అక్కడ మహిళా ఉద్యోగులదే రికార్డు!
సీయోల్: ప్రతి రంగంలో పురుషుల కంటే మహిళలలే ముందంజలో ఉంటున్నారు. వ్యాపార సంస్థల్లో ఉన్నత స్థానాల్లో చోటు సంపాదించి పనితీరులో పురుషుల కంటే తామేమీ తక్కువకాదని నిరూపిస్తున్నారు. 2015 నాటికి దక్షిణ కొరియా రాజధాని సీయోల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య అత్యధిక స్థాయికి చేరి రికార్డు సృష్టించినట్టు మంగళవారం అధికారకంగా వెలువబడిన ఒక సమాచారంలో వెల్లడైంది. సీయోల్ మెట్రోపాలిటన్ ప్రభుత్వం గణాంకాల ప్రకారం.. మహిళా ఉద్యోగుల సంఖ్య 2.06 మిలియన్లకు చేరగా, సంవత్సర కాలంలో తొలిసారి రెండు మిలియన్లకు చేరిన వారి సంఖ్య 4.12 శాతంగా పెరిగినట్టు ది కొరియా హెరాల్డ్ వెల్లడించింది. మొత్తం మీద సీయోల్ నగరంలో వివిధ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల సంఖ్య 4.7 బిలియన్లకు చేరినట్టు పేర్కొంది. ఇదే సమయంలో పురుష ఉద్యోగుల సంఖ్య 2.9 శాతంతో 2.67 మిలియన్లకు పెరిగినట్టు తెలిపింది. మహిళా ఉద్యోగుల పనితీరు గతంలో కంటే మేరుగ్గా ఉందని సమాచారంలో వెల్లడైంది.
సాధారణ మహిళా ఉద్యోగుల స్థానాలు 5.8 శాతంతో 1.37 మిలియన్లు పెరగగా, స్వయం ఉపాధి వ్యాపారాలు చేస్తున్న మహిళలు 2.2 శాతంతో 2 లక్షల 39వేల మంది ఉన్నారు. తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేసేవారి సంఖ్య 0.6 శాతానికి పడిపోయి 2 లక్షల 67వేలకు చేరగా, ఇంట్లో పనిచేసే మహిళల సంఖ్య 3.4 శాతంతో 69వేలకు పడిపోయింది. వ్యాపార దిగ్గజ స్థానాల్లో పనిచేసే మహిళలు కూడా 3.8 శాతానికి 2 లక్షల 70వేలకు దాటినట్టు పేర్కొంది. అయితే వ్యాపార సంస్థలు, ఇతరేతర సంస్థల్లో సీఈఓలుగా పనిచేసే మహిళలు 56 శాతం ఉండగా, విద్య సంస్థల్లో మహిళలు 52 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది.