reverse repo rate
-
తగ్గిద్దామా? వద్దా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ రెపోరేటు(ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీరేటు-ప్రస్తుతం 6.5 శాతం)ను తగ్గించాలా? వద్దా అనే నిర్ణయంపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. కమిటీ తీసుకునే నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ ఈ నెల 9వ తేదీన వివరిస్తారు.యథాతథ స్థితికే ఓటు..!కమిటీ కీలక వడ్డీరేట్లను యథాతథ స్థితిలోనే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, దాంతో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాలు ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు సరళతర రేటు విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ దేశీయంగా ఆర్బీఐ ఆ తరహా నిర్ణయాలు తీసుకోకపోవచ్చని నిపుణుల అంచనా. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ యథాతథంగా 6.5 శాతం రెపో రేటును కొనసాగిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే, డిసెంబర్లో జరిగే ఎంపీసీ సమావేశంలో రేటు తగ్గింపు ఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులుభేటీలో ముగ్గురు కొత్త సభ్యులుఆర్బీఐ తాజా ద్రవ్య పరపతి విధాన కమిటీని ప్రభుత్వం ఈ నెలారంభంలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఎక్స్టర్నల్ సభ్యులుగా రామ్ సింగ్, సౌగత భట్టాచార్య, నగేష్ కుమార్‌లను కేంద్రం ఈ నెల ప్రారంభంలో నియమించింది. పదవీ కాలం ముగిసిన అషిమా గోయల్, శశాంక భిడే, జయంత్ ఆర్ వర్మ స్థానంలో వీరి నియామకం జరిగింది. గత ద్వైమాసిక సమావేశాల్లో అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మలు రేటు తగ్గింపునకు ఓటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా నియమితులైన వారితో పాటు కమిటీలో అంతర్గత (ఆర్బీఐ తరఫున) సభ్యులుగా గవర్నర్ శక్తికాంతదాస్, డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్బీఐ పరపతి విధాన విభాగం) రాజీవ్ రంజన్లు ఉన్నారు. -
రివర్స్ రెపో పావు శాతం పెరగొచ్చు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) చివరి సమీక్షా సమావేశం వచ్చే వారం (8–10వ తేదీల్లో) జరగనుంది. ఈ సందర్భంగా కీలక రేట్లను పావు శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. ‘‘ఒమిక్రాన్ వేరియంట్ విస్తరణ నేపథ్యంలో వృద్ధిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు ద్రవ్యోల్బణం దాదాపుగా ఆర్బీఐ నియంత్రణల పరిధిలోనే ఉంది. దీంతో వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ సర్దుబాటు విధానాన్నే కొనసాగించొచ్చు. రివర్స్ రెపో రేటును 0.20–0.25 శాతం వరకు పెంచొచ్చు’’ అని బార్క్లేస్ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ రేటు 3.35%గా ఉంది. ప్రభుత్వం ఊహించని విధంగా రుణ సమీకరణ పరిమాణాన్ని బడ్జెట్లో పెంచినందున ఇది పాలసీ సాధారణీకరణ దిశగా ఆర్బీఐకి సంకేతం ఇచ్చినట్టేనని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్లో మూలధన వ్యయాలపై దృష్టి సారించడం ఆర్థిక వ్యవస్థకు ప్రేరణనిస్తుందని.. ద్రవ్యోల్బణం సహా స్థూల ఆర్థిక నేపథ్యాన్ని మార్చదని బార్క్లేస్ పేర్కొంది. చమురు ధరలు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు పెరగకపోవచ్చని అంచనా వేసింది. ఆర్బీఐ అప్రమత్తంగా ఉంటూ, ద్రవ్యోల్బణం అంచనాలను ఎగువవైపు పరిమితి (2–6) వద్ద కొనసాగించొచ్చని పేర్కొంది. -
రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష
-
ఆర్బీఐ కీలక నిర్ణయం... స్టాక్ మార్కెట్లో అనూహ్య మార్పులు
ముంబై: రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం వెలువరించిన మరుక్షణం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోంది. రెపోరేటు, రివర్స్ రేపో రేటులలో మార్పులు ఉండబోవంటూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నిర్ణయం ప్రకటించిన వెంటనే స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కలిసిరావడంతో తిరిగి మార్కెట్ కోలుకుంటోంది. పాజిటివ్ ట్రెండ్ ఈ వారం ప్రారంభం నుంచి స్టాక్మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ నడుస్తోంది. వరుసగా ప్రతీ రోజు ఇన్వెస్టర్లు లాభాలు కళ్లజూస్తున్నారు. గడిచిన మూడు రోజులుగా అయితే సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డులు సృష్టించాయి. ఆల్‌టైం హైలకు చేరుకున్నాయి. ఈవారంలో మార్కెట్‌కి చివరి రోజైన శుక్రవారం సైతం సెన్సెక్స్ స్వల్ప నష్టాలతో ప్రారంభమై ఆ వెంటనే పుంజుకుంది. మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి నిఫ్టీ లాభాల బాటలోనే పయణించింది. గంటలోనే ఈరోజు ఉదయం 54,492 పాయింట్లతో సెన్సెక్స్ మొదలైంది. ఓ దశలో గరిష్టంగా 54,663 పాయింట్లను తాకింది. ఈ సమయంలో రిపోరేటు, రివర్స్ రిపోరేటుపై ఆర్బీఐ నిర్ణయం ప్రకటించింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్నట్టుగానే రిపో రేటు 4 శాతం, రివర్స్ రిపో రేటు 3.35 శాతంగానే కొనసాగుతాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఆర్బీఐ నుంచి ప్రకటన వెలువడిన మరుక్షణమే దేశీ సూచీలు లాభాల నుంచి నష్టాల దిశగా దారి మార్చుకున్నాయి. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన గంట వ్యవధిలోనే 205 పాయింట్లు నష్టపోయి 54,287 వద్ద సెన్సెక్స్ ట్రేడయ్యింది. మరికాసేపటికే కోలుకుంది. ఉదయం 11 గంటల సమయంలో 88 పాయింట్ల నష్టంతో 54,403 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ ఈ రోజు ఉదయం 16,304 పాయింట్లతో మొదలైంది. ఓ దశలో 16,336 పాయింట్లకు చేరుకుంది. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన మరుక్షణం నుంచి పాయింట్లు కోల్పోవడం మొదలైంది. గంట వ్యవధిలో 41 పాయింట్లు నష్టపోయి 16,253 వద్ద ట్రేడయ్యింది. అయితే కాసేపటికే పుంజుకుంది. ఉదయం 11;30 గంటల సమయంలో 24 పాయింట్లు నష్టపోయి 16,270 వద్ద ట్రేడవుతోంది. -
వడ్డీరేట్ల మార్పుపై రిజర్వ్‌బ్యాంక్ కీలక నిర్ణయం
ముంబై: బ్యాంకు వడ్డీ రేట్ల మార్పుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిపో రేటు, రివర్స్ రిపో రేటులపై మానిటరీ పాలసీ కమిటీ సూచనలకు అనుగుణంగా ఆర్బీఐ వడ్డీ రేట్లను నిర్ణయించింది. మార్పులేదు కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ గాడిన పడే వరకు ప్రస్తుతం ఉన్న రిపో రేటు, రివర్స్ రిపో రేటులను కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ సూచించిందని, అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితినే కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్నట్టుగానే రిపో రేటు 4 శాతం, రివర్స్ రిపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి. గాడిన పడుతోంది వ్యవసాయ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండం, వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుండటంతో త్వరలోనే ఆర్థిక వ్యవస్థ పూర్వ స్థితికి చేరుకుంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు పెట్రోలు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నా.. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు. రిపోరేటు ప్రభుత్వ సెక్యూరిటీలను తన వద్ద ఉంచుకుని వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ అప్పులు ఇచ్చేప్పుడు వసూలు చేసే వడ్డీని రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఇదే సమయంలో వాణిజ్య బ్యాంకులు తన వద్ద డిపాజిట్ చేసిన మొత్తానికి ఆర్బీఐ ఇచ్చే వడ్డీని రివర్స్ రిపో రేటు అంటారు. -
ఆర్బీఐ వృద్ధి మంత్రం!
