Speed control
-
నల్లమల ఘాట్ రోడ్‌లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్
అసలే దట్టమైన నల్లమల అభయారణ్యం.. ఎత్తయిన ఘాట్ రోడ్డు.. భారీ మలుపులు.. వాహనదారుల అజాగ్రత్తలతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే రెండువైపులా భారీగా నిలిచిపోతున్న వాహనాలు.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్.. సంఘటన స్థలానికి అంబులెన్స్, పోలీసు వాహనాలు చేరుకునేందుకు కూడా అష్టకష్టాలు పడాలి.. ఈలోపు క్షతగాత్రుల ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొని ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం, కర్నూలు ఘాట్ రోడ్లలో వాహన ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్పీడ్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లతో తనిఖీలు చేయడం.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో చెక్ పెడుతున్నారు. పెద్దదోర్నాల: ► శ్రీశైలం వైపు వేగంగా వెళ్తున్న ఓ టూరిస్టు బస్సు ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇవ్వబోయి అదుపుతప్పి తుమ్మలబైలు వద్ద బోల్తాపడిన సంగతి పాఠకులకు విధితమే. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ► మూడు రోజుల కిందట ఓ కారు శ్రీశైలం ఘాట్ రోడ్డులో సాక్షి గణపతి ఆలయ సమీపంలో బోల్తా పడి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. ఇలాంటి ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణతో రంగంలోకి దిగింది. అధిక శాతం వాహనదారులకు ఘాట్ రోడ్లపై అవగాహన లేకపోవడం, మితిమీరిన వేగంతో ప్రయాణించడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించింది. అతివేగం కారణంగా జరుగుతున్న అనర్థాలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తోంది. ప్రమాదాల నివారణకు కసరత్తు చేస్తోంది. జిల్లాలోని సమస్యాత్మక రోడ్లతో పాటు అత్యంత ప్రమాదకర రోడ్లుగా నల్లమల అభయారణ్యంలోని శ్రీశైలం, కర్నూలు ఘాట్ రోడ్లను గుర్తించారు. ఘాట్ రోడ్లలో తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణకు లేజర్ స్పీడ్ గన్లతో పరిశీలించి వాహనాల మితిమీరిన వేగాన్ని కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా జరిమానాలు విధించేందుకు బ్రీత్ ఎనరైజర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్‌తో వాహనదారులకు పరీక్షలు.. మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్ రోడ్డుతో పాటు కర్నూలు రహదారిపై వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపటం వలన అధిక శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని తేలడంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత తప్పిదాల వలనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. దానివలన ఏ తప్పూ చేయని ఎదుటి వ్యక్తుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఘాట్ రోడ్లపై 40 కి.మీ వేగానికి మించి ప్రయాణించడం ప్రమాదకరమని, సెల్ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన వేగంతోనే తరుచూ ప్రమాదాలు.. మితిమీరిన వేగం, వాహనాలను నడిపే సమయంలో నిర్లక్ష్యం కారణంగానే ఘాట్ రోడ్లపై ఎక్కువగా వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు గుర్తించారు. పెద్దదోర్నాల మండల కేంద్రం నుంచి శ్రీశైల పుణ్యక్షేత్రానికి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా కర్నూలు రోడ్డులోని రోళ్లపెంట నుంచి మండల కేంద్రం వరకు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రెండు రహదారులూ ఘాట్ రోడ్లే. ఈ మార్గాలలో నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ప్రయాణికులు, భక్తులు వందలాది వాహనాల్లో శ్రీశైలం వెళ్తారు. కొన్నేళ్లుగా ఘాట్ రోడ్లలో అధికంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లాలోని ముఖ్య రహదారులపై ప్రయాణించే వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అధికారులు లేజర్ గన్లను వినియోగిస్తున్నారు. పరిమితికి మించిన వేగంతో వెళ్లే వాహనాలకు జరిమానాలు, ఈ–చలానాలు విధిస్తున్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి రాజధానికి వెళ్లే రహదారులతో పాటు, అత్యంత క్లిష్టమైన శ్రీశైలం ఘాట్ రోడ్డులో స్పీడ్ గన్లను ఏర్పాటు చేసి వేగ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. మితిమీరిన వేగంగా వెళ్తున్న వాహనాలను కంట్రోలు చేసేందుకు స్పీడు గన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వేగ నియంత్రణకు పటిష్ట చర్యలు మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనాల వలనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అందువలన అతివేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించేందుకు ఘాట్ రోడ్లలో స్పీడ్ గన్లను వినియోగిస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా నిర్వహించి జరిమానాలు విధిస్తున్నాం. దీనివలన రోడ్డు ప్రమాదాలను నియంత్రించగలుగుతున్నాం. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపటం నేరం. సెల్ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపటం అనర్థదాయకం. - మారుతీకృష్ణ, సీఐ, యర్రగొండపాలెం -
హలో బాసూ.. వేగం ఎక్కువైంది.. అని కారు డ్రైవర్‌కు చెబితే!
