SLBC project
-
తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆరెస్ట్
-
ఎస్ఎల్బీసీకి రూ. 80 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) లోని టన్నెల్ పనులను తిరిగి గాడిలో పెట్టే పనులు మొదలయ్యాయి. పనుల పూర్తికి అవసరమయ్యే నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో ఆ దిశగా అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ప్రాజెక్టు పనులు చేస్తున్న ఏజెన్సీకి రూ. 80 కోట్ల మేర అడ్వాన్సు కింద చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. పెండింగ్ బిల్లులు సైతం చెల్లించనున్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉండగా, మొదటి టన్నెల్‌ను శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.89 కి.మీ. కాగా, మరో 10 కి.మీలకు పైగా టన్నెల్‌ను తవ్వాల్సి ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 23.07 కి.మీ. టన్నెల్ పూర్తవగా.. తర్వాత ఐదేళ్లలో 9 కి.మీ. మేర తవ్వారు. ఈ టన్నెల్‌ను రెండు వైపుల నుంచి తవ్వుతూ వస్తుండగా.. శ్రీశైలం నుంచి తవ్వుతున్న పనులు 3 నెలలుగా నిలిచిపోయాయి. కన్వేయర్ బెల్ట్ మార్చాల్సి ఉండటం, ఇతర యంత్రాలను మార్చాల్సి రావడంతో వాటిని తిరిగి ఏర్పాటు చేస్తున్నారు. ఔట్లెట్ టన్నెల్ బోరింగ్ మెషీన్ మరమ్మతులకు సమయం పడుతోంది. దీనికి తోడు ప్రస్తుతం సీపేజీ కారణంగా గంటకు 9,600 లీటర్ల మేర నీరు ఉబికి వస్తుండగా, ఏజెన్సీ వద్ద కేవలం 6 వేల లీటర్ల నీటిని తోడే సామర్థ్యం గల మోటార్లే పనిచేస్తున్నాయి. టన్నెల్ బోరింగ్ మెషీన్ మునగకుండా చూసుకోవడమే పెద్ద సమస్యగా మారింది. సీపేజీ నీటిని తోడాలంటే ఏకంగా 3 స్టేజుల్లో పంపింగ్ చేయాల్సి వస్తుందని, దీనికే రూ. 20 కోట్ల వరకు అవసరం ఉంటుందని ఇటీవల ఏజెన్సీ ప్రభుత్వం ముందు మొర పెట్టుకుంది. దీనికి తోడు మెíషీన్ మరమ్మతులకు మరో రూ. 60 కోట్లు అడ్వాన్స్‌గా ఇవ్వాలని కోరింది. 2022లోపు పూర్తి చేసే అవకాశం.. ప్రస్తుత పరిస్థితుల్లో వేరే వారికి పనులు అప్పగించే పరిస్థితులు లేకపోవడం, అడ్వాన్సులు ఇస్తే పనులు కొనసాగే అవకాశం లేని దృష్ట్యా రూ. 80 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన ఫైలు సైతం నీటి పారుదల శాఖ నుంచి కదిలింది. దీంతో ప్రాజెక్టు పరిధిలో రూ. 585 కోట్ల మేర పెండింగ్ బిల్లులు ఉండగా ప్రాధాన్యతా క్రమంలో వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే పనులు ఇప్పటికిప్పుడు తిరిగి మొదలు పెట్టినా పనులను మాత్రం 2022 ఏడాదిలో పూర్తి చేసే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
బ్యాంకుల వైఖరి మారాలి
- ప్రజల్లో ఆర్థిక అంతరాన్ని తగ్గించేలా పనిచేయాలి - ఎస్ఎల్బీసీలో ఆర్థిక మంత్రి ఈటల సూచన సాక్షి, హైదరాబాద్: ‘ఆర్థిక చేయూత పథకాలకు గరిష్టంగా 80% రాయితీ ఇస్తున్నా క్షేత్రస్థాయిలో యూనిట్లు ఆశించిన స్థాయిలో గ్రౌండింగ్ కావడం లేదు. బ్యాంకర్ల సహకారం సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. బ్యాంకులు లాభనష్టాలను బేరీజు వేసుకునే పనిలో పడ్డాయి. బ్యాంకు సేవలంటే ఇవి కావు. బ్యాంకర్లు తమ వైఖరి మార్చుకుని కొత్తగా ఆలోచించాలి. ప్రజల మధ్య ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి’అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బ్యాంకులకు సూచించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన 14వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి (ఎస్ఎల్ బీసీ) ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. బ్యాంకులు డిపాజిట్ల అంశాన్ని పక్కనబెట్టి ప్రజల కోణం నుంచి ఆలోచించాలన్నారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లకు సంబంధించి పలు పథకాలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ ఎక్కడా ఈ నిబంధన పాటిస్తున్నట్లు కనిపించడం లేదు. గతంలో బ్యాంకుల్లో పరిశోధనా విభా గం ఉండేది. రుణ వితరణపై అధ్యయనం చేస్తూ ప్రణాళికలు తయారు చేసేవి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో సిబ్బంది సంఖ్య తగ్గింది. ఈ క్రమంలో ఉద్యోగులు సైతం యంత్రాల మాదిరిగా పనిచేస్తున్నారు’అంటూ చుర కలంటించారు. ‘బ్యాంకులు రుణాల మంజూరు, రికవరీపైనే దృష్టి పెడితే సరిపోదు. రుణం తీసుకుని నెలకొల్పిన యూనిట్ ఎలా ఉంది? ఆశించిన మేర వ్యాపారం నడుస్తుందా? రుణగ్ర హీతకు గిట్టుబాటు అవుతుందా? అనే అంశాలపై పరిశీలన చేయాలి. బ్యాంకులు, ప్రభుత్వం అజమాయిషీ లేకుంటే లక్ష్యం నెరవేరదు’అని స్పష్టం చేశారు. సామాన్యుడికి రుణాలిచ్చే సమయంలో ఉండే కొన్ని నిబంధనలు, పెద్ద కంపెనీల విషయంలో ఉండడం లేదని, ఇటీవల కొందరు బడా వ్యాపారులు రుణాలు ఎగ్గొడితే బ్యాంకులు ఉక్కిరిబిక్కిరి అయ్యాయని ఊటంకించారు. రైతులకు సంతృప్తికర స్థాయిలో రుణాలు ఇవ్వాలని సూచించారు. నాలుగో విడత రుణ మాఫీ నిధులు త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కులవృత్తుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, చాలా కులాల్లో ప్రతిభ ఉన్నప్పటికీ పెట్టుబడి లేదని, ఫలితంగా మానవవనరుల వినియో గం ఆశించిన స్థాయిలో ఉండడం లేదన్నారు. పరిగణనలోకి తీసుకోవద్దు పెద్దనోట్ల రద్దు ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని ఆర్బీఐ ప్రాంతీయ సంచాలకులు సుబ్రమణియం అన్నారు. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున నగదు బ్యాంకుల్లో జమైనప్పటికీ క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. అన్ని రంగాలపై ప్రభావం చూపడంతో 2016–17 వార్షికంలో మూడో త్రైమాసికం పురోగతి క్షీణించిందని, దీంతో ఆ త్రైమాసికాన్ని పరిగణనలోకి తీసుకోవద్దన్నారు. ‘పౌర’ అవినీతిని ప్రక్షాళించాం సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరా లశాఖలో అవినీతిని ప్రక్షాళన చేయడం తోపాటు బియ్యం అక్రమ రవాణాదా రులపై ఉక్కు పాదం మోపి కొత్త ఒరబడి సృష్టించామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రబీ కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం ఇక్కడి మానవ వనరుల కేంద్రంలో ఈట ల సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పౌరసర ఫరాల శాఖతో సంబంధం ఉన్న వారంతా ఆత్మగౌర వంతో వ్యాపారం చేయాలి తప్ప మంత్రు లు, అధికారుల ముందు చేతులు కట్టు కుని నిలబడొద్దని సూచించారు. పౌరసర ఫరాల కమిషనర్‌గా సీవీ ఆనంద్ రావ డం సంతోషంగా ఉందన్నారు. గతంలో అవినీతిపరులపై కేసులు ఎత్తేయాలని అధికారులపై రాజకీయ నేతల నుంచి ఒత్తిడి ఉండేదని, కానీ మూడేళ్లలో ఒక్క కేసు ఎత్తివేతకూ జేసీలు, ఇతర అధికారులపై ఒత్తిడి లేదన్నారు. -
