Revenue Mechanism
-
Telangana: బోగస్ కృష్ణ‘పట్టా’!
తిరుమలగిరి (సాగర్) మండలంలోని గోడుమడకకు చెందిన ఈయన పేరు బారు శివయ్య. ఆయనకు చింతలపాలెం రెవెన్యూ శివార్లలోని సర్వే నంబర్ 14లో 4.30 గుంటల భూమి ఉంది. తాతల కాలం నుంచీ వారే ఆ భూమిని సాగుచేసుకుంటున్నారు. నేటికీ రికార్డుల్లో పేరు లేకపోవడంతో పట్టాదారు పాసుపుస్తకం అందలేదు. కానీ కొందరు ఈ భూమికి సంబంధించి అక్రమంగా పట్టాలను చేయించుకుని రైతుబంధు, రైతుబీమా పథకాలు పొందుతున్నారు. బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకున్నారు. భూమి తమ స్వాదీనం (కబ్జా)లో ఉన్నా.. తమకు పాస్ పుస్తకం లేక ప్రభుత్వ పథకాలు అందడం లేదని శివయ్య వాపోయారు...ఈయన ఒక్కరి భూమే కాదు. కేవలం ప్రైవేటు వ్యక్తుల అదీనంలోని స్థలాలే కాదు.. వేల ఎకరాల ప్రభుత్వ భూములను కూడా అక్రమార్కులు చెరబట్టారు. భూమిని ఏళ్లకేళ్లుగా సాగుచేసుకుంటున్నవారు పట్టాలు లేక, హక్కుల్లేక ప్రభుత్వ పథకాలకు దూరమైతే... కొందరు అవే భూములపై నకిలీ పట్టాలు సృష్టించి, ప్రభుత్వం నుంచి రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల సొమ్మును కాజేస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా ప్రభుత్వ భూములకే బోగస్ పట్టాలు సృష్టించేశారు. కృష్ణపట్టె ప్రాంతమైన నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలంలో తాజాగా బయటపడిన బాగోతమిది. అక్రమార్కులు ఈ మండలంలో 3,900 ఎకరాలకు బోగస్ పట్టాలు సృష్టించినట్టు రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. తద్వారా ఏటా రూ.3.5 కోట్ల చొప్పున గత పదేళ్లలో రూ.35 కోట్లకుపైగా రైతుబంధు రూపంలోనే పొందినట్టు అధికారులు భావిస్తున్నారు. బోగస్ పట్టాలతో రైతుబీమా, బ్యాంకుల్లో రుణాలు పొందినట్టు తేల్చారు. సమీపంలోని దామరచర్ల మండలంలోనూ వేల ఎకరాల ప్రభుత్వ భూములు బోగస్ పట్టాలతో కబ్జా అయినట్టు రెవెన్యూ యంత్రాంగం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ముడుపులకు అలవాటుపడిన అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ అక్రమాలు సాగాయని అంటున్నారు. – సాక్షి ప్రతినిధి, నల్లగొండసాక్షి ప్రతినిధి, నల్లగొండ: ధరణి సమస్యలతో రైతులు ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో పరిష్కార మార్గాలపై సర్కారు దృష్టి పెట్టింది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా లోని తిరుమలగిరి (సాగర్) మండలంలో నెలకొన్న పరిస్థితిని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనితో ప్రభుత్వం తిరుమలగిరి (సాగర్) మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. భూముల సమస్య లపై విచారణ చేపట్టింది. అధికారులు ప్రాథమిక విచారణలోనే 3,900 ఎకరాలకు కొందరు బోగస్ పట్టాలు సృష్టించినట్టు గుర్తించారు. మండలంలోని చింతలపాలెం గ్రామంలోని 12, 222, 158, 162, 223 సర్వే నంబర్లలో, తిమ్మాయి పాలెం గ్రామంలోని 38, 39, 60, 70, 74 సర్వే నంబర్లలో అక్రమ పట్టాలు ఉన్నట్టు తేల్చారు. వీటితోపాటు తునికినూతల గ్రామంలో సర్వే నంబర్ 45, నెల్లికల్ గ్రామంలో 424 సర్వే నంబర్, జమ్మలకోట గ్రామంలో 28 సర్వేనంబర్లలో అక్రమంగా పట్టాలు పొందినట్టు గుర్తించారు. చింతలపాలెం, తిమ్మాయిపల్లి రెండు గ్రామాల్లోనే 2,800 ఎకరా లకు నకిలీ పట్టాలు సృష్టించినట్టు తేలడం గమనార్హం. ప్రభుత్వ భూములనూ బోగస్ పట్టాలతో చెరబట్టినట్టు గుర్తించారు. దీంతో ఈ అక్రమాలను పూర్తిస్థాయిలో నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 14 రెవెన్యూ, సర్వే బృందాల ఆధ్వర్యంలో 80 మందికిపైగా సిబ్బంది తో క్షేత్రస్థాయి సర్వేకు