RTC services
-
టీఎస్ఆర్టీసీ చరిత్రలో ఆల్ టైం రికార్డు
సాక్షి, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి పర్వదినం నాడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) సరికొత్త రికార్డులను నమోదు చేసింది. నిన్న ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు. గత ఏడాది రాఖీ పండుగ(12.08.2022) నాడు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈ సారి దాదాపు రూ.కోటి వరకు అదనంగా ఆర్జించింది. ఈ రాఖీ పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో 40.92 లక్షల మంది టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. గత ఏడాది కన్నా లక్ష మంది అదనంగా రాకపోకలు సాగించారు. ఒక్క రోజులో ఇంత పెద్ద ఎత్తున ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే, గత రాఖీ పండుగతో పోల్చితే 1.23 లక్షల కిలోమీటర్లు అదనంగా ఈ సారి ఆర్టీసీ బస్సులు తిరిగాయి. 2022లో రాఖీ పండగ నాడు 35.54 లక్షల కిలోమీటర్లు తిరగగా.. ఈ సారి 36.77 లక్షల కిలో మీటర్లు నడిచాయి. రాఖీ పౌర్ణమి పర్వదినం నాడు #TSRTC సరికొత్త రికార్డులను నమోదు చేసింది. నిన్న ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు. గత ఏడాది రాఖీ పండుగ(12.08.2022) నాడు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈ సారి దాదాపు రూ.కోటి వరకు అదనంగా ఆర్జించింది. ఈ… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) September 1, 2023 20 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్ ఆక్యూపెన్సీ రేషియా(ఓఆర్) విషయానికి వస్తే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా గత ఏడాది రికార్డును పునరావృతం చేసింది. 2022లో రాఖీ పండుగ నాడు 101.01 ఓఆర్ సాధించగా.. ఈసారి 104.68 శాతం రికార్డు ఓఆర్ నమోదు చేసింది. ఆ జిల్లా పరిధిలోని 7 డిపోల్లో నార్కెట్ పల్లి మినహా మిగతా డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. నల్లగొండ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రాఖీ పౌర్ణమికి 97.05 శాతం ఓఆర్ నమోదైంది. ఆ జిల్లాలో 9 డిపోలు ఉండగా.. 6 డిపోలు 100కిపైగా ఓఆర్ సాధించడం విశేషం. అలాగే, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఓఆర్ నమోదైంది. రాఖీ పౌర్ణమి నాడు రాష్ట్రంలోని 20 డిపోల్లో ఓఆర్ 100 శాతానికి పైగా దాటింది. ఆయా డిపోల్లో బస్సులన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. హుజురాబాద్, నల్లగొండ, భూపాలపల్లి, హుస్నాబాద్, పరకాల, కల్వకుర్తి, తొర్రూర్, మహబుబాబాద్, మిర్యాలగూడ, దేవరకొండ, యాదగిరిగుట్ట, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, కోదాడ, నర్సంపేట, సూర్యాపేట, దుబ్బాక, జనగామ, సిద్దిపేట, గోదావరిఖని, షాద్ నగర్ డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో అత్యధికంగా ఒక కిలోమీటర్ కు రూ.65.94ను వరంగల్-1 డిపో, రూ.65.64ను భూపాలపల్లి డిపో సాధించింది. ఈ రెండు కూడా సంస్థ చరిత్రలోనూ ఎర్నింగ్స్ పర్ కిలోమీటర్ (ఈపీకే) ఆల్ టైం రికార్డు గమనార్హం. ప్రయాణికులకు ధన్యవాదాలు “ప్రజా రవాణా వ్యవస్థ వెంటే తాము ఉన్నామని ప్రజలు మరోసారి నిరూపించారు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి రాఖీ పౌర్ణమికి కూడా సంస్థకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒక్క రోజులో దాదాపు 41 లక్షల మంది ప్రయాణికులు సంస్థ బస్సుల్లో రాకపోకలు సాగించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సంస్థ తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజల ఆదరణ, పోత్సాహం వల్ల ఈ సారి ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీల చరిత్రలో ఒక్క రోజులో రూ.22.65 కోట్ల రాబడి రాలేదు. గత ఏడాది రాఖీ నాడు 12 డిపోలు మాత్రమే 100 శాతానికిపైగా ఓఆర్ సాధించగా.. ఈ సారి 20 డిపోలు నమోదు చేశాయి.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్(ఐపీఎస్) మీడియాకు తెలిపారు. రాఖీ పండుగ నాడు ఎంతో నిబద్దతతో సిబ్బంది పనిచేశారని, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు రాఖీ పండుగ రోజును త్యాగం చేసి మరీ విధులు నిర్వర్తించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి.. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారని సిబ్బందిని అభినందించారు.. ఎంతో మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను మొచ్చకుంటూ తమకు, ఉన్నతాధికారులకు సందేశాలు పంపించారని పేర్కొన్నారు. “ప్రజలందరూ పండుగలు చేసుకుంటుంటే.. సంస్థ సిబ్బంది మాత్రం విధుల్లో నిమగ్నై వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. అందుకు రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తున్నారు. సంక్రాంతి, రాఖీ పౌర్ణమి, దసరా, తదితర ప్రధాన పండుగల్లో సిబ్బంది చేసే త్యాగం ఎనలేనిది. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజల ఆదరణ, ప్రోత్సాహన్ని స్పూర్తిగా తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో పని చేసి భవిష్యత్ లోనూ మరింతగా మెరుగైన, నాణ్యమైన సేవలందించాలి. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రభుత్వ నమ్మకాన్ని కొల్పోకుండా మంచి ఫలితాలు వచ్చేలా పాటుపడాలి.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సిబ్బందికి పిలుపునిచ్చారు. -
బస్సులు పెంచుకుందాం.. ఆదాయం పంచుకుందాం!
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుకునే దిశగా మళ్లీ కదలిక మొదలైంది. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు ఈడీలతో కలిసి హైదరాబాద్ బస్‌భవన్‌లో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీలతో సోమవారం భేటీ అయ్యారు. ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టు, ఎస్బీటీ, ఎస్ఆర్బీఎస్ పథకాల విభజనే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరిగినా అంతర్రాష్ట్ర సర్వీసులపై కూడా చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య తిరిగే ప్రయాణికులు చాలినన్ని ఆర్టీసీ సర్వీసుల్లేక ప్రైవేటు బస్సుల్లో వెళ్తున్నారని, రెండు ఆర్టీసీలకు రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు ఆపరేటర్లు కొట్టుకుపోతున్నందున ఆర్టీసీ సర్వీసుల సంఖ్య పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం 1.52 లక్షల కి.మీ. చొప్పున మాత్రమే రెండు ఆర్టీసీల అంతర్రాష్ట్ర సర్వీసులు తిరుగుతున్నాయని, ఇప్పుడు కనీసం 2.05 లక్షల కి.మీ.కన్నా పెంచుకోవాలని ఏపీ అధికారులు పేర్కొన్నారు. అయితే తమ వద్ద బస్సుల సంఖ్య పరిమితంగా ఉందని, కొత్త బస్సులు కొన్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని సజ్జనార్ పేర్కొన్నారు. త్వరలో టీఎస్ఆర్టీసీ 1,016 కొత్త బస్సులు కొననుంది. మరో 300 ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులు సమకూర్చుకోనుంది. రెండేళ్ల కింద భారీగా కుదింపు.. రెండు ఆర్టీసీల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకునే క్రమంలో రెండేళ్ల కింద బస్సు సర్వీసుల సంఖ్యను భారీగా కుదించారు. 2020 ఆగస్టు నాటికి.. తెలంగాణ నుంచి ఏపీకి 746 బస్సులు తిరుగుతుండగా, ఏపీ నుంచి తెలంగాణకు 1,006 బస్సులు (లాక్‌డౌన్‌కు పూర్వం) నడిచేవి. తెలంగాణ బస్సులు ఏపీ పరిధిలో 1,52,344 కి.మీ. తిరుగుతుంటే, ఏపీ బస్సులు తెలంగాణలో 2,64,275 కి.మీ. తిరిగేవి. రెండూ సమంగా ఉండాలని, ఇందుకు లక్ష కి.మీ. పరిధిని, అంతమేర సర్వీసులను కుదించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ అప్పుడు డిమాండ్ చేయగా ఏపీ తగ్గించుకుంది. పీఎఫ్ నిధి వాడుకోవటంతో చిక్కులు ఆర్టీసీ ఉమ్మడిగా ప్రత్యేకంగా పీఎఫ్ ట్రస్టును ఏర్పాటు చేసుకుని సొంతంగా పీఎఫ్ నిధిని నిర్వహిస్తోంది. ఆర్టీసీ విడిపోయినా ఆ ట్రస్టు ఉమ్మడిగానే ఉంది. తెలంగాణ ఆర్టీసీ రూ.1,300 కోట్ల పీఎఫ్ నిధిని వాడేసుకుని బకాయి పడింది. దీంతో పీఎఫ్ కమిషనరేట్ తీవ్రంగా స్పందించి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కానీ, ట్రస్టు చైర్మన్‌గా ఏపీ ఆర్టీసీ ఉన్నందున ఆ నోటీసులు ఏపీఎస్ ఆర్టీసీ పేరుతోనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు, నిధుల విభజనపైనా అధికారులు చర్చించారు. స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం (ఎస్ఆర్బీఎస్), స్టాఫ్ బెన్వెలంట్ ట్రస్టు (ఎస్బీటీ)లు కూడా ఉమ్మడిగానే ఉన్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన నేపథ్యంలో ఈ రెండు మనుగడలో లేవు. వాటిని కూడా విభజించుకునే అంశంపై చర్చించినా కొలిక్కి రాలేదు. దీంతో మరో నెలలో మరో సమావేశం ఏర్పాటు చేసుకుని వాటి విభజన ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. -
ఆర్టీసీ 'డోర్ టు డోర్' పార్సిల్ సర్వీసు
సాక్షి, అమరావతి: లాజిస్టిక్ సేవల ద్వారా ఆదాయం పెంపుదలపై ఆర్టీసీ దృష్టి సారించింది. మొదటగా రాష్ట్రంలో ‘డోర్ టు డోర్’ పార్సిల్ సర్వీసు ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్టీసీలో సాధారణ పార్సిల్ సర్వీసు అందుబాటులో ఉంది. అంటే ఆర్టీసీలోని ఏఎన్ఎల్ పాయింట్‌కు వెళ్లి పార్సిల్ బుక్ చేయాలి. దాన్ని తీసుకునేవారు గమ్యస్థానంలోని ఆర్టీసీ బస్ స్టేషన్‌కు వెళ్లి తీసుకోవాలి. కాగా, ప్రస్తుతం ‘డోర్ టు డోర్’ పార్సిల్ సర్వీసు సేవలనూ ప్రవేశపెట్టాలని ఆర్టీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అంటే ఆర్టీసీని సంప్రదిస్తే ఇంటివద్దకే వచ్చి పార్సిల్/కొరియర్ బుక్ చేసుకుని తీసుకెళ్తారు. గమ్యస్థానంలోనూ నిర్ణీత చిరునామాకు వెళ్లి ఆ పార్సిల్/కొరియర్‌ను అందజేస్తారు. తద్వారా తమ వాణిజ్య సేవలను మరింత విస్తరించడంతోపాటు ప్రజలకు చేరువ కావచ్చన్నది ఆర్టీసీ ఉద్దేశం. అందులో భాగంగా మొదట పార్సిల్ ‘డోర్ డెలివరీ’ సేవలను త్వరలో ప్రవేశపెట్టనుంది. తర్వాత రెండుమూడు నెలలకు ‘డోర్ పిక్ అప్’ సేవలను అందించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. పార్సిల్ సేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి లాజిస్టిక్ సేవల ద్వారా ఆర్టీసీకి చెప్పుకోదగ్గ ఆదాయం సమకూరుతోంది. 2019–20లో మొత్తం రూ.97.44 కోట్లు ఆదాయం వచ్చింది. కరోనా పరిస్థితులతో లాక్డౌన్, ఇతర ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ 2020–21లో లాజిస్టిక్ సేవల ద్వారా రూ.87.24 కోట్లు ఆదాయం రావడం విశేషం. వాటిలో పార్సిల్ సర్వీసుల ద్వారా రూ.46.42 కోట్లు, కొరియర్ సేవల ద్వారా రూ.1.78 కోట్లు, బల్క్ బుకింగ్‌ల ద్వారా రూ.0.53 కోట్లు, కాంట్రాక్టు వాహనాల ద్వారా రూ.17.31 కోట్లు, ఏజెన్సీ సేవల ద్వారా రూ.21.20 కోట్లు వచ్చాయి. ఏజెన్సీ ద్వారా పార్సిల్ సేవలు ఆదాయం పెరిగిన నేపథ్యంలో లాజిస్టిక్ సేవలను మెరుగుపరచాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా తమకున్న వ్యవస్థీకృత సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈ సేవలను సమర్థంగా నిర్వర్తించవచ్చని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. మొదటగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ‘డోర్ టు డోర్’ పార్సిల్/కొరియర్ సేవలను తీసుకురానుంది. మునుముందు మరిన్ని కొత్త తరహా సేవలను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. -
సంక్రాంతికి 1,500 ఆర్టీసీ బస్సులు!
