Samaikya resolution
-
తొలి తీర్మానం వైఎస్సార్ కాంగ్రెస్‌దే
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్మానంతో పాటు మరో పది అనధికార తీర్మానాలు అందాయని శాసనసభలో ప్రకటించిన స్పీకర్ వాటన్నింటినీ సభలో ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. అయితే అధికారిక తీర్మానంతో పాటు మిగిలిన అన్ని తీర్మానాలు ఒకే అంశంపై ఇచ్చినందున అన్నింటినీ చేపట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇలా వచ్చిన తీర్మానాల్లో మొట్టమొదటి తీర్మానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని శాసనసభలో తీర్మానం చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత విజయమ్మ నేతృత్వంలోని ఎమ్మెల్యేల సంతకాలతో డిసెంబర్ 12 ఉదయం స్పీకర్‌కు నోటీసు అందజేశారు. అసెంబ్లీ రూల్ 77 కింద ఇచ్చిన మొదటి నోటీసు ఇదే. అదే రోజు మధ్యాహ్నం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, గాదె వెంకటరెడ్డి తదితర ఎమ్మెల్యేలు వైఎస్సార్ సీపీ తరహాలోనే రూల్ 77 కింద స్పీకర్‌కు నోటీసులు అందించారు. మధ్యాహ్నం తర్వాత టీడీపీ ఎమ్మెల్యే ఎం.లింగారెడ్డి అదే మాదిరి నోటీసును స్పీకర్‌కు అందజేశారు. బిల్లు అసమగ్రంగా, తప్పుల తడకగా ఉందని, దీన్ని తిప్పి పంపాలని కోరుతూ విజయమ్మ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిసెంబర్ 16న రూల్ 77 కింద స్పీకర్‌కు మరో నోటీసు ఇచ్చారు. డిసెంబర్ 12న, 16న ఇచ్చిన నోటీసులను గుర్తుచేస్తూ విజయమ్మ జనవరి 24న స్పీకర్‌కు ప్రత్యేకంగా లేఖ కూడా రాశారు. ఆ తర్వాతి రోజు జనవరి 25న చర్చలో పాల్గొన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఆ రోజు సభ వాయిదా పడిన తర్వాత.. బిల్లును తిప్పిపంపాలంటూ రూల్ 77 కింద స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. అదే రోజున టీడీపీ ఎమ్మెల్యేలు పి.అశోకగజపతిరాజు నేతృత్వంలో రూల్ 77 కింద నోటీసు ఇచ్చారు. వైఎస్సార్ సీపీ ఓటింగ్‌కు పట్టుపడితే విమర్శలు చేసిన టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు.. మళ్లీ ఓటింగ్ జరపాలని కోరుతూ జనవరి 26న స్పీకర్‌కు నోటీసులు ఇచ్చారు. బిల్లు అసమగ్రంగా ఉందంటూ లోక్‌సత్తా ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ్ కూడా జనవరి 27న రూల్ 77 కింద నోటీసు ఇచ్చారు. -
సమైక్య తీర్మానమే రాష్ట్రానికి రక్ష
-
సమైక్య తీర్మానమే రాష్ట్రానికి రక్ష
* ‘సాక్షి’తో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి ఉద్ఘాటన * రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర విభజన ప్రక్రియ * తీర్మానం కోరకుండా నేరుగా ముసాయిదా బిల్లు పంపడం చట్టసభలను అవమానించడమే * అసెంబ్లీ విభజనకు అనుకూలమా? ప్రతికూలమా ముందు తేలాలి * ఈ అంశంపై సీఎం అనుబంధ తీర్మానం ప్రతిపాదించొచ్చు * సమైక్య రాష్ట్రంపై చిత్తశుద్ధిలేనివారే సమైక్య తీర్మానానికి పట్టుబట్టరు * విభజనపై సభల అభిప్రాయం తీసుకోకుండా డ్రాప్టుపై చర్చకు అర్థం లేదు * ముసాయిదాపై చర్చకు అంగీకరించడమంటే.. విభజనకు అంగీకరించినట్లే! * తీర్మానానికి అసెంబ్లీలో పట్టుబట్టాలేగాని.. సభనూ ఎవరూ బాయ్‌కాట్ చేయకూడదు * బాయ్‌కాట్ చేస్తే టీ సభ్యులు చెప్పిందే సభ అభిప్రాయంగా కేంద్రానికి పంపే ప్రమాదముంది * జగన్మోహన్రెడ్డి చొరవతో రాష్ట్ర విభజనపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రను కాంక్షిచేవారందరూ.. సమైక్య రాష్ట్ర తీర్మానం చేయాల్సిందిగా అసెంబ్లీలో పట్టుబట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, సమైక్యాంధ్రను కాంక్షించేవారు అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌ను విభజించే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ (రాష్ట్రాల విభజన, కలపడం, సరిహద్దుల మార్పు) విషయంలో చట్టసభలకున్న అధికారాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇది చట్టసభలను (ప్రజలను) అవమానించడమే. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎలాంటి ప్రాతిపదిక లేకుండా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం సుమోటోగా విభజన బిల్లు రూపొందించి శాసనసభ అభిప్రాయాల (వ్యూస్) కోసం పంపింది. ఇందులో కూడా రాష్ట్రాన్ని విభజించాలా? కలిపి ఉంచాలా? అనే ఆప్షన్ లేదు. అందువల్ల దీనిపై చర్చలో పాల్గొనడమంటే సూత్రప్రాయంగా రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లే అవుతుంది. అందువల్ల దీనిపై చర్చను అడ్డుకుని సమైక్య తీర్మానం కోసం సభ్యులు పట్టుబట్టాల్సిందే’ అని లక్ష్మణరెడ్డి స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డి మొదట నుంచి చేసిన డిమాండు ఇదే కదా! రాష్ట్రానికి కేంద్రం నుంచి ముసాయిదా బిల్లు రాకముందే సమైక్య రాష్ర్టం కోసం అసెంబ్లీలో తీర్మానం చేద్దామని అన్ని రాజకీయ పక్షాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా ముందే విజ్ఞప్తి చేశారు. అప్పట్లో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక తరఫున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఇదే ప్రతిపాదన చేశాను. రాష్ట్ర పునర్విభజనపై తీర్మానం కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఎటూ ప్రతిపాదన పంపుతుందని, అప్పుడూ వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ద్వారా తీర్మానం పంపితే బాగుంటుందని సీఎం చెప్పారు. కేంద్రం నుంచి ప్రతిపాదన రాకముందే మనం సుమోటోగా తీర్మానం పంపినా పక్కన పడేసే అవకాశం ఉందని సీఎం చెప్పడంతో ఆనాడు సంతృప్తి చెందాం. తర్వాత దిగ్విజయ్‌సింగ్, షిండేతోపాటు ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం చెప్పాల్సిందిగా ఒకసారి తీర్మానం కోరతారని, మరోసారి ముసాయిదా బిల్లు వస్తాయని ప్రకటించారు. ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీర్మానాన్ని కోరకుండా నేరుగా ముసాయిదా బిల్లునే పంపింది. ఇందులో కూడా రాష్ట్ర విభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? అనే క్లాజు లేదు. ఇది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉంది. ఆర్టికల్ 3 కింద రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం కేంద్ర ప్రభుత్వానిదే కదా? రాష్ట్రాలను అడ్డగోలుగా విభజించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించలేదు. రాష్ట్ర విభజనకు రెండు విధానాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం పంపితే దానిని కేబినెట్ ఆమోదించి తర్వాత ముసాయిదా బిల్లు రూపొందించి పంపడం ఒక విధానం. కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్రాల పునర్విభజన కమిటీ(ఎస్ఆర్సీ) తరహాలో నిపుణుల కమిటీని వేయడం. ఆ కమిటీ నివేదికను పార్లమెంటులో చర్చించి పార్లమెంటు చేసే సవరణల ప్రకారం ముసాయిదా బిల్లును రూపొందించడం. మన రాష్ట్రం విషయంలో ఇవి రెండూ జరగలేదు. నేరుగా కేంద్రం తనకు నచ్చినట్లు ముసాయిదా బిల్లు రూపొందించింది. చట్టసభలు రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంటే ఆర్టికల్ -3 ద్వారా దానిని అమలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మామూలుగా కూడా చట్టసభలు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే దాన్నిఅమలు చేసే అధికారం ప్రభుత్వానికి (కార్యనిర్వాహక వ్యవస్థకు) ఉంటుంది. ఆర్టికల్ -3 సవరించాలనే డిమాండుపై.. కేంద్రం ప్రభుత్వమంటే అధికారపక్షమే. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా భావిస్తున్న ప్రస్తుత అధికార పక్షం తనకు అనుకూలించే రాజకీయ ధ క్పథంలో ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించే ప్రయత్నం చేస్తోంది. అందువల్లే రాష్ట్రాల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఆంధ్రను కేంద్రం విభజిస్తున్న విషయాన్ని, ఆర్టికల్-3ను సవరించాల్సిన అవసరం గురించి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ పార్టీల నేతలను కలిసి వివరించారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం జగన్ చొరవ వల్ల ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. అసెంబ్లీ తీర్మానం లేకుండా ఆంధ్రను విభజిస్తే అంగీకరించబోమని, పార్లమెంటులో వ్యతిరేకిస్తామని వివిధ రాష్ట్రాలకు చెందిన పలు పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు చెప్పారు. మరిప్పుడు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ముందున్న పరిష్కారమార్గం ఏమిటి? రాష్ట్ర విభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? అనే అంశంపై సభ అభిప్రాయం తీసుకుని ఓటింగ్ నిర్వహించాలని సభా నాయకుడైన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిపాదించొచ్చు. సభలో ఎవరైనా అంశంపై ప్రైవేటు తీర్మానం ప్రతిపాదించినా స్పీకరు ఆమోదించాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజనకు సంబంధించి తీర్మానం చట్టసభల నుంచే రావాలి. అయితే మన రాష్ట్ర విభజనకు సంబంధించి అటు పార్లమెంటులో గానీ, ఇటు అసెంబ్లీలోగానీ తీర్మానం జరగలేదు. కేంద్ర ప్రభుత్వమే సుమోటోగా ముసాయిదా బిల్లును రూపొందించి రాష్ట్రంపై రుద్దింది. ఇది చట్టసభలను అగౌరవపరచడమే. ఈ నేపథ్యంలో మన చట్టసభకు ఉన్న అధికారాన్ని వినియోగించుకునేందుకు సమైక్య తీర్మానం కోరుతూ సభ్యులు నోటీసు ఇస్తే స్పీకరు అనుమతించాల్సిందే. లేకపోతే మన సభ గౌరవాన్ని మన సభాపతే మంటగలిపినట్లు అవుతుంది. సభ గౌరవాన్ని కాపాడాల్సిన స్థానంలో ఉన్న స్పీకరు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించలేరు. రాష్ట్రపతి పంపిన ముసాయిదాకు ప్రాధాన్యం అంటున్నారు? అసలు ఇది రాష్ట్రపతి పంపినది కాదు. కేంద్ర హోంశాఖ రూపొందించి పంపిన ముసాయిదా బిల్లు మాత్రమే. ప్రొసీజర్‌లో భాగంగా రాష్ట్రపతికి వెళ్లి వస్తుంది. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాలు వెళ్లిన తర్వాత కేబినెట్ మళ్లీ దానిని రాష్ట్రపతికి పంపితే రాష్ట్ర విభజన బిల్లు ప్రతిపాదించాలా? వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుని కేబినెట్‌కు పంపుతారు. అయితే రాష్ట్ర విభజనపై సభ అభిప్రాయాలు తెలియకుండా విభజనవల్ల తలెత్తే అంశాలపై సభలో ఎలా చర్చిస్తారు? ముందు విభజనకు అనుకూలమా? ప్రతికూలమా? అనే అంశం తేల్చాలి. విభనకు సభ అనుకూలమని (మెజార్టీ సభ్యుల అభిప్రాయాలే(వ్యూస్) సభ అభిప్రాయాలుగా పరిగణిస్తారు) సభ అభిప్రాయపడితే విభజన బిల్లుపై చర్చించవచ్చు. రాష్ట్రాన్ని విభజించవద్దని సభ అభిప్రాయపడితే తదుపరి ముసాయిదా బిల్లుకే విలువ ఉండదు. క్లాజుల వారీ ముసాయిదా బిల్లుపై చర్చించాలని సీఎం అంటున్నారు? అది అర్థరహితం. సీమాంధ్ర ప్రజలు ముక్తకంఠంతో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు. సీమాంధ్ర శాసనసభ్యులు కూడా రాజ్యాంగ విరుద్ధంగా, చట్టసభల తీర్మానం లేకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు పంపిందని, దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని బయట చెబుతున్నారు. ఇలాంటప్పుడు విభజన బిల్లుకు సంబంధించి క్లాజులపై ఎలా చర్చిస్తారు? చర్చను అంగీకరించడమంటే.. రాష్ట్ర విభజనను సూత్రప్రాయంగా అంగీకరించినట్లే కదా? ఇప్పుడు చర్చలో పాల్గొంటే .. రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లును పంపిందని సుప్రీంకోర్టులో ఎలా వాదిస్తారు? రాజ్యాంగ విరుద్ధమైతే చర్చలో ఎలా పాల్గొన్నారని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే కేసు బలహీనపడుతుంది. అందువల్ల బిల్లుపై ఎట్టి పరిస్థితుల్లో చర్చకు అంగీకరించరాదు. రాష్ట్ర విభజన గురించి కేంద్రం ప్రకటించగానే సీమాంధ్ర రాజధాని కోసం రూ. 4 లక్షల కోట్లు ఇవ్వాలని డిమాండు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు సమన్యాయం అంటూ తప్పించుకు తిరుగుతున్నారు.. సీఎం మాత్రం విభజనకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ క్లాజులవారీగా ముసాయిదా బిల్లుపై చర్చించాలంటున్నారు.. దీనిని ఏమనుకోవాలి? అందుకే రాష్ట్ర విభజనకు అనుకూలమా? ప్రతికూలమా? అనే అంశంపై సభలో చర్చించాలని పట్టుబడితే సమన్యాయం అనేవారు, విభజనను అడ్డుకుంటామంటూ పరోక్షంగా సహకరించే వారి బండారం బయటపడుతుంది. విభజనకు వ్యతిరేకంగా నిలిచిందెవరో? ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా విభజనకు సహకరించేదెవరో ఓటింగ్‌లో తేలిపోతుంది. వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. అందుకే రాష్ట్ర విభజనను బహిరంగంగా వ్యతిరేకించకుండా గూడు పుఠాణి చేసేవారే, సమైక్య రాష్ట్రంపై చిత్తశుద్ధి లేనివారే తీర్మానం కోసం పట్టుబట్టకుండా వెనుకంజ వేస్తారు. బహిష్కరించవద్దు సమైక్య తీర్మానం కోసం సభ్యులు పట్టుబట్టాలేగానీ స్పీకరు అనుమతించకపోతే బాయ్‌కాట్ చేయరాదు. స్పీకరు సస్పెండు చేస్తే తప్ప సీమాంధ్ర సభ్యులెవరూ బాయ్‌కాట్ చేయరాదు. బాయ్‌కాట్ చేస్తే తెలంగాణ సభ్యులే అనుకూలంగా మాట్లాడి సభ అభిప్రాయం కింద కేంద్ర ప్రభుత్వానికి పంపే ప్రమాదం ఉంది. ఒక వేళ స్పీకరు సస్పెండ్ చేస్తే ఆ విషయం రికార్డు అవుతుంది. అప్పుడు సభ్యులంతా సమైక్యానికే కట్టుబడి ఉన్నట్లు అఫిడవిట్లు సమర్పించవచ్చు. మమ్మల్ని సభ నుంచి బహిష్కరించి అతి తక్కువమంది అభిప్రాయాన్నే సభ అభిప్రాయం కింద పంపారని వాదించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అంశాన్ని రాష్ట్రపతితోపాటు కోర్టులు కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. -
బాబు బాల్ వేయరు...కిరణ్ బ్యాటింగ్ చేయరు
-
సమైక్య తీర్మానం
-
'వైఎస్ఆర్ సీపీ సమైక్య తీర్మానం పెడితే అడ్డుకుంటాం'
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు సమైక్య తీర్మానం పెడితే తెలంగాణ ఎమ్మెల్యేలంతా అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో తెలిపారు. తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టాలని కొన్నేళ్లుగా తాము కొరినా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సమైక్య తీర్మానాన్ని ఇప్పుడెలా ప్రవేశపెడతారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చిన ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజన బిల్లుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు,ఎంపీలు మాదిరిగా అసెంబ్లీలో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజనకు సహకరిస్తారని రాంరెడ్డి దామోదరరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బిల్లును వెంటనే శాసనసభకు పంపాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షుడు దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఆయన్ని అడ్డుకుంటే జరిగే పరిణామాలకు వారే బాధ్యులు అవుతురని ఆయన సీమాంధ్ర నేతలు, ఉద్యోగులకు పరోక్షంగా హెచ్చరించారు. అలాగే సభలో తెలంగాణ బిల్లు అడ్డుకుంటే భాగ్యనగరంలోని సీమాంధ్రులకు ఏదైన జరిగితే కూడా వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. -
సమైక్య తీర్మానంతోనే విభజనకు అడ్డుకట్ట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఇప్పుడిప్పుడే వాస్తవ అంశాలు అవగతమవుతున్నాయి. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయడం ద్వారా విభజనను అడ్డుకోవచ్చని, రాష్ట్ర సమైక ్యతను కాపాడుకోగలుగుతామని వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న వాదన దారిలోకి వస్తున్నారు. విభజన బిల్లు రాష్ట్రానికి రాకముందే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని సోమవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందానికి నివేదించాల్సిన అంశాలపై సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సీఎం క్యాంపుకార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, శైలజానాధ్, గంటా శ్రీనివాసరావు, సి.రామచంద్రయ్య, శత్రుచర్ల విజయరామరాజు, కొండ్రు మురళితో సహ 16 మంది మంత్రులు, 33 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అనంత వెంకటరామిరెడ్డి, హర్షకుమార్ పాల్గొన్నారు. సమైక్యతను కోరుతూ గతంలో చేసిన తీర్మానాన్నే పునరుద్ఘాటించి దాన్నే మంత్రుల బృందానికి పంపించాలని నిర్ణయించారు. అధిష్టానం తీరును, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరిని సమావేశంలో న్యాయశాఖ మంత్రి ఎరాసు ప్రతాప్‌రెడ్డి, ఇతర నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. అసెంబ్లీకి విభజన బిల్లు రాకముందే శాసనసభను సమవేశపరచి సమైక్య తీర్మానం చేయాలన్నారు. ఈపాటికే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చే సి ఉంటే కేంద్రం అంత త్వరగా ముందుకు వెళ్లే అవకాశం ఉండేది కాదని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిప్రాయపడ్డారు. మంత్రి కొండ్రు సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక దశలో ఆయనపై మూకుమ్మడిగా దాడి చేసేంత పరిస్థితి ఏర్పడినట్టు సమాచారం. -
విభజనను వ్యతిరేకిస్తూ గ్రామసభల తీర్మానం
* వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సర్పంచ్ల పోరు * పార్టీ శ్రేణుల ఆందోళనలతో దద్దరిల్లిన సీమాంధ్ర సాక్షి నెట్వర్క్: దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ ప్రథమ పౌరులు ముందడుగు వేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో గత నెల 2వ తేదీ గాంధీ జయంతి నాటి నుంచి సమగ్ర కార్యాచరణతో ఉద్యమిస్తున్న వైఎస్సార్సీపీ శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సం నాడు విభజనను వ్యతిరేకిస్తూ వేలాది గ్రామసభల్లో ఏకగ్రీవతీర్మానాలు చేయించింది. పార్టీ పిలుపుమేరకు వేలాదిమంది సర్పంచ్‌లు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరుతూ ఆయా పంచాయతీల గ్రామసభల్లో తీర్మానాలు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానాలను రాష్ట్రపతి, ప్రధానమంత్రిలకు పంపనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. విశాఖ జిల్లావ్యాప్తంగా 335 గ్రామసభల్లో సమైక్యరాష్ట్రం కోరుతూ తీర్మానం చేయగా, శ్రీకాకుళం జిల్లాలో 367 గ్రామసభల్లో, విజయనగరం జిల్లాలో 218 గ్రామసభల్లో ఆ మేరకు తీర్మానం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 254 గ్రామసభల్లోనూ, వైఎస్సార్ జిల్లాలో 391, అనంతపురంలో 314, నెల్లూరు జిల్లాలోని 244 గ్రామసభల్లో సమైక్య తీర్మానాలు చేశారు. కర్నూలు, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ వందలాది గ్రామాల్లో సర్పంచ్‌లు సభలు నిర్వహించి రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరుతూ తీర్మానాలు చేశారు. సమైక్య రాష్ట్రం కోరుతూ పార్టీకి చెందిన విశాఖ జిల్లా జామిగుడ, గిన్నెలకోట సర్పంచ్‌లు కుమడ సుబ్బారావు, లకే దేవకుమారిలు శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేసి పత్రాలను జిల్లా అధికారులకు అందజేశారు. విభజన కారకుల దిష్టిబొమ్మల దహనం నరక చతుర్దశిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి వైఎస్సార్ సీపీ శ్రేణులు సీమాంధ్ర జిల్లాల్లో విభజన రాక్షస సంహార కార్యక్రమాన్ని చేపట్టాయి. రాజమండ్రి, జగ్గంపేటలలో సోనియా, కేసీఆర్, కిరణ్, చంద్రబాబుల దిష్టిబొమ్మలను విభజన నరకాసురులిగా కూర్చి దహనం చేశారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, గణపవరం, నిడదవోలు, కొవ్వూరు, నరసాపురం ప్రాంతాల్లోనూ వీరి దిష్టిబొమ్మలను దహనం చేశారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, జామి, ఎస్‌కోట ప్రాంతాల్లో కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కర్నూలు, డోన్లలో, వైఎస్ఆర్ జిల్లా రాజంపేట, కడపల్లో విభజన నరకాసుర వధ పేరిట దిష్టిబొమ్మల దహనాలు చేపట్టారు. విజయమ్మను అడ్డుకోవడంపై ఆగ్రహజ్వాలలు నల్లగొండలో వైఎస్ విజయమ్మ పర్యటనను అడ్డుకున్నందుకు నిరసనగా కృష్ణాజిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం గ్రామంలో రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా గుమ్మంపాడు సర్పంచ్ పెన్మత్స రామరాజు 24 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. వాడవాడలా హోరెత్తిన నిరసనలు రాష్ర్ట విభజన జరిగితే విద్యార్థులు గొర్రెలు మేపి బతకాల్సి వస్తుందన్న సందేశంతో తిరుపతి నగర పరిధిలోని తిమ్మినాయుడుపాలెంలో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కాన్వొకేషన్ కోటు ధరించి, డిగ్రీ పట్టా నమూనాలను గొర్రెలకు తినిపించి నిరసన వ్యక్తం చేశారు. విభజన జరిగితే హైదరాబాద్‌కు పాస్‌పోర్టు తప్పదన్న సందేశంతో వైఎస్సార్ సీపీ చంద్రగిరి నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యవాదులు పాస్‌పోర్టుల కోసం దరఖాస్తులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. బాలాజీ చౌక్ వద్ద రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పార్టీ నేతలు క్షీరాభిషేకాలు చేశారు. గుంటూరు నగరంలో పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు మానవ హారం నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో పార్టీ ఆధ్వర్యంలో 10 వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగు తల్లి విగ్రహాన్ని పట్టణంలో ఊరేగించారు. పూల అంగళ్ళ కూడలిలో తెలుగు తల్లికి రాష్ట్ర విభజన సెగ తగలకూడదంటూ 101 బూడిద గుమ్మడికాయలతో మహిళలు దిష్టి తీశారు. ఇక అక్టోబర్ 2 నుంచి సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గకేంద్రాల్లో పార్టీశ్రేణులు చేపట్టిన రిలే నిరశన దీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. -
ఏమార్చేందుకే కిరణ్ డ్రామా!
* హైకమాండ్ గీత దాటకుండా గీతోపదేశాలు * అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసే అవకాశాన్ని కావాలనే కాలరాస్తున్నారు * సభను సమావేశపరిచే అధికారం తన చేతిలోనే ఉన్నా విస్మరిస్తున్నారు * తీర్మానం చేయకుండా రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలతో మోసం చేస్తున్నారు * ‘కేబినెట్ నోట్’ను అసెంబ్లీలో వ్యతిరేకిద్దామంటూ ఇంతకాలం మభ్యపెట్టారు * రాష్ట్రంలో ఉద్యోగుల సమ్మెను విరమింపజేశారు * సమ్మె కొనసాగుతుంటే బీజేపీ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చేది.. బిల్లు తెచ్చే సాహసం కాంగ్రెస్ చేసేది కాదు * విభజన సజావుగా సాగేందుకే ఇలా.. అంతా అధిష్టానం స్కెచ్‌లో భాగమే.. రాజకీయ పరిశీలకులు, కాంగ్రెస్ సమైక్యవాదుల నుంచి తీవ్ర విమర్శలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గీసిన గీతను దాటకుండా ప్రజలను ఏమార్చడమే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారా? ఆయన వేస్తున్న ప్రతి అడుగు నిస్సందేహంగా ప్రజలను మోసపుచ్చేదిగా ఉన్నదని రాజకీయ పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమంటూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌లకు లేఖల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపిన సీఎం.. తన పరిధిలో ఉన్న అసెంబ్లీ తీర్మానం విషయాన్ని దాటవేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్న అపకీర్తిని మూటగట్టుకుంటున్నారని వారు గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ చేపట్టిన విభజన ప్రక్రియకు ఎలాంటి అవరోధం కలగకుండా తన వంతు కృషి చేస్తూనే సమైక్యవాదినని ముద్ర వేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖలు రాసే బదులు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ శాసనసభ ద్వారా తీర్మానం చేసి యావత్ దేశం దృష్టికి సమస్యను తీసుకువెళ్లే అవకాశాన్ని కిరణ్ కాలరాస్తున్నారని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. శాసనసభలో సమైక్య తీర్మానానికి మద్దతు ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినా ముఖ్యమంత్రిలో చలనం లేకపోవడం కాంగ్రెస్ సీమాంధ్ర నేతలను కలవరపరుస్తోంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వైఖరినే కిరణ్ అవలంబిస్తున్నట్టున్నారనే అనుమానం కాంగ్రెస్‌లోని సమైక్యవాదుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి ఆంధ్రా భవన్లో దీక్ష చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, ఆయన