rash
-
చెవి రింగులతో ర్యాష్ వస్తోందా?
కొందరికి చెవి రింగులు లేదా దుద్దులు సరిపడక చెవి తమ్మెలకు ర్యాష్ రావచ్చు. కృత్రిమ ఆభరణాలలోని నికెల్ కారణంగా కొందరిలో ఈ ర్యాషెస్ వస్తాయి. ఫలితంగా దురద, ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ దశలో నిర్లక్ష్యం చేస్తే గాయం మరింత రేగి, రక్తస్రావమయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ సమస్యను ‘అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ టు నికెల్’ అంటారు. ఈ కింది సూచనలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. నికెల్‌తో అలర్జీ ఉన్నవారు ఆ లోహంతో తయారైన రింగులు, దిద్దుల వంటి కృత్రిమ ఆభరణాలు ధరించడం సరికాదు.ఫ్యూసిడిక్ యాసిడ్ లాంటి తక్కువ మోతాదు కార్టికోస్టెరాయిడ్ ఉన్న యాంటీబయాటిక్ కాంబినేషన్‌తో లభించే క్రీములను గాయం ఉన్న చోట రోజుకు రెండు సార్లు చొప్పున కనీసం 10 రోజులు రాస్తే త్వరగా తగ్గుతుంది. అప్పటికీ తగ్గక పోతే డాక్టర్‌ను సంప్రదించాలి. -
ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!!
"ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారింది. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఏ మూలనున్న వారితోనైనా స్నేహించే, సంభాషించే అవకాశం దొరుకుతోంది. మరోవైపు ముక్కూమొహం తెలియని వారిపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి, బాధపెట్టి ఆనందించే ట్రోల్స్ అనే ప్రత్యేక జాతిని సృష్టించింది. చక్కగా అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లిష్ మాట్లాడిన బెండపూడి విద్యార్థులను, పిల్లలని కూడా చూడకుండా విపరీతంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వం నుంచి ఇంటి స్థలాన్ని పొందిన వివాహితను అసభ్య పదజాలంతో ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారు. సినీ తారలు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్.. వారని వీరని లేదు, అందరూ ట్రోలింగ్ బారిన పడ్డవారే!" అదోరకమైన శాడిజం.. జీవితంలో ఎలాంటి గుర్తింపులేని, ఎవరూ పట్టించుకోని వ్యక్తులకు ఆన్లైన్లో ఐడెంటిటీ బయటపడకుండా మాట్లాడగలగటం ధైర్యాన్నిస్తుంది. తమను ఎవరూ పట్టుకోలేరనే ధైర్యంతోనే నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడుతుంటారు. నిజానికి వీరిలో లోతైన అభద్రత ఉంటుంది. దాన్నుంచి బయట పడేందుకు, ఇతరుల అటెన్షన్‌ను పొందేందుకు ట్రోలింగ్‌ను ఒక సాధనంగా చేసుకుంటారు. ఎమోషనల్ కంట్రోల్ లేనివారు కూడా ట్రోలింగ్‌ను ఎంచుకుంటారు. ట్రోల్స్‌లో నార్సిసిజం, మాకియవెల్లియనిజం, శాడిజం ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. నార్సిసిజం అంటే విపరీతమైన స్వీయప్రేమ. వీరికి విపరీతమైన అటెన్షన్ కావాలి. దానికోసం ఇతరులను ట్రోల్ చేస్తుంటారు. మన రియాక్షన్ నుంచి వారికి కావాల్సిన అటెన్షన్ పొందుతారు. మాకియ వెల్లియన్ ట్రోల్స్ మానిప్యులేట్ చేయడానికి అబద్ధాలు, మోసం ఉపయోగిస్తారు. వారిలో ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు. ఇతరులు బాధపడుతుంటే లేదా బాధపెట్టి ఆనందించడమే శాడిజం. శాడిస్ట్ ట్రోల్స్ సంబంధంలేని అంశాలలో కూడా చేరి బాధపెట్టి ఆనందిస్తుంటారు. బలమైన కోటను నిర్మించుకోవాలి.. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ట్రోలింగ్ తప్పలేదని, మీరు ఒంటరి కాదని గుర్తించండి. ట్రోలింగ్ ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా, మీ చుట్టూ బలమైన కోటను నిర్మించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీరు సున్నిత మనస్కులైతే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఉన్నా, ట్రోలింగ్ జరుగుతున్నంతకాలం డియాక్టివేట్ చేసుకోవాలి. ట్రోల్‌కు ప్రతిస్పందించడమంటే మృగానికి ఆహారం అందివ్వడమే. వారు కోరుకునే గుర్తింపు వారికి అందివ్వడమే. అందువల్ల కష్టమైనప్పటికీ ట్రోల్స్‌ను విస్మరించడమే వారి నుంచి తప్పించుకునే మార్గం. అప్పుడే వారు నిరాయుధులవుతారు, ఆకలితో అలమటిస్తారు. ట్రోల్స్‌ను నిరోధించడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందించిన రిపోర్టింగ్ మెకానిజాన్ని ఉపయోగించండి. వారిని బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి, వారి అకౌంట్ డిలీట్ అయ్యేలా రిపోర్ట్ చేయండి. ట్రోలింగ్ మీ కంటే ట్రోల్ గురించి ఎక్కువగా వెల్లడిస్తుంది. వారి నీచ మనస్తత్వం అందరికీ తెలిసేలా చేస్తుంది. అందువల్ల ట్రోల్స్ గురించి బాధపడకండి. మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోకండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆన్లైన్ గ్రూపుల మద్దతు తీసుకోండి. మీ విలువను మీకు గుర్తు చేయగల, మీకు సహాయం చేయగల వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి. ట్రోలింగ్ వల్ల ఆందోళన, నిరాశ, దిగులు, ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి. ట్రోల్స్ 2 రకాలు.. ట్రోలింగ్ చేసేవారిని ట్రోల్ అంటారు. వీరు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటారు. వ్యక్తిగతంగా ఇతరులను ట్రోల్ చేసి ఆనందించేవారు. వీరివల్ల కాస్తంత బాధే తప్ప ప్రమాదం ఉండదు. కానీ ఒక సంస్థ కోసమో, రాజకీయ పార్టీ కోసమో వ్యవస్థీకృతంగా ట్రోల్ చేసేవారు ప్రమాదకరంగా ఉంటారు. ఎందుకంటే వారిలో ఒకరు ట్రోలింగ్ మొదలుపెడితే వందల్లో, వేలల్లో, లక్షల్లో ట్రోల్ చేస్తారు. వారికి ఆయా సంస్థ లేదా పార్టీల మద్దతు కూడా ఉండటంతో విపరీతంగా రెచ్చిపోతారు. ఇవి కొన్నిసార్లు ఆన్లైన్ యుద్ధాలుగా మారవచ్చు. ట్రోలింగ్ సంకేతాలను గుర్తించాలి.. ట్రోల్స్ నుంచి తప్పించుకోవాలంటే ముందు వారి లక్షణాలను, ప్రవర్తనను గుర్తించాలి. అప్పుడే వారికి దూరంగా ఉండవచ్చు. అందుకే వాటిని గుర్తించడం అవసరం. మీతో గొడవపడటం, మిమ్మల్ని రెచ్చగొట్టి, బాధపడేలా చేయడమే ట్రోల్స్ లక్ష్యం. అందుకోసం అవమానకమైన భాష ఉపయోగిస్తారు వాస్తవాలను వక్రీకకరిస్తారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించి, సామాజిక ఉద్రిక్తతలను సృష్టించాలని ప్రయత్నిస్తుంటారు. చర్చను వాదనగా మారుస్తారు. మీ రూపం, విలువలు, విశ్వాసాలను కించపరుస్తూ మాట్లాడతారు. కొందరు మరింత దిగజారి బూతులు కూడా తిడతారు. — సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) ఇవి చదవండి: Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో -
మరో బోస్
1911లో రెండు ముఖ్య పరిణామాలు జరిగాయి. ఒకటి, బెంగాల్ విభజనను ఉపసంహరించుకుంటున్నట్టు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. రెండో కీలక పరిణామం– బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కేంద్రాన్ని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. డిసెంబర్ 23, 1912న నాటి వైస్రాయ్ హార్డింజ్ ఏనుగు ఎక్కి ఆడంబరంగా ఢిల్లీ నగరంలో ప్రవేశించాడు. చాందినీ చౌక్ ప్రాంతంలోని ఒక ఇంటి ముందు ఒక బాలిక ఆత్రంగా ఎదురు చూస్తోంది, ఆ ఏనుగు రాక కోసం. దగ్గరకి రాగానే రహస్యంగా పట్టుకున్న నాటుబాంబును ఏనుగు మీది అంబారీ మీదకి విసిరింది. జనం కకావికలయ్యారు. హార్డింజ్ స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డాడు. ఈ చర్యను ఖండిస్తు డెహ్రాడూన్‌లో ఉన్న అటవీ పరిశోధన సంస్థ ఒక సభ నిర్వహించింది. ఆ కార్యక్రమాన్ని నిర్వహించినవాడు అక్కడే పని చేస్తున్న రాస్ బిహారీ బోస్. నిజానికి ఢిల్లీలో బాంబు విసిరినది బాలిక కాదు, ఆ వేషంలో ఉన్న 16 ఏళ్ల బసంత్ విశ్వాస్ అనే బాలుడు. సాక్షాత్తు వైస్రాయ్ హత్యకు పథకం వేసినవాడు మరెవ్వరో కాదు, రాస్ బిహారీ బోస్. హత్యాయత్నం విఫలం కావడంతో డెహ్రాడూన్ వెళ్లిపోయి అనుమానం రాకుండా విధులలో చేరాడు. కానీ ఈ పథకం వేసినవాడు రాస్ బిహారీ అన్న సంగతి త్వరలోనే పోలీసులు పసిగట్టారు. భారతదేశం నుంచి బ్రిటిష్ పాలనను సాగనంపాలంటే హింసామార్గం తప్ప వేరుదారి లేదని నమ్మినవారిలో రాస్ బిహారీ ఒకరు. విప్లవకారులతో, విప్లవ కార్యకలాపాలతో ఆయన మమేకత్వం గమనిస్తే విస్తుపోతాం. చాలా చిన్నతనంలోనే ఆయన బాంబులు చేయడం నేర్చుకున్నాడు. తరువాత సైన్యంలో చేరాలని అనుకున్నాడు. సాధ్యం కాలేదు. గదర్ పార్టీలో పనిచేశాడు. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనే సంస్థను స్థాపించాడు. ఆపై తన నాయకత్వంలో పనిచేస్తున్న అజాద్ హింద్ ఫౌజ్‌ను నేతాజీ సుభాశ్ చంద్రబోస్‌కు అప్పించారు. దేశంలో ప్రవేశించే అవకాశం లేక జపాన్ గడ్డ మీద కన్నుమూశారు. \ రాస్ బిహారీ (మే 25, 1886– జనవరి 21, 1945) అఖండ బెంగాల్‌లోని బురద్వాన్ జిల్లా సుబల్‌దహ గ్రామంలో పుట్టారు. ఆయన మూడో ఏటనే తల్లి మరణించారు. తండ్రి బిపిన్బిహారీ బోస్. తాతగారు కాళీచరణ్ బోస్ పర్యవేక్షణలో రాస్ బిహారీ ప్రాథమిక విద్య సుబల్దహలోనే జరిగింది. తరువాత చంద్రనాగోర్‌లో ఉన్నత విద్యకు వెళ్లారు. చంద్రనాగోర్ అప్పుడు ఫ్రెంచ్ ఏలుబడిలో ఉండేది. దీనితో 1789 నాటి ఫ్రెంచ్ విప్లవం గురించి చిన్నతనంలోనే తెలుసుకునే అవకాశం ఆయనకు వచ్చింది. దీనితో పాటు బంకించంద్ర చటర్జీ రాసిన ‘ఆనందమఠం’ నవలతో కూడా ఆయన దృష్టి వికసించింది. ఇంకా నవీన్ సేన్ కవితల సంకలనం ‘ప్లాసి యుద్ధం’ కూడా ఆయనను ఉత్తేజపరిచింది. వీటితో పాటు సురేంద్రనాథ్ బెనర్జీ, వివేకానంద వంటి వారి ఉపన్యాసాలు కూడా రాస్ బిహారీలో చిన్నతనంలోనే ఒక కొత్త ప్రాపంచిక దృష్టికి అవకాశం కల్పించాయి. ఢిల్లీలో హార్డింజ్ హత్య పథకం విఫలమైన తరువాత రాస్ బిహారీ కొద్దికాలం చంద్రనాగోర్‌లో అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన దొరికితే ఉరిశిక్ష ఖాయం. భారతదేశం నుంచి బయటపడాలని 1915లో భావించారాయన. పీఎన్ ఠాకూర్ పేరుతో, ఒక కవి అవతారం దాల్చి జప బయటుదేరారు. మొదట కోబ్ నౌకాశ్రయానికి, తరువాత టోక్యో చేరుకున్నారు. అక్కడే విశాల ఆసియావాదులను ఆశ్రయించారు. మిత్సుర టొయోమా అందులో ఒకరు. ఈయనే మొదట రాస్ బిహారీకి ఆశ్రయం ఇచ్చారు. కానీ కొద్దికాలానికే బ్రిటిష్ ప్రభుత్వానికి ఆయన ఆచూకీ తెలిసిపోయింది. తమకు అప్పగించవలసిందిగా ఇంగ్లండ్ జపాన్ను కోరింది. భారతీయ విప్లవకారులను వెతికే పని ఆరంభించిన జపాన్ పోలీసు యంత్రాంగం టొయోమా ఇంటిని కూడా సోదా చేసింది. అయితే మితవాద నాయకుడైనందువల్ల ఆ ఇంటిని ఎక్కువ సేపు సోదా చేయలేదు. దీనితో బోస్ టోక్యోలోనే షింజుకు అనే కొత్త రహస్య స్థావరానికి వెళ్లిపోయారు. అక్కడ సోమా కుటుంబీకులు నడుపుతున్న నకామురయా బేకరీలో ఆశ్రయం పొందారు. టొయోమో, సోమా కుటుంబం వీరంతా భారత స్వాతంత్య్రోద్యమం పట్ల సానుభూతి కలిగినవారే. ఐజో, కొత్సుకొ సోమా కూడా అలాంటివారే. వారు తమ బేకరీలోనే రహస్య ప్రదేశంలో రాస్ బిహారీని ఉంచారు. ఈ విషయం ఇతరులు ఎవ్వరికీ తెలియనివ్వకుండా తమ కుటుంబ సభ్యుల మధ్యనే దాచారు. రాస్ బిహారీని అంత జాగ్రత్తగా కాపాడారు. ఆ సమయంలోనే ఒక బ్రిటన్ నౌక జపాన్ వారి వాణిజ్య నౌకను పేల్చింది. దీనితో రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసిపోయాయి. ఫలితంగా రాస్ బిహారీని అప్పగించాలంటూ బ్రిటన్ చేసిన విజ్ఞాపన రద్దయింది. అప్పుడు ఆయన బయట ప్రపంచంలోకి స్వేచ్ఛగా అడుగు పెట్టారు. సోమా కుటుంబంతో ఏర్పడిన అనుబంధంతో ఐజో, కొత్సుకొ సోమా పెద్ద కుమార్తె తొషికోను వివాహం చేసుకుంటానని రాస్ బిహారీ కోరాడు. అందుకు ఆ దంపతులు అంగీకరించారు. అసలు ఆ సమయంలో రాస్ బిహారీని అల్లుడిగా చేసుకోవడానికి ఆ దంపతులు అంగీకరించడం. భర్తగా స్వీకరించడానికి తొషికో ఇష్టపడడం పెద్ద విషయమే. ఎందుకంటే విదేశీయులని పెళ్లి చేసుకోవడానికి ఆనాటి జపాన్ సమాజం అంగీకరించేది కాదు. పైగా విదేశాల నుంచి వచ్చి ప్రవాసం గడుపుతున్న వారితో వివాహాలు అసలే నిషిద్ధం కూడా. అందుకే తొషికో గురించి చెప్పకుండా రాస్ బిహారీ జీవిత చిత్రం పరిపూర్ణమని అనిపించదు. అంతేకాదు, జపాన్ చేరుకున్న తరువాత కూడా రాస్ బిహారీ తన భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని విరమించలేదు. అందుకోసం ఆయన విదేశాలకు వెళుతూ ఉండేవారు. అలాంటి సమయంలో తొషికో కుటుంబ బాధ్యత అంతా చూసుకునేవారు. కానీ ఇద్దరు పిల్లలు కలిగిన తరువాత తొషికో క్షయ బారిన పడి తన 28వ ఏటనే హఠాత్తుగా కన్నుమూశారు. ఆమె మరణం బోస్‌ను బాగా కుంగదీసింది. ఆయన మరోసారి వివాహం చేసుకోలేదు కూడా. నకామురయా బేకరీ పై అంతస్తులో చిన్న రెస్టారెంట్ ప్రారంభించి, మామగారితో కలసి వ్యాపారం చేశారు. ఈ చిన్న రెస్టారెంట్లో తయారు చేసే భారతీయ వంటకాల కోసం జపాన్ జాతీయులు విరగబడేవారు. ఇది ఎంతగా ఎదిగిపోయిందంటే జపాన్ స్టాక్ ఎక్సె ్చంజ్‌లో వాటాలు అమ్మిన తొలి జపాన్ ఆహారాల సంస్థగా చరిత్ర సృష్టించింది. ఇది సహజంగానే స్థానికులలో ఆసూయకు కారణమైంది. ఒక సామ్రాజ్యవాద వలస దేశానికి చెందిన మనిషితో తొషికో ప్రేమ వ్యవహారం అంటూ ఆమె గురించి చెడుగా రాసేవి. కానీ ‘నకామురయా బోస్’గా ఆయన ఎందరో జపనీయులకు ఇష్టుడిగా మారిపోయారు. ఆయన తయారు చేసిన కూరకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఒకపక్క ఆ రెస్టారెంట్ పని చేస్తూనే భారత దేశ విముక్తి గురించి ఆలోచించేవారు రాస్ బిహారీ. టోక్యోలోనే ఇండియన్ క్లబ్ పేరుతో ఒక చిన్న సంస్థను స్థాపించి, దాని ద్వారా ఇంగ్లిష్ పత్రికలకు అనేక వ్యాసాలు రాసేవారాయన. రేడియో ప్రసంగాలు ఇచ్చేవారు. భారతీయులు సాగిస్తున్న స్వాతంత్య్రం పోరాటానికి మద్దతు ఇవ్వవలసిందిగా ఆయన ప్రపంచ దేశాలకు నిరంతరం విజ్ఞప్తి చేస్తూ ఉండేవారు. అనేక మందికి ఉత్తరాలు రాసేవారు. భారత్‌కు స్వాతంత్య్రం అంటే అది భారత్‌కు మాత్రమే ప్రయోజనం కాదు. ప్రపంచానికి ప్రయోజనం అని భావించారాయన. అందుకు కారణం కూడా చూపించారు. భారత్‌లో ఇంగ్లండ్ తిష్ట అలా కొనసాగుతూ ఉంటే, పేద, బడుగు దేశాలకు రక్షణ నానాటికీ కరువైపోతుందని ఆయన భావించారు. భారత్‌ను ఇంగ్లండ్ పాలించినంత కాలం ప్రపంచంలో శాంతి ఉండదు అని కూడా ఆయన రాశారు. దీనితో పాటు జపాన్‌లోనే ఉంటున్నప్పటికీ భారతదేశంలో సాగుతున్న ఉద్యమాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. ‘గాంధీజీ గతకాలపు మనిషి. సుభాశ్ చంద్రబోస్ ఈ కాలం మనిషి’ అని ఒక సందర్భంలో రాస్ బిహారీ వ్యాఖ్యానించారు కూడా. ఆసియా దేశాల మధ్య ఐక్యతకు ఎంతో ప్రాధాన్యం ఉన్నదో రాస్ బిహారీ అద్భుతంగా ఆనాడే గుర్తించారని అనిపిస్తుంది. ఆ ఐక్యతను ఆయన మనసారా ఆకాంక్షించారు. ఆగస్టు 1, 1926న నాగసాకిలో ఆయన నిర్వహించిన సభ చరిత్రాత్మకమైనదని చెప్పాలి. డాక్టర్ హోక్వా అనే ప్రముఖునితో కలసి రాస్ బిహారీ ఆసియా దేశాల ప్రతినిధుల గోష్టి నిర్వహించారు. దీనికి 42 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో చైనా వారు 11 మంది. భారతీయులు 8, అప్ఘాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి ఒక్కొక్కరి వంతున హాజరయ్యారు. ఇంకా జపాన్‌వారు 20 మంది పాల్గొన్నారు. ఆసియా ఆసియావాసులకే అన్న నినాదం రాస్ బిహారీ అక్కడ ఇచ్చారు. 1926లో ఆయన స్థాపించిన పాన్ ఆసియన్ అసోసియేషన్, 1930లో నెలకొల్పిన జపాన్–ఇండియా మిత్రమండలి కూడా ఎంతో ప్రాధాన్యం కలిగినవి. ఈ మిత్రమండలి ఏటా మూడు లేదా నాలుగు పర్యాయాలు సమావేశాలు జరిపేది. జపాన్, భారత్ దేశాల మధ్య సత్సంబంధాల గురించి చర్చించేది. ప్రధానంగా పురాతన సంస్కృతులు కలిగిన జపాన్, భారత్‌ల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. హిందూ మహాసభ జపాన్ శాఖను ఆయనే ప్రారంభించి, వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేశారు బోస్. ఇంతలోనే రెండో ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. ఈ యుద్ధంలో బ్రిటన్ కీలకంగా ఉంది. ఇంగ్లండ్‌ను చావు దెబ్బ కొట్టడానికి ఈ యుద్ధాన్ని ఆయుధంగా మలుచుకోవాలని విప్లవవాదుల ఆశయం. 1942లో సింగపూర్ జపాన్ అధీనంలోకి వచ్చింది. ఆగ్నేయాసియాలో 32,000 మంది భారతీయ సిపాయిలను జపాన్ యుద్ధఖైదీలుగా పట్టుకుంది. వీరిందరికీ భారత స్వాతంత్య్రం కోసం పోరాడే అవకాశం కల్పిస్తానని సింగపూర్‌లో జపాన్ సైనిక వ్యవహారాల అధిపతి మేజర్ ఫుజీవరా ప్రమాణం చేశాడు. ఈ వ్యవహారం చూడడానికి సింగపూర్ వచ్చిన రాస్ బిహారీ అక్కడే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌ను 1924లో స్థాపించారాయన. ఈ యుద్ధఖైదీల సాయంతో భారత్‌ను విముక్తం చేసే పనిలో తోడ్పడేందుకు రాస్ బిహారీ టోక్యో నుంచి బ్యాంకాక్ వెళ్లారు. తరువాత ఆజాద్ హింద్ ఫౌజ్‌కు నాయకత్వం వహించవలసి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలోనే మేజర్ మోహన్‌సింగ్ నాయకత్వంలో పోరాడుతున్న 40 వేల మంది భారతీయ సైనికులు యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు. వీరందరితో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయవలసిందని జపాన్ సైనికాధికారులు అవకాశం ఇచ్చారు. ఆ పని మొదలయింది. అయితే ఆగ్నేయాసియాలో యుద్ధం గురించి సింగ్‌కూ, జపాన్ అధికారులకు మధ్య విబేదాలు వచ్చాయి. దీనితో సింగ్‌ను అరెస్టు చేసి, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌కు, అంటే రాస్‌బిహారీకి అజాద్ హింద్ ఫౌజ్‌ను అప్పిగించాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. తరువాత రాస్ బిహారీ అజాద్ హింద్ పౌజ్ను భారతదేశం నుంచి రహస్యంగా సింగపూర్ వచ్చిన నేతాజీ బోస్‌కు అప్పచెప్పారు. 1945 నాటికి రాస్ బిహారీ నిరంతరం రేడియో ప్రసారాలను వినడానికి అలవాటు పడ్డారు. అందులో ఒక వార్త కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. అది భారతదేశం స్వాతంత్య్రమైందన్న వార్త. కానీ ఆ వార్త వినకుండానే ఆయన కన్నుమూశారు. ఆయన పార్ధివదేహాన్ని తీసుకువెళ్లడానికి జపాన్ రాజకుటుంబం ప్రత్యేక వాహనాన్ని పంపించింది. 1924 నాటికే జపాన్లొ రాస్ బిహారీ ఒక ప్రముఖ పౌరుడు. - ∙డా. గోపరాజు నారాయణరావు -
ఇంట్లోనే వాక్సింగ్
