Sakshi Premier League
-
సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు
-
విజేత గౌతమ్ జూనియర్ కాలేజి
లాలాపేట: డిఫెండింగ్ చాంపియన్ గౌతమ్ జూనియర్ కాలేజి (ఈసీఐఎల్) జట్టు తెలంగాణ రీజియన్ సాక్షి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీలో టైటిల్ నిలబెట్టుకుంది. హబ్సిగూడలోని ఐఐసీటీ మైదానంలో జరిగిన జూనియర్ విభాగం ఫైనల్లో గౌతమ్ కాలేజి జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఎస్ఆర్ఆర్ జూనియర్ కాలేజి (మంచిర్యాల) జట్టుపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్ఆర్ కాలేజి 11 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది. గౌతమ్ కాలేజీ స్పిన్నర్ డి.మనీశ్ రెండు వికెట్లు పడగొట్టాడు. టోర్నీ మొత్తంలో మనీశ్ 12 వికెట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. అనంతరం గౌతమ్ కాలేజి జట్టు కేవలం. 4.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసి గెలిచింది. అన్విత్ రెడ్డి 11 బంతుల్లో 24 పరుగులు చేశాడు. టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన అన్విత్ రెడ్డి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. హెచ్‌సీఏ అండర్–14, అండర్–16 లీగ్‌లలో కూడా అన్విత్ రెడ్డి తన సత్తా చాటుకున్నాడు. బాలాజీకి ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించింది. సీనియర్ విభాగంలో భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజి (సైనిక్‌పురి) జట్టు టైటిల్ సొంతం చేసుకుంది. ఫైనల్లో భవాన్స్ జట్టు 35 పరుగుల తేడాతో వాగ్దేవి డిగ్రీ కాలేజి (మంచిర్యాల) జట్టును ఓడించింది. ముందుగా భవాన్స్ జట్టు 15 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు సాధించింది. రాహుల్ 36 బంతుల్లో 71 పరుగులు చేశాడు. అనంతరం వాగ్దేవి కాలేజి 14.4 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ రెడ్డికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఫైనల్’ అవార్డులు దక్కాయి. జూనియర్, సీనియర్ విభాగాల్లో విజేతగా నిలిచిన జట్లకు రూ. 25 వేలు చొప్పున... రన్నరప్ జట్లకు రూ. 15 వేలు చొప్పున నగదు పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి మల్లా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విన్నర్స్, రన్నరప్ జట్లకు ట్రోఫీలను అందజేశారు. అబ్బాయిలకే కాకుండా అమ్మాయిలకు కూడా టోర్నీ లు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ రాణి రెడ్డి కూడా పాల్గొన్నారు. -
Sakshi Premier League 2023: ఫైనల్లో ఎస్ఆర్ఆర్, గౌతమ్ కాలేజీ జట్లు
ఘట్కేసర్: తెలంగాణ రాష్ట్ర స్థాయి సాక్షి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ జూనియర్ విభాగంలో ఎస్ఆర్ఆర్ కాలేజి (మంచిర్యాల), గౌతమ్ జూనియర్ కాలేజి (ఈసీఐఎల్) జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. సీనియర్ విభాగంలో వాగ్దేవి డిగ్రీ కాలేజి (మంచిర్యాల), భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజి (సైనిక్‌పురి) జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఫైనల్స్ నేడు జరుగుతాయి. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం ప్రతాప సింగారంలోని బాబురావు సాగర్ మైదానంలో ఈ టోర్నీ జరుగుతోంది. సోమవారం జరిగిన జూనియర్ విభాగం తొలి మ్యాచ్‌లో ఎస్ఆర్ఆర్ కాలేజి తొమ్మిది వికెట్లతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజి (వరంగల్)పై గెలిచింది. ముందుగా పాలిటెక్నిక్ కాలేజి 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. అనంతరం ఎస్ఆర్ఆర్ కాలేజి 7.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 89 పరుగులు చేసి గెలుపొందింది. ఎస్ఆర్ఆర్ ప్లేయర్ కృష్ణతేజ 25 బంతుల్లో 52 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గౌతమ్ జూనియర్ కాలేజి 67 పరుగుల తేడాతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజి (వరంగల్)ను ఓడించింది. ముందుగా గౌతమ్ కాలేజి 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. అన్విత్ రెడ్డి 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అనంతరం పాలిటెక్నిక్ కాలేజి 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 52 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. సీనియర్ విభాగం తొలి మ్యాచ్‌లో వాగ్దేవి డిగ్రీ కాలేజి ఎనిమిది వికెట్లతో ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజి (ఖమ్మం)పై నెగ్గింది. ముందుగా ఎస్ఆర్బీజీఎన్ఆర్ కాలేజి 10 ఓవర్లలో 9 వికెట్లకు 74 పరుగులు చేయగా... వాగ్దేవి కాలేజి 6 ఓవర్లలో 2 వికెట్లకు 75 పరుగులు చేసి గెలిచింది. సాయి 16 బంతుల్లో 38 పరుగులు చేశాడు. సీనియర్ విభాగం రెండో మ్యాచ్‌లో భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజి ఐదు వికెట్లతో ఎస్ఆర్బీజీఎన్ఆర్ కాలేజిని ఓడించింది. మొదట ఎస్ఆర్బీజీఎన్ఆర్ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. అనంతరం భవాన్స్ వివేకానంద కాలేజి 6.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసి గెలుపొందింది. భవాన్స్ ప్లేయర్ కృతిక్ 17 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. -
విజ్ఞాన వర్శిటీలో సాక్షి ప్రీమియర్ లీగ్ బహుమతుల ప్రదానం
-
Sakshi Premier League: చాంప్స్ ఎన్ఆర్ఐ, సర్ సీఆర్ రెడ్డి కాలేజీలు
చేబ్రోలు: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో జూనియర్ విభాగంలో ఎన్ఆర్ఐ కాలేజి (విజయవాడ), సీనియర్ విభాగంలో సర్ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజి (ఏలూరు) జట్లు చాంపియన్స్‌గా నిలిచాయి. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం ఎస్పీఎల్ టోర్నీ ఘనంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా హాజరై విన్నర్స్, రన్నరప్ జట్లకు నగదు పురస్కారాలు, ట్రోఫీలను అందజేశారు. చాంపియన్ జట్లకు రూ. 25 వేలు... రన్నరప్ జట్లకు రూ. 15 వేలు చొప్పున నగదు పురస్కారం లభించింది. జూనియర్ విభాగం ఫైనల్లో ఎన్ఆర్ఐ కాలేజి 35 పరుగులతో సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజి (విశాఖపట్నం)పై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఎన్ఆర్ఐ జట్టు నిర్ణేత 20 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు సాధించింది. రూపేష్ (60 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రేవంత్ (45 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో మెరిశారు. అనంతరం సాయి గణపతి కాలేజి 16.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఎన్ఆర్ఐ జట్టు బౌలర్లలో తరుణ్ 4 వికెట్లు, రేవంత్ 2 వికెట్లు పడగొట్టారు. రేవంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించింది. సీనియర్ విభాగం ఫైనల్లో సర్ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజి తొమ్మిది వికెట్ల తేడాతో శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ (సీకామ్) డిగ్రీ కాలేజి (తిరుపతి) జట్టును ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. మొదట సీకామ్ కాలేజి 19.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. శివ కార్తీక్ (51 బంతుల్లో 42 పరుగులు; 3 ఫోర్లు) రాణించాడు. సీఆర్ రెడ్డి కాలేజి బౌలర్ మనోజ్ నాలుగు, వికెట్లు పడగొట్టాడు. అనంతరం సర్ సీఆర్ రెడ్డి కాలేజి 15.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 117 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ గగన్ కుమార్ (47 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), సంజయ్ (27 బంతుల్లో 23; 3 ఫోర్లు) రాణించారు. జూనియర్ విభాగంలో ఎన్ఆర్ఐ కాలేజి ఆటగాడు రేవంత్... సీనియర్ విభాగంలో సీఆర్ రెడ్డి కాలేజి ఆటగాడు మనోజ్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కించుకున్నారు. -
Sakshi Premier League: ఫైనల్లో ఎన్ఆర్ఐ, సాయి గణపతి కాలేజీలు
చేబ్రోలు: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జూనియర్, సీనియర్ స్థాయి పురుషుల క్రికెట్ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఈ టోర్నీ జరుగుతోంది.జూనియర్ విభాగంలో సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజి (విశాఖపట్నం), ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజి (విజయవాడ) జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఏపీ ఐఐఐటీ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజి తొమ్మిది వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట ఏపీ ఐఐఐటీ నిరీ్ణత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. ఎ.రాంబాబు (37; 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. సాయి గణపతి బౌలర్లలో బి.కుమార్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం సాయి గణపతి కాలేజి 8.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 69 పరుగులు చేసి గెలిచింది. జి.బౌరి (44 నాటౌట్; 4 ఫోర్లు), మధు (18 నాటౌట్; 2 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ఏపీ ఐఐఐటీ (ఇడుపులపాయ)తో జరిగిన మరో మ్యాచ్‌లో ఎన్ఆర్ఐ కాలేజి 30 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా ఎన్ఆర్ఐ కాలేజి నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఎస్కే జాఫర్ (46 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), ఇక్తాన్ సింగ్ (30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. 99 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఏపీ ఐఐఐటీ 5 వికెట్ల నష్టానికి 68 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఎన్ఆర్ఐ కాలేజి బౌలర్ బి.తరుణ్ నాలుగు వికెట్లు తీశాడు. ఏపీ ఐఐఐటీ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. సీనియర్ విభాగంలో ఎంవీజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (విజయనగరం)పై సర్ సీఆర్ రెడ్డి కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ (ఏలూరు) పరుగు తేడాతో గెలిచింది. తొలుత సర్ సీఆర్ రెడ్డి కాలేజి నిరీ్ణత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. వి.గగన్ కుమార్ (37; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఎంవీజీఆర్ కాలేజి బౌలర్లు కల్యాణ్ మూడు వికెట్లు, సురేష్ రెండు వికెట్లు తీశారు. అనంతరం ఎంవీజీఆర్ కాలేజి నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసి ఒక పరుగు తేడాతో విజయాన్ని చేజార్చుకుంది. నేడు సీనియర్ విభాగం ఫైనల్లో సీకామ్ డిగ్రీ కాలేజీతో సర్ సీఆర్ రెడ్డి కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ జట్టు; జూనియర్ విభాగం ఫైనల్లో ఎన్ఆర్ఐ కాలేజితో సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజి తలపడతాయి. -
