Ratnachal sf express
-
అమ్మకానికి ‘రత్నాచల్’ బోగీ
విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా తునిలో దగ్ధమైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోగీలను పాత ఇనుముగా విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఈ టెండర్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారులు పిలిచారు. మొత్తం 17 బోగీలను వేలం ద్వారా విక్రయిస్తున్నారు. ఎక్కువ ధరకు టెండర్ వేసిన వారికి ఖరారు చేస్తామని విజయవాడ డివిజన్ అధికారులు చెబుతున్నారు. జనవరి 30న తునిలో కాపుగర్జన సందర్భంగా రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను దహనం చేసిన విషయం విదితమే. ఘటన జరిగిన తర్వాత ఈ బోగీలను తుని స్టేషన్‌కు తరలించి ఇటీవలే విజయవాడ తీసుకొచ్చి వేలం నిర్వహిస్తున్నారు. -
నేడు, రేపు 'రత్నాచల్' రద్దు
విశాఖపట్నం : విజయవాడ - విశాఖపట్నం మధ్య నడిచే రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 12718, 12717 రైలు సర్వీసు రెండు రోజులపాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు సర్వీసులు బుధవారం, గురువారం రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే హౌరా - చెన్నై మెయిల్ (12839) మరింత ఆలస్యంగా నడుస్తుందని పేర్కొన్నారు. ఈ రైలు మంగళవారం రాత్రి 11.45 గంటలకు విశాఖ రావాల్సి ఉందని కానీ బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు విశాఖ చేరుకుంటుందని వాల్తేర్ డివిజన్ అధికారులు చెప్పారు.