సిక్కుల ఊచకోతకు కాంగ్రెస్ భాద్యత వహిస్తుందా?- శేఖర్ కపూర్
అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన సినీ దర్శకుడు శేఖర్ కపూర్ ఎక్కువగా వివాదాల్లో తలదర్చినట్టు కనిపించడు. అయితే తాజాగా ఓ వివాదస్పదమైన వ్యాఖ్య చేసి వార్తల్లో నిలివడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో వేలాది మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు అని ట్విటర్ లో పోస్ట్ చేశాడు. అయితే దారుణ సంఘటనకు కాంగ్రెస్ నాయకత్వం బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించాడు. ఎప్పుడో జరిగిన దారుణ సంఘటనను మళ్లీ కెలకడం వెనుక కారణం ఏమై ఉంటుందా అని సినీ, రాజకీయ విమర్శకులు ఆరా తీస్తున్నారు.
అంతేకాకుండా ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తుండగా శేఖర్ కపూర్ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను కూడా సంతరించుకున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడిప్పుడే మానుతున్న పుండు గీకడం అంటే ఇదేనేమో అంటున్నారు కొందరు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు జరిపిన దాడుల్లో వేలాది మంది సిక్కులు దారుణ హత్యకు గురయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు హెచ్ కే భగత్, సజ్లన్ కుమార్ లపై కూడా కేసులు నమోదయ్యాయి.
1000's innocent Sikhs killed on streets of Delhi after Indira Gandhi assassination. Was the Congress leadership responsible? #pradhanmantri
— Shekhar Kapur (@shekharkapur) October 19, 2013