star shooter
-
ఆడుకుందాం రండి
‘ఎప్పుడూ ఆటలేనా... చదువుకోవచ్చు కదా’ అనే తల్లిదండ్రులే ఎక్కువ. ‘ఎప్పుడూ చదువేనా... ఆటలు కూడా ఆడవచ్చు కదా’ అనే తల్లిదండ్రులు అతి తక్కువ. చదువు విషయంలోనే కాదు ఆటల్లో కూడా పిల్లలను ్రపోత్సహిస్తే చారిత్రక అద్భుతాలు జరుగుతాయని చెప్పడానికి బలమైన ఉదాహరణ... స్టార్ షూటర్ మను బాకర్. ‘మీకు డాక్టర్ లేదా ఇంజినీర్ కావాలని లేదా... అయితే ఆటల ప్రపంచంలోకి రండి. అదొక అద్భుత ప్రపంచం’ అంటుంది ఒలింపిక్స్‌లో డబుల్–మెడల్ గెల్చుకున్న మను బాకర్. విద్యార్థుల దృష్టిని ఆటలపై మళ్లించడానికి నేషనల్ టూర్ చేస్తోంది...తన పర్యటనలో భాగంగా చెన్నైలోని వేలమ్మళ్ నెక్సెస్ స్కూల్‌కు వెళ్లిన మను బాకర్ ఆటలకు ఉండే శక్తి ఏమిటో ఆసక్తికరంగా చెప్పింది. ‘ఆటలు అనే దారి వైపు వచ్చి చూడండి. ఆ దారిలో ముందుకు వెళుతున్న కొద్దీ మీలో ఉత్సాహం, శక్తి అంతకంతకూ పెరుగుతూ పోతాయి’ అంటుంది మను.‘టోక్యో ఒలింపిక్స్‌లో నా గురి తప్పింది. ఓటమి పలకరించింది. అలా అని నిరాశలోనే ఉండిపోలేదు. ఆటలో గెలుపు ఎంత సహజమో, ఓటమి అంతే సహజం. గెలుపు ఓటములు ఆటలో శాశ్వతం కాదు. ఆటలో ఉన్న అందం, అద్భుతం ఇదే’ అంటుంది మను.‘డ్రీమ్ బిగ్’ అని మను అన్నప్పుడు పిల్లలు చప్పట్లు కొట్టారు. ‘మనం ఒక లక్ష్యం ఏర్పర్చుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకుంటామా లేదా అనేది పూర్తిగా మన మీదే ఆధారపడి ఉంటుందంటూ తన గత అనుభవాలను విద్యార్థులతో పంచుకుంది.‘ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకే ఆటలు సరిపోతాయి. పేద, మధ్యతరగతి పిల్లలకు కష్టం’ అనే అపోహను తోసిపుచ్చింది మను. ‘ఆత్మస్థైర్యం నుంచి ఆర్థికసహాయం వరకు క్రీడా ప్రపంచంలో ఏది కష్టం కాదు. మీరు పెద్ద కల కంటే పెద్ద విజయాన్ని సాధిస్తారు. పేదరికం మీకు ఎప్పుడూ అడ్డు కాదు. ఈ విషయాన్ని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది’ అంటుంది మను బాకర్. ‘మీ ఇన్స్పిరేషన్ ఎవరు?’ అనే ప్రశ్నకు– ‘ఇంకెవరు... మా అమ్మే’ అని చెప్పింది మను. ‘ఎప్పుడూ ఆటలేనా!’ అని ఎప్పుడూ అనేది కాదు ఆమె. ఆటల్లో కూతురు చూపుతున్న ప్రతిభకు సంతోషించేది.‘క్రీడల్లో పిల్లలు రాణించడం, పెద్దస్థాయికి చేరుకోవడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంది’ అంటుంది మను బాకర్.ఆటలు ఇంకా ఏం చేస్తాయి? మను మాటల్లో చె΄్పాలంటే ప్రపంచాన్ని చూపిస్తాయి. ‘షూటింగ్ కెరీర్ వల్ల ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాను. దీనివల్ల రకరకాల మనుషులు, రకరకాల సంస్కృతులు, చరిత్ర, పోరాటాలు... ఒక్కటా రెండా ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. నేను ఆటల్లోకి రాకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు’ అంటుంది మను.‘మనం ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు ఎక్కడికి వెళ్లాలనేది ముఖ్యం’ అంటారు పేదరిక నేపథ్యం నుంచి వచ్చిన విజేతలు. ఇదే విషయాన్ని పిల్లలకు చెబుతుంటుంది మను.‘మేము పేదవాళ్లం, నాకు ఇంగ్లీష్ రాదు, నేను బలహీనంగా ఉంటాను, ఇతరులతో పోటీ పడగలనా... ఇలాంటి ఆలోచనలేవీ పెట్టుకోవద్దు. ఎన్ని పరిమితులు ఉన్నా కష్టపడే తత్వం, అంకితభావం ఉంటే మన ప్రయాణానికి అవేమీ అడ్డు కాదు. ప్రయాణం ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యం. నా విషయానికి వస్తే... మొదట్లో నాకూ ఇంగ్లీష్ పెద్దగా రాదు, ఇతరులతో ఎలా మాట్లాడాలో తెలియదు. ఏమీ తెలియదు... అనుకుంటే అక్కడే ఉండిపోతాం. తెలుసుకుంటాను’... అనే పట్టుదల ఉంటే తెలుసుకోగలం. నేను ఎంతోమంది వ్యక్తుల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. కొత్త విషయాల గురించి తెలుసుకోవడానికి తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయుల వరకు ఎవరితోనైనా మాట్లాడవచ్చు’ అంటుంది మను.‘మీకు ఎన్నో కెరీర్ ఆప్షన్లు ఉన్నాయి. అవేమీ మీకు ఆసక్తిగా లేకపోతే ఆటల ప్రపంచంలోకి రండి’ అని విద్యార్థులను ఆహ్వానిస్తోంది మను బాకర్. ఆమె మాటల స్ఫూర్తి ఎంతోమందికి విజయ మంత్రం కావాలని ఆశిద్దాం. -
Paris Olympics 2024: ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత బృందం పతాకధారిగా మనూ భాకర్
పారిస్ ఒలింపిక్స్‌లో తన అద్భుత ప్రదర్శన ద్వారా దేశానికి రెండు పతకాలు అందించిన స్టార్ షూటర్ మనూ భాకర్‌కు మరో గౌరవం దక్కింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కిన మనూ... ‘పారిస్’ క్రీడల ముగింపు వేడుకల్లో పతాకధారిగా వ్యవహరించ నుంది. ఈనెల 11న జరగనున్న ముగింపు వేడుకల్లో మనూ.. జాతీయ జెండా చేబూని భారత బృందాన్ని నడిపించనుంది. ‘ముగింపు వేడుకల్లో మనూ ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనుంది. దీనికి భాకర్ పూర్తి అర్హురాలు’ అని భారత ఒలింపిక్ సంఘం తెలిపింది. ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో స్టార్ షట్లర్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ ఆచంట శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు. ముగింపు వేడుకల్లో ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్న పురుష అథ్లెట్ పేరు తర్వాత ప్రకటించనున్నారు. -
రంజన్‌కు ‘ఆంగ్లియన్’ చేయూత!
న్యూఢిల్లీ: మిట్టల్ చాంపియన్స్ ట్రస్ట్ (ఎంసీటీ)ను మూసివేయడంతో... భారత స్టార్ షూటర్ రంజన్ సోధికి ‘ఆంగ్లియన్ మెడల్ హంట్’ స్పోర్ట్స్ కంపెనీ (ఏఎంహెచ్సీ) చేయూత ఇచ్చేందుకు ముందుకొచ్చింది. సోధితో పాటు మరో ఇద్దరు టాప్ అథ్లెట్లతో కూడా ఈ కంపెనీ ఒప్పందం చేసుకోనుంది. ‘రంజన్‌తో ఒప్పందం దాదాపుగా ఖరారైంది. మరో ఇద్దరు అథ్లెట్లు టచ్‌లో ఉన్నారు. అయితే ఈ సమయంలో వాళ్ల పేర్లను వెల్లడించడం పద్ధతి కాదు. ఏదేమైనా త్వరలోనే ఈ ఒప్పందాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మాది పరిమిత బడ్జెట్. ఎంసీటీ పెద్ద మొత్తంలో ఖర్చు చేసేది. కానీ మేం అథ్లెట్లకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం’ అని ఏఎంహెచ్సీ సీఈఓ మనీష్ బహుగుణ తెలిపారు. ఆంగ్లియన్ కంపెనీ తనను తీసుకోవడంపై సోధి సంతోషం వ్యక్తం చేశాడు. ఆంగ్లియన్ కంపెనీ మొత్తం 26 మంది క్రీడాకారులతో ఒప్పందం చేసుకుంది. ఇందులో 11 ఏళ్ల కుర్రాళ్లు కూడా ఉన్నారు. -
ఆ రుగ్మతలపై పోరాడాల్సిందే: రాథోడ్
జైపూర్: క్రీడా సమాఖ్యల్లో ఆటగాళ్లు తప్పకుండా భాగస్వాములు కావాల్సిందేనని స్టార్ షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పేర్కొన్నాడు. ఇటీవల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకున్న ఇతను జాతీయ రైఫింగ్ సంఘం (ఎన్ఆర్ఐ) ఎన్నికలపై కోర్టులో పోరాడుతున్నాడు. ‘ఆటగాళ్లు రాజకీయాలు మనకెందుకులే అని అనుకోకుండా క్రీడా సమాఖ్యల పాలకపగ్గాల బాధ్యతల్లో పాలుపంచుకోవాలి. అప్పుడే సుదీర్ఘ కాలంగా అక్కడ తిష్ట వేసిన అసమర్థ, అవినీతి రుగ్మతలపై పోరాడే అవకాశం లభిస్తుంది. తద్వారా చక్కని ఫలితాల్ని దేశానికి అందించగలుగుతాం’ అని అతను సూచించాడు. ప్రజాస్వామ్య పద్ధతిలో పరిస్థితుల్ని చక్కదిద్దే చొరవ క్రీడాకారులు తీసుకుంటేనే క్రీడలకు న్యాయం చేయగలుగుతామన్నాడు. అసమర్థ కార్యకలాపాలకు చరమగీతం పలికే అవకాశం ఆ సమాఖ్యల్లో క్రీడాకారులు భాగమైనప్పుడే లభిస్తుందని రాథోడ్ చెప్పాడు. క్రీడా సమాఖ్యల్లో ‘అథ్లెట్స్ కమిషన్’ను ఏర్పాటు చేయాలనే తన ప్రతిపాదనకు భారత ఒలింపిక్ సంఘం ఆమోదం తెలిపిందని... అలాగే ఇతర సమాఖ్యలు, సంఘాలు కూడా ఈ కమిటీకి తమ పాలకమండలిలో చురుకైన సభ్యత్వం ఇస్తేనే పరిస్థితులు మెరుగవుతాయని చెప్పాడు. తానిప్పుడు ఎన్ఆర్ఏఐపై పోరాడుతున్నానన్నాడు. ఈ సంఘం ఎన్నికలను సవాలు చేస్తూ అతను ఢిల్లీ హైకోర్టుకెక్కాడు. -
కావాల్సింది ప్రోత్సాహమే: సైనా
రాయదుర్గం, న్యూస్‌లైన్: క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభిస్తేనే సత్ఫలితాలు సాధ్యమని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అభిప్రాయపడింది. పిల్లలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకోకపోవడానికి కారణం ప్రోత్సాహం కొరవడటమేనని స్టార్ షూటర్ గగన్ నారంగ్ అన్నారు. వీరిద్దరితో పాటు భారత హాకీ మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా బుధవారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఐఎస్ఎల్ గేమ్స్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సైనా మాట్లాడుతూ ఒలింపిక్ స్వర్ణమే తన లక్ష్యమని చెప్పింది. చైనాలో ఒకే పట్టణంలో 40 నుంచి 50 అకాడమీలుంటే ఇక్కడ చెప్పుకోదగినవి ఒకటో రెండో ఉంటాయని తెలిపింది. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఓజీక్యూ) లాంటి సంస్థలు భారత్‌లో మరిన్ని ఉంటే చక్కని ఫలితాలు పొందవచ్చని చెప్పింది. ఐఎస్బీలో చదవడం కన్నా క్రీడల్లో రాణించడం చాలా కష్టమని షూటర్ నారంగ్ అన్నారు. ఆటగాళ్లకు ఆర్థిక, సాంకేతిక సహకారం లభిస్తేనే పతకాలు సాధ్యమవుతాయని చెప్పారు. రస్కిన్హా మాట్లాడుతూ క్రీడల్లో భారత్ వెలిగిపోవాలనే లక్ష్యంతోనే ఓజీక్యూను స్థాపించామన్నారు.