rdt team
-
పరుగుల వర్షం
– సెంచరీలతో కదంతొక్కిన న్యూజిలాండ్ – 84 పరుగుల తేడాతో ఓడిన ఆర్డీటీ జట్టు - నేడు వన్డే మ్యాచ్ అనంతపురం న్యూసిటీ: అనంత క్రీడాగ్రామంలోని క్రికెట్ స్టేడియంలో శనివారం పరుగుల వర్షం కురిసింది. న్యూజిలాండ్‌కు చెందిన హాట్హాక్స్ జట్టు బ్యాట్స్‌మన్స్ టామ్బ్లండల్, మారడాక్ చెలరేగి ఆడి సెంచరీలు కొట్టి తమ జట్టు విజయంలో కీలకంగా మారారు. ఆర్డీటీ జట్టుతో రెండ్రోజులుగా సాగుతున్న సన్నాహాక క్రికెట్మ్యాచ్ల్లో శనివారం టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేసింది. జట్టులోని అంతర్జాతీయ క్రీడాకారుడు టామ్ బ్లండర్ 97 బంతుల్లో మూడు సిక్సర్లు, 11 బౌండరీలతో 125 పరుగులు సాధించారు. మరో బ్యాట్స్‌మెన్ మారడాక్ 127 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు బౌండరీలతో 106 పరుగులు సాధించారు. ఆర్డీటీ బౌలర్లలో మస్తాన్‌ఖాన్ ఐదు వికెట్లు తీశారు. 332 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్డీటీ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 248 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో వినీల్‌కుమార్ 53, గిరినాథ్‌రెడ్డి 52 పరుగులు సాధించారు. న్యూజిలాండ్ బౌలర్లతో హెడెన్స్మిత్ మూడు వికెట్లు తీశారు. కాగా, ఆదివారం ఈ రెండు జట్ల మధ్య వన్డే పోటీ జరగనుంది. -
న్యూజిలాండ్ శుభారంభం
– ఛేజింగ్‌లో బోల్తాపడ్డ ఆర్డీటీ జట్టు అనంతపురం న్యూసిటీ: సన్నాహక క్రికెట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం ఉదయం హట్‌హాక్స్, ఆర్డీటీ జట్ల మధ్య టీ–20 మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. గరెత్ సెవెరిన్ 50 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెటర్ ల్యూక్ఉడ్కాక్ 23 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. ఆర్డీటీ బౌలర్లలో మస్తాన్‌ఖాన్ 3/31, సాయికార్తీక్, గిరినాథ్‌రెడ్డి తలా వికెట్ తీసుకున్నారు. బోల్తాపడ్డ ఆర్డీటీ జట్టు అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్డీటీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు మాత్రమే చేసింది. గిరినాథ్‌రెడ్డి (37), సాయికార్తీక్రావు (34), షాబుద్దీన్ (34) మాత్రమే రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మెక్ ఇవాన్ 2/27, స్మిత్, జెస్సీ, ఉడ్‌కాక్, గ్రీన్ఉడ్ తలా వికెట్ తీసుకున్నారు. దీంతో న్యూజిల్యాండ్ హట్‌హాక్స్ జట్టు 29 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. ముందుగా ఆర్డీటీ క్రికెట్ స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథులుగా హాజరైన ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి, హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాలఫెర్రర్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ స్థాయిలో క్రీడాకారులు కలర్ దుస్తులతో పోటీల్లో పాల్గొన్నారు. మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల సభ్యులు తమ దేశగీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు పగడాల మల్లికార్జున, జొన్నా జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
క్రికెట్ విజేత ఆర్డీటీ అనంత జట్టు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : వైఎస్సార్ జిల్లా నందలూరులో జరుగుతున్న పీఎంసీఎం సౌత్‌జోన్ ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీ విజేతగా ఆర్డీటీ అనంత జట్టు నిలిచింది. బుధవారం జరిగిన రెండవ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్డీటీ అనంతపురం, గూడూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అనంత జట్టు నిర్ణీత 30 ఓవర్లలో 212 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గూడూరు జట్టు 23 ఓవర్లలోనే 104 పరుగులకే కుప్పకూలింది. అనంత బౌలర్లలో ముదస్సిర్ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు సాధించాడు. జట్టు విజయానికి కీలకంగా మారిన ముదస్సిర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఆర్డీటీ అనంతపురం జట్టు విజయకేతనం ఎగరేయడంతో జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాంఛో ఫెర్రర్, షాహబుద్దీన్లు హర్షం వ్యక్తం చేశారు. నేడు నామమాత్రపు మూడో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.