ముంబై: వృద్ధికి మద్దతుగా కీలకమైన వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకూడదని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. దీంతో ప్రస్తుత రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగనున్నాయి. అదే విధంగా ఇప్పటి వరకు అనుసరిస్తున్న సర్దుబాటు విధానాన్నే ఇక ముందూ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పరిస్థితులకు తగ్గట్టు అవసరమైతే రేట్ల కోతకు అవకాశం ఉంటుందని సంకేతమిచ్చింది. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునేందుకు గాను గతేడాది 1.15 శాతం మేర ఆర్బీఐ రేట్లను తగ్గించిన విషయం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ బాండ్లను రూ.లక్ష కోట్ల మేర ప్రస్తుత త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) కొనుగోలు చేస్తామని ఆర్బీఐ ఎంపీసీ ప్రకటించింది. తద్వారా కేంద్ర ప్రభుత్వ రుణ వ్యయాలను తగ్గించడంతోపాటు, బాండ్ ఈల్డ్స్‌ను అదుపులో ఉంచేలా వ్యవహరించనుంది. వృద్ధికి ఎంతో ప్రాముఖ్యత వృద్ధికి ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. ఎంపీసీ సమావేశం తర్వాత నిర్ణయాలను వెల్లడిస్తూ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుని పరుగు అందుకునే వరకు ఆర్బీఐ అన్ని విధాలుగా (కనిష్ట వడ్డీ రేట్లు, తగినంత ద్రవ్య లభ్యత చర్యలు) మద్దతుగా నిలుస్తుందన్నారు. కనిష్ట రివర్స్ రెపో విధానం నుంచి ఆర్బీఐ ఎప్పుడు బయటకు వస్తుందన్న ప్రశ్నకు.. కాలమే నిర్ణయిస్తుందని బదులిచ్చారు. వ్యవస్థలో ద్రవ్య లభ్యతను దృష్టిలో పెట్టుకుని.. తటస్థ చర్యలను తీసుకోవడంపై అవగాహన కలిగి ఉన్నామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ డీ పాత్ర పేర్కొన్నారు. వృద్ధి 10.5 శాతం... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021–22) జీడీపీ 10.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న గత సమీక్ష సందర్భంగా వేసిన అంచనాలను ఆర్బీఐ ఎంపీసీ కొనసాగించింది. అదే సమయంలో పెరుగుతున్న కరోనా కేసులు దీనిపై అనిశ్చితికి దారితీసినట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘క్యూ1లో (ఏప్రిల్–జూన్) 26.2 శాతం, క్యూ2లో (జూలై–సెప్టెంబర్) 8.3 శాతం, క్యూ3లో (అక్టోబర్–డిసెంబర్) 5.4 శాతం, క్యూ4లో (2022 జనవరి–మార్చి) 6.2 శాతం చొప్పున వృద్ధి నమోదు కావచ్చు’’ అని ఆర్బీఐ ఎంపీసీ పేర్కొంది. అంతర్జాతీయంగా ఫిబ్రవరి నుంచి కమోడిటీ ధరలు పెరగడం, ఆర్థిక మార్కెట్లలో పెరిగిన అనిశ్చితి వృద్ధి రేటును కిందకు తీసుకెళ్లే రిస్క్‌లుగా దాస్ పేర్కొన్నారు. టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, మరిన్ని వర్గాలకు విస్తరించడం, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, పెట్టుబడులను పెంచే చర్యలు వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా చెప్పారు. 2021–22 బడ్జెట్లో ప్రకటించిన పెట్టుబడి చర్యలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్ఐ), సామర్థ్య విస్తరణ అన్నవి ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు సాయపడతాయని ఆర్బీఐ గవర్నర్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం నియంత్రణలోనే.. రిటైల్ ద్రవ్యోల్బణం 4.4–5.2 శాతం మధ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉంటుందని ఆర్బీఐ ఎంపీసీ అంచనా వేసింది. ఆహార ధాన్యాల భారీ దిగుబడి.. ధరలు తగ్గేందుకు సాయపడతుందని పేర్కొంది. అదే సమయంలో నైరుతి రుతుపవనాల పురోగతిపైనా ఇది ఆధారపడి ఉంటుందని తెలిపింది. వచ్చే ఐదేళ్లపాటు ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో.. ఎగువవైపు 6 శాతం.. దిగువ వైపు 2 శాతం దాటిపోకుండా చూడాలన్నది ఆర్బీఐ లక్ష్యంగా ఉంది. అవసరమైనంత కాలం అండగా... వృద్ధి రేటు నిలకడగా, స్థిరంగా కొనసాగేందుకు అవసరమైనంత కాలం, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తొలగిపోయేంత వరకు సర్దుబాటు ధోరణిని కొనసాగించాలని ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. రానున్న రోజుల్లోనూ ద్రవ్యోల్బణం నిర్దేశిత లక్ష్య పరిధిలోనే ఉంటుంది. ఇటీవల కరోనా ఇన్ఫెక్షన్ కేసులు భారీగా పెరగడం భవిష్యత్తు వృద్ధి అంచనాలపై అనిశ్చితికి దారితీసింది. ముఖ్యంగా స్థానిక, ప్రాంతీయ లాక్డౌన్లు ఇటీవలే మెరుగుపడిన డిమాండ్ పరిస్థితులను దెబ్బతీస్తాయా? సాధారణ పరిస్థితులు ఏర్పడడాన్ని ఆలస్యం చేస్తాయా? అన్నది చూడాల్సి ఉంది. అయితే, ఇన్ఫెక్షన్లు పెరిగిపోవడం వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇప్పుడు మరింత మెరుగైన సన్నద్ధతతో ఉన్నాం. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పెద్దగా పడకుండా చూసేందుకు ద్రవ్య, పరపతి యంత్రాంగాలు సమన్వయంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. సర్దుబాటు ధోరణికి తగినట్టు వ్యవస్థలో ద్రవ్య లభ్యత పుష్కలంగా ఉండేలా ఆర్బీఐ చూస్తుంది. అంటే ఫైనాన్షియల్ మార్కెట్, ఉత్పత్తి రంగాల అవసరాలకు మించి నగదు లభ్యత ఉండేలా చూడడం. ఆర్థిక స్థిరత్వం కోసం చేయాల్సినదంతా ఆర్బీఐ చేస్తుంది. అంతర్జాతీయ ప్రభావాలు, అస్థిరతలను దేశీ ఫైనాన్షియల్ మార్కెట్లు తట్టుకునేలా తగిన చర్యలతో రక్షణ కల్పిస్తాం. నేటి పరిస్థితుల్లో మారటోరియం (రుణ చెల్లింపులపై కొంత కాలం విరామం) అవసరం లేదు. ప్రైవేటు రంగం తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు తగిన సన్నద్ధతతో ఉంది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను తొలగించేందుకు హామీతో కూడిన, నిరంతర ద్రవ్య లభ్యతకు కట్టుబడి ఉన్నట్టు ఆర్బీఐ ప్రకటన స్పష్టం చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో సవాళ్లను అధిగమించేందుకు స్పష్టమైన మార్గదర్శనం చూపించింది. వృద్ధిపై స్పష్టమైన ముద్ర వేసింది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ రెపో రేటును యథాతథంగా కొనసాగించడంతోపాటు ఆర్బీఐ సర్దుబాటు వైఖరిని కొనసాగించింది. పుష్కలంగా ద్రవ్య లభ్యత ఉండేలా చూస్తామని ఆర్బీఐ గవర్నర్ ప్రకటించడం.. ఎన్‌హెచ్‌బీకి అదనంగా రూ.10,000 కోట్లు సమకూర్చడం అన్నది.. ప్రాజెక్టుల పూర్తికి నిధుల కొరతను ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ పరిశ్రమకు సాయపడేవి. – హర్షవర్ధన్ పటోడియా, క్రెడాయ్ జాతీయ ప్రెసిడెంట్ రూ.లక్ష కోట్లతో ప్రభుత్వ సెక్యూరిటీలు సెకండరీ మార్కెట్ ప్రభుత్వ సెక్యూరిటీల (జీసెక్‌లు) కొనుగోలు కార్యక్రమాన్ని (జీ–ఎస్ఏపీ) ఆర్బీఐ ప్రకటించింది. దీని ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.3లక్షల కోట్ల మేరకు ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది. బాండ్‌ఈల్డ్స్ గమనా న్ని గాడిలో పెట్టేందుకు (బాండ్ ఈల్డ్స్‌లో క్రమబద్ధత) ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘మానిటరీ పాలసీకి అనుగుణంగా బ్యాలన్స్ షీటును కొసాగించేందుకు ఆర్బీఐ మొదటిసారి నిర్ణయించింది. ప్రతీ త్రైమాసికంలో రూ.లక్ష కోట్ల మేర (ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3లక్షల కోట్లు) మార్కెట్‌కు అందించనున్నాం’ అని మేఖేల్ డి పాత్ర తెలిపారు. బాండ్ల కొనుగోలు అన్నది ఇతర ప్రధాన సెంట్రల్ బ్యాంకులు అనుసరించిన విధానం మాదిరేనన్నారు. మొదటగా ఏప్రిల్ 15న రూ. 25,000 కోట్ల వరకు ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐ కొనుగోలు చేయనుంది. రాష్ట్రాలకు నిధుల సాయం కొనసాగింపు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మధ్యంతర వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ (డబ్ల్యూఎంఏఎస్) కింద రూ.51,560 కోట్ల సాయాన్ని పొందే గడువును వచ్చే సెప్టెంబర్ వరకు పొడిగిస్తూ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. కరోనా రెండో విడత ప్రభావాలను ఎదుర్కొనేందుకు గాను రాష్ట్రాలకు ఈ మేరకు సాయం అందించనున్నట్టు ప్రకటించింది. ఆదాయాలు, వ్యయాల మధ్య అంతరాలను గట్టేందుకు గాను రాష్ట్రాలకు అందించే తాత్కాలిక రుణ సదుపాయమే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెన్స్. అలాగే, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో అందించే అగ్రిగేట్ డబ్ల్యూఎంఏ సాయం రూ.32,225 కోట్లుగా ఉండగా.. దీన్ని 46% పెంపుతో రూ.47,010 కోట్లు చేస్తూ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. నాబార్డ్, సిడ్బి, ఎన్‌హెచ్‌బీలకు రూ.50వేల కోట్లు ఆర్థిక వ్యవస్థలోని వివిధ విభాగాలకు రుణ వితరణ సక్రమంగా అందేలా చూసేందుకు జాతీయ ఆర్థిక సంస్థలకు అదనంగా రూ.50వేల కోట్లను ఆర్బీఐ అందించనుంది. నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)కు రూ.25,000 కోట్లు, నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ)కు రూ.10,000 కోట్లు, చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి)కు రూ.15,000 కోట్లు లభిస్తాయి. వ్యాలెట్ల మధ్య నగదు బదిలీలు చెల్లింపుల సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ఆర్బీఐ పలు చర్యలను తాజా సమీక్షలో ప్రకటించింది. ఎన్బీఎఫ్సీలు, ఇతర చెల్లింపుల సేవల సంస్థలు, పేమెంట్ బ్యాంకులు ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలను ప్రాసెస్ చేసేందుకు వీలు కల్పించింది. ఆర్బీఐ నిర్వహణలోని కేంద్రీకృత చెల్లింపుల సేవలైన (సీపీఎస్) ఆర్టీజీఎస్, నెఫ్ట్లను ఆర్బీఐ నియంత్రణ పరిధిలోని పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు దాస్ ప్రకటించారు. ఆపరేటర్లు ఇందుకు గాను సీపీఎస్ సభ్యత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుందని.. డిజిటల్ ఆర్థిక సేవలు మరింత మందికి చేరుకునేందుకు ఇది సాయపడుతుందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు. ప్రీపెయిడ్ చెల్లింపుల సేవలను అందించే సంస్థలు (ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్/పీపీఐ).. తమ కస్టమర్లు ఇతర సంస్థల పరిధిలోని కస్టమర్లతో లావాదేవీలు నిర్వహించుకునేలా ఇంటర్ ఆపరేబులిటీని అమలు చేసే చర్యలను చేపట్టనున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. ఈ సేవలను అందించే ఎంపికను పీపీఐలకు ఇచ్చామని.. ఒక పీపీఐ పరిధిలోని కస్టమర్ మరో పీపీఐ/బ్యాంకు పరిధిలోని కస్టమర్‌కు నగదు బదిలీలు చేసుకోవచ్చని దాస్ చెప్పారు. పీపీఐ పరిధిలో ఒక కస్టమర్‌కు సంబంధించి బ్యాలన్స్ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు పెంచింది. పూర్తి స్థాయి కేవైసీ కస్టమర్లకే ఇది వర్తిస్తుంది. -
కరోనా ఉధృతి: ఆర్బీఐ కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థికసంవత్సరంలో మొదటి పాలసీ సమీక్ష ఇది. తాజా నిర్ణయంతో రెపో రేటు 4శాతం వద్ద,రివర్స్ రెపో రేటు 3.5 శాతం వద్ద కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం వెల్లడించారు. రేట్లను యధాతథంగా ఉంచేందుకు మానిటరీ పాలసి కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ తన ద్వి-నెలవారీ ద్రవ్య విధాన సమీక్ష ఫలితాలను ఈ రోజు ప్రకటించింది. రెండో దశలో కరోనా వైరస్ కేసులు పెరగడం, తాజా ఆంక్షలునేపథ్యంలో బెంచ్‌మార్క్ రెపో రేటుపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించిందని శక్తి కాంత్‌దాస్ వివరించారు. వృద్ధికి తోడ్పడటానికి , ద్రవ్యోల్బణ టార్గెట్‌ను సాధించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండో దశలో విజృంభిస్తున్న కోవిడ్ మహమ్మారి ఆర్థికవృద్ధి, రికవరీపై అనిశ్చితిని సృష్టించిందని గవర్నర్ చెప్పారు. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిని 10.5 శాతంగా, సీపీఐ ద్రవ్యోల్బణం 5.1 శాతంగానూ అంచనా వేసిందన్నారు. -
కోత లేదు.. పెంచేదీ లేదు!
ముంబై: ఆర్థికవేత్తలు, నిపుణుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్కడి రేటు అక్కడే ఉంచడం ఇది వరుసగా నాలుగోసారి. ప్రస్తుతం రెపో 4 శాతం వద్ద ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్ బ్యాంక్, గడచిన (ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్ నెలల్లో) మూడు ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం భయాలను ఇందుకు కారణంగా చూపుతోంది. అయితే ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలను వ్యక్తం చేస్తున్న ఆర్బీఐ, రేటు తగ్గింపునకు మొగ్గు చూపే సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేస్తోంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ శుక్రవారమూ ఏకగ్రీవంగా ఇదే విధానాన్ని పునరుద్ఘాటించింది. తద్వారా వృద్ధికి తగిన మద్దతు ఆర్బీఐ నుంచి ఉంటుందని స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో 2021–22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ తరువాత, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్వహించిన మొట్టమొదటి ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఇది. ఏప్రిల్‌లో తదుపరి సమీక్ష ఏప్రిల్ 5వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య ఎంపీసీ 28వ తదుపరి సమావేశం జరుగుతుంది. మే నాటికి సీఆర్ఆర్ 4 శాతానికి ‘రివర్స్’ కాగా, రెపో రేటును తగ్గించని ఆర్బీఐ పాలసీ సమీక్ష, రివర్స్ రెపో రేటు (బ్యాంకులు తమ వద్ద ఉన్న మిగులు నిధులను తన వద్ద డిపాజిట్ చేసినప్పుడు ఇందుకు ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటు) కూడా 3.35 శాతంగానే కొనసాగుతుందని తన తాజా పాలసీలో ఆర్బీఐ స్పష్టంచేసింది. ఫిబ్రవరి తర్వాత ఈ రేటు కూడా 155 పాయింట్లు తగ్గి, 4.9 శాతం నుంచి 3.35 శాతానికి దిగివచ్చింది. ఇక బ్యాంకులు తమ నిధుల్లో తప్పనిసరిగా ఆర్బీఐ వద్ద నిర్వహించాల్సిన మొత్తం క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్)ను మార్చి 27 నాటికి 3.5 శాతానికి, మే 22 నాటికి 4 శాతానికి పెంచుతున్నట్లు ఆర్బీఐ పాలసీ ప్రకటించింది. ప్రస్తుతం సీఆర్ఆర్ 3 శాతంగా ఉంది. అంటే బ్యాంకుల వద్ద ప్రస్తుతం ఉన్న నిధుల్లో మరికొంత మొత్తం ఆర్బీఐకి చేరుతుందన్నమాట. తద్వారా తన వద్దకు తిరిగి వచ్చే ‘మరిన్ని’ నిధులను ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్‌కు అలాగే ఇతర లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) చర్యలకు సెంట్రల్ బ్యాంక్ వినియోగించనుంది. డిసెంబర్ నాటికి 4.3 శాతానికి ద్రవ్యోల్బణం ఆర్బీఐ తాజా అంచనాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (2021 జనవరి–మార్చి) మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.2 శాతంగా ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (2021–22 ఏప్రిల్–సెప్టెంబర్) సగటున ఈ రేటు 5 శాతానికి తగ్గుతుంది. మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 4.3 శాతానికి దిగివస్తుంది. ఇదే కారణంగా కీలక రేటు విధానం సరళతరంగా ఉంచడానికే ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. అంటే వడ్డీరేట్లు వ్యవస్థలో మరింత తగ్గడానికే అవకాశం ఉంది తప్ప, పెంచే యోచనలేదని భావించవచ్చు. ఆర్థిక వ్యవస్థకు బడ్జెట్ దన్ను! భారత్ ఆర్థిక వ్యవస్థ ఒకేఒక్క దిశలో.. అదీ పురోగమన బాటలో ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. 2021–22లో ఎకానమీ 10.5% వృద్ధిని (ఎకనమిక్ సర్వే 11% కన్నా తక్కువ కావడం గమనార్హం) నమోదు చేసుకుంటుందన్న భరోసాను ఆయన ఇచ్చారు. మౌలిక రంగం, ఆరోగ్యం వంటి కీలక రంగాల పునరుత్తేజానికి ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ తగిన చర్యలను ప్రకటించిందని తెలిపారు. ఆయా అంశాల దన్నుతో 2021–22 మొదటి ఆరు నెలల్లో వృద్ధి 26.2%–8.3% శ్రేణిలో ఉంటుందని, 3వ త్రైమాసికంలో 6% వృద్ధి నమోదవుతుందని తెలిపింది. బ్యాంకులకు నిధుల లభ్యత అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకింగ్ ఆర్బీఐ నుంచి నిధులు పొందడానికి సంబంధించిన మార్జినల్ స్టాండింగ్ సౌలభ్యత (ఎంఎస్ఎఫ్)ను ఆర్బీఐ మరో ఆరు నెలలు పొడిగించింది. దీనివల్ల రూ.1.53 లక్షల కోట్లు బ్యాంకింగ్‌కు అందుబాటులో ఉంటాయి. గత ఏడాది మార్చి నుంచీ ఈ పొడిగింపులను ఆర్బీఐ కొనసాగిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్‌కు అందుబాటులో బాండ్ మార్కెట్ ప్రభుత్వ బాండ్ మార్కెట్లోకి రిటైల్ ఇన్వెస్టర్లు ప్రత్యక్షంగా పాల్గొనడానికి అనుమతినిస్తూ, ఇందుకు సంబంధించి కీలక సంస్కరణాత్మక చర్యకు ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. తద్వారా ఇలాంటి సౌలభ్యం కల్పిస్తున్న నిర్దిష్ట దేశాల జాబితాలో భారత్ కూడా చేరినట్లయ్యింది. ప్రస్తుతం రిటైల్ ఇన్వెస్టర్లు ప్రైమరీ ఆక్షన్లు, సాŠట్క్ ఎక్సే్చంజీల్లో నాన్–కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలుచేసే అవకాశం ఉంది. ఆర్బీఐ నిర్ణయం ప్రకారం ఇకపై ప్రత్యక్షంగా ఆన్లైన్ ద్వారా ఆర్బీఐ నుంచే ప్రభుత్వ బాండ్లను రిటైల్ ఇన్వెస్టర్ కొనుగోలు చేయగలుగుతాడు. దీనిని రిటైల్ డైరెక్ట్ అని వ్యవహరిస్తారు. ఆర్బీఐతో ప్రత్యక్షంగా నిర్వహించే గిల్ట్ అకౌంట్ల ప్రారంభం ద్వారా ఈ ఇన్స్ట్రమెంట్ లావాదేవీలు సాధ్యమవుతాయి. అసలు, వడ్డీ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వ సెక్యూరిటీలు అత్యంత సురక్షితమైన సాధనాలు కావడం గమనార్హం. ఈ విధమైన చర్య తీసుకున్న మొదటి ఆసియా దేశం. అమెరికా, బ్రెజిల్‌ల్లో ఇప్పటికే పరోక్ష ఎంట్రీనే ఉంది. ఈ నిర్ణయం వల్ల బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోతాయని తాము భావించడం లేదని కూడా ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేయడం గమనార్హం. కరోనా కష్టకాలాన్ని ఎదుర్కోవడంలో భాగంగా ప్రభుత్వం మార్కెట్ రుణ సమీకరణలను బడ్జెట్ భారీగా పెంచిన నేపథ్యంలో ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. 2021–22లో ఈ మొత్తాలను స్థూలంగా రూ.12.05 లక్షల కోట్లుగా నిర్దేశించింది. అయితే 2020–21లో 64% పెంచి రూ.12.8 లక్షల కోట్లకు తాజా బడ్జెట్ సవరించిన సంగతి తెలిసిందే. డిజిటల్ పేమెంట్ల వివాదాల పరిష్కారానికి యంత్రాంగం ఆన్లైన్ ఆర్థిక లావాదేవీల పెరిగేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, ఈ విభాగంలో వివాదాల సత్వర పరిష్కారంపైనా ఆర్బీఐ పాలసీ దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి వివాదాల పరిష్కారానికి నిరంతరాయంగా పనిచేసే (24 గీ7) హెల్ప్‌లైన్ ఏర్పాటు ప్రతిపాదన చేసింది. దిగ్గజ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు ఇందుకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్బీఐ జారీచేసిన ‘డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ పాలసీ’ ప్రకటన స్పష్టం చేసింది. ఒకే దేశం– ఒకే అంబుడ్స్‌మన్ బ్యాంకింగ్ వివాదాల పరిష్కారం విషయంలో ఒకే దేశం– ఒకే అంబుడ్స్‌మన్ విధానాన్ని సెంట్రల్ బ్యాంక్ ప్రతిపాదించింది. తద్వారా అంబుడ్స్‌మన్ పథకాలన్నింటినీ ఏకీకృతం చేస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు అనుగుణంగా సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ వ్యవస్థను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ విషయంలో మూడు (బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీలు, డిజిటల్ లావాదేవీలు) అంబుడ్స్‌మన్ విధానాలు అమల్లో ఉన్నాయి. తాజా నిర్ణయం వల్ల మరింత సరళతర వ్యవస్థ రూపొందుతుందని ఆర్బీఐ గవర్నర్ వివరించారు. జూన్ 2021 నుంచీ తాజా వ్యవస్థ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్‌బీఎఫ్‌సీలకు మరిన్ని నిధులు! బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లకు మరిన్ని నిధులను అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ (టీఎల్టీఆర్ఓ) ప్రయోజనాలను ఎన్బీఎఫ్సీలకూ విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. దీనివల్ల లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలుసహా ద్రవ్య లభ్యత ఇబ్బందుల్లో ఉన్న రంగాలకు నిధులు సమకూర్చడానికి ఎన్బీఎఫ్సీలు బ్యాంకింగ్ నుంచి టీఎల్టీఆర్ఓ కింద నిధులను పొందగలుగుతాయి. కరోనా మహమ్మారి ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో వివిధ రంగాలకు ద్రవ్య లభ్యత కల్పించే ఉద్దేశంతో బ్యాంకులకు టీఎల్టీఆర్ఓ స్కీమ్ కింద 2020 అక్టోబర్‌లో ఆర్బీఐ రూ. లక్ష కోట్లకు ప్రకటించింది. ఈ స్కీమ్ కింద తమకూ నిధులను అందించాలని ఎన్బీఎఫ్సీలు కొంతకాలంగా సెంట్రల్ బ్యాంక్‌కు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఎన్పీఏల వాస్తవికతపై మదింపు బ్యాంకింగ్‌లో ఉన్న మొండిబకాయిల (ఎన్పీఏ) విషయంలో వాస్తవికతను ఆర్బీఐ తనకుతానుగా మరింత లోతుగా మదింపు చేస్తున్నట్లు శక్తికాంతదాస్ ప్రకటించారు. తద్వారా రుణ నాణ్యత విషయంలో స్పష్టమైన అభిప్రాయానికి రావడం జరుగుతుందని చెప్పారు. పీఎంసీ బ్యాంక్.. మూడు ఆఫర్లు పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ) సంక్షోభ పరిష్కారానికి ముగ్గురు ఇన్వెస్టర్ల నుంచి తుది ఆఫర్లు అందినట్లు తనకు సమాచారం ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. వీటిని సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల పటిష్టతకు ‘మధ్యకాలికంగా అవసరపడే’ ఒక రోడ్ మ్యాప్‌ను రూపొందించడానికి త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆలోచనాపూర్వక పాలసీ... వృద్ధికి మద్దతు, రుణ నిర్వహణ, ద్రవ్య లభ్యత వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఆలోచనాపూర్వక పాలసీ ఇదీ. వృద్ధే లక్ష్యంగా రూపొందించిన 2021–22 బడ్జెట్‌తో కలిసి తాజా విధాన నిర్ణయాలు కరోనా సవాళ్లను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ రియల్టీకి ప్రయోజనం.. వ్యవస్థలో ద్రవ్య లభ్యతకు తగిన నిర్ణయాలను ఆర్బీఐ తీసుకుంది. ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీలకు టీఎల్టీఆర్ఓ ప్రయోజనాలను విస్తరించడం రియల్టీసహా ద్రవ్య లభ్యత సమస్యలను ఎదుర్కొంటున్న పలు రంగాలకు దోహదపడుతుంది. తక్కువ వడ్డీరేట్ల వల్ల హౌసింగ్ రంగంలో డిమాండ్ ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. –శశిధర్ బైజాల్, నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ రికవరీ పటిష్టతకు దోహదం ఇప్పటికే ఎకానమీ రికవరీ వేగవంతమైంది. సెంట్రల్ బ్యాంక్ తాజా పాలసీ నిర్ణయాలు ఈ రికవరీ బాటను మరింత పటిష్టం చేస్తాయని భావిస్తున్నాం.చిన్న పరిశ్రమలకు ద్రవ్య లభ్యతకు పాలసీ తగిన నిర్ణయాలను తీసుకోవడం హర్షణీయం. సరళ విధానాన్ని పునరుద్ఘాటించడం వృద్ధికి భరోసాను ఇచ్చే అంశం. –ఉదయ్ శంకర్, ఫిక్కీ ప్రెసిడెంట్ డిమాండ్ బలపడుతోంది... కరోనా మహమ్మారి ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో తొలుత వ్యవస్థలో కనబడిన డిమాండ్ విషయంలో కొంత సంశయాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వ్యవస్థలో వాస్తవిక డిమాండ్ కనబడుతుంది. ఇదే ధోరణి కొనసాగి, పటిష్టమవుతుందని భావిస్తున్నాం. దీనితోపాటు వృద్ధి–ద్రవ్యోల్బణం సమతౌల్యత తత్సంబంధ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సరళతర ఆర్థిక, ద్రవ్య విధానాలవైపే మొగ్గుచూపాలని పరపతి విధాన కమిటీ నిర్ణయించింది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ -
పర్సంటేజ్లతో పండగ చేస్కో!
ముంబై: పండుగల వేళ.. రుణ గ్రహీతలకు ఆర్బీఐ మరోసారి శుభవార్త తెచ్చింది. గృహ, వాహన, కార్పొరేట్ రుణాలు చౌకగా లభ్యమయ్యేలా వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటించింది. దేశ వృద్ధికి ఆర్బీఐ విధానం మద్దతుగా నిలుస్తుందన్న మాటను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మరో విడత ఆచరణలో చూపించారు. ఇందుకుగాను కీలక రేట్లకు మరో పావు శాతం కోత పెట్టారు. రెపో, రివర్స్ రెపోలను 25 బేసిస్ పాయింట్ల చొప్పున (0.25 శాతం) తగ్గించారు. తద్వారా రుణాల రేట్లను మరి కాస్త దిగొచ్చేలా చేశారు. ఎందుకంటే గతంలో మాదిరిగా బ్యాంకులు ఆర్బీఐ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించకుండా ఉండేందుకు అవకాశం లేదు. అక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ పేర్కొన్న ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లలో (ముఖ్యంగా రేపోరేటు) ఏదో ఒకదాని ఆధారంగా బ్యాంకులు రిటైల్ రుణాలపై రేట్లను అమలు చేయాల్సి ఉంటుంది. నిదానించిన ఆర్థిక వృద్ధికి మద్దతుగా గడిచిన ఏడాది కాలంలో ఆర్బీఐ రేట్లను తగ్గిస్తూనే వస్తోంది. 2019 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఐదు పర్యాయాలు నికరంగా 135 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించడం జరిగింది. కాకపోతే బ్యాంకులే ఈ ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురాలేదు. ఇప్పటి వరకు రుణాలపై అవి తగ్గించింది 50 బేసిస్ పాయింట్లకు మించలేదు. ఇకపై ఆర్బీఐ విధాన నిర్ణయాలకు అనుగుణంగా బ్యాంకులు కూడా రిటైల్ రుణ రేట్లను వెంటనే సవరించాల్సి వస్తుంది. దీనివల్ల వాహన, గృహ, వ్యక్తిగత, ఇతర రుణాలు చౌకగా మారనున్నాయి. తక్కువ వడ్డీ రేట్లతో కార్పొరేట్ కంపెనీలపైనా భారం తగ్గుతుంది. దీంతో అవి మరింత పెట్టుబడులతో ముందుకు రాగలవు. రుణాల వినియోగం పెరిగితే, అది వ్యవస్థలో డిమాండ్ పెరిగేందుకు దారితీస్తుంది. ముఖ్యంగా పండుగల సమయంలో ఆర్బీఐ రేట్ల తగ్గింపు వినియోగదారులకు ఉత్సాహాన్నిచ్చేదే. వృద్ధి రేటు అంచనాలు భారీగా తగ్గింపు... దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గించి ఆర్బీఐ షాక్‌కు గురిచేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.1 శాతంగా ఉంటుందని తాజాగా పేర్కొంది. గత పాలసీ సమావేశంలో వృద్ధి రేటును ఆర్బీఐ 6.9 శాతంగా అంచనా వేయడం గమనార్హం. అయితే, జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరుతుందని ఆర్బీఐ కూడా ఊహించలేదు. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ దాస్ ఓ సందర్భంలో పేర్కొన్నారు కూడా. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు పుంజుకోకపోవడంతోపాటు, ఎగుమతులు తగ్గడమే తన అంచనాల తగ్గింపునకు కారణాలుగా పేర్కొంది. కాకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్ధభాగం.. అక్టోబర్ నుంచి వృద్ధి రికవరీ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఇక, 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7 శాతానికి పుంజుకుంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. పాలసీ సమీక్ష ముఖ్యాంశాలు... ► ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో ఉన్న ఆరుగురు సభ్యులు కూడా పాలసీ రేట్ల తగ్గింపునకు ఏకగ్రీవంగా ఓటు వేశారు. ఐదుగురు సభ్యులు పావు శాతం తగ్గింపునకు అనుకూలంగా ఓటు వేయగా, రవీంద్ర ధోలాకియా మాత్రం 0.40 బేసిస్ పాయింట్ల తగ్గింపునకు అనుకూలంగా ఓటేశారు. ► ఆర్బీఐ తన ప్రస్తుత విధానమైన సర్దుబాటు ధోరణిని అలాగే కొనసాగించింది. అంటే పరిస్థితులకు అనుగుణంగా రేట్ల తగ్గింపు నిర్ణయాలకు ఇది వీలు కల్పిస్తుంది. ► తాజా రేట్ల తగ్గింపు తర్వాత రెపో రేటు 5.15 శాతానికి, రివర్స్ రెపో రేటు 4.9 శాతానికి చేరాయి. రెపో రేటు అంటే... బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటు. రివర్స్ రెపో రేటు అంటే బ్యాంకులు తన వద్ద ఉంచిన నిధులపై ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటు. రెపో రేటు 2010 తర్వాత కనిష్ట స్థాయికి చేరింది. 