క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలు
విజయవాడ స్పోర్ట్స్: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి జూనియర్, సీనియర్ పురుషుల క్రికెట్ పోటీలు ముగిశాయి. కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో పది రోజుల పాటు హోరాహోరీగా జరిగిన ఈ టోర్నీలో 12 జూనియర్, 28 సీనియర్ జట్లు తలపడ్డాయి. రెండు విభాగాల్లో శుక్రవారం జరిగిన ఫైనల్స్ ఉత్కంఠభరితంగా సాగింది. జూనియర్స్ విభాగంలో ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, సీనియర్స్ విభాగంలో ఆంధ్రా లయోల ఇంజినీరింగ్ కాలేజీ, నలంద డిగ్రీ కాలేజీ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లను పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టాస్ వేసి ప్రారంభించారు. జిల్లా స్థాయి పోటీల్లో ఫైనల్స్‌కు చేరిన జట్లను అభినందించారు. క్రీడల్లో రాణిస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని చెప్పారు. ఎన్ఆర్ఐ విశ్వరూపం... టోర్నీ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ జట్టు ఫైనల్స్‌లో అదే క్రీడా ప్రతిభను కనబర్చింది. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ సత్తా చాటి తన ప్రత్యర్ధి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ జట్టుపై 78 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎన్ఆర్ఐ జట్టు నిర్ణీత 10 ఓవర్లకు ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి 130 పరుగులను సాధించింది. బ్యాట్స్మెన్లు రూపేష్ ఆర్ధసెంచరీ (28 బాల్స్, 2 సిక్స్‌లు, 9 ఫోర్లు, 64 రన్స్)తో, ఇక్తాన్సింగ్ 33 పరుగులతో రాణించారు. భారీ స్కోరు లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన పాలిటెక్నిక్ జట్టును ఎన్ఆర్ఐ బౌలర్లు 52 పరుగులకు కట్టడి చేసి జూనియర్స్ విభాగంలో జిల్లా స్థాయి విజేతగా నిలవడమే కాకుండా సెంట్రల్ ఆంధ్రా ఎస్పీఎల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టుకు ఎంపికైంది. ఈ మ్యాచ్‌లో 64 రన్స్ చేసిన ఎన్ఆర్ఐ బ్యాట్స్‌మెన్ రూపేష్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు ఎంపికయ్యాడు. జూనియర్స్ విభాగంలో రన్నర్‌గా పాలిటెక్నిక్ జట్టు నిలిచింది. ఉత్సాహాన్నిచ్చింది సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించిన ‘సాక్షి ప్రీమియర్ లీగ్’ (ఎస్పీఎల్) ఎంతో ఉత్సాహానిచ్చిందని ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ కెప్టెన్ రేవంత్, నలంద డిగ్రీ కాలేజీ జట్టు కెప్టెన్ సుశాంత్నాయుడు అన్నారు. ట్రోఫీలను అందుకున్న అనంతరం వారు సాక్షితో మాట్లాడారు. కాలేజీల్లో చదువుకునే విద్యార్థుల కోసమే సాక్షి ఈ టోర్నీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఒక్కో జట్టుతో తలపడినపుడు ఒక్కో విషయాన్ని గ్రహించామన్నారు. ప్రత్యర్ధి జట్లు ఎలా ఉంటాయనేది తెలుసుకున్నామన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాక్షి యాజమాన్యం చర్యలు తీసుకుందన్నారు. క్రీడా నైపుణ్యం సాధించేందుకు ఎస్పీఎల్ దోహదం క్రీడా నైపుణ్యం సాధించేందుకు సాక్షి ప్రీమియర్ లీగ్ దోహద పడతుందని సీపీ టీకే రాణా అన్నారు. ముగింపు సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన విజేతలకు ట్రోఫీలు అందజేశారు. సీనియర్స్ విభాగంలో నలంద డిగ్రీ కాలేజీ జట్టుకు విన్నర్ ట్రోఫీని, ఆంధ్రా లయోల ఇంజినీరింగ్ కాలేజీ జట్టుకు రన్నర్ ట్రోఫీని, జూనియర్స్ విభాగంలో ఎన్ఆర్ఐ జూనియర్ జట్టుకు విన్నర్ ట్రోఫీని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ జట్టుకు రన్నర్ ట్రోఫీని అందజేశారు. సాక్షి రెసిడెంట్ ఎడిటర్ రమణమూర్తి, ఏపీ అడ్మిన్ డీజీఎం కె.ఎస్.అప్పన్న, కాలేజీ ప్రిన్సిపాల్ ఎ.వి.రత్నప్రసాద్, బ్రాంచ్ మేనేజర్ యశోధ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీఎల్ జూనియర్ విజేత జట్లకు క్రికెట్ కిట్లు అందజేత విజయవాడ స్పోర్ట్స్: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) జూనియర్ బాలుర ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు క్రికెట్ కిట్లను పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పంపిణీ చేశారు. జూనియర్స్ విభాగాన ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జట్ల మధ్య శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను ఎమ్మెల్యే టాస్ వేసి ప్రారంభించారు. ఈ రెండు జట్ల క్రీడాకారులు కోరిన మేరకు రెండు క్రికెట్ కిట్లను ఎమ్మెల్యే సారథి వెంటనే మంజూరు చేశారు. క్రీడాకారులు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. -
ఘనంగా ‘సాక్షి’ ప్రీమియర్ లీగ్ ప్రారంభం (ఫొటోలు)
-
ఉత్సాహం .. ఉద్వేగం.. రసవత్తరంగా సాగుతున్న ఎస్పీఎల్ క్రికెట్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో జరుగుతున్న సాక్షి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఉత్సాహంగా.. ఉద్వేగంగా సాగుతున్నాయి. ఆదివారం రెండోరోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీచైతన్య జూనియర్ కళాశాల – వెలాసిటీ జూనియర్ కళాశాల జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీచైతన్య జూనియర్ కళాశాల జట్టు 74 పరుగులు చేయగా, తర్వాత బ్యాటింగ్ చేసిన వెలాసిటీ జూనియర్ కళాశాల జట్టు 52 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. దీంతో శ్రీచైతన్య జూనియర్ కళాశాల జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన ఎస్బీఐటీ డిప్లొమా కాలేజీ జట్టు తన ప్రత్యర్థి ఏఎస్ఆర్ జూనియర్ కళాశాలపై నెగ్గి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఏఎస్ఆర్ జట్టు పరిమిత ఓవర్లకు 63 పరుగులు సాధించగా బ్యాట్స్‌మెన్ ముస్తఫా 19 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎస్బీఐటీ జట్టు సునాయాసంగా లక్ష్యం సాధించింది. దీంతో ఎస్బీఐటీ డిప్లొమా కాలేజీ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. కిట్స్ డిప్లొ మా కాలేజీ ఖమ్మం – అనుబోస్ డిప్లొమా కళాశాల పాల్వంచ జట్ల మ్యాచ్‌లో.. ముందుగా టాస్ గెలిచిన అనుబోస్ డిప్లొమా జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కిట్స్ జట్టు 78 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన అనుబోస్ జట్టు 40 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. దీంతో కిట్స్ డిప్లొ మా కళాశాల జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. మొదటి రౌండ్లో బొమ్మ కాలేజీ విజయభేరి.. బొమ్మ డిప్లొమా కాలేజీ – వాణి ఐటీఐ ఖమ్మం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వాణి ఐటీఐ జట్టు పరిమిత ఓవర్లలో 71 పరుగులు చేయగా, తర్వాత బ్యాటింగ్ చేసిన బొమ్మ డిప్లొమా కాలేజీ జట్టు 72 పరుగులు సాధించింది. రెండో మ్యాచ్‌లో ఆర్జేసీ జూనియర్ కళాశాల – ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కొత్తగూడెం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్జేసీ జట్టు కేవలం 44 పరుగులు చేయగా.. తర్వాత బ్యాటింగ్ చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కొత్తగూడెం జట్టు ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో కృష్ణవేణి జూనియర్ కళాశాల 2– వెలాసిటీ జూనియర్ కళాశాల ఖమ్మం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కృష్ణవేణి జట్టు 53 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ చేసిన వెలాసిటీ జూనియర్ కళాశాల జట్టు నాలుగు వికెట్ల నష్టంతోనే లక్ష్యం సాధించింది. మూడో మ్యాచ్‌లో రెజొనెన్స్ జూనియర్ కళాశాల (మెయిన్ క్యాంపస్) – ముదిగొండ జూనియర్ కళాశాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రెజొనెన్స్ జూనియర్ కళాశాల (మెయిన్ క్యాంపస్) నిర్ణీత ఒవర్లలో 7 వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ముదిగొండ జూనియర్ కళాశాల జట్టు పరిమిత ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసి ఓటమి పాలైంది. దీంతో రెజొనెన్స్ జూనియర్ కళాశాల జట్టు ఘన విజయం సాధించింది. జట్టు కెప్టెన్ రేవంత్ చక్కని ప్రతిభ కనబరిచిచాడు. చదవండి: IND vs NZ: కుల్దీప్ మ్యాజిక్ డెలివరి.. దెబ్బకు కివీస్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్ -
