కృష్ణ పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు | special trains for krishna pushker | Sakshi
Sakshi News home page

కృష్ణ పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు

Published Tue, Jul 26 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

కృష్ణ పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు

కృష్ణ పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు

  • భక్తుల రద్దీని బట్టి మరిన్ని పెరిగే అవకాశం
  • కొత్తగూడెం అర్బన్‌: కృష్ణ పుష్కరాలకు భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌ నుంచి భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వే కమర్షియల్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఆగస్టు 12వ తేదీ నుంచి మణుగూరు రైల్వే స్టేషన్‌ నుంచి తెనాలి వరకు పుష్కరాల ప్రత్యేక రైళ్లు ఆగస్టు  23వ తేదీ వరకు నడుస్తాయన్నారు. మణుగూరు, భద్రాచలం, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, కృష్ణ కెనాల్, తెనాలిలో ఆల్టింగ్‌ ఉంటాయని వివరించారు. కొత్తగూడెం , భద్రాచలం తదితర ఏరియాల భక్తులు కృష్ణ పుష్కరాలకు వెళ్లేందుకు వారి రద్దీని బట్టి రైల్వే అధికారులు మరిన్ని రైళ్లు పెంచే అవకాశం ఉందన్నారు. పుష్కరాల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలుకు రిజర్వేషన్‌ సౌకర్యం ఉండదని, భక్తులు ప్రత్యేక రైలును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement