Rawat
-
ఆరుసార్లు ఎమ్మెల్యే.. 15 నిమిషాల్లో రెండుసార్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో సోమవారం మంత్రివర్గ మినీ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రభుత్వంలో ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రామ్ నివాస్ రావత్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ మంగూభాయ్ సీ పటేల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే తొలుత రామ్ నివాస్ తప్పుగా ప్రమాణం చేశారు. కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవలసి ఉండగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం తన తప్పును గ్రహించడంతో 15 నిమిషాల తరువాత కేబినెట్ మంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది.రావత్ గ్వాలియర్-చంబల్ ప్రాంతానికి చెందిన శక్తివంతమైన ఓబీసీ నేత. లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ అయ్యారు. షియోపూర్ జిల్లాలోని విజయ్‌పూర్ స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రావత్‌కు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవి, ప్రతిపక్ష నేత వంటి కీలక పదవులు అప్పజెప్పనందుకు అసంతృప్తి చెంది పార్టీ మారారు. రావత్ బీజేపీలో చేరిన తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ మోరెనా సీటు గెలవడంలో కృషి చేశారు. గతంలో జ్యోతిరాదిత్య సింధియా కుటుంబానికి విధేయుడిగా ఉన్న రావత్.. 2020 మార్చిలో 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి సింధియా పార్టీని వీడి బీజేపీలో చేరిప్పటికీ రావత్ కాంగ్రెస్‌లోనే కొనసాగారు.ప్రస్తుతం సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మినహా 30 మంది మంత్రులు ఉన్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 18 మంది కేబినెట్ మంత్రులు, 10 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. అంతేగాక అతని ప్రభుత్వంలో 3 ఖాళీలు ఉన్నాయి. -
ఏ చిన్న ఆధారాన్నీ వదలం
సాక్షి, హైదరాబాద్: భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ కూలిన ఘటనలో ఏ చిన్న ఆధారాన్నీ వదలబోమని ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి స్పష్టం చేశారు. ప్రమాదానికి వాతావరణ పరిస్థితులు కారణమా, మానవ తప్పిదమా, సాంకేతిక లోపమా అని తెలుసుకునేందుకు త్రివిధ దళాల ఎంక్వైరీ టీమ్ నేతృత్వంలో ‘కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ’ కొనసాగుతోందని తెలిపారు. వైమానిక దళంలో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ విభాగాలకు చెందిన 175 మంది ఫ్లైట్ క్యాడెట్ల శిక్షణ ముగిసిన సందర్భంగా శనివారం దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ముఖ్య అతిథిగా వివేక్ రామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘సీడీఎస్ హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో దొరికిన అన్ని ఆధారాలను పరిశీలించి ప్రతి సాక్షిని విచారించాలి. ఇందుకు కొంత సమయం పడుతుంది’ అని చెప్పారు. హెలికాప్టర్ దుర్ఘటన నేపథ్యంలో వీవీఐపీ ప్రొటోకాల్స్‌ను పునః పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు నివేదిక ఆధారంగా ప్రోటోకాల్స్‌ను సమీక్షించనున్నట్లు వెల్లడించారు. అవసరమైతే తూర్పు లద్దాఖ్‌కు అదనపు బలగాలు తూర్పు లద్దాఖ్‌లో అదనపు బలగాల అవసరమైతే తక్షణం తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని చౌదరి చెప్పారు. ‘అక్కడ కొన్ని ప్రాంతాల్లో భారత్, చైనా తమ బలగాలను వెనక్కి రప్పించాయి. కొన్ని చోట్ల ఉద్రిక్తత అలాగే ఉంది. గల్వాన్ ఘటన తర్వాత ఏప్రిల్ నుంచీ పరిస్థితిలో మార్పు లేదు’ అని అన్నారు. రాఫెల్, అపాచీ, చినూక్ మొదలైన వాటితో ఎయిర్ ఫోర్స్ అత్యంత బలమైన వైమానిక దళంగా మారబోతోందని చెప్పారు. క్యాడెట్లలో 28 మంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్న 175 మంది క్యాడెట్లలో 28 మంది మహిళలున్నారు. శిక్షణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్యాడెట్లకు అవార్డులను చౌదరి ప్రదానం చేశారు. ఇటీవల ప్రమాదంలో మరణించిన సీడీఎస్ రావత్, ఆయన సతీమణి, సాయుధ దళాలకు చెందిన 12 మం ది సిబ్బందికి గౌరవ సూచకంగా హవాక్, చేత క్, కిరణ్ విమాన విన్యాసాలు నిర్వహించలేదు. -
మోదీ, రాహుల్ కోసం నా తండ్రి చావలేదు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘మోదీ కోసమో, రాహుల్ కోసమో నా తండ్రి చనిపోలేదు. భారత్ కోసం చనిపోయారు. మన సైనికులను లాగకుండా మీరు ఎన్నికల్లో పోటీ చేయలేరా? ఎన్నికలైతే మీరు కచ్చితంగా మమ్మల్ని మరచిపోతారు. అది మాకు తెలుసు’ సూటిగ గుండెల్లో గుచ్చుకునే ఈ మాటలు అన్నది ఎవరో కాదు, పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లలో ఒకరైన కౌశల్ కుమార్ రావత్ కూతురు అపూర్వ రావత్. ‘భారత్ సైన్యానికి చెందిన ఎవరిని మీరు రాజకీయాల్లోకి లాగినా మీరు వారిని అవమానించినట్లే. సైనికులేమి ప్రధానికి చెందిన వారు కాదు’ అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. భారత సైన్యాన్ని ‘మోదీకీ సేన’ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని అపూర్య అలా మాట్లాడి ఉండవచ్చు. ‘భారత సైన్యం ఏ రాజకీయ పార్టీకే, ఏ రాజకీయ నాయకుడికో చెందినది కాదు. దేశంలోని ప్రతి ఒక్కరిది. నా తండ్రి చనిపోయారని వార్త తెల్సిన తర్వాత రాజకీయ నాయకులు తండోపతండాలుగా మా ఇంటికి వచ్చి కుటుంబం పట్ల ఎనలేని సానుభూతి కురిపించారు. మమ్మల్ని విసిగించారు. ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి పోయారు. ఆ తర్వాత ఫోన్లు చేస్తే ఒక్కరంటే ఒక్కరి నుంచి కూడా సమాధానం లేదు’ అని ‘తిరంగ టీవీ’ షోకు తన తల్లి మమతా రావత్‌తో హాజరైన అపూర్వ రావత్, రాజకీయ నేతలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆమె వ్యాఖ్యలను సీనియర్ జర్నలిస్ట్ బర్ఖా దత్ ట్వీట్ చేశారు. -
గీత దాటితే వేటే!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా దూషణలు, కుల, మతాల పేరుతో ఎవరైనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే సంబంధిత పార్టీ అగ్రనాయకత్వంపై ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓమ్ ప్రకాశ్ రావత్ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ యంత్రాలు 100 శాతం ట్యాంపర్ రహితం కావని కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్లు జేఎం లింగ్డో, సంపత్ ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై స్పందన కోరగా, ప్రపంచంలో ఏ యంత్రాన్ని అయినా ట్యాంపర్ చేయవచ్చన్నారు. యంత్రాలకు కళ్లు, చెవులు, నోరు, చేతులుండకపోవడంతో అవి తమను తాము సంరక్షించుకోలేవన్నారు. అవి మనుషుల సంరక్షణలో ఉండాల్సిందేనని, వారు రాజీపడితే ట్యాంపరింగ్ సాధ్యమేనన్నారు. లేనిపక్షంలో ఈవీఎంలు పూర్తిగా ట్యాంపర్ ప్రూఫ్ యంత్రాలే అన్నారు. ఈవీఎంలకు ఎన్నికల సంఘం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం చేపట్టిన రెండు రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరిగి వెళ్లడానికి ముందు శుక్రవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏర్పాట్ల పట్ల సంతృప్తి, ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఎస్పీలు, క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ కష్టపడి పనిచేసి ఏర్పాట్లలో మంచి పురోగతి సాధించారని కొనియాడారు. నేర చరిత్రపై ప్రకటనలు ఇవ్వాల్సిందే.. పర్యటనలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించగా.. ఓటర్ల జాబితాలో తప్పులు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, కుల, మతాల పేరుతో ఓట్ల అభ్యర్థన, ఫోన్ల ట్యాపింగ్, అనుమతుల జారీలో అధికారుల వివక్ష తదితర ఫిర్యాదులు, సూచనలొచ్చాయని రావత్ అన్నారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులు, సూచనలు దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల యంత్రాంగానికి సూచనలు జారీ చేశామని రావత్ అన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆదేశించామన్నారు. ఎలాంటి ప్రలోభాలు, భయాందోళనలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పించాలని కోరామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన ప్రతి ఫిర్యాదుపై సత్వర చర్యలు తీసుకోవాలని, ఈ–సువిధ యాప్ ద్వారా ప్రచార కార్యక్రమాలకు అనుమతుల జారీలో అన్ని పార్టీలకు సమ అవకాశం కల్పించాలని, 24 గంటల్లోగా అనుమతులు జారీ చేయాలని సూచించామన్నారు. రాజకీయ పార్టీల యాజమాన్యంలో పత్రికలు, వార్తా చానళ్లకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి తనపై ఉన్న నేర చరిత్రను వేర్వేరు రోజుల్లో మూడు పర్యాయాలు పత్రికలు, వార్తా చానళ్లలో ప్రకటనలు జారీ చేయాల్సిందే అన్నారు. నియోజకవర్గానికో మహిళా పోలింగ్ కేంద్రం ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున రాష్ట్రంలో 119 మహిళా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రావత్ అన్నారు. వీవీ ప్యాట్‌లో ఓటు వేరే వారికి పడినట్లు కనిపిస్తోందని పోలింగ్ ఏజెంట్ల నుంచి ఫిర్యాదులొస్తే.. పరిశీలన జరపాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం రిటర్నింగ్ అధికారులకు ఉందన్నారు. పోలింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది అందరికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. 2014లో రాష్ట్రంలో 7,056 మంది సర్వీస్ ఓటర్లుండగా, తాజాగా 10,038కు పెరిగారన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు తదుపరిగా ఇంకొన్ని చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. పెండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్న వ్యక్తులను అరెస్టు చేయాలని, నేరస్తులను బైండోవర్ చేయాలని, అవసరమైతే అరెస్టు చేయాలని కోరామన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం, కానుకల పంపిణీ జరుగుతోందని ఫిర్యాదులున్నాయన్నారు. ఇప్పటి వరకు గణనీయ సంఖ్యలో రూ.77.80 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, గత ఎన్నికల్లో జప్తు చేసిన రూ.76 కోట్లతో పోల్చితే ఈ సారి పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయన్నారు. ఆధార్‌తో ‘ఓటర్ల’అనుసంధానంపై చర్చలు ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు లేవని, డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని రావత్ అన్నారు. పునరావృతమైన ఓటర్లను ప్రస్తుతం తొలగించడం సాధ్యం కాదన్నారు. 2019 జనవరి 1 అర్హత తేదీ గా నిర్వహించనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా పునరావృత ఓటర్లను తొలగిస్తామని, ఈ జాబితాతో 2019లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఓటర్ల జాబితాను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసే అంశంపై యూఐడీఏఐతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఓటర్లకు వ్యక్తిగత ప్రయోజనాలు కల్పించే హామీ లు సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకమని, ఇలాంటి హామీలను మేనిఫెస్టోలో పెడితే ఎన్నికల సంఘం పరిశీలించి మార్పులకు సూచిస్తుందన్నారు. మౌఖికంగా ఇలాంటి హామీలు ఇస్తే చర్యలు తీసుకోవడం సాధ్యం కాదన్నారు. శాసనసభ ఎన్నికల్లో 1952 నుంచి గులాబీ బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నామని, ఇప్పుడో పార్టీ గులాబీ రంగు జెండాను కలిగి ఉందని బ్యాలెట్ల రంగు మార్చలేమన్నారు. జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించే అంశంపై పరిశీలన చేస్తామన్నారు. గతంలో తాము నిర్వహించిన పర్యటనలో జరిపిన పరిశీలనతో పోల్చితే ప్రస్తుతం ఎన్నికల ఏర్పాట్లలో మంచి పురోగతి వచ్చిందని, గత పర్యటన అనంతరం కలిగిన ఆందోళన దూరమైందన్నారు. సీఈవో రజత్‌కుమార్ బాగా కష్టపడ్డారని అభినందించారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు అశోక్ లావాసా, సునీల్ అరోరా, సీఈవో రజత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం మొరాయిస్తే ఏం చేస్తారు? కలెక్టర్ల పరిజ్ఞానానికి ఈసీఐ రావత్ పరీక్ష పోలింగ్ సమయంలో ఈవీ ఎం మొరాయిస్తే ఏం చర్యలు తీసుకుంటారు? వీవీ ప్యాట్ పనిచేయకపోతే ఎలా స్పందిస్తారు? వంటి ప్రశ్నలతో ఎన్నికల నిర్వహణలో జిల్లా కలెక్టర్లకు ఉన్న పరిజ్ఞానాన్ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓమ్ ప్రకాశ్ రావత్ పరీక్షించి చూశారు. ఎన్నికల సందర్భంగా ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే కలెక్టర్ల స్పందన ఎలా ఉంటుందో అడిగి తెలుసుకున్నారు. శాసనసభ ఎన్నికల నిర్వహణకు వచ్చే 15 రోజులే కీలకమని, జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తతతో పని చేయాలని ఆదేశిం చారు. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకుగాను రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం రెండో రోజు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌తో కలసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులొస్తున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన ఘట నలపై సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని నిలుపుదల చేయాలన్నారు. వికారాబాద్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ జిల్లాలో డబ్బులు, మద్యం జప్తు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆ జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. తమ జిల్లాలోని కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండటంతో ఆ నియోజకవర్గంపై అధిక దృష్టి పెట్టాల్సి వస్తోందని తెలియజేసినట్లు సమాచారం. -
రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈసీ భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ రావత్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, బీజేపీ, సీపీఐ, సీపీఐ (ఎం), నేషనల్ కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఆయా పార్టీల ప్రతినిధులకు రావత్ సూచించారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం విపరీతంగా ఉందని బీఎస్పీ ప్రతినిధులు కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్‌కు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ ప్రతినిధుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటోంది. -
ఓటర్ల జాబితా తక్షణ తనిఖీ
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను క్షేత్ర స్థాయికి పిలిపించి స్పాట్ వెరిఫికేషన్ నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారుల (ఈఆర్వో)కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓపీ రావత్ ఆదేశించారు. ఫిర్యాదులందిన మరుసటి రోజు స్వయంగా ఈఆర్వోలు, ఎన్నికల బృందాలు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలన జరపాలని సూచించారు. ఈ పరిశీలనలో తప్పులను గుర్తిస్తే సరిదిద్దాలని, తప్పులు లేకుంటే పాత సమాచారంతో ఫిర్యాదు చేశారని రాజకీయ పార్టీలను కన్విన్స్ చేయాలని ఈఆర్వోలకు సూచించినట్లు రావత్ వెల్లడించారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన నిర్దిష్ట ఫిర్యాదులను సంబంధిత ఈఆర్వోలకు పంపించామని, ఫిర్యాదుల పరిశీలన పురోగతిలో ఉందన్నారు. ఓటర్ల జాబితా శుద్ధీకరణకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకోసం తెలంగాణకు వచ్చిన ఓపీ రావత్.. మూడ్రోజుల పర్యటన ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) రజత్ కుమార్, ఇతర అధికారులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ఏర్పాట్ల పట్ల కొంత ఆందోళనతో రాష్ట్ర పర్యటనకు వచ్చామని, సమీక్ష అనంతరం సీఈవో, కలెక్టర్లు, ఎస్పీలు తీసుకున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని ప్రశంసించారు. ప్రజా పండుగలా ఎన్నికలు రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ప్రజా పండుగలా నిర్వహించాలని రాష్ట్ర, జిల్లా