specialties
-
తెలంగాణ హైకోర్టు ప్రత్యేకతలు.. (ఫొటోలు)
-
టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు వచ్చేస్తున్నాయ్.. ప్రత్యేకతలివే..
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించిన సంస్థ.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి రాబోతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా సంస్థ నామకరణం చేసింది. హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త ప్రోటో (నమూనా) ఏసీ స్లీపర్ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువస్తోన్న టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పీవీ ముని శేఖర్, చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎం) కృష్ణ కాంత్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (సీఎంఈ) రఘునాథ రావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(సీటీఎం) జీవన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. బస్సు ప్రత్యేకతలివే! 12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్త్ ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతి బెర్త్ వద్ద రీడిండ్ ల్యాంప్ లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏసీ స్లీపర్ బస్సుల్లో వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ స్లీపర్ బస్సుల్లో వైఫై సదుపాయాన్ని కల్పించారు. ప్రతి బస్సులోనూ రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి కేబిన్‌లో, బస్సు లోపల ఉన్నాయి. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్ఎస్)ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టం బస్సుల్లో ఉంటుంది. చదవండి: అమ్మకానికి హెచ్ఎండీఏ భూములు.. ప్లాట్ల ఆన్లైన్ వేలం ఎప్పుడంటే? -
శ్రీశైలం బయో డైవర్సిటీ రీసెర్చ్ సెంటర్.. ఎన్నో ప్రత్యేకతలు
సాక్షి, అమరావతి: ప్రకృతి ప్రసాదించిన వరం నల్లమల అటవీ ప్రాంతం. ఎత్తయిన కొండలు.. జలపాతాలు.. అరుదైన వృక్షాలు.. వన్యప్రాణులు.. అన్నిటికీ మించి పులులు జీవించేందుకు నల్లమల అత్యంత అనుకూలమైంది. విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు. ఎన్నో విశేషాలు, వింతలు, అద్భుతాలతో అలరారుతున్న నల్లమలను చుట్టి రావాలంటే.. మామూలుగా అయితే సాధ్యం కాదు. కానీ.. అక్కడి జీవవైవిధ్యం అంతటినీ శ్రీశైలం బయో డైవర్సిటీ రీసెర్చ్ సెంటర్లో చూడవచ్చు. నల్లమల ప్రత్యేకతలు, జీవజాలం, జంతుజాలం, పులులు, ఇతర వన్యప్రాణులు వంటి సమస్త సమాచారం అక్కడ ఉంటుంది. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ప్రాంతంలో జీవవైవిధ్య కార్యకలాపాల కోసం 2001లో స్వతంత్ర జీవవైవిధ్య పరిశోధన కేంద్రాన్ని శ్రీశైలంలో ప్రారంభించారు. దశాబ్ద కాలంలో వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యం, వివిధ జాతుల జాబితాకు సంబంధించి అత్యుత్తమ పరిశోధనలు ఇక్కడ జరిగాయి. ఈ అటవీ ప్రాంతంలోని వెన్నెముక లేని, వెన్నెముక ఉన్న జీవుల నమూనాలను సేకరించి బయోడైవర్సిటీ రీసెర్చ్ సెంటర్ ల్యాబోరేటరీలో భద్రపరిచారు. ఇదీ నల్లమల జీవవైవిధ్యం పులులు, ఎలుగుబంట్లు వంటి 80 రకాల పాలిచ్చే జంతువులు, 303 జాతుల పక్షులు, 80 రకాల పాకే ప్రాణులు, కప్పల వంటి 20 ఉభయ చరాలు, 55 రకాల చేపలు, 102 రకాల సీతాకోక చిలుకలు, 57 రకాల తూనీగలు, 47 జాతుల కీటకాలు ఇంకా అనేక రకాల కీటక జాతులను ఈ అటవీ ప్రాంతంలో గుర్తించిన పరిశోధనా కేంద్రం చెక్లిస్ట్ను తయారు చేసింది. నాగార్జున సాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం, రోళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యాలలో అన్ని రకాల జీవవైవిధ్య సర్వేలు నిర్వహించింది. నల్లమలలోని జంతు, పుష్ప సంపదపై డిజిటల్ ఫొటో డాక్యుమెంటేషన్ చేసింది. అక్కడి జంతుజాలం, వృక్షజాలం యొక్క జాతుల స్థాయిపై సమగ్ర తనిఖీ జాబితాను రూపొందించింది. మాంసాహార ప్రాణుల ఆహారపు అలవాట్లను అధ్యయనం నిర్వహిస్తోంది. శాకాహార ప్రాణుల వెంట్రుకల ద్వారా వాటి లక్షణాలను గుర్తిస్తోంది. ఇక్కడి గడ్డి జాతుల వైవిధ్యం, వృక్ష జాతులతో వాటిపై సంబంధాలపై అధ్యయనం చేసింది. పులుల గణన ఇక్కడే.. నల్లమల అటవీ ప్రాంతంలోని పులుల గణన చేపట్టేది ఈ పరిశోధనా కేంద్రంలోనే. అటవీ ప్రాంతంలో పులులు తిరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌ల నుంచి సేకరించిన లక్షలాది ఫొటోలను విశ్లేషించి ప్రతి సంవత్సరం పులులను ఇక్కడ లెక్కిస్తారు. పులుల సంఖ్య, వాటి తీరు, ఆడవా, మగవా, వాటి మధ్య తేడాలు వంటి అన్ని అంశాలను గుర్తిస్తారు. పులులపై ఉండే చారల ద్వారా ప్రతి పులి ఆనవాలును ఇక్కడ సేకరించి దాని కదలికలను గమనిస్తారు. చదవండి: పెళ్లయిన ఆ జంటలు.. ఇక ప్రత్యేక కుటుంబాలు చిరుతలు, ఎలుగుబంట్లు వంటి ఇతర జంతువులను కూడా ఈ ఫొటోల ద్వారా గుర్తించి లెక్కిస్తారు. అటవీ సిబ్బందికి శిక్షణ తరగతులు, ప్రజలకు జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 8.6 హెక్టార్ల విస్తీర్ణంలో శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీ పక్కన పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో ఎకోలాజికల్ నాలెడ్జ్ పార్కును అభివృద్ధి చేశారు. ఇందులోని 4.96 హెక్టార్ల విస్తీర్ణంలో భూమి ఆవిర్భావం నుండి ఆధునిక మనిషి జీవ పరిణామ క్రమాన్ని వివరించే థీమ్‌తో ఏర్పాటు చేసిన పార్కు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. -
సికింద్రాబాద్ టు విశాఖ.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలివే..
