The sky
-
ఆకాశంలో ఆ చుక్కల లెక్కలన్నీ మారిపోతాయట!
రాత్రిపూట ఆకాశాన్ని చూస్తే కోట్ల కొద్దీ నక్షత్రాలు కనువిందు చేస్తుంటాయి. అందులో కొన్ని ఆకారాలూ కనిపిస్తుంటాయి. కానీ భవిష్యత్తులో ఆ చుక్కల లెక్కలన్నీ మారిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నక్షత్రాలన్నీ స్థానం మారిపోతాయని.. ఆకాశాన్ని అత్యంత ప్రకాశవంతమైన వెలుగు ఆక్రమిస్తుందని అంటున్నారు. మరి దానికి కారణం ఏమిటో తెలుసా? మన భూమి, సౌర కుటుంబం ఉన్న పాలపుంత గెలాక్సీ, సమీపంలోని ఆండ్రోమెడా అనే మరో గెలాక్సీ రెండూ ఢీకొని కలసిపోనుండటమే. ఇప్పటికే ఈ రెండూ ఒకదానికొకటి సమీపంలోకి వస్తున్నాయి. మరో 375 కోట్ల ఏళ్ల తర్వాత ఢీకొనడం మొదలవుతుంది. సుమారు 700 కోట్ల ఏళ్ల తర్వాత రెండూ పూర్తిగా కలసిపోయి పెద్ద గెలాక్సీగా మారిపోతాయి. ఈ క్రమంలో చాలా నక్షత్రాలు చెల్లాచెదురైపోతాయి. వాటి స్థానాలు మారిపోతాయి. మరి ఇలా రెండూ దగ్గరికి రావడం, కలిసిపోవడం జరుగుతున్నప్పుడు మనకు ఆకాశం ఎలా కనిపిస్తుందనే దానిపై నాసా ఓ వీడియోను రూపొందించింది. చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ తీసిన చిత్రాలు, దాని సాయంతో చేసిన పరిశీలన ఆధారంగా సిద్ధం చేసిన ఈ వీడియోను.. చంద్ర అబ్జర్వేటరీ పేరిట ఉన్న ‘ఎక్స్ (ట్విట్టర్)’ ఖాతాలో పోస్ట్ చేసింది. మనం చూసేది పాలపుంతే కాదు..! మన సౌర కుటుంబం ఉన్న పాలపుంత (మిల్కీవే) గెలాక్సీ అంటూ ఫొటోల్లో, ఇంటర్నెట్లో మనం చూస్తున్నది నిజానికి పాలపుంత ఫొటో కానే కాదు. అసలు మనం పాలపుంత మొత్తం చిత్రాన్ని తీయడం సాధ్యమే కాదు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల నక్షత్రాలున్న పాలపుంత గెలాక్సీలో మధ్య భాగానికి ఓ పక్కన మన సూర్యుడు, భూమి ఉన్నాయి. పాలపుంత గెలాక్సీ మొత్తాన్ని దాటి బయటికి వెళితే తప్ప దీనిని ఫొటో తీయలేం! ఎలాగంటే.. సముద్రం మధ్య చిన్న పడవలో కెమెరా పట్టుకుని కూర్చున్న మనం వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న సముద్రం మొత్తాన్ని ఫొటో తీయగలమా? ఇదీ అంతే.. మరి మనం చూసే పాలపుంత చిత్రం ఏమిటి అంటారా.. దాదాపుగా పాలపుంతలా ఉండే ఆండ్రోమెడా గెలాక్సీ చిత్రమే. ఈ గెలాక్సీయే భవిష్యత్తులో పాలపుంతను ఢీకొట్టేది. -
తారలు తెర‘మరుగు’.. ఆ రోజు ఎంతో దూరంలో లేదు
బెంగళూరు: మబ్బుల్లేని రాత్రి వేళ అలా ఆకాశంలోకి చూసినప్పుడు లెక్కలేనన్ని నక్షత్రాలు తళుకుమంటూ కనువిందు చేస్తుంటే ఎంతో బావుంటుంది కదా! కానీ వినువీధిలో తారల తళుకులు నానాటికీ తగ్గిపోతున్నాయి. 2011తో పోలిస్తే 2022 నాటికి అబ్జర్వేటరీల కెమెరా కంటికి కన్పిస్తున్న నక్షత్రాల సంఖ్య ఏకంగా 10 శాతం తగ్గిందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది! అయితే, దీనికి కారణం నక్షత్రాలు నశించిపోవడం కాదు. భూమిపై కృత్రిమ వెలుగులు మితిమీరి పెరిగిపోవడం! మరోలా చెప్పాలంటే కాంతి కాలుష్యమన్నమాట!! దాంతో కాస్త తక్కువ ప్రకాశంతో కూడిన నక్షత్రాలన్నీ సదరు కృత్రిమ వెలుగు మాటున మరుగున పడిపోతున్నాయట! ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితని యూనివర్సిటీ ఆఫ్ శాంటియాగో డీ కాంపొస్టెలా భౌతిక శాస్త్రవేత్త ఫాబియో ఫాల్చీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘కాంతి కాలుష్యం ఏటా 7 నుంచి 10 శాతం చొప్పున పెరిగిపోతోంది! ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది’’ అని ఆయనన్నారు. ‘‘ఒకప్పట్లా చిక్కటి చీకటితో నిండిన రాత్రుళ్లు ఎప్పటికీ తిరిగిరావు. ముఖ్యంగా నగరాల్లోనైతే రాత్రిపూట వెలుగులు అనివార్యంగా మారి దశాబ్దాలు దాటింది. కానీ పరిస్థితి పూర్తిగా చేయి దాటకుండా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఆకాశంలో కేవలం వేళ్లపై లెక్కబెట్టగలిగినంతకు మించి చుక్కలు కన్పించని రోజు ఎంతో దూరంలో లేదు’’ అంటూ హెచ్చరించారు. -
ఆకాశంలో, పోరులో సగం... అధికారంలో?!
(సందర్భం) తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కొత్త రాష్ట్రంలో ఏడాది పాలన కూడా గడిచింది. ఏడాది దొర ల పాలన గడిచిందనటం సబ బేమో. ఎందుకంటే అరవై ఏళ్ల తెలంగాణ పోరాటం సామా జిక న్యాయం కోసం జరిగింది. 2009 నుంచి 2014 వరకు సామాజిక, ప్రజాస్వామిక నినాదాల మీద జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా మలిదశ (1996) తెలంగాణ ఉద్య మం నడిచింది. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజ లకు అధికారంలో వాటా కోసమనే సామాజిక న్యాయం డిమాండ్ కూడా ఈ పోరాటంలో ఉంది. అన్ని వర్గాల ప్రజలు పోరాటంలో భాగం కావటం వలన రాబోయే తెలంగాణలో వారి వాటా ఉండాలని భావించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోరాడిన శక్తులకు అన్యాయం జరిగింది.ఆ కాలంలో ఉదాసీనంగా లేదా వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులకు, శక్తులకు అధికారం లో వాటా దక్కింది. ఉద్యమంలో విద్యార్థులు, యువత, రైతులు, కూలీలు, ఉద్యోగులు, ఇతర వృత్తుల ప్రజలు పోరాడారు. ఇక్కడ ప్రస్తావించిన అన్ని రంగాల వారితో కలసి స్త్రీలు కూడా సగభాగమై పాల్గొన్నారు. కానీ ఈ పితృస్వామ్య సమాజంలో స్త్రీలు అన్నిటా అన్యాయానికి గురైనట్లే తెలంగాణలో కూడా గురయ్యారు. నాలుగు కోట్ల తెలంగాణ జనాభాలో రెండు కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. ఆకాశంలో సగంగా ఉన్న వీళ్లు పోరాటంలో కూడా సగమైనారు. తెలంగాణలో స్త్రీల చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగినది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడిని ఎదిరించి యుద్ధం చేస్తూ అమరులైన సమ్మక్క-సారక్కల వారసత్వాన్ని వారు అందిపుచ్చుకు న్నారు. నైజాం పరిపాలనలో విసునూర్ రామచంద్రారెడ్డి గూండాలకు వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి నాళ్లలో కూడా స్త్రీలు ముందంజలో ఉన్నారు. ఆరుట్ల కమ లాదేవి మరొక అద్భుత ఉదాహరణ. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాటై దూసుకొచ్చిన తెలంగాణ గానకోకిల బెల్లి లలిత. తన పాతిక సంవత్సరాల జీవితాన్ని తెలం గాణ రాష్ట్రం కోసం అర్పించింది. ఆమెతో పాటు ఎంతో మంది దళిత, బీసీ, ఆదివాసీ, స్త్రీ కళాకారులు ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నిలబెట్టారు. ఆ ఉద్యమాల పునా దుల మీదనే 2001లో టీఆర్ఎస్ పుట్టింది. 2009 నుంచి 2013 వరకు జరిగిన పోరాటంలో కూడా మంజుల (వరంగల్), రాధ (కరీంనగర్), కావలి సువర్ణ (పాలమూరు), కురువ సరిత (రంగారెడ్డి), చామంతి శ్రుతి (నిజామాబాద్) వంటి ఎందరో విద్యార్థి నులు ఆత్మబలిదానంతో ఉద్యమ దీపాన్ని వెలిగించారు. ప్రత్యేక తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పా టుకు కావాల్సిన మెజారిటీతో గెలిచింది. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ అతడే గద్దెనెక్కి కూర్చున్నాడు. పైగా 66 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో మహిళలకు మంత్రిపదవి దక్కని మంత్రివర్గం ఒక్క కేసీఆర్‌దే. ముఖ్యమంత్రులుగా, కేంద్రమంత్రులుగా, లోక్‌సభ స్పీకర్‌గా కూడా ఇప్పుడు మహిళలు అవకాశం పొందారు. ప్రపంచంలోని అన్ని దేశాలతోపాటు మన దేశంలో కూడా ఎంతో కొంత మహిళలకు అధికారంలో భాగస్వామ్యం దక్కింది. కాని పోరాట చైతన్యం ఉన్న తెలంగాణలో పోరాడిన మహిళలకే అధికారంలో వాటా దక్కక పోవటం చూస్తే మగ పెత్తనం ‘దొరల’ రాజ్యం నడుస్తున్నదని అర్థమవుతుంది. టీఆర్ఎస్లో బొడిగె శోభ, కోవా లక్ష్మి, రేఖానాయక్, పద్మాదేవేందర్‌రెడ్డి, గొంగిడి సునీత, కొండా సురేఖ లాంటి ఆరుగురు మహి ళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఒక్కరికీ మంత్రి పదవి దక్క లేదు. పైగా కనీసం ఎమ్మెల్యేలుగా కూడా గెలవని తుమ్మ ల నాగేశ్వరరావు, నాయిని నర్సింహారెడ్డి, కడియం శ్రీహ రిలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. టీడీపీ నుంచి వలస వచ్చిన శ్రీనివాస్ యాదవ్‌కు మంత్రి పదవి కట్టబె ట్టారు. మహిళలకు మంత్రి పదవి వస్తే ఈ రాష్ట్రంలో మహిళలందరి జీవితాలూ మొత్తం మారిపోతాయని కాదు కాని, ఇది తెలంగాణలోని రెండు కోట్ల మహిళల ఆత్మగౌరవం సమస్య. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబే డ్కర్ వంటి సామాజిక విప్లవకారుల స్ఫూర్తితో సమ్మక్క -సారక్క, చాకలి ఐలమ్మ, బెల్లి లలిత పోరాట స్ఫూర్తితో మంత్రివర్గంలో చోటుతో పాటు అన్ని రంగాలలో స్త్రీలకు 50 శాతం వాటా దక్కటం కోసం పోరాటం చేయటం తప్ప మరో మార్గంలేదు. తల్లులు, అక్కలు, చెల్లెళ్లు, ప్రజాస్వామికవాదులు, మహిళా ఉద్యమ నాయకులు, విప్లవకారులు ఈ న్యాయమైన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి. (నేడు హైదరాబాద్‌లో జరిగే మహిళా గర్జన సందర్భంగా...) (వ్యాసకర్త మందకృష్ణ మాదిగ, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షులు) మొబైల్: 94407 23808 -
మొరటు మాటల మొగుళ్లూ... అందుకే ఈ విరుగుళ్లూ!
