Shashi Arora
-
ఎయిర్‌టెల్‌కు మరో షాక్
సాక్షి, న్యూడిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌కు మరోషాక్ తగిలింది. టెలికాం దిగ్గజానికి చెందిన చెల్లింపుల బ్యాంకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశి అరోరా రాజీనామా చేశారు. ఇటీవల బ్యాంక్‌పై చెలరేగిన వివాదం, యుఐడిఎఐ సంస్థ ఇ-కెవైసీ లైసెన్స్ సస్పెన్షన్ నేపథ్యంలో ఆయన తన పదవినుంచి తప్పుకున్నారు. ఎయిర్టెల్ వీడాలని అరోరా నిర్ణయించుకున్నారని.. ఆయన భవిష్యత్తు అవకాశాలు మరింత బావుండాలని కోరుతున్నామంటూ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. కంపెనీ అభివృద్ధిలో గత కొన్నేళ్లుగా అరోరా విశేష కృషి చేశారని, ముఖ్యంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు ఆయన పునాది వేశారని పేర్కొంది. కాగా 2006 నుండి సీనియర్ నాయకత్వ స్థానాల్లో పనిచేస్తున్న అరోరా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఎండీ, సీఈవోగా జూన్ 1, 2016న నియమితులయ్యారు. వినియోగదారుల అనుమతి లేకుండానే వంటగ్యాస్ సిలిండర్లపై కేంద్రం అందిస్తున్న సబ్సిడీనీ పేమెంట్ బ్యాంకుకు మళ్లిస్తున్న వైనం ఇటీవల వెలుగులోకి రావడంతో వివాదం రేగింది. దాదాపు రూ.190 కోట్ల మేర సబ్సిడీ మొత్తం ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ వ్యవహారంపై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సీరియస్‌గా స్పందించింది. ఎయిర్టెల్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుకు ఆధార్ ఇ-కెవైసీ ధ్రువీకరణ అధికారాన్ని నిలిపివేసింది. తుది విచారణ, ఆడిట్ నివేదిక వచ్చేంత వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. -
ఎయిర్టెల్ డీటీహెచ్ కస్టమర్లు @ కోటి
మార్కెట్ వాటా 25 శాతానికి చేరిక ఎయిర్టెల్ డీటీహెచ్ సీఈవో శశి అరోరా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెరైక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో ఉన్న ఎయిర్టెల్ డిజిటల్ టీవీ 1 కోటి కస్టమర్ల మార్కును దాటింది. కార్యకలాపాలు ప్రారంభించిన ఆరేళ్లలోనే కంపెనీ ఈ రికార్డు సాధించడం విశేషం. భారత డీటీహెచ్ రంగంలో 25 శాతం మార్కెట్ వాటా సాధించామని ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సీఈవో శశి అరోరా సాక్షి బిజినెస్ బ్యూరోకు మంగళవారం తెలిపారు. 500పైగా చాన ళ్లు, సర్వీసులతో 16 భాషలకు చెందిన కస్టమర్లకు సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ, ఉత్తమ సేవలు, వీక్షించే చానళ్లకే చెల్లించే సౌకర్యం వంటి ప్రత్యేకతలతో డీటీహెచ్ రంగం పుంజుకుం టోందని తెలిపారు. ‘ప్రస్తుతం డిజిటైజేషన్ ప్రక్రియ 35 శాతం మాత్రమే పూర్తి అయింది. దేశవ్యాప్తంగా డిజిటైజేషన్ అమలుకు 2016 డిసెంబర్ తుది గడువు. డీటీహెచ్ ఎంచుకునే వారి సంఖ్య రానున్న రోజుల్లో గణనీయంగా పెరగనుంది’ అని పేర్కొన్నారు. హెచ్‌డీకే పట్టం..: ఎయిర్టెల్ డిజిటల్ టీవీ ప్రస్తుతం 27 హై-డెఫినిషన్(హెచ్డీ) చానళ్లను ప్రసారం చేస్తోంది. ఈ సంఖ్యను 50కి చేర్చాలని కృతనిశ్చయంతో ఉంది. హెచ్డీ టీవీల అమ్మకాలు పెరగడం, కంటెంట్ లభ్యత కారణంగా ఈ విభాగంపై ప్రత్యేక దృష్టిసారించామని శశి అరోరా తెలిపారు. కొత్తగా చేరుతున్న కస్టమర్లలో 50% మంది హెచ్డీ కనెక్షన్‌ను తీసుకుంటున్నారని వివరించారు. ఈ విభాగంలో కంపెనీకి 30% వాటా ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 8.5 లక్షల డీటీహెచ్ కనెక్షన్లతో అగ్ర స్థాన ంలో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. 2013-14లో దేశవ్యాప్తంగా కంపెనీకి 10 లక్షల మంది కొత్త కస్టమర్లు వచ్చి చేరారు. ఫిక్కీ-కేపీఎంజీ నివేదిక ప్రకారం భారత్‌లో 2014లో టీవీ గృహాల సంఖ్య 16.8 కోట్లు. పెయిడ్ కేబుల్, శాటిలైట్ చందాదారులు 13.9 కోట్ల మంది ఉన్నారు. వీరిలో డీటీహెచ్ కస్టమర్లు 4 కోట్లు. హెచ్డీ చందాదారులు 40 లక్షలు ఉన్నారు.