సాక్షి, విశాఖపట్నం: అత్యంత వేగంగా నడిచే వందేభారత్ రైలు బుధవారం విశాఖపట్నం చేరుకుంది. చెన్నైలో గల ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి ప్రాథమిక నిర్వహణ నిమిత్తం ఈ రైలు ఇక్కడికి వచ్చింది. దీనిని నిర్వహణ నిమిత్తం కోచింగ్ కాంప్లెక్స్‌కు పంపించారు. తదుపరి ఆదేశాలు వచ్చిన తరువాత ఈ రైలును సికింద్రాబాద్ పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. వందేభారత్ ప్రత్యేకతలు ►ఈరైలు బయట నుంచి చూడడానికి విమానాన్ని పోలి ఉంటుంది. మిగిలిన రైలు కోచ్‌ల కంటే ఇవి తేలికైనవి. ►మొత్తం 16 కోచ్‌లు, 1128 సీటింగ్ సామర్ధ్యం, మొత్తం శీతల కోచ్‌లు. ►మధ్యలో గల రెండు కోచ్‌లు మొదటి తరగతి కోచ్‌లు, ఇవి 52 సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంటాయి. మిగిలిన కోచ్‌ల్లో మాత్రం విమానం మాదిరిగా 78 రిక్లైనింగ్ సీట్లు ఉంటాయి. ►ఈ కోచ్‌ల పొడవు 23 మీటర్లు, మొత్తం రైలు ఫ్రేమ్ స్టెయిన్లెస్ స్టీల్‌తో నిర్మించబడింది. ►ఆటోమెటిక్ ఇంట్రీ, ఎగ్జిట్ స్లైడింగ్ డోర్స్, వ్యక్తిగతంగా చదువుకునేందుకు వీలుగా లైటింగ్ సదుపాయం, మొబైల్ చార్జింగ్ పాయింట్స్, సహాయకుడిని పిలిచే సదుపాయం, బయో టాయ్‌లెట్స్, సీసీ టీవి కెమెరాలు, రీ సైక్లింగ్ సదుపాయాలు ►దీని ప్రయాణ గరిష్ట వేగ పరిమితి గంటకు 160 కి.మీ. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Warship: ఐఎన్ఎస్ విశాఖపట్నం.. ఆ పేరెందుకు పెట్టారంటే..
సాక్షి, విశాఖపట్నం: పాకిస్తాన్ పీచమణిచి.. 1971 యుద్ధంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడిన చిరస్మరణీయ విజయానికి విశాఖ కీలక వేదికగా నిలిచింది. భారత జాతి గర్వించదగ్గ గెలుపును అందించిన విశాఖ పేరు వింటేనే ఉత్తరాంధ్ర వాసులకే కాదు.. యావత్ తెలుగు ప్రజల గుండె ఉప్పొంగుతుంది. అలాంటిది.. సముద్ర రక్షణలో శత్రువుల్ని సమర్థంగా ఎదుర్కొనే యుద్ధ నౌకకు విశాఖపట్నం పేరు పెడితే ఆ ఆనందం సాగరమంత అవుతుంది. అందుకే.. నౌకాదళ అధికారులు ఐఎన్ఎస్ విశాఖపట్నం పేరుతో భారీ యుద్ధ నౌకను సిద్ధం చేశారు. త్వరలోనే దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఆ ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక విశేషాలివీ. (చదవండి: పసిడికి పెట్టింది పేరు.. నరసాపురం గోల్డ్ మార్కెట్) విశాఖపట్నం పేరెందుకు పెట్టారంటే.. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్–15బీ పేరుతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిౖసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లను పెట్టాలని సంకల్పించి తొలి షిప్‌ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు. చదవండి: పర్యాటకానికి 'జల'సత్వం ముంబైలో తయారీ 2011 జనవరి 28న ఈ ప్రాజెక్ట్ ఒప్పందం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్, ఇండియన్ నేవీకి చెందిన అంతర్గత డిజైన్ సంస్థలు షిప్ డిజైన్లని సిద్ధం చేశాయి. 2013 అక్టోబర్‌లో విశాఖపట్నం యుద్ధనౌక షిప్ తయారీకి వై–12704 పేరుతో ముంబైలోని మజ్గావ్ డాక్స్ లిమిటెడ్ (ఎండీఎల్) శ్రీకారం చుట్టింది. 2015 నాటికి హల్‌తో పాటు ఇతర కీలక భాగాలు పూర్తి చేసింది. తయారు చేసే సమయంలో పలుమార్లు ప్రమాదాలు కూడా సంభవించాయి. 2019 జూన్‌లో షిప్‌లోని ఏసీ గదిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు మరణించాడు. అయితే.. షిప్ తయారీలో మాత్రం ఎక్కువ నష్టం వాటిల్లలేదు. 2020లో రెండుసార్లు విజయవంతంగా సీ ట్రయల్స్ పూర్తి చేసిన అనంతరం తూర్పు నౌకాదళానికి ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను అక్టోబర్ 28న అప్పగించారు. డిసెంబర్లో దీనిని జాతికి అంకితం చేయనున్నారు. శత్రువుల పాలిట సింహస్వప్నమే ఇది సముద్ర ఉపరితలంపైనే ఉన్నా.. ఎక్కడ శత్రువుకు సంబంధించిన లక్ష్యాన్నైనా ఛేదించి మట్టుబెట్టగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విశాఖను శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. యుద్ధ నౌక విశేషాలివీ.. బరువు 7,400 టన్నులు పొడవు 163 మీటర్లు బీమ్ 17.4 మీటర్లు డ్రాఫ్ట్ 5.4 మీటర్లు వేగం గంటకు 30 నాటికల్ మైళ్లు స్వదేశీ పరిజ్ఞానం - 75 శాతం పరిధి - ఏకధాటిన 4 వేల నాటికల్ మైళ్ల ప్రయాణం సెన్సార్స్ ,ప్రాసెసింగ్ వ్యవస్థలు- మల్టీ ఫంక్షన్ రాడార్, ఎయిర్ సెర్చ్ రాడార్ ఆయుధాలు: 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు విమానాలు: రెండు వెస్ట్‌ల్యాండ్ సీ కింగ్ విమానాలు లేదు రెండు హెచ్ఏఎల్ ధృవ్ విమానాల్ని తీసుకెళ్లగలదు -
గూఢచారి ‘ధ్రువ్’ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలివే..