బండెక్కితే వంద దాటాల్సిందే అనేవాళ్లు చాలా మందే ఉంటారు. రోడ్డు బాగుంటే, జనాలెవరూ లేకపోతే ఈ స్పీడు రెండింతలు కూడా అవుతుంటుంది. ఇలాంటి సమయంలోనే కాస్త అటూఇటైతే ప్రమాదాలు జరుగుతుంటాయి. మరి ఇలాంటి ప్రమాదాలను అరికట్టే అవకాశమే లేదా?.. అంటే ‘మై హూనా’అంటోంది కార్ల కంపెనీ ఫోర్డ్. అత్యవసర సమయాల్లో వాహనం వేగాన్ని తగ్గించే ‘జియోఫెన్సింగ్’టెక్నాలజీని రూపొందించింది. సిటీల్లో ఏయే ప్రాంతాల్లో మెల్లగా వెళ్లాలో అక్కడి నిబంధనల ప్రకారం ఓ వర్చువల్ ప్రాంతాన్ని ఈ టెక్నాలజీ డిజైన్ చేస్తుంది. ఈ ప్రదేశాల్లోకి వాహనం వెళ్లినప్పుడు ఎక్కడైనా వేగం హద్దు మీరినట్టు అనిపిస్తే ‘హలో.. వేగం ఎక్కువైంది’అని డ్రైవర్‌కు ఓ సాఫ్ట్వేర్ రెస్పాన్స్‌ను ఈ టెక్నాలజీ చూపిస్తుంది. ఆ వెంటనే ఆ ప్రాంతానికి తగ్గట్టు వేగాన్ని తగ్గించేస్తుంది. వేగం ఎంత తగ్గుతోందో డ్రైవర్ ముందున్న డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. మరి కొన్నికొన్నిసార్లు రోడ్లు ఖాళీగా ఉన్నా, జనాలెవరూ లేకున్నా ఇలా వేగం తగ్గిస్తే పరిస్థితేంటి?.. అంటే ఈ టెక్నాలజీని ఆఫ్ చేసే వెసులుబాటు కూడా డ్రైవర్‌కు ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్తో అనుసంధానమైన వాహనాల్లో ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ఫోర్డ్ పరిశీలిస్తోంది. మంచి ఫలితాలొస్తున్నాయని కంపెనీ చెబుతోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. కచ్చితంగా పాటించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను తగ్గించే క్రమంలో రోడ్లపై వాహనాల వేగంపై ప్రభుత్వం పరిమితి విధించింది. దీనికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వేగ పరిమితిని ఖరారు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. కార్లు– ఇతర వాహనాలను (సరుకు రవాణా వాహనాలు, బస్సులు, మూడు చక్రాల వాహనాలు, ద్విచక్రవాహనాలు) రెండు కేటగిరీలుగా విభజించి వేరువేరు వేగ పరిమితులను ఖరారు చేసింది. ► డివైడర్లతో ఉన్న రోడ్లు, డివైడర్లు లేని రోడ్లు, కాలనీ రోడ్లు.. ఇలా మూడు వేర్వేరు రోడ్లకు వేర్వేరు గరిష్ట వేగాలను ఇందులో పేర్కొనటం విశేషం. ► ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగి మరణాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ ఉత్తర్వు జారీ చేసినట్లు తెలుస్తోంది. ► రోడ్డు డివైడర్ ఉన్న రోడ్లపై కార్ల గరిష్ట వేగం గంటకు 60 కి.మీ.గా, ఇతర వాహనాల వేగం 50 కి.మీ.గా నిర్ధారించారు. ► డివైడర్ లేని రోడ్లపై కార్ల గరిష్ట వేగం గంటకు 50 కి.మీ.గా, ఇతర వాహనాల వేగం 40 కి.మీ.గా, కాలనీ రోడ్లపై కార్లు, ఇతర వాహనాల గరిష్ట వేగం 30 కి.మీ.