real estate act
-
త్వరలో టీజీ రెరా యాప్..
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఉద్దేశించినదే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(TG-RERA). సాంకేతికత వినియోగం పెరిగిన ఈ రోజుల్లో టీజీ రెరా సేవలకు కూడా ఆధునికత చేర్చాలని నిర్ణయించారు. రియల్ ఎస్టేట్(Real Estate) ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్, ఫిర్యాదుల ట్రాకింగ్, రియల్ టైం నోటిఫికేషన్ల క్రమబద్ధీకరణ కోసం టీజీ రెరా యాప్‌ను తీసుకురానున్నట్లు టీజీ రెరా ఛైర్మన్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. అలాగే ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్లు తక్షణ ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్ సాంకేతికత అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం టీజీ రెరా వెబ్సైట్(Website)లో రిజిస్ట్రేషన్లు, ఫిర్యాదులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ.. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడమే దీన్ని ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూ పూర్తి వివరాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోనివాస సముదాయాలు మాత్రమే రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? వాణిజ్య భవనాలకు రెరా రిజిస్ట్రేషన్ అవసరం లేదా?జవాబు: నివాస, వాణిజ్య ఏ భవనమైనా సరే రెరాలో రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 యూనిట్ల కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉన్న ప్రతీ ప్రాజెక్ట్ కూడా ఆర్ఈ(R and D) చట్టంలోని సెక్షన్–3 కింద రిజిస్ట్రేషన్ చేయాలి.రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండానే విక్రయాలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?జవాబు: బ్రోచర్లు, కరపత్రాలతో సహా అన్ని ప్రింట్, ఎల్రక్టానిక్, సోషల్ మీడియాలో ప్రచురించే ప్రకటనలు, ప్రాజెక్ట్(Project)లకు తప్పనిసరిగా రెరా రిజిస్ట్రేషన్ నంబరు ఉండాలి. దాన్ని ప్రదర్శించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే తొలుత షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. 15 రోజుల వ్యవధిలో ప్రత్యుత్తరాన్ని సమర్పించాలి. లేని పక్షంలో ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం వరకు జరిమానా విధిస్తారు. ఉల్లంఘనలు పునరావృతమైతే సంబంధిత ప్రమోటర్‌కు మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు.ఇల్లు కొనేందుకు కొనుగోలు దారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?జవాబు: ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారులు సంబంధిత ప్రాజెక్ట్‌కు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ(HMDA), డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ వంటి స్థానిక సంస్థల నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నాయా? లేదా అని తెలుసుకోవడంతో పాటు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి. రెరా వెబ్సైట్ ద్వారా ప్రాజెక్ట్ రెరా రిజిస్ట్రేషన్ నంబర్‌ను పరిశీలించవచ్చు. అలాగే లీగల్ టైటిల్, ఆమోదిత లేఔట్ ప్లాన్, ప్రాజెక్ట్ పేరు, వసతులు, ప్రాంతం వివరాలు, చట్టపరమైన టైటిల్ డీడ్స్, ప్రాజెక్ట్ నిర్మాణ గడువు వంటి అన్ని రకాల వివరాలను పరిశీలించవచ్చు.బాధితులు రెరాకు ఎలా ఫిర్యాదు చేయాలి? జవాబు: రెరా రిజిస్ట్రేషన్ లేకుండా, ప్రీలాంచ్, బైబ్యాక్ స్కీమ్‌ల పేరిట ప్రచారం చేసినా, విక్రయాలు చేసినా టీజీ రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. 040–29394972 లేదా 9000006301 వాట్సాప్ నంబరులో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే https://rera.telangana.gov.in/complaint/ లేదా rera-maud@telangana.gov.in లేదా secy-rera-maud@telangana.gov.inలకు ఈ–మెయిల్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లేదా సేల్‌డీడ్‌లో పేర్కొన్న గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకపోయినా, అడ్వాన్స్‌గా 10 శాతం కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేసినా రెరాకు ఫిర్యాదు చేయవచ్చు.