మనస్తాపంతో ఎమ్మార్వో ఆత్మహత్యాయత్నం
అనంతపురం: మనస్తాపం చెందిన ఓ ఎమ్మార్వో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. సోమందేపల్లి ఎమ్మార్వోగా తిమ్మప్ప గత కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్నారు. భూ వివాదంలో తనపై ఆరోపణలు చేస్తున్నారని..మనస్తాపం చెందిన ఆయన కార్యాలయంలో తలుపులు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన సిబ్బంది, స్థానికులు తలుపులు పగలకొట్టి తిమ్మప్పను రక్షించారు.