గా ఖరారు చేసింది. నాలుగున్నరేళ్ల తర్వాత.. ఆధునిక వాహనాలు అందుబాటులోకి రావటంతో రోడ్లపై వాటి వేగం పెరిగి ప్రమాదాలు చోటుచేసుకోవటం ద్వారా విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్న తీరును 2017లో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రోడ్లు, నగర, పట్టణ రోడ్లపై వాహనాల గరిష్ట వేగంపై పరిమితి విధించాలని ఆయన అందులో ప్రభుత్వాన్ని కోరారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ఆయా రోడ్లపై వేగ పరిమితిని నిర్ధారించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు 2017 నవంబరు 17న ఉత్తర్వు జారీ చేసింది. జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రోడ్లు, పురపాలక సంఘాల రోడ్లపై వేగ పరిమితిని నిర్ధారించే బాధ్యతను ఆయా విభాగాల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు అప్పగించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆ సంస్థ ఎస్ఈకి అప్పగించింది. దీనికి సంబంధించి ఆయా అధికారులు కసరత్తులు పూర్తి చేసి ఎక్కడికక్కడ నివేదికలు సమర్పించారు. ఇంతకాలానికి జీహెచ్ఎంసీ పరిధిలో అధికారుల సిఫారసు ఆధారంగా వేగ పరిమితిని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఇక జాతీయ, రాష్ట్ర, గ్రామీణ, పురపాలక రోడ్లకు సంబంధించి అధికారుల సిఫారసుల ఆధారంగా పరిమితులు అమలులోకి వస్తాయని రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. (క్లిక్: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. అరుదైన ఘనతలు) మరింత స్పష్టత కావాలి.. ఈ వేగాలకు సంబంధించి మరింత స్పష్టత అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డివైడర్ ఉన్న రోడ్లపై గరిష్ట వేగాన్ని కార్లకు 60గా నిర్ధారించినా, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రార్థనా సంస్థలు, మార్కెట్ల చేరువలో అది సాధ్యం కాదని, అలాంటి వాటిపై మరింత స్పష్టత ఉండాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర, గ్రామీణ, పురపాలిక రోడ్లకు సంబంధించి, ఆయా ప్రాంతాల పరిస్థితుల ఆధారంగా ప్రతి రోడ్టుపై వేగ పరిమితిని ప్రకటించాలని వారు కోరుతున్నారు. (క్లిక్: ఏఐతో ‘రాస్తే’ సేఫ్.. పనిచేస్తుందిలా!) -
బైక్‌పై చిన్నారులతో వెళ్తున్నారా? అయితే, జాగ్రత్త!
న్యూఢిల్లీ: నాలుగేళ్లలోపు చిన్నారులు ప్రయాణించే మోటార్ బైక్ వేగం గంటకు 40 కిలోమీటర్లకు మించరాదని కేంద్రం ప్రతిపాదించింది. దీంతో పాటు, 9 నెలల నుంచి 4 ఏళ్లలోపు చిన్నారులైతే తప్పని సరిగా హెల్మెట్ ఉండేలా వాహనదారు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. దీంతోపాటు, వాహన చోదకుడు ఆ చిన్నారిని సేఫ్టీ పట్టీతో తన వీపునకు తగిలించుకోవాలని పేర్కొంది. దీనివల్ల, చిన్నారి మెడ, తలభాగాలకు పూర్తి రక్షణ కల్పించినట్లు అవుతుందని వివరించింది. దృఢమైన, తేలికపాటి, నీటిలో తడవని, అవసరానికి అనుగుణంగా సరి చేసుకోదగ్గ, కనీసం 30 కిలోల బరువును మోయగలిగే నైలాన్‌తో ఆ పట్టీ తయారయినదై ఉండాలని తెలిపింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారుల భద్రతే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలను రూపొందించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ తెలిపింది. అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా ప్రజలను కోరింది. (చదవండి: రెండు రోజులు తర్వాత పుట్టింటికి .. బావిలో శవాలుగా తేలిన తల్లీ, కూతురు) -
అంతకు మించి స్పీడ్‌గా వెళ్లలేరు..!
సాక్షి, నిజామాబాద్: వాహనాల దూకుడుకు త్వరలో కళ్లెం పడనుంది.. అతి వేగాన్ని నియంత్రించేందుకు రంగం సిద్ధమవుతోంది.. వాహనాల ‘హైస్పీడ్’కు బ్రేకులు వేసేందుకు రవాణా శాఖ సన్నద్ధవుతోంది.. త్వరలోనే వాహనాలకు వేగ నియంత్రణ పరికరాలు అమర్చుకునేలా చర్యలు చేపట్టనుంది. రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏటా వందల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వేల సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న వాహనాల అతివేగానికి బ్రేకులు వేసేందుకు రవాణాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్పీడ్ గవర్నర్ పేరుతో వాహనాలకు స్పీడ్ కంట్రోల్ డివైస్ (వేగ నియంత్రణ పరికరం)లను అమర్చుకోవాలనే నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఆగస్టు మొదటి వారం నుంచే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. స్పీడ్ కంట్రోల్ డివైస్‌లు బిగించుకోవాల్సిన వాహనాలు జిల్లాలో సుమారు 30 వేల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మొదట రవాణా వాహనాలకు.. స్పీడ్ కంట్రోల్ డివైస్‌లను అమర్చుకోవాలనే నిబంధనను మొదట రవాణా వాహనాలకు వర్తింపచేస్తోంది. ఎల్లో నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు, క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు ఈ పరికరాన్ని అమర్చుకునేలా చర్యలు చేపట్టనున్నారు. అలాగే డంపర్లు, టిప్పర్లు, స్కూల్ బస్సులు, లారీలు, వ్యాన్లు ఇలా రవాణా వాహనాలు వేగ నియంత్రణ పరికరాలు అమర్చుకోవడం తప్పనిసరి కానుంది. ఈ వాహనాలు గంటకు 80 కిలోమీటర్లకు మించి వేగంగా నడపకుండా ఈ పరికరం నియంత్రిస్తుంది. స్కూల్ బస్సులు, డంపర్లు, టిప్పర్లు వంటి వాహనాల వేగాన్ని గంటకు 60 కి.మీ.లకు మించకుండా పరికరం ద్వారా వేగాన్ని నియంత్రిస్తారు. డ్రైవర్ అంతకు మించి స్పీడ్‌గా వెళ్లాలని ప్రయత్నించినా ఆ వాహనం నిర్ణీత స్పీడ్ దాటి ముందుకు దూసుకెళ్లదు. రూ.2 వేల నుంచి మొదలు.. వేగ నియంత్రణ పరికరాల ధర రూ.2 వేల నుంచి రూ.7 వేల వరకు ఉంటుంది. ఈ పరికరాలను జిల్లాలో సరఫరా చేసేందుకు రెండు, మూడు ప్రైవేటు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఆయా కంపెనీలు పుణేలో ఉన్న ఆటోమెటిక్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా కంపెనీలకు అనుమతుల అంశం రవాణాశాఖలోని కమిషనరేట్ కార్యాలయం పరిశీలనలో ఉంది. -
స్పీడ్ గన్స్, కెమెరాలు
సాక్షి, సిద్దిపేట : రాజీవ్ జాతీయ రహదారి.. ఇటీవల తరచూ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.. ఆ రహదారిపై ప్రయాణించాలంటేనే జనం జంకుతు న్నారు.. అయితే ఇకపై ఆ పరిస్థితి మారనుంది. రాజీవ్ రహదారిపై రక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్దిపేట జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు, వాటికి గల కారణాలు తెలుసుకుని, అవి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం, మానకొండూరులో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలతో అధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ఈ మేరకు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌తోపాటు బీవోటీ డీజీఎం విజయభాస్కర్‌రెడ్డి సమావేశమయ్యారు. ప్రమాదాలపై అధ్యయనం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట నుంచి సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల మీదుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ప్రాంతం వరకు 207 కిలోమీటర్ల మేర రాజీవ్ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించారు. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో గల పలు జాతీయ రహదారులను ఈ దారి కలుపుతుంది. సిద్దిపేట జిల్లాలో ఈ రహదారి ములుగు మండలం వంటిమామిడి నుంచి బెజ్జంకి వరకు సుమారు 125 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రహదారి పనులపై అప్పట్లోనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎక్కడా పార్కింగ్ లేదు! రాజీవ్ రహదారిపై ఎక్కడిపడితే అక్కడ ఉన్న మూల మలుపులు, తొమ్మిది అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న డివైడర్ వల్ల ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. ఇసుక వాహనాలు, ఎక్స్‌ప్రెస్‌లు మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణం అని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. వీటిని నిరోధించేందుకు ఓఆర్ఆర్ మాదిరిగా స్పీడ్ కంట్రోలింగ్ సిస్టమ్ (స్పీడ్ గన్స్) ఏర్పాటు చేయనున్నారు. 207 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారిపై ఎక్కడా పార్కింగ్ సౌకర్యం లేదు. కొన్ని సందర్భాల్లో ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని నివారించేందుకు సిద్దిపేట జిల్లాలోని 95 కిలోమీటర్ల పొడవున 7 పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు స్థల సేకరణ చేస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు.. గుర్తుతెలియని వాహనాలను గుర్తించడంతో పాటు రహదారిపై జరిగే ఇతర నేరాలను అరికట్టేందుకు సిద్దిపేట జిల్లా పరిధిలో రాజీవ్ రహదారిపై 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా రహదారి వెంట ఉన్న గ్రామాల్లో రోడ్డు దాటే సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి నివారణకు ప్రతి గ్రామంలో లైటింగ్, ఇతర రక్షణ చర్యలు చేపట్టనున్నారు. జీబ్రా క్రాసింగ్ పెయింటింగ్, ప్రమాద సూచికలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. డివైడర్ల ఎత్తు పెంపు విషయంపై బీవోటీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. అలాగే సిద్దిపేట సరిహద్దులోని పొన్నాల వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి మంజూరు ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. రహదారికి ఇరువైపులా పార్కింగ్ ‘ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడం. దీన్ని నివారించేందుకు సిద్దిపేట జిల్లా పరిధిలోని 75 కిలోమీటర్లలో అవసరమైన చోట పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు ప్రభుత్వ భూమి గుర్తించాలని ఆర్డీవోలు, తహశీల్దారర్లకు ఆదేశాలు జారీ చేశాం. మితిమీరిన వేగాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టే విషయంపై పోలీస్ కమిషనర్‌తో చర్చించాం.’ – వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక ‘రాజీవ్ రహదారిపై రోజూ ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. దీన్ని నివారించేందుకు జిల్లా కలెక్టర్ చొరవతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. పార్కింగ్, స్పీడ్ కంట్రోల్, సీసీ కెమెరాల ఏర్పాటు మొదలైన చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతాం. – జోయల్ డేవిస్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ రక్షణ చర్యలు చేపడుతున్నాం. రహదారిపై ప్రమాదాలు నివారించేందుకు రక్షణ చర్యలు చేపడుతున్నాం. రామునిపట్ల, లింగారెడ్డిపల్లి గ్రామాల వద్ద లైటింగ్ ఏర్పాటు, మార్కింగ్‌లు, ఇతర గుర్తులను తెలిపేలా ఎప్పటికప్పుడు పెయింటింగ్ చేస్తున్నాం. – విజయ భాస్కర్‌రెడ్డి, బీవోటీ, డీజీఎం -
వేగం..కళ్లెం
►ఓఆర్ఆర్పై ‘స్పీడ్ గన్’ల నిఘా మరింత పటిష్టం ►ఇప్పటికే అందుబాటులో ఐదు నిఘానేత్రాలు ►కొత్తగా మరో మూడు.. నేడు ప్రారంభం ► వేగ నియంత్రణ చర్యలు ఇక కఠినతరం తీవ్రమైన ప్రమాదాలతో నిత్యం రక్తసిక్తమవుతున్న అవుటర్ రింగ్‌రోడ్డుపై అతి వేగానికి కళ్లెం వేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఉన్న ఐదు స్పీడ్ లేజర్ గన్ కెమెరాలకు తోడుగా బుధవారం నుంచి మరో మూడింటిని కొత్తగా అందుబాటులోకి తెస్తున్నారు. వీటి ద్వారా అతివేగంగా ప్రయాణించే వాహనదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. తద్వారా వాహనదారుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: రాజధాని చుట్టూ విస్తరించిన అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ప్రమాదాలను అరికట్టేందుకు