pushker
-
గోదారి ఆరాధన
-
పుష్కర స్నానం.. పునీతం
-
పుష్కరోత్సవం
-
‘శ్రావణ’ గోదారి
-
‘అంత్య’ శోభితం
భద్రాచలం తరలివస్తున్న భక్తులు రెండో రోజు 20వేల మంది స్నానాలు అంత్య పుష్కర శోభితంగా గోదావరి తీరం.. 20వేల మందికి పైగా పుణ్యస్నానం.. రెండోరోజు సోమవారం కూడా పుష్కరాలకు భక్తులు భారీగానే తరలివచ్చారు. పసుపు, కుంకుమ, నవధాన్యాలు, వస్త్రాలను గౌతమి మాతకు సమర్పించారు. నదిలో దీపాలు వదిలి.. పితృదేవతలకు తర్పణాలు ఇచ్చారు. ముల్తైదువుల వాయినాలు.. బంధుమిత్రుల కోలాహలం.. భక్తజనంతో గోదావరి తీరం పులకించింది. భద్రాచలం : గోదావరి అంత్యపుష్కరాల్లో భాగంగా రెండో రోజు సోమవారం కూడా భక్తుల సందడి కొనసాగింది. భద్రాచలంలో సుమారు 20వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రామాలయ దర్శనం, పుష్కరస్నానం చేసుకునే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు గోదావరి స్నానఘట్టాల రేవులో సందడి కనిపించింది. గౌతమి తీరానికి చేరుకున్న భక్తులు ముందుగా పుణ్యస్నానాలు ఆచరించి, గోదారమ్మకు పసుపు, కుంకుమ, నవధాన్యాలు, వస్త్రాలను సమర్పించారు. మెట్ల రేవులో తులసి మొక్కలను ఏర్పాటు చేసి, పూజలు చేసి, దీపాలు వెలిగించి.. వాటిని భక్తి శ్రద్ధలతో గోదావరిలో వదిలారు. కృష్ణా పుష్కరాలకు ముందు వచ్చిన గోదావరి అంత్య పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. గోదావరిలో నీరు నిండుగా ఉండటంతో పిల్లలు, పెద్దలు ఆహ్లాద వాతావరణంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. పుష్కర స్నానం పూర్తయిన తరువాత పునర్వసు మండపంలో కొలువుదీరిన స్వామివారికి పూజలు చేశారు. తీర్థప్రసాదాలు స్వీకరించి రామాలయాన్ని దర్శించుకున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్ధసారథి కుటుంబ సమేతంగా గోదావరిలో పుష్కరస్నానం చేశారు. గోదావరి ఒడ్డున పూజలు నిర్వహించి నదిలో దీపాలు వదిలారు. ఉత్సవమూర్తులకు సహస్రనామార్చన అంత్య పుష్కరాల్లో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో స్వామివారికి సహస్ర నామార్చన చేశారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో వేడుక అత్యంత వైభవంగా సాగింది. క్షేత్రమహాత్మ్యంపై ఆలయ వేదపండితులు ప్రవచనాలిచ్చారు. స్వామివారికి నిత్యకల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు దేవస్థానం వేదపండితులు, అర్చకులు ఊరేగింపుగా గోదావరి తీరానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి గోదారమ్మకు హారతులు ఇచ్చారు. తిరిగి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. శ్రీసీతారామచంద్రస్వామి వారికి ప్రభుత్వ సేవ జరిపించారు. -
అంత్య పుష్కరాలకు వచ్చేవారికి అన్ని వసతులు కల్పించాలి
► ఐటీడీఏ పీఓ రాజీవ్ భద్రాచలం : అంత్య పుష్కరాలకు వచ్చేవారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఐటీడీఏ పీఓ, ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశించారు. గోదావరి స్నానఘట్టాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. భద్రాచలంలోని గోదావరి కరకట్ట పరిసరాలను ఆయన బుధవారం పరిశీలించారు. స్నానఘట్టాల వద్ద మెట్లపై పేరుకుపోయిన ఒండ్రు మట్టిని త్వరితగతిన తొలగించాలన్నారు. గోదావరిలో స్నానానికి లోతుకు వెళ్లకుండా బారికేడ్లు నిర్మించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఇరిగేషన్ డీఈని ఆదేశించారు. మహిళలు బట్టలు మార్చుకునే తాత్కాలిక గదులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలన్నారు. 24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. భక్తులు ఎక్కడ పడితే అక్కడ కాకుండా నిర్ణీత ప్రదేశాల్లో స్నానాలు చేసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు స్నానాలు చేసే ప్రదేశాల్లో పడవలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయాలని డీఎల్పీఓ ఆశాలతకు సూచించారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. పీఓ వెంట ఏఎస్పీ భాస్కరన్, తహశీల్దార్ రామకృష్ణ, డీఈ శ్యాంప్రసాద్, ఎస్సై కరుణాకర్, దేవస్థానం డీఈ రవీందర్, జీపీ ఈఓ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాసరావు, ఏఈ శైలజ పాల్గొన్నారు. -
కృష్ణ పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
భక్తుల రద్దీని బట్టి మరిన్ని పెరిగే అవకాశం కొత్తగూడెం అర్బన్: కృష్ణ పుష్కరాలకు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వే కమర్షియల్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. ఆగస్టు 12వ తేదీ నుంచి మణుగూరు రైల్వే స్టేషన్ నుంచి తెనాలి వరకు పుష్కరాల ప్రత్యేక రైళ్లు ఆగస్టు 23వ తేదీ వరకు నడుస్తాయన్నారు. మణుగూరు, భద్రాచలం, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, కృష్ణ కెనాల్, తెనాలిలో ఆల్టింగ్ ఉంటాయని వివరించారు. కొత్తగూడెం , భద్రాచలం తదితర ఏరియాల భక్తులు కృష్ణ పుష్కరాలకు వెళ్లేందుకు వారి రద్దీని బట్టి రైల్వే అధికారులు మరిన్ని రైళ్లు పెంచే అవకాశం ఉందన్నారు. పుష్కరాల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలుకు రిజర్వేషన్ సౌకర్యం ఉండదని, భక్తులు ప్రత్యేక రైలును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.