Sakshi Media Group: ధనాధన్ టోర్నీకి దండోరా
బ్యాట్ పట్టుకొని బంతిని బౌండరీ దాటించాలని ఉందా? బుల్లెట్ వేగంతో బంతులు వేస్తూ వికెట్లను గిరాటేయాలని ఉందా? మెరుపు వేగంతో కదులుతూ బ్యాటర్లను రనౌట్ చేయాలని ఉందా? క్రికెట్ ఆడేద్దామని... మనలోని ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలని మనసులో బలమైన కోరిక ఉంటే సరిపోదు.. దానికి వేదిక కూడా కావాలిగా! ఇలాంటి ఔత్సాహిక క్రికెటర్లు తమ కలలు నెరవేర్చుకునేందుకు మళ్లీ సమయం వచ్చేసింది. మరో ఆలోచన లేకుండా ముందుగా మీ జట్టును తయారు చేసుకొని ఎంట్రీలు పంపించండి.. ఆ తర్వాత సమరానికి ‘సై’ అనండి...ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ఔత్సాహిక క్రికెటర్లకు సువర్ణావకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో 2023 జనవరి మూడో వారంలో సాక్షి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ నాలుగో సీజన్ మొదలుకానుంది. మూడో సీజన్లో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 627 జట్లు బరిలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్ సీనియర్ విభాగంలో సీకామ్ డిగ్రీ కాలేజీ (తిరుపతి)... జూనియర్ విభాగంలో సీఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కాలేజీ (ఏలూరు) చాంపియన్స్‌గా నిలిచాయి. తెలంగాణ సీనియర్ విభాగంలో ఎంఎల్ఆర్ఐటీ (దుండిగల్), జూనియర్ విభాగంలో గౌతమ్ జూనియర్ కాలేజీ (ఈసీఐఎల్) జట్లు టైటిల్స్ సాధించాయి. టోర్నీ ఫార్మాట్... ముందుగా జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లను 10 ఓవర్లపాటు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో విజేతగా నిలిచిన జట్లు ప్రాంతీయ స్థాయి టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లను 20 ఓవర్లపాటు నిర్వహిస్తారు. ప్రాంతీయ స్థాయి టోర్నీ విజేతలు రాష్ట్ర స్థాయిలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో టైటిల్ కోసం తలపడతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపాదికగా ఎంట్రీలు స్వీకరిస్తారు. ఎంట్రీ ఫీజు... ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే జట్లు రూ. 1,500 ఎంట్రీ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్ పద్ధతిలోనూ చెల్లించవచ్చు. వివరాలకు సాక్షి జిల్లా యూనిట్ కార్యాలయంలో సంప్రదించాలి. https://www.arenaone.in/registration వెబ్సైట్లోనూ వివరాలు లభిస్తాయి. ఎంట్రీలను జనవరి 6వ తేదీలోపు పంపించాలి. ఏ ఏ విభాగాల్లో... సాక్షి ప్రీమియర్ లీగ్‌ను రెండు కేటగిరీల్లో నిర్వహిస్తారు. అండర్–19 జూనియర్ స్థాయిలో (1–1– 2003 తర్వాత జన్మించి ఉండాలి)... అండర్–25 సీనియర్ స్థాయిలో (1–1–1997 తర్వాత జన్మించి ఉండాలి) వేర్వేరుగా నిర్వహిస్తారు. జూనియర్ స్థాయిలో ఆడేందుకు జూనియర్ కాలేజీ జట్లకు, సీబీఎస్ఈ స్కూల్ జట్లకు (ప్లస్ 11,12 ), ఐటీఐ, పాలిటెక్నిక్ జట్లకు అర్హత ఉంది. సీనియర్ స్థాయిలో ఆడేందుకు డిగ్రీ, పీజీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీ జట్లకు అవకాశం కల్పిస్తారు. ఎన్ని జట్లకు అవకాశం... ఒక్కో కాలేజీ నుంచి గరిష్టంగా రెండు జట్లను పంపించే వెసులుబాటు ఉంది. రెండు జట్లు కూడా వేర్వేరుగా ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ఒక జట్టులో ఆడే ఆటగాడు మరో జట్టుకు ఆడకూడదు. మ్యాచ్‌లు ఆడే సమయంలో ఆటగాళ్లు వయసు ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. మ్యాచ్ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్) చూపించాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్స్, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్‌గ్లౌవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూస్ ధరించాలి. ఇతర వివరాలకు నిర్వాహకులను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు (తెలంగాణ రీజియన్) 9505514424, 9666013544 (ఆంధ్రప్రదేశ్ రీజియన్) 9912671555, 7075709205, 9666697219 నోట్: అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం. -
హోరాహోరీ.. చివరి బంతికి విజయం..
Sakshi Premier League 2022 AP- విజయవాడ స్పోర్ట్స్: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో జూనియర్ విభాగంలో సర్ కట్టమంచి రామలింగారెడ్డి (సీఆర్) పాలిటెక్నిక్ కాలేజీ (ఏలూరు) జట్టు... సీనియర్ విభాగంలో శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ (సీకాం) డిగ్రీ కాలేజీ (తిరుపతి) జట్టు చాంపియన్స్‌గా నిలిచాయి. స్థానిక కేఎల్ యూనివర్సిటీ మైదానంలో బుధవారం జరిగిన జూనియర్ ఫైనల్లో సెంట్రల్ ఆంధ్ర రీజియన్‌కు చెందిన సీఆర్ రెడ్డి కాలేజీ ఆరు వికెట్ల తేడాతో ఉత్తరాంధ్ర రీజియన్‌కు చెందిన సాయి గణపతి జూనియర్ కాలేజీ (విశాఖపట్నం) జట్టును ఓడించింది. తొలుత సాయి గణపతి కాలేజీ 62 పరుగులు సాధించింది. సీఆర్ రెడ్డి కాలేజీ బౌలర్లలో సంజయ్ నాలుగు వికెట్లు తీయగా... రేవంత్, మనోజ్ దత్తు ఒక్కో వికెట్ పడగొట్టారు. 63 పరుగుల లక్ష్యాన్ని సీఆర్ రెడ్డి జట్టు 7.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది. సంజయ్ 26 పరుగులతో రాణించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన సంజయ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’... ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించింది. చివరి బంతికి విజయం... సీనియర్ విభాగం ఫైనల్లో రాయలసీమ రీజియన్‌కు చెందిన సీకాం డిగ్రీ కాలేజీ రెండు పరుగుల ఆధిక్యంతో మహరాజ్ విజయరామ్ గజపతి రాజ్ (ఎంవీజీఆర్) ఇంజనీరింగ్ కాలేజీ (విజయనగరం) జట్టుపై గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీకాం డిగ్రీ కాలేజీ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 96 పరుగులు చేసింది. అఫ్రోజ్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 పరుగులు సాధించగా... ధరణి 14 పరుగులు చేశాడు. ఎంవీజీఆర్ జట్టు బౌలర్లు తరుణ్ తేజ్ మూడు, వంశీ రెండు వికెట్లు తీశారు. 97 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంవీజీఆర్ జట్టు 8 వికెట్లకు 94 పరుగులు చేసి ఓడిపోయింది. ఎంవీజీఆర్ జట్టు విజయానికి చివరి బంతికి మూడు పరుగులు అవసరంకాగా ఆ జట్టు బ్యాటర్ ఆకేశ్ భారీ షాట్‌కు యత్నించి బౌండరీ వద్ద సీకాం కాలేజీ ఫీల్డర్ అబ్బాస్ చేతికి చిక్కాడు. అంతకుముందు ఎంవీజీఆర్ బ్యాటర్లు రవికిరణ్ (26), సాయిప్రణీత్ (16), ప్రసాద్ (19) పరుగులతో రాణించారు. అఫ్రోజ్‌కు (సీకాం కాలేజీ) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు... ఎం.రవికిరణ్ (ఎంవీజీఆర్ కాలేజీ) ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విన్నర్, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, నగదు పురస్కారాలు అందజేశారు. సాక్షి యాజమాన్యానికి అభినందనలు: బైరెడ్డి ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ... క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు సాక్షి ప్రీమియర్ లీగ్ దోహదపడుతుందన్నారు. ప్రతిభావంతులను గుర్తించేందుకు సాక్షి యాజమాన్యం ఈ టోర్నీని నిర్వహించడం అభినందనీయమని బైరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ జె.శ్రీనివాసరావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం.కిషోర్‌బాబు, స్పోర్ట్స్ అసోసియేట్ డీన్ డాక్టర్ హరికిషోర్, సాక్షి డిప్యూటీ ఎడిటర్ రాఘవ రెడ్డి, యాడ్స్ జీఎం బొమ్మారెడ్డి వెంకట రెడ్డి, ఈవెంట్స్ ఏజీఎం ఉగ్రగిరిరావు, విజయవాడ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ కేఎస్ అప్పన్న, బ్యూరో ఇన్‌చార్జ్‌లు ఓబుల్ రెడ్డి వెంకట్రామి రెడ్డి, రమేశ్, గుంటూరు జిల్లా యాడ్స్ ఆర్ఎం వెంకట రెడ్డి, ఈవెంట్ ఆర్గనైజర్లు శ్రీహరి, వేణు తదితరులు పాల్గొన్నారు. చదవండి: IPL 2022 DC Vs PBKS: ఢిల్లీ అలవోకగా... -
ఘనంగా ముగిసిన సాక్షి ప్రీమియర్ లీగ్ పోటీలు.. విజేతలు ఎవరంటే..?
సాక్షి, గుంటూరు: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) 2022 రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు బుధవారం ఘనంగా ముగిశాయి. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 649 జట్లు పోటీపడ్డాయి. సీనియర్స్ విభాగంలో సీకాం డిగ్రీ కాలేజ్ (తిరుపతి) జట్టు విజేతగా నిలువగా, విజయనగరం ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఇదే టోర్నీ జూనియర్ విభాగంలో సర్ సీఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కాలేజ్ (ఏలూరు) జట్టు టైటిల్ సాధించగా, విశాఖపట్నం సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజ్ రన్నరప్‌గా నిలిచింది. సీనియర్ విభాగంలో ఎస్ ఆఫ్రోజ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకోగా, ఎం రవికిరణ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుకు ఎంపికయ్యాడు. జూనియర్ విభాగంలో జి. సంజయ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను గెలుచుకున్నాడు. విజేతలకు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి బహుమతులు అందజేశారు. సీనియర్, జూనియర్ విభాగంలో విన్నర్స్‌కు 25వేలు, రన్నరప్‌కు 15వేలు చెక్కులు అందజేశారు. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి సాక్షి డిప్యూటీ ఎడిటర్ రాఘవ రెడ్డి, అడ్వర్టైజ్ జీఎం వెంకట్ రెడ్డి, కేఎల్‌యూ అడ్మిన్ డైరెక్టర్ జేఎస్ఆర్ శ్రీనివాస్, అసిసోయేట్ డీన్ హరి కిషోర్, డీన్ ఎంహెచ్ ఎస్ కిషోర్ బాబు తదితరులు హాజరయ్యారు. -
SPL 2022: ఆద్యంతం ఉత్కంఠభరితం..
విజయవాడ స్పోర్ట్స్: సాక్షి ప్రీమియర్ లీగ్(ఎస్పీఎల్) క్రికెట్ రాష్ట్ర స్థాయి పోటీలు స్థానిక కేఎల్ యూనివర్సిటీలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర, మధ్య ఆంధ్ర, రాయలసీమ సీనియర్, జూనియర్ పురుషుల జట్లు ఈ చాంపియన్‌షిప్ కు ప్రాతినిధ్యం వహించాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఆరు జట్లు ఈ టోర్నీలో హోరాహోరీగా తలపడ్డాయి. సీనియర్స్ విభాగంలో మధ్య ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన నెల్లూరు జట్టు రెండు ప్రత్యర్థి జట్ల చేతిలో ఓడి వెనుకంజ వేయగా, జూనియర్స్ విభాగంలో మధ్య ఆంధ్ర, ఉత్తరాంధ్ర జట్లు చెరో రెండేసి పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లను సాక్షి విజయవాడ బ్రాంచ్ మేనేజర్ కేఎస్ అప్పన్న పర్యవేక్షించారు. సీఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కాలేజీ విజయకేతనం జూనియర్స్ విభాగం తొలి మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర(సాయిగణపతి పాలి టెక్నిక్ కాలేజీ, విశాఖపట్నం) జట్టుపై, మధ్య ఆంధ్ర(సీఆర్ రెడ్డి పాలి టెక్నిక్ కాలేజీ, ఏలూరు) జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచి రెండు పాయింట్లను సాధించింది. టాస్ గెలిచిన మధ్య ఆంధ్ర జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరాంధ్ర జట్టు నిర్ణీత 10 ఓవర్లకు ఎనిమిది వికెట్లు నష్టపోయి 58 పరుగులు మాత్రమే చేసింది. బ్యాట్స్మెన్లు మధుసూదన్ 12, అవినాష్ 11 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మధ్య ఆంధ్ర జట్టు 8.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు నష్టపోయి 60 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాట్స్మెన్లు సంజయ్ 19 రన్స్ చేయగా సాయిచరణ్, సాయిశశికుమార్ చెరో 15 రన్స్ చేసి జట్టు విజయానికి దోహదపడ్డారు. 19 రన్స్ చేసి, ఒక వికెట్ తీసిన సంజయ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఐదు వికెట్ల తేడాతో ఎంజీవీఆర్ కాలేజీ గెలుపు సీనియర్స్ విభాగం తొలి మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర(ఎంజీవీఆర్ కాలేజీ, విజయనగరం), మధ్య ఆంధ్ర(నారాయ ణ ఇంజినీరింగ్ కాలేజీ, నెల్లూ రు) జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఉత్తరాంధ్ర జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన మధ్య ఆంధ్ర జట్టు నిర్ణీత 10 ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 57 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు తవ్సీఫ్, వెంకటేశ్‌లు తొలి నాలుగు ఓవర్లు నిలకడగా ఆడి 28 పరుగులు చేశారు. అయితే ఆ తరువాత ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో మధ్య ఆంధ్ర జట్టు తక్కువ స్కోర్‌ను సాధించింది. ఉత్తరాంధ్ర బౌలర్లు రవికిరణ్, సంతోష్ చెరో రెండు కీలకమైన వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను కట్టడి చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరాంధ్ర జట్టు కేవలం 7.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసి సునాయాసంగా విజయం సాధించింది. ఓపెనర్లు రవికిరణ్ 18, సాయిప్రణీత్ 10 పరుగులతో రాణించి జట్టు విజయానికి దోహదపడ్డారు. రెండు వికెట్లు తీసి, 18 రన్స్ చేసిన ఉత్తరాంధ్ర బ్యాట్స్‌మెన్ రవికిరణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఉత్తరాంధ్ర జట్టు రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. తిరుపతి సీకామ్ డిగ్రీ కాలేజీ విజయదుందుభి సీనియర్స్ విభాగంలోనే మరో మ్యాచ్‌లో మధ్య ఆంధ్ర(నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ, నెల్లూరు) జట్టును ఓడించిన రాయలసీమ(సీకామ్ డిగ్రీ కాలేజీ, తిరుపతి) జట్టు రెండు పాయింట్లను సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయలసీమ జట్టు నిర్ణీత 10 ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 98 పరుగులు సాధించింది. బ్యాట్స్మెన్లు అఖిబ్ 20, ఫయాజ్‌అలీ 17, మనోజ్ 13, డి.సాయి12 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మధ్య ఆంధ్ర జట్టు నిర్ణీత 10 ఓవర్లకు రెండు వికెట్లు నష్టపోయి 63 పరుగులు మాత్రమే చేసింది. 13 రన్స్, ఒక వికెట్ తీసిన రాయలసీమ జట్టు ఆల్‌రౌండర్ మనోజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజీ విజయం జూనియర్స్ విభాగంలోనే రెండో మ్యాచ్‌లో రాయలసీమ(ఎస్ఎస్బీఎన్ జూనియర్ కాలేజీ, అనంతపురం), ఉత్తరాంధ్ర(సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజీ, విశాఖపట్నం) జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయలసీమ జట్టు నిర్ణీత 10 ఓవర్లకు ఆరు వికెట్లు నష్టపోయి 70 పరుగులు చేసింది. బ్యాట్స్మెన్లు విఘ్నేష్ 26, ప్రశాంత్ 20 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరాంధ్ర జట్టు 9.3వ ఓవర్ వద్ద ఐదు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాట్స్మెన్లు నూకేష్ 22, అవినాష్ 19 పరుగులతో రాణించారు. ఆరు పరుగులు, రెండు వికెట్లు తీసిన బి.కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఉత్తరాంధ్ర జట్టు రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. నేడు విజేతలకు ట్రోఫీల ప్రదానం సీనియర్స్ విభాగంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ జట్లు బుధవారం తలపడతాయి. జూనియర్స్ విభాగంలో మధ్య ఆంధ్ర, రాయలసీమ జట్లు తలపడతాయి. పోటీల అనంతరం సాయంత్రం జరిగే బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేస్తారు. చదవండి: IPL 2022: సెంచరీ మిస్.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్‌లో బెంగళూరు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SPL 2022: ఉత్సాహంగా సాక్షి ప్రీమియర్ లీగ్ క్రీడా సంబరం
విజయవాడ స్పోర్ట్స్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) రీజనల్ స్థాయి పోటీలు సోమవారం ముగిశాయి. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో రెండు రోజులుగా ఈ పోటీలు కొనసాగాయి. జూనియర్స్ విభాగంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టు, సీనియర్స్ విభాగంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా జట్టు విజేతలుగా నిలిచాయి. జూనియర్స్‌లో ఉమ్మడి నెల్లూరు జిల్లా జట్టు, సీనియర్స్‌లో ఉమ్మడి గుంటూరు జిల్లా జట్టు ద్వితీయస్థానంలో నిలిచాయి. జూనియర్స్ విభాగంలో ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, సీనియర్స్ విభాగంలో ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు నెల్లూరు, ప్రకాశం జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. విజృంభించిన నెల్లూరు సీనియర్స్ విభాగంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా (నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ) జట్టు ఆల్ రౌండ్ ప్రతిభను కనబర్చి రీజనల్ ట్రోఫీని కైవసం చేసుకుని సెంట్రల్ ఆంధ్రా రీజియన్ పోటీలకు ఎంపికైంది. ఉదయం జరిగిన సెమీ ఫైనల్స్‌లో టాస్ గెలిచిన ఉమ్మడి ప్రకాశం జిల్లా (ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజీ) జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన నెల్లూరు జట్టు నిర్ణీత పది ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 61 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ విఫలమైనా వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ సాయిరోహిత్ 19 బంతుల్లో 34 (5 ఫోర్లు) పరుగులుచేసి జట్టును ఆదుకున్నాడు. 62 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ప్రకాశం జట్టు 9.2వ ఓవర్ వద్ద 50 పరుగులు చేసి ఆలౌటయింది. నెల్లూరు బౌలర్లు సాయిరోహిత్, తవ్సీఫ్ మూడేసి వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. దీంతో నెల్లూరు జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 34 పరుగులు చేసి, మూడు వికెట్లు తీసిన ఆల్‌రౌండర్ సాయిరోహిత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు ఎంపికయ్యాడు. సెమీ ఫైనల్స్‌లో సత్తా చాటిన నెల్లూరు జట్టు ఫైనల్స్‌లోనూ ఉమ్మడి గుంటూరు (జేకేసీ డిగ్రీ కాలేజీ) జట్టుపై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రీజనల్ విజేతగా నిలిచింది. టాస్ గెలిచిన నెల్లూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా గుంటూరు జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 62 పరుగులు చేసింది. షేక్ ఐరోస్ 17, వై.శ్రీనివాస్ 10 పరుగులు చేశారు. నెల్లూరు బౌలర్లు సాయిరోహిత్ మూడు, వెంకటేష్ రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు 9.1వ ఓవర్లోనే నాలుగు వికెట్లు నష్టపోయి 65 పరుగులు చేసి విజయం సాధించింది. అరుణ్ 19, సాయిరోహిత్ 15 పరుగులతో రాణించారు. మూడు వికెట్లు తీసి 15 పరుగులు చేసిన సాయిరోహిత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు ఎంపికయ్యాడు. పశ్చిమగోదావరి జిల్లా ఆల్‌రౌండ్ ప్రతిభ జూనియర్స్ విభాగంలో జరిగిన ఫైనల్స్‌లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా (సీఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కాలేజీ) జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సత్తా చాటి ఉమ్మడి నెల్లూరు జిల్లా (వివేకానంద జూనియర్స్ కాలేజీ) జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. నిఖిల్ 12 పరుగులు చేశారు. పశ్చిమ గోదావరి జట్టు బౌలర్లు రేవంత్, గణేష్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పశ్చిమగోదావరి జిల్లా జట్టు 8.1 ఓవర్‌కే రెండు వికెట్లు నష్టపోయి 56 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాట్స్‌మన్ సంజయ్ 22 పరుగులతో రాణించాడు. ఒక వికెట్ తీసి, 22 పరుగులుచేసిన పశ్చిమ గోదావరి జిల్లా జట్టు ఆల్‌రౌండర్ సంజయ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు ఎంపికయ్యాడు. జూనియర్స్ విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా జట్టు సెంట్రల్ ఆంధ్రా రీజియన్ జట్టుకు ఎంపికైంది. విజేతలకు ట్రోఫీలు అందజేత విజేత జట్లకు కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అఫైర్స్ అడ్వైజర్ డాక్టర్ హబీబుల్లాఖాన్, డీన్ డాక్టర్ సీహెచ్ హనుమంతరావు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ‘సాక్షి’ యాజమాన్యం ఈ టోర్నీ నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడాకారుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఈ టోర్నీ దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ కె.ఎస్.అప్పన్న తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలు ‘సాక్షి’ ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) రాష్ట్ర స్థాయి జూనియర్స్, సీనియర్స్ పురుషుల క్రికెల్ పోటీలు కేఎల్ యూనివర్సిటీ క్రీడా మైదానంలో మంగళవారం ప్రారంభమవుతాయి. ఈ పోటీల్లో ఉత్తరాంధ్ర, సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ రీజియన్ జట్లు లీగ్ పద్ధతిలో తలపడతాయి. జూనియర్స్ విభాగంలో పశ్చిమగోదావరి జిల్లా జట్టు, సీనియర్స్ విభాగంలో నెల్లూరు జిల్లా జట్టు సెంట్రల్ ఆంధ్రా రీజియన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఉత్తరాంధ్ర రీజియన్‌కు విజయనగరం జిల్లా (జూనియర్స్), విశాఖపట్నం జిల్లా (సీనియర్స్), రాయలసీమ రీజియన్‌కు చిత్తూరు జిల్లా (సీనియర్స్), అనంతపురం జిల్లా (జూనియర్స్) జట్లు ప్రాతినిధ్యం వహిస్తాయి. -
'సాక్షి ప్రీమియర్ లీగ్' విజేతలకు ఇచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే?
‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాక్షి ప్రీమియర్ లీగ్’(ఎస్పీఎల్) తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ గురువారం ఘనంగా ముగిసింది. సీనియర్, జూనియర్ విభాగాల్లో జరిగిన పోటీల్లో మొత్తం 649 జట్లు పాల్గొన్నాయి. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించారు. సీనియర్ విభాగంలో ఎంఎల్ఆర్ఐటి (దుండిగల్), జూనియర్ విభాగంలో గౌతమ్ జూనియర్ కళాశాల (ఈసీఐఎల్) విజేతలుగా నిలిచాయి. సీనియర్ ఫైనల్లో ఎంఎల్ఆర్ఐటి 35 పరుగుల తేడాతో వాగ్దేవి డిగ్రీ కళాశాల (మంచిర్యాల)పై విజయం సాధించింది. ఎస్పీఎల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఫైనల్లో విజేతలుగా నిలిచిన ఎంఎల్ఆర్ఐటి(సీనియర్స్ విభాగం) , గౌతమ్ జూనియర్ కాళాశాల(జూనియర్స్ విభాగం) జట్లకు రూ. 25 వేలు, రన్నరప్‌గా నిలిచిన వాగ్దేవి, కెఎల్ఎన్ జట్లకు రూ. 15 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీ, మెడల్స్, సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. అదే విధంగా జూనియర్స్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మనీస్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రిషబ్ బిమల్, సీనియర్స్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దీపక్ దక్షిత్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సూర్యతేజలను మెమెంటోలతో సత్కరించారు.కాగా సాక్షి మీడియా గ్రూఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఎస్పీఎల్ నిర్వహణపై పలువురు ప్రశంసల జల్లు కుపించారు. 'విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి కనబర్చాలని, విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఉత్తమంగా రాణిస్తారు. ఎస్పీఎల్ లీగ్ నిర్వహించడం అభినందనీయం' -ఎంఎల్ఆర్ఐటీ కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి 'ఎస్పీఎల్ అభినందనీయం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 649 జట్లతో రాష్ట్ర స్థాయిలో ఎస్పీఎల్ నిర్వహించడం గొప్ప విషయం. అందుకు మా కాలేజీ ఆతిథ్యమివ్వడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్నో మంచి కార్యక్రమాలను నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న సాక్షి మీడియా గ్రూఫ్‌కు ప్రత్యేకంగా కృతజ్థతలు' - మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎంఎల్ఆర్ఐటి కళాశాలల సెక్రటరీ -
Sakshi Premier League 2022: విజేతలు ఎంఎల్ఆర్ఐటి, గౌతమ్ కాలేజి
-
Sakshi Premier League 2022: విజేతలు ఎంఎల్ఆర్ఐటి, గౌతమ్ కాలేజి
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాక్షి ప్రీమియర్ లీగ్’ తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ గురువారం ఘనంగా ముగిసింది. సీనియర్, జూనియర్ విభాగాల్లో జరిగిన పోటీల్లో మొత్తం 649 జట్లు పాల్గొన్నాయి. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించారు. సీనియర్ విభాగంలో ఎంఎల్ఆర్ఐటి (దుండిగల్), జూనియర్ విభాగంలో గౌతమ్ జూనియర్ కళాశాల (ఈసీఐఎల్) విజేతలుగా నిలిచాయి. సీనియర్ ఫైనల్లో ఎంఎల్ఆర్ఐటి 35 పరుగుల తేడాతో వాగ్దేవి డిగ్రీ కళాశాల (మంచిర్యాల)పై విజయం సాధించింది. ఎంఎల్ఆర్ఐటి ముందుగా 10 ఓవర్లలో 9 వికెట్లకు 100 పరుగులు చేయగా, వాగ్దేవి 10 ఓవర్లలో 5 వికెట్లకు 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. జూనియర్ ఫైనల్లో గౌతమ్ కాలేజి 32 పరుగులతో కేఎల్ఎన్ జూనియర్ కాలేజిని ఓడించింది. గౌతమ్ 10 ఓవర్లలో 5 వికెట్లకు 81 పరుగులు చేయగా, కేఎల్ఎన్ 9.2 ఓవర్లలో 49 పరుగులకే ఆలౌటైంది. డి.మనీశ్ ఒక పరుగే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ముగింపు కార్యక్రమానికి ఎంఎల్ఆర్ఐటి కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, సెక్రటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డి, అవినాశ్ విద్యాసంస్థల చైర్మన్ అవినాశ్, సాక్షి మార్కెటింగ్, అడ్వర్టయిజ్మెంట్ సీజీఎం కమల్ కిశోర్ రెడ్డి, సాక్షి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉగ్రగిరి రావు, ఈవెంట్ కో–ఆర్డినేటర్లు వేణు, సుమన్, కళాశాల స్పోర్ట్స్ డైరెక్టర్ పార్థసారధి పాల్గొన్నారు. -
సాక్షి ప్రీమియర్ లీగ్ 2022 విజేతగా ఎంఎల్ఆర్ఐటి
సాక్షి, హైదరాబద్: సాక్షి ప్రీమియర్ లీగ్ మూడవ ఎడిషన్ (2022) పోటీలు సందడిగా ముగిశాయి. జూనియర్, సీనియర్ విభాగాల్లో డిస్ట్రిక్ట్, రీజియన్, స్టేట్ లెవెల్స్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 649 జట్లు పాల్గొన్నాయి. తెలంగాణలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నిర్వహించిన ఈ టోర్నీలో (సీనియర్ విభాగం) మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటి), హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. స్థానిక ఎంఎల్ఆర్ఐటి క్రికెట్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఎంఎల్ఆర్ఐటి జట్టు వాగ్దేవి డిగ్రీ కళాశాల (మంచిర్యాల) జట్టుపై విజయం సాధించి సాక్షి ప్రీమియర్ లీగ్ 2022 టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. టైటిల్ విజేతకు ట్రోఫీతో పాటు 25000 నగదు బహుమతి లభించింది. ఇదే టోర్నీ జూనియర్ విభాగం విజేతగా గౌతమ్ జూనియర్ కళాశాల (ఈసీఐఎల్) జట్టు నిలిచింది. ఫైనల్లో గౌతమ్ జూనియర్ కాలేజీ జట్టు.. కేఎల్ఎన్ జూనియర్ కళాశాల (మిర్యాలగూడ) జట్టుపై విజయం సాధించింది. ఎస్పీఎల్ 2022 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎంఎల్ఆర్ఐటి సెక్రటరీ మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంఎల్ఆర్ఐటి చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ అవినాష్, సాక్షి సీజీయం కమల్ కిషోర్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. -
హోరాహోరీగా ‘సాక్షి’ ప్రీమియర్ లీగ్..