హెచ్ఎండీఏ, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఓఆర్ఆర్పై రాకపోకలు సాగించే వాహనాల వేగంలో వ్యత్యాసాలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఇటీవల ఓఆర్ఆర్ రోడ్డు స్థితిగతులపై అధ్యయనం చేసిన న్యూఢిల్లీకి చెందిన సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ) రిపోర్ట్ వెల్లడించింది. దీనిని ఆధారంగా చేసుకుని వేగ నియంత్రణ చర్యలు మొదలెట్టారు. ఇప్పటికే ఓఆర్ఆర్పై ఐదు స్పీడ్ లేజర్‌గన్ కెమెరాలుండగా, మరో మూడు స్పీడ్ లేజర్ గన్ కెమెరాలను బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వీటిని ఆదిభట్ల బొంగళూరు టోల్గేట్ వద్ద డీజీపీ అనురాగ్‌శర్మ, రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు ప్రారంభించనున్నారు. వీటితో పాటు ఓఆర్ఆర్పై మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారికి చెక్ పెట్టేందుకు 12 బ్రీత్ అనలైజర్లను కూడా ట్రాఫిక్ పోలీసులకు అందజేయనున్నారు. స్పీడ్ లేజర్ గన్, బ్రీత్ అనలైజర్ల ఖర్చు అంతా హెచ్ఎండీఏనే భరించింది. ఇక పక్కాగా ‘స్లో స్పీడ్’ వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు 2014 జనవరి 19న ఉమ్మడి సైబరాబాద్ పోలీసులు ఓఆర్ఆర్పై స్లో స్పీడ్ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. ఇక్కడి నాలుగు వరుసల్లో ఎంత వేగంతో వెళ్లాల్లో అప్పట్లో నిర్ణయించారు. తొలి రెండు వరుసల్లో గంటకు 80 నుంచి 120 కిలోమీటర్లు, మిగిలిన రెండు వరుసల్లో 40 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలని ఆంక్షలు విధించారు. ఓఆర్ఆర్పై ప్రయాణించేందుకు 40 కిలోమీటర్ల కనిష్ట, 120 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉండాలని, భారీ వాహనాలు మూడు, నాలుగు వరుసల్లో రాకపోకలు సాగించాలని నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఇష్టానుసారంగా ప్రయాణిస్తూ నిర్ణీత వేగాన్ని మీరి ఒక వరుస నుంచి మరో వరుసకు మారితే జరిమానా విధిస్తున్నారు. మొత్తం 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్పై అప్పట్లో పెద్దఅంబర్‌పేట్ నుంచి పటాన్చెరు వరకు ఈ నిబంధన అమల్లోకి తెచ్చారు. ఈ దూరాన్ని నాలుగు విభాగాలుగా విభజించి నాలుగు బృందాలతో పర్యవేక్షణ చేపట్టారు. పెద్దఅంబర్‌పేట్ నుంచి రావిర్యాల జంక్షన్, రావిర్యాల జంక్షన్ నుంచి పెద్ద గోల్కొండ, పెద్ద గోల్కొండ నుంచి రాజేంద్రనగర్ జంక్షన్, రాజేంద్రనగర్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు వాహనాల వేగాన్ని కొలిచేందుకు ఐదు లేజర్ స్పీడ్ గన్ కెమెరాలను అందుబాటులోకి తెచ్చారు. సంచార వాహనాలపై వీటిని ఉంచుతూ వేర్వేరు ప్రాంతాల్లో నిఘా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. తొలినాళ్లలో ఈ ప్రక్రియ సత్ఫలితాన్నిచ్చింది. నిబంధన అతిక్రమిస్తే వెయ్యి రూపాయల జరిమానా విధించడంతో పాటు ఓఆర్ఆర్ ఆరంభంలో ప్రచారం చేయడంతో తొలి ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత పోలీసుల ఆలసత్వం, స్పీడ్ గన్ కెమెరాల మొరాయింపుతో కథ మళ్లీ మొదటికిరావడం, ప్రమాదాలు పెచ్చుమీరుతుండటంతో స్లో స్పీడ్ నిబంధనను పక్కాగా అమలుచేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మత్తును దించేస్తారు... ఓఆర్ఆర్పై ఇప్పటివరకు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు పెద్దగా ఉండేవి కావు. వాహనాలు వేగంగా వెళ్తాయనే ఉద్దేశంత పోలీసులు ఆపే సాహసం చేసేవారు కాదు. తాజా కార్యచరణలో భాగంగా టోల్‌బూత్‌లు, డౌన్ ర్యాంపుల వద్ద డ్రంకన్ డ్రైవ్‌ను విస్తృతం చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో వాహనాలు తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి కాబట్టి ఇక్కడ డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నారు. ఇందుకోసం సైబరాబాద్‌కు 30, రాచకొండకు 12 బ్రీత్ అనలైజర్లను హెచ్ఎండీఏ సమకూర్చింది. రాచకొండకు కేటాయించిన 12 బ్రీత్ అనలైజర్లను డీజీపీ అనురాగ్‌శర్మ సమక్షంలో ట్రాఫిక్ పోలీసులకు అందించనున్నారు. -