ఇప్పటి వరకు రెరాలో ఎన్ని ప్రాజెక్ట్‌లు రిజిస్ట్రేషన్ అయ్యాయి?జవాబు: ఇప్పటివరకు టీజీ రెరాలో 9,129 ప్రాజెక్ట్‌లు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటిలో అత్యధికంగా రంగారెడ్డిలో 2,954, అత్యల్పంగా ఆసిఫాబాద్‌లో 2 ప్రాజెక్ట్‌లు రిజిస్టర్ అయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. మేడ్చల్–మల్కాజ్గిరి 2,199, సంగారెడ్డి 986, హైదరాబాద్ 516, వరంగల్ అర్బన్ 414, యాదాద్రి భువనగిరి 349, మహబూబ్‌నగర్ 257, ఖమ్మం 280, నిజామాబాద్ 158, కరీంనగర్ 144, సిద్దిపేట 101, వికారాబాద్ 101, సూర్యాపేట 98, నల్లగొండ 87, నాగర్‌కర్నూల్ 66, మెదక్ 61, కామారెడ్డి 53, మంచిర్యాల 37, భద్రాది కొత్తగూడెం 34, జగిత్యాల 32, ఆదిలాబాద్ 31, మహబూబాబాద్ 27, పెద్దపల్లి 26, జనగాం 24, వనపర్తి 21, రాజన్న సిరిసిల్ల 19, జోగులాంబ గద్వాల్ 17, నిర్మల్ 12, వరంగల్ రూరల్ 12, జయశంకర్ 11 ప్రాజెక్ట్‌లు రిజిస్టరయ్యాయి.ఇప్పటి వరకు రెరా ఎంత జరిమానా విధించింది? ఎంత వసూలైంది?జవాబు: ఇప్పటి వరకు రెరా నిబంధనల ఉల్లంఘనదారులపై రూ.40.95 కోట్ల జరిమానాలు విధించాం. ఇందులో రూ.15.64 కోట్లు వసూలు చేశాం.నిర్మాణ సంస్థలు జరిమానా చెల్లించకపోతే రెరా తదుపరి చర్యలు ఏంటి?జవాబు: రెరా విధించిన జరిమానా లేదా వడ్డీ పరిహారం చెల్లించడంలో ప్రమోటర్ విఫలమైతే.. అది రెవెన్యూ బకాయిగా పరిగణిస్తారు. ఈ తరహా కేసులను ఆర్ఈ(ఆర్అండ్డీ) చట్టం–2016లోని సెక్షన్ 40(1) కింద జరిమానా లేదా వడ్డీ రికవరీ చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేస్తాం.ఇప్పటి వరకు ఎంత మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు?జవాబు: రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా తప్పనిసరిగా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. రెరా రిజిస్ట్రేషన్ నంబరు లేకుండా ఏజెంట్లు ప్లాట్లు, ఫ్లాట్, ఇల్లు ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ను విక్రయించకూడదు. ఇప్పటి వరకు టీజీ–రెరాలో 3,925 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రిజిస్టరయ్యారు.ఇదీ చదవండి: భవిష్యత్తులో కనుమరుగయ్యే ఉద్యోగాలు ఇవే..ఈమధ్య కాలంలో బిల్డర్ల చీటింగ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. వీటిలో చాలా మంది బిల్డర్లు ఏజెంట్ల ద్వారా విక్రయాలు చేసినవాళ్లే.. మరి, ఏజెంట్ల మీద రెరా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?జవాబు: రెరా చట్టంలోని 9, 10లను ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కూడా రెరా జరిమానా విధిస్తుంది. ఇప్పటి వరకు భృగు ఇన్ఫ్రా, సాయిసూర్య డెవలపర్స్, భారతి ఇన్ఫ్రా డెవలపర్స్, రియల్ ఎస్టేట్ అవెన్యూ కన్సల్టెంట్ సర్వీసెస్, యంగ్ ఇండియా హౌసింగ్ ప్రై.లి. వంటి ఏజెంట్లపై రెరా చర్యలు తీసుకున్నాం. రెవెన్యూ రికవరీ చట్టం కింద జరిమానా రికవరీ చేసేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్ చర్యలు కూడా ప్రారంభించారు.ఇప్పటి వరకు రెరా ఎన్ని ఫిర్యాదులను పరిష్కరించింది?జవాబు: టీజీ రెరా పోర్టల్ ద్వారా ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా ఆన్లైన్లో కేసుల విచారణ కూడా చేపడుతున్నాం. దీంతో ఎక్కడి నుంచైనా సరే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మౌఖిక వాదనాలు వినిపించవచ్చు. ఇప్పటి వరకు 1,216 ఫిర్యాదులను పరిష్కరించాం. -
నేటి నుంచి ‘రియల్’ అమలు
-
నేటి నుంచి ‘రియల్’ అమలు
