింగ్, ఇతరత్రా వసతులకు కేటాయించాం. లేక్ చుట్టూ గ్రీనరీ, బోటింగ్, ఇతరత్రా సౌకర్యాలతో పూర్తి గా పర్యావరణ హితమైన ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతాం. ♦ప్రాజెక్ట్‌లో మొత్తం 1,000 లగ్జరీ విల్లాలుంటాయి. 150 గజాలు, 400 గజాలలో ట్రిపులెక్స్ విల్లాలు... ఒక్కోటి 2 వేల చ.అ. నుంచి 5 వేల చ.అ. మధ్య విస్తీర్ణాలలో ఉంటుంది. ధర చ.అ.కు రూ.6,500. నిర్మాణ అనుమతులు తుది దశలో ఉన్నాయి. ఈ ఏడాది ముగింపు నాటికి ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. మూడేళ్లలో పూర్తి చేస్తాం. ♦ఇందులో 70 వేల చ.అ.లలో క్లబ్‌హౌస్, ఓపెన్ థియేటర్, ఫ్రాగ్రెన్స్ గార్డెన్, బటర్‌ఫ్లై గార్డెన్, ఓర్చిడ్ గార్డెన్, పెట్స్ పార్క్, పార్టీ లాన్స్ వంటివి అభివృద్ధి చేస్తాం. వీటితో పాటు టెన్నిస్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, క్రికెట్ పిచ్, బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్ట్స్, అవెన్యూ ప్లాంటేషన్, స్కేటింగ్ రింక్, ఔట్‌డోర్ జిమ్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. -
ఆ 37 ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాలను వినియోగిస్తూ నిర్మిస్తున్న, నిర్మించ తలపెట్టిన మొత్తం 37 ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ స్పెషల్ సీఎస్‌కు లేఖ రాసింది. డీపీఆర్‌లు సమర్పించాలని ఇప్పటికే కోరినా రాష్ట్రం ఇంతవరకు స్పందించలేదని గుర్తు చేసింది. బోర్డు, కేంద్ర జల సంఘం అనుమతి ఇవ్వకుండా, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టరాదని గతంలో లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేసింది. ఏపీ ఫిర్యాదు నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రెండు వేర్వేరు లేఖ ల్లో బోర్డును కోరింది. ఇప్పటికే ఆరింటిని పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తోందని ఫిర్యాదు చేసింది. ఏపీ ఫిర్యాదు చేసిన ప్రాజెక్టుల్లో పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల వంటి ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. అలాగే కొత్తగా చేపడతామని ప్రకటించిన జోగుళాంబ బ్యారేజీ, భీమాపై వరద కాల్వ, కల్వకుర్తి పరిధిలో రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, పులిచింతల పరిధిలో ఎత్తిపోతలు, సాగర్ టెయిల్‌పాండ్‌లో ఎత్తిపోతల పథకాలు కూడా ఉన్నాయి. కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాల పరిధిలో 13 ఎత్తిపోతల పథకాలను చేపట్టేలా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు కూడా ఏపీ తెలిపింది. ఏపీ లేఖల నేపథ్యంలో స్పందించిన బోర్డు తాజాగా తెలంగాణకు లేఖ రాసింది. కాగా, శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామంటూ ఏపీ చేసిన విజ్ఞప్తిపై అభిప్రాయం తెలియజేయాలని, మరో లేఖలో తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు కోరింది. రేపటి నుంచి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ ఢిల్లీ వెళ్లిన అంతర్రాష్ట్ర జలవిభాగపు ఇంజనీర్లు సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీజలాల పంపకాల కోసం ఏర్పాటైన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ బుధవారం తిరిగి మొదలు కానుంది. ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరఫున సాక్షిగా ఉన్న కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఘన్‌శ్యామ్ ఝాకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది పలు ప్రశ్నలు సంధించనున్నారు. గత మార్చిలో జరిగిన విచారణ సందర్భంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు, కేసీ కెనాల్‌కు సంబంధించిన పలు అంశాలపై ఏపీ తరపు సీనియర్ న్యాయవాది వెంకటరమణి ప్రశ్నలు లేవనెత్తగా తెలంగాణ తరఫు సాక్షి సమాధానమిచ్చారు. ప్రస్తుత విచారణలో ఇవే అంశాలపై క్రాస్ ఎగ్జామిన్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అంతర్రాష్ట్ర జలవిభాగపు ఇంజనీర్లు సోమవారమే ఢిల్లీ వెళ్లారు. వాదనలపై తెలంగాణ తరఫు న్యాయవాది వైద్యనాథన్‌తో వారు చర్చించనున్నారు. -
గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్‌లు పంపండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ బేసిన్లో చేపట్టిన కొత్త ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లను తక్షణమే పంపాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. గతంలో జరిగిన బోర్డు భేటీలు, అపెక్స్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన హామీల మేరకు వ్యవహరించాలని.. త్వరగా డీపీఆర్‌లను అందించేలా సంబంధిత అధికారులను ఆదేశించా లని కోరింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జల వనరుల శాఖ కార్యదర్శులకు బోర్డు సభ్యుడు పీఎస్ కుటియాల్ శుక్రవారం లేఖ రాశారు. గత ఏడాది జూన్‌లో జరిగిన బోర్డు భేటీ సందర్భంగా.. ప్రభుత్వ అనుమతి తీసుకొని డీపీఆర్‌లు సమర్పి స్తామని తెలంగాణ అధికారులు వెల్లడించారని, ఏపీ అధికారులు కూడా ఇంకా డీపీఆర్‌లు ఇవ్వని ప్రాజెక్టుల వివరాలు అందజేస్తామని పేర్కొన్నారని వివరించారు. జూన్ 10 నాటికల్లా డీపీఆర్‌లు సమర్పించాలని బోర్డు ఛైర్మన్ ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. గత ఏడాది అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా కూడా.. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని కేంద్ర జల శక్తి మంత్రి సూచించారని.. దానికి ఇరు రాష్ట్రాల సీఎంలు అంగీకరించారని లేఖలో ప్రస్తావించారు. ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దన్నా.. రెండో అపెక్స్ భేటీ తర్వాత డీపీఆర్‌లు సమర్పించాలని బోర్డు నవంబర్‌లో ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసిందని, అనుమతులు లేని ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లరాదని ఆదేశించిందని పీఎస్ కుటియాల్ లేఖలో గుర్తు చేశారు. ఎన్నిసార్లు కోరినా తెలంగాణ డీపీఆర్‌లు ఇవ్వలేదన్నారు. ఏపీ పట్టిసీమ, పురుషోత్తమపట్నం డీపీఆర్‌లు ఇచ్చినా, పూర్తి వివరాలు లేవని.. వాటిని పొందుపరచాలని సూచించామని తెలిపారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టిపెట్టాలని.. వెంటనే డీపీఆర్‌లు అందించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. కాగా డీపీఆర్‌లు ఇవ్వాలని బోర్డు కోరిన ప్రాజెక్టుల్లో.. గోదావరి ఎత్తిపోతల పథకం ఫేజ్–3, సీతారామ, కంతనపల్లి, మిషన్ భగీరథ, లోయర్ పెన్‌గంగపై చేపట్టిన మూడు బ్యారేజీలు, రామప్ప–పాకాల నీటి తరలింపు, కాళేశ్వరంలోని మూడో టీఎంసీకి సంబంధించిన పనులు ఉన్నాయి. -
కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దని తెలంగాణకు కేంద్రం స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దని తెలంగాణకు కేంద్రం స్పష్టం చేసింది. కాగా అనుమతులు వచ్చేవరకు నీటి కేటాయింపులు, నిర్మాణాలు చేపట్టొద్దని తెలంగాణకు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రాజెక్టుల డీపీఆర్‌లకు అనుమతులు, అపెక్స్ కౌన్సిల్‌తో పాటు జలశక్తి, సీడబ్ల్యూసీ అనుమతులు తప్పనిసరి చేసింది. చదవండి: పొలాల్లోనే రైతుబంధు నగదు -
జేఎంసీ ప్రాజెక్ట్స్- కేన్ ఫిన్ హోమ్ జూమ్
వరుసగా మూడో రోజు సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్డర్లు పొందిన వార్తలతో మౌలిక సదుపాయాల కంపెనీ జేఎంసీ ప్రాజెక్ట్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మార్టిగేజ్ సంస్థ కేన్ ఫిన్ హోమ్ ఫైనాన్స్ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. జేఎంసీ ప్రాజెక్ట్స్ దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర నుంచి తాజాగా రూ. 554 కోట్ల విలువైన ఆర్డర్లు పొందినట్లు వెల్లడించడంతో జేఎంసీ ప్రాజెక్ట్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో తొలుత 16 శాతం దూసుకెళ్లి రూ. 62ను అధిగమించింది. ప్రస్తుతం 13 శాతం ఎగసి రూ. 60.5 వద్ద ట్రేడవుతోంది. బిల్డింగ్ నిర్మాణాలకు దక్షిణాది నుంచి రూ. 315 కోట్ల కాంట్రాక్టు లభించగా.. మహారాష్ట్ర నుంచి ఫ్యాక్టరీ ఏర్పాటుకుగాను రూ. 239 కోట్ల ఆర్డర్ దక్కినట్లు జేఎంసీ తెలియజేసింది. ఫలితంగా ఆర్డర్ బుక్ విలువ తాజాగా రూ. 4,000 కోట్లకు చేరినట్లు మౌలిక సదుపాయాల దిగ్గజం కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్కు అనుబంధ సంస్థ జేఎంసీ ప్రాజెక్ట్స్ వెల్లడించింది. కేన్ ఫిన్ హోమ్ ఫైనాన్స్ కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ కేన్ ఫిన్ హోమ్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో రూ. 93 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 15 శాతం వృద్ధికాగా.. నికర వడ్డీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 522 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 2 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలుత కేన్ ఫిన్ హోమ్ షేరు ఎన్ఎస్ఈలో 9 శాతం జంప్‌చేసి రూ. 420కు చేరింది. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 398 వద్ద ట్రేడవుతోంది. -
జూన్ 2న కాంగ్రెస్ శ్రేణుల దీక్ష
సాక్షి, హైదరాబాద్: కొత్త ప్రాజెక్టులు కట్టేది నీళ్ల కోసం కాదు జేబులు నింపుకోవడానికే అని తెలంగాణ పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్లైన్ క్యాంపెయిన్ చేపట్టాలన్నారు. జూన్ రెండవ తేదీన ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టాలి అని ఉత్తమ్ పిలుపునిచ్చారు. కాళేశ్వరం నుంచి రెండు టీఎంసీల నీటిని తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చుచేశారన్నారు. తరతరాలను ఇందుకోసం తాకట్టు పెట్టారని మండిపడ్డారు. (కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు!) లక్ష కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్‌కు గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్లేవని కానీ ఆరేళ్లలో టన్నెల్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదని ఆరోపించారు. కరోనాపై అంతర్జాతీయ నిపుణులు కేసీఆరే, ఇరిగేషన్‌పై అంతర్జాతీయ నిపుణులు కేసీఆర్, వ్యవసాయంపై కూడా అంతర్జాతీయ నిపుణులు కేసీఆరే అని చెప్పుకుంటున్నారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. ఎవరైనా మాట్లాడేందుకు వెళితే ప్రతిపక్షాలను, మీడియాను తన అహంకారపు వ్యాఖ్యలతో సీఎం కేసీఆర్ విమర్శిస్తున్నారని ఉత్తమ్ ధ్వజమెత్తారు. ఆరేళ్ల తర్వాత కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు వందశాతం పూర్తి కాలేదని ఉత్తమ్ ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు సీఎం కేసీఆర్‌కు జీవితం ఇస్తే అక్కడ డబ్బులు ఖర్చు పెడితే కమిషన్ తక్కువ వస్తుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారా అని నిలదీశారు. జూన్ 2న మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ప్రాజెక్టుల వద్ద ఒక రోజు దీక్ష చేపట్టాలి అని ఉత్తమ్ పిలుపునిచ్చారు. (ఆ తర్వాతే షూటింగ్‌లకు అనుమతి: తలసాని) -
ఇసుకకు ఇక్కట్లే!
ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగంగా కొనసాగాలంటూ ప్రభుత్వ ఆదేశాలు ఒకవైపు... ఇసుక లభ్యత తగ్గుదల మరోవైపు.. వెరసి అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి ఇసుక లభ్యత తగ్గుతుండటంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. గోదావరి నదీ తీర ప్రాంతాల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉండటంతో ఇసుక లభ్యత కష్టంగా మారింది. ప్రాజెక్టుల ప్రాంతాల్లో నీటి నిల్వలు తగ్గితేగానీ ఇసుక తీయడం సాధ్యమయ్యేలా లేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగించేందుకు ఇసుక ఇక్కట్లు తప్పేలా లేవు. ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన మేర.. ఇసుక లభ్యత లేకపోవడం పెను ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి. ఇసుక లభ్యత అధికంగా ఉండే గోదావరి నదీ తీర ప్రాంతాల్లోని బ్యారేజీలు, రిజర్వాయర్లలో నీటి లభ్యత అధికంగా ఉండటంతో కొరత తీవ్రమవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుల పనులు వేగంగా కొనసాగించాల్సిన సమయంలో లభ్యత తగ్గుతుండటం శాఖకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రాజెక్టులేమో నిండు కుండలా.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ఇదివరకే నిర్ణయించింది. సాగునీటి శాఖ చేపట్టిన బ్యారేజీల వద్ద ఇసుక తవ్వకాలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. ప్రధానంగా ప్రాజెక్టులు చేపడుతున్న పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో ఇసుక తవ్వకాలు చేపడుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ వద్ద 4.18 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యత ఉంటుందని గుర్తించి, అక్కడి నుంచే ప్రాజెక్టుల అవసరాలకు వాడుకున్నారు. అన్నారం బ్యారేజ్ వద్ద మరో 1.26 కోట్ల క్యూబిక్ మీటర్లు, సుందిళ్ల వద్ద సైతం అదే స్థాయిలో ఇసుక లభ్యత ఉంటుం దని గుర్తించి ఇందులో కొంతమేర వినియోగం చేశారు. అయితే ప్రస్తుతం ఈ బ్యారేజీలన్నీ నిండుకుండలుగా ఉన్నాయి. మేడిగడ్డలో 16.12 టీఎంసీలకు ప్రస్తుతం 14 టీఎంసీల మేర నిల్వలున్నాయి. అన్నారంలోనూ 10.87 టీఎంసీలకు గాను 6 టీఎంసీల మేర లభ్యత ఉంది. దీంతో ఇక్కడి నుంచి ఇసుక తీయడం సాధ్యం కాదు. సుందిళ్లలోనూ ఇదే పరిస్థితి మిడ్‌మానేరు రిజర్వాయర్ పరిధిలోనూ నీటి నిల్వలు నిండుగా ఉన్నాయి. 25.87 టీఎంసీలకు గాను, 24 టీఎంసీల మేర నిల్వలు ఉండటం, ఎగువ నుంచి నీటి ప్రవాహం కొనసాగుతుండటం, దిగువకు వదులుతుండటంతో పరీవాహకంలోనూ పూర్తిగా ఇసుక లభ్యత తగ్గింది. అవసరాలేమో ఆకాశంలో.. సమయంలో సాగునీటి ప్రాజెక్టులకు ఇసుకఅవసరాలు మాత్రం గణనీయంగా పెరిగాయి. ప్రధాన ప్రాజెక్టులకు మొత్తంగా 3కోట్ల క్యూబిక్ మీటర్ల అవసరం ఉండగా, ఇప్పటివరకు 1.50కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక వినియోగం జరగ్గా, మరో 1.50కోట్ల ఇసుక అవసరాలున్నాయని ఖనిజాభివృధ్ధి సంస్థకు నివేదిక అందింది. ఇందులో ఒక్క కాళేశ్వరం పరిధిలోనే 75 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంటుందని తేల్చారు. ఇందులో మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి 40 లక్షల క్యూబిక్ మీటర్లు అవసరం కాగా ఇందులో 18 లక్షలు వినియోగం చేయగా, 22 లక్షల క్యూబిక్ మీటర్లు ఇంకా వినియోగించాల్సి ఉంది. వీటితో ఆదిలాబాద్ జిల్లాలోని కుఫ్టి, పెనుగంగ, చనాకా–కొరట, సదర్‌మఠ్ సహా ఇతర పనులకు 18 లక్షల క్యూబిక్ మీటర్లు, సీతారామ ఎత్తిపోతలకు 3.5 లక్షలు, దేవాదుల పరిధిలో 5.75 లక్షలు, పాలమూరులోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాల పరిధిలో మరో 3 లక్షలు, నల్లగొండ జిల్లాలోని డిండి, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులకు 26 లక్షల క్యూబిక్ మీటర్ల మేర అవసరాలను ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో ఈ సీజన్లోనే జూన్ వర్షాలు కురిసే నాటికి 50 నుంచి 75 లక్షల క్యూబిక్ మీటర్లు అవసరం కానుంది. ఈ స్థాయిలో ప్రస్తుతం ఇసుక లభ్యత లేదు. తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల ప్రాంతాల్లోనే కొద్దిమేర లభ్యత ఉండగా, దాన్ని స్థానిక కాల్వలు, బ్యారేజీ, పంప్‌హౌస్‌ల నిర్మాణాలకు వాడుతున్నారు. ఖాళీ అయితే లభ్యత ఓకే.. ఏప్రిల్ నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఖాళీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కాస్త ఉపశమనం కల్గించేలా ఉంది. ఏప్రిల్ నుంచి బ్యారేజీలు ఖాళీ అయితే మూడు నెలల పాటు ఇసుక తీసుకునే అవకాశం దొరుకుతుంది. కనిష్టంగా కోటి క్యూబిక్ మీటర్ల మేర తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక తుపాకులగూడెం, దమ్ముగూడెం ఎగువన గోదావరి ప్రవాహాలు తగ్గడంతో ఇసుక లభ్యత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఇసుకతోనే గట్టెక్కాలని సాగునీటి శాఖ భావిస్తోంది. -
అద్భుతాల కోసం ప్రాజెక్టులు కట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలకోసం భారీ ప్రాజెక్టులు చేపట్టేకంటే ఉపరితల నీరు, భూగర్భ జలాల సమగ్ర వినియోగంపై దృష్టి పెట్టాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దక్షిణాది రాష్ట్రాలకు సూచించారు. ఎక్కడి నీటిని అక్కడే వినియోగించేలా ప్రభుత్వాల విధానాలు, కార్యాచరణలు ఉండాలని తెలిపారు. అంతేతప్ప భారీ ప్రాజెక్టులు చేపట్టి, వాటికి కేంద్రం నిధులు ఇవ్వాలని కోరితే మాత్రం తాము ఇవ్వలేమని తేల్చిచెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే భారీ ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. అద్భుతాల కోసం ప్రాజెక్టులు కట్టొద్దన్నారు. కేంద్రం తీసుకొచ్చిన జల్‌జీవన్ మిషన్ అంశంపై జలశక్తి శాఖ దక్షిణాది రాష్ట్రాలతో హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్లో సోమవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ రాష్ట్రాల నీటిపారుదల, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు హాజరయ్యారు. తెలంగాణ తరఫున మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఏపీ జలవనరుల మంత్రి అనిల్ కుమార్, కర్ణాటక మంత్రి ఈశ్వరప్పతో పాటు సీఎస్ ఎస్కే జోషి, నీటిపారుదల శాఖ ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్, కాడా కమిషనర్ మల్సూర్, సీఈలు బంగారయ్య, వీరయ్య, మోహన్‌కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదట జలశక్తి శాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ జల్‌మిషన్ ప్రాథమ్యాలను వివరించారు. దేశంలోని 14.60 కోట్ల గ్రామీణ ప్రాంత గృహాలకు సురక్షిత నీటి సరఫరా చేసేందుకు కేంద్రం నిర్ణయించిందని, దీనికోసం 2024 నాటికి ఏడాదికి రూ.40 వేల కోట్ల చొప్పున రూ.2 లక్షల కోట్లు కేంద్రం ఖర్చు చేయనుందని తెలిపారు. అనంతరం తెలంగాణసహా మిగతా రాష్ట్రాలు తాము చేపడు తున్న ప్రాజెక్టులు, వాటికి ఖర్చు చేస్తున్న నిధులు, వాటి ప్రయోజనాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించాయి. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు తమ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందించాలని గట్టిగా కోరాయి. దీనిపై చివరగా కేంద్ర మంత్రి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రోల్స్‌రాయిస్ మీరిచ్చుకోండి.. మీ రాష్ట్రాల ప్రజలకు రోల్స్ రాయిస్ కారివ్వాలని అనుకుంటే రాష్ట్రాల నిధుల్లోంచి యథేచ్ఛగా నిధులు ఇచ్చుకోవచ్చని, అయితే కేంద్రం మాత్రం మారుతి–800 కారు మాత్రమే ఇస్తుందని షెకావత్ స్పష్టం చేశారు. అద్భుతమైన ప్రాజెక్టులు కట్టి మేము ఎక్కువ నిధులు ఖర్చు చేశాం కాబట్టి, కేంద్రం నిధులు ఇవ్వాలంటే మాత్రం తాము ఇవ్వలేమన్నారు. ఏపీ, తెలంగాణకంటే ఎక్కువ నీటి ఎద్దడి ఉన్న రాష్ట్రాలున్నాయని, నీటి ఎద్దడి ఉందన్న కారణంగా ఎక్కువ నిధులు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తామన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే భారీ ప్రాజెక్టులు కట్టాలని హితవు పలికారు. నీటి సద్వినియోగం కోసం అందరం కృషి చేయాలని, గ్రామం యూనిట్‌గా తాగునీటి సదుపాయాలు కల్పించాలన్నారు. నీటి పునర్వినియోగంలో రామకృష్ణా మిషన్ మోడల్ చాలా బాగుందని, దానిపై రాష్ట్రాలు దృష్టి సారించాలన్నారు. జలజీవన్ మిషన్ కింద మొదటి విడత నిధులు విడుదల చేశామని, రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి పనులు చేపట్టాలన్నారు. జల్ జీవన్ మిషన్ విజయవంతం కావడానికి తొలి ఆరు నెలల పనితీరే కీలకమని, సంబంధిత అధికారులంతా మిషన్ పనులను ప్రారంభించడంతో పాటు మెరుగైన పనితీరును కనబరచాలని షెకావత్ అన్నారు. నదుల అనుసంధానానికి నిధులివ్వాలి ఏపీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ, పోలవరం నుంచి రాయలసీమ ప్రాంతాలకు తాగు, సాగు నీరిచ్చేలా గోదావరి–పెన్నా నదుల అనుసంధానం చేపడుతున్నామని తెలిపారు. దీన్ని 2021 నాటికి పూర్తి చేస్తామని, దీనికి కేంద్ర సహకారం అందించాలని కోరారు. ఏపీ పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజ శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఏపీలో ఎక్కువగా గిరిజన, కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాలున్నాయని, ఇక్కడి తాగునీటి అవసరాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఎక్కువ నిధులివ్వాలని కోరారు. ఇదే సమయంలో కర్ణాటక ప్రతినిధులు మాట్లాడుతూ, మిషన్ భగీరథపై ప్రశంసలు కురిపించారు. ‘భగీరథ’కి నిధులివ్వాలి సీఎస్ ఎస్కే జోషి తెలంగాణ తరఫున సీఎస్ ఎస్కే జోషి మాట్లాడుతూ, రక్షిత తాగునీటి సరఫరాలో అన్ని రాష్ట్రాలకన్నా తెలంగాణ ముందుందని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇప్పటికే తాగునీటి సరఫరా చేస్తున్నామని, భారీగా అప్పులు తెచ్చి దీన్ని పూర్తి చేశామని, వాటి తిరిగి చెల్లింపులకు కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్న రాష్ట్రాలకు మరిన్ని నిధులు పెంచాలన్నారు. అన్ని రాష్ట్రాలను ఒకే గాటన కట్టకుండా, పనిచేసే రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న షెకావత్. చిత్రంలో సీఎస్ జోషి, మంత్రి దయాకర్‌రావు, ఏపీ మంత్రి అనిల్ తదితరులు -
అత్యవసర ప్రాజెక్టులకే ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: అత్యవసరంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. 25 శాతంలోపు పూర్తయిన సాగునీటి ప్రాజెక్టుల పనులపై శుక్రవారం సచివాలయంలో జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్లతో ఆయన సమావేశమయ్యారు. 25 శాతంలోపు పనులు పూర్తయిన ప్రాజెక్టుల విలువ రూ.22,880.44 కోట్లని, ఇప్పటివరకూ చేసిన పనులకు రూ.1,191.15 కోట్లు బిల్లులు చెల్లించామని.. ఆ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రూ.21,689.29 కోట్లు అవసరమని ఆదిత్యనాథ్ దాస్ మంత్రి బుగ్గనకు వివరించారు. ఈ ప్రాజెక్టుల్లో అవసరమైనవి ఏవి? అనవసరమైనవి ఏవి? అన్నది గుర్తించాలని మంత్రి సూచించారు. -
ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం మొదలుకానున్న నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, రిజర్వాయర్లు, హెడ్ రెగ్యులేటర్ల పరిధిలోని గేట్లు, కాల్వలు, డిస్ట్రిబ్యూటర్లు, తూముల నిర్వహణను ప్రాధాన్యతగా తీసుకుంది. ప్రాజెక్టుల గేట్లు వాటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విషయంలో అత్యం త శ్రద్ధ చూపాలని, గోదావరి, కృష్ణా నదులకు వరద పుంజుకునే సమయానికి నిర్వహణ అంశాలన్నింటినీ చక్కబెట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి 12 గంటల వరకు జరిగిన సమీక్షలో ప్రధానంగా ప్రాజెక్టుల గేట్లు, తూములు, కాల్వలు, హెడ్ రెగ్యులేటరీల నిర్వహణ అంశాలపై కాళేశ్వరం, ఎస్సారెస్పీ, కడెం, పాలమూరు–రంగా రెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, జూరాలకు చీఫ్ ఇంజనీర్లకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భం గా వరదల నిర్వహణ లోపాలను ఎత్తిచూపుతూ ఈ నెల ‘సాక్షి’ప్రచురించిన కథనాల్లోని అంశాలను సీఎం ప్రధానంగా ప్రస్తావించారు. గతేడాది కడెం ప్రాజెక్టు గేట్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులను మరోమారు గుర్తు చేసినట్లు నీటిపారుదల వర్గాలు తెలిపాయి.దీంతోపాటే చాలా ప్రాజెక్టుల పరిధిలో వరదలు వచ్చే సమయాల్లో వర్క్ ఇన్స్పెక్టర్లు, గేటు ఆపరేటర్లు, హెల్పర్లు, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, లష్కర్ ల పాత్ర కీలకంగా ఉన్నా అవసరానికి తగ్గట్లుగా వారు లేరన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వారి నియామకాల విషయంలో జాప్యం చేయరాదని ఇంజనీర్లకు సూచించారు. గేట్లకు గ్రీజింగ్ చేసుకోవాలని, రోప్‌వైర్లు సరిచూసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల పరిధిలో లష్కర్ల నియామకాలను త్వరగా పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీటిని అందించే చర్యలు చేపట్టాలని సూచించారు. కాళేశ్వరం నీటితో తొలి ఫలితం ఎస్సారెస్పీ ఆయకట్టుకే అందనున్న దృష్ట్యా దాని పరిధిలోని కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాల్వల ఆధునీకరణ, అవసరమైన మరమ్మతు పనులను 20 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కొండపోచమ్మ నుంచే సింగూరుకు.. మల్లన్న సాగర్ నుంచే కాళేశ్వరం నీటిని సింగూరుకు తరలించాలంటూ రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికపై పత్రికల్లో వచ్చిన కథనంపైనా సీఎం తన సమీక్షలో ప్రస్తావించినట్లు తెలిసింది. మల్లన్న సాగర్ నుంచి నీటి తరలింపులో 18 కి.మీ. టన్నెల్ పనుల పూర్తి అంశం అడ్డంకిగా ఉందని, అన్నీ ఆలోచించే కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని సింగూరుకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సీఎం ఇంజనీర్లతో వ్యాఖ్యా నించినట్లు తెలిసింది. ఈ విషయంలో ఎటువంటి ప్రత్యామ్నాయాలకు తావులేదని, గతంలో నిర్ణయించిన మాదిరే సింగూరుకు నీటి తరలింపుపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించినట్లు సమాచారం. పాలమూరు–రంగారెడ్డి పనులకు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే రూ.10 వేల కోట్ల మేర రుణం తీసుకుం టున్న దృష్ట్యా ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తుమ్మిళ్ల రెండోదశ పనులు, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఆర్డీఎస్లో మిగిలిన పనుల పూర్తిని వేగిరం చేయాలని సూచించారు. -
పునర్నిర్మాణం చేయిమారితే...
తెలంగాణ సమాజమంతా కలిసికట్టుగా ఒక నిర్ణ యం తీసుకోవాల్సి ఉంది. ఉద్యమ సమయంలో సబ్బండ వర్ణాలు కలిసికట్టుగా జై తెలంగాణ అని నినదించినట్లుగా ఈ ఎన్నికల్లో కూడా కీలకనిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కలిసి పోరా డింది తెలంగాణ కోసం. రాష్ట్రం సాకారం చేసుకున్నాక మళ్లీ ముక్తకంఠంతో తొలి ఎన్నికల్లో ఉద్యమనేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే తెలంగాణ జై కొట్టింది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని ఆరో పణలు చేసినా ఈ నాలుగున్నరేళ్లుగా తెలంగాణలో పునర్నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కేసీఆర్ ఆలోచనలతో, దార్శనికతతో ప్రధానంగా సాగు, తాగునీటి రంగాలకు సంబంధించిన మహత్తరమైన పనులు దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా జరుగుతున్నాయి. కాళేశ్వరం పనులు పూర్తికాబోతున్నాయి. కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్లు చివరనవున్న నడిగూడెం పాదాలను తాకాలి. అది కదా పరవశం. శక్తినంతా కూడదీసుకుని, ఉన్న వనరుల న్నింటిని ఉపయోగించుకొని తెలంగాణ సమాజనిర్మాణం జరుగుతున్నది. దీనికి కేసీఆర్ దార్శనికతతో పాటుగా ఆయనలో ఉన్న మొండితనం, వెనక్కు తగ్గని స్వభావం కూడా దోహదం చేస్తున్నది. కేసీఆర్‌పై రాజకీయ విమర్శలు చేసేవాళ్లు సైతం ఈ నాలుగున్నరేళ్లలో ఆయన పునర్నిర్మాణపనులను అంగీకరించారు. కాకపోతే ఇపుడు ఎన్నికలు కాబట్టి ఎవరైనా, ఏదైనా కూయవచ్చును. కేసీఆర్ ఆనాడు రాష్ట్ర సాధన ఉద్యమానికి ఎంత అవసరమో నేటి పునర్నిర్మాణానికి కూడా అంతే అవసరం. కేసీఆర్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకుపోతున్నారు. ఈ అభివృద్ధి రథం ఆగకూడదు. ఈ పునర్నిర్మాణ ప్రక్రియకు బ్రేకులు పడకూడదు. సరిగ్గా రాష్ట్రసాధన ఉద్యమ సమయంలో దూరంగా వున్న శక్తులు, ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని అడ్డుతగిలిన వ్యక్తులు ఈ ఎన్నికల్లో మహాకూటమిగా రావటం కేసీఆర్‌కు రాష్ట్రసాధన తర్వాత జరుగుతున్న మరో పరీక్ష. కేసీఆర్‌కు సవాళ్లను సవాల్‌చేసి ఎదుర్కొనటం అలవాటైన విద్య. రాష్ట్రసాధన ఉద్యమంలో, రాజకీయ ప్రక్రియలో ఉద్యమజెండాను పట్టుకొని ఒక్కడుగా తెగించి కొట్లాడాడు. సరిగ్గా రాష్ట్ర అవతరణ తర్వాత జరుగుతున్న రెండవ ఎన్నికల్లో శక్తులన్నీ కట్టకట్టుకుని మీదకు దూసుకొస్తున్నా కేసీఆర్ ఒక్కడుగానే ధైర్యంగా, ధీశాలిగా ఈ బరిలో నిలిచి దూసుకుపోయేందుకు సిద్ధమవుతున్నారు. పదవులు రానివాళ్లు, పదవుల్లో లేని వాళ్లు, రాజకీయ వారసత్వం పోతుందని తహతహలాడుతున్న ఆధిపత్యశక్తులు కేసీఆర్‌ను ఎదుర్కోలేవు. తెలంగాణకు కేసీఆర్ కాకుండా ఎవరికి ఈ అధికార పగ్గాలిచ్చినా ప్రగతి కుంటుపడుతుంది. ప్రజల నోటి దగ్గరకు వచ్చిన సంక్షేమ పథకాలు ఆగిపోయే ప్రమాదముంది. ఒక నిర్మాణం జరుగుతున్న సమయంలో దాన్ని ఆపి వేరే వాళ్లకు హస్తగతం చేస్తే దాని రూపురేఖలు మారిపోవచ్చును. అందుకే కేసీఆర్ సీఎంగా కొనసాగాల్సిన అవసరముంది. దీన్ని సంక్షేమపథకాల లబ్ధిపొందే పేదలు గుర్తుపెట్టుకుంటారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎక్కువమంది నూతన వర్గాల నుంచి వచ్చారు. ఉద్యమం నుంచి నేరుగా వచ్చినవాళ్లు. తెలంగాణలో రాజకీయ అవినీతి లేదు. డబ్బు చుట్టూ చేరే శక్తులకు కేసీఆర్ బ్రేక్ వేశారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రేమికులు, ఆలోచనా పరులంతా అర్థం చేసుకుని తీర్పునిస్తారు. ఆచార్య నిర్మాణ్, హైదరాబాద్ -
సీఎస్సార్ నిధులకు ఎసరు!
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కింద ప్రాజెక్ట్‌లు ఖర్చు చేయాల్సిన నిధులకు తాళాలు పడ్డాయి. సీఎస్సార్ నిధులు ఖర్చు చేసే బాధ్యతలను ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల నిర్వాహకుల నుంచి తొలగించింది. నిధులు వ్యయం చేసే అధికారాన్ని కలెక్టర్‌కు అప్పగించడంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అటకెక్కాయి. అభివృద్ధి పనులు పడకేశాయి. ముత్తుకూరు(నెల్లూరు): రాష్ట్ర రాజధాని అమరావతిలో జూన్ 26వ తేదీన విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు, వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, థర్మల్ ప్రాజెక్ట్‌ల ప్రతినిధులు సమావేశమయ్యారు. సీఎస్సార్ నిధులను జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రాజెక్ట్‌ల ప్రభావిత గ్రామాల్లో ప్రజల దాహార్తి తీర్చే ఆర్వో వాటర్ ప్లాంట్లు నిర్వహించే దిక్కులేక మూతపడ్డాయి. మరికొన్ని ప్లాంట్లలో అభివృద్ధి పనులు పడకేశాయి. మూతపడ్డ ఆర్వో వాటర్ ప్లాంట్లు ముత్తుకూరు మండలంలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌లు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసిన 13 ఆర్వో వాటర్ ప్లాంట్లల్లో ప్రస్తుతం ఏడు ప్లాంట్లు మూతపడ్డాయి. మిగిలిన ప్లాంట్ల నిర్వహణకు తలపెట్టిన టెండర్లను రద్ధు చేయడంతో ఇవి కూడా ప్రమాదంలో పడ్డాయి. ముఖ్యంగా రెండు థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌లకు కేంద్రంగా ఉన్న నేలటూరు పంచాయతీలోని టైడు వాటర్ ప్లాంట్లు మూతపడడం విశేషం. ఇవి కాకుండా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ఏర్పాటైన ఆరు ప్లాంట్లల్లో మూడు మూతపడ్డాయి. మూత పడ్డ ఆర్వో ప్లాంట్లు, ప్రజల కష్టాలు పట్టించుకునే అధికారులు, నాయకులు కరువయ్యారు. తాగునీటి కోసం అల్లాడిపోయే ప్రజలు ప్లాంట్ల పరిస్థితి వివరించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మినరల్ వాటర్‌ను తాగేందుకు అలవాటు పడ్డ పేదలు ప్రస్తుతం నీళ్ల క్యాన్లు కొనుగోలు చేయలేక అల్లాడిపోతున్నారు. సీఎస్సార్ నిధుల వ్యయానికి ఫుల్స్టాప్ సామాజిక బాధ్యత కింద ప్రాజెక్ట్‌లు తమ ఆదాయంలో రెండు శాతం నిధులను ప్రభావిత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయాల్సి ఉంది. సెమ్కార్ఫ్ గాయత్రి పవర్ కాంప్లెక్స్ నిర్వాహకులు ఇప్పటి వరకు రూ.25 కోట్ల మేరకు సీఎస్సార్ నిధులు వ్యయం చేసినట్టు చెబుతున్నారు. రాష్ట్ర మంత్రులు ఆంక్షలు పెట్టిన తర్వాత నేలటూరులోని ఏపీజెన్కో ప్రాజెక్ట్ ఇంజినీర్లు రూ.2 కోట్ల సీఎస్సార్ నిధులను ఇటీవల కలెక్టర్‌కు డిపాజిట్ చేశారు. దీంతో చేపట్టాల్సిన పనులు, కల్పించాల్సిన సౌకర్యాలపై కలెక్టర్‌కు కనీసం ప్రతిపాదనలు పంపించే అధికారం కూడా తమకు లేదని జెన్కో ఇంజినీర్లు స్పష్టం చేశారు. బడి చుట్టూ ప్రహరీగోడ, స్కూల్ ముందు నీళ్ల బోరు ఏర్పాటు చేసే అధికారం కూడా కోల్పోయామన్నారు. రూ.కోట్లు ఉన్నా..గుక్కెడు నీళ్లు లేవు సామాజిక బాధ్యత నిధులను ప్రాజెక్ట్‌ల ప్రతినిధులు కలెక్టర్‌కు డిపాజిట్ చేయడంతో తీరప్రాంత గ్రామాల్లో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. మరమ్మతులకు గురైన ఆర్వో ప్లాంట్‌ను రిపేరు చేయించే దిక్కు లేకుండా పోయింది. తాగునీటి కోసం తీరప్రాంత గ్రామాల్లో అలజడి మొదలైంది. పనులు కోసం ప్రజలు పదే పదే కలెక్టర్ వద్దకు వెళ్లే పరిస్థితి లేదు. స్థానికంగా నెలకొన్న ఈ సమస్యలను ఎవరు పరిష్కరిస్తారనేది ప్రశ్నార్థకమైంది. కనీసం తాగునీటి కష్టాలు తొలగించేందుకైనా అత్యవసర కమిటీని ఏర్పాటు చేయాలి. మూతపడ్డ ఆర్వో ప్లాంట్లను తెరిపించాలి. మిగిలిన ప్లాంట్లు మూతపడకుండా చర్యలు తీసుకోవాలి. –నెల్లూరు శివప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు, ముత్తుకూరు ఆర్వో ప్లాంట్లు మూతపడ్డాయి నేలటూరు పంచాయతీలో ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లు అన్నీ మూతపడ్డాయి. జెన్కో ఇంజినీర్లకు ఈ సమస్యను తెలియజేశాం. సీఎస్సార్(సామాజిక బాధ్యత) నిధులు కలెక్టర్‌కి ఇచ్చేశాం, రిపేరు చేయించలేము అని ఇంజినీర్లు బదులిచ్చారు. తాగునీటికి చాలా ఇబ్బందిగా ఉంది. నెల్లూరులో జేసీని కలసి, ఆర్వో ప్లాంట్ల సమస్య చర్చించాం. –ఈపూరు కోటారెడ్డి, నేలటూరు. ప్రాజెక్ట్‌లే ప్లాంట్లు నిర్వహించాలి థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు పనిచేయని విషయం సోమవారం నెల్లూరులో జరిగిన సమావేశంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. సీఎస్సార్ నిధులు కలెక్టరేట్లో డిపాజిట్ చేసినప్పటికీ ఆర్వో ప్లాంట్ల బాధ్యత ప్రాజెక్ట్‌లే నిర్వహించాలని, ప్లాంట్లను రిపేరు చేయించాలని కలెక్టర్ సూచించారు. –మునికుమార్, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ -
పనులు ఉరకలెత్తాలి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో చేపడుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టు పనులను ఉరకలెత్తించి నిర్దిష్ట కాలంలో సంబంధిత ఆయకట్టుకు నీరందేలా చూడా లని అధికారులను నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ పనులు, భూసేకరణ, పునరావాసం పనుల తీరును మంత్రి వీడియో సమావేశం ద్వారా గురువారం సమీక్షించారు.. మిడ్ మానేరు , ఛనాకా– కొరటా బ్యారేజి, కొమురంభీం ప్రాజెక్టు, గొల్ల వాగు, ర్యాలీ వాగు, నీలవాయి ప్రాజెక్టు, జగన్నాథపూర్, మత్తడి వాగు, సాత్నాల, స్వర్ణ, గడ్డన్న వాగు, ఎన్టీఆర్ సాగర్, వట్టి వాగు, పీపీ రావు, ప్రాజెక్టుల తీరును తెలుసుకొని హరీశ్ అధికారులకు సూచనలు చేశారు. అక్టోబరు నాటికి ఛనాకా–కొరటా నీరు ఛనాకా– కొరటా ప్రాజెక్టులో ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ నాటికి నీరు నింపి 13 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించేలా చేయాలని మంత్రి ఆదేశించారు. కొమురంభీం ప్రాజెక్టు కింద గత ఏడాది 20 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వగా, ఈ ఏడాది కనీసం అదనంగా మరో 5 వేల ఎకరాలకు ఇవ్వాలని, రైల్వే క్రాసింగ్ పనులను పూర్తి చేసి మరో 15 వేల ఎకరాలకు అందించాలన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఇంకా 280 ఎకరాల భూసేకరణ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్‌ను ఆదేశించారు. దీనికి రూ. పది కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. గొల్లవాగు ప్రాజెక్టులో ఫీల్డ్ ,చానల్స్, మిగిలిన చిన్న చిన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. నీలవాయి ప్రాజెక్టు లో 8 వేల ఎకరాలకు నీరు ఇచ్చేలా ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. జన్నాథపూర్ ప్రాజెక్టు బ్యారేజీ పనులు పూర్తయ్యయాని చెప్పారు. ఎన్టీ ఆర్ సాగర్ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది అదనంగా మరో 3 వేల ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. వట్టి వాగు ద్వారా ఈ ఏడాది 16 వేల ఎకరాలకు నీరు ఇచ్చేలా చూడాలన్నారు. దీని ఆధునీకరణకు రూ.26 కోట్లకు ప్రతిపాదనలు పంపాలని ఇంజనీర్లను ఆదేశించారు. డీపీ రావు ప్రాజెక్టు ఈ ఏడాది అదనంగా మరో 3,500 ఎకరాలకు నీరిస్తామని మంత్రి చెప్పారు. మత్తడి వాగు ప్రాజెక్టు ద్వారా 1200 ఎకరాలకు నీరిచ్చే పనులపై కలెక్టర్ సమీక్ష జరిపి ఈ ఖరీఫ్‌కు పైలట్ ప్రాజెక్టును విజయవంతం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ దివ్యను కోరారు. లోయర్ పెన్ గంగకు గాను జూలై చివరికల్లా భూసేకరణ చేపట్టాలన్నారు. సాత్నాల ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది 6 వేల ఎకరాలకు నీరు ఇవ్వాలని ఆదేశించారు. గడ్డన్న వాగు ద్వారా 12వేల ఎకరాలకు నీరిస్తామని, మిగిలిన మరో 2 వేల ఎకరాలకు కాలువల ఆధునీకరణ ద్వారా నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిడ్ మానేరు ద్వారా 76 వేల ఎకరాలకు నీరు మిడ్ మానేరు కింద 76వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. ప్యాకేజీల వారీగా పనుల తీరును కాంట్రాక్టర్లతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. మిడ్ మానేరు పునరావాస చర్యల కోసం రూ.33 కోట్లకు అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. ఆర్థికశాఖతో మాట్లాడి ఈ ప్రక్రియను హరీశ్ వెంటనే పూర్తిచేయించారు. ఈ సమీక్షలో మంత్రి జోగు రామన్న, సాగు నీటి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఈఎన్సీలు హరిరామ్, అనిల్ కుమార్, సీఈలు భగవంతరావు, శంకర్, వెంకటేశ్వర్లు ( క్వాలిటీ కంట్రోల్ ), సంబంధిత జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. -
సంక్షేమరాజ్యం.. సరికొత్త నమూనా
అభిప్రాయం ప్రాజెక్టులు కట్టడం, కాళేశ్వరాన్ని నిర్మించడం, కాలువలు, బావులు, చెరువులు తొవ్వించే పని కేసీఆర్ తనకు తానే విధించుకున్న అతిపెద్ద సవాల్. దేశంలో ఎక్కడా జరగనన్ని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి నేరుగా పాలనా పగ్గాలు చేపట్టిన తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలే ఎజెండాగా తమ పరిపాలనా రంగాన్ని రూపొందించుకున్నారు. ఉద్యమ ఉత్తేజంతో పాలనారంగాన్ని కూడా సంస్కరించుకుంటూ అనేక కొత్త పథకాలకు రూపకల్పన చేసి మున్నెన్నడూ లేని విధంగా ఆచరణాత్మకంగా ఫలితాలను కూడా ప్రజల ముంగిటికి తీసుకువస్తున్నారు. అది ఇంటింటికి నల్లా నీళ్లు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికలు తవ్వించడం, ప్రాజెక్టుల నిర్మాణాల వంటి భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నాలుగేళ్ల పాలనలోనే తెలంగాణ భీడుభూములపై నీళ్లను ప్రవహింపచేస్తున్నారు. ఇది ప్రభుత్వమే ఒక మిషన్‌గా మారి చేస్తున్న భగీరథ యత్నం. తెలంగాణ సమాజంలో ఎత్తుపల్లాలున్నాయి. 90 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలున్నారు. ఈ వ్యవస్థ నిచ్చెన మెట్ల వ్యవస్థ. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్క అడు గుపైకి వేసుకుంటూ ముందుకుసాగాలి. అందుకు ప్రధాన సాధనంగా విద్యా, వైద్య రంగాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. పేద పిల్లలందరికీ ఉచితంగా నాణ్యమైన చదువందాలి. కార్పొరేట్‌ను తలదన్నే చదువును పేదలవాకిళ్లకాడికి కేసీఆర్ తీసుకొచ్చారు. 815 గురుకులాలు పెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారు. కేజీ నుంచి పిజీ పిల్లలకు ఉచిత చదువును అందించేందుకు శ్రమిస్తున్నారు. అంగన్వాడీ స్కూళ్ల దగ్గర్నుంచి వాళ్లపై ఒక్కపైసా పడకుండా బహుజన పిల్లల్ని చదివిస్తున్నారు. ‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు’’ అన్న స్థితి నుంచి ఇప్పుడు ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేసీఆర్ కిట్లు, ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులు పెంచడం వల్ల పేదప్రజలకు వైద్యం సులభంగా అందే దశకు చేరుకుంటున్నారు. ప్రజలకు అనేక రకాల ఆదాయపరి మితి పెంపుకు సంబంధించిన పనులను ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆసరా పెన్షన్లు, ఇంటింటికి ఆరుకిలోల బియ్యం, మున్సిపాల్టీల్లో రూపాయికే నల్లా కనెక్షన్, బీడీ కార్మికుల భృతి, సింగరేణి, ఆర్టీసి ఉద్యోగుల జీతాలను పెంచడం, టెంపర్వరీగా పనిచేస్తున్న ఉద్యోగులకు మంచిస్కేల్స్ ఇవ్వడం ఇవన్నీ సంక్షేమంలో భాగంగానే చేస్తున్నారు. రైతు బజారులు, సద్దిమూట పథకం, రుణమాఫీ, సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతు సమన్వయ సమితిని ఏర్పరచటం, భూరికార్డుల ప్రక్షాళన, సమన్వయ సమితుల ఏర్పాటు సంచార పశువైద్యశాలలు ఇవన్నీ సంక్షేమ రాజ్యం లక్షణాలు. అంగన్వాడీ జీతాలు 150 శాతం పెంచారు. ఆశా వర్కర్ల జీతాలు రూ.6,000 వరకు పెంచారు. అమ్మఒడి ప«థకం, ఒంటరి మహిళలకు రూ.1,000ల భృతి ఇవన్నీ సంక్షేమ పధకాలుగా ప్రజల దగ్గరకు వెళ్లాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు వేలకోట్లతో సంక్షేమ పథకాలను రూపొందించారు. బీసీ కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, ఎంబీసీ కార్పొరేషన్లను ప్రకటించి కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఈ రోజు లక్షల మంది ప్రభుత్వ పెన్షన్ల ద్వారా సహాయం పొందుతున్నారు. కోఆపరేటివ్ మోడల్లో చిన్న, మధ్య తరగతి వర్గాలకు సాయం అందజేసే పని మొదలైంది. ప్రధానంగా చేతివృత్తులవారు, సంచారజాతుల వారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు చేతి వృత్తుల ద్వారా లేదా ఆధునిక వృత్తుల ద్వారా ఉత్పత్తులు చేస్తే ఆ ఉత్పత్తుల అమ్మకానికి ప్రభుత్వమే ముందుకు రావ డం విశేషం. తెలంగాణలో ప్రభుత్వ రంగం ద్వారా విద్యా, వైద్యరంగాల్లో సేవలు అందించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. దీన్ని జాగ్రత్తగా నిర్వహిస్తే అది ధనికులకు పేదలకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించే చర్యే అవుతుంది. గురుకులాలపై ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థిపై లక్ష రూపాయల ఖర్చు చేస్తున్నారు. వృద్ధులకు ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు. ప్రాజెక్టులు కట్టడం, కాళేశ్వరాన్ని నిర్మిం చడం, కాలువలు, బావులు, చెరువులు తొవ్వించే పని కేసీఆర్ తనకు తానే విసురుకున్న అతిపెద్ద సవాల్. దాన్ని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం సంపూర్ణంగా గెలవబోతుంది. 60 ఏళ్లలో ఎవరూ చేయలేని పనిని టీఆర్ఎస్ చేసి కొత్త చరిత్రను రచించుకుంటూ ముందుకు సాగుతుంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులను పూర్తి చేయబోతుంది. ఉద్యోగుల చర్చల్లో జీతాలు పెంచమని కోరితే, వాళ్లడిగిన దానికంటే రెండు రెట్లు అధిక జీతాన్ని కేసీఆర్ ప్రకటించారు. కార్పొరేట్ వ్యవస్థకు ఇవ్వాల్సిన రాయితీలను తగ్గించుకుని ఆ నిధులను రైతాంగానికి అందజేసే క్రియాశీలకమైన పనికి కేసీఆర్ నడుంకట్టారు. ఆదాయ వనరులను పెంచింది. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం ఏ కోణం నుంచి చూసినా అది సంక్షేమ రాజ్యంగా ముందుకుసాగుతుంది. కేసీఆర్ దార్శనికతతో పునర్నిర్మాణ పనికి పూనుకోవడమే సంక్షేమ రాజ్యం ఏర్పడటానికి కారణం. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో సాధించిన విజయాలు తెలం గాణ భవిష్యత్‌ను మరింత తేజోవంతంగా చేయడానికి పునాదులు వేసినట్లయింది. - జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 94401 69896 -
పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి
* 25 ప్రాజెక్టు పనుల వేగవంతంపై సర్కారు కసరత్తు * వాటి ఆయకట్టు లక్ష్యం 31లక్షల ఎకరాలు.. చేరుకుంది 7లక్షల ఎకరాలే * ప్రాజెక్టుల నిర్మాణంలో సమస్యల పరిష్కారంపై దృష్టి * నేడు ప్రాజెక్టులపై ప్రభుత్వం ‘మారథాన్’ సమీక్ష * ఎస్కలేషన్ జీవో, భూసేకరణ గైడ్‌లైన్స్‌పై అధికారులకు అవగాహన సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు లక్ష్యాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సాగునీటి ప్రాజెక్టులకు ఏటా నిధుల వరద పారుతున్నా... అనుకున్న స్థాయిలో ఆయకట్టుకు నీరు అందడం లేదు. దీంతో తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకే ప్రాధాన్యమిచ్చి.. వాటిల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడంపై కసరత్తు చేస్తోంది. భూసేకరణ, పరిహారం, ఎస్కలేషన్ చెల్లింపులపై ఓ స్పష్టత వచ్చినందున పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా గురువారం మంత్రి హరీశ్‌రావు నీటి పారుదల శాఖ అధికారులతో ప్రాజెక్టుల వారీగా ‘మారథాన్’ సమీక్ష నిర్వహించనున్నారు. భారీ వ్యయంతో.. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటివరకు భారీగా నిధులు ఖర్చు చేశారు. 25 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కోసం 2004 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.32 వేల వరకు ఖర్చు చేశారు. వీటిలో 29.19 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకున్న 13 భారీ ప్రాజెక్టులకు రూ.30 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. కానీ ఇంతవరకు అందుబాటులోకి వచ్చిన ఆయకట్టు కేవలం 6.51 లక్షల ఎకరాలే. మరో 23 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాల్సి ఉంది. ఇక 1.62 లక్షల ఆయకట్టు లక్ష్యంగా ఉన్న 12 మధ్యతరహా ప్రాజెక్టులకు ఇప్పటికే రూ.1,528 కోట్లు ఖర్చు చేసినా 35వేల ఎకరాలకే నీరివ్వగలిగారు. మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్ భీమా, కోయల్‌సాగర్, నల్లగొండలోని ఏఎమ్మార్పీ, వరంగల్‌లోని దేవాదుల, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండలకు సాగునీటిని ఇచ్చే ఎస్సారెస్పీ-2, వరద కాలువ, కరీంనగర్‌లోని ఎల్లంపల్లి, ఖమ్మం జిల్లాకు చెందిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు 80 శాతానికిపైగా పూర్తయ్యాయి. ఏఎమ్మార్పీ, దేవాదుల వంటి ప్రాజెక్టుల నుంచి ఇప్పటికే పాక్షికంగా నీటిని కూడా విడుదల చేశారు. అలాగే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల నుంచి వచ్చే ఖరీఫ్ సీజన్లో నీటిని ఇవ్వడానికి అవకాశముంది. అయితే ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న భూసేకరణ సమస్యలు, పరిహారంలో జాప్యం, ఎస్కలేషన్ చార్జీలను పెంచాలన్న కాంట్రాక్టర్ల డిమాండ్‌పై తేల్చడంలో జాప్యం ఆయకట్టు లక్ష్యాన్ని నీరుగార్చాయి. నేడు సమీక్ష ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడంపై ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈ, ఈఈ, డీఈలతో మంత్రి హరీశ్‌రావు గురువారం సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. వరంగల్‌లోని దేవాదుల, మహబూబ్‌నగర్‌లోని భీమా, నెట్టెంపాడు, కోయల్‌సాగర్ ప్రాజెక్టుల పరిధిలో రైల్వే క్రాసింగ్, జాతీయ రహదారుల(ఎన్‌హెచ్)కు సంబంధించిన సమస్యలున్నాయి. వీటిని పూర్తి చేసుకోగలిగితే వచ్చే జూలై నాటికి సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంది. మొత్తంగా అన్ని ప్రాజెక్టుల్లో కలిపి 21 రైల్వే, 6 ఎన్‌హెచ్ క్రాసింగ్లకు సంబంధించిన సమస్యలున్నాయని అధికారులు తేల్చారు. వీటితో పాటు ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల విషయంలో భూసేకరణ, పరిహారం సమస్యలున్నాయి. వీటన్నింటిపై గురువారం నాటి సమావేశంలో విడివిడిగా సమీక్షించి దిశానిర్దేశం చేయనున్నారు.