sub editors
-
న్యూస్ ఛానల్లో పని చేస్తున్న 27 మందికి కరోనా
చెన్నై : తమిళనాడులోని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్లో విధులు నిర్వర్తిస్తున్న 27 మంది జర్నలిస్ట్‌లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. న్యూస్ ఛానల్లో రిపోర్టర్లతోపాటూ డెస్క్‌లో విధులు నిర్వర్తిస్తున్న సబ్ ఎడిటర్లకు కూడా కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. 24 ఏళ్ల జర్నలిస్ట్‌కి కరోనా పరీక్షల్లో తొలుత పాజిటివ్ రావడంతో సదరు న్యూస్ ఛానల్లో పని చేస్తున్న మొత్తం 94 మందికి కరోనా పరీక్షలు జరిపించారు. మంగళవారం వచ్చిన ఫలితాల్లో 26 మందికి కరోనా సోకినట్టు తేలింది. (జర్నలిస్టులను వణికిస్తున్న కరోనా: ఒక్కరోజే 53 మందికి..) తొలుత కరోనా వ్యాధి సోకిన 24 ఏళ్ల జర్నలిస్ట్ తండ్రి ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. తండ్రి సూచనల మేరకు కుటుంబం మొత్తం కరోనా పరీక్షలు చేపించుకోగా, జర్నలిస్ట్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో న్యూస్ ఛానల్లో పని చేస్తున్న మిగతా వారికి పరీక్షలు జరిపించగా 26 మందికి కరోనా పాజిటివ్‌గా ఫలితాలు వచ్చాయి. దీంతో వెంటనే వారిని క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ముంబైలో కూడా రిపోర్టర్లు, కెమెరామెన్లు కలుపుకుని మొత్తంగా 53 మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. -
సబ్ ఎడిటర్లు కావలెను
సాక్షి పత్రిక అనుబంధ వెబ్సైట్ "సాక్షి డాట్ కామ్"లో పనిచేసేందుకు సబ్ ఎడిటర్లు/సీనియర్ సబ్ ఎడిటర్లు కావలెను. మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్లుగా, న్యూస్ వెబ్సైట్లలో కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు సబ్ ఎడిటర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు ప్రాంతీయ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ బాగా చేయగలగాలి. 30 సంవత్సరాల లోబడిన వయసు కలిగిన అర్హులైన అభ్యర్థులు ఈ కింద పేర్కొన్న మెయిల్‌కు పూర్తి వివరాలతో కూడిన బయోడేటాలను ఈ నెల 31 వ తేదీలోగా పంపించగలరు. recruitments@sakshi.com -
రౌడీ పోలీస్ సస్పెన్షన్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఖాకీ డ్రెస్సు ఉందనే అహంకారంతో కన్నూమిన్నూ కానకుండా డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్న ‘సాక్షి’ సబ్ ఎడిటర్‌పై అర్ధరాత్రి వేళ అకారణంగా దాడి చేసి, నిర్బంధించిన ‘రౌడీ పోలీస్’ కె.పద్మారావును సస్పెండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాలు జారీ చేశారు. సాక్షి సబ్ ఎడిటర్‌ను అసభ్య పదజాలంతో బూతులు తిట్టి, కొట్టి హింసించిన కొంకటి పద్మారావు అనే హెడ్ కానిస్టేబుల్ వల్ల సామాన్య ప్రజల ముందు పోలీసుల ప్రతిష్ట దెబ్బతిన్నదని, అందుకే సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట పోలీస్‌స్టేషన్ నుంచి రుద్రంగి పీఎస్‌కు అటాచ్ చేసిన కె.పద్మారావు(హెచ్‌సీ 1720)ను ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1964ను ఉల్లంఘించిన నేపథ్యంలో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కోతిరాంపూర్‌లో నివసించే హెడ్ కానిస్టేబుల్ కె.పద్మారావు కోనరావుపేట పీఎస్‌లో పనిచేస్తూ అటాచ్మెంట్ కింద కొత్తగా ఏర్పాటైన రుద్రంగి పీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, ‘సాక్షి’ సబ్ ఎడిటర్లు చెవుల రాములు, తన్నీరు వెంకటేష్ ఈ నెల 10న అర్ధరాత్రి విధులు ముగించుకొని ‘సాక్షి’ మినీ బస్సులో కోతిరాంపూర్ రోడ్డుపై దిగి ఇంటికి వెళ్తుండగా, హెడ్ కానిస్టేబుల్ పద్మారావు కొడుకు కె.దిలీప్ వారిని అడ్డగించి ‘ఇది మా ఏరియా.. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడేం పని?’ అని మద్యంమత్తులో ప్రశ్నించాడు. తాము సాక్షిలో సబ్ ఎడిటర్లమని చెప్పినా పట్టించుకోకుండా.. మీ ఐడీకార్డులు చూపించమని డిమాండ్ చేశాడు. వెంకటేశ్ ఐడీ కార్డు చూపించి తన ఇంటికి వెళ్లగా, ‘నీకెందుకు చూపించాలి’ అని ప్రశ్నించిన రాములును ‘నేనడిగితే గుర్తింపు కార్డు చూపించవా?’ అని జులుం చేస్తూ తన తండ్రి, హెడ్‌కానిస్టేబుల్ పద్మారావు దగ్గరికి తీసుకెళ్లాడు. మద్యంమత్తులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ కె.పద్మారావు ‘నాకొడుకు అడిగితే ఐడీ కార్డు, ఆధార్ కార్డులు చూపించరా? ఎక్కడి నుంచి వచ్చినవ్ రా అని బూతులు తిడుతూ రాములును చితకబాదాడు. అతని కొడుకు దిలీప్, ఇతర బంధువులు కూడా దాడి చేశారు. ఎందుకు కొడుతున్నావని ప్రశ్నించిన రాములును ‘నువ్వెవడివో తెలిసే దాకా ఇక్కడే ఉండాలని తెల్లవారు జాము 2గంటల వరకు ఇంటి ముందు కూర్చోబెట్టాడు. ఆ సమయంలో 100కు ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో రాములు ఎలాగోలా తప్పించుకొని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు వన్‌టౌన్ సీఐ తులా శ్రీనివాస్‌రావు కేసు నమోదు చేసుకొని తండ్రీ కొడుకులను పిలిపించి విచారణ జరిపారు. క్రైం నెంబర్ 225/2019 కింద ఐపీసీ 341, 323, 290, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో హెడ్ కానిస్టేబుల్ పద్మారావు సాక్షి సబ్ ఎడిటర్ చెవుల రాములుపై దౌర్జన్యం చేసి హింసించినట్లు ప్రాథమికంగా తేలడంతో ఈ మేరకు కమిషనర్ కమలాసన్‌రెడ్డికి నివేదిక సమర్పించారు. 13న కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆ రిపోర్టును సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డేకు పంపించారు. ఈ మేరకు కె.పద్మారావును సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన హెడ్ కానిస్టేబుల్‌పై పోలీస్ విచారణ కొనసాగుతుందని, రాజన్న సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా, సాక్షి సబ్ ఎడిటర్ రాములుపై దాడి చేసి నిర్బంధించిన హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయడంపై టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జానపట్ల మారుతి, కోశాధికారి తాండ్ర శరత్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరుణాకర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. అతని కొడుకు దిలీప్‌పై రౌడీషీట్ ఓపెన్‌చేయాలని డిమాండ్ చేశారు. -
రౌడీ పోలీస్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అర్ధరాత్రి విధులు ముగించుకుని ఇళ్లకు వెళుతున్న ‘సాక్షి’ సబ్ ఎడిటర్లపై అకారణంగా దాడి చేసి నిర్బంధించిన హెడ్ కానిస్టేబుల్ కె.పద్మారావు వ్యవహారాన్ని పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. సిరిసిల్ల జిల్లా చందుర్తి సర్కిల్ పరిధిలోని రుద్రంగి పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పద్మారావు గత చరిత్ర కూడా వివాదాస్పదమేనని పోలీసుల విచారణలో తేలింది. తాజాగా ‘సాక్షి’ సబ్ ఎడిటర్లపై అకారణంగా దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండడంతో శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించింది. సదరు హెడ్ కానిస్టేబుల్ కొడుకుపై కూడా గతంలో కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో దాడి కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పాత కేసులను తిరగతోడిన కరీంనగర్ పోలీసులు పద్మారావు తీరుపై పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి కరీంనగర్ కమిషనర్, సిరిసిల్ల ఎస్పీకి పంపించారు. కోతిరాంపూర్‌లో సదరు హెడ్ కానిస్టేబుల్ నివసిస్తున్న ఇంటి సమీపంలోనే అతని మేనత్త కాంతమ్మ పేరిట 170 గజాల ఆస్తి ఉంది. 2015లో అక్కడ ఇల్లు నిర్మించుకునేందుకు కాంతమ్మ కుటుంబం ప్రయత్నిస్తుండగా, దాన్ని అడ్డుకునేందుకు, ఆస్తిని స్వాధీనం చేసుకునే క్రమంలో 2015, మార్చి 26న అర్ధరాత్రి ఆ కుటుంబంపై దాడికి దిగారు. అప్పట్లో కథలాపూర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఇతను తన కొడుకుతో కలిసి దాడి చేసినట్లు 2015, మార్చి 27న కేసు (నంబర్ 120/ 2015) నమోదైంది. ఈ కేసులో కూడా పద్మారావు మొదటి నిందితుడు (ఎ–1) కావడం గమనార్హం. ఐపీసీ సెక్షన్లు 448, 427,290, 323, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 10వ తేదీ రాత్రి కోతిరాంపూర్‌లో ‘సాక్షి’ సబ్ ఎడిటర్లపై దాడి కేసు (నంబర్ 255/2019)లో ఐపీసీ 290, 323, 34, 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదయింది. అకారణంగా జర్నలిస్టులపై దాడి చేసి, నిర్బంధించి గాయపరిచిన పద్మారావు, అతని కొడుకు ప్రదీప్, పద్మారావు బంధువులపై పెట్టిన కేసులో ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నప్పటికీ, పద్మారావుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా, పద్మారావు కానిస్టేబుల్‌గా ఉన్నప్పుడే దాడి కేసులు నమోదైనప్పటికీ, అతనికి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించడం గమనార్హం. ఎన్నికల విధుల పేరిట వచ్చి కరీంనగర్లో మకాం... సిరిసిల్ల జిల్లా చందుర్తి సర్కిల్ పరిధిలోని రుద్రంగి పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పద్మారావు ఈనెల 10న బోయినపల్లిలో ఎన్నికల డ్యూటీ పేరిట రిలీవ్ అయి వచ్చాడు. అదే రోజు పద్మారావు ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో కరీంనగర్ కోతిరాంపూర్‌లోని ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం నుంచే మొదలైన విందు అర్ధరాత్రి వరకు సాగడం, రాత్రి 12.40 గంటల సమయంలో సబ్ ఎడిటర్లు డ్యూటీ ముగించుకుని రావడంతో ముందు కొడుకు, తరువాత తండ్రి దాడికి తెగబడ్డారు. మద్యం మత్తులో ఫంక్షన్‌కు వచ్చిన బంధువులు కూడా సబ్ ఎడిటర్లు రాములు, వెంకటేశ్‌పై దాడి చేసి, నిర్భందించడం గమనార్హం. కోతిరాంపూర్ బస్తీలో రౌడీయిజం ప్రదర్శించడంపై బస్తీలోని మిగతా కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రదీప్‌పై రౌడీషీట్ ఓపెన్ చేయాలి: టీయూడబ్ల్యూజే సాక్షి సబ్ ఎడిటర్లు రాములు, వెంకటేశ్‌పై అకారణంగా దాడి చేసి, నిర్బంధించిన హెడ్ కానిస్టేబుల్ పద్మారావును సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని, అతని కొడుకు ప్రదీప్‌పై రౌడీషీట్ తెరవాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మారుతి స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. హెడ్ కానిస్టేబుల్‌గా ఉంటూనే జర్నలిస్టులపై రౌడీయిజం ప్రదర్శిండంతోనే పద్మారావు నేరప్రవృత్తి తెలుస్తుందని పేర్కొన్నారు. అతని కొడుకు ప్రదీప్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, అర్ధరాత్రి బస్తీల్లో తిరుగుతూ రౌడీయిజం చేస్తున్న ప్రదీప్‌పై రౌడీషీట్ ఓపెన్ చేయాలని కమిషనర్ కమలాసన్‌రెడ్డిని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
సాక్షి సబ్ ఎడిటర్లపై హెడ్‌కానిస్టేబుల్ పిడిగుద్దులు
కరీంనగర్‌క్రైం: సాక్షి దినపత్రికలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఇద్దరు సబ్ ఎడిటర్లను రాజన్న సిరిసిల్ల జిల్లాలో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న పద్మారావు, అతడి కుమారుడు దిలీప్ అకారణంగా అడ్డగించి జులుం ప్రదర్శించారు. ‘ఇది మా ఏరియా.. ఎవరూ రాకుడదు.. నేను పోలీసు..’ అంటూ దాడి చేసి చితకబాదారు. ఈ సంఘటన కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కరీంనగర్ వన్‌టౌన్ సీఐ తుల శ్రీనివాసరావు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చెవుల రాములు, తన్నీరు వెంకటేశ్ తిమ్మాపూర్‌లోని సాక్షి యూనిట్ కార్యాలయంలో సబ్ ఎడిటర్లుగా పని చేస్తూ కరీంనగర్ కోతిరాంపూర్‌లో నివాసం ఉంటున్నారు. విధులు ముగించుకుని శుక్రవారం అర్ధరాత్రి కోతిరాంపూర్‌లో ఆఫీసు బస్సు దిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ సమయంలో అతిగా మద్యం సేవించి ఉన్న హెడ్‌కానిస్టేబుల్ పద్మారావు కుమారుడు దిలీప్, మరో ఇద్దరు బంధువులు ఇంటి బయట ఉన్నారు. రాములు, వెంకటేశ్‌లను అడ్డగించి ‘ఇది మా ఏరియా మీరు ఎవరు.. ఎందుకు వచ్చారు.. అంటూ దబాయించారు. సాక్షి దినపత్రికలో సబ్ ఎడిటర్లుగా పని చేస్తున్నామని, ఆఫీసు నుంచి వస్తున్నామని చెప్పారు. అయినా వినిపించుకోకుండా గుర్తింపు కార్డులు చూపించాలంటూ బెదిరించారు. వెంకటేశ్ గుర్తింపుకార్డు చూపించగా... గుర్తింపుకార్డులు మీకెందుకు చూపించాలని రాములు ప్రశ్నించడంతో దిలీప్ అకారణంగా దూషిస్తూ ‘మా నాన్న పోలీసు’ అంటూ కాలర్ పట్టుకుని దాడి చేశాడు. ఇక్కడ విద్యుత్ స్తంభానికి కట్టేస్తామంటూ కొట్టుకుంటూ అక్కడికి తీసుకుని వెళ్లారు. అదే సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన హెడ్‌కానిస్టేబుల్ పద్మారావు ‘నేను పోలీసును రా ఎవరినైనా తంతా..’ అంటూ నోటికి వచ్చినట్లు దూషించి పిడిగుద్దులు కురిపించాడు. రాములు ప్రాధేయపడినా పట్టించుకోకుండా రాళ్లతో దాడిచేసేందుకు యత్నించారు. రాములు వారి నుంచి తప్పించుకుని వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ పద్మారావు, అతడి కుమారుడు దిలీప్, మరో ఇద్దరు బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వన్‌టౌన్ సీఐ తుల శ్రీనివాసరావు తెలిపారు. కాగా, తమపై దాడి జరుగుతున్న విషయాన్ని డయల్ 100కు సమాచారం అందించినా పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ సరిగా స్పందించలేదని బాధితులు తెలిపారు. పైగా హెడ్‌కానిస్టేబుల్ పద్మారావుకు మద్దతుగా మాట్లాడుతూ నీవు ఎందుకు వెళ్లావని నన్నే దబాయించాడని రాములు ఆవేదన వ్యక్తం చేశాడు. హెడ్‌కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలి.. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సాక్షి సబ్ ఎడిటర్లపై హెడ్‌కానిస్టేబుల్ పద్మారావు, అతని కుమారుడు దిలీప్, బంధువులు అకారణంగా దాడి చేయడాన్ని టీయూడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. వెంటనే నిందితులపై చర్య తీసుకోవాలని, పద్మారావును విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుని, జర్నలిస్ట్‌కు రక్షణ కల్పించాలని కోరారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంఘం బాధ్యులు వన్‌టౌన్ సీఐ తుల శ్రీనివాసరావును కలిసి విజ్ఞప్తి చేశారు. సీఐని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జానపట్ల మారుతి, కోశాధికారి తాండ్ర శరత్‌రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, సాక్షి కరీంనగర్ బ్యూరో ఇన్చార్జి ఆంజనేయులు ఉన్నారు. -
భయ బీభత్సాల కాలం
ఎమర్జెన్సీలో న్యాయ వ్యవస్థ, మీడియా ఇప్పుడు కొందరు అతిగా ప్రచారం చేస్తున్నదానికంటే తక్కువ ఆదర్శప్రాయంగానే పనిచేశాయి. ఎమర్జెన్సీ విధింపును అత్యున్నత ధర్మాసనం నిస్సిగ్గుగా ఆమోదించింది. ప్రభుత్వ సెన్సార్షిప్ను సవాలు చేసింది కూడా కొందరు పాత్రికేయులు, కొన్ని పత్రికలు మాత్రమే. నలభై ఏళ్ల క్రితం సరిగ్గా ఈ వారంలోనే ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. అది వేయి కోరల విషపు నాగు. దానికి ఇరుసు నియంతృత్వం. ఆ రక్కసి యంత్రపు చక్రాల్లోని కీలకమైన చువ్వల్లాంటి క్రూరులైన పోలీ సు అధికారులు ప్రజాస్వామ్య సౌధపు ప్రతి మూలస్తంభంపైనా పాశవిక రాజ్య ఉగ్ర వాద దాడులు సాగించారు. రాజ్య అతిక్రమణాధికారా లను, వ్యవస్థలను దాటి అనామక ప్రజల జీవితాల్లోకి సైతం విస్తరింపజేశారు. అంత విచక్షణారహితంగా స్వేచ్ఛను ఛిన్నాభిన్నం చేయడం సాధ్యమేనని 1975లో దేశం విశ్వసించలేకపో యింది. అంతకంటే విచిత్రంగా, 1975లో పుట్టని ఈ 2015 నాటి తరం స్వేచ్ఛకు వ్యతిరేకంగా అలాంటి కుట్ర ఒకటి జరిగిందని సైతం విశ్వసించలేకపోతోంది. ఆ వాస్తవం ఆహ్లాదకరంగా కంటే చేదుగా ఉండేది కావడమే అందుకు కారణం కావచ్చు. ఆత్మగౌరవంతో ఉండాలంటే బహుశా కొంత మతిమరుపు, పాత విష యాన్నే తిరిగి కనిపెట్టడం అవసరమేమో. ధీరోదాత్త తకు, లొంగుబాటుకు మధ్య నిష్పత్తి రెండో దాని వైపే బాగా ఎక్కువగా మొగ్గి ఉన్నప్పుడు, జ్ఞాపకశక్తి సక్రమం గా లేకపోవడం జాతీయ ఆరోగ్యానికి బహుశా మంచిది కామోసు. జూన్ 1975 నుండి మార్చి 1977 వరకు ఆ 20 మాసాలు అసాధారణమైనవి. ఆ తదుపరి దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల ఓటర్లు విముక్తి కోసం ఇచ్చిన తీర్పు దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి, భావి సవాళ్లకు అతీతంగా దాన్ని పునఃస్థాపించింది. ఆ కాలం గురించి రాసిన వ్యాఖ్యల్లో కొన్ని ఏమంత లోతులేని వాస్తవాన్ని గొప్ప ఐతిహాసికంగా చేసి, అతిగా ప్రచారం చేస్తున్నారు. న్యాయవ్యవస్థ, మీడియా అనే రెండు గొప్ప వ్యవస్థలూ ప్రభుత్వానికి సమీపంగా ఉండేవే అయినా సాంకేతికంగా దాని నియంత్రణకు బయటివే. అవి, వాటి సమర్థకులు నేడు చె బుతున్నదాని కంటే తక్కువ ఆదర్శప్రాయంగానే పనిచేశాయి. కార్యనిర్వాహక వ్యవస్థ అత్యవసర పరిస్థితి విధిస్తూ జారీ చేసిన అనైతిక ఆదేశా లను అత్యున్నత ధర్మాసనం నాలుగు-ఒకటి ఆధిక్యతతో నిస్సిగ్గుగా ఆమోదించి, అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో విషాదకరంగా సుప్రీం కోర్టే పిరికితనానికి మారు పేరుగా మారింది. అంటే అంతరార్థాన్ని ఉన్నది ఉన్నట్టు గా విడమరచాలంటే ఎలాంటి జవాబుదారీతనం వహిం చకుండానే ఎవరినైనా చంపే హక్కు సైతం ప్రభుత్వానికి ఉందనే. కేవలం కొద్ది మంది పాత్రికేయులు, కొన్ని పత్రికలు మాత్రమే ప్రభుత్వాన్ని, సెన్సార్షిప్ను సవాలు చేశాయి. నిజానికి సెన్సార్షిప్ జర్నలిజాన్నే అర్థరహితం చేసేసిందనుకోండి . ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సంపాