pulse oxo meter
-
కరోనా: తగ్గనున్న అయిదు మెడికల్ ఉత్పత్తుల ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా ఉధృతి సమయంలో పల్స్ ఆక్సీమీటర్లు, ఇతర పరికరాల ధరలు ప్రజలకు చుక్కలు చూపించాయి. మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ వాస్తవ ధర కంటే దాదాపు రెండుమూడు రెట్లు అధిక ధరకు విక్రయిస్తూ డబ్బులు దండుకున్నాయి. ఈ క్రమంలో నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. పల్స్ ఆక్సీమీటర్, నెబ్యులైజర్, డిజిటల్ థెర్మామీటర్, గ్లూకోమీటర్, బీపీ మానిటర్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. వీటిపై మార్జిన్‌ను 70 శాతానికి పరిమితం చేస్తూ ఎన్పీపీఏ ఉత్తర్వులు వెలువరించింది. తయారీ, దిగుమతి, మార్కెటింగ్ కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వీటి విక్రయం ద్వారా 709 శాతం వరకు లాభాలను ఆర్జిస్తున్నారని తెలిపింది. తయారీ సంస్థలు ఇక నుంచి వీటి ధరలను సవరించాల్సిందే. జూలై 20 నుంచి తాజా ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి. ఔషధాల (ధరల నియంత్రణ) ఉత్తర్వు-2013 ప్రకారం ప్రభుత్వ ఆదేశాలను తయారీదార్లు ఉల్లంఘించినట్టయితే అధికంగా వసూలు చేసిన మొత్తానికి 15 శాతం వార్షిక వడ్డీతోపాటు 100 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆక్సీజన్ కాన్సంట్రేటర్లపై మార్జిన్‌ను 70 శాతానికి పరిమితం చేస్తూ గత నెలలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
కరోనాను ‘పల్స్’ పట్టేస్తుంది
కరోనా వైరస్ సోకిన వారికి ఆక్సిజన్ ప్రధాన సమస్యగా మారుతోంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా రోగి తీసుకునే ఆక్సిజన్ సరైన మోతాదులో రక్తంలో చేరకపోవడంతో శ్వాస తీసుకునేప్పుడు సమస్య ఉత్పన్నమై మరణాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రక్తంలో సరైన మోతాదులో ఆక్సిజన్ ఉందా.. లేదా అనే విషయాలు తెలుసుకోవడానికి పల్స్ ఆక్సీమీటర్ ఎంతో కీలకం. కరోనా ముప్పును ముందుగా గుర్తించేందుకు ఉపయోగపడే పల్స్ ఆక్సీమీటర్‌కు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. ఈ తరుణంలో పల్స్ ఆక్సీమీటర్ ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరూ తెలుకోవాల్సిందే. పెద్దదోర్నాల/పుల్లలచెరువు/చీరాల అర్బన్: శరీరంలో ఆక్సిజన్ శాతాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా కరోనా ముప్పును ముందుగానే గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అత్యంత సులువుగా వినియోగించే ఈ పరికరం ఇప్పుడు ప్రతి ఇంటిలో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా సోకి చికిత్స పొందుతూ ముఖ్యంగా హోం ఐసోలేషన్, క్వారంటైన్లో ఉన్న వారు తరచుగా రక్తంలోని ఆక్సీజన్ స్థాయి తెలుసుకోవడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడొచ్చు. పల్స్ ఆక్సీమీటర్ పనిచేసే విధానం ఈ పరికరాన్ని ప్రతి ఒక్కరూ చాలా సులువుగా ఉపయోగించొచ్చు. ఏదో ఒక చేతి వేలి కొనకు ఈ మీటర్ పెట్టి బటన్ నొక్కితే చాలు ఆన్ అవుతుంది. కొన్ని సెకన్ల తర్వాత డిస్ప్లేలో ఆక్సిజన్ శాతం పల్స్ రేటును చూపిస్తోంది. ఈ రీడింగ్ ఆధారంగా రోగులను వర్గీకరించి చికిత్స అందించొచ్చు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి ఇలా రక్తంలో ఎంత మోతాదులో ఆక్సిజన్ సరఫరా అవుతుందో పల్స్ ఆక్సీమీటర్ గుర్తిస్తుంది. సాధారణంగా ఆక్సిజన్ లెవల్స్ 95–100 వరకు ఉంటుంది. పల్స్ రేటు 60–100 మధ్య ఉండాలి. ఆక్సిజన్ స్థాయి 90 శాతం కన్నా తక్కువ పడిపోయినా, గుండె పల్స్ రేటు 100 కన్నా పెరిగినా రోగి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని భావిస్తారు. కరోనా పాజిటివ్ వ్యక్తుల్లో ఉండే ఆక్సిజన్ లెవల్స్ 95 పైన ఉంటే తక్కువ లక్షణాలు ఉన్నట్లు, వీరిని ఇంటి వద్ద ఉంచి చికిత్సను అందిస్తారు. ఆక్సిజన్ లెవల్స్ 90 నుంచి 94 మధ్య ఉంటే మధ్యస్తంగా ఉన్నట్లు.. వీరిని వైద్యశాలకు తరలించాల్సి వస్తుంది. 90 కన్నా తక్కువ పడిపోతే ఐసీయూకి తరలించి వెంటిలేటర్ వైద్యం అందించాలి. పల్స్ఆక్సీమీటర్ ఎంతో ఉపయోగపడుతుంది ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పల్స్ఆక్సీమీటర్ ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ ఏ మేరకు ఉన్నాయో తెలియపరుస్తుంది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి పల్స్ ఆక్సీమీటర్ ద్వారా ఆక్సిజన్ లెవల్స్‌ను అంచనాలు వేసి చికిత్స అందిస్తారు. కరోనా రోగుల్లో ఊపిరి అందకపోవడం అతి పెద్ద సమస్య. రక్తంలోకి చేరే ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. వేగంగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడాన్ని హైపోక్సియా అంటారు. కరోనా రోగులు తరచూ పల్స్ఆక్సీమీటర్ ద్వారా ఆక్సిజన్‌శాతం సరిచూసుకోవడం మంచిది. డాక్టర్ పి.కమలశ్రీ. పీపీపీ యూనిట్, చీరాల ఏరియా వైద్యశాల హైపోక్సియాను గుర్తిస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో పల్స్ ఆక్సీమీటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కరోనా రోగుల్లో ఊపిరి అందకపోవడం పెద్ద సమస్య. దీంతో రక్తంలో చేరే ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఇలా వేగంగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడాన్ని హైపోక్సియా అంటారు. కరోనా రోగుల్లో చాలా మందికి ఆక్సిజన్ శాతం 87.88 ఉన్నా ఆయాసంగా ఫీలవ్వరు. అలాంటప్పుడు దానిని హ్యాపీ హైపోక్సియా అంటారు. ఇదే పెద్ద ప్రమాదకరం. ఇలాంటప్పుడు పల్స్ ఆక్సీమీటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో తరచూ పరిశీలించుకోవాలి. ఆరు నిమిషాలు నడిచిన తర్వాత పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పరీక్షించుకుంటే 94 శాతం కన్నా తక్కువగా ఉంటే అతనికి ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్ అందడం లేదని గుర్తించాలి. అలాంటివారు వెంటనే వైద్యశాలలో చేరాల్సి ఉంటుంది. వారికి ఆక్సిజన్ స్థాయి పడిపోతున్న విషయం తెలియదు. ఫలితంగా ఒకటి రెండ్రోజుల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. కరోనా మరణాల్లో ఎక్కువగా ఇలానే జరుగుతున్నాయి. హైపోక్సియాను వెంటనే గుర్తించి వైద్యశాలకు వెళ్లగలిగితే ప్రాణాలు కాపాడుకోవచ్చు. గ్రామాల్లో ప్రతి ఆరోగ్య కార్యకర్త వద్ద ఈ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా పల్స్ రేటును చూసుకుని ముందు జాగ్రత్తలు తీసుకునే విధానం ఉంది. డాక్టర్ గౌతమి,పుల్లలచెరువు, ప్రభుత్వ వైద్యాధికారి -