ధరల సర్దుబాటుకు అఖిలపక్షం ఓకే
ఎస్ఎల్బీసీపై ఏకాభిప్రాయం ప్రస్తుత కాంట్రాక్టర్ చేతనే పనులు చేయించేందుకు అంగీకారం రూ. 750 కోట్ల చెల్లింపుపై సభానాయకులతో నేడు మరోభేటీ సాక్షి, హైదరాబాద్: sశ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) సొరంగ పనుల తవ్వకాన్ని ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్‌తోనే కొనసాగించేందుకు అన్ని పార్టీలు తమ సమ్మతి తెలిపాయి. కాంట్రాక్టర్ ఆర్థికపరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటూ ధరలు సర్దుబాటు చేసేందుకు అంగీకరించాయి. ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేసేలా అన్నిచర్యలు తీసుకోవాలని సూచించాయి. అయితే ధరలు ఎలా ఉండాలన్న దానిపై మాత్రం సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై శుక్రవారం మరోమారు అన్నిపార్టీల సభానాయకులతో, కాంట్రాక్టర్‌తో కలిపి సమవేశం నిర్వహించి ఓ నిర్ణయానికి రావాలని ప్రభుత్వం సంకల్పించింది. శుక్రవారం నాటి నిర్ణయానికి అనుగుణంగా ఎస్ఎల్బీసీ పనులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు 43.89కిలోమీటర్ల తవ్వాల్సిన సొరంగ మార్గంలో ఇప్పటిరవకు 24 కిలోమీటర్లు పూర్తికాగా మరో 19.8కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది. అయితే ఆర్థికభారం కారణంగా సొరంగం పనులను ముందుకు తీసుకెళ్లడం తనకు కష్టంగా మారిందని, పెరిగిన నిర్మాణ వ్యయం దృష్ట్యా తనకు రూ.750 కోట్లవరకు ఎస్కలేషన్ చెల్లింపులతో పాటు, మరో రూ.150కోట్లు అడ్వాన్స్‌గా ఇవ్వాలని కోరుతున్న విషయం విదితమే. బుధవారం సభలో చేసిన ప్రకటన మేరకు పనుల కొనసాగింపు, కాంట్రాక్టర్‌కు ఆర్థికఇబ్బందులపై గురువారం అసెంబ్లీ కమిటీహాల్లో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. దీనికి ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, మంత్రులు టి.హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, బాల్క సుమన్, జిల్లా ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతి, ప్రభాకర్‌రెడ్డి, గొంగిడి సునీత, శేఖర్‌రెడ్డి, కిశోర్,బాలరాజులతో పాటు బీజేపీ తరఫున ఎన్వీవీఎస్ ప్రభాకర్, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు ప్రాజెక్టు పనులు, కాంట్రాక్టర్ కోరుతున్న ధరల సర్దుబాటు అంశాలపై చర్చించారు. కాంట్రాక్టర్‌ను మారిస్తే రూ.5,800 కోట్ల భారం దీనిపై మొదట ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, ఇప్పటివరకు జరిగిన పనులను గణాంకాలతో వివరించారు. మరో 20 కిలోమీటర్ల సొరంగం తవ్వకానికి రెండేళ్లకు మించి పట్టేలా ఉందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించినా నిర్ణీత గడువులో పని పూర్తికావడం అసాధ్యమన్నారు. కొత్త కాంటారక్టర్కు పనులు అప్పగించిన పక్షంలో ప్రాజెక్టుపై మరో రూ.5,800ల కోట్ల భారం పడుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలో తెలపాలని పార్టీల అభిప్రాయాలను కోరారు. దీనిపై అన్నిపార్టీలు దాదాపు ఒకే విధంగా స్పందించాయి. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్‌తోనే పనులు కొనసాగించాలని సూచించాయి. అదే సమయంలో 2005లో పనులు చేపట్టే సమయంలో సిమెంట్, స్టీలు, ఇంధన ధరలు ప్రస్తుత ధరలకు చాలా వ్యత్యాసం ఉందని, ఈ దృష్ట్యా కాంట్రాక్టర్ కోరుతున్న విధంగా ధరల సర్దుబాటు సబబే అన్న భావన వ్యక్తం చేసినట్టు తెలిసింది. గతంలో ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసు మేరకు 5 శాతం పైన పెరిగిన ధరలను సవరించేందుకు అంగీకారం తెలిపాయి. అయితే కాంట్రాక్టర్ కోరుతున్న ధరల సర్దుబాటు విలువ సుమారు రూ.750 కోట్లవరకు ఉన్నందున దీనిపై ఎలాంటి నిర్ణయం చేయాలన్న దానిపై శుక్రవారం మరోమారు కాంట్రాక్టర్ సమక్షంలో పార్టీ సభా నాయకులతో చర్చిద్దామని నిర్ణయించారు. వీటితో పాటే కొందరు ఎమ్మెల్యేలు డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఉదయసముద్రం ఎత్తిపోతల పనులు సత్వరమే పూర్తిచేయాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారని సమావేశం అనంతరం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. -
ఎస్ఎల్బీసీపై ముందుకెళ్లేదెలా?
♦ నేడు అన్ని పక్షాల నేతలతో సీఎం ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం ♦ 1983లో రూ. 480 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ప్రస్థానం ♦ 2005 ఆగస్టులో రూ.2,813 కోట్లకు పరిపాలనా అనుమతులతో తొలి అడుగు ♦ ప్రస్తుతం 43.89 కిలోమీటర్ల సొరంగం పనుల్లో పూర్తయింది 24 కిలోమీటర్లు ♦ ఇప్పటి వరకు రూ.1,925 కోట్ల పనుల్లో రూ.1,185 కోట్ల పనులు పూర్తి ♦ మిగిలి ఉన్న మరో రూ.700 కోట్ల పనులు పెండింగ్ ♦ ఎస్కలేషన్ ఖర్చుల కింద రూ.783కోట్లు అడుగుతున్న కాంట్రాక్టు సంస్థ ♦ అడ్వాన్సు కింద రూ.150 కోట్లు తక్షణం ఇవ్వాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదీ జలాలను వినియోగించుకొని తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో పురుడు పోసుకున్న శ్రీశైలం ఎడమ కాల్వ(ఎస్ఎల్బీసీ) సొరంగం పనులపై ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రాజెక్టు ఆరంభం నుంచీ ఓ ప్రహసనంలా మారిపోయిన సొరంగ పనుల్లో వేగంపెంచే దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. పనులు ప్రారంభించి పదే ళ్లు గడుస్తున్నా సగం పనులు సైతం పూర్తికాకపోవడం, నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా దీనిపై ఎలాంటి కార్యాచరణ చేపట్టాలన్న అంశంపై అన్ని పక్షాలతో గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. బుధవారం అసెంబ్లీలో ఈ అంశంపై జరిగిన చర్చ సం దర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం1983లో.. పనుల ఆరంభం 2005లో.. శ్రీశైలం నుంచి నీటిని తరలించాలంటే గ్రావిటీ ద్వారా సాధ్యం కాదని ఎప్పుడో నిపుణలు తేల్చారు. సొరంగం ద్వారా నీటిని తరలించడమే మార్గమని తేల్చిచెప్పారు. దీంతో తొలిసారిగా 1983లో ఎస్ఎల్బీసీకి పునాది పడింది. సొరంగం తవ్వకానికి రూ.480కోట్ల మేర అంచనాలు వేశారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సొరంగం పనులను పక్కనపెట్టి ప్రత్యామ్నాయంగా నాగార్జునసాగర్ నుంచి అంతే స్థాయి నీటిని ఎత్తిపోతల ద్వారా ఇచ్చేందుకు నిర్ణయించడం, ఎత్తిపోతల పనులను సైతం వేగిరం చేసి దాన్ని పూర్తి చేయడంతో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తిగా మరుగునపడ్డాయి. మధ్యలో 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం సొరంగం పనులకు అంచనా వేయించగా అది రూ.967కోట్లుగా, 1997లో టీడీపీ ప్రభుత్వం