ఎన్నికల యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తుందని ఓపీ రావత్ స్పష్టం చేశారు. ఎలాంటి భయాందోళనలు, ప్రలోభాలకు లోనుకాకుండా ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణాన్ని ఏర్పాటుచేయాలని సూచించామన్నారు. ఎన్నికల నిర్వహణలో నిర్భయంగా, తటస్థంగా, స్వతంత్రంగా ఉండాలని, రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదుశాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ‘పెద్ద మొత్తంలో డబ్బులు, మద్యం పంపిణీ జరుగుతోందని రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులొచ్చాయి. వీటి నియంత్రణ చర్యల కోసం ఆదాయ పన్ను, ఎక్సైజ్, రవాణా, బ్యాంకర్స్ కమిటీ, విమానాశ్రయాలు అధికారులతో చర్చించాం. ఎన్నికల కోడ్ అమలుకు ఫ్లైయింగ్ స్క్వాడ్ల సంఖ్యను పెంచుతున్నాం. రైలు, వాయు, బ్యాంకింగ్ ద్వారా జరిగే డబ్బుల పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంటుంది’అని ఆయన పేర్కొన్నారు. మేనిఫెస్టోలపై పరిమిత అధికారాలే! రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలపై ఎన్నికల సంఘానికి పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయని, హామీలను ఎలా అమలు చేస్తారు? వనరులేంటి? అనే సమాచారాన్ని మాత్రమే పార్టీల నుంచి కోరతామని రావత్ వెల్లడించారు. ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలకు 24 గంటల్లోగా అనుమతులు జారీ చేయాలని ఈఆర్వోలను ఆదేశించామన్నారు. కాగా, ఎన్నికల కోడ్ అమలులో పక్షపాత వైఖరితో వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు కోరాయన్నారు. డబ్బులు, మద్యం, ఇతర వస్తువులు, కానుకల టోకెన్ల పంపిణీని నియంత్రించాలని కోరినట్లు రావత్ వెల్లడించారు. పొరుగు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు రాష్ట్రంలో డబ్బులు, మద్యం పంపిణీకి సహకరిస్తున్నారని ఓ రాజకీయ పార్టీ ఫిర్యాదు చేసిందని, వివరాలు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. బురఖా ధరించి వచ్చే ముస్లిం ఓటర్లను గుర్తించేందుకు మహిళా పోలీసు కానిస్టేబుళ్లు/మహిళా పోలింగ్ అధికారులను నియమించనున్నట్లు ఆయన తెలిపారు. వికలాంగ ఓటర్ల నమోదు, వారు ఓటు హక్కు వినియోగించుకునేలా సదుపాయాలకల్పన కోసం తొలిసారిగా ఎలక్షన్ యాక్ససబిలిటీ అబ్జర్వర్లను పంపుతున్నామన్నారు. అంధ ఓటర్లకు బ్రెయిలీలో బ్యాలెట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. సిబ్బందికి క్యాష్‌లెస్ వైద్యం ఎన్నికల విధుల్లో అస్వస్థతకు గురయ్యే సిబ్బందికి.. సమీపంలోని అత్యుత్తుమ ఆస్పత్రిలో క్యాష్‌లెస్ సదుపాయం కల్పించాలని సూచించగా.. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంగీకరించారన్నారు. మారుమూల ప్రాంతాల్లో అస్వస్థతకు లోనైతే వారిని తరలించడానికి ఏయిర్ అంబులెన్స్ అందుబాటులో ఉంచుతామన్నారు. శాంతి భద్రతల పరిస్థితులపై సమీక్ష నిర్వహించామని, భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు రావత్ పేర్కొన్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలను వినియోగిస్తామని ఆయన వెల్లడించారు. మహిళా పోలింగ్ బూత్‌ల్లో ఎక్కడా గులాబీ రంగు కనిపించదన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు సునీల్ అరోరా, అశోక్ లావస, బృందంలోని ఇతర అధికారులు ఉమేష్ సిన్హా, సందీప్ సక్సేనా, సందీప్ జైన్, చంద్రభూషణ్ కుమార్, దిలీప్ శర్మ, ధీరేంద్ర ఓజా, సుందర్ భయిల్ శర్మ, ఎస్కె రుడోలా పాల్గొన్నారు. నేర చరిత్ర ప్రకటన తప్పనిసరి అభ్యర్థులు తమ నేర చరిత్రను తప్పనిసరిగా ప్రకటించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎన్నికల అఫిడవిట్ల నమూనాలో మార్పు లు చేశామన్నారు. అభ్యర్థులు.. తమ నేర చరిత్రను 3 పత్రికలు, న్యూస్ ఛానళ్లలో ప్రకటనల రూపంలో ప్రసారం చేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల అఫిడవిట్లను 24 గంటల్లోగా వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. గత ఎన్నికల్లో నమోదైన కేసుల్లో కేవలం 25% మాత్రమే కోర్టుల్లో రుజువయ్యాయని.. ఈసారి కేసుల నమోదు సమయంలోనే అన్ని రకాల ఆధారాలను సేకరించాలని, బాధ్యుల పేర్ల ను రికార్డు చేయాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించామన్నారు. నోటిఫికేషన్ విడుదల నాటి నుంచి ఎన్నికల కోడ్ ఉల్లంఘనల ఫిర్యాదుల స్వీకరణకు ‘సీ–విజిల్’యాప్ వినియోగంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలోని 38 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకటి కంటే ఎక్కువ జిల్లాల పరిధిలో ఉన్నాయని, గందరగోళం ఏర్పడకుండా ఈవీఎంలకు కలర్ కోడింగ్ చేస్తున్నట్లు సీఈఓ చెప్పారన్నారు. -
భారత్ రెడీగా ఉంది: ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో కల్లోల పరిస్థితులకు పాక్ కారణమని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ద్వారా కశ్మీర్ యువతను పాక్ రెచ్చగొడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. కశ్మీర్లో పరిస్థితులు త్వరలోనే చక్కబడుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన రావత్.. భారత్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆర్మీ ఆధునికీకరణ అంశాన్ని ప్రభుత్వంతో ప్రస్తావిస్తున్నామని, ఈ విషయంలో పురోగతి బాగుందని ఆయన వెల్లడించారు. పాక్, చైనా, కశ్మీర్ కల్లోల పరిస్థితులను ఉటంకిస్తూ రెండున్నర యుద్దాలను ఎదుర్కోవడానికి భారత్ సన్నద్ధంగా ఉందని రావత్ వ్యాఖ్యానించారు. కాగా.. కశ్మీర్‌లోని నౌగామ్ సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని గురువారం భారత ఆర్మీ తిప్పికొట్టింది. చొరబాటుదారులతో జరిగిన ఎన్కౌంటర్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు. -
అస్తిపంజరాలు లభించిన మాట నిజమే
డెహ్రాడూన్: మూడేళ్ల క్రితం ప్రకృతి విపత్తుతో విలవిలలాడిన కేదార్నాథ్ ఆలయం వద్ద అనేక అస్తిపంజరాలు లభించిన మాట నిజమేనంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యమంత్రి హరీశ్‌రావత్ ఈ విషయమై సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘మొత్తం 31 అస్తిపంజరాలు దొరికాయి. అందులో 21 అస్తిపంజరాలకు అంత్యక్రియలు నిర్వహించాం. మిగతా ఎనిమిది మృతదేహాలకు మంగళవారం చేస్తాం’ అని చెప్పారు. దీనితో నాకేమీ సంబంధం లేదు. నాకు ముందు అధికారంలో ఉన్న విజయ్ బహుగుణ గాలింపు చర్యలను నిలిపివేశారు. గాలింపు చర్యలు చేపట్టలేదంటూ ఇల్లెక్కి అరిచేవాళ్లంతా ఈ విషయమై ఆయననే నిలదీయాలి’ అని అన్నారు. కేదార్నాథ్ ఆలయం సమీపంలో అనేక అస్తిపంజరాలు లభ్యమయ్యాయంటూ వార్తలు రావడం తెలిసిందే. 2013లో ఏకబిగిన కుండపోతగా వర్షం కురియడంతో అనేక భవనాలు కూలిపోయి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో కొంతమంది తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం కొండ పైభాగానికి వెళ్లారు. అయితే అక్కడ ఆహారం, నీరు దొరకకపోవడంతో చనిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. -
డెహ్రాడూన్‌లో శక్తిమాన్ స్మారక పార్కు
-
బలపరీక్షలో రావత్ గెలుపు
* ఉత్తరాఖండ్‌లో గట్టెక్కిన కాంగ్రెస్ సర్కారు * అనుకూలంగా 33 మంది, వ్యతిరేకంగా 28 మంది ఓటు గెలుపు వివరాలు వెల్లడించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు * నేడు అధికారికంగా ప్రకటించనున్న సుప్రీంకోర్టు * ఇప్పటికైనా ఉత్తరాఖండ్ అభివృద్ధికి కలసిరండి: రావత్ డెహ్రాడూన్/న్యూఢిల్లీ: తీవ్ర ఉత్కంఠ మధ్య మంగళవారం జరిగిన ఉత్తరాఖండ్ బలపరీక్షలో రావత్ సర్కారు గట్టెక్కింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమాచారం మేరకు రావత్‌కు అనుకూలంగా 33 మంది ఓటేయగా, 28 మంది వ్యతిరేకంగా ఓటేశారు. 