కామన్వెల్త్ గేమ్స్‌కు సతీశ్, రాహుల్ క్వాలిఫై
సాక్షి, న్యూఢిల్లీ : భారత వెయిట్ లిఫ్టర్లు శివలింగం సతీశ్ కుమార్, రాగల వెంకట్ రాహుల్ కామన్వెల్త్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్-2018కి అర్హత సాధించారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో పురుషులు, మహిళలకు పలు విభాగాల్లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే.
ఇదివరకే రికార్డులు సృష్టించిన రాహుల్ స్నాచ్ లో 156 కేజీలు, క్లీన్ అండర్ జర్క్‌లో 195 కేజీలు ఎత్తి సత్తాచాటారు. జూనియర్, సీనియర్ విభాగాలలో బరిలోకి రాహుల్ దిగనున్నారు. 2014 కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన సతీశ్ కుమార్ 77 కేజీల విభాగంలో స్నాచ్‌లో 148 కేజీలు, క్లీన్ అండర్ జర్క్‌లో 172 కేజీలతో ఓవరాల్‌గా 320 కేజీలెత్తారు.