ఈ చట్టంతో రియల్ ఎస్టేట్‌లో పారదర్శకత ► నోటిఫై చేసిన 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ► మిగిలిన రాష్ట్రాలతో కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ చర్చలు న్యూఢిల్లీ: చాలాకాలంగా ఎదురుచూస్తున్న రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యం పెంచేందుకే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. గతేడాది మార్చిలో పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందగా.. ఇందులోని 92 సెక్షన్లు మే 1నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ చట్టం నిబంధనలను 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే నోటిఫై చేశాయి. యూపీ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు నోటిఫై చేశాయి. గతేడాది కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల (అండమాన్ నికోబార్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, దామన్ దయ్యూ, లక్షద్వీప్)కు, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఢిల్లీ నేషనల్ కేపిటల్ రీజియన్ ప్రాంతానికి ఈ నిబంధనలను నోటిఫై చేశాయి. మిగిలిన రాష్ట్రాలు తమ సొంత నిబంధనలతో ముందుకు రావాల్సి ఉంది. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఈచట్టాన్ని నోటిఫై చేసి పంపేవిధంగా ఆయా రాష్ట్రాలతో గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. కొనుగోలుదారుల ప్రయోజ నాలను కాపాడేందుకే కేంద్రం ఈ చట్టం తీసుకొచ్చింది. ఇందుకోసం వినియోగదారుల ఫెడరేషన్, రియల్ ఎస్టేట్ సంస్థలతోపాటుగా పలు భాగస్వామ్య పక్షాలతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. ఈ చట్టంలోని కొన్ని ముఖ్యమైన నిబంధనలు ♦ కనీసం 500 చదరపు మీటర్లు లేదా ఎనిమిది అపార్ట్మెంట్లున్న ప్రతి ప్రాజెక్టుకు ఈ చట్టం అమలవుతుంది. ♦ మొదట్లో దీన్ని రెసిడెన్షియల్ ప్రాజెక్టులకే పరిమితం చేద్దామనుకున్నా తర్వాత కమర్షియల్ ప్రాజెక్టులకూ అమలు చేయనున్నారు. ♦ ప్రాజెక్టులో ఆలస్యం కారణంగా నిర్ణీత సమయానికి కొనుగోలుదారులకు ఇల్లు/వాణిజ్య సముదాయం ఇవ్వని పక్షంలో డెవలపర్ ఎస్బీఐ వడ్డీరేటుపై అదనంగా 2 శాతం పరిహారాన్ని 45 రోజుల్లోగా (నిర్ణీత సమయం నుంచి) చెల్లించాలి. ఇది 11–12 శాతం ఉండొచ్చు. ♦ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు డెవలపర్లు కొనుగోలుదారుల నుంచి సేకరించిన మొత్తంలో 70 శాతాన్ని వేరే బ్యాంకు అకౌంట్లో భద్రపరచాలి. ప్రస్తుత ప్రాజెక్టు నిధులు వేరే ప్రాజెక్టుకు వినియోగించకుండా ఉండేందుకే ఈ నిబంధన. ♦ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ నిధులను ఉల్లంఘించే డెవలపర్లకు కఠినమైన శిక్షతోపాటుగా.. ప్రాజెక్టు వ్యయంలో 10శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుం ది. కొనుగోలుదారులు, ఏజెంట్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కొన్న ఆస్తి వ్యయంలో 10 శాతం జరిమానా విధిస్తారు. ♦ కొత్త నిబంధనల ప్రకారం ఆస్తుల అమ్మకాల్లో ఎలాంటి వివక్షా ఉండరాదు. ఇలాంటి ఫిర్యాదులను న్యాయస్థానాలు, రియల్ ఎస్టేట్ అథారిటీ, అప్పిలేట్ ట్రిబ్యునల్స్ 60 రోజుల్లోగా పరిష్కరించాలి. ♦ కొనసాగుతున్న ప్రాజెక్టులకు నిర్ణీత సమయంలో కంప్లీషన్ సర్టిఫికేట్ రానిపక్షంలో.. డెవలపర్లు ఇందుకు గల కారణాలు, చేసిన మార్పులు, వాటాదారులనుంచి సేకరించిన మొత్తం, ఇందులో వినియోగించిన మొత్తం, ఎప్పటిలోగా ప్రాజెక్టు పూర్తవుతుంది తదితర అంశాలతో బహిరంగ ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. ♦ అధికారుల వద్ద ప్రాజెక్టులు రిజిస్ట్రేషన్ కోసం.. డెవలపర్లు పాన్ కార్డు, గడిచిన మూడేళ్ల వార్షిక లాభ నష్టాల అకౌంట్, బ్యాలన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఆడిటర్ నివేదిక, ధ్రువీకృత లీగల్ టైటిల్ డీడ్, ప్రమోటర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం కాపీని తప్పనిసరిగా పొందుపరచాల్సిందే. దీంతోపాటు ప్రమోటర్లూ ఓపెన్, క్లోజ్డ్ పార్కింగ్‌ల వివరాలను సమర్పించాలి. ♦ ఆదాయ పన్ను రిటర్న్స్ వివరాలు తప్పనిసరిగా పొందుపరచాలన్న నిబంధనను తొలగించారు. ♦ కొనుగోలుదారుల కోసం.. ప్రమోటర్ల ట్రాక్ రికార్డు, వివాదాల వివరాలు, ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటనలు, ప్రాస్పెక్టస్, అపార్టుమెంట్లు, ప్లాట్ల వివరాలు, నమోదు చేసుకున్న ఏజెంట్లు, కన్సల్టెంట్లు, అభివృద్ధి ప్రణాళిక, ప్రమోటర్ ఆర్థిక వివరాలు, ప్రాజెక్టు అనుమతి వివరాలను కచ్చితంగా ప్రమోటింగ్ సంస్థ వెబ్సైట్లో ఉంచేలా రియల్ ఎస్టేట్ నియంత్రణ అధికారులు బాధ్యత వహించాలి. -
నేటి నుంచి రియాల్టీ చట్టం అమల్లోకి..
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి సాక్షి, హైదరాబాద్: చారిత్రక నియంత్రణ చట్టం (రియల్ ఎస్టేట్ యాక్ట్, 2016) సోమవారం నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ప్రకటించారు. దీని ద్వారా స్థిరాస్తి రంగానికి కొత్త ఊపు వస్తుందని, కొనుగోలుదారులు, విక్రయదారులు, సంస్థ లకు లాభం, ప్రయోజనం కలుగుతుంద న్నారు. ఈ బిల్లుపై 2008లో తర్జనభర్జనలు ప్రారంభించిన గత యూపీఏ ప్రభుత్వం 2013 లో దీన్ని ప్రవేశపెట్టగా.. మోదీ ప్రభుత్వం అవసరమైన మార్పులు, సవరణలతో సెలక్ట్ కమిటీ ద్వారా ఆమోదం పొందిందన్నారు. ఈ చట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌తో కలుపుకొని 13 రాష్ట్రాలు నియ మని బంధనలను నోటిఫై చేశాయన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా వెంటనే నోటిఫై చేసి ఈ చట్ట స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్ర పరిధిలో నియమనిబంధ నలను రూపొందించుకోవాలన్నారు. ఆదివారం పార్టీ నాయకులు డా.కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నల్లు ఇంద్ర సేనారెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 2018లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో మధ్యంతర ఎన్నికలు జరగవచ్చనే ప్రచారం నిరాధారమైం దన్నారు. 2019లో జరిగే ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా కార్యకర్తలకు పిలుపునిచ్చిన విష యాన్ని గుర్తుచేశారు. ఏపీ, తెలంగాణలోని మిర్చి రైతుల సమస్యపై తగిన చర్య తీసుకోవా లని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కోరగా కొంత మేర సహాయం అందించేందుకు సుముఖతను వ్యక్తం చేశార న్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, దానిపై తగిన సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజకీయాల్లో తనకు తెలిసిన బాహుబలి మోదీ ఒక్కరేనన్నారు. తలాక్ మతపరమైన అంశం కాదు ట్రిపుల్ తలాక్ మతపరమైన అంశం కాదని వెంకయ్య స్పష్టం చేశారు. షరియాత్లో కూడా దీనికి మంజూరు లేదన్నారు. ఇది ముస్లిం మహిళలు గౌరవంతో జీవించే హక్కుకు సంబంధించినదని, దీనిని రాజకీయం చేయడం తగదన్నారు. ఈ అంశంపై బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న గులాంనబీ ఆజాద్ వంటి వారు తాము అధికారంలో ఉండగా దీనిపై మౌనం ఎందుకు వహించారో చెప్పాలన్నారు. బాహుబలి–2 పై వెంకయ్య ప్రశంసల వర్షం అత్యద్భుత చిత్రీకరణతో హాలీవుడ్ సినిమాలతో పోటీపడే స్థాయిలో బాహుబలి–2ను దర్శకుడు రాజమౌళి తెరకెక్కిం చారని వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ సినిమా కీర్తిపతాకాన్ని ప్రపంచం నలుమూలాల చాటిన తెలుగుచిత్రం ఇది కావడం గర్వ కారణమన్నారు. శుక్రవారం ఈ సినిమాను తాను వీక్షించి గొప్ప అనుభూతికి లోనైన ట్లు చెప్పారు. కేంద్ర మంత్రిగా ఈ సినిమా దర్శకుడు, నిర్మాతలు, మొత్తం బాహుబలి టీమ్‌ను అభినందిస్తున్నామన్నారు. దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు గ్రహీత కె. విశ్వనాధ్‌ను ఆదివారం కలసి అభినందనలు తెలిపామన్నారు. మే 3న రాష్ట్రపతి చేతుల మీదుగా విశ్వనాథ్‌కు ఈ అవార్డును అందజేస్తామన్నారు.