సాక్షి, అమరావతి: ఈ సంక్రాంతి పండక్కి ఆర్టీసీ 1,500 ప్రత్యేక సర్వీసులు తిప్పేందుకు ప్రణాళికలు రూపొందించింది. గత రెండేళ్ల నుంచి 2,200 సర్వీసుల వరకు తిప్పిన ఆర్టీసీ ఈ దఫా కరోనా కారణంగా బస్సులను తగ్గించనుంది. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి సర్వీసులను నడపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. బుధవారం అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులతో ఎండీ కృష్ణబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా సంక్రాంతి పండక్కి ఎన్ని సర్వీసులు నడపాలనే అంశంపైనే చర్చ జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రత్యేక బస్సులపై ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోనున్నారు. అత్యధిక సర్వీసులు హైదరాబాద్‌కు తిప్పేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. ఈ జిల్లాలకు వెళ్లేందుకు ప్రతి ఏటా డిమాండ్ అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉభయగోదావరి జిల్లాలకు ప్రత్యేక బస్సులు అధిక సంఖ్యలో నడపనున్నారు. పండగ తిరుగు ప్రయాణంలోనూ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా బస్సులు నడపనున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాట్లు ఇలా.. ► హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో రద్దీ తగ్గించేందుకు, బస్సుల పార్కింగ్‌కు ఇబ్బందులు లేకుండా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. ► బీహెచ్ఈఎల్లో బస్సుల పార్కింగ్‌కు గతంలో ఆర్టీసీ స్థలం కొనుగోలు చేయడంతో ఇబ్బందుల్లేవని అధికారులు పేర్కొంటున్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే రెగ్యులర్, పండుగ స్పెషల్ బస్సులన్నీ ఎంజీబీఎస్ వెలుపల ఉన్న గౌలిగూడ సీబీఎస్ హాంగర్ (సిటీ బస్ టెర్మినల్) నుంచి బయల్దేరేలా ఏర్పాట్లు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ► విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే అన్ని పండుగ స్పెషల్ బస్సులు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి (ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్, కేపీహెచ్‌బీ, ఎల్బీ నగర్) నడపనున్నారు. ఈ ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఎంజీబీఎస్‌లోకి రాకుండా నేరుగా వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నారు. ► గతేడాది పండక్కి ఆర్టీసీ రూ.67 కోట్ల మేర ఆదాయాన్ని రాబట్టింది. ప్రయాణికులపై భారం మోపకుండా 40% రాయితీతో ప్రత్యేక సర్వీసుల్ని ఆర్టీసీ నడిపింది. ఈ దఫా పండక్కి సొంతూళ్లకు వెళ్లే వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నై, బెంగళూరులకూ ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. -
అక్టోబర్ నుంచి వందశాతం ఆర్టీసీ సర్వీసులు
సాక్షి, తిరుపతి అర్బన్ : జిల్లాలోని అన్ని బస్సు సర్వీసులు అక్టోబర్ నుంచి రోడ్డెక్కనున్నాయి. కరోనా మహమ్మారి ఆరునెలలుగా అన్ని శాఖలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అందులో ఆర్టీసీ ప్రధానమైంది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం మార్చి 21 నుంచి మే 20 వరకు ఆర్టీసీ బస్సులను రద్దు చేసింది. మే 21నుంచి ఆర్టీసీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చినప్పటికీ 30శాతం బస్సులకు మించి నడపలేని పరిస్థితి. మరోవైపు భౌతికదూరంలో భాగంగా 50 శాతం సీట్లను తొలగించి ఆర్టీసీ ప్రయాణికులకు సేవలు అందించింది. (ప్రైవేట్ బస్సుల్లో అధిక చార్జీలకు బ్రేకులు) ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నష్టాలు మూటగట్టుకుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ చార్జీలు పెంచకపోవడం అభినందనీయం. అక్టోబర్ నుంచి అన్ని ఆర్టీసీ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు 100శాతం సీట్లతో బస్సులను తిప్పాలని అధికారులు భావిస్తున్నారు. దాంతో ఆర్టీసీ బస్సుల్లో తొలగించిన సీట్లను సరిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1550 సర్వీసులున్నాయి. అయితే 500కు మించి బస్సులను కరోనా సమయంలో నడపలేకపోయారు. అ్రల్టాడీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో మాత్రమే సీట్లను తొలగించారు. పల్లెవెలుగు సర్వీసుల్లో ఇన్‌టూ మార్క్‌తోనే 50శాతం సీట్లతో బస్సులను తిప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని ఆయా డిపోలకు చెందిన గ్యారేజ్ మెకానిక్స్ తొలగించిన సీట్లను జోరుగా భర్తీ చేస్తున్నారు. మొత్తం మీద ఆర్టీసీకి మళ్లీ పూర్వవైభవం రానుంది. -
ఉద్దానం కిడ్నీ బాధితులకు తీపి కబురు
కవిటి: ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులకు ప్రభు త్వం ఓ తీపి కబురు అందించింది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ నిర్ణ యం తీసుకుంది. ఇప్పటికే ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుంది. జిల్లాలోని 38 మండలాల పరిధిలో 2856 మంది కిడ్నీవ్యాధిగ్రస్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించనున్నారు. దీనివల్ల జిల్లాలోని ఆ రు ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డయాలసిస్ రోగులకు ఉచిత ప్రయాణసేవలు అందనున్నాయి. వీటితో పాటు సీరం క్రియేటినైన్ పరిమితికి మించి ఉండి కిడ్నీవ్యాధి ముప్పు అధికంగా ఉన్నవా రుకూడా నిపుణులైన వైద్యుల సాయం తీసుకునేందుకు విశాఖపట్నం తదితర సుదూర ప్రాంతాలకు ఆరీ్టసీల్లో ఉచిత ప్రయాణానికి వీలు కలుగుతుంది. కిడ్నీ బాధితులకు సాయం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు నెల కు రూ.10,000 పెన్షన్ అందించడం బాధిత కు టుంబాలకు అత్యంత సంతోషానిచ్చింది. అనంతర కాలంలో సీరం క్రియేటినైన్ 5 కు మించి ఉ న్న బాధితులకు కూడా నెలకు రూ.5000 పెన్షన్, నికంగా డయాలసిస్ కేంద్రాలకు వెళ్లేందుకు ఉచి త అంబులెన్స్ సేవలతో పాటు తాజాగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నిర్ణయం తీసుకోవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్థానికులు వేనోళ్ల కీర్తిస్తున్నారు. సీఎం జగన్ ఆపద్బాంధవుడు వైఎస్ జగన్ మా వద్దకు వచ్చి కష్టాలు తెలుసుకున్నా రు. ఆనాడు ఇచ్చిన హామీ మేరకు మాకు చెప్పినవన్నీ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో పడుతున్న కష్టాలను తొలగించేలా కిడ్నీవ్యాధిగ్రస్తులకు ఊరట నిచ్చేవిధంగా ఆదుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ఉచితంగా పాస్‌లు అందించే నిర్ణయం సంతోషం కలిగిస్తోంది. – నర్తు తరిణమ్మ, కొండిపుట్టుగ, కిడ్నీ బాధితురాలు, కవిటి మండలం ఆదేశాలు అందిన వెంటనే చర్యలు కిడ్నీవ్యాధిగ్రస్తులకు ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా శాఖాపరమైన ఆదేశాలు వచ్చిన వెంటనే నిబంధనల మేరకు బాధితులకు సేవలందించేందుకు చర్యలు తీసుకుంటాం. – అంధవరపు అప్పలరాజు, రీజనల్ మేనేజర్, శ్రీకాకుళం. -
ప్రయాణికుల కస్సుబస్సు
ఆర్టీసీ బస్సులు ఆదివారం రూటు మార్చాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులన్నీ తిరుపతికి మళ్లాయి. సీఎం సభకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ తనవంతు బాధ్యతను భుజాలకెత్తుకుంది. జిల్లావాసులను పక్కన పెట్టి,చివరకు తిరుమలకు వచ్చే యాత్రికులను సైతం లెక్కచేయలేదు. దీంతో ఉన్నఅరకొర బస్సుల్లో ఎక్కలేక, ప్రయాణించలేకప్రయాణికులు, యాత్రికులునానాఅగచాట్లు పడ్డారు. తిరుపతి సిటీ: జిల్లాలోని గ్రామీణ ప్రాం తాలకు తిరిగే ఆర్టీసీ బస్సులను తిరుపతిలో సీఎం చేపట్టిన బహిరంగ సభకు మళ్లించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు బస్సుల్లేక నానా అవస్థలు పడ్డారు. ఉదయం పూట సొంత పనుల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు, మండల కేంద్రాలకు వచ్చిన ప్రజలు తిరిగి వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో నానా తంటాలుపడ్డారు. జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల్లో 1,246 బస్సు సర్వీసులు ఉన్నాయి. వాటిలో 750 బస్సులను ధర్మపోరాట దీక్షకు కార్యకర్తలను, డ్వాక్రా మహిళలను తరలించేందుకు వినియోగించారు. దీంతో ఆర్టీసీకి కూడా కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. దీంతో అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి మరో దెబ్బ పడింది. ఎన్నికల కోడ్ ఉల్లఘించిన ఆర్టీసీ అధికారులు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మే 25వ తేదీ దాకా కోడ్ అమలులో ఉంది. మొదట 1,005 బస్సులు కావాలని టీడీపీ నేతలు, రవాణా శాఖా మంత్రి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బస్సులను ప్రభుత్వ ఛలానా ద్వారా ఇవ్వడానికి కుదరదని అధికారులు రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఎలాగైనా బస్సులు పంపించి తీరాలని ఆర్టీసీ అధికారులపై మండిపడ్డారు. ఒకానొక దశలో రీజనల్ మేనేజర్ చెంగల్‌రెడ్డి చేతులెత్తేయడంతో నెల్లూరు జోన్ ఈడీ మహేశ్వర తిరుపతికి వచ్చి రెండు రోజులపాటు మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర పార్టీ నేతలు, ఆర్టీసీ ఆర్ఎం ఇతర అధికారులతో చర్చించారు. ఆర్టీసీ అధికారుల ఐడియా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తే తాము ఎక్కడ ఇరుక్కుంటామనే భయంతో ఆ పార్టీ నేతలకు ఆర్టీసీ అధికారులే ఐడియా అందించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మండలాధ్యక్షులు, జెడ్పీటీసీలు బస్సులు మండలానికి ఇన్ని చొప్పున కావాలని ఆర్టీసీ అధికారులను కోరినట్లు పేర్కొన్నారు. వారిచేతనే నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా 750 బస్సులకు కోటి 20 లక్షల డబ్బును అధికార పార్టీ నేతల నుంచి వసూలు చేశారు. ఆదివారం సాయంత్రం వరకు కూడా బస్సుల కోసం డబ్బులు చెల్లించని అధికార పార్టీ నేతలు సోమవారం ఉదయానికల్లా బస్సులను ఎలా గ్రామాలకు పార్టీ కార్యకర్తలు, మహిళల కోసం పంపించారో.. దీన్ని బట్టి చూస్తే ఆర్టీసీ అధికారులు అధికార పార్టీ నేతలు, మంత్రుల పట్ల ఎంత స్వామి భక్తి ప్రదర్శించారో దీన్నిబట్టి మనకు ఇట్టే తెలుస్తోంది. మరో 400 బస్సులను పక్క జిల్లాల నుంచి తెప్పించుకున్నారు. మరో 200 బస్సులు తమిళనాడు నుంచి తెప్పించుకుని తిరుపతి సభకు జనాన్ని తరలించారు. తిరుమలలో అవస్థలు పడ్డ ప్రయాణికులు తిరుమల నుంచి తిరుపతికి భక్తులను తరలించేందుకు కావాల్సినన్ని బస్సుల్లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా ఇతర డిపోల నుంచి తిరుమలకు రావాల్సిన బస్సులన్నింటిని రద్దు చేశారు. వాటన్నింటిని చంద్రబాబు బహిరంగ సభకు మళ్లించారు. దీంతో తిరుమల నుంచి ఒక్కొక్క బస్సులో సీటింగ్ కెపాసిటీ ప్రకారం 45 మంది ప్రయాణికులను ఎక్కించాల్సి ఉండగా సోమవారం ఒక్కొక్క బస్సులో 70 నుంచి 80 మంది భక్తులను కుక్కి తిరుపతికి పంపారు. హఠాత్తుగా రద్దు.. జిల్లా వ్యాప్తంగా 750 బస్సులను రోజువారీ తిరుగుతున్న రూట్లలో రద్దు చేసి తిరుపతిలో జరిగే బహిరంగ సభకు పంపారు. దీంతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో, పట్టణాల్లో ఉన్న ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. ఆర్టీసీ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉన్నట్టుండి బస్సులను రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆర్టీసీ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రయాణాలను వాయిదా వేసుకోలేక ట్యాక్సీలు, ఆటోల్లో వారు చేరాల్సిన ప్రాంతాలకు ఎట్టకేలకు అవస్థలు పడుతూ చేరుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
చదువుకోవాలంటే సాహసమే!
- గ్రామీణ విద్యార్థులకు తప్పని ఇబ్బందులు - బస్సు పైకెక్కి ప్రమాదకర ప్రయాణం మెదక్: మారుమూల ప్రాంతాల విద్యార్థులు చదువుకోవాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే! ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు.. సరైన రవాణా సౌకర్యాలు లేక బస్సుల పైకెక్కి ప్రయాణాలు చేస్తున్నారు. మెదక్ పట్టణంలో పదో తరగతి మొదలుకొని పాలిటెక్నిక్ కాలేజీ, మహిళా డిగ్రీ కళాశాల, బాలుర కళాశాల, డిగ్రీ కాలేజీ, గురుకుల పాఠశాలలు, ఐటీఐలతో పాటు ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలున్నాయి. దీంతో నిత్యం దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులు నిజామాబాద్ జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంతో పాటు మెదక్, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, చేగుంట, నార్సింగ్ తదితర మండలాల విద్యార్థులు బస్సుల్లో మెదక్ వస్తుంటారు. కాగా, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను నడపకపోవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు బండ్ల పైకెక్కి ప్రయాణిస్తున్నారు. దీంతో ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో బూర్గుపల్లి-వాడి బస్సు మెదక్ వస్తుండగా కొందరు విద్యార్థులు టాప్ పైకి ఎక్కారు. కరెంట్ సర్వీస్ వైర్లు విద్యార్థుల మెడకు తగలడంతో విద్యార్థి కిందపడిపోయాడు. అదేవిధంగా బస్సు డోర్ వద్ద నిలబడి ప్రయాణించే విద్యార్థులు జారి కిందపడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. మారుమూల పల్లెలకు సర్వీస్ నిల్ కొన్ని మారుమూల పల్లెలకు ఆర్టీసీ సర్వీసులను నడపడం లేదు. దీంతో పేదవిద్యార్థులు ప్రాథమిక చదువులతో సరిపెడుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను నడపాలని ప్రజలు కోరుతున్నారు. -
పుష్కరాలకు ఆర్టీసీ సేవలు భేష్!
* పుష్కర నగర్ల నుంచి ఘాట్ల వరకు ఉచిత ప్రయాణం * 150 బస్సులను తిప్పుతున్న అధికారులు * ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్న ఆర్టీసీ ఆర్ఎం * దూరప్రాంతాలకు సర్వీసుల పెంపు అమరావతి (పట్నంబజారు) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు భక్తులు, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాలకు 905 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ అధికారులు, మరో 500 బస్సులను అదనంగా అందుబాటులో ఉంచుకున్నారు. పుష్కరనగర్ల ఏర్పాటుతో బస్సులన్నీ సుమారు 2 లేదా 3కిలో మీటర్లు దూరంలోనే నిలిచిపోతున్నాయి. దీనిని గమనించిన ఏపీఎస్ ఆర్టీసీ రీజయన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి పుష్కరనగర్ల నుంచి ప్రయాణికులు, భక్తులను ఘాట్ల వద్దకు ఉచితంగా దింపేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే అమరావతిలోని పుష్కర నగర్ల నుంచి ఘాట్‌కు 60 బస్సులు, మంగళగిరి నుంచి ఎయిమ్స్, తాడేపల్లికి 30 బస్సులు, ఎయిమ్స్ నుంచి ఉండవల్లికి 15, విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి 15, కేసీ కెనాల్ రైల్వేస్టేషన్ నుంచి తాడేపల్లి, ఉండవల్లికి 30 బస్సులను తిప్పుతున్నారు. భక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. దూరప్రాంతాలకు ప్రత్యేక బస్సులు... నిత్యం తిరిగే సర్వీసులతో పాటు బెంగళూరుకు 7, చెన్నైకి 9, హైదరాబాద్‌కు 25, తిరుపతికి 2 సర్వీసులతో పాటు కర్నూలు, కడప, చిత్తూరు. విశాఖపట్నంలకు అవసరాన్ని బట్టి బస్సుల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్ ద్వారా పుష్కర స్పెషల్ టికెట్ ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. వీటితో పాటుగా ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. -
పుష్కరాలకు ఆర్టీసీ సేవలు భేష్!
