ఎయిర్‌టెల్ డీటీహెచ్ కస్టమర్లు @ కోటి | Airtel Digital TV crosses 1 crore acive users | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్ డీటీహెచ్ కస్టమర్లు @ కోటి

Published Wed, Apr 1 2015 12:23 AM | Last Updated on Fri, Aug 17 2018 6:18 PM

ఎయిర్‌టెల్ డీటీహెచ్ కస్టమర్లు @ కోటి - Sakshi

ఎయిర్‌టెల్ డీటీహెచ్ కస్టమర్లు @ కోటి

మార్కెట్ వాటా 25 శాతానికి చేరిక
   ఎయిర్‌టెల్ డీటీహెచ్ సీఈవో శశి అరోరా
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెరైక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో ఉన్న ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ 1 కోటి కస్టమర్ల మార్కును దాటింది. కార్యకలాపాలు ప్రారంభించిన ఆరేళ్లలోనే కంపెనీ ఈ రికార్డు సాధించడం విశేషం. భారత డీటీహెచ్ రంగంలో 25 శాతం మార్కెట్ వాటా సాధించామని ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ సీఈవో శశి అరోరా సాక్షి బిజినెస్ బ్యూరోకు మంగళవారం తెలిపారు. 500పైగా చాన ళ్లు, సర్వీసులతో 16 భాషలకు చెందిన కస్టమర్లకు సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ, ఉత్తమ సేవలు, వీక్షించే చానళ్లకే చెల్లించే సౌకర్యం వంటి ప్రత్యేకతలతో డీటీహెచ్ రంగం పుంజుకుం టోందని తెలిపారు. ‘ప్రస్తుతం డిజిటైజేషన్ ప్రక్రియ 35 శాతం మాత్రమే పూర్తి అయింది. దేశవ్యాప్తంగా డిజిటైజేషన్ అమలుకు 2016 డిసెంబర్ తుది గడువు. డీటీహెచ్ ఎంచుకునే వారి సంఖ్య రానున్న రోజుల్లో గణనీయంగా పెరగనుంది’ అని పేర్కొన్నారు.
 
 హెచ్‌డీకే పట్టం..: ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ప్రస్తుతం 27 హై-డెఫినిషన్(హెచ్‌డీ) చానళ్లను ప్రసారం చేస్తోంది. ఈ సంఖ్యను 50కి చేర్చాలని కృతనిశ్చయంతో ఉంది. హెచ్‌డీ టీవీల అమ్మకాలు పెరగడం, కంటెంట్ లభ్యత కారణంగా ఈ విభాగంపై ప్రత్యేక దృష్టిసారించామని శశి అరోరా తెలిపారు. కొత్తగా చేరుతున్న కస్టమర్లలో 50% మంది హెచ్‌డీ కనెక్షన్‌ను తీసుకుంటున్నారని వివరించారు. ఈ విభాగంలో కంపెనీకి 30% వాటా ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 8.5 లక్షల డీటీహెచ్ కనెక్షన్లతో అగ్ర స్థాన ంలో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. 2013-14లో దేశవ్యాప్తంగా కంపెనీకి 10 లక్షల మంది కొత్త కస్టమర్లు వచ్చి చేరారు. ఫిక్కీ-కేపీఎంజీ నివేదిక ప్రకారం భారత్‌లో 2014లో టీవీ గృహాల సంఖ్య 16.8 కోట్లు. పెయిడ్ కేబుల్, శాటిలైట్ చందాదారులు 13.9 కోట్ల మంది ఉన్నారు. వీరిలో డీటీహెచ్ కస్టమర్లు 4 కోట్లు. హెచ్‌డీ చందాదారులు 40 లక్షలు ఉన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement