Rahasya movie
-
ఆసక్తికరంగా 'రహస్య' టీజర్
ప్రస్తుతం కొత్త కథలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రొటీన్ చిత్రాలకంటే కొత్తగా ఉన్నా సినిమాలనే జనాలు ఇష్టపడుతున్నారు. థియేటర్లో వచ్చి చూసేంత కంటెంట్ ఉంటేనే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే మిస్టరీ థ్రిల్లింగ్ సినిమాల పట్ల ఆసక్తి చూపుతున్నారు నేటితరం ఆడియన్స్. దర్శకనిర్మాతలు సైతం అదే కోణంలో సినిమాలు రూపొందిస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. ఇదే బాటలో ఇప్పుడు రహస్య అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రూపుదిద్దుకుంటోంది. నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ శ్రీ మీగడ దర్శకత్వం వహిస్తుండగా.. గౌతమి.ఎస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (చదవండి: సమంత ఎక్కడ? ఆమె సైలెన్స్‌కు కారణం ఇదేనా?) తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. 52 సెకన్ల నిడివితో కట్ చేసిన ఈ టీజర్.. సినిమా పట్ల ఆసక్తి రేకెత్తిస్తోంది. క్రైం మిస్టరీ నేపథ్యంలో మిస్టరీ కథాంశంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఈ వీడియో స్పష్టం చేస్తోంది. అంతుచిక్కని ఓ క్రైం ఇన్సిడెంట్‌ని పోలీసు వర్గాలు ఎలా ఛేదించాయి? ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు ఎలాంటివి? అనే పాయింట్ తో రియలిస్టిక్‌గా ఈ రహస్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని అర్థమవుతోంది. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ కోణాలను టచ్ చేస్తూ సస్పెన్స్ మిస్టరీకి తెర రూపమిచ్చారని తెలుస్తోంది. -
Rahasya Movie: ఎన్ఐఏ అధికారిగా నివాస్ శిష్టు
ప్రస్తుతం కొత్త కథలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రొటీన్ చిత్రాలకంటే కొత్తగా ఉన్నా సినిమాలనే జనాలు ఇష్టపడుతున్నారు. థియేటర్లో వచ్చి చూసేంత కంటెంట్ ఉంటేనే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే మిస్టరీ థ్రిల్లింగ్ సినిమాల పట్ల ఆసక్తి చూపుతున్నారు నేటితరం ఆడియన్స్. దర్శకనిర్మాతలు సైతం అదే కోణంలో సినిమాలు రూపొందిస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. ఇదే బాటలో ఇప్పుడు రహస్య అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రూపుదిద్దుకుంటోంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు శివ శ్రీ మీగడ దర్శకత్వం వహిస్తుండగా.. గౌతమి.ఎస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి హీరో నివాస్ కారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో నివాస్.. విశ్వతేజ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇందులో నివాస్ ఎన్ఐఏ అధికారికగా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే నివాస్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ కోణాలను టచ్ చేస్తూ సస్పెన్స్ మిస్టరీని ప్రేక్షకుల ముందుంచబోతున్నారు. ఎస్ఎస్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభించబోతోన్నారు. ఈ మేరకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. -
రహస్యం హిట్ అవ్వాలి
‘‘సినిమాల మీద మంచి అభిరుచి ఉన్న నిర్మాత రామసత్యనారాయణగారు. చిన్న సినిమాలు తీసి, విజయవంతంగా విడుదల చేయటంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా ఆయన నిర్మించిన ‘రహస్యం’ సినిమా మంచి హిట్ అవ్వాలి’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. సాగర్ శైలేష్, శ్రీ రితిక జంటగా ‘జబర్దస్త్’ అప్పారావు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రహస్యం’. సాగర శైలేశ్ దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా రెండో ట్రైలర్‌ని మారుతి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని శైలేష్ స్టైల్‌గా తెరకెక్కించాడు. ట్రైలర్ చూస్తుంటే డైరెక్టర్, అతని టీమ్ బాగా కష్టపడ్డారని తెలుస్తోంది. దర్శకునిగా తనకు మంచి భవిష్యత్తు ఉంది’’ అన్నారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘నూతన దర్శకులకు మార్గదర్శి మా ఆర్జీవీగారు (రామ్‌గోపాల్ వర్మ). ప్రతి కొత్త డైరెక్టర్ తమ చిత్రాలను ఆర్జీవీగారి చేతుల మీదుగా ప్రారంభించాలని కోరుకుంటారు. సాగర్ శైలేష్ తన శక్తిని, యుక్తిని, ప్రాణాన్ని పణంగా పెట్టి ‘రహస్యం’ సినిమా తీసాడు’’ అన్నారు. సాగర్ శైలేష్, శ్రీ రితిక పాల్గొన్నారు. -
'రహస్య' సినిమాను విడుదల చేయొద్దు
ముంబై: ఆరుషి తల్వార్ హత్యాకాండ కథ ఆధారంగా తెరకెక్కిన హిందీ చిత్రం 'రహస్య' విడుదలను బాంబే హైకోర్టు నిలిపివేసింది. జూన్ 13 వరకు ఈ సినిమాను విడుదల చేయవద్దంటూ జస్టిస్ వీఎం కనాడే, అనిల్ మీనన్‌లతో కూడిన బెంచ్ ఆదేశాలిచ్చింది. అయితే సినిమా మేకింగ్ ప్రొమోలు పదర్శించకుండా చూడాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. రహస్య సినిమా విడుదల కాకుండా చూడాలన్న నుపుర్, రాజేష్ తల్వార్ అభ్యర్థన మేరకు ఈ ఆదేశాలిచ్చింది. వేసవి సెలవులు ముగిసిన తర్వాత జూన్ 13న తదుపరి విచారణ జరుపుతామని పేర్కొంది. సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసులో ఆమె తల్లిదండ్రులు దోషులుగా తేలడంతో వారికి జీవితఖైదు విధించిన సంగతి తెలిసిందే.