ఉద్యోగులకు పల్స్ ఆక్సీమీటర్లు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ బారిన పడిన ఆర్టీసీ ఉద్యోగులకు పల్స్ ఆక్సీమీటర్లతో కూడిన కరోనా కిట్ పంపిణీ చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మను ఆదేశించారు. రెండు రోజుల్లో ఆ కిట్లు సరఫరా కానున్నాయి. ఇప్పటికే ఆర్టీసీలో దాదాపు 450 మంది కోవిడ్ బారినపడ్డారు. వీరిలో దాదాపు 20 మందికిపైగా చనిపోగా మిగతావారు కోలుకున్నారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చాలా అధికంగా ఉండటంతో ఆర్టీసీలో కరోనా బారిన పడుతున్నవారి సం ఖ్య పెరుగుతోంది. ఒత్తిడి, వయసు ప్రభావం కారణంగా డ్రైవర్, కండక్టర్లలో చాలామంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో వారికి పల్స్ ఆక్సీమీటర్లు ఉచితంగా అందించాలని మంత్రి పువ్వాడ నిర్ణయించారు. శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంటే, ముందే గుర్తించి వెంటనే ఆసుపత్రిలో చేరితే ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్న వైద్యుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి కిట్.. టిమ్స్‌లో వైద్యం కోవిడ్ సోకితే ఇంట్లోనే ఉండి వైద్యం తీసుకునేవారికి వైద్యులు సూచించే మందులు, శానిటైజర్, మాస్కులు తదితరాలతో కూడిన కిట్‌ను పంపిణీ చేయనున్నారు. వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగానే వారికి ఈ కిట్ అందిస్తారు. ఆరోగ్య సమస్యలు లేకుంటే ఇంట్లోనే చికిత్స పొందుతారు. ఏవైనా సమస్యలు పెరిగి వైద్యుల పర్యవేక్షణ అవసరమైతే ఆసుపత్రికి తరలిస్తారు. ఇందుకోసం గచ్చిబౌలి లోని టిమ్స్‌ను గుర్తించారు. మంత్రి సూచన మేరకు ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ వైద్య అధికారులతో చర్చించారు. ప్రస్తుతం టిమ్స్‌లో పడకలు కావాల్సినన్ని ఖాళీగా ఉన్నాయని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో వైద్యం అవసరమైనవారు అప్పటికప్పుడు అటు, ఇటు వెతుక్కునే సమస్య లేకుండా నేరుగా టిమ్స్‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అవకాశం కల్పించండి: కార్మిక సంఘాలు ‘మంత్రిగారు టిమ్స్‌లో చేరేలా చర్యలు తీసుకున్నారు. కానీ, టిమ్స్‌కు ఎవరైనా వెళ్లొచ్చు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉండాలి. ఇందుకోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా చికిత్సకు అవకాశం కల్పించాలి’అని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. వెయ్యి ఆక్సీమీటర్లు కొంటాం: పువ్వాడ ‘ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నాం. కోవిడ్ బారిన పడితే ఎక్కువగా శ్వాస సమస్యలు వస్తున్నాయి. నిరంతరం పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పరీక్షించుకుంటే సమస్యను ముందే గుర్తించొచ్చు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. వేయి వరకు ఆక్సీమీటర్లు కొని అందిస్తాం. అవసరమైతే మరిన్ని కొంటాం’ -
కరోనాను పసిగట్టేందుకు పల్స్ ఆక్సిమీటర్
సాక్షి, రామగుండం: కరోనా ముప్పును ముందుగానే పసిగట్టేందుకు పల్స్ ఆక్సిమీటర్ కీలకంగా మారింది. ఆస్పత్రుల్లో మాత్రమే కనిపించే పల్స్ ఆక్సిమీటర్లు.. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో వెలుగు చూస్తున్నాయి. కరోనా లక్షణాల్లో తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, ఊపిరి సరిగా అందకపోవడం ముఖ్యమైనవి. ఇలాంటప్పుడు వైరస్‌ను పసిగట్టాలంటే చేతిలో పల్స్ ఆక్సిమీటర్ ఉండాలి. కరోనా వైరస్ సోకి హోంక్వారంటైన్లో ఉంటున్నవారు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ స్థాయి తెలుసుకోవడానికి పల్స్ ఆక్సిమీటర్ అత్యవసరమైందని వైద్యులు వెల్లడిస్తున్నారు. కరోనా ముప్పును ముందుగానే గుర్తించేందుకు ఉపయోగపడే పల్స్ ఆక్సిమీటర్‌కు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. హైపోక్సియా అంటే.. కోవిడ్ రోగుల్లో ఊపిరి అందకపోవడం అతిపెద్ద సమస్య. రోగుల్లో రక్తంలోకి చేరే ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఇలా వేగంగా ఆక్సిజన్ శాతం తగ్గిపోవడాన్ని ‘హైపోక్సియా’ అంటారు. ఇది బయటకు కనిపించకపోయినా పల్స్ ఆక్సిమీటర్ సాయంతో మాత్రం పసిగట్టొచ్చు. కోవిడ్ కేసుల్లో రెండు రకాలున్నాయి. ఒకటవది సింప్టమాటిక్ కేసు. ఇందులో లక్షణాలు తీవ్రంగా కనిపించి, హాస్పిటల్లో జాయిన్ అయ్యేవాళ్లు, రెండవది అసింప్టమాటిక్ కేసు. అంటే ఒంట్లో వైరస్ ఉన్నా కూడా లక్షణాలు ఏవీ బయటపడని వాళ్లు. ఇక్కడ నష్టం ఎక్కువ జరిగేది అసింప్టమాటిక్ కేసులతోనే. ఎందుకంటే వీళ్లలో వైరస్ ఉన్నా లక్షణాలు కనిపించవు కాబట్టి టెస్ట్ చేసేవరకూ వీళ్లకు వైరస్ ఉన్నట్టు తెలియదు. దీంతో పక్కవాళ్లకు వైరస్ సోకే ప్రమాదముంది. అలాగే వాళ్ల శరీరంలో కూడా వైరస్ వల్ల జరిగే నష్టం ఎక్కువ ఉంటుంది. అందుకే లక్షణాలు పైకి కనిపించకపోయినా శరీరంలో ఎలాంటి మార్పులొస్తున్నాయో మనమే కొన్ని పరికరాల ద్వారా ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. వాటిలో అన్నింటికంటే ముఖ్యమైంది పల్స్ ఆక్సిమీటర్. (తెలంగాణలో 80వేలు దాటిన కరోనా కేసులు) ముందు జాగ్రత్త కోసం.. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సైలెంట్‌గా న్యుమోనియా కలిగిస్తుంది. అంటే పైకి కనిపించకుండానే ఊపిరితిత్తులు న్యుమోనియా వల్ల ఎఫెక్ట్ అవుతాయి. దీనివల్ల శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి వ్యక్తి చనిపోవడానికి కారణమవుతుంది. కొంతమంది రోగుల్లో కోవిడ్ న్యుమోనియా లక్షణాలు ముందే బయటపడక పోవచ్చు. లేకుంటే వారం పది రోజుల తర్వాత బయటపడొచ్చు. కానీ ఈలోపు ఊపిరితిత్తులకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే ఈ సైలెంట్ న్యుమోనియాను ముందుగానే గుర్తించగలిగితే రోగులను వెంటిలేటర్‌పై ఉంచాల్సిన ఆవసరం రాకుండా ముందస్తు జాగ్రత్తలతో వాళ్ల ప్రాణాలను కాపాడొచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలా పనిచేస్తుంది.. శరీరంలోని అన్ని భాగాలకు గుండె ఎలా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుందో పల్స్ ఆక్సిమీటర్ గుర్తిస్తుంది. రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వల్ల వచ్చే సమస్యలను గుర్తించడం కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఆస్తమా, న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి వాటిలో ఈ మీటర్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. పల్స్ ఆక్సిమీటర్ వాడడం చాలా తేలిక. ఏదో ఒక చేతి వేలి కొనకు ఈ మీటర్‌ను ఉంచి, ఒక్క బటన్ నొక్కితే చాలు. కొన్ని సెకన్ల తర్వాత డిస్ప్లేలో పల్స్ రేట్‌తోపాటు ఆక్సిజన్ శాచ్యురేషన్ రేటు కనిపిస్తుంది. రెండు రకాల రీడింగ్.. సాధారణంగా మనిషి రక్తంలో ఆక్సిజన్ లెవల్ 94 నుంచి 100 శాతం వరకు ఉండాలి. అలాగే పల్స్ రేటు 60 నుంచి 100 మధ్యలో ఉండాలి. ఈ రెండు రీడింగ్స్.. ఉండాల్సిన దానికంటే తక్కువగా పడిపోయినా, ఎక్కువగా పెరిగినా ప్రమాదమని గుర్తించాలి. పల్స్ ఆక్సిమీటర్ ధర రూ.1,300 నుంచి రూ.ఐదువేల వరకు ఉంటుంది. ఆన్లైన్లో కూడా లభిస్తున్నాయి. చాలా మంది ప్రాణాలను కాపాడడానికి ఈ పరికరం ఉపయోగపడిందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఇంట్లో అవసరం ఉటుందని భావిస్తున్న వారు కొనుగోలు చేస్తున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా పల్స్ ఆక్సిమీటర్లకు డిమాండ్ పెరిగింది. అమ్మకాలు పెరిగాయి.. పల్స్ ఆక్సిమీటర్ పరికరాల అమ్మకాలు బాగా పెరిగాయి. అయితే ఇంట్లో పెద్దవాళ్లు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటే మాత్రం తప్పనిసరిగా పల్స్ ఆక్సిమీటర్ ఉంచుకోవడం మంచిది. దీని ద్వారా ఆక్సిజన్ లెవల్స్తోపాటు పల్స్ రేట్‌ను సులువుగా తెలుసుకోవచ్చు. ప్రమాదమని తెలిస్తే వెంటనే ఆస్పత్రికి తరలించడానికి దోహపడుతుంది. – కళ్యాణ్, మెడికల్ షాప్ యజమాని, గోదావరిఖని -
కరోనా: అవి వాడాకా ఒక్కరు కూడా చనిపోలేదు
ఢిల్లీ : హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగుల మరణాలను తగ్గించడంలో పల్స్ ఆక్సిమీటర్లు ఎంతగానో ఉపయోగపడ్డాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు. వీటిని సురక్షా కవచాలు (రక్షణ కవచాలు)గా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. తేలికపాటి కరోనా లక్షణాలున్న రోగులకు ప్రభుత్వం ఈ పల్స్ ఆక్సిమీటర్లను అందజేసిందని పేర్కొన్నారు. రోగి రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నట్లు అనిపిస్తే హెల్త్ టీంను సంప్రదించగానే ఆక్సిజన్ సిలిండర్లను పంపుతున్నామని కేజ్రివాల్ అన్నారు. ఒకవేళ ఆక్సిజన్ స్థాయి 90 శాతం, లేదా అంతకన్నా పడిపోతే వారిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. (కరోనా: కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం) గత 15 రోజులుగా ఢిల్లీలో మరణాల సంఖ్య తక్కువగా ఉందని, జూలై మొదటివారం నుంచి ఇప్పటివరకు మరణాలు నమోదు కాలేదని కేజ్రివాల్ స్పష్టం చేశారు. పల్స్ ఆక్సిమీటర్లు వాడాకా రోజువారి మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని వివరించారు. ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి పల్స్ ఆక్సిమీటర్లు అందివ్వాలని ముఖ్యమంత్రి కేజ్రివాల్ నిర్ణయించారు. రోగి ఆక్సిజన్ స్థాయి 90 లేదా అంతకన్నా తక్కువకు పడిపోతే ఈ పరికరం వెంటనే అప్రమత్తం చేస్తుంది. రోజూవారి టెలి కౌన్సిలింగ్, ఆక్సిమీటర్ల ద్వారా హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆస్పత్రికి వెళ్లకుండానే ఎంతోమంది కరోనా రోగులు ఈ విధాన వల్ల కోలుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. (కొత్తగా 28,701 పాజిటివ్ కేసులు) Delhi has been able to minimise deaths of Corona patients in home isolation thru this suraksha kavach called pulse oximeter If patients detect their oxygen is falling they reach out to us for help. We immediately send oxygen concentrators to their home or take them to a hospital https://t.co/C0Yhulsdho — Arvind Kejriwal (@ArvindKejriwal) July 12, 2020 -