ఉత్త(మ)పురుష ప్రముఖ ఖగోళశాస్త్రవేత్త కోపర్నికస్సు కస్సూబుస్సూమంటూ కోపంతో ఎప్పుడూ ఆకాశంలోకి చూస్తూ ఉండేవాడంటారు మా శ్రీవారు. ఆయన నమ్మకం ఏమిటంటే... అలనాడు పెళ్లాం మీద అలిగినప్పుడల్లా కోపర్నికస్సు... తన ఖర్మకొద్దీ ఇలా జరుగుతోందంటూ అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయేవాడట. అలా చూస్తూ చూస్తూ ఉండే క్రమంలో అలా టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అన్న ఆలోచన ఆయనలో బయల్దేరిందట. తన బతుకూ ఆకాశం లాగే శూన్యమైపోయింది కాబట్టి, తన జీవితంలో ఆనందం గగనమైపోయిందట. కాబట్టి ఆ గగనంలోనే ఆయన ఏదో వెతుక్కునే క్రమంలో సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదనీ, భూమే సూర్యుని చుట్టూ తిరుగుతోందని కనిపెట్టాడన్నది మా ఆయన ఉవాచ. పైగా ఇందులో కాస్త పురుషాధిపత్యం కూడా ఉంది. సూర్యుడు పుంలింగం. భూమి స్త్రీలింగం. అలాంటప్పుడు సూర్యుడి చుట్టూ భూమి తిరగాలి గానీ... భూమి చుట్టూ సూర్యుడు తిరగడమేమిటి నాన్సెన్స్ అన్న భావనే ఇందులో ఉంది, ఆ తర్వాత యాదృచ్ఛికంగానూ, కోపర్నికస్సు అదృష్టం కొద్దీనూ సైన్సు ప్రకారం కూడా అదే నిజమని ఆ తర్వాత తేలిందన్నది ఆయన వాదన. భార్యల మీద కోపం కొద్దీ ఇలాంటి పిచ్చివాదనలు చాలా చేస్తుంటారాయన. నా మీద అలిగి, తానూ శూన్యంలోకి చూస్తూ, చుక్కలు లెక్కిస్తూ కోపర్నికస్సును గుర్తు తెచ్చుకున్నారు మా శ్రీవారు. ఈసారి తన కోపానికి కారణం మా తరఫు బంధువులట. భార్యలనూ, ఆమె తరఫు చుట్టాలనూ ఇలా ఆడిపోసుకోవడం చాలామంది భర్తలకు మామూలే కదా. ఈ క్రమంలో ఆ రోజున మా పేరెంట్స్ కూడా ఆయన బారిన పడ్డారు. మాది మాటమీద నిలబడే వంశం కాదట. మావాళ్లంతా మాట తప్పారట. అనుకున్నట్టుగా లాంఛనాలేమీ పెట్టలేదనీ, పెళ్లికి అనుకున్నవన్నీ ఇవ్వలేదనీ అన్నారాయన. ఈ జాడ్యం చాలా మంది మొగుళ్లకూ ఉంటుంది. కానీ మావారి విషయంలో ఈ మధ్య ఇది మరీ పెచ్చుమీరి పోయింది. ఇక ఓ హద్దు వరకూ సహించి, ఆ తర్వాత ఊరుకోలేక నేనూ ఓ మాట అన్నా. మీరు అనుకున్నట్టు మాదీ, మా పేరెంట్స్‌దీ మాట తప్పే వంశం కాదు. మాట మీద నిలబడే వంశం. మీకో విషయం తెలుసా? నాకు ఐదేళ్లున్నప్పుడు ఇచ్చిన మాటను మా అమ్మ సరిగ్గా పదిహేనేళ్ల తర్వాత గుర్తుపెట్టుకుని నిలబెట్టుకుంది తెలుసా?’’ అన్నాను. ‘‘ఏమిటా మాట’’ అడిగారు ఆయన ఆసక్తిగా. ‘‘అప్పట్లో నేను చిన్నదాన్ని. తెగ అల్లరి చేసేదాన్నట. అలా బువ్వ తిననంటూ నేను తెగ మారాం చేస్తూ ఉంటే, నా అల్లరి భరించలేక మా అమ్మ నాకో హెచ్చరిక లాంటి వాగ్దానం చేసింది. ఆ తర్వాత అది పట్టుబట్టి నెరవేర్చింది.’’ ‘‘ఊరించకు. తొందరగా చెప్పు’’ అన్నారాయన. ‘‘అప్పుడూ... ఇలాగే అల్లరి చేస్తూ ఉంటే బూచోడికి పట్టిస్తా అంది. నాకు మీతో పెళ్లి చేసి తన మాట నిలబెట్టుకుంది’’ అన్నాన్నేను. అంతే... అప్పట్నుంచి మాది ఆడి తప్పే వంశమని మా శ్రీవారు మళ్లీ అంటే ఒట్టు! - యాసీన్