మార్కెట్లోకి ‘సాక్షి’ టెన్త్‌క్లాస్ బుక్లెట్లు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థుల కోసం ‘సాక్షి’ రూపొందించిన టెన్త్‌క్లాస్ బుక్లెట్లు విడుదలయ్యాయి. పరీక్షలు మార్చి 27 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్షలాది విద్యార్థుల ప్రయోజనార్థం ‘సాక్షి’.. ఆంగ్లం, గణితశాస్త్రం, భౌతిక-రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం సబ్జెక్టుల్లో మొత్తం పది బుక్లెట్లను ప్రచురించింది. తెలుగుతోపాటు ఇంగ్లిష్ మీడియంలోనూ అందుబాటులోకి తెచ్చింది.
ఈ పుస్తకాల్లో ప్రారంభంలో ఇచ్చిన ప్రిపరేషన్ గెడైన్స్ విద్యార్థికి సబ్జెక్టుపై పూర్తి అవగాహన పెంపొందిస్తుంది. దీంతోపాటు ప్రతి అధ్యాయం పరిచయం, ముఖ్య నిర్వచనాలు, సూత్రాలు, 1, 2, 4, 5 మార్కుల ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఖాళీలు, జతపర్చడం, క్విక్ రివ్యూ, బ్లూప్రింట్, ప్రీవియస్ పేపర్లు, మోడల్ పేపర్లు వంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఒక్కో బుక్లెట్ ధర రూ.30 మాత్రమే.
ఏ గ్రేడ్ సాధించాలనుకునే ప్రతి విద్యార్థీ కచ్చితంగా చదవాలనే రీతిలో, నిష్ణాతులైన ఉపాధ్యాయుల సహకారంతో తీర్చిదిద్దిన ఈ పుస్తకాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. గతేడాది తెలుగు మీడియంలో రూపొందించిన పుస్తకాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి విశేష ఆదరణ లభించింది.