గోలీసోడా–2లో సముద్రఖని
తమిళసినిమా: గోలీసోడా–2లో నటుడు, దర్శకుడు సముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మధ్య కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, దర్శక నిర్మాతగా వరుస విజయాలను అందుకుంటున్న సముద్రఖని తాజాగా నటిస్తున్న చిత్రం గోలీసోడా– 2. సాధారణంగా విజయం సాధించిన చిత్రాలన్నింటి కీ రెండవ భాగం రూపొందవు. అలా కొన్ని చిత్రాలకే అవకాశం ఉంటుంది. 2014లో చిన్న చిత్రంగా తెరకెక్కి పెద్ద విజయం సాధించిన చిత్రం గోలీసోడా. దానికి సృష్టికర్త ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్మి ల్టన్. ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టిన గోలీసోడా చిత్రం తాజాగా రెండవ భాగానికి దారి తీసింది.
ఎస్. విజయ్‌మిల్టన్ తన రఫ్‌నోట్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో గోలీ సోడా–2ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆయన ప్రకటించగానే చిత్ర పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందట. దీని గురించి దర్శక నిర్మాత విజయ్‌మిల్టన్ తెలుపుతూ ఇది ప్రధానంగా నాలుగు పాత్రల చుట్టూ తిరిగే కథా చిత్రంగా ఉంటుందన్నారు. అందులో కీలకమైన పాత్రలో సముద్రఖని నటిస్తున్నారని చెప్పారు. గోలీసోడా చిత్రంలో ఏటీఎం పాత్ర ఎంత కీలకంగా ఉందో, అంత ప్రాముఖ్యం పార్టు–2లో సముద్రకని పాత్ర ఉంటుందన్నారు. ఇందులో ఆయన సస్పెండ్ అయిన కానిస్టేబుల్‌గా నటిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా గోలీసోడా–2లో పలు ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకుంటాయని విజయ్ మిలన్ అన్నారు.