2010 మార్చిలో రెపో రేటు 5 శాతంగా ఉంది. గత ఎంపీసీ సమీక్షలో 35 బేసిస్ పాయింట్ల మేర రెపోను తగ్గించారు. ► క్రితం నాలుగు ఎంపీసీ భేటీల్లో వడ్డీ రేట్లను 110 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటికీ, కస్టమర్లకు రుణాలపై ఈ ప్రయోజన బదలాయింపు అస్థిరంగా, అసంపూర్ణంగా ఉందని ఆర్బీఐ పేర్కొంది. ► అమెరికా–చైనా వాణిజ్య యుద్ధంతో పడిపోతున్న వృద్ధిని నిలు వరించేందుకు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు (అమెరికా ఫెడ్ సహా) వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ► 2019–20 రెండో త్రైమాసికానికి ద్రవ్యోల్బణం అంచనాలను 3.4 శాతానికి ఆర్బీఐ ఎంపీసీ సవరించింది. అలాగే, ద్వితీయ ఆరు నెలల కాలంలో ద్రవ్యోల్బణం 3.5–3.7 శాతం మధ్య ఉంటుందన్న గత అంచనాలనే కొనసాగించింది. ద్రవ్యోల్బణాన్ని మధ్య కాలానికి 4 శాతానికే పరిమితం చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం. ► వ్యవసాయ రంగ పరిస్థితులు ఆశాజనకంగా మారాయని ఎంపీసీ పేర్కొంది. తిరిగి ఉపాధి కల్పనకు, ఆదాయానికి, దేశీయ వృద్ధికి సానుకూలించనున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ► తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 3–5 తేదీల్లో జరుగుతుంది. వృద్ధి కోసం రేట్ల కోత అవసరమే: దాస్ నిలిచిన వృద్ధి ఇంజిన్‌ను వెంటనే పరుగెత్తించేలా చేయాల్సిన అవసరమే.. రేట్లను దశాబ్ద కనిష్ట స్థాయికి తగ్గించాల్సి వచ్చినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ‘‘వృద్ధి ధోరణి ఇలాగే ఉన్నంత కాలం... అలాగే, వృద్ధి పుంజుకునేంత వరకు ఆర్బీఐ తన ప్రస్తుత సర్దుబాటు విధానాన్నే కొనసాగిస్తుంది’’ అని దాస్ అభయమిచ్చారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు ద్వారా కేంద్రం రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం కోల్పోనుండడం ద్రవ్యలోటుపై ప్రభావం చూపించే అవకాశాలపై ఎదురైన ఒక ప్రశ్నకు... ‘‘బడ్జెట్లో పేర్కొన్న లక్ష్యానికి (జీడీపీలో 3.3 శాతం) ద్రవ్యలోటును పరిమితం చేస్తామని కేంద్రం చెబుతోంది. కనుక కేంద్ర ప్రభుత్వ అంకితభావాన్ని సందేహించాల్సిన అవసరం లేదు’’ అని దాస్ చెప్పారు. ద్రవ్య ప్రోత్సాహకాలు, కార్పొరేట్ పన్ను తగ్గింపు ఆర్థిక వ్యవస్థకు సానుకూలతలుగా దాస్ పేర్కొన్నారు. ప్రభుత్వం మధ్యంతర డివిడెండ్ రూపంలో రూ.30 వేల కోట్లను కోరనుందన్న విషయమై తనకు అవగాహన లేదన్నారు. బ్యాంకింగ్ రంగం పటిష్టం దేశ బ్యాంకింగ్ రంగంపై తలెత్తుతున్న సందేహాలు, వదంతులను తోసిపుచ్చుతూ.. బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా, సుస్థిరంగా ఉందని, భయపడేందుకు కారణాలేమీ లేవన్నారు దాస్. ఒక్క కోపరేటివ్ బ్యాంకులో తలెత్తిన సమస్య పునరావృతం కాబోదన్నారు. దీన్ని బ్యాంకింగ్ వ్యవస్థ సాధారణ పరిస్థితికి ముడిపెట్టి చూడడం తగదన్నారు. అక్రమాలు వెలుగు చూడడంతో ఇటీవలే పీఎంసీ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. ఎవరేమన్నారంటే... 25 బేసిస్ పాయింట్ల మేర రేట్ల కోతతోపాటు అవసరమైతే తదుపరి రేట్ల కోత ఉంటుందని చెప్పడం అన్నది.. వృద్ధి ఆందోళనలకు ముగింపు పలికేందుకు ద్రవ్య, పరపతి విధానాలు కలసి పనిచేస్తాయన్న భరోసాను ఇస్తోంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ 135 బేసిస్ పాయింట్లను ఈ ఏడాది తగ్గించడానికి తోడు ప్రభుత్వం తీసుకున్న పలు ప్రోత్సాహక చర్యలు పలు రంగాల్లో వృద్ధికి దారితీస్తుంది. ఇది ప్రస్తుత స్థాయి నుంచి దేశ వృద్ధి పెరిగేందుకు తోడ్పడుతుంది. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, సీఐఐ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్లను ఆర్బీఐ తగ్గించడం, వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం ఇటీవలీ తీసుకున్న చర్యలకు అదనపు ప్రోత్సాహాన్నిస్తుంది – కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసిన మేరకే రేట్ల కోత ఉంది. అయితే, మార్కెట్లు మరింత రేటు కోతను అంచనా వేయడంతో నిరాశ చెందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 25–40 బేసిస్ పాయింట్ల వరకు రేట్ల తగ్గింపు ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. – అభిషేక్ బారు, వైస్ ప్రెసిడెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎంఎఫ్‌ఐల రుణ పరిమితి పెంపు సూక్ష్మ రుణ సంస్థలకు (మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు/ఎంఎఫ్ఐ) సంబంధించి రుణ పరిమితిని పెంచుతూ ఆర్బీఐ పాలసీ సమీక్ష సందర్భంగా ఓ సానుకూల నిర్ణయాన్ని వెలువరించింది. దీని వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రుణాల లభ్యత పెరుగుతుంది. ఓ రుణ గ్రహీతకు గరిష్టంగా రూ.లక్షగా ఉన్న పరిమితిని రూ.1.25 లక్షలు చేసింది. ఎంఎఫ్ఐ, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీలు) రుణ గ్రహీతలకు సంబంధించి గృహ ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షలకు, పట్టణాల్లో రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఆదాయం, రుణ వితరణ పరిమితులను చివరిసారిగా 2015లో ఆర్బీఐ సవరించింది. -
రుణాలిక..బిం‘దాస్’
ముంబై: ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ వృద్ధికే తన ప్రథమ ప్రాధాన్యం అని సంకేతమిచ్చారు. ధరలు తమ లక్ష్యానికి అనుగుణంగా స్థిరపడితే సమయానుకూలంగా వ్యవహరిస్తామంటూ అవసరానికి అనుగుణంగా భవిష్యత్తులోనూ రేట్ల కోతకు అవకాశాలు ఉంటాయని పరోక్షంగా సంకేతమిచ్చారు. ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ట స్థాయిలకు దిగి రావడం, మరోవైపు రుణాలు భారంగా మారాయని, వడ్డీ రేట్లు తగ్గించాలంటూ పారిశ్రామిక రంగం, ప్రభుత్వం నుంచి వచ్చిన డిమాండ్లను మన్నించారు. బడ్జెట్లో తాయిలాలతో తిరిగి ద్రవ్యోల్బణానికి రెక్కలు వస్తాయన్న ఆందోళనలు ఉన్నప్పటికీ.. పరిమితంగా పావు శాతం రేట్లను తగ్గించి ఉపశమనం కల్పించారు. 18 నెలల తర్వాత మళ్లీ ఆర్బీఐ వడ్డీ రేటను తగ్గించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంతదాస్ తన ఆధ్వర్యంలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలి భేటీలో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరవ ద్వైమాసిక సమావేశం) అందరినీ ఆశ్చర్యపరుస్తూ కీలక రెపో, రివర్స్ రెపో రేట్లను పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెపో రేటు 6.25 శాతానికి, రివర్స్ రెపో 6 శాతానికి దిగొచ్చాయి. క్రమానుగత కఠిన విధానాన్ని ఇప్పటి వరకు అనుసరిస్తుండగా, దీన్ని తటస్థానికి (న్యూట్రల్‌కు) సడలించారు. ఈ నిర్ణయాలతో ఇంటి రుణాలు, ఇతర రుణాలు చౌకగా మారనున్నాయి. ఈఎంఐల భారం తగ్గనుంది. కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు రుణాల వితరణకు, ఆర్థిక ఉద్దీపనానికి ఆర్బీఐ నిర్ణయాలు వీలు కల్పించనున్నాయి. గతానికి భిన్నంగా... ఆర్బీఐ గవర్నర్‌గా వచ్చిన తర్వాత శక్తికాంతదాస్ వివిధ రంగాల ప్రతినిధులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి కోర్కెల గురించి తెలుసుకున్నారు. ద్రవ్యోల్బణం చాలా కనిష్ట స్థాయిల్లో ఉండడం, వృద్ధి రేటు ఆశించినంత లేకపోవడంతో వడ్డీ రేట్లలో కోత విధించొచ్చని ఎక్కువ మంది భావించారు. కానీ, మధ్యంతర బడ్జెట్లో రైతులకు ప్రకటించిన ప్యాకేజీ, ఆదాయపన్ను మినహాయింపుల వంటి ప్రోత్సాహకాలతో వినియోగం పెరిగి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆర్బీఐ ఎంపీసీ రేట్లను తగ్గించకపోవచ్చని, తటస్థానికి తన విధానాన్ని మార్చొచ్చన్న అభిప్రాయాలూ వినిపించాయి. కానీ, బడ్జెట్‌కు ముందు వ్యక్తమైన అంచనాలను దాస్ నిజం చేశారు. రేట్ల కోత విధింపునకు ఆరుగురు సభ్యుల ఎంపీసీలో ఆర్బీఐ గవర్నర్ సహా నలుగురు అనుకూలంగా ఓటేశారు. తటస్థ విధానానికి మారేందుకు మాత్రం ఆరుగురు అంగీకారం తెలిపారు. 2014 జనవరి 28న కీలక రేట్ల పెంపు తర్వాత నుంచి... రేట్లు తగ్గుతూ వచ్చాయి. దీనికి విరామం పలుకుతూ 2018 జూన్, ఆగస్ట్ సమావేశాల్లో ఆర్బీఐ ఎంపీసీ కీలక రేట్లను పావు శాతం చొప్పున పెంచింది. ఈ మధ్య కాలంలో అంటే 2014 జవవరి నుంచి 2018 జూన్‌లోపు ఆరు సార్లు వడ్డీ రేట్లను తగ్గించడం జరిగింది. వృద్ధి కోసమే కోత... ‘‘పెట్టుబడుల ధోరణి పుంజుకుంటోంది. అయితే, ఇది ప్రధానంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై వెచ్చిస్తున్న నిధుల వల్లే. ప్రైవేటు పెట్టుబడులను, ప్రైవేటు వినియోగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మధ్య కాలానికి ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కొనసాగించాలన్న లక్ష్యానికి లోబడే వృద్ధికి మద్దతు ఇచ్చేందుకు రేట్ల కోత చేపట్టడం జరిగింది’’ అని ఆర్బీఐ పరపతి విధాన కమిటీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బోణీ రుణ రేటు తగ్గింపు.. ముంబై: ఆర్బీఐ రేట్లు తగ్గించిన కొన్ని గంటల వ్యవధిలోనే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేటును 0.05 శాతం తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, ఆరు నెలల కాల వ్యవధి కలిగిన రుణాలకే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఏడాది సహా మిగిలిన కాల వ్యవధి రుణాలకు ఇంతకుముందు రేట్లే అమలవుతాయి. ఆరు నెలల రుణాలకు ఇక 8.55 శాతం రేటును బ్యాంకు అమలు చేస్తుంది. చౌకగా రుణాలు... ఆర్బీఐ రెపో రేటును 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించడం, తన విధానాన్ని తటస్థానికి మార్చడం ఆర్థిక రంగానికి బలాన్నిస్తుంది. చిన్న వ్యాపారులకు, ఇళ్ల కొనుగోలుదారులకు చౌకగా రుణాలు లభించేందుకు తోడ్పడుతుంది. ఇది ఉద్యోగ అవకాశాలకూ మరింత ఊతమిస్తుంది. – పీయూష్ గోయల్, కేంద్ర ఆర్థిక మంత్రి హౌసింగ్ డిమాండ్ జోరు.. ఈ నిర్ణయం గృహ కొనుగోలు డిమాండ్ పెరుగుదలకు దోహదపడుతుంది. ఆర్బీఐ కల్పించిన తాజా వెసులుబాటును బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు బదలాయిస్తాయని భావిస్తున్నాం. మరోపక్క, రియల్టీ రంగానికి ద్రవ్య లభ్యత పెరుగుదల దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. – జక్సాయ్ షా, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ వ్యాపార వర్గాలకు శుభవార్త... తాజా పాలసీలో ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు, దీనితోపాటు ‘జాగరూకతతో కూడిన కఠిన వైఖరి’ నుంచి ‘తటస్థ’ దిశగా తన పాలసీ వైఖరిని మార్చుకోవడం పారిశ్రామిక రంగానికి శుభవార్తలు. వ్యవస్థలో వినియోగం, పెట్టుబడులు రెండూ పెరుగుతాయ్. దీనివల్ల వృద్ధి జోందుకుంటుంది. – రాకేశ్ భారతీ మిట్టల్, సీఐఐ ప్రెసిడెంట్ మరింత తగ్గే సంకేతాలు... దేశంలో ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్ధేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. దీంతో రేట్ల కోతకు వెసులుబాటు లభించింది. రానున్న కొద్దికాలంపాటు ధరలు కట్టడిలో ఉండే అవకాశాల నేపథ్యంలో రేటు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ పరపతి విధానం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. – రజ్నీష్ కుమార్, ఎస్బీఐ చీఫ్ పాలసీ ముఖ్యాంశాలు... ► రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింపు. రివర్స్ రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు. బ్యాంకు రేటు 6.5 శాతం. ► ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటుగా పేర్కొంటారు. ఆర్బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు. ► నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)లో ఎలాంటి మార్పుల్లేవు. 4 శాతంగానే కొనసాగుతుంది. ► వడ్డీ రేట్ల తగ్గింపునకు శక్తికాంతదాస్ సహా నలుగురు ఎంపీసీ సభ్యులు అనుకూలంగా ఓటు. చేతన్‌ఘటే, విరాళ్ ఆచార్య యథాతథానికి ఓటు. ► రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు 2019 జనవరి–మార్చి త్రైమాసికానికి 2.8 శాతానికి తగ్గింపు. 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు(ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి) 3.2–3.4 శాతంగా అంచనా. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి అంచనా 3.9 శాతం. ► జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతంగా ఉండొచ్చు. 2019–20లో ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య 7.2–7.4 శాతంగాను, అక్టోబర్–డిసెంబర్ కాలానికి 7.5 శాతంగానూ ఉండొచ్చు. ► చమురు ధరల్లో అస్పష్టత ఉండొచ్చు. వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ వృద్ధి అవకాశాలపై ప్రభావం చూపిస్తాయి. ► వ్యవసాయ రుణాలు, ప్రాంతీయ అసమానత, కవరేజీ విస్తృతికి ఓ అంతర్గత కమిటీ ఏర్పాటు. ► రూపాయి విలువలో స్థిరత్వానికి ఆఫ్‌షోర్ రూపీ మార్కెట్ల కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు. ► కార్పొరేట్ డెట్ మార్కెట్లో పెట్టుబడుల విషయంలో ఎఫ్‌పీఐలపై ఉన్న నియంత్రణలు ఎత్తివేత. ► పేమెంట్ గేట్‌వే సర్వీసు ప్రొవైడర్లు, పేమెంట్ అగ్రిగేటర్లకు సంబంధించి త్వరలో చర్చా పత్రం విడుదల. ► కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు ఖర్చు చేసే ఆదాయాన్ని పెంచడం ద్వారా డిమాండ్‌కు ఊతమిస్తాయి. ► ఎన్‌బీఎఫ్‌సీల సమన్వయానికి త్వరలో మార్గదర్శకాలు. ► ఆర్బీఐ తదుపరి ఎంపీసీ భేటీ వచ్చే ఏప్రిల్ 2న జరగనుంది. -
రుణాలు ఇక మరింత ప్రియం
-
రెపో రేటు, రివర్స్ రెపో రేటు యథాతథం
ముంబై: రెపో రేటు, రివర్స్ రెపో రేటు యథాతథంగా ఉంచనున్నట్లు రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అధికారులు మంగళవారం ఉదయం ద్రవ్య పరపతిపై సమీక్ష నిర్వహించారు. ఆర్బీఐ రెపో రేటు 6.75 శాతం ఉండగా, రివర్స్ రెపో రేట్ 5.75 శాతమని ఇందులో ఎటువంటి మార్పులు చేయలేదని అధికారులు పేర్కొన్నారు. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతమని నిర్ణయించారు. మార్చి 2017 నాటికి ద్రవ్యోల్బణం 5 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. -
వడ్డీ రేట్లలో మార్పులు చేయని RBI
-
కీలక పాలసీ వడ్డీరేట్లు యథాతథం..
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లుచల్లారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగమనం కొనసాగుతున్నా.. ద్రవ్యోల్బణం కట్టడికే ప్రాధాన్యమిచ్చారు. కీలక పాలసీ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని మంగళవారం జరిగిన పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ నిర్ణయించింది. అయితే, చట్టబద్ద ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్)ను మాత్రం అర శాతం తగ్గించడంద్వారా వ్యవస్థలోకి ద్రవ్యసరఫరా పెంచే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ద్రవ్యోల్బణం గనుక మరింత తగ్గుముఖం పడితే వడ్డీరేట్లను తప్పకుండా తగ్గిస్తామని చెప్పడం ఒక్కటే కాస్తలోకాస్త ఊరటనిచ్చే విషయం. అయితే, ఎస్ఎల్ఆర్ను తగ్గించినప్పటికీ... తాము ఇప్పట్లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశం లేదని బ్యాంకర్లు తేల్చిచెప్పారు. ముంబై: మోడీ నేతృత్వంలోని కొత్త సర్కారు కొలువైన తర్వాత తొలిసారిగా చేపట్టిన ఆర్బీఐ పాలసీ సమీక్షలో దాదాపు అందరి అంచనాలకు అనుగుణంగానే నిర్ణయం వెలువడింది. కీలక పాలసీ రేట్లను మార్చకుండా వదిలేసినప్పటికీ.. ఎస్ఎల్ఆర్ను అర శాతం ఆర్బీఐ తగ్గించింది. దీంతో ప్రస్తుతం 23 శాతంగా ఉన్న ఎస్ఎల్ఆర్ 22.5 శాతానికి తగ్గింది. ఈ నెల 14 నుంచి ఈ తగ్గింపు నిర్ణయం అమలవుతుందని పేర్కొంది. తాజా చర్యలతో వ్యవస్థలోకి సుమారు రూ.40,000 కోట్లు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాంకులకు రుణాలిచ్చేందుకు నిధుల లభ్యత పెరగనుంది. ఇదిలాఉండగా... రెపో రేటు 8 శాతం, రివర్స్ రెపో రేటు 7 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతం చొప్పున ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగనున్నాయి. బ్యాంక్ రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్ఎఫ్)లను కూడా ప్రస్తుత 9 శాతం వద్దే ఉంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వరుసగా రెండోసారీ నో చేంజ్... ఆర్బీఐ గవర్నర్‌గా గతేడాది సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన రాజన్.. ఆతర్వాత మూడుసార్లు పావు శాతం చొప్పున రెపో రేటును పెంచడం తెలిసిందే. అయితే, తాజాగా రేట్లను యథాతథంగా ఉంచడంద్వారా వరుసగా రెండోసారి పాలసీ రేట్లను పెంచడం లేదా తగ్గించకుండా వదిలేసినట్లయింది. ప్రధానంగా ద్రవ్యోల్బణం కట్టడికే తమ తొలిప్రాధాన్యమంటూ వస్తున్న రాజన్.. తాజాగా మోడీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా ఇదే పల్లవిని వినిపించారు. గతేడాది జీడీపీ వృద్ధి రేటు ఇంకా మందగమనంలోనే 4.7 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. కాగా, సరఫరాపరమైన అడ్డంకుల నేపథ్యంలో ఆర్బీఐ లక్ష్యానికి అనుగుణంగా ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశాలు లేవని విశ్లేషకులు అంటున్నారు. దీనివల్ల డిసెంబర్‌లోపు మరో విడత పాలసీ రేట్ల పెంపు తప్పకపోవచ్చని బ్రోకరేజి దిగ్గజం క్రెడిట్ సూసే అభిప్రాయపడింది. పాలసీలో ఇతర ముఖ్యాంశాలు... ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు గతంలో అంచనావేసినట్లుగానే 5.5 శాతంగా ఉండొచ్చు. ఫారెక్స్ మార్కెట్లో సానుకూల పరిస్థితుల నేపథ్యంలో(డాలరుతో రూపాయి విలువ బలపడటం) వ్యక్తిగతంగా విదేశాల్లో పెట్టే వార్షిక పెట్టుబడుల పరిమితి పెంపు. ప్రస్తుత 75,000 డాలర్ల స్థాయి నుంచి 1.25 లక్షల డాలర్లకు పెంచుతూ నిర్ణయం. బంగ్లాదేశ్, పాకిస్థాన్ పౌరులు మినహా భారత, విదేశీ పౌరులు భారత్ నుంచి బయటికి వెళ్లినప్పుడు ఇకపై రూ.25,000 వరకూ భారతీయ కరెన్సీని పట్టుకెళ్లేందుకు అనుమతి. ప్రస్తుతం విదేశాలకు వెళ్లే భారతీయులు రూ.10,000 వరకూ మాత్రమే దేశీ కరెన్సీని తమతో తీసుకెళ్లేలా ఆర్బీఐ పరిమితి ఉంది. ఫారెక్స్ మార్కెట్లో దేశీయ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కరెన్సీ డెరివేటివ్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు కూడా లావాదేవీలు జరిపేం దుకు అనుమతి. ఈ విభాగంలో ట్రేడింగ్ పరిమాణం తగ్గడంతో దీన్ని బలోపేతం చేసేందుకు చర్యలు. ఎక్స్పోర్ట్ క్రెడిట్ రీఫైనాన్స్ సదుపాయం కింద నిధుల లభ్యత తగ్గింపు. ప్రస్తుతం ఎగుమతిదారులు తాము చెల్లించాల్సిన రుణ మొత్తంలో మరో 50 శాతం వరకూ రుణం తీసుకోవడానికి వీలుండగా.. దీన్ని ఇప్పుడు 32 శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను తగ్గించలేం తేల్చిచెప్పిన బ్యాంకర్లు ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ను అర శాతం తగ్గించినప్పటికీ.. తాము మాత్రం వడ్డీరేట్ల తగ్గించే అస్కారం లేదని బ్యాంకర్లు స్పష్టం చేశారు. పాలసీ సమీక్ష తమ అంచనాలకు అనుగుణంగానే ఉందన్నారు. ఆర్బీఐ పాలసీపై ఎవరేమన్నారంటే... ఆర్బీఐ నిర్దేశించిన స్థాయికంటే ప్రస్తుతం బ్యాంకుల ఎస్ఎల్ఆర్ స్థాయి అధికంగానే ఉంది. దీన్ని తగ్గించడంవల్ల తక్షణం ఎలాంటి ప్రభావం ఉండదు. ద్రవ్యసరఫరా పెంపు సంకేతమిది. సమీప కాలంలో వడ్డీరేట్లు తగ్గే అవకాశాల్లేవు. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్మన్ కొత్త ప్రభుత్వం రానున్న నెలల్లో వృద్ధి పెంపునకు, ద్రవ్యోల్బణం కట్టడి కోసం తీసుకోబోయే పాలసీ విధానపరమైన చర్యలను పరిశీలించి తదనుగుణంగా తగిన నిర్ణయం తీసుకోవడానికివీలుగానే ఆర్బీఐ పరపతి విధాన నిర్ణయం ఉంది. కేంద్రంలో కొలువుదీరిన మోడీ సర్కారు వృద్ధికి చేయూతనిస్తుందన్న అంచనాల నేపథ్యంలో వేచిచూసే ధోరణితో ఆర్బీఐ వ్యవహరించింది. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ ఎస్ఎల్ఆర్ తగ్గింపు వల్ల మాకు రూ.1,600 కోట్ల నిధుల లభ్యత పెరిగినప్పటికీ వడ్డీరేట్లలో మార్పులను మేం పరిశీలించే అవకాశం లేదు. - ఎం.నరేంద్ర, ఐఓబీ సీఎండీ ఎస్ఎల్ఆర్ కోతను స్వాగతించిన కార్పొరేట్లు పాలసీ వడ్డీరేట్లను తగ్గించనప్పటికీ.. ఎస్ఎల్ఆర్ను అర శాతం తగ్గించడంపట్ల పారిశ్రామిక వర్గాలు హర్హం వ్యక్తం చేశాయి. ఈ చర్యతో కార్పొరేట్ రంగానికి రుణాలు పెంచేందుకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని చాంబర్లు పేర్కొన్నాయి. సరళ పాలసీని అనుసరించడం ద్వారా పెట్టుబడులను పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలను ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్దార్థ్ బిర్లా ప్రశంసించారు. కాగా, ఎస్ఎల్ఆర్ తగ్గింపు వల్ల పారిశ్రామిక రంగానికి పెట్టుబడులకు రుణ లభ్యత పెరిగి, వృద్ధికి కూడా ఊతమిస్తుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. కాగా, అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ మాత్రం నిధుల లభ్యత పెరగడం కంటే వడ్డీరేట్ల తగ్గింపే ప్రస్తుతం పారిశ్రామిక రంగానికి అత్యవసరమని చెప్పారు. రియల్టర్ల అసంతృప్తి: పాలసీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపట్ల రియల్ ఎస్టేట్ రంగం అసంతృప్తి వ్యక్తం చేసింది. వృద్ధికి ఊతమిచ్చేవిధంగా మళ్లీ హౌసింగ్ డిమాండ్ పెంచాలంటే ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించాలని రియల్టీ డెవలపర్ల సంఘాల సమాఖ్య(క్రెడాయ్) డిమాండ్ చేసింది. ‘వ్యవస్థలోకి ద్రవ్యసరఫరా పెంచేలా ఎస్ఎల్ఆర్ను తగ్గించడాన్ని మేం స్వాగతిస్తున్నాం. అయితే, వడ్డీరేట్ల తగ్గింపు ద్వారా ఇళ్ల కొనుగోళ్లు పెంచే చర్యల కోసం రియల్టీ పరిశ్రమల వేచిచూస్తోంది’ అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ సి.శేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీర్ఘకాలం పాటు వడ్డీరేట్లు తగ్గకుండా అక్కడే ఉంటే ఇళ్ల కొనుగోళ్లు జోరందుకోవడం కష్టమని క్రెడాయ్ చైర్మన్ లలిత్ జైన్ పేర్కొన్నారు. ఆర్బీఐ అస్త్రాలు... నగదు నిల్వల నిష్పతి(సీఆర్ఆర్): బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో కచ్చితంగా ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన మొత్తమే సీఆర్ఆర్. రెపో రేటు: బ్యాంకులు తన వద్దనుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీని రెపో రేటుగా పేర్కొంటారు. రివర్స్ రెపో: బ్యాంకులు తన వద్ద ఉంచే అదనపు నిధులపై రిజర్వ్ బ్యాంక్ చెల్లించే వడ్డీనే రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఎస్ఎల్ఆర్: బ్యాంకులు తమ వద్దనున్న డిపాజిట్లలో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ సెక్యూరిటీ(బాండ్లు)ల్లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. దీన్నే చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్)గా వ్యవహరిస్తారు. రుణ వృద్ధిని నియంత్రించేందుకు ఆర్బీఐ దీన్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది. -
వడ్డీరేట్ల పిడుగు!
అంచనాలన్నీ తలకిందులయ్యాయి... గృహ, వాహన రుణాలపై నెలవారీ వాయిదా(ఈఎంఐ)లు మరింత భారమయ్యేలా రుణ గ్రహీతలపై వడ్డీరేట్ల పిడుగుపడింది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ తన రూటే సెప‘రేటు’ అని మరోసారి నిరూపిస్తూ... అనూహ్యంగా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాన్ని ప్రకటించారు. ద్రవ్యోల్బణం కట్టడే తమ ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. అసలే వడ్డీరేట్ల భారం, వృద్ధి మందగమనంతో అల్లాడుతున్న పారిశ్రామిక రంగానికి ఆర్బీఐ తాజా చర్యలు మింగుడుపడటం లేదు. పరిశ్రమలు మరింత తిరోగమనంలోకి జారిపోతాయంటూ కార్పొరేట్లు గగ్గోలు పెడుతున్నారు. అయితే, రానున్న కాలంలో మరిన్ని రేట్ల పెంపులకు ఆస్కారం ఉండకపోవచ్చనిఆర్బీఐ సంకేతాలివ్వడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం. ముంబై: ద్రవ్యోల్బణంపై రఘు‘రామ’ బాణం మరోసారి దూసుకెళ్లింది. మంగళవారం చేపట్టిన మూడో త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలకమైన రెపో రేటును ఆర్బీఐ పావు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడున్న 7.75% నుంచి 8 శాతానికి ఎగసింది. రెపోతో ముడిపడి ఉన్న రివర్స్ రెపో కూడా పావు శాతం పెరిగి 7 శాతానికి చేరింది. అదేవిధంగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 8.75 శాతం నుంచి 9 శాతానికి పెరిగింది. అయితే, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)ని మాత్రం యథాతథంగా ఇప్పుడు 4%గానే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. తాజా చర్యలతో రుణాలపై వడ్డీరేట్లకు రెక్కలొస్తాయని నిపుణులు భావిస్తున్నారు. బ్యాంకర్లు తక్షణం రేట్ల పెంపుపై నిర్ణయం ప్రకటించనప్పటికీ.. త్వరలోనే చర్యలు ఉండొచ్చని పేర్కొనడం గమనార్హం. మూడో‘సారీ’... వాస్తవానికి డిసెంబర్లో ద్రవ్యోల్బణం భారీగా దిగిరావడంతో ఈసారి పాలసీ సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచొచ్చని అధిక శాతం మంది బ్యాంకర్లు, ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. కొంతమంది రేట్ల కోతకూ ఆస్కారం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. అయితే, రాజన్ మాత్రం అందరూ అవాక్కయ్యేలా మరోసారి ‘వడ్డి’ంపు ప్రకటించారు. ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఐదు నెలల్లో మూడుసార్లు వడ్డీరేట్లు పెంచడం గమనార్హం. సెప్టెంబర్, నవంబర్లలో చేపట్టిన పరపతి విధాన సమీక్షల్లో రెపో రేటు పావు శాతం చొప్పున పెంచారు. అయితే, అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో డిసెంబర్ సమీక్షలో కచ్చితంగా రేట్ల పెంపు ఉండొచ్చని అందరూ భావించగా... అప్పుడు అనూహ్యంగా పాలసీ రేట్ల జోలికివెళ్లలేదు. ఈసారి కూడా అంచనాలను తలకిందులు చేశారు ఆర్బీఐ చీఫ్. డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 9.87 శాతానికి(మూడు నెలల కనిష్టం), టోకు ధరల ద్రవ్యోల్బణం 6.16 శాతానికి(ఐదు నెలల కనిష్టస్థాయి) శాంతించడం తెలిసిందే. కాగా, తాజా సమీక్షలకు కొద్దిరోజుల ముందు ద్రవ్యోల్బణాన్ని ఒక వినాశకర వ్యాధిగా రాజన్ అభివర్ణించడం తెలిసిందే. ధరలను కట్టడి చేస్తేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కార్పొరేట్ల గగ్గోలు... వడ్డీరేట్లు తగ్గించాలన్న తమ విజ్ఞప్తిని పట్టించుకోకుండా మరోసారి ఆర్బీఐ రేట్లను పెంచడంపట్ల పారిశ్రామిక వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఆర్బీఐ చర్యలను సాకుగాచూపి బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్ల పెంపు నిర్ణయం తీసుకోరాదని... ఇదే జరిగితే ఆర్థిక వ్యవస్థ రికవరీని తీవ్రంగా దెబ్బతీస్తుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) పేర్కొంది. ద్రవ్యోల్బణం కట్టడికంటే వృద్ధి, పెట్టుబడుల పెంపుపై ఆర్బీఐ దృష్టిపెట్టడం ముఖ్యమని అభిప్రాయపడింది. ‘వృద్ధి ఇంకా మందగమనంలోనే ఉంది. గత రెండేళ్లుగా పెట్టుబడులు పడిపోవడంతో అన్ని రంగాల పరిశ్రమల్లోనూ ఉద్యోగావకాశాలు క్షీణించిన సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. పారిశ్రామికోత్పతి తిరోగమనంలోకి జారిపోయిన తరుణంలో మళ్లీ దీన్ని గాడిలోపెట్టారంటే వడ్డీరేట్ల తగ్గింపు ఇతరత్రా విధానపరమైన మద్దతు చాలా అవసరం. రానున్న నెలల్లో ఆర్బీఐ వృద్ధి, ఉద్యోగకల్పనపై ప్రధానంగా దృష్టిపెడుతుందని భావిస్తున్నాం’ అని ఫిక్కీ వ్యాఖ్యానించింది. పాలసీలో ఇతర ముఖ్యాంశాలివీ.. ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఆందోళనకరం. ఈ ఏడాది(2013-14) మూడో త్రైమాసికం(క్యూ3)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి మరింత నెమ్మదించొచ్చు. ఈఏడాది జీడీపీ వృద్ధి రేటు 5 శాతం లోపే ఉండొచ్చు. గత అంచనా 5.5 శాతం. 2014-15లో మాత్రం వృద్ధి రేటు కాస్త మెరుగ్గా 5.5 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తున్నాం. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఈ ఏడాది జీడీపీలో 2.5% లోపే ఉండొచ్చు. గతేడాది ఇది చరిత్రాత్మక గరిష్ట స్థాయిని(4.8%) తాకింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత నాలుగో త్రైమాసికంలో 9 శాతం పైనే ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది క్యూ4లో 7.5-8.5% స్థాయిలో ఉండొచ్చు. రేట్ల పెంపుతో ద్రవ్యో ల్బణం ఒత్తిళ్లు తగ్గుతాయి. {దవ్యోల్బణం పెరుగుదల అనేది అనవసరమైన పన్నుపోటుగా మారుతోంది. పేద ప్రజలను ఇది తీవ్రంగా కుంగదీస్తోంది. ఇక నుంచి ప్రతి రెండు నెలలకు ఒకసారి పాలసీ సమీక్ష చేపట్టాలని నిర్ణయం(ఇప్పటిదాకా నెలన్నర రోజులకు ఒకసారి ఉంది). తదుపరి పరపతి విధాన సమీక్ష ఏప్రిల్ 1 ఉంటుంది. ఆర్బీఐ అస్త్రాలు.. రెపో రేటు: బ్యాంకుల వద్ద నిధుల కొరత గనుక ఉంటే అవి ఆర్బీఐ నుంచి నగదును స్వల్పకాలిక రుణంగా తీసుకోవచ్చు. ఇటువంటి రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీని రెపో రేటుగా పేర్కొంటారు. రెపో రేటును పెంచితే బ్యాంకులు తీసుకునే ఈ స్వల్పకాలిక రుణాలు ఖరీదవుతాయి. రివర్స్ రెపో: బ్యాంకులు తన వద్ద ఉంచే నిధులపై ఆర్బీఐ చెల్లించే వడ్డీనే రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు. రివర్స్ రెపో రేటు ఆకర్షణీయంగా ఉంటే గనుక, ఆర్బీఐ వద్ద బ్యాంకులు తమ అదనపు నిధులను ఉంచేందుకు ఇష్టపడతాయి. సీఆర్ఆర్: బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద కచ్చితంగా నిర్దిష్ట శాతంలో ఉంచాల్సిన నిధుల మొత్తమే సీఆర్ఆర్. ఎంఎస్ఎఫ్: స్వల్పకాలిక రుణాల వడ్డీరేట్లలో హెచ్చుతగ్గులను నివారించేందు కోసం ఆర్బీఐ ఈ ఎంఎస్ఎఫ్ను ప్రవేశపెట్టింది. రెపో రేటు కన్నా 100 బేసిస్ పాయింట్లు(1%) ఎక్కువగా ఉంటుంది. రిటైల్ ద్రవ్యోల్బణంపై దృష్టి.... రిటైల్ ద్రవ్యోల్బణం ఇంకా చాలా ఎక్కువగానే ఉంది. దీన్ని తగ్గించడంలో భాగంగానే మరోవిడత రెపో రేటును పెంచాల్సి వచ్చింది. రానున్న పాలసీ సమీక్షల్లో నిర్ణయాలన్నీ గణంకాలపైనే ఆధారపడి ఉంటాయి. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని వచ్చే ఏడాది జనవరినాటికి 8 శాతం లోపునకు తీసుకురావాలనేది ఆర్బీఐ లక్ష్యం. అయితే, ఇది అంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశాలున్నాయి. ఒకవేళ మా అంచనాలకు అగుగుణంగా ద్రవ్యోల్బణం గనుక దిగొస్తే... సమీప భవిష్యత్తులో మరోవిడత రేట్ల పెంపునకు ఆస్కారం ఉండకపోవచ్చు. పాలసీ నిర్ణయాలకు ఇక నుంచి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలన్న ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సులను ఆర్బీఐ ఇంకా ఆమోదించలేదు. ఈ విధమైన మార్పులు చేసేముందు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణం గణంకాలు రెండూ కీలకమే. అయితే, రిటైల్ ధరలు నేరుగా వినియోగదారులతో ముడిపడి ఉన్నందున దీనిపై కొంత అధిక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తేనే దీర్ఘకాలంలో నిలకడైన వృద్ధిరేటు కొనసాగేందుకు దోహదపడుతుంది. రెపో రేటు పెంపు వల్ల బ్యాంకుల వడ్డీరేట్లు పెరిగే అవకాశాలు తక్కువే. ఆర్థిక వ్యవస్థ రికవరీ పటిష్టంగా ఉండాలంటే ముందుగా ధరలను దించాల్సిన అవసరం ఉంది. ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం వల్లే బ్యాంకుల డిపాజిట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ధరలు దిగొస్తే.. డిపాజిట్, రుణ రేట్లు కూడా దిగొచ్చేందుకు అస్కారం లభిస్తుంది. - రఘురామ్ రాజన్, ఆర్బీఐ గవర్నర్ వేచిచూస్తాం: బ్యాంకర్లు ఆర్బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకర్లు ఆచితూచి స్పందించారు. రుణాలపై వడ్డీరేట్ల పెంపుపై నిర్ణయం తీసుకునేముందు ద్రవ్యోల్బణం ధోరణి, డిపాజిట్ రేట్లను మదింపు చేయాల్సి ఉందని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల అధిపతులు చెప్పారు. ఎవరేమన్నారంటే... త్వరలో నిర్ణయం... డిపాజిట్, రుణ రేట్ల పెంపుపై నిర్ణయం కోసం బ్యాంకు యాజమాన్యం సమావేశం కానుంది. నిధుల సమీకరణ వ్యయంపై ఎలాంటి ప్రభావం ఉందన్నదానిపైనే రేట్లలో మార్పుచేర్పులు ఉంటాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డిపాజిటర్లకు తగిన వడ్డీని ఇవ్వాల్సి ఉంటుంది. రుణ గ్రహీతల నుంచి అధిక వడ్డీరేట్లను వసూలు చేసి.. డిపాజిటర్లకు అధిక వడ్డీని ఆఫర్ చేయలేం. ఈ మొత్తం పరిస్థితిని నిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. - అరుంధతి భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ అన్నీ చూశాకే... డిపాజిట్లు, ద్రవ్యోల్బణం వాస్తవ ధోరణులను సమీక్షించాలి. ఈ రెండే బ్యాంకుల నిధుల వ్యయంపై ప్రభావం చూపేవి. ఆతర్వాతే రుణ రేట్ల జోలికెళ్లడం సముచితం. డిపాజిట్ రేట్ల విషయంలో నిర్ణయానికి వచ్చేదాకా రుణాలపై వడ్డీ రేట్ల పెంపు విషయంలో తక్షణం ఎలాంటి చర్యలూ తీసుకోలేం. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ రుణాలకు డిమాండ్నుబట్టే... బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాలకు డిమాండ్, డిపాజిట్ల సమీకరణ వ్యయాలను పరిగణనలోకి తీసుకొని వడ్డీరేట్ల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. - ఆదిత్య పురి, హెచ్డీఎఫ్సీ ఎండీ, సీఈఓ ఆప్షన్లన్నీ సిద్ధం... ఆర్బీఐ పాలసీ నిర్ణయంపై మార్కెట్లో ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తమవుతోందనేది పరిశీలించాలి. వడ్డీరేట్ల పెంపు సహా అన్ని ఆప్షన్లనూ సిద్ధంగా ఉంచుకొని కొంత వేచిచూసి నిర్ణయం తీసుకోవాలి. - కేఆర్ కామత్, పీఎన్బీ సీఎండీ