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. అధునాతన సాంకేతికతతో రూపొందించిన గూఢచారి నౌక ఐఎన్ఎస్ ధ్రువ్‌ను ఈ నెల 10న జాతికి అంకితం చేయనున్నట్లు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ప్రకటించారు. విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డులో ఈ నౌకని రూపొందించారు. 2015లో నౌక నిర్మాణం ప్రారంభించగా 2020 అక్టోబర్‌లో పూర్తయింది. మొత్తం రూ.1,500 కోట్లతో ధ్రువ్ నిర్మితమైంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) శాస్త్రవేత్తలు, ఇండియన్ నేవీ ఇంజనీర్లు, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) శాస్త్రవేత్తలు, హిందుస్థాన్ షిప్‌యార్డు (హెచ్ఎస్ఎల్) నిపుణులు ఈ నౌక నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. శత్రు క్షిపణుల్ని సమర్థవంతంగా గుర్తించగల సామర్థ్యంతోపాటు అనేక ప్రత్యేకతలు ఈ నౌకకు ఉన్నాయి. శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్లతో పాటు ఇతర భూభాగాల నుంచి క్షిపణులను ప్రయోగిస్తే వాటిని ధ్రువ్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. అంతేకాకుండా మనకు నష్టం జరగకుండా శత్రు క్షిపణులను ఏ ప్రాంతంలో ధ్వంసం చేయాలన్న విస్తృత సమాచారాన్ని సైతం అందించగల సామర్థ్యం ధ్రువ్ సొంతం. సాధారణ మిసైల్స్‌తో పాటు న్యూక్లియర్ మిసైల్స్ జాడల్ని కూడా ఇది సులభంగా గుర్తిస్తుంది. ధ్రువ్ నౌక మరిన్ని ప్రత్యేకతలివే.. ►దేశాన్ని మొత్తం నిశిత పరిశీలన చేసే శాటిలైట్ మానిటర్లను ఇందులో ఏర్పాటు చేశారు. ►ఈ నౌక రాకతో అత్యాధునిక అధునాతన సముద్ర నిఘా వ్యవస్థలున్న పీ–5 దేశాల సరసన భారత్ చేరింది. ►ఇందులో సెన్సార్లతో కూడిన త్రీ డోమ్ షేప్డ్ సర్వైలెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఎరే రాడార్స్ టెక్నాలజీని వాడారు. ►అందుకే భారత నౌకాదళం ఐఎన్ఎస్ ధ్రువ్‌ని ‘ఈసీజీ ఆఫ్ ఇండియన్ ఓషన్’ అని పిలుస్తోంది. ►అంతేకాకుండా.. దీని ద్వారా 14 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. సాగరతీరంలో విజయ జ్వాల బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): పాక్‌తో 1971లో జరిగిన యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వార్షికోత్సవం స్వర్ణిమ్ విజయ్ వర్ష్‌లో భాగంగా వెలిగించిన విక్టరీ ఫ్లేమ్ శుక్రవారం ఈఎన్సీకి చేరుకుంది. ఈ విక్టరీ ఫ్లేమ్‌ను అధికారికంగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, ఈఎన్సీ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ తీసుకున్నారు. విక్టరీ ఫ్లేమ్ రాక సందర్భంగా శుక్రవారం బీచ్‌రోడ్డులోని విక్టరీ ఎట్ సీ వద్ద వేడుకలు జరిగాయి. నేవీ సిబ్బంది నిర్వహించిన కవాతు అందర్నీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా 1971 యుద్ధంలో పాల్గొన్న వారి అనుభవాలను హోంమంత్రి తెలుసుకున్నారు. విక్టరీ ఫ్లేమ్‌ను స్వీకరిస్తున్న హోంమంత్రి సుచరిత, ఈఎన్సీ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ యుద్ధంలో అమరులైన వారిని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. 1971లో విజయం సాధించి 50 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద 2020 డిసెంబర్ 16న నాలుగు విజయ జ్వాలలను వెలిగించారు. ఇవి దేశవ్యాప్తంగా ప్రయాణిస్తున్నాయి. దక్షిణ కార్డినల్ కోసం విక్టరీ ఫ్లేమ్ ఐఎన్ఎస్ సుమిత్రలో పోర్ట్ బ్లెయిర్ నుంచి విశాఖపట్నం చేరుకుంది. ఇది నగరంలోని వివిధ పాఠశాలలకు వెళ్తుంది. అనంతరం రాజమహేంద్రవరం, విజయవాడ, నల్గొండ మీదుగా హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ఏడాది డిసెంబర్ 16న ఈ నాలుగు విజయ జ్వాలలు కలుస్తాయి. ఇవీ చదవండి: వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ.. మాయ‘లేడి’: చాటింగ్‌తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్ -
Visakhapatnam: యువర్ అటెన్షన్ ప్లీజ్.. విశాఖపట్నం
రైల్వే స్టేషన్ ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా, వినోదమయంగా, విజ్ఞానవంతంగా వెలుగులీనుతూ మీకు స్వాగతం పలుకుతోంది. మీరు వచ్చింది ఎయిర్‌పోర్టుకా లేదా రైల్వేస్టేషన్కేనా అనే సందేహమే అవసరం లేదు. ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా ఈ ప్రగతిని పట్టాలెక్కించారు. తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఎన్నో ప్రత్యేకతలతో, మరెన్నో విశేషాలతో స్వాగతం చెబుతోంది. కరోనా లాక్డౌన్ వేళల్లో సైతం నిత్యం జాగ్రత్తలు వహిస్తూ ఇక్కడ ఆధునికీకరణ పనులు పూర్తి చేశారు. ఒకటో నెంబర్ ప్లాట్ ఫారం మీద వీఐపీ లాంజ్, మూడో నెంబర్ గేట్ వద్ద ప్రవేశ ద్వారం, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల వంటి నిర్మాణాలు చేపట్టారు. వీటిలో కొన్ని పూర్తవగా మరికొన్నిటి పనులు చకచకా సాగుతున్నాయి. వృద్ధులు, చిన్న పిల్లలకు అవసరమైన ప్రత్యేక సేవలు మొదలు, కనువిందు చేసే పచ్చటి గార్డెన్లు, చరిత్ర సాక్ష్యాలు తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్, జాతిపిత జీవితంలో ప్రధాన ఘట్టాలను ఆవిష్కరింపచేసేలా శిల్పాలు, పనికిరాని వస్తువులతో తయారు చేసిన ప్రత్యేక పరికరాలు, వాడి వదిలేసిన భారీ క్రేన్, రైలింజన్ వంటి ఎన్నో ప్రత్యేకతలతో మన రైల్వేస్టేషన్ ఆహ్వానం పలుకుతోంది. ఆకర్షణీయంగా ప్రవేశ ద్వారాలు అందమైన ప్రవేశ ద్వారాలతో మన స్టేషన్ ముస్తాబైంది. ఇంత వరకూ కరోనా కారణంగా పరిమిత ద్వారాలను మాత్రమే వినియోగించారు. ఇప్పుడు అన్ని ద్వారాలు అందుబాటులోకి రావటంతో స్టేషన్ పరిసరాలు చాలా అందంగా మారిపోయాయి. గతంలో వర్షం వస్తే చాలామంది బయట తడిసిపోయేవారు. ఇప్పుడు శ్లాబులను పెంచడంతో ప్రయాణికులు చాలావరకు ఎండా, వానల నుంచి రక్షణ పొందవచ్చు. కుడ్య చిత్రాలలో అహింసామూర్తి ఇక ఈ ప్రవేశ ద్వారం పక్కనే ఏర్పాటు చేసిన మహాత్మా మ్యూరల్ ఆర్ట్ మరో ప్రత్యేక ఆకర్షణ. జాతిపిత జీవితంలో సంభవించిన ప్రధాన ఘట్టాలతో ఈ కుడ్య చిత్రకళను వాల్తేర్ డివిజన్‌కు చెందిన ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఇక్క డ గోడలపై అద్భుతంగా ఆవిష్కరించారు. వివిధ సంవత్సరాల్లో జరిగిన సత్యాగ్రహ, సహాయ నిరాకరణోద్యమం, దండిమార్చ్, క్విట్ ఇండియా మూవ్మెంట్, సబర్మతి ఆశ్రమం నమూనా, సౌత్ ఆఫ్రికా రైలు ఘటన, ఖాదీ గ్రామోద్యోగ్, జాతిపిత సమాధి వంటి వాటిని కనుల ముందు సాక్షాత్కరింపజేశారు. ఇక ప్రధాన ప్రవేశద్వారం ఒకటో నెంబర్ గేట్ ఎదురుగా స్వచ్ఛ భారత్ లోగో కనువిందు చేస్తుంది. దాని నేపథ్యంలో పచ్చదనం మరో విశేష ఆకర్షణ. నూరేళ్ల సేవలకు నిలువెత్తు దర్పణం విశాఖ రైల్వేస్టేషన్లో 1887–1988 వరకు వందేళ్లు సేవలందించిన పర్లాకిమిడి లైట్‌రైల్ ప్రధాన ద్వారం పక్కనే మరో అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. నాటి సౌత్ ఈస్ట్రన్ రైల్వే పరిధిలో పర్లాకిమిడి లైట్ రైల్వే పేరిట నౌపడా–గుణుపూర్ మధ్య దాదాపు 100 సంవత్సరాలు ఈ లైట్ రైల్ సేవలందించింది. దానికి గుర్తుగా అదే ఇంజిన్, బోగీలను ఇక్కడ ప్రదర్శనార్థం ఉంచారు. జ్ఞానాపురం వైపు గల ప్రవేశాల వద్ద ఏర్పాటు చేసిన గ్లోబ్, గిటార్ కళ్లు తిప్పుకోనీయవు. అప్పట్లో విశేష సేవలందించిన భారీ క్రేన్లను చూస్తే వాటిని మలచిన వారి కళా దృష్టి, చక్కటి పని తీరు ఎప్పటికీ మన మదిలో కదలాడుతుంది. వాల్తేర్ డివిజన్‌కు చెందిన డీజిల్ లోకో షెడ్ సిబ్బంది వీటిని పనికిరాని, వాడి వదిలేసిన ఇనుప పనిముట్లతో తయారు చేశారు. జ్ఞానాపురం వైపే రైల్వేలో అప్పట్లో ఎంతోకాలం సేవలందించిన భారీ క్రేన్‌ను కూడా సందర్శన కోసం ఉంచారు. చరిత్ర చిత్రాలు ఒకటో నెంబర్ ప్రధాన ద్వారం పక్కనే విశాఖపట్నం రైల్వే, వాల్తేర్ డివిజన్ చరిత్రను తెలియజేసే అలనాటి ఫొటోలెన్నో మనకు చరిత్రను తెలియజేస్తాయి. కేకే లైన్లో నాటి నిర్మాణ శైలి, తొలి రైల్వేస్టేషన్, ఇలా రైల్వే చరిత్రను మనకు సాక్షాత్కరింపజేస్తుంది. చదవండి: వైఎస్సార్‌కు భారతరత్న ఇవ్వాలి -
మేడారం.. అన్నీ ‘ప్రత్యేకం’