90 నిమిషాల ఓటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీసిన అధికారులు సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించారు. గెలుపు వివరాలను సుప్రీంకోర్టు నేడు అధికారికంగా ప్రకటించనుంది. రావత్ సర్కారు విజయంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదని, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందంటూ మార్చి 28న మోదీ సర్కారు రాష్ట్రపతి పాలన విధించడం తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే సరితాఆర్య తెలిపిన వివరాల ప్రకారం.. రావత్‌కు అనుకూలంగా 33 మంది ఓటేశారు. దాంతో బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలే మిగిలారు. బీజేపీకి చెందిన భీమ్లాల్ ఆర్య, కాంగ్రెస్‌కు చెందిన రేఖా ఆర్యలు క్రాస్ ఓటింగ్ చేసినట్లు సమాచారం. రావత్‌కు అనుకూలంగా ఓటేసిన వారిలో 27 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు బీఎస్పీకి చెందిన ఇద్దరు, యూకేడీ నుంచి ఒకరు, ముగ్గురు స్వతంత్రులున్నారు. 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు అనర్హులని సోమవారం హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో 61 మందే ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటింగ్ కోసం మంగళవారం ఉదయం రెండు గంటలపాటు రాష్ట్రపతి పాలనను తొలగించారు. ఉదయం నుంచే ఉత్కంఠ.. బలపరీక్ష నేపథ్యంలో అసెంబ్లీ వద్ద ఉదయం నుంచే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఉద్యోగులు మినహా ఎవరినీ లోపలికి అనుమతించలేదు. 11 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ గంట పాటు సాగింది. అసెంబ్లీ గేటు బయట విలేకర్లు, పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఇంతలో నైనిటాల్ ఎమ్మెల్యే సరిత ఆర్య బయటకొచ్చి ఆనందంతో రావత్ గెలిచారంటూ ప్రకటించారు. సుప్రీం ఆదేశాల మేరకు బలపరీక్ష క్రమశిక్షణ మధ్య సాగిందన్నారు. ఘర్షణ వాతావరణం వద్దు: రావత్ బలపరీక్ష ముగిసిన వెంటనే హరీశ్ రావత్ కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ, రాహుల్‌కు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఒక్కో ఎమ్మెల్యేకు పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. బలపరీక్ష వివరాల్ని బుధవారం సుప్రీంకోర్టు వెల్లడిస్తుందన్నారు. తాను చిన్న రాష్ట్రానికి చిన్న ముఖ్యమంత్రినని, ఘర్షణ వాతావరణానికి ముగింపు పలికి ఉత్తరాఖండ్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని బలమైన నేతలు స్నేహ హస్తం అందించాలని కోరారు. రాజ్యసభలో రగడ: ఉత్తరాఖండ్ ఆర్థిక బిల్లును సోమవారం నాటి అదనపు జాబితాలో పెట్టడంపై రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదించగా మళ్లీ పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టారని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ బలపరీక్ష నేపథ్యంలో మంగళవారం రాజ్యసభ బోసి పోయి కన్పించింది. పాలక, ప్రతిపక్ష సభ్యులు చాలా మంది హాజరుకాలేదు. సమాధానాలు కోరిన పలువురు సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో కనిపించలేదు. కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ ప్రజాసంక్షేమంపై కీలకమైన ప్రశ్నలు సంధించినా.. ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడంతో సహాయమంత్రి సమాధానమిచ్చారు. మోదీ సర్కారుకు ఎదురుదెబ్బ: సోనియా బలపరీక్ష ముగియగానే ఇది ప్రజాస్వామ్య విజయమంటూ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ పేర్కొన్నారంటూ పార్టీ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చెప్పారు. ఈ విజయం మోదీ ప్రభుత్వానికి చెంపపెట్టని సోనియా చెప్పారన్నారు. రావత్ విజయం బీజేపీకి ఎదురుదెబ్బ కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కాంగ్రెస్ అంతర్గత సమస్య వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని, ఇది కాంగ్రెస్, బీజేపీల మధ్య సమస్య కాదని ఆయన వ్యాఖ్యానించారు. హరీశ్ రావత్ గెలుపును కొనుగోలు చేశారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు గుణపాఠం చెపుతారంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకుని సంపాదించిన సొమ్ముతో ఎమ్మెల్యేల్ని కొన్నారంటూ ఆయన విమర్శించారు. పార్టీ మారితే రాజీనామా చేయాల్సిందే ప్రజాప్రతినిధులు సొంత పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీలో చేరాలనుకుంటే తక్షణం రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమవ్వాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఒకవేళ ప్రజాప్రతినిధి వేరే పార్టీ మారాలనుకుంటే అతన్ని తక్షణం అనర్హుడ్ని చేయాలన్నారు. ఉత్తరాఖండ్ బలపరీక్ష నేపథ్యంలో మాట్లాడుతూ.. ‘ఒక ప్రజాప్రతినిధి పార్టీ మారాలనుకుంటే రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి పదవికి రాజీనామా చేయాలి. బలపరీక్షకు సంబంధించి స్పీకర్ పాత్రతో పాటు ఫిరాయింపుల చట్టం అమలు నిబంధనల్నీ పునఃపరిశీలించాలి’ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి, తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి మారిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
దారిమళ్లిన రాయితీ సొమ్ము
♦ రూ.10.71 కోట్లే ♦ ‘సాక్షి’ వార్తపై పరిశ్రమల శాఖ వివరణ సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రాయితీల వ్యవహారంలో రూ.10.71 కోట్లు మాత్రమే పక్కదారి పట్టాయని, ఇందులో రూ.7.5 కోట్లు తిరిగి రాబట్టామని, ఇంకా రూ.3.66 కోట్లను రాబట్టాల్సి ఉందని పరిశ్రమల శాఖ తెలిపింది. ‘రావత్ అవుట్... మిశ్రాపై సీఎస్ సీరియస్’ పేరుతో ఈ నెల 7న ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఆ శాఖ స్పందించింది. పారిశ్రామిక రాయితీల కింద రూ.1,990.52 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది. ఇందులో కొన్ని తప్పుగా, మరికొన్ని ఇచ్చిన సంస్థలకే మళ్లీ ఇవ్వడం జరిగిందని పేర్కొంది. వీటిని తిరిగి తెప్పించే క్రమంలో జాయింట్ డెరైక్టర్ రామిరెడ్డి బ్యాంకులో తప్పుడు ఖాతా సృష్టించి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, ఈ వ్యవహారంలో మరో ముగ్గురి పాత్ర కూడా ఉందని, ఈ కారణంగానే వారిని సస్పెండ్ చేసినట్టు వెల్లడించింది. దాదాపు రూ.100 కోట్ల వరకూ రాయితీ సొమ్ము పక్కదారి పట్టాయన్న ఆరోపణల్లో నిజం లేదని పరిశ్రమలశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
బాబు... రావత్..ఓ చిన్నట్విస్ట్..!
‘‘థర్టీ ఇయర్స్ ఇన్ పాలిటిక్స్.. సీఎంగా.. ప్రతిపక్ష నేతగా నాదే రికార్డు అంటూ’’ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఇటీవలే షాక్‌కు గురయ్యారట. ఎందుకంటారా.. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసి తెలంగాణకు వెళ్లేందుకు క్యాట్‌కు దరఖాస్తు చేసుకున్న ఎస్.ఎస్.రావత్ నిర్ణయం తెలుసుకున్న చంద్రబాబు కొద్ది సేపు తేరుకోలేదట. క్యాట్ కూడా రావత్‌కు అనుమతి ఇవ్వడంతో బాబు షాక్ తిన్నారట. ఏపీలో పరిశ్రమల స్థాపన ప్రమోషన్‌కు దావోస్‌కు వెళ్లిన రావత్ అక్కడే స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఆయన కాలు దెబ్బతినడంతో అక్కడే చికిత్స చేయించుకున్నారు. చంద్రబాబు ప్రత్యేకంగా రావత్ బాగోగులకు ఆదేశాలిచ్చారు. దావోస్ నుంచి తిరిగొచ్చిన రావత్ తెలంగాణకు వెళ్లేందుకు తీసుకున్న నిర్ణయంతో బాబు కొంత ఇబ్బందికి గురయ్యారట. రావత్ బాటలోనే పలువురు ఐఏఎస్‌లు పొరుగు రాష్ట్రానికి వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారనే వార్తలకు బాబు ఉక్కిరి బిక్కిరవుతున్నారట. తాను ఏం తక్కువ చేశాను.. అని బాబు ముఖ్యుల వద్ద వాపోతుంటే.. అదేదో సినిమాలో పాపులరైన డైలాగు ‘‘అంతా మీరే చేశారు..’’ అని బాబు కోటరీ ముఖ్యులు అంటున్నారట. ప్రభుత్వ విధానమేంటో స్పష్టంగా చెప్పకుండా.. నిత్యం గంటల కొద్దీ సమీక్షలు... పొద్దుపోయే వరకు మీటింగులతో ఐఏఎస్‌లు విసుక్కుని పొరుగు రాష్ట్రానికి, కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నారట. ఐఏఎస్‌ల ఆలోచన తెలుసుకున్న బాబు తన పంథా మార్చుకుంటారా.. లేక భ్రమలు కల్పిస్తూ కాగితాల్లోనే అభివృద్ధి చూసుకుంటారా? అని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.