సమతుల్య ఆహారంతోనే ఆరోగ్యం
అనంతపురం టౌన్ : సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ రావెల సుధీర్‌బాబు తెలిపారు. ఐసీడీఎస్, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం డీఆర్డీఏ అభ్యుదయ భవన్లో పౌష్టికాహారం, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు.
కిశోర బాలికల పోషకాహారం, యుక్త వయస్సులో వచ్చే మార్పుల గురించి జబార్ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయమ్మ వివరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజారోగ్య నర్సింగ్ అధికారి రాణి, పీఓడీటీటీ సుజాత, డెమో హరిలీలాకుమారి, డిప్యూటీ డెమో సుధాకర్‌రెడ్డి, హెల్త్ ఎడ్యుకేషర్ నాగరాజు, ఐసీడీఎస్ అనంతపురం అర్బన్ ప్రాజెక్ట్ సీడీపీఓ కృష్ణకుమారి, సూపర్వైజర్లు కొండమ్మ, చంద్రకళ, లలిత, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.