దీక్ష విరమించేలోగా నయానో భయానో ఉద్యోగుల సమ్మె విరమింపజేయడం అన్నీ తమ అనుమానాలను బలపరుస్తున్నాయని సీమాంధ్రకు చెందిన మంత్రి ఒకరు పేర్కొన్నారు. తీర్మానం చేస్తే తన సీటు పోతుందని కిరణ్ భయమా? శాసనసభలో సమైక్య తీర్మానం ప్రవేశపెడితే పార్టీ అధిష్టానం నుంచి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని కిరణ్‌కుమార్‌రెడ్డి భయపడుతున్నట్టు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. విభజనకు ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం కిరణ్‌కు అప్పగించిందని.. అందువల్లే శాసనసభను సమావేశపరచి సమైక్య తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఆయన ముందుకు రావడం లేదని కోస్తా జిల్లాకు చెందిన మంత్రి ఒకరు పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ నోట్ వస్తుందని, దానికి వ్యతిరేకంగా తీర్మానం చేద్దామని ఇంతకాలం కాంగ్రెస్ నేతలను మభ్యపెడుతూ వచ్చిన సీఎం.. అసెంబ్లీని సమావేశపరిచి తీర్మానం చేసే అధికారం తనకే ఉన్నా పట్టించుకోకుండా లేఖలు రాస్తూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ‘శాసనసభను సమావేశపరచడానికి ఇప్పుడు గవర్నర్ నోటిఫికేషన్‌తో కూడా పని లేదు. అసెంబ్లీని ఇప్పటిదాకా ప్రోరోగ్ చేయకపోవడం వల్ల వెంటనే దానిని సమావేపరిచేందుకు వీలుంది. కేంద్రంలో ముసాయిదా బిల్లు తయారయ్యే నాటికయినా అసెంబ్లీని సమావేశపరచేందుకు సీఎం సాహసించడం లేదు. అలా చేస్తే పార్టీ హైకమాండ్ ఆగ్రహానికి గురై పదవిని కోల్పోవాల్సి వస్తుందని కిరణ్ భయపడుతున్నారు’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. వ్యామోహం లేకపోతే ఎందుకు రాజీనామా చేయలేదు? కిరణ్ తనకు పదవీ వ్యామోహం లేదని తన సన్నిహితుల ద్వారా చెప్పిస్తున్నారని.. అదే నిజమైతే తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తరువాత కూడా పదవిని పట్టుకుని వదిలి పెట్టకుండా దర్జాగా అధికార హోదా అనుభవిస్తూనే అడపా దడపా లేఖల పేరుతో ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. విభజన సంకేతాలు వస్తున్న దశలోనే ముఖ్యమంత్రి పదవికి కిరణ్ రాజీనామా చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని.. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ సాహసం చేసి ఉండేది కాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజన తీరు పట్ల జాతీయ పార్టీ బీజేపీ ఇప్పుడిప్పుడే ఆక్షేపణ వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో.. రాష్ట్రాన్ని విభజించాల్సిందేనంటూ చంద్రబాబు ఏకంగా ఢిల్లీలో దీక్ష చేయడం.. ఆయన దీక్ష ముగిసిన తెల్లారే ఉద్యోగ సంఘాల సమ్మెను విరమింపజేయడం అంతా హైకమాండ్ స్కెచ్‌లో భాగమేనని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ఉద్యోగుల సమ్మె ఇంకా కొనసాగి ఉంటే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు కాంగ్రెస్ సాహసించేది కాదని, బీజేపీ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
తక్షణమే అసెంబ్లీ
* సమైక్య తీర్మానం కోసం వైఎస్సార్సీపీ డిమాండ్.. * కుదరదన్న సీఎం.. సచివాలయంలో ఎమ్మెల్యేల ధర్నా * కేంద్రం కోరితే తప్ప తాను ప్రత్యేక భేటీ ఏర్పాటు చేయలేనన్న కిరణ్ * సీ బ్లాక్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన.. అరెస్టు * తక్షణమే సభను సమావేశపరచాలని స్పీకర్‌ను కోరిన ప్రజాప్రతినిధులు * సమైక్యవాదులెవరో, ద్రోహులెవరో తేలిపోతుందని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానించేందుకు శాసనసభను తక్షణమే ప్రత్యేకంగా సమావేశపరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని శుక్రవారం సచివాలయంలో కలిసి ఈ మేరకు డిమాండ్ చేశారు. కానీ అందుకు ఆయన ససేమిరా అన్నారు. అసెంబ్లీ ప్రత్యేక భేటీ కుదరదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం నేపథ్యంలో దానికి విరుగుడుగా శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు, మేకతోటి సుచరిత, ధర్మాన కృష్ణదాస్, కాటసాని రామిరెడ్డి, కె.శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కర రామారావు తదితరులు కిరణ్‌ను కలిశారు. సమైక్య తీర్మానం కోసం అసెంబ్లీని వెంటనే ప్రత్యేకంగా సమావేశ పరచాలని డిమాండ్ చేశారు. కానీ వారి డిమాండ్‌ను కిరణ్ పట్టించుకోలేదు. శీతాకాల సమావేశాలకోసం డిసెంబర్లోనే సభ జరుగుతుందని చెప్పారు. కేంద్రం కోరితే తప్ప తనంతట తానుగా ముందస్తుగా సమావేశాలు ఏర్పాటు చేయలేనని కూడా ఆయన చెప్పినట్టు తెలిసింది. కిరణ్ తీరుతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సమైక్య తీర్మానం కోసం సభను సమావేశపరచాలనే డిమాండ్‌తో ఆయనకు వినతిపత్రం అందించారు. అనంతరం జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేయడమే గాక సీఎం కార్యాలయముండే సీ బ్లాక్ వద్ద ధర్నాకు దిగారు. ‘జగన్‌తోనే సమైక్యాంధ్ర సాధ్యం’, ‘సమైక్య జెండా, రాష్ట్రానికి అండ’, ‘సమైక్యం కోసం సభను సమావేశపరచాలి’, ‘జై సమైక్యాంధ్ర’, ‘బాబు, కిరణ్ మొండి వైఖరి నశించాలి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని అరగంటపాటు అక్కడే బైఠాయించారు. నినాదాలతో హోరెత్తించారు. దాంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కనీసం అక్కడున్న మీడియాతో మాట్లాడటానికీ అనుమతించలేదు. ప్రజాప్రతి నిధుల్ని బలవంతంగా ఎత్తుకెళ్లి వాహనం ఎక్కించి సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తు పై వదిలేశారు. ధర్నా నేపథ్యంలో సచివాలయంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెయిన్‌గేటు నుంచి సీ బ్లాక్ వరకు పోలీసు వలయాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు అసెంబ్లీని తక్షణమే సమావేశపరచాల్సిందిగా స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కూడా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల జరిగే నష్టాల్ని అసెంబ్లీద్వారా ప్రజలకు తెలపాల్సిన అవసరముందన్నారు. అదే సమయంలో సమైక్యవాదులెవరో, సమైక్యం ముసుగులో ద్రోహం చేస్తున్నవారి బండారమేమిటో కూడా బయటపడుతుందన్నారు. శుక్రవా రం మధ్యాహ్నం వారు అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్ కానందున వెంటనే సభను సమావేశపరచాలని కోరారు. సీమాంధ్రలో అగ్నిజ్వాలలు స్పీకర్‌ను కలిసిన అనంతరం సహచర ఎమ్మెల్యేలతో కలసి భూమన మీడియాతో మాట్లాడారు. విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో 79 రోజులుగా అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయన్నారు. ‘‘స్వాతంత్య్ర సంగ్రామం తరవాత అతిపెద్ద ఉద్యమం ఇదే. రాష్ట్రాన్ని విభజిస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఎడారవుతుంది. విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నేతలు తొలి నుంచీ పోరాడుతూనే ఉన్నారు. మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విభజనను వ్యతిరేకిస్తూ జైల్లోనూ, బయటా ఆమరణ దీక్ష చేశారు. ఈ నేపథ్యంలో విభజన విషయంలో ఎవరి బండారమేమిటో ప్రజలకు తెలియాలంటే తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాల్సిన అవసరముంది. విభజనకు వ్యతిరేకంగా ఎగిసిపడుతున్న అగ్ని కీల లను ఆపడానికి సమైక్యవాద ముసుగులో నీళ్లు చల్లుతున్న ద్రోహుల బండారం కూడా సభ ద్వారానే బయటపడుతుంది. మేం సీఎంను కలసి ఇదే విషయం చెప్పి అసెంబ్లీని సమావేశపరచాలని కోరినా ఆయన అంగీకరించలేదు. అసెంబ్లీని సమావేశపరచడానికి డిసెంబర్ 30 దాకా గడువుంది గనుక ఆలోపుసమావేశపరుస్తామని, విభజనపై కేంద్ర కేబినెట్ నోట్ వచ్చినప్పుడు అభిప్రాయ సేకరణ కూడా చేపడతామని బదులిచ్చారు. అసెంబ్లీ తీర్మానం చేసినా దానికి చట్టబద్ధత ఉండదు గనుక అసలు సభను సమావేశపరచాల్సిన అవసరమే లేదని కూడా కిరణ్ అన్నారు’’ అని తెలిపారు. విభజన తొలి ద్రోహి సోనియానే కాంగ్రెస్‌తో వైఎస్సార్సీపీ కుమ్మక్కైందంటూ వస్తున్న వార్తల్ని కొందరు విలేకరులు ప్రస్తావించగా భూమన తీవ్రంగా స్పం దించారు. రాష్ట్ర విభజన విషయంలో తొలి ద్రోహి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీయేనన్నారు. ‘‘మొదటి నుంచీ మేం ఇదే చెబుతూ పోరాడుతూనే ఉన్నాం కదా! సోనియా తరవాత... విభజనకు అనుకూల లేఖలిచ్చి, విభజన జరిగేదాకా నిద్ర కూడా పోకుండా, తీరా విభజన ప్రకటన వచ్చాక ఇప్పుడు హాయిగా నిద్ర పోతున్న చంద్రబాబు మరో ద్రోహి. 3వ అధికరణం ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని మేం చెప్పలేదు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగేలా, అందరి సమ్మతితో ఒక తండ్రిలా న్యాయం చేయాలని మాత్రమే చెప్పాం. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమంటే విభజించాలని కాదు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే న్యాయం జరుగుతుందనేది మా భావన. అంతే తప్ప ఏ ఒక్కరి అభిప్రాయమూ తెలుసుకోకుండా 3వ అధికరణాన్ని దుర్వినియోగం చేస్తూ, ఒక ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేసే నిర్ణయం తీసుకోవాలని కాదు. ఇలాంటి నిర్ణయాన్ని మేం అంగీకరించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టారు. గతంలో రాజీనామా చేసి, వాటిని ఆమోదించాలని స్పీకర్‌ను ఎందుకు కోరలేదని ప్రశ్నిం చగా, ‘అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని అడిగేందుకు వచ్చిన వాళ్లం రాజీనామాలను ఆమోదించాలని కోరతామా?’ అని బదులిచ్చారు. అసెంబ్లీని సమావేశపరిచి అందరి అభిప్రాయాలూ తీసుకున్నాక స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించుకుంటామని శోభా నాగిరెడ్డి చెప్పారు. -