శ్రీకారం చుట్టింది. నకిలీ స్వాతంత్య్ర సమరయోధుల పేరిట పట్టాలు దామరచర్ల మండలంలోని సర్వే నంబర్లు 686, 691, 1100, 735, 655, 621, 690, 714తోపాటు మరో 33 సర్వే నంబర్లలో 4,542 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములపై కబ్జాదారు ల కన్ను పడింది. దీంతో భూబకాసురులకు.. స్వాతంత్య్ర సమరయోధులు గుర్తుకొచ్చారు. నకిలీ సమర యో ధులను సృష్టించి, తమ చేతివాటం ప్రదర్శించి, అధికారులను మచి్చక చేసుకొని కోట్ల రూపాయల విలువైన భూములను దోచేశారు. వాటిపైనే ఇప్పుడు జిల్లా యంత్రాంగం ఫోకస్ పెట్టింది.60 ఏళ్లుగా సేద్యం చేస్తున్నా.. హక్కులు తొలగించారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మా గ్రామం ముంపునకు గురికావడంతో చిన్నాయిపా లెం తండాలో పునరావా సం కల్పించారు. 1962లో అప్పటి ప్రభుత్వం పట్టాలు అందజేసింది. 60 ఏళ్లుగా అక్కడే సేద్యం చేసుకుంటూ జీవిస్తున్నాం. ధరణికి ముందు వరకు బ్యాంకులో రుణాలు పొందాం. 2016 భూప్రక్షాళన సమయంలో మా భూములను పార్ట్–బీలో చేర్చడంతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందలేదు. అప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. బ్యాంకు రుణం తీసుకునే అవకాశం లేకుండాపోయింది. – రమావత్ హనుమ, చెన్నాయపాలెంమొత్తం రీసర్వే.. అక్రమ పట్టాల తొలగింపే లక్ష్యం తిరుమలగిరి సాగర్ మండలంలోని అన్ని భూములపై రీసర్వే చేస్తున్నాం. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. 100 ఎకరాల భూమి ఉంటే రికార్డుల్లో 200 ఎకరాలకు పేర్లు ఉన్నాయి. భూమి స్వా«దీనంలో ఉన్న వారి పేర్లు ధరణిలో లేవు. ధరణిలో పేర్లు ఉన్నవారి స్వాదీనంలో భూములు లేవు. ఎవాక్యూ ప్రాపర్టీని కబ్జా చేసి పట్టాలు సృష్టించారు. అటవీ భూముల హద్దుల సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ తేల్చి.. అర్హులకు పట్టాలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశం. అందుకే ఈ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఈ మండలంలోని ప్రతి సర్వే నంబరులోనూ విస్తృత సర్వే చేస్తున్నాం. ఆ భూమి ఎవరిదని తేల్చి, నకిలీ పట్టాలను రద్దు చేసి.. కబ్జాలో ఉన్న అసలైన అర్హుల పేరిట పట్టాలు ఇచ్చి, న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నాం. – నారాయణరెడ్డి, నల్లగొండ జిల్లా కలెక్టర్ -
మరాఠ్వాడాలో మరణ మృదంగం
సాక్షి ముంబై: మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలోనే 300 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల పలితాల అనంతరం అధికారం కోసం ఒకవైపు కుమ్ములాటలు కొనసాగుతున్న సమయంలోనే ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 300 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం ప్రకటించింది. 2019 అక్టోబరు 14 నుంచి 2019 నవంబరు 11వ తేదీ వరకు ఒక్క మరాఠ్వాడా ప్రాంతంలోనే 68 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే, 2019 నవంబరు నెలలో 300 రైతులకు ఆత్మహత్యలకు పాల్పడ్డారనే దిగ్భ్రాంతికర విషయాన్ని రెవెన్యూ శాఖ శుక్రవారం వెల్లడించింది. అక్టోబర్‌లో అకాల వర్షాల కారణంగా మరాఠ్వాడాలో 70 శాతం ఖరీఫ్ పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో అక్టోబర్, నవంబర్ నెలలో ఆత్మహత్యలు 61 శాతం వరకు పెరిగినట్లు పేర్కొంది. ఇలా ఒకే నెలలో 300 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడటం 2015లోనూ చోటుచేసుకుందని తెలిపింది. -