ఆదివాసీల అతి పెద్ద జాతర.. దక్షిణాది కుంభమేళ.. మేడారం జాతర ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. ప్రతి అంశం వెనుక ఓ చరిత్ర ఉంది. ప్రతి ప్రక్రియకు ప్రత్యేకత ఉంది. ఒక్కో ఊరికి ఒక్కో చరిత్ర. వనదేవతలుగా ప్రసిద్ధికెక్కిన ఒక్కొక్కరిదీ ఒక్కో వీరగాథ. మేడారంలోని కీలక అంశాలపై ప్రత్యేక కథనం.. పగిడిద్దరాజు గుడి.. పూనుగొండ్ల మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో పూనుగొండ్ల గ్రామం ఉంది. ఇక్కడ సమ్మక్క భర్త పగిడిద్దరాజు గుడి ఉంది. మేడారం, పూనుగొండ్ల మధ్య దూరం నలభై కిలోమీటర్లు. సమ్మక్క భర్త పగిడిద్దరాజును పూనుగొండ్ల నుంచి మేడారానికి తీసుకువస్తారు. పెనక వంశానికి చెందిన పగిడిద్దరాజును అదే వంశానికి చెందిన పెనక బుచ్చి రామయ్య అనే పూజారి పూనుగొండ్ల గ్రామం నుంచి కాలినడకన తీసుకువస్తారు. వెన్నెలక్క నెలవు.. కన్నెపల్లి తాడ్వాయి మండలంలోని ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో కన్నెపల్లి గ్రామం ఉంది. ఈ గ్రామంలోనే వెన్నెలమ్మగా పిలిచే సారలమ్మ ఆలయం ఉంది. జాతర సమయంలో ఇక్కడి నుంచి జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వరకు సారలమ్మను ఆదివాసీ పూజారులు తీసుకొస్తారు. ఈ ఊరి జనాభా 282 మంది. ఈ గ్రామ ప్రజలు ఏం చేయాలన్నా సారలమ్మ ఆశీర్వాదం తప్పనిసరి. ‘మా వెన్నెలక్కకు సెప్పకుంటే ఇగ అంతే.. అమ్మో.. సారక్కకు చెప్పే సేత్తం’అంటారు ఇక్కడి ఆదివాసీలు. మారేడు చెట్ల మేడారం 80 కుటుంబాలు ఉన్న చిన్న పల్లె ఇది. సమ్మక్క–సారలమ్మ జాతర ప్రధాన కేంద్రమైన గద్దెలు ఈ గ్రామంలోనే ఉన్నాయి. ఈ గ్రామంలో సమ్మక్కకు ఆలయం ఉంది. జాతరలో కీలక ప్రాంతాలైన చిలకలగుట్ట, జంపన్నవాగు సైతం ఈ గ్రామ సమీపంలోనే ఉన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం నుంచి 110 కిలోమీటర్ల దూరంలో మేడారం ఉంటుంది. అటవీ ప్రాంతంలోని తాడ్వాయి మండలం ఊరట్టం పంచాయతీ పరిధిలో ఈ ఊరు ఉంటుంది. మారేడు చెట్లు ఎక్కువగా ఉన్నందున ఈ ఊరికి మేడారం అని పేరు వచి్చనట్లు చెబుతుంటారు. ఇక్కడ కోయ వర్గానికి చెందిన గిరిజన కుటుంబాలే ఎక్కువ. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం, ఉత్పత్తుల సేకరణ. విలుకాడు... గోవిందరాజు సారలమ్మ భర్త గోవిందరాజు. దబ్బగట్ల వంశానికి చెందిన గోవిందరాజు.. మేడారానికి వచ్చిన సమయంలోనే కాకతీయులతో యుద్ధం జరిగింది. విలువిద్యలో ఆరితేరిన గోవిందరాజు యుద్ధంలోనే వీరమరణం పొందారు. సారలమ్మ.. సమ్మక్క కూతురు సారలమ్మ. తల్లికి తగ్గ తనయ. కాకతీయులతో జరిగిన యుద్ధంలో మేడారం నుంచి కన్నెపల్లి వైపు వెళ్లిన సారలమ్మ ఆ ప్రాంతంలోనే వీరమరణం పొందారు. దీంతో అక్కడివారు తమ ఇలవేల్పుగా కొలుస్తున్నారు. సమ్మక్క ఆగమనానికి ముందురోజు కన్నెపల్లి గ్రామంలోని సారలమ్మ గుడిలో ప్రధాన పూజారి ప్రత్యేక పూజలు చేస్తారు. బయ్యక్కపేట, చందా వంశీయులు... ఇదో ఘట్టం కొందరి పరిశోధనల ప్రకారం... మేడారంలో కొలువు తీరిన సమ్మక్కకు బయ్యక్కపేటలోనూ చరిత్ర ఉంది. ఈ మేడారం జాతరను మొదట బయ్యక్కపేటలోనే నిర్వహించేవారు. ఈ బయ్యక్కపేట మేడారానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చందా వంశపు కోయ గిరిజనుల ఆడబిడ్డగా సమ్మక్క బయ్యక్కపేటలోనే జన్మించినట్లు ప్రచారంలో ఉంది. గోవిందరాజు ఇలాకా.. కొండాయి ఏటూరునాగారం మండలంలో కొండాయి గ్రామం ఉంది. సారలమ్మ భర్త గోవిందరాజు ఆలయం ఇక్కడే ఉంది. మేడారం, కొండాయి గ్రామాల మధ్య దూరం పన్నెండు కిలోమీటర్లు. జాతర సందర్భంగా వడ్డెలు, తలపతి, వర్తోళ్లు కలసి డోలు చప్పుళ్లతో కాలినడకన మేడారం చేరుకుంటారు. సంపెంగవాగే ‘జంపన్న’వాగు సమ్మక్క కుమారుడు జంపన్న. కాకతీయులతో జరిగిన యుద్ధంలో శుత్రువు చేతికి చిక్కి చావడం ఇష్టంలేని జంపన్న అక్కడికి సమీపంలోని సంపెంగవాగులో దూకి చనిపోయాడు. అప్పటి నుంచి ఈ వాగును జంపన్న వాగుగా పిలుస్తారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈ వాగులో స్నానాలు చేసిన తర్వాతే వన దేవతలకు మొక్కులు సమర్పిస్తారు. అందరి మాత.. సమ్మక్క కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని ‘పొలవాస’ను 12 శతాబ్దంలో గిరిజన దొర మేడరాజు పాలించాడు. వేట కోసం ఒకసా రి అభయారణ్యం వెళ్లాడు. అక్కడ పులుల సంరక్షణలో, దివ్యకాంతులతో ఉన్న బాలికను చూసి గ్రామానికి తీసుకొచ్చారు. సమ్మక్క అని పేరు పెట్టారు. యుక్త వయసు వచ్చిన సమ్మక్క.. మేడారాన్ని పరిపాలించే పగిడిద్దరాజును వివాహమాడిం ది. పగిడిద్దరాజు మేడరాజుకు మేనల్లుడు. పగిడిద్దరాజు – సమ్మక్కకు సారలమ్మ, నా గులమ్మ కుమార్తెలు, జంపన్న కుమారుడు. సారలమ్మకు గోవిందరాజుతో పెళ్లయింది. – గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, వరంగల్ -
వసతి లేని గృహాలు !
ఖమ్మంమయూరిసెంటర్: రెండు రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచే ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలను సైతం ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. రెండు నెలలుగా విద్యార్థులు లేక మూసి ఉన్న హాస్టళ్లను శుభ్రం చేయడంతో పాటు వసతిగృహాల్లో నెలకొన్న ఇతర సమస్యలను పరిష్కరించాలి. అయితే జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. వాటి పరిష్కారానికి అధికారులు చేపడుతున్న చర్యలు శూన్యం. ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను గుర్తించి, మరమ్మతులకు అంచనాలు రూపొందించాలని ఆ శాఖ అధికారులు ఇంజనీరింగ్ శాఖకు లేఖలు రాసి, తమ పని అయిపోయిందన్నట్టుగా చేతులు దులుపుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్యా గుర్తించలేదు. బీసీ వసతిగృహాల్లోనూ సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. గతంలో ‘సాక్షి’ నిర్వహించిన హాస్టళ్ల సందర్శనలో బీసీ వసతి గృహాల్లో.. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలోని వసతిగృహాల్లోనే అత్యధిక సమస్యలు దర్శనమిచ్చాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రతిపాదనలు చేస్తున్నామని అధికారులు చెపుతున్నా.. ఇప్పటి వరకు ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు పనులు చేపట్టినప్పటికీ కొన్ని కూడా పూర్తి కాలేదు. హాస్టళ్ల కిటికీలకు తలుపులు కూడా లేవు. మరో రెండు రోజుల్లో విద్యార్థులు వసతిగృహాలకు వస్తున్నా.. పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో సమస్యలు పరిష్కారమవుతాయా అనే ప్రశ్న విద్యార్థి సంఘాల్లో తలెత్తుతోంది. ప్రారంభం కాని మరమ్మతులు.. విద్యా సంవత్సరం ప్రారంభానికి రెండు రోజులే సమయం ఉండడం, వేసవి సెలవులు ముగించుకొని నూతనోత్సాహంతో ఇంటి నుంచి వసతిగృహాలకు వచ్చే విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలుకనున్నాయి. ప్రతి ఏడాది వేసవిలోనే హాస్టళ్లలో సమస్యలను గుర్తించి, మరమ్మతుల కోసం ఆయా శాఖల అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపించి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఎస్సీ వసతిగృహాల్లో సమస్యలను గుర్తించాలని ఇంజనీరింగ్ అధికారులకు లేఖలు పెట్టినా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేకపోవడంతో వసతిగృహాల్లో సమస్యలు తప్పేలా లేవు. బీసీ హాస్టళ్లలో సమస్యలను గుర్తించినా.. ఇంతవరకు మరమ్మతు చర్యలేమీ చేపట్టలేదు. ఇక గిరిజన వసతిగృహాల్లో సైతం సమస్యలకు కొదవలేదు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మరమ్మతు పనులు ప్రారంభించినప్పటికీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఈ మూడు శాఖల వసతిగృçహాలు, ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య ప్రధానంగా ఉంది. అద్దె భవనాల్లో ఉన్న వసతిగృహాల పరిస్థితి మరీ దారుణంగా ఉందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆయా శాఖల సంక్షేమాధికారులు శ్రద్ధ చూపించకపోవడంతో మరమ్మతుల ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయం పొడిగించినా ఫలితం లేదు.. 2019 – 20 విద్యా సంవత్సరం జూన్ 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రభుత్వం ఈనెల 12న పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో వసతిగృహాల్లో సమస్యల పరిష్కారానికి కొద్ది సమయం దొరికిందని అధికారులు భావించినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వసతిగృహాల్లో సమస్యలివే.. వసతిగృహాల ప్రారంభంలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యల్లో మొదటిది మరుగుదొడ్ల శుభ్రత. వసతిగృహాలు ప్రతి రోజు నిర్వహించే సమయంలోనే వీటిని శుభ్రం చేసే వారు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు రెండు నెలలు మూసి ఉంచిన అనంతరం తెరుస్తుండడంతో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మరో ప్రధాన సమస్య తాగునీరు. గత్యంతరం లేని స్థితిలో విద్యార్థులు స్నానాలకు ఉపయోగించే నీటినే తాగిన విషయం గతంలో అనేక సార్లు బహిర్గతం అయింది. ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఈ సమస్య మళ్లీ ఉత్పన్నమయ్యేలా ఉంది. ఇక వాడుకునే నీరు సైతం అపరిశుభ్రంగానే ఉంది. జిల్లాలో వసతిగృహాల సంఖ్య ఇలా.. జిల్లాలో ఎస్సీ వసతిగృహాలు 50 ఉండగా వాటిలో కళాశాల స్థాయి 11 ఉన్నాయి. ఇందులో బాలురు 6, బాలికలకు 5 ఉన్నాయి. పాఠశాల స్థాయి వసతిగృహాలు 39 ఉండగా వీటిలో బాలురకు 25, బాలికలకు 14 కేటాయించారు. ఇందులో నేలకొండపల్లి బారుల వసతి గృహం ప్రైవేటు భవనంలో కొనసాగుతోంది. బీసీ వసతిగృహాలు 33 ఉండగా కళాశాల స్థాయి 10 ఉన్నాయి. ఇందులో బాలురవి 5, బాలికలవి 5. పాఠశాల స్థాయి వసతిగృహాలు 23 ఉండగా బాలురకు 18, బాలికలకు 5 కేటాయించారు. ఇందులో 10 హాస్టళ్లు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 19 వసతిగృహాలు ఉండగా కళాశాల స్థాయి 12 ఉన్నాయి. వీటిలో బాలురకు 6, బాలికలకు 6 కేటాయించారు. పాఠశాల స్థాయిలో 7 ఉండగా బాలురకు 5, బాలికలకు 2 ఉన్నాయి. ఇక ఆశ్రమ పాఠశాలలు 11 ఉండగా బాలురకు 4, బాలికలకు 7 కేటాయించారు. వీటిలో 4 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సమస్యలు గుర్తించడంలో నిర్లక్ష్యం.. వసతిగృహాల్లో సమస్యలను గుర్తించడంలో సంక్షేమశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. విద్యా సంవత్సరం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏ వసతిగృహంలో చూసినా ఏదో ఒక సమస్య విద్యార్థులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. గత కొన్ని రోజులుగా అధికారులకు వినతిపత్రం అందించినా పట్టించుకోవడం లేదు. – ఎన్.ఆజాద్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి సమస్యలు గుర్తించినా మరమ్మతులు లేవు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వసతిగృహాల సందర్శన నిర్వహించి సమస్యలను గుర్తించాం. వాటిని నివేదిక రూపంలో తయారు చేసి ఆయా శాఖల అధికారులకు అందించాం. సమస్యలను వారికి విన్నవించినా పరిష్కరించకుండా చోద్యం చూస్తున్నారు. గుర్తించిన సమస్యలను మరమ్మతులు చేసి పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. – టి.నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి -
మహిళలు.. మనీ రాణులు
మహిళలు వంటింటికే పరిమితమన్న మాటలకు కాలం చెల్లి చాలా రోజులయ్యింది. ఆర్థిక రంగం నుంచి అంతరిక్షం దాకా అన్నింటిలోనూ వారు దూసుకెళ్లిపోతున్నారు. ప్రపంచస్థాయిలో పెద్ద పెద్ద కంపెనీల్లో వన్ మ్యాన్ షో .. సారీ.. వన్ ఉమన్ షో నడిపించేస్తున్నారు. పురుషాధిక్య రంగాల్లో కూడా ఆధిపత్యాన్ని చాటుతున్నారు. దేశంలోనే అతి పెద్ద బ్యాంకులైన ఎస్బీఐ (అరుంధతి భట్టాచార్య), ఐసీఐసీఐ బ్యాంకు (చందా కొచర్), యాక్సిస్ (శిఖా శర్మ) బ్యాంకులకు సారథ్యం వహిస్తున్నది మహిళలే. అంతర్జాతీయంగా సాఫ్ట్‌డ్రింక్స్ దిగ్గజం పెప్సీకి (ఇంద్రా నూయి), ఇంటర్నెట్ దిగ్గజం యాహూకి (మెరిస్సా మెయర్) నేతృత్వం వహిస్తున్నది వారే. వీరికి ఇంతటి విజయాలెలా సాధ్యమయ్యాయి.. వీటి వెనుక రహస్యాలేమిటి.. మనీ మ్యాటర్స్‌లో పురుషాధిక్యతను అధిగమించగలగడంలో మహిళల ప్రత్యేకతలేమిటీ? వీటిపైనే ఈ వారం ధనం కథనం. టైమ్ కావొచ్చు, మనీ కావొచ్చు.. మేనేజ్మెంట్ విషయంలో మహిళలే నంబర్‌వన్. అందుకే, మిగతా విషయాలెలా ఉన్నా ఇంటి ఖర్చుల మేనేజ్మెంటు బాధ్యతలు వారికి అప్పగిస్తుంటారు. పెద్దగా దృష్టి పెట్టం గానీ.. రిస్కులు తీసుకోవడం నుంచి లక్ష్యాలు సాధించడం దాకా మహిళల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని.. లక్ష్యం నిర్దేశించుకోవడం.. లక్ష్యాలు నిర్దేశించుకోవడం, సాధించడంలో మహిళలు మేటి. అత్యధిక శాతం మహిళలు ఇంటిలోనైనా ఆఫీసులోనైనా.. ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంపైనా, సాధించడంపైనా ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అందుకే, స్కూలు స్థాయి నుంచి యూనివర్సిటీల దాకా టాపర్స్‌లో ఎక్కువశాతం వారే. లక్ష్య సాధనపై దృష్టి కారణంగానే కెరియర్లో కూడా మగవారి కన్నా కాస్త వేగంగా ముందుకెళ్లగలుగుతారు. ఇలా లక్ష్యాలను నిర్దేశించుకోవడమనేది విజయంతో పాటు కాస్త సమయం ఆదా చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది. విద్య ఎంపికలో.. చదువుకు సంబంధించి కోర్సులను ఎంచుకోవడంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తమకు అనుకూలమైనవి, తాము అన్ని విధాలా రాణించేందుకు అవకాశాలు ఉన్న రంగాలను ఎంచుకుంటూ ఉంటారు. మేనేజ్మెంట్, మెడికల్, అడ్మినిస్ట్రేటివ్ కోర్సులు వారికి ఆల్‌టైమ్ ఫేవరెట్స్‌గా ఉంటుంటాయి. ఒక టి, రెండు మార్కులు పోయినా పర్లేదులే అని అబ్బాయిలు లైట్‌గా తీసుకున్నా.. అమ్మాయిలు మాత్రం ఆ ఒక్క మార్కు కూడా పోకూడదని సీరియస్‌గానే తీసుకుంటుంటారు. సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. సెల్ఫ్-హెల్ప్.. ఇంటి పనుల విషయంలో చూడండి. పిల్లల డైపర్లు మార్చడం నుంచి నిత్యావసరాలు కొనుక్కుని తెచ్చుకోవడం, బిల్లులు కట్టేసేయడం దాకా అన్ని విషయాలను ఎవరిపైనా ఆధారపడకుండా స్వంతంగానే చక్కబెట్టుకుంటుంటారు మహిళలు. వారు సెల్ఫ్-హెల్ప్‌కి ప్రాధాన్యమిస్తారు. భర్తకో, కుటుంబ సభ్యులకో, స్నేహితులకో పని అప్పజెప్పి.. వారు చేసే దాకా ఎదురుచూస్తూ కూర్చుని సమయం వృదా చేసుకోవడం కన్నా సొంతంగా పనులు పూర్తి చేసుకోవడానికి మొగ్గు చూపుతారు. ఇతరులకు అప్పజెబితే తమలాగా శ్రద్ధగా చేస్తారో లేదోనన్న సందేహం కూడా దీనికి కొంత కారణం. ఎందుకంటే..మహిళలు పర్ఫెక్షనిస్టులు కూడా. రోజువారీ రికార్డు.. ఆర్థిక విషయాలు ఇంటికి సంబంధించినవైనా.. ఆఫీసుకు సంబంధించినవైనా.. మహిళలు రికార్డు పాటించడంలో పక్కాగా ఉండేందుకు ఇష్టపడతారు. ప్రతీ పైసాకి వారి దగ్గర లెక్క ఉంటుంది. ఇది మగవారికి కాస్త చాదస్తంగా అనిపించినా.. నెల తిరిగేసరికి జమాఖర్చుల పక్కా రికార్డు చూస్తే మరి మాట్లాడటానికి ఉండదు. నేర్చుకోవడానికి ప్రాధాన్యం.. మహిళలు సాధ్యమైనంత వరకూ తప్పులకు దూరంగా ఉండటానికి ప్రాధాన్యమిస్తారు. ఒకవేళ చేసినా దాన్నుంచి నేర్చు కుంటారు. ఒకసారి చేసిన మిస్టేక్‌ను మరోసారి చేయరు. ఏదైనా డీల్‌తో లాభం వచ్చిందంటే.. మరింత అధిక టార్గెట్లతో మరోసారి ప్రయత్నిస్తారు. అదే నష్టం వస్తే.. దాన్ని పాఠంగా తీసుకుని మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తపడతారు. ప్లాన్ బీ.. ఒక ప్లాన్ వర్కవుట్ కాకపోతే.. మరొకటి..ఇలా ప్రతిదానికీ మహిళల దగ్గర ప్లాన్ బి అంటూ ఒకటి ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ సరిగ్గా లేకపోయినా.. నచ్చినవి కొనేందుకు సరిపడేంత డబ్బు చేతిలో లేకపోయినా.. అప్పటికప్పుడు ఏదో ఒకటి అరేంజ్ చేసేయగలరు వారు. సందర్భం ఏదైనా సరే వారి దగ్గర ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. ఆఖరు నిమిషంలో కూడా మార్పులు, చేర్పులను సమర్థంగా చేయగలరు. అప్పులు.. సాధ్యమైనంత వరకూ అప్పు ఊసే ఉండకుండా చూసుకోవడానికి మహిళలు మొగ్గు చూపుతుంటారు. కుటుంబసభ్యులో, స్నేహితులో ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకుని కొనుక్కోవడం కన్నా.. చేతిలో ఉన్నప్పుడే కొనుక్కునేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే మహిళలు అప్పుల బారిన పడటం కూడా చాలా తక్కువే. ఎలాంటి పరిస్థితినైనా మేనేజ్ చేసేయగల పుష్కలమైన మేనేజ్మెంట్ నైపుణ్యాలు, ఆఖరు నిమిషంలో కూడా దేన్నయినా సెట్ రైట్ చేయగలిగే సామర్థ్యాలు ఉండటమే ఇందుకు కారణం. రిస్కుకి రెడీ.. మిగతావారు మనకి రిస్కు ఎందుకులే అనుకున్న వాటిని కూడా జంకకుండా చేపట్టగలిగే ధైర్యం మహిళల సొంతం. రిస్కు తీసుకున్నా.. విజయాలు సాధించిన వారి ఉదంతాలు కోకొల్లలు. నష్టపోవాల్సి వస్తుందన్న భయం కన్నా.. విజయంపై ఆశావహంగా ఉండగలగడం, నేర్పుగా వ్యవహరించగలగడం ఇందుకు కారణం. పైగా.. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో సమర్థత కలిగి ఉండటం మరో కారణం. మనీ మేనేజ్మెంట్.. కీలకమైన డబ్బు సంగతికొస్తే.. ఎక్కడ, దేనిపై, ఎంత ఖర్చు చేయాలన్న దానిపై మహిళలు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అనవసరమైన వాటిపై ఖర్చు చేయడం కన్నా.. దీర్ఘకాలిక అవసరాల కోసం డబ్బును పొదుపు చేయడానికే ప్రాధాన్యమిస్తుంటారు. ఆదాయం కన్నా ఖర్చుల లిస్టు తక్కువగా ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంటి విషయంలోనైనా ఆఫీసు విషయంలోనైనా అవసరమనుకున్న వాటిపై తప్ప మిగతా వాటిపై ఖర్చు చేసేందుకు ఇష్టపడరు. మనీ మేనేజ్మెంట్లో వారి సామర్థ్యం ఇందుకు ఉపయోగపడుతుంది.