కుత్బుల్లాపూర్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సాక్షి ప్రీమియర్ లీగ్’ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు బుధవారం దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ గ్రౌండ్లో జరిగాయి. అండర్–19, అండర్–26 సీనియర్, జూనియర్ విభాగాల్లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లు ఆద్యంతం ఉత్కంఠంగా సాగాయి. కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ‘సాక్షి’ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉగ్రగిరి రావు, ఈవెంట్ కో.ఆర్డినేటర్లు వేణు, సుమన్, కళాశాల స్పోర్ట్స్ డైరెక్టర్ పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు. సీనియర్స్ విభాగంలో వాగ్దేవి బోణీ వాగ్దేవి డిగ్రీ కశాళాల(మంచిర్యాల), ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల (సూర్యపేట) జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్వీ కళాశాల జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. వాగ్దేవి కళాశాల జట్టు బ్యాట్స్‌మెన్ సైఫ్ 26 బంతుల్లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లతో ఏకంగా 46 పరుగులు సాధించడంతో 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 85 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎస్వీ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి కేవలం 68 పరుగులు మాత్రమే చేసింది. 17 పరుగుల తేడాతో వాగ్దేవి ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో రాణించిన సాహిప్ బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా, బెస్ట్ బౌలర్‌గా అశ్విక్ ఎంపికయ్యారు. మరో మ్యాచ్‌లో ఎంఎల్ఆర్ఐటీ విజయం.. సీనియర్స్ విభాగంలో జరిగిన మ్యాచ్‌లో ఎంఎల్ఆర్ఐటీ (దుండిగల్ హైదరాబాద్) 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల(సూర్యపేట) 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఎంఎల్ఆర్ఐటీ కళాశాల జట్టు కేవలం 6 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 63 పరుగులు సాధించింది. వినయ్ 44 పరుగులు చేసి జట్టు విజయాన్ని సునాయాసం చేశాడు. జూనియర్స్‌లో కేఎల్ఎన్ గెలుపు.. జూనియర్ విభాగంలో మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగాయి. మొదటి మ్యాచ్ ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాల (మంచిర్యాల), కెఎల్ఎన్ జూనియర్ కళాశాల(మిర్యాలగూడ) తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాల 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 49 పరుగులు మాత్రమే చేసింది. కెఎల్ఎన్ కళాశాల జట్టు 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసి 7 వికెట్ల నష్టంతో విజయం సొంతం చేసుకుంది. 24 పరుగులు చేసిన శరత్ బెస్ట్ బ్యాట్స్‌మెన్, 2 వికెట్లు తీసిన ఫైజ్‌కు బెస్ట్ బౌలర్ అవార్డు అందుకున్నాడు. సత్తాచాటిన గౌతమి కళాశాల... మొదటి విజయంతో ఉత్సాహంతో రెండో మ్యాచ్‌కు దిగిన కెఎల్ఎన్ జూనియర్ కళాశాలకు గౌతమి జూనియర్ కళాశాల(ఈసీఐఎల్) చెక్ పెట్టింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెఎల్ఎన్కు ధీటుగా గౌతమి కళాశాల బ్యాట్స్మెన్లు రెచ్చిపోయారు. 7 వికెట్ల నష్టానికి 83 పరుగుల భారీ స్కోర్ చేయగా, కెఎల్ఎన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 73 పరుగులు మాత్రమే చేసింది. 11 పరుగుల తేడాతో గౌతమి జూనియర్ కళాశాల విజయం సాధించింది. బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా వామన్, బెస్ట్ బౌలర్‌గా తునికి సాహిత్ ఎంపికయ్యారు. నేడు సీనియర్స్ ఫైనల్స్.. తలపడనున్న వాగ్దేవి, ఎంఎల్ఆర్ఐటీ ప్రతి జట్టు రెండేసి మ్యాచ్‌ల చొప్పున తలపడనున్న నేపథ్యంలో బుధవారం జరిగిన కీలక మ్యాచ్‌లో విజయం సొంతం చేసుకున్న వాగ్దేవి, ఎంఎల్ఆర్ఐటీ జట్లు గురువారం ఉదయం ఫైనల్స్ బరిలో తలపడనున్నాయి. అదేవిధంగా జూనియర్ సెమీఫైనల్, ఫైనల్స్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. క్రికెట్ పోటీలను ప్రారంభిస్తున్న మర్రి లక్ష్మణ్‌రెడ్డి -
SPL: ఎస్పీఎల్ విజేతలు వీరే!
Sakshi Premier League 2022- ఇబ్రహీంపట్నం: సాక్షి ప్రీమియర్ లీగ్ పోటీలు సోమవారం సందడిగా ముగిశాయి. గ్రేటర్ హైదరాబాద్ రీజినల్ విజేతలుగా సీనియర్స్ విభాగంలో దుండిగల్ ఎంఎల్ఆర్ఐటీ కళాశాల, జూనియర్స్ విభాగంలో ఈసీఐఎల్ గౌతమ్ జూనియర్ కళాశాల జట్లు నిలిచాయి. ఔత్సాహిక క్రికెటర్లను ప్రొత్సహించేందుకు సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో 3వ సీజన్ క్రికెట్ టోర్నీ శేరిగూడలోని శ్రీఇందు విద్యాసంస్థల మైదానంలో గత నెల 19న ప్రారంభమైన విషయం తెలిసిందే. జిల్లాస్థాయి విజేతలతో సోమవారం గ్రేటర్ హైదరాబాద్ రీజినల్ స్థాయి పోటీలు ఇక్కడ నిర్వహించారు. విజయం సాధించిన జట్లకు శ్రీఇందు విద్యాసంస్థల చైర్మన్ ఆర్. వెంకట్రావు, సుధాకర్ పీవీసీ పైప్స్ రీజినల్ మేనేజర్ రంగారావు, సంస్థ సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నరేష్కుమార్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ.. సాక్షి మీడియా గ్రూపు క్రికెట్ టోర్నీ నిర్వహించడం అభినందనీయమన్నారు. మున్ముందు ఇలాంటి టోర్నీలు నిర్వహిస్తే సహకరిస్తామని చెప్పారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. టోర్నీకి స్పానర్స్గా వ్యవహరించిన సుధాకర్ పీవీసీ పైప్స్ సంస్థతోపాటు క్రీడాకారులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సుధాకర్ పీవీసీ సంస్థ రీజినల్ మేనేజర్ రంగారావు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో నైపుణ్యం సాధించాలన్నారు. తల్లిదండ్రులు ఈవిషయంలో ప్రోత్సహించాలని చెప్పారు. సమావేశంలో సుధాకర్ పైప్స్ సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నరేష్కుమార్ మాట్లాడుతూ.. టీర్నీని విజయవంతం చేసిన సాక్షి మీడియాకు అయన ధన్యవాదాలు తెలిపారు. ఎస్‌పీఎల్‌కు రీఫ్రెష్మెంట్ డ్యూక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సుధాకర్ పీవీసీ సంస్థలు తెలంగాణ రీజినల్ స్పాన్సర్స్‌గా వ్యవహరించాయి. ఫైనల్స్‌లో ఇలా.. రీజినల్ జూనియర్ విభాగంలో ఈసీఐఎల్ గౌతమ్ జూనియర్ కళాశాలతో మహబూబ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టు తలపడింది. మొదట గౌతమ్ కళాశాల 105 పరుగులు సాధించింది. అనంతరం మహబూబ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 81 పరుగులు సాధించి ఓటమిపాలైంది. గౌతమ్ కాలేజీ ఆడగాడు అశ్లేష్ 30 బాల్స్‌లో 44 పరుగులు సాధించి ఉత్తమ ప్రతిభ చాటాడు. రీజినల్ సీనియర్స్ విభాగంలో దుండిగల్ ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ జట్టు, మహబూబ్‌నగర్ వాసవీ డిగ్రీ, పీజీ కాలేజీ జట్టు పోటీపడింది. ఎంఎల్ఆర్ఐటీ జట్టు 5 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. అనంతరం మహబూబ్‌నగర్ వాసవీ కాలేజీ టీం 69 పరుగులు సాధించి ఓటమిపాలైంది. ఎంఎల్ఆర్ఐటీ జట్టు విజయ్ 17 బాల్స్‌లో 34 పరుగులను సాధించి ప్రతిభచాటాడు. ఉత్సాహంగా బహుమతుల ప్రదానం బహుమతుల ప్రదానోత్సవం ఉత్సాహంగా సా గింది. జాతీయ గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.జూనియర్ విభాగంలో ఈసీఐఎ ల్ గౌతమ్ కాలేజీ, సీనియర్ విభాగంలో దుండిగ ల్ ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ జట్లు విజేతలుగా నిలిచాయి. రన్నర్స్‌గా సైనిక్‌పురి భవన్స్ కళాశాల జ ట్లు నిలిచాయి. జూనియర్ విభాగంలో గౌతమ్ కాలేజీ జట్టు, దుండిగల్ ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ జట్లు విజయం సాధించారు. విన్నర్స్, రన్నర్స్‌కు షీల్డ్‌లను, సర్టిఫికెట్లను ముఖ్యఅతిథులు అందజేశారు. ఇందు కాలేజీ తరఫున పాల్గొన్న రెండు జట్లను చెర్మన్ వెంకట్రావ్ ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. రీజినల్ స్థాయిలో విజేతలైన జట్లు 10 తర్వాత జరిగే రాష్ట్ర స్థాయి ఎస్పీఎల్ పోటీల్లో తలపడుతాయి. కార్యక్రమంలో సాక్షి ఈ వెంట్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉగ్రగిరిరావు, ఇందు కాలేజీ ఏఓ బాలకృష్ణారెడ్డి,సత్యనారాయణ, పీడీ నరసింహ పాల్గొన్నారు. -
Sakshi Premier League 2022: ఏవీ డిగ్రీ కళాశాల విజయం
ఇబ్రహీంపట్నం/హైదరాబాద్: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) పోటీల్లో భాగంగా నాలుగో రోజు మంగళవారం నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. శేరిగూడలోని శ్రీ ఇందు కాలేజీ వేదికగా పోటీలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్‌లో కాచిగూడ భద్రుకా డిగ్రీ కళాశాల, దోమలగూడ ఏవీ డిగ్రీ కళాశాల జట్లు పోటీ పడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భద్రుక డిగ్రీ జట్టు 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 72 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఏవీ డిగ్రీ కళాశాల జట్టు 9.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు సాధించి విజయాన్ని కైవసం చేసుకుంది. రెండో మ్యాచ్‌లో మొయినాబాద్ కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ జట్టు, శేరిగూడ శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజీ జట్టు తలబడ్డాయి. టాస్ గెలిచి శ్రీదత్త కాలేజీ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. కేజీ రెడ్డి జట్టు 10 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. 79 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీదత్త జట్టు 42 పరుగులకే అలౌట్ అయింది. 36 పరుగుల తేడాతో కేజీ రెడ్డి జట్టు విజేతగా నిలిచింది. మూడో మ్యాచ్ శేరిగూడ శ్రీ ఇందు ఫార్మాసీ కాలేజీ, కోఠి ప్రగతి డిగ్రీ కళాశాల జట్ల మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీ ఇందు ఫార్మసీ కళాశాల జట్టు 34 పరుగులకే అలౌట్ అయింది. ప్రగతి కాలేజీ జట్టు 3 ఓవర్లకే 38 పరుగులు చేసి విజయాన్ని సునాయసంగా చేజిక్కించుకుంది. నాలుగో మ్యాచ్‌లో మెహిదీపట్నం పుల్లారెడ్డి కాలేజీ, కోఠి వివేకవర్ధిని కాలేజీ జట్లు పోటీ పడ్డాయి. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వివేకవర్ధిని జట్టు 10 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 54 పరుగులు సాధించింది. 55 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పుల్లారెడ్డి డిగ్రీ కాలేజీ జట్టు 9 వికెట్ల నష్టానికి 46 పరుగులు సాధించి 8 పరుగుల తేడా ఓటమి పాలైంది. సాక్షి ప్రీమియర్ లీగ్‌కు రీఫ్రెష్మెంట్ డ్యూక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సుధాకర్ పీవీసీ సంస్థలు తెలంగాణ రీజియన్ స్పాన్సర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ ఇందూ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వరుణ్, ఏఓ బాలకృష్ణారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ నరసింహ పాల్గొన్నారు. ఘట్కేసర్: ఘట్కేసర్ మండలం, కొర్రెముల్ సెంట్రల్ క్రికెట్ మైదానంలో ‘సాక్షి’ ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మంగళవారం నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. మొదటి మ్యాచ్‌లో ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాల–ఏ జట్టుతో శేర్గూడ శ్రీదత్తా డిప్లమా కళాశాల–బీ జట్టు తలడింది. మొదట బ్యాటింగ్ చేసిన లిటిల్ ఫ్లవర్ 10 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 95 పరుగులు చేయగా, శ్రీ దత్తా డిప్లమా–బీ జట్టు 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసి పరాజయం పాలైంది. రెండో మ్యాచ్‌లో ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాల–బీ జట్టుతో సైనిక్‌పురి భవాన్స్ అరబిందో జూనియర్ కళాశాల–బీ జట్టు తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన భవాన్స్ 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. జట్టు క్రీడాకారుడు రామ్రుత్విక్ రెడ్డి 52 పరుగులు సాధించడమే కాక రెండు స్టంప్ ఔట్లు, రెండు రన్ ఔట్లు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్–బీ జట్టు 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసి ఓడిపోయింది. మూడో మ్యాచ్‌లో సైనిక్‌పురి భవాన్స్ వివేకానంద డిగ్రీ కళాశాల–బీ జట్టుతో ఇబ్రహీంపట్నం విజ్ఞాన భా రతి ఇంజనీరింగ్ కళాశాల జట్టు తలపడింది. మొదట బ్యా టింగ్ చేసిన విజ్ఞాన భారతి జట్టు 10 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేయగా భవాన్స్ 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసి గెలుపొందింది. ఉత్కంఠంగా నాల్గో మ్యాచ్... నాల్గో మ్యాచ్‌లో సికింద్రాబాద్ జాహ్నవి డిగ్రీ కళాశాల జట్టుతో గండిపేట్ మహాత్మ గాంధీ ఇంజినీరింగ్ కళాశాల జట్టు తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన జాహ్నవి జట్టు 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ చేసిన మహాత్మాగాంధీ ఇంజినీరింగ్ కళాశాల జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అనంతరం సూపర్ ఓవర్ నిర్వహించగా మహాత్మా గాంధీ ఇంజినీరింగ్ కళాశాల జట్టు వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేయగా జాహ్నవి జట్టు వికెట్ నష్టపోయి 2 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. -
Sakshi Premier League 2022: రెండో రోజు నాలుగు మ్యాచ్‌లు.. విజేతలు వీరే
ఇబ్రహీంపట్నం/హైదరాబాద్: రెండోరోజు సాక్షి ప్రీమియర్ లీగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఆదివారం మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఔత్సాహిక క్రికెటర్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘సాక్షి మీడియా గ్రూప్’ ఆధ్వర్యంలో లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శేరిగూడలోని శ్రీఇందు కాలేజీ వేదికగా కొనసాగుతున్న మ్యాచ్‌లకు ఆదివారం ఆయా విద్యాసంస్థల చైర్మన్ ఆర్. వెంకట్రావ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకు సాక్షి మీడియా చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకొని ప్రతిభను చాటాలన్నారు. సాక్షి ప్రీమియర్ లీగ్‌కు రీఫ్రెష్మెంట్ డ్యూక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సుధాకర్ పీవీసీ సంస్థలు తెలంగాణ రీజియన్ స్పాన్సర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. రెండోరోజు నాలుగు మ్యాచ్‌లు రెండోరోజు నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. మొదటి మ్యాచ్‌లో దిల్సుఖ్నగర్ అవంతి పీజీ కళాశాల, ఘట్కేసర్ వీబీఐటీ జట్లు పోటీపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అవంతి కళాశాల జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన వీబీఐటీ జట్టు 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసి విజయం సాధించింది. రెండో మ్యాచ్ శేరిగూడ శ్రీఇందు ఇన్స్టిట్యూట్, ఘట్కేసర్ శ్రీనిధి కళాశాల జట్లు పోటీ పడ్డాయి. శ్రీఇందు విద్యాసంస్థల చైర్మన్ వెంకట్రావ్ టాస్ వేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీఇందు జట్టు 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 85 పరుగులు సాధించింది. అనంతరం శ్రీనిధి కళాశాల జట్టు 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 42 పరుగులు మాత్రమే చేసింది. శ్రీఇందు జట్టులో శివ అత్యుత్తమంగా బ్యాటింగ్ చేసి 22 బాల్స్‌కు 41 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. శ్రీఇందు ఇన్స్టిట్యూట్ జట్టును విద్యాసంస్థల చైర్మన్ వెంకట్రావ్ అభినందించారు. మూడో మ్యాచ్‌లో హైదరాబాద్ ఓయూ జట్టు, ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల జట్టు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఓయూ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గురునానక్ జట్టు 7 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 56 పరుగులు సాధించి విజేతగా నిలిచింది. నాలుగో మ్యాచ్‌లో అల్వాల్ లయోలా డిగ్రీ కళాశాలతో సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కళాశాల పోటీపడ్డాయి. టాస్ గెలిచిన లయోలా జట్టు వెస్లీ జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. 10 ఓవర్లల్లో 8 వికెట్ల నష్టానికి వెస్లీ జట్టు 50 పరుగులు చేసింది. అనంతరం లయోలా జట్టు 8.2 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు సాధించి విజయాన్ని దక్కించుకుంది. -
రసవత్తరంగా సాక్షి ప్రీమియర్ లీగ్
విజయవాడ స్పోర్ట్స్: ‘సాక్షి’ ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) క్రికెట్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. కేసీపీ సిద్ధార్థ ఆదర్శ పబ్లిక్ స్కూల్ క్రికెట్ మైదానంలో శనివారం జూనియర్, సీనియర్ విభాగాల్లో నాలుగేసి జట్లు తలపడ్డాయి. ‘సాక్షి’ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీకి ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొర్పొరేషన్ (ఏపీఎండీసీ) రీజనల్ స్పాన్సర్‌గా, డ్యూక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రీఫ్రెష్మెంట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నాయి. సత్తాచాటిన ‘ఎన్ఆర్ఐ’ జూనియర్ విభాగంలో ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ, నలంద జూనియర్ కాలేజీ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన నలంద జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎన్ఆర్ఐ జట్టు నిరీ్ణత 10 ఓవర్లకు ఐదు వికెట్లు నష్టపోయి 64 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ కె.రేవంత్ 22 పరుగులతో రాణించాడు. 65 పరుగుల విజయలక్ష్యంతో బరి లో దిగిన నలంద జట్టు ఏడు ఓవర్లో 27 పరుగులకే కుప్పకూలింది. ఎన్ఆర్ఐ జట్టు 37 పరుగుల తేడాతో గెలిచింది. ఎన్ఆర్ఐ బౌలర్లు జాఫర్ మూడు, రేవంత్ రెండు వికెట్లు తీశారు. జాఫర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రెండు వికెట్ల తేడాతో పాలిటెక్నిక్ కాలేజీ గెలుపు మరో మ్యాచ్‌లో ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ జట్టుపై ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ జట్టు రెండు వికెట్ల తేడాతో గెలిచింది. పాలిటెక్నిక్ కాలేజీ జట్టు టాస్‌గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్ఆర్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. పాలిటెక్నిక్ కాలేజీ జట్టు ఎనిమిది వికెట్లు నష్టపోయి చివరి ఓవర్లో 57 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రెండు కీలక వికెట్లు తీసిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ బౌలర్ కె.ఉదయ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. పీవీపీ సిద్ధార్థ(టీమ్–2) ప్రతిభ సీనియర్ విభాగంలో పీవీపీ సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ(టీమ్–2) జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సత్తా చాటింది. టాస్ గెలిచిన సిద్ధార్ధ హోటల్ మేనేజ్మెంట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. పీవీపీ సిద్ధార్థ జట్టు ఆది నుంచే దూకుడుగా ఆడి నిర్ణీత 10 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. ఓపెనర్లు జి.శ్రీను 30 బంతులకు 36, షేక్ ఫరాహాన్ సోహైల్ 12 బంతులకు 21 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హోటల్ మేనేజ్మెంట్ జట్టు ఓపెనర్లు పవన్ కల్యాణ్, చరణ్ వెంటవెంటనే ఔటయ్యారు. నిర్ణీత ఓవర్లలో ఈ జట్టు ఆరు వికెట్లు నష్టపోయి 37 పరుగులు చేసి ఓటమిపాలైంది. 36 పరుగులు చేసిన పీవీపీ సిద్ధార్థ బ్యాట్స్‌మెన్ జి.శ్రీను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. నాలుగు వికెట్ల తేడాతో ఎస్ఆర్కే కాలేజీ విజయం మరో మ్యాచ్‌లో ఎస్ఆర్కే ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కాలేజీ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పొట్టి శ్రీరాములు కాలేజీ జట్టు నిర్ణీత 10 ఓవర్లకు తొమ్మిది వికెట్లు నష్టపోయి 51 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్కే కాలేజీ జట్టు ఆరు వికెట్లు నష్టపోయి 56 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. రెండు వికెట్లు తీసిన ఎస్ఆర్కే కాలేజీ బౌలర్ జ్ఞానేశ్వర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. -