ఆపద్బంధుకు ఆపద
సాక్షి, సిటీబ్యూరో: ఆపద్బంధుకు ఆపదొచ్చింది. ఇలా పిలవగానే అలా కుయ్.. కుయ్.. మంటూ ఆగమేఘాల మీద పరుగెత్తుకొచ్చే 108 అంబులెన్సుల ఆయుష్షు నిర్వహణ లోపం వల్ల రోజురోజుకూ మరింత క్షీణిస్తోంది. నెలల తరబడి మరమ్మతులకు నోచుకోక పోవడంతో వాహనాల్లో తరచూ సాంకేతిక సమస్యలు వెలుగు చూస్తున్నాయి. కారణాలేవైనప్పటికీ ఆస్పత్రికి తరలిం చడంలో జరుగుతున్న జాప్యం వల్ల క్షతగాత్రులు, నిండు గర్భిణులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం 108కి పదేపదే కాల్ చేసినా రావడం ఆలస్యం కావడమో లేక ఎంగేజ్ రావడమో జరుగుతోంది. గతంలోలా ఘటనా స్థలానికి సకాలంలో చేరుకోలేక పోతోంది. అంతేకాదు అంబులెన్స్‌లో 108 రకాల మందులు, సర్జికల్ ఐటమ్స్ ఉండాల్సి ఉండగా... చాలా వాహనాల్లో ఉండాల్సిన స్థాయిలో అవి ఉండటం లేదు. వివిధ ప్రాంతాల్లో అంబులెన్స్‌ల పరిస్థితి ఇదీ... ఎల్బీనగర్ సర్వీసులో సెక్షన్ ఆపరేటర్, ఫల్స్ ఆక్సోమీటర్, ఫెడిబోర్డు, వీల్‌చైర్స్ లేవు. మందుల స్టాక్ తక్కువగా ఉంది. వాహనం అతి కష్టమ్మీద స్టార్ట్ అవుతోంది. సరూర్‌నగర్‌లోని వాహనంలో ఆగిపోయిన గుండెను కరెంట్ తరంగాల ద్వారా యథాతథ స్థితిలోకి తీసుకొచ్చే హార్ట్స్ట్రోక్ యంత్రం, నెబులైజర్ లేదు. 20 ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండాల్సి ఉండగా ఐదే ఉన్నాయి. వాహనం తరచూ మొరాయిస్తోంది. గచ్చిబౌలి, కొండాపూర్ నుంచి ప్రతి నెలా ఒకటిన మెడికల్ ఇండెక్స్ పంపుతుండగా..13న అంబులెన్స్‌కు చేరుతున్నాయి. మల్కాజ్‌గిరిలో ఎలక్ట్రిక్ బ్యాండేజ్ లేదు. జంగమ్మెట్ కేంద్రానికి కొత్తగా ఇచ్చిన అంబులెన్స్ టైర్లు పూర్తిగా అరిగి పోయాయి. మియాపూర్ లోని వాహనం టైర్లు మార్చాల్సి ఉంది. కెమెరా, సైన్‌బోర్డు, టార్చ్‌లైట్, ఫ్రీకాలర్, ప్రింటర్, కిడ్నీ ట్రీలు లేవు. స్ట్రక్చర్ కూడా పాడైపోయింది. రోజుకు పది నుంచి 30 కాల్స్ వస్తే, 8 కాల్స్ మాత్రమే అటెండ్ చేస్తున్నారు. ఉప్పల్ వాహనంలో పల్స్‌రేట్‌ను చెక్ చేయాల్సిన పరికరం లేదు. వాహనం ఇప్పటివరకు 2.40 లక్షల కి.మీ. తిరిగింది. పాతది కావడం వల్ల పికప్ అందుకోలేక పోతుంది. గతంలో నెలకు 300 వరకు కేసులు వస్తే.. ఇప్పుడు 110 వరకు కేసులు వస్తున్నాయి. జాప్యానికి పెలైట్లు చెబుతున్న కారణాలు ట్రాఫిక్ రద్దీ, వాహనానికి దారి ఇవ్వకపోవడం ఒకే సమయంలో రెండు మూడు ప్రమాదాలు జరగడం వాహనం మరో కేసులో బిజీగా ఉండటం ఘటనా స్థలంపై సరైన సమాచారం ఇవ్వక పోవడం వాస్తవం ఇదీ... గ్రేటర్లో 48 సర్వీసులుండగా.. వీటిలో చాలావరకు పాతవే. వాహనం 60 వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత టైర్లు మార్చాలి. ప్రతి ఆరు లక్షల కిలోమీటర్లకు వాహనాన్ని మార్చాలి. ఈ నిబంధనలు అమలుకాక చాలా వాహనాల కండిషన్ బాగోలేదు. చాలావాటికి టైర్లు అరిగిపోయి, తరచూ ఫంక్చర్ అవుతున్నాయి. నిర్వహణ లోపం వల్ల ఇంజన్ నుంచి ఆయిల్ లీక్ అవుతోంది. 10 నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకోవాల్సిన ఈ సర్వీసులు అరగంటైనా రావడం లేదు.