సమైక్యాంధ్రే లక్ష్యం
చుక్కవలస (తెర్లాం రూరల్), న్యూస్‌లైన్ : రాష్ట్రంలో సమైక్యాంధ్ర కోసం మొదటి నుంచీ పోరాటం చేస్తున్నది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని సమైక్య ంగా ఉంచే వరకూ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తెర్లాంలోని చుక్కవలస గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్రపై కాంగ్రెస్, టీడీపీలకు చిత్తశుద్ధి లేదన్నారు. విభజనపై టీడీపీ రెండు ప్రాంతాల్లో రెండు రకాలుగా మా ట్లాడుతుందని, ఆ పార్టీకి విభజనపై స్పష్టమైన వైఖరి లేదని విమర్శించారు. విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పార్లమెంట్లో బిల్లు ఓటమి చెందడం ఖాయమన్నారు. పార్లమెం ట్, అసెంబ్లీలో విభజన బిల్లుపై తీర్మానం చేసినా, తమ పార్టీ కోర్టు ద్వారానైనా అడ్డుకుంటుందన్నారు. అసెంబ్లీలో విభజనపై చర్చ జరగకుండా, కేవలం విభజనను ఆపేందుకు తీర్మానం చేయాలని, అందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. సీమాంధ్ర జిల్లాల్లోని చాలా పార్టీల నాయకులు వైఎస్సార్ సీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అరుుతే ప్రజల్లో మంచిపేరు, గుర్తింపు ఉన్న నాయకులనే పార్టీలో చేర్చుకుంటామన్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా మని తెలిపారు. ఆయనతో పాటు లోచర్ల మా జీ సర్పంచ్ మర్రాపు జగన్నాథం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తెంటు సత్యంనాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు నర్సుపల్లి వెంకటేశ్వరరావు ఉన్నారు.