* పుష్కర నగర్ల నుంచి ఘాట్ల వరకు ఉచిత ప్రయాణం * 150 బస్సులను తిప్పుతున్న అధికారులు * ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్న ఆర్టీసీ ఆర్ఎం * దూరప్రాంతాలకు సర్వీసుల పెంపు అమరావతి (పట్నంబజారు) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు భక్తులు, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాలకు 905 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ అధికారులు, మరో 500 బస్సులను అదనంగా అందుబాటులో ఉంచుకున్నారు. పుష్కరనగర్ల ఏర్పాటుతో బస్సులన్నీ సుమారు 2 లేదా 3కిలో మీటర్లు దూరంలోనే నిలిచిపోతున్నాయి. దీనిని గమనించిన ఏపీఎస్ ఆర్టీసీ రీజయన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి పుష్కరనగర్ల నుంచి ప్రయాణికులు, భక్తులను ఘాట్ల వద్దకు ఉచితంగా దింపేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే అమరావతిలోని పుష్కర నగర్ల నుంచి ఘాట్‌కు 60 బస్సులు, మంగళగిరి నుంచి ఎయిమ్స్, తాడేపల్లికి 30 బస్సులు, ఎయిమ్స్ నుంచి ఉండవల్లికి 15, విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి 15, కేసీ కెనాల్ రైల్వేస్టేషన్ నుంచి తాడేపల్లి, ఉండవల్లికి 30 బస్సులను తిప్పుతున్నారు. భక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. దూరప్రాంతాలకు ప్రత్యేక బస్సులు... నిత్యం తిరిగే సర్వీసులతో పాటు బెంగళూరుకు 7, చెన్నైకి 9, హైదరాబాద్‌కు 25, తిరుపతికి 2 సర్వీసులతో పాటు కర్నూలు, కడప, చిత్తూరు. విశాఖపట్నంలకు అవసరాన్ని బట్టి బస్సుల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్ ద్వారా పుష్కర స్పెషల్ టికెట్ ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. వీటితో పాటుగా ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. -
ఆ దుప్పట్లు ఉతికేది ఎన్ని నెలలకో?
ఆర్టీసీ ఏసీ బస్సుల్లో రాత్రి ప్రయాణాలు నరకం.. క్లీనింగ్ కాంట్రాక్టు నిర్వహణ లోపభూయిష్టం పట్టించుకోని యాజమాన్యం సాక్షి, హైదరాబాద్: సురక్షితమైన.. సుఖవంతమైన ప్రయాణం ఆర్టీసీతోనే సాధ్యం... ఆర్టీసీ చెప్పే ప్రధాన స్లోగన్లలో ఇది ముఖ్యమైంది. ఇందులో సురక్షితం మాటెలా ఉన్నా.. సుఖవంతమైన ప్రయాణం మాత్రం ప్రయాణికులకు కరువవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏసీ బస్సుల్లో రాత్రివేళ ప్రయాణాలు నరకాన్ని చూపుతున్నాయి. ఏసీ బస్సుల్లో ప్రయాణిస్తే అంటువ్యాధులు ఫ్రీ అని ప్రయాణికులంటున్నారంటే సేవల తీరెలా ఉందో విదితమవుతోంది. ఇందుకు కారణం బస్సుల్లో అందించే బ్లాంకెట్లు, బెడ్షీట్లు దుర్వాసన వెదజల్లడంతోపాటు అపరిశుభ్రతతో కూడుకోవడమే. ప్రైవేటు సర్వీసులకంటే మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రయాణికుల ఆదరణ చూరగొనాల్సిన ఆర్టీసీ సేవలు అథమంగా ఉంటున్నాయి. రాష్ట్రవిభజన తర్వాత ఆర్టీసీ ఏపీలో 307 ఏసీ బస్సుల్ని వివిధప్రాంతాలకు నడుపుతోంది. ఇందులో వెన్నెల, గరుడ ప్లస్ బస్సుల్లో సేవలు ఫర్వాలేదనిపిస్తే, ఇంద్ర, గరుడ బస్సుల్లో రాత్రివేళ ప్రయాణమంటే బెంబేలెత్తిపోవాల్సిందే. చిరిగిన బ్లాంకెట్లు, దుర్వాసన వెదజల్లే ఉలెన్ బ్లాంకెట్లు ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణికులు చర్మవ్యాధులు, అంటువ్యాధుల బారిన పడుతున్నారు. ప్యాసింజర్ సెస్ పేరిట టికెట్‌పై రూ.3 నుంచి రూ.5 వసూలుచేస్తూ ఏటా రూ.250 కోట్లవరకు భారం మోపుతున్నా.. ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలు అథమంగా ఉంటున్నాయి. బస్సెక్కితే సీట్లలో నల్లులు, అధ్వాన సేవలంటూ సాక్షాత్తూ రవాణామంత్రి శిద్ధా రాఘవరావు వ్యాఖ్యానిస్తున్నారంటే.. పరిస్థితేంటో విదితమవుతోంది. రైళ్లలో దుప్పట్లు ఉతికేది రెండు నెలలకోసారి మాత్రమేనని సాక్షాత్తూ రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్‌సిన్హా రాజ్యసభలో పేర్కొన్నారంటే.. ఇక ఆర్టీసీబస్సుల్లో దుప్పట్లను ఉతికేది ఎన్ని నెలలకోననే సందేహం తలెత్తుతోంది. ప్రైవేటుకు అప్పగించడం వల్లే.. ఏసీ బస్సుల నిర్వహణనంతటినీ ప్రైవేటువ్యక్తుల చేతుల్లో పెట్టడమే సేవలు అథమంగా ఉండడానికి ప్రధాన కారణం. ఏటా టెండర్లద్వారా ఆర్టీసీ ఏసీ బస్సుల క్లీనింగ్, బ్లాంకెట్ల క్లీనింగ్, అటెండర్ వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. కాంట్రాక్టు పొందినవారు ఏసీ బస్సుల నిర్వహణను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. రూ.కోట్ల సొమ్ము ప్రైవేటు కంపెనీలకు చెల్లిస్తున్నా.. సేవలు ఘోరంగా ఉంటున్నాయి. ఏసీ బస్సుల్లో సీటుకొకటి చొప్పున రాత్రిపూట ప్రయాణంలో అందించే బ్లాంకెట్లను ఒక ప్రయాణానికే వినియోగించాలి. కానీ బస్సులో డ్రైవర్‌కు సహాయకుడిగా ఉండే అటెండర్ కాంట్రాక్టు పొందిన సంస్థకు చెందినవారవడంతో ప్రయాణికులు దిగిపోగానే.. బ్లాంకెట్లు, బెడ్షీట్లను మడతపెట్టి తిరుగు ప్రయాణానికీ వాటినే వాడుతున్నారు. క్లీనింగ్ లేకుండా రెండు,మూడు దఫాలు ఇలా వినియోగించడంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఫిర్యాదుకు లేని అవకాశం.. ఏసీ బస్సుల్లో అసౌకర్యాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రయాణికులకు అవకాశమే లేకుండాపోయింది. ప్రయాణికులనుంచి ఫీడ్‌బ్యాక్ తెలుసుకునే అవకాశాన్ని కల్పించకపోగా.. కనీసం ఓ లాగ్‌బుక్ అందుబాటులో ఉంచడమో లేదా టోల్‌ఫ్రీ నంబర్‌ద్వారా ఫిర్యాదు చేసేందుకూ తావులేదు. ఒకవేళ ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు కాంట్రాక్టు సంస్థకు వత్తాసు పలుకుతున్నారేతప్ప పట్టించుకోవట్లేదనేది ప్రయాణికుల భావనగా ఉంది. రోజుకు సగటున ఏపీలోని ఏసీ బస్సుల్లో పదివేల మంది ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో సేవలు మెరుగ్గా ఉంటే ప్రైవేటు బస్సుల్ని ఎందుకు ఆశ్రయిస్తామని పలువురు అంటున్నారు. ఏసీ బస్సుల్లో సేవలపై వివరణనిచ్చేందుకు ఆర్టీసీ అధికారులు సుముఖత వ్యక్తపరచకపోవడం గమనార్హం. ఫంగల్ ఇన్ఫెక్షన్లు అధికం.. దుస్తులు లేదా పడకల్ని పరిశుభ్రంగా ఉంచకపోతే కంటేజియస్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు అవకాశముండే జబ్బులొస్తాయి. ఆర్టీసీ బస్సుల విషయానికొస్తే సీట్లపై వేసే దుస్తులుగానీ, టవల్స్గానీ మార్చకపోతే ఒకరినుంచి ఒకరికి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశమెక్కువ. అంతేగాక స్కిన్ అలర్జీలు వచ్చే వీలుంటుంది. ఒక్కోసారి చికెన్‌ఫాక్స్ ఉన్నవాళ్లు ప్రయాణించిన సందర్భాల్లో అలాంటి దుప్పట్లను శుభ్రం చేయకుంటే మరొకరికి వచ్చే అవకాశం ఎక్కువ. -డా.ఉమ,చర్మవ్యాధి నిపుణులు, హైదరాబాద్ -
మూడోవంతు బస్సులు రాజమండ్రికే..
సగం రూట్లలో ప్రైవేటు వాహనాలే దిక్కు ఒంగోలు : పుష్కరాల పుణ్యమాని మూడోవంతు బస్సులు రాజమండ్రికే పరిమితమయ్యాయి. దీంతో సగం రూట్లలో ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. ప్రైవేటు వాహనాలే ప్రజలకు దిక్కయ్యాయి. జిల్లాలో మొత్తం 750 సర్వీసులున్నాయి. వాటిలో పాతిక బస్సులు ఎప్పుడూ సర్వీసింగ్‌లో ఉంటుంటాయి. అంటే తిరిగేది కేవలం 725 మాత్రమే. వాటిలో 120 సర్వీసులు సుదూర ప్రాంతాలైన హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు తిరుగుతూ ఉంటాయి. వాటిని మినహాయిస్తే మిగిలిన బస్సుల సంఖ్య 605. వీటిలో మరో 15 సర్వీసులు అద్దెకు ఇచ్చారు. అంటే మిగిలిన సర్వీసుల సంఖ్య 590. వాటిలో 70 బస్సులను పుష్కరాల ప్రారంభంలోనే రాజమండ్రికి పంపారు. పుష్కరాలు జరిగినంత కాలం ఈ బస్సులన్నీ రాజమండ్రి డిపో పరిధిలోనే సేవలు అందిస్తాయి. రోజువారీ మరో 50 బస్సులు జిల్లానుంచి పుష్కరాలకు ప్రయాణీకులను తీసుకొని వెళ్తున్నాయి. అదే విధంగా మరో 50 బస్సులు రాజమండ్రి నుంచి ఒంగోలు వస్తున్నాయి. దీని ప్రకారం మొత్తం 170 బస్సులు రాజమండ్రికి పంపిస్తున్నారు. ఇవి కాకుండా ఇక ప్రత్యేకంగా ఎవరైనా బస్సులు బుక్ చేసుకుంటే రాజమండ్రికి 34 గంటలు చొప్పున బస్సులను అద్దెకు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే గురువారం మరో 50 పల్లెవెలుగు సర్వీసులను రాజమండ్రికి పంపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో అదనంగా మరో 50 సర్వీసులు రాజమండ్రికి బయల్దేరాయి. దీంతో 230 బస్సులు పుష్కరాలకే కేటాయించినట్లయింది. ఇక మిగిలింది కేవలం 360. అంటే మొత్తం మూడు వంతుల్లో రెండు వంతులు మాత్రమే జిల్లాలో తిరుగుతున్నాయి. ఒక వంతు బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీకి ఆదాయం తక్కువగా ఉన్న రూట్లలో బస్సులను తగ్గించేశారు. దీంతో ఆయా మార్గాలలో ప్రజలకు ప్రైవేటు వాహనాలే దిక్కుగా మారిపోయాయి. శుక్ర, శనివారాలలో రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో 50 సర్వీసులను జిల్లానుంచి పుష్కరాలకు తిప్పేందుకు అధికారులు యత్నిస్తుండడం గమనార్హం. -
126 ఆర్టీసీ సర్వీసులు రద్దు