సురక్షిత ప్రయాణమే లక్ష్యం
గంటకు మించి ఆలస్యం కాదు వేగ నియంత్రణతో మేలే ఎక్కువ మేడారం రూట్‌మ్యాప్ వివరాలతో యాప్ ఆర్టీసీ క్యూలైన్లపై విస్తృత ప్రచారం రూరల్ ఎస్పీ అంబర్కిశోర్ ఝా హన్మకొండ : మేడారం జాతరకు వచ్చి వెళ్లే భక్తులు ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు. వన దేవతల గద్దెల వద్దకు చేరేందుకు ఏర్పాటు చేసిన రెండు ప్రధాన క్యూ లైన్ల వద్ద రద్దీకి అనుగుణంగా భక్తులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. మేడారం దారుల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం కొత్తగా బైక్పార్టీలు అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. జాతర ఏర్పాట్లపై ఎస్పీ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే... వేగ నియంత్రణతో మేలు వేలాదిగా వాహనాలు ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు వేగ నియంత్రణ అవసరం. ఓవర్టేక్ చేసే సమయంలో ఏ ఒక్క చోట ఇబ్బంది ఏర్పడినా.. దాని ప్రభావం దారి పొడుగునా ఉంటుంది. అందువల్లే ఈ సారి కటాక్షాపూర్ - తాడ్వాయి మధ్య వేగ నియంత్రణ అమల్లోకి తెస్తున్నాం. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు కటాక్షాపూర్ నుంచి గరిష్ట వేగం గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేస్తున్నాం. దీనివల్ల మొత్తం ప్రయాణంలో గంట ఆలస్యమైనా ఎక్కడా ఇబ్బంది రాకుండా ప్రయాణం సాఫీగా జరుగుతుంది. ఎక్కడైనా సమస్య తలెత్తినా సరిదిద్దడం తేలికవుతుంది. హోల్డింగ్ పాయింట్ల నుంచి భక్తులను తరలించేందుకు ఆర్టీసీతో సంప్రదించాం. చిన్నబోయినపల్లి దగ్గర 25 బస్సులు, తాడ్వాయి, పస్రా వద్ద 15 బస్సుల చొప్పున అందుబాటులో ఉంచుతున్నాం. చింతల్‌క్రాస్ వద్ద కూడా షటిల్ బస్సులు ఏర్పాటు చేస్తాం. ట్రాఫిక్‌ను పర్యవేక్షించేందుకు బైక్ పార్టీలను అందుబాటులో ఉంచుతున్నాం. వీరు సాధ్యమైనంత త్వరగా సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తారు. రామప్ప ఆలయాన్ని దర్శించుకునే వారు తిరుగు ప్రయాణంలో గాంధీనగర్ క్రాస్‌రోడ్డు మీదుగా రామప్పకు చేరుకోవచ్చు. ఈ దారిలో ఎటువంటి ఆంక్షలూ లేవు. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చే మార్గాన్ని విస్తరించారు. దీంతో సగం సమస్య తీరిపోయినట్టే. భక్తులు పోలీసులకు సహకరిస్తే సమ్మక్క రాకను ఇబ్బంది లేకుండా చూడొచ్చు. తోపులాటకు పాల్పడవద్దని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను. భద్రత ఏర్పాట్లలో భాగంగా జాతర ప్రాంగణలో మొత్తం 100కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా అందుబాటులో ఉన్న ఐదు వాచింగ్ టవర్స్‌ను సమర్థంగా వినియోగించుకుంటాం. ట్రాఫిక్ గైడ్‌గా మొబైల్ అప్లికేషన్ ఈ సారి అమలు చేయబోతున్న వన్‌వే పద్ధతి వల్ల భక్తులకు ఇబ్బంది రాకుండా ఎప్పటికప్పుడు వివరాలు అందించేలా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో పనిచేసే విధంగా వెల్కమ్ టూ మేడారం పేరుతో మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించాం. ట్రాఫిక్ వివరాలతో పాటు జాతర షెడ్యుల్, అత్యవసర ఫోన్నంబర్ల వివరాలు ఈ అప్లికేషన్లో పొందుపరిచాం. రాష్ట్రం నలుమూలల నుంచి మేడారం వచ్చే దారుల వివరాలు ఉన్నాయి. అదేవిధంగా మేడారం నుంచి తిరుగు ప్రయాణానికి సంబంధించిన దారుల వివరాలు అప్లికేషన్లో అందుబాటులో ఉంచాం. మొబైల్ఫోన్లో ఉండే గ్లోబర్ పోజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)తో అనుసంధానం చేస్తే దారి మొత్తాన్ని ఎప్పటికప్పుడు మొబైల్‌ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. హన్మకొండ నుంచి వెళ్లే ప్రైవేట్ వాహనాలు పస్రా నుంచి నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవచ్చు. తిరుగు ప్రయూణంలో నార్లాపూర్, బయ్యక్కపేట, భూపాలపల్లి, పరకాల, గుడెప్పాడ్ క్రాస్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులు పస్రా నుంచి తాడ్వారుు మీదుగా మేడారం చేరుకుంటారుు. తిరుగు ప్రయూణంలోనూ అదే రూట్లో వస్తారుు. నోటిఫికేషన్‌తో మేలు ఈ అప్లికేషన్లో ఉన్న నోటిఫికేషన్ ఆప్షన్ ద్వారా మేడారం జాతర రాకపోకల్లో ట్రాఫిక్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మార్గమధ్యంలో ఎక్కడైనా ట్రాఫిక జామ్ అయితే ప్రత్యామ్నయ దారి వివరాలను, రూట్‌ను ఈ అప్లికేషన్ చూపిస్తుంది. ఫలితంగా నిరీక్షణ ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాకుండా మేడారం వచ్చే దారిలో ఎక్కడెక్కడ పార్కింగ్ స్థలాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. గద్దెల ప్రాంగణం చుట్టూ సగటున ఐదు కిలోమీటర్ల పరిధిలో భక్తులు విడిది చేస్తారు. జాతరకు వచ్చిన భక్తులు తమ వాహనాలను నిలిపి ఉంచిన చోటును సేవ్ లొకేషన్ ఆప్షన్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల జాతర నుంచి తిరిగి వెళ్లేప్పుడు వాహనం ఎక్కడ పార్క్ చేశారనే అంశాన్ని తెలుసుకునే వెసులుబాటు ఉంది. సోషల్ మీడియాలో యానిమేషన్ మేడారం జాతర విశిష్టతతో పాటు మేడారం రాకపోకలకు సంబంధించి వరంగల్ రూరల్ పోలీసులు పది నిమిషాల నిడివిగల యానిమేషన్ మూవీని రూపొందించారు. యూట్యూబ్, వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో ఈ యానిమేషన్ మూవీ అందుబాటులో ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా జాతర రూట్‌మ్యాప్ వివరాలు తెలుసుకోవచ్చు. కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలు కాటారం, భూపాలపల్లి, గాంధీనగర్ క్రాస్, జంగాలపల్లి క్రాస్ మీదుగా పస్రా, నార్లాపూర్ నుంచి మేడారం వెళ్లాలి. తిరుగు ప్రయూణంలో నార్లాపూర్, బయ్యక్కపేట, కమలాపూర్ క్రాస్ నుంచి కాటారం మీదుగా వెళ్లిపోవచ్చు. ఆర్టీసీ బస్సులు కాటారం, భూపాలపల్లి, గాంధీనగర్ క్రాస్, జంగాలపల్లి క్రాస్ మీదుగా పస్రా, తాడ్వారుు నుంచి మేడారం వెళ్తారుు. తిరుగు ప్రయూణంలోనూ ఇదే రూట్లో వెళ్తారుు. -
హైవేలపై కొత్తగా 1,710 పోలీస్ స్టేషన్లు
* ఏర్పాటు కోసం ప్రభుత్వానికి పోలీస్ శాఖ ప్రతిపాదనలు * రహదారులపై ప్రమాదాలను అరికట్టేందుకు కసరత్తు సాక్షి, హైదరాబాద్: నిత్యం ఎక్కడో ఒకచోట రహదారులు నెత్తురోడుతున్నాయి. ప్రమాదాల కారణంగా ఏటా వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటుంటే.. మరికొందరు క్షతగాత్రులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో రస్తసిక్తమవుతున్న రహదారులపై ప్రమాదాల నివారణకు రాష్ట్ర పోలీసు శాఖ నడుం బిగించింది. అన్ని ప్రధాన రహదారులపై పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి వేగ నియంత్రణ చేయాలని సంకల్పించింది. స్పీడ్గన్లతో వాహనాల జోరుకు కళ్లెం వేయాలని భావిస్తోంది. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన రహదారులపై 1,710 పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సర్కారు నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే త్వరితగతిన వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఏటా పెరుగుతున్న ప్రమాదాలు! సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రహదారుల భద్రతకు పెద్ద పీట వేయాలని డీజీపీ అనురాగ్‌శర్మ భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 16 జాతీయ రహదారులు, 42 రాష్ట్రీయ రహదారులు ఉన్నాయి. ఈ రెండు రకాల రహదారులు కలుపుకొని 26,837 కి.మీ. విస్తీర్ణం ఉన్నాయి. వీటి పరిధిలో 2014లో 17,330 ప్రమాదాలు జరిగి 6,259 మంది ప్రాణాలు కోల్పోగా.. 19,241 మంది గాయాలపాలయ్యారు. 2015లోనూ 18,534 ప్రమాదాలు చోటు చేసుకోగా... 6,495 మంది మృత్యువాత పడ్డారు. 20,922 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. గతేడాదితో పోల్చితే ప్రమాదాలు.. మృతుల సంఖ్య పెరిగింది. భారీగా చలాన్లు విధించేందుకు కసరత్తు ప్రమాదాలను అరికట్టేందుకు నిబంధనలను అతిక్రమించేవారికి భారీగా జరిమానాలు విధించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. 2015లో పోలీసులు 20 లక్షల కేసులు పెట్టి రూ. 35 కోట్లకు పైగా జరిమానాలు విధించారు. ఇక నుంచి హైవేలపై కూడా వాహనాలకు జరిమానా విధించేందుకు కసరత్తు చేస్తున్నారు.