సమయం వచ్చేసింది... సాక్షి క్రికెట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీకి ఎంట్రీల ఆహ్వానం
మీకు క్రికెట్ అంటే ప్రాణమా? ప్రతిభ ఉన్నా సత్తా చాటుకోవడానికి సరైన వేదిక కోసం వేచి చూస్తున్నారా? అయితే ఎందుకు ఆలస్యం... సమయం వచ్చేసింది... బ్యాట్ పట్టుకోండి... బంతితో చెలరేగిపోండి... మీ కలలను నిజం చేసుకోండి... ప్రస్తుతం మీరు చేయాల్సిందల్లా ... ముందుగా ఎంట్రీలు పంపించడం... ఆ తర్వాత మైదానంలోకి దిగడమే! ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ఔత్సాహిక క్రికెటర్లకు సువర్ణావకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో డిసెంబర్ చివరి వారంలో సాక్షి క్రికెట్ ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) మూడో సీజన్ మొదలుకానుంది. ఎస్పీఎల్ రెండో సీజన్లో ఆంధ్రప్రదేశ్ సీనియర్ విభాగంలో శ్రీ సాయిబాబా నేషనల్ డిగ్రీ కాలేజీ (అనంతపురం), జూనియర్ విభాగంలో శాతవాహన జూనియర్ కాలేజీ (శ్రీకాకుళం) చాంపియన్స్‌గా నిలిచాయి. తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ రీజియన్ సీనియర్ విభాగంలో భవన్స్ డిగ్రీ కాలేజీ (సైనిక్‌పురి), జూనియర్ విభాగంలో భవాన్స్ శ్రీ ఆరంబిందో జూనియర్ కాలేజీ (సైనిక్‌పురి), నార్త్ తెలంగాణ రీజియన్ సీనియర్ విభాగంలో వాగ్దేవి డిగ్రీ కాలేజీ (మంచిర్యాల), ఎస్ఆర్ఆర్ జూనియర్ కాలేజీ (మంచిర్యాల), సౌత్ తెలంగాణ రీజియన్ సీనియర్ విభాగంలో మాస్టర్జీ పీజీ కాలేజీ (హనుమకొండ) జూనియర్ విభాగంలో హార్వెస్ట్ జూనియర్ కాలేజీ (ఖమ్మం) టైటిల్స్ నెగ్గాయి. టోర్నీ ఫార్మాట్... ముందుగా జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లను 10 ఓవర్లపాటు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో విజేతగా నిలిచిన జట్లు ప్రాంతీయ స్థాయి టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లను 20 ఓవర్లపాటు నిర్వహిస్తారు. ప్రాంతీయ స్థాయి టోర్నీ విజేతలు రాష్ట్ర స్థాయిలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో టైటిల్ కోసం తలపడతాయి. తెలంగాణలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపాదికగా ఎంట్రీలు స్వీకరిస్తారు. ఎంట్రీ ఫీజు... ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే జట్లు రూ. 1,500 ఎంట్రీ ఫీజుగా చెల్లించాలి. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్ పద్ధతిలోనూ చెల్లించవచ్చు. వివరాలకు సాక్షి జిల్లా యూనిట్ కార్యాలయంలో సంప్రదించాలి. www.arenaone.in వెబ్సైట్లోనూ వివరాలు లభిస్తాయి. ఎంట్రీలను డిసెంబర్ 10వ తేదీలోపు పంపించాలి. ఏ ఏ విభాగాల్లో... సాక్షి ప్రీమియర్ లీగ్‌ను రెండు కేటగిరీల్లో నిర్వహిస్తారు. అండర్–19 జూనియర్ స్థాయిలో (1–12–2002 తర్వాత జన్మించి ఉండాలి)... అండర్–25 సీనియర్ స్థాయిలో (1–12–1996 తర్వాత జన్మించి ఉండాలి) వేర్వేరుగా నిర్వహిస్తారు. జూనియర్ స్థాయిలో ఆడేందుకు జూనియర్ కాలేజీ జట్లకు, సీబీఎస్ఈ స్కూల్ (ప్లస్ 11,12) జట్లకు, ఐటీఐ, పాలిటెక్నిక్ జట్లకు అర్హత ఉంది. సీనియర్ స్థాయిలో ఆడేందుకు డిగ్రీ, పీజీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీ జట్లకు అవకాశం కల్పిస్తారు. ఎన్ని జట్లకు అవకాశం... ఒక్కో కాలేజీ నుంచి గరిష్టంగా రెండు జట్లను పంపించే వెసులుబాటు ఉంది. రెండు జట్లు కూడా వేర్వేరుగా ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ఒక జట్టులో ఆడే ఆటగాడు మరో జట్టుకు ఆడకూడదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం.... www.arenaone.in వెబ్సైట్లో లాగిన్ కావాలి. మ్యాచ్‌లు ఆడే సమయంలో ఆటగాళ్లు వయసు ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. మ్యాచ్ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్) చూపించాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్‌గ్లౌవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూస్ ధరించాలి. గమనిక: అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం. ► తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలను మూడు రీజియన్లుగా విభజించారు. ► రీజియన్–1లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ ఉన్నాయి. ► రీజియన్–2లో వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉన్నాయి. ∙ రీజియన్–3లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉన్నాయి. ► ఒక్కో జోన్ నుంచి విజేత జట్టు రాష్ట్రస్థాయి టోర్నీకి అర్హత సాధిస్తుంది. ఇతర వివరాలకు నిర్వాహకులను సంప్రదించాల్సిన ఫోన్‌నంబర్లు (తెలంగాణ రీజియన్) 99120 35299 (హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్) 950 551 4424, 96660 13544 (వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్) -
చాంప్స్ శాతవాహన, ఎస్ఎస్బీఎన్ కాలేజి జట్లు
విజయవాడ స్పోర్ట్స్: సాక్షి మీడియా గ్రూప్, కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో జూనియర్స్ విభాగంలో శాతవాహన జూనియర్ కాలేజీ (శ్రీకాకుళం)... సీనియర్స్ విభాగంలో శ్రీ సాయిబాబా నేషనల్ డిగ్రీ కాలేజి (అనంతపురం) జట్లు చాంపియన్స్‌గా నిలిచాయి. జూనియర్ విభాగం ఫైనల్లో శాతవాహన కాలేజి రెండు వికెట్ల తేడాతో ఎమరాల్డ్స్ జూనియర్ కాలేజి (తిరుపతి, చిత్తూరు) జట్టుపై నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎమరాల్డ్స్ కాలేజి నిర్ణీత 10 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 80 పరుగులు చేసింది. ప్రణయ్ (33 పరుగులు), గగన్ (15 పరుగులు) రాణించారు. శాతవాహన కాలేజి బౌలర్ ఉదయ్ మూడు వికెట్లు పడగొట్టాడు. 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శాతవాహన కాలేజి 9.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసి విజయం సాధించింది. వాసు (19), ఉదయ్ (18), సోమేశ్ (28 నాటౌట్) ఆకట్టుకున్నారు. ఉదయ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఎమరాల్డ్స్ కాలేజి 20 పరుగుల ఆధిక్యంతో చీరాల పాలిటెక్నిక్ కాలేజి (ప్రకాశం) జట్టును ఓడించి ఫైనల్ చేరింది. తొలుత ఎమరాల్డ్స్ జట్టు 10 ఓవర్లలో మూడు వికెట్లకు 90 పరుగులు చేసింది. సోహన్ (47), గగన్ (28) దూకుడగా ఆడారు. అనంతరం 91 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన చీరాల పాలిటెక్నిక్ కాలేజీ జట్టు 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసి ఓడిపోయింది. జూనియర్స్ విభాగంలో చీరాల పాలిటెక్నిక్ కాలేజి మూడో స్థానంలో నిలిచింది. ఖాదర్ వలీ విజృంభణ సీనియర్స్ విభాగంలో శ్రీ సాయిబాబా నేషనల్ డిగ్రీ కాలేజి (ఎస్ఎస్బీఎన్–అనంతపురం), కృష్ణ చైతన్య డిగ్రీ, పీజీ కాలేజి (నెల్లూరు) జట్ల మధ్య ‘బెస్ట్ ఆఫ్ త్రీ’ పద్ధతిలో ఫైనల్స్ నిర్వహించారు. గురువారం చెరో మ్యాచ్‌లో నెగ్గి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. శుక్రవారం జరిగిన చివరి ఫైనల్ మ్యాచ్‌లో ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కాలేజి ఎనిమిది వికెట్ల తేడాతో కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజిపై విజయం సాధించి ఓవరాల్‌గా 2–1తో టైటిల్‌ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కృష్ణ చైతన్య కాలేజి నిర్ణీత 10 ఓవర్లలో 72 పరుగులకు ఆలౌటైంది. ఫారూఖ్ 18 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎస్ఎస్బీఎన్ కాలేజి బౌలర్ ఖాదర్ వలీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. 73 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఎస్బీఎన్ కాలేజి 8.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అధిగమించి గెలిచింది. బౌలింగ్‌లో నాలుగు వికెట్లతో అదరగొట్టిన ఖాదర్ వలీ బ్యాటింగ్‌లోనూ రాణించి 23 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో బ్యాట్స్‌మన్ రోహిత్ రోషన్ 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన ఖాదర్ వలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. విజేత జట్లకు కేఎల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వైవీఎస్‌ఎస్‌ఎస్‌యూ ప్రసాద రావు, సాక్షి రెసిడెంట్ ఎడిటర్ ఎం.రమణమూర్తి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి జనరల్ మేనేజర్ బొమ్మారెడ్డి వెంకటరెడ్డి, సాక్షి విజయవాడ బ్రాంచ్ మేనేజర్ సింహాద్రి అప్పన్న, హెచ్ఆర్ సంతోష్, ఈవెంట్ ఆర్గనైజర్ శ్రీహరి పాల్గొన్నారు. జూనియర్స్ విభాగంలో ఉదయ్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’... గగన్ ‘బెస్ట్ ఆల్‌రౌండర్’... సోహన్ ‘బెస్ట్ బ్యాట్స్‌మన్’... ఉదయ్ ‘బెస్ట్ బౌలర్’ అవార్డులు గెల్చుకున్నారు. సీనియర్స్ విభాగంలో ఎస్ఎస్బీఎన్ కాలేజికి చెందిన ఖాదర్ వలీ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’... మహేంద్ర ‘బెస్ట్ ఆల్‌రౌండర్’... రోహిత్ రోషన్ ‘బెస్ట్ బ్యాట్స్‌మన్’... ఖాదర్ వలీ ‘బెస్ట్ బౌలర్’ పురస్కారాలు అందుకున్నారు. సీనియర్స్ విభాగంలో విజేతగా నిలిచిన ఎస్ఎస్బీఎన్ కాలేజి (అనంతపురం) జట్టు