బ్యూటిప్స్ చేతుల మీద అవాంఛిత రోమాలను తొలగించడం పెద్ద పనే. కానీ ఇంట్లోనే వ్యాక్సింగ్ చేసుకోవచ్చు. ఒక టీ స్పూను నిమ్మరసంలో ఒక టీ స్పూను చక్కెర కలిపి వేడి చేయాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే వ్యాక్సింగ్ నైఫ్‌తో కాని స్పూను వెనుక భాగంతో కాని చేతులకు పట్టించి వెంటనే కాటన్ క్లాత్ కప్పేసి గట్టిగా అదమాలి. వ్యాక్సింగ్ మిశ్రమం చల్లారి ఆరే కొద్దీ చర్మానికి క్లాత్ అతుక్కుపోతుంది. పూర్తిగా ఎండిన తరువాత క్లాత్ ఒక వైపును పట్టుకుని గట్టిగా లాగేయాలి. ఇలా చేయడం వల్ల రోమాలన్నీ క్లాత్‌కు అతుక్కుని వచ్చేస్తాయి. ఇది కొంచెం నొప్పిగా అనిపిస్తుంది కాని క్రమంగా రోమాల కుదుళ్లు బలహీన పడి పెరుగుదల ఆగిపోతుంది. వ్యాక్సింగ్ పట్టించేటప్పుడు రోమాలు ఏ దిశగా ఉన్నాయన్న సంగతిని గుర్తించి అదే దిశగా అప్లై చేసి, క్లాత్ లాగేటప్పుడు వ్యతిరేక దిశగా లాగాలి. వ్యాక్సింగ్ చేసినప్పుడు ర్యాష్ వచ్చినట్లయితే వెంటనే రెండు చుక్కల గ్లిజరిన్ రాయాలి. వ్యాక్సింగ్ చేయడానికి క్లాత్‌కు బదులు వ్యాక్సింగ్ టిష్యూలను వాడవచ్చు. -
పాపకు పదేపదే దద్దుర్లు..!
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాప వయసు ఐదేళ్లు. ఇటీవల మూడు నాలుగు సార్లు ఒంటి మీద దద్దుర్లలా వచ్చాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. అవి వాడినప్పుడు తగ్గినట్లే తగ్గి మళ్లీ మళ్లీ వస్తున్నాయి. మా పాపకు ఇలా జరగడానికి కారణం ఏమిటి? మా పాప సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - నాగరాణి, గుంటూరు మీ పాపకు ఉన్న సమస్యను అర్టికేరియా అంటారు. ఈ సమస్యలో చర్మం పైభాగం (సూపర్ఫీషియల్ డర్మిస్) ఎర్రబడి కాస్త ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు. ఇది చిన్న ఎర్రటి మచ్చలా మొదలై శరీరమంతటా అనేక చోట్ల కనిపించవచ్చు. ఆర్టికేరియాలో అక్యూట్ అని, క్రానిక్ అని రెండు రకాలు ఉంటాయి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు అక్యూట్ అర్టికేరియా అని చెప్పవచ్చు. ఆర్టికేరియాకు చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆహారం వల్ల (అంటే... గుడ్డు, గోధుమ, పల్లీలు, సముద్రపు చేపలు, కొందరిలో స్ట్రాబెర్రీస్); మందులు, ఏదైనా పురుగు కుట్టడం (అంటే... తేనెటీగలు లేదా చీమల వంటివి); ఇన్ఫెక్షన్లు (అంటే బ్యాక్టీరియల్ లేదా వైరల్); కాంటాక్ట్ అలర్జీలు (అంటే లేటెక్స్/రబ్బరు, పుప్పొడి వంటివి); గొంగళిపురుగులు, కొన్ని జంతువుల లాలాజలం తగలడం; రక్తం, రక్తానికి సంబంధించిన ఉత్పాదనల వల్ల...అక్యూట్ అర్టికేరియా రావచ్చు. వీటితో పాటు నట్స్‌తో కూడిన ఆహారం, ఆహారంలో వేసే కృత్రిమ రంగులు, పుప్పొడి, కడుపులో నులిపురుగులు, సింథటిక్ దుస్తులు వంటి వాటిని సాధారణ కారణాలుగా గుర్తించారు. ఇక దీర్ఘకాలికంగా కనిపించే క్రానిక్ అర్టికేరియాలో 80 శాతం కేసుల్లో కారణం ఇదీ అని చెప్పడం కష్టం. కాకపోతే కొన్నిసార్లు చాలా వేడి, చల్లటి వాతావరణం వల్ల, థైరాయిడ్, రక్తానికి సంబంధించిన రుగ్మతల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) అర్టికేరియా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. పైన పేర్కొన్న అంశాలలో ఏది కారణమో గుర్తించి, మీ పాపను ఆ అంశాల నుంచి దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. ఇక మందుల విషయానికి వస్తే యాంటీహిస్టమైన్స్, హెచ్2 బ్లాకర్స్ వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. లక్షణాలు తీవ్రంగా కనిపించే వారిలో ఇమ్యూనో మాడ్యులేషన్ మెడిసిన్స్ కూడా వాడవచ్చు. పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ మీ పాపకు యాంటీహిస్టమైన్స్‌లో హైడ్రాక్సిజీన్, సిట్రజీన్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. ఈ సమస్య పదే పదే తిరగబెడుతూ, తీవ్రంగా కనిపిస్తుంటే కొన్ని ఇమ్యూనలాజికల్ పరీక్షలు కూడా చేయించాలి. కాబట్టి తీవ్రతను బట్టి మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణుణ్ణి లేదా మీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ హోమియో కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 25 ఏళ్లు. ఈమధ్య తలలో ఒకేచోట వెంట్రుకలు రాలిపోతున్నాయి. అందరూ పేనుకొరుకుడు అంటున్నారు. హోమియోలో దీనికి పరిష్కారం ఉందా? - శంకుతల, మిర్యాలగూడ మామూలుగా అందరూ పేనుకొరుకుడు అని వ్యవహరించే ఈ సమస్యను వైద్య పరిభాషలో అలోపేషియా అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి నున్నగా అవుతుంది. శరీరం తనను తాను రక్షించుకోగలిగే శక్తి కోల్పోయినప్పుడు తలపై ఉండే జుట్టు రాలిపోతుంటుంది. వెంట్రుకలకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారై నిర్ణీత ప్రదేశంలో వెంట్రుకలు లేకుండా చేస్తుంది. కాబట్టి దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌గా చెప్పవచ్చు. ఆడ, మగ అనే తేడా లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా ఈ సమస్య కనిపిస్తుంటుంది. ముఖ్యంగా 20 ఏళ్ల వయసు ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది తలలోగానీ, గడ్డంలోగానీ, మీసాలలోగానీ... ఇలా ఎక్కడైనా కనిపించవచ్చు. ఇది అంటువ్యాధి కాదు. సాధారణంగా అలోపేషియా తలపై ఒకటి రెండు గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి. కారణాలు : మానసిక ఆందోళన థైరాయిడ్, డయాబెటిస్ బీపీ వంటి సమస్యలు ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది వంశపారంపర్యం కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వచ్చే అవకాశం ఎక్కువ. లక్షణాలు : తలపై ఎక్కువ మొత్తంలో జుట్టు ఊడిపోతుంది తలపై అక్కడక్కడ గుండ్రంగా జుట్టు ఊడిపోతూ బట్టతల ఏర్పడుతుంది. తలలో అక్కడక్కడా అతుకుల్లాగా మచ్చల్లాగా ఏర్పడతాయి సాధారణంగా మచ్చలా ఉండే జుట్టు ఊడిపోయే ప్రదేశాలు గుండ్రగా లేదా అండాకృతితో ఉంటాయి. హోమియో చికిత్స: పేనుకొరుకుడుకు హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. సమస్య లక్షణాలను, కారణాలను పరిగణనలోకి తీసుకొని మంచి మందులను వైద్యులు సూచిస్తారు. దీనికి యాసిడ్ ఫ్లోర్, సల్ఫర్, నేట్రమ్ మ్యూరియాటికమ్, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, సెలినియమ్, సోరినమ్, తూజా మొదలైన మందులను నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ స్కిన్ క్యాన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. నా వృత్తిరీత్యా రోజూ బైక్‌పై ఎక్కువగా తిరుగుతుంటాను. నా చర్మం నల్లబడటంతో పాటు కొన్నాళ్ల నుంచి నా ఒంటిపై తీవ్రమైన దద్దుర్లు, ఎర్రటి గడ్డల్లా వచ్చాయి. స్కిన్ స్పెషలిస్ట్‌ను సంప్రదించి కొన్ని మందులు వాడినా తగ్గకపోగా మరింత పెరిగాయి. ఈసారి ఆయన కొన్ని పరీక్షలు చేసి ‘చర్మక్యాన్సర్’ ఏమోననే అనుమానాన్ని వ్యక్తం చేశారు. నా ఒంటిమీద ఏర్పడ్డ పుండ్ల నమూనాను బయాప్సీకి పంపించారు. క్యాన్సర్‌కు మందులేదంటారు కదా. నాకు ఏదైనా జరిగితే నా కుటుంబం ఏమైపోతుందోనని ఆందోళనగా ఉంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - స్వరూప్, హైదరాబాద్ శరీరంలోని అతి పెద్ద అవయవం చర్మం. ఇది ఎన్నో విధాలుగా మనల్ని కాపాడుతుంది. వాతావరణంలో ఏర్పడే మార్పుల నుంచి రక్షిస్తుంది. అలాగే స్పర్శను తెలియజేస్తుంది. ఇలా మనకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే మన చర్మాన్ని మనం శ్రద్ధగా చూసుకోము. ప్రకృతి మన శరీరానికి ‘మెలనిన్’ అనే రంగు పదార్థాన్ని ఇచ్చింది. ఇక మీరు మీ వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారని తెలిపారు. ఈసారి ఎప్పుడూ లేనంతగా ఎండలు చాలా తీవ్రంగా ఉండటంతో పాటు మీరు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తీవ్రమైన, ప్రమాదకరమైన సూర్యుడి ‘అల్ట్రా వయొలెట్ రేడియేషన్’ బారిన పడి ఉంటారని అనిపిస్తోంది. దానివల్లనే మీ శరీరంపై ఇలాంటి మార్పులు చోటు చేసుకుని ఉంటాయి. చర్మంపై ఏర్పడిన దద్దుర్లు, గడ్డలు, వాటి సైజు, రంగు, రక్తం కావడం లాంటి లక్షణాలను బట్టి పరీక్షలు ఉంటాయి. ఒకవేళ మీకు బయాప్సీలో చర్మం సంబంధిత క్యాన్సర్ ఉన్నట్లు తెలిసినా అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ సమస్య కాస్త తీవ్రమైనదే అయినా ఇప్పుడు అందుబాటులో ఉన్న అధునాతన వైద్య ప్రక్రియలతో, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మీకు మంచి చికిత్సను అందించవచ్చు. సర్జరీ ద్వారా మీ చర్మంపై ఏర్పడిన దద్దుర్లు గడ్డలను సమూలంగా తీసివేయవచ్చు. ఒకవేళ అవి చాలా పెద్దగా ఉండి, చికిత్స సమయంలో మీ చర్మం కమిలిపోవడమో, ఊడిపోవడమో జరిగితే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కూడా ఆ భాగాన్ని మునుపటిలా సరిచేయవచ్చు. ఇదే సమస్య మీకు భవిష్యత్తులో ఎదురుకాకుండా పుండ్లు, గడ్డలు ఏర్పడ్డ స్పాట్లోనే కాకుండా చుట్టుపక్కల కూడా అలాంటి కణజాలాల (టిష్యూస్)ను పూర్తిగా తీసివేయడం జరుగుతుంది. ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల సూర్యకాంతిలోని అల్ట్రా వయొలెట్ కిరణాల తీక్షణత వల్ల ఈమధ్య తీవ్రమైన చర్మవ్యాధులు, క్యాన్సర్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి. మీలా ఎక్కువగా ఎండలో తిరిగేవారు తలపై హెల్మెట్‌గానీ, టోపీగాని ధరించాలి. ఫుల్‌షర్ట్ వేసుకోవాలి. ముఖానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. వీలైనంత వరకు తీక్షణమైన సూర్యకాంతికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ సచిన్ సుభాష్ మర్దా సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
సీఈఓపై టీడీపీ ఎంపీ దురుసు ప్రవర్తన
భన్వర్‌లాల్‌తో ఫోన్లోనే టీడీపీ ఎంపీ వాదన సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల పోలింగ్ సరళిని జీర్ణించుకోలేని టీడీపీ ఎంపీ సి.ఎం.రమేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌తో దురుసుగా వ్యవహరించారు. భన్వర్‌లాల్ బుధవారం ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రమేష్ఆయనకు ఫోన్ చేసి ఫోన్లోనే వాదనకు దిగారు. కడప జిల్లాలో పక్క గ్రామాలకు చెందిన వారిని ఎన్నికల ఏజెం ట్లుగా నియమించటంపై హైకోర్టు స్టే ఇవ్వటాన్ని రమేశ్తప్పుపడుతూ.. ‘మీరేం చేస్తున్నార’ంటూ భన్వర్‌లాల్‌ను ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు తన పరిధిలోకి రాదని చెప్పిన భన్వర్‌లాల్.. ‘మీరు ఇలా మాట్లాడకూడద’ని పలుమార్లు రమేశ్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆయన వినిపించుకోకుండా వాదన కొనసాగించారు. దీనికి భన్వర్‌లాల్ స్పందిస్తూ.. ‘మీరు ప్రజాప్రతినిధిగా ఉంటూ ఈ విధంగా మాట్లాడం సరికాదు.. వ్యవహార శైలిని సరిచేసుకోవాలి’ అని ఆయనకు సూచించారు. అనంతరం భన్వర్‌లాల్ మీడియాతో మాట్లాడుతూ సి.ఎం.రమేశ్తీరుపట్ల ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యునిగా ఉండి రమేష్ ఈ విధంగా ప్రవర్తించారని, ఆ పార్టీ నాయకుల తీరు ఈ విధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కడప జిల్లాలో పక్క గ్రామాల్లోని వ్యక్తిని పోలింగ్ ఏజెంటుగా నియమించుకోవడానికి ఈసీ అనుమతించింది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా ఈసీ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. అదే అంశంపై రమేశ్ ఫోన్ చేసి భన్వర్‌లాల్‌తో వాదనకు దిగారు. కోర్టు తీర్పుపై తానేం చేయగలనని భన్వర్‌లాల్ నచ్చచెప్పటానికి ప్రయత్నించినా ఆయన దురుసుగా మాట్లాడారు.