అక్షరాలా పది లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివాదాస్పద భూముల లెక్క ఎట్టకేలకు తేలింది. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూముల్లో పది లక్షల ఎకరాలు వివాదాల్లో ఉన్నాయని రెవెన్యూ యంత్రాంగం నిర్థారించింది. కోర్టు కేసులు, అటవీ శాఖతో ఉన్న వివాదాలు, భూబదలాయింపు క్రమబద్ధీకరణ, వ్యక్తిగత వివాదాలున్న భూములను కేటగిరీల వారీగా లెక్కగట్టి ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ గణాంకాలను ప్రభుత్వానికి సమర్పించింది. రెవెన్యూ శాఖ లెక్క ప్రకారం 5 లక్షలకుపైగా ఎకరాలకు వ్యక్తిగత వివాదాలుండటం గమనార్హం. ఆరు నెలలకు పైగానే.. భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియలో భాగంగా రెవెన్యూ రికార్డుల సవరణలు, మార్పులు, చేర్పులు జరిగాయి. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా ఈ సవరణల గణాంకాలను కూర్పు చేసి ఆరునెలలకుపైగా సమయం తీసుకున్న తర్వాత వివాదాస్పద భూములను రెవెన్యూ యంత్రాంగం నిర్థారించింది. ఈ గణాంకాల ప్రకారం.. సివిల్ కోర్టుల్లో 1,11,196 ఎకరాలు, రెవెన్యూ కోర్టుల్లో 42,318 ఎకరాలకు సంబంధించి భూవివాదాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక, ఇలా అటవీ–రెవెన్యూ శాఖల మధ్య పంచాయితీ ఉన్న భూమి 2,04,729 ఎకరాలని తేలింది. వీటికి తోడు భూబదలాయింపు క్రమబద్ధీకరణ(ఎల్టీఆర్)æ(ఒకరి చేతిలో ఉన్న భూమి ఇంకొకరికి బదలాయింపు చేసి దానిని క్రమబద్ధీకరించడం) కింద రాష్ట్రవ్యాప్తంగా 95,214 ఎకరాలు వివాదాల్లో ఉన్నాయి. అన్నింటికన్నా ఎక్కువగా అన్నదమ్ములు, వారసులు, బంధువులు, సరిహద్దుల్లో భూములున్న వారితో వివాదాలున్న భూములు 5,84,527 ఎకరాలున్నాయని తేలింది. ఆ నాలుగు జిల్లాల్లోనే ఎక్కువ జిల్లాలవారీగా చూస్తే నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వివాదాస్పద భూములు ఎక్కువగా ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 33,121 ఎకరాల్లో అటవీశాఖతో వివాదం ఉన్న భూములు తేలాయి. మంచిర్యాల, కామారెడ్డి, మహబూ బాబాద్, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అటవీశాఖతో వివాదాలున్న భూములు ఎక్కు వగా ఉన్నాయని తేలింది. కోర్టు కేసుల విష యానికి వస్తే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 17,118 ఎకరాల వివాదాలు సివిల్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో సివిల్ కోర్టుల్లో ఉన్న భూములు 243 ఎకరాలే. ఎల్టీఆర్ కేటగిరీలో రాష్ట్రవ్యాప్తంగా 95 వేల ఎకరాలకుపైగా వివాదాలుంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 75,987 ఎకరాలుండటం విశేషం. రాష్ట్రంలోని 30 గ్రామీణ జిల్లాలకుగానూ 19 జిల్లాల్లో ఎల్టీఆర్ కేసులు ఒక్కటీ నమోదు కాలేదు. వ్యక్తిగత వివాదాలున్న భూముల విషయానికి వస్తే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 53,033 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 41,463 ఎకరాల్లో వివాదాలున్నాయి. వివాదాస్పద భూములన్నింటినీ పార్ట్–బీ కేటగిరీలో చేర్చిన రెవెన్యూ యంత్రాంగం.. కోర్టుల్లో ఉన్న భూములు మినహా మిగిలిన వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించాలని నిర్ణయించింది. -
తొలిరోజు 3,47,250 ఎకరాలు
► రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన భూ రికార్డుల ప్రక్షాళన ► హైదరాబాద్ మినహా మిగతా 30 జిల్లాల్లో ప్రక్రియ మొదలు ► 1,389 బృందాలు.. 1,389 గ్రామాల్లో గ్రామసభలు ► ఇంటింటికీ వెళ్లి రికార్డుల పరిశీలన ► మంచి స్పందన ఉందంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళన శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. హైదరాబాద్ మినహా 30 జిల్లాల్లో ప్రారంభమైన ఈ ప్రక్రియలో మొత్తం 1,389 బృందాలు పాల్గొన్నాయి. తొలిరోజు 1,389 గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించడంతోపాటు ఇంటింటికీ వెళ్లి రికార్డులను కూడా పరిశీలించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 3,47,250 ఎకరాలకు సంబంధించిన భూ రికార్డుల పరిశీలన పూర్తయింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. గ్రామసభలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని, తొలిరోజు స్పందన ఆశాజనకంగా ఉందని అధికారులు చెబుతున్నారు. నివాసేతరులు కూడా.. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా నివాసేతరులు కూడా గ్రామాలకు వెళ్లి రికార్డులను సరి చేసుకోవాలని రెవెన్యూ యంత్రాంగం స్పష్టం చేస్తోంది. గ్రామసభ జరిగే రోజు హాజరు కావాలని, లేదంటే గ్రామంలో రెవెన్యూ బృందాలు ఉండే 10 రోజుల్లో ఒక రోజు గ్రామానికి వెళ్లి రికార్డులను సరి చూసుకుని.. అవసరమైతే సరి చేయించుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. గ్రామాలకు దూరంగా, ఇతర రాష్ట్రాల్లో ఉండే వారికి వీఆర్వోలు సమాచారం ఇస్తారని, దాని ఆధారంగా ప్రక్షాళన కార్యక్రమానికి హాజరు కావాలని చెబుతున్నారు. నివాసేతరుల కోసం ప్రతిరోజు సంబంధిత గ్రామంలో సాయంత్రం 5–6 గంటల మధ్య రెవెన్యూ బృందం ఉంటుందని, ఆ సమయంలో రికార్డులను సరి చూసుకోవాలని సూచిస్తున్నారు. ప్రవాస తెలంగాణవాసుల కోసం ‘ఈ–ప్రక్షాళన’ ఇక ప్రవాస తెలంగాణవాసుల కోసం ‘ఈ–ప్రక్షాళన’కార్యక్రమం చేపట్టాలని రెవెన్యూ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. గ్రామాల్లో ప్రవాసుల భూములకు ఉండే కాపలాదారులు లేదంటే వారి బంధువుల ద్వారా రికార్డులను సరి చేయించుకోవచ్చని, ఏవైనా అభ్యంతరాలుంటే సదరు జిల్లా యంత్రాంగానికి ఈ మెయిల్ ద్వారా నివేదించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే ‘మాభూమి’పోర్టల్‌లోకి వెళ్లి అక్కడ తమ భూమి వివరాలు తెలుసుకోవచ్చని, అక్కడ తేడా ఉంటే వెంటనే ఈ మెయిల్ ద్వారా తెలియజేయాలని పేర్కొంటున్నారు. సదరు ప్రవాసుల ఈ మెయిల్ అడ్రస్‌లను రెవెన్యూ కార్యాలయాల్లో ఇచ్చినా ఆన్లైన్ 1–బీ ప్రతులను మెయిల్ ద్వారా పంపుతామని, వారు కూడా అదే మెయిల్ ద్వారా మార్పు, చేర్పులను ప్రతిపాదించవచ్చని చెబుతున్నారు. ఈ విధానాన్ని ఒకటి రెండు రోజుల్లో అమల్లోకి తెస్తామని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. భూ వివాద రహిత గ్రామం ల్యాగలమర్రి సాక్షి, జగిత్యాల: రెవెన్యూ రికార్డుల శుద్ధీక రణ, నవీకరణ కార్యక్రమం తొలిరోజే జగి త్యాల జిల్లా పెగడపల్లి మండలం ల్యాగల మర్రి గ్రామం తొలి భూవివాదరహిత గ్రా మంగా రికార్డు సృష్టించింది. గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, ఆర్డీవో డాక్టర్ గంటా నరేందర్ శుక్రవారం పర్యటిం చారు. దరఖాస్తుల రూపంలో వచ్చిన 113 సమస్య లకు పరిష్కార పత్రాలు, పట్టాలు ఇచ్చి ల్యాగలమర్రిని భూవివాదరహిత గ్రామం గా ప్రకటించారు. వీటిలో 49 విరాసత్.. భూ రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లలో వచ్చిన సమస్య లు 62, రెండు ఓఆర్సీ పట్టాలను అర్హులైన లబ్ధిదారులకు అంద జేశారు. జమీన్ బందీ, సాదాబైనామా రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ల్యాగలమర్రిలో మొత్తం 1,036 వివిధ రకాల సమస్యలపై దరఖాస్తులు అందాయి. వీటన్నింటిని పరిశీలించి పరి ష్కార మార్గాలను చూపించారు. కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ రెవెన్యూ రికార్డులను శుద్ధీకరించిన ల్యాగల మర్రి మాదిరిగానే జగిత్యాలను భూవివాద రహిత జిల్లాగా త్వరలోనే ప్రకటిస్తామని ఆశా భావం వ్యక్తం చేశారు.