మరోమారు అంచనా వేస్తే అది రూ.1,250 కోట్లకు పెరుగుతూ వచ్చింది. అంచనాలు వేసినా పనులు మాత్రం ఎక్కడా ప్రారంభం కాలేదు. తిరిగి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సొరంగం పనులకు అంకురార్పణ చేసింది. అయితే అప్పటికే సొరంగం పనుల అంచనా ఏకంగా రూ.2,813 కోట్లమేర పెరిగింది. అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం 2005 ఆగస్టులో టెండర్లు పిలవగా రూ.1,925కోట్ల పనులను కోట్ చేసిన జయప్రకాశ్ అసోసియేట్ కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించింది. ఈ పనులను 2010 వరకు పూర్తి చేయాల్సి ఉన్నా, భూసేకరణ సమస్యలు, వరదలు పనులను ఆలస్యం చేశాయి. పూర్తయింది రూ.1185 కోట్ల పనులే! ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనుల్లో రెండు సొరంగాలు తవ్వాల్సి ఉండగా మొదటిదాన్ని శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్నెవారిపల్లె వరకు తవ్వాల్సి ఉంది. మొత్తం 43.89 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉండగా ఇందులో ఇప్పటి వరకు కేవలం 24 కిలోమీటర్లు పూర్తికాగా మరో 19.8 కిలోమీటర్ల మేర ఇంకా సొరంగం తవ్వాల్సి ఉంది. ఇక రెండో సొరంగం నల్లగొండ జిల్లాలో 7.25 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా ఇది పూర్తయినా, ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటికోసం ఇప్పటికే రూ.1185.38 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా పనులు పూర్తి చేసేందుకు మరో రూ.700ల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉండగా, పెరిగిన నిర్మాణ వ్యయం దృష్ట్యా సదరు కాంట్రాక్టు సంస్థ గతంలో ఇచ్చిన జీవో 13 మేరకు ఎస్కలేషన్ చార్జీలను భరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. అలా రూ.783 కోట్ల వరకు చెల్లిస్తేనే పనులు వేగిరం అవుతాయని స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో తన ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వెంటనే రూ. 150 కోట్లు అడ్వాన్సుగా చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం చేయలేదు. ఇక వీటితో పాటే ఎస్ఎల్బీసీ హై లెవెల్ కెనాల్ కింద 2.20లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రాజెక్టు పరిధిలోని లోయర్ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(7.6 టీఎంసీలు), మరో లక్ష ఎకరాలకు నీరందించే ఉదయసముద్రం(6.7టీఎంసీలు) ప్రాజెక్టు పనులను సైతం త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంది. వీటి పరిధిలో ముంపునకు గురయ్యే సుమారు 3వేల ఎకరాల భూమికి పరిహారం చెల్లించాల్సి ఉంది. గతంలో ఇచ్చిన పరిహారం చాలా తక్కువగా ఉన్న దృష్ట్యా దానిని పునఃపరిశీలన జరపాలన్న డిమాండ్ అక్కడి నిర్వాసితుల నుంచి వస్తోంది. ఈ అంశాలను పరిష్కరిస్తేనే ఎస్ఎల్బీసీ పనులు కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతమున్న టెండర్‌ను కొనసాగించడమా, లేక రద్దు చేయడమా, రద్దు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? లేదా కాంట్రాక్టు సంస్థ కోరుతున్నట్లుగా రూ.150 కోట్లు అడ్వాన్సుగా చెల్లించాలా అనే అంశాలపై గురువారం వివిధ పార్టీల నేతలు, నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశంలో చర్చించనున్నారు.