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: భారీ వర్షాలకు వాగులు, చెరువుల గట్లు తెగుతుండడంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా శుక్రవారం 126 బస్సు సర్వీసులను రద్దు చేశారు. నెక్ పరిధిలోని తొమ్మిది డిపోలలో అధికంగా శ్రీకాకుళం, పలాస డిపోల పరిధిలో ఈ సర్వీసులను రద్దుచేశారు. స్థానిక ఆర్ఎం కార్యాలయం ఆవరణలో ఆర్ఎం అప్పన్న ఆధ్వర్యంలో సీటీఎం సుధాకర్, డీప్యూటీ సీటీఎంలు శ్రీనివాసరావు, సత్యనారాయణ, పీఓ మల్లికార్జునరాజుతో శుక్రవారం సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎం అప్పన్న‘ న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ నదులు, నీటి ప్రవాహాల పరిసర ప్రాంతాలకు వెళ్లే రూట్లను రద్దు చేసినట్లు తెలిపారు. విజయగనరం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలకు పార్వతీపురం డిపో నుంచి వెళ్లే 12 సర్వీసులు, విజయనగరం నుంచి 10, సాలూరు డిపో నుంచి 9 బస్సుల సర్వీసులను గురు, శుక్రవారాల్లో రద్దు చేసినట్టు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో రద్దు చేసిన వాటిలో శ్రీకాకుళం-1 డిపోనుంచి నుంచి 16, శ్రీకాళకుశం-2 నుంచి 16, పలాసా-20, పాలకొండ-10, టెక్కలి-9 బస్సులను రద్దు చేశామని తెలిపారు. దీంతో రోజుకు రూ. 10 లక్షలు చొప్పున ఆదాయానికి గండి పడిందని పేర్కొన్నారు. -
నిలిచిన ఆర్టీసీ బస్సులతో ప్రయాణికుల వెతలు
హైదరాబాద్,న్యూస్‌లైన్: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుండడంతో రాయలసీమ, కోస్తాంధ్రాలవైపు వెళ్లే ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఎనిమిది రోజులుగా ఆర్టీసీ సర్వీసులు నడవకపోవడంతో అటువైపు ప్రయాణం సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కోస్తావైపు ఓ మోస్తరుగా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నప్పటికీ రాయలసీమ వైపు వెళ్లాల్సిన బస్సులన్నీ పూర్తిగా నిలిచిపోయి డిపోలకే పరిమితమయ్యాయి. గత శనివారం నుంచి ఆర్టీసీ అధికారులు కర్నూలువరకు అరకొరగా బస్సులను నడుపుతున్నారు. బుధవారం రాత్రి 8గంటల వరకు ఎంజీబీఎస్ నుంచి 2588 బస్సులు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండగా కేవలం 2170 మాత్రమే వెళ్లాయి. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి 2648 బస్సులు ఎంజీబీఎస్‌కు రావాల్సి ఉండగా 2137 మాత్రమే వచ్చాయి. కాగా ఈనెల 9, 10,11 తేదీల్లో వరుస సెలవుల కారణంగా రాయలసీమ, కోస్తాంధ్ర వైపు వెళ్లే ఆర్టీసీ షెడ్యూల్డ్ సర్వీసులకు ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ముందస్తుగా అడ్వాన్స్‌గా రిజర్వేషన్ కల్పించడంతో గురువారం షెడ్యూల్డ్ బస్సుల సీట్లు అన్నీ రిజర్వయ్యాయి. గురువారం పరిస్థితిని బట్టి బస్సులు నడిపిస్తామని, రాయలసీమ వైపు బస్సులు నడపలేని పక్షంలో ప్రయాణికులకు డబ్బులు తిరిగి చెల్లిస్తామని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. -
డిపోలకే పరిమితం అయిన ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్ : సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ఆ ప్రాంతానికి వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఇది మరింత కుంగదీస్తోంది. కోస్తా, రాయలసీమకు వెళ్లాల్సిన బస్సులను ఉద్యమం కారణంగా నిలిపేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంజీబీఎస్ నుంచి రాయలసీమ జిల్లాలకు రోజూ 710 బస్సులు నడస్తుండగా గత అయిదు రోజులుగా సర్వీసులన్నీ రద్దయ్యాయి. కాగా శనివారం నుంచి ఒంగోలు, నెల్లూరు, వైపు 90 శాతం, విజయవాడ, గుంటూరు వైపు 75 శాతం ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఉభయ గోదావరి జిల్లాల వైపు 50 శాతం, విశాఖపట్నం వైపు 25 శాతం బస్సులను అధికారులు రద్దు చేశారు. ప్రయాణికులు గత్యంతరం లేక రైలు, విమానాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. మరోవైపు నిన్న రాత్రి నుంచి కర్నూలు జిల్లాకు ఆర్టీసీ సర్వీసులను పునరుద్దరించారు. కాగా సీమాంధ్ర జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు సోమవారం కూడా డిపోలకే పరిమితం అయ్యాయి. విజయనగరం, పార్వతీపురం డిపోల్లోని బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ డ్రైవర్లు, ఉద్యోగుల మానవహారం నిర్వహించారు. రాయగడ, కోరాపుట్, జైపూర్ సహా ఒడిశాకు సర్వీసులు నడవటం లేదు. మరోవైపు పార్వతిపురం రైల్వేస్టేషన్లో ఈరోజు ఉదయం సమైక్యవాదులు రైల్‌రోకో చేపట్టారు. దుర్గ్-విశాఖ ప్యాసింజర్ రైలును ఆందోళనకారులు అడ్డుకున్నారు. విశాఖ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. మద్దిలపాలెం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు రిలే దీక్షలకు దిగారు. బంద్ కారణంగా నేడు ఏయూలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.