సీఎం ఛాంబర్ ఎదుట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ఆందోళన
శాసనసభను తక్షణమే సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలంటూ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు.అనంతరం వినతి పత్రం సమర్పించారు.అసెంబ్లీని సమావేశ పరచటం కుదరదని చెప్పటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు చేతబట్టి సీఎం ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారుఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను ...పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
బిల్లుకు ముందే తీర్మానం
* విభజనపై ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చేలోగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయాలి * దీనికి వీలుగా తక్షణమే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని ప్రభుత్వాన్ని ఆదేశించండి * గవర్నర్ నరసింహన్‌ను కోరిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వినతిపత్రం అందజేత సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై అభిప్రాయం కోరుతూ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చేలోగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తీర్మానం చేయడానికి శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు తరాల ప్రయోజనాలను కాపాడడానికి వీలుగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలని గవర్నర్‌కు విన్నవించారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి జగన్మోహన్రెడ్డి గురువారమిక్కడ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఒక వినతిపత్రం అందజేశారు. తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడానికి ముందే సమైక్యంగా ఉంచాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడానికి వీలుగా చొరవ చూపించాలని గడిచిన సెప్టెంబర్ 30న సమర్పించిన వినతిపత్రం గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. సీఎం మా అభిప్రాయాన్ని పట్టించుకోలేదు.. ‘‘అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచినట్లయితే ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశమే కాకుండా, వైఖరిని కూడా తెలియజేసేందుకు వీలుంటుంది. నిరంకుశంగా చేసిన విభజన ప్రక్రియను నిలుపుదల చేయడానికి అనువుగా సమైక్య తీర్మానం చేసే అవకాశం లభిస్తుంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సెప్టెంబర్ 26న ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా లేఖ రాశాం. కానీ దురదృష్టవశాత్తూ మా అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు’’ అని వినతిపత్రంలో పేర్కొన్నారు. ‘‘తెలంగాణ అంశంపై కేబినెట్ నోట్‌ను ఆమోదించి, మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి విభజన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. బృందం తన మొదటి సమావేశంలోనే ప్రజాభీష్టాన్ని విస్మరించి, రాష్ట్రాన్ని చీల్చేందుకు కార్యాచరణను రూపొందించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యాలయం జోక్యం చేసుకుని, అసెంబ్లీని సమావేశపరచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. డ్రాప్టు బిల్లు తయారవడానికి ముందే సమైక్య తీర్మానాన్ని ఆమోదించడం ఎంతైనా అవసరం. అసెంబ్లీలో మెజారిటీ ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చేసిన తీర్మానాన్ని గౌరవించాల్సి ఉంటుంది’’ అని విన్నవించారు. దేశం దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించండి.. ‘‘విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరింత ముందడుగు వేయకుండా అసెంబ్లీని సమావేశపరచాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. విభజనపై మా వ్యతిరేకతను వ్యక్తంచేసి, జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలన్న మా ఆలోచనను దేశం దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించాలి. అసెంబ్లీ తీర్మానం చేయాలన్న మౌలిక సంప్రదాయాన్ని విస్మరించి, కొన్ని ఓట్లు, సీట్ల కోసం రాష్ట్ర విభజనకు సిద్ధపడటం సరికాదు. 18 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్న బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా, రాష్ట్రంలోని అరవై శాతం జనాభా గత 70 రోజులుగా తమ నిరసనను వివిధ రూపాలలో వ్యక్తపరుస్తున్న విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. అసెంబ్లీని సమావేశపరిస్తే విభజనకు వ్యతిరేకంగా మా గళాన్ని వినిపించే వీలు దొరుకుతుంది. తద్వారా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నం చేయవచ్చు. తక్షణం అసెంబ్లీని సమావేశపరచాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని వినతిపత్రంలో పేర్కొన్నారు.