బాలకృష్ణ, సౌందర్య నటించిన నర్తనశాల రిలీజ్
నందమూరి నటసింహం బాలకృష్ణ దర్శకత్వం వహించాలనుకున్న 'నర్తనశాల' సినిమా మధ్యలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అర్జునిడిగా బాలయ్య నటించగా, భీముడిగా శ్రీహరి , ధర్మరాజుగా శరత్ కుమార్ నటించారు. ఇక ద్రౌపతిగా అందాలనటి సౌందర్య నటించింది. కేవలం ఈ సినిమాను 17 నిమిషాల పాటు చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించింది. దాంతో సినిమా షూటింగ్‌ను బాలకృష్ణ పక్కన పెట్టేశారు. అయితే అభిమానుల కోరిక మేరకు 17 నిమిషాల నిడివి ఉన్న ఆ సన్నివేశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నట్లు బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
బుధవారం 12.30 గంటలకు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో అర్జునుడు, కృష్ణుడు, ధుర్యోధనుడిగా బాలయ్య త్రిపాత్రాభినయం చేయాలనుకున్నారు. అయితే అనుకోని విధంగా ఏప్రిల్ 17, 2004న ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వెళుతూ నటి సౌందర్య ప్రమాదానికి గురై చనిపోయింది. ఆ ప్రమాదంలోనే ఆమె సోదరుడు అమర్నాథ్ కూడా సజీవ దహనమయ్యిన విషయం తెలిసిందే. దీంతో నర్తశాల మరుగున పడిపోయింది. తాజాగా ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఇన్నాళ్లకు ఓటీటీ ద్వారా చిత్రంలోని కొన్ని సన్నివేశాలను విడుదల చేయబోతున్నారు.
చదవండి: ‘బాలయ్య కరోనా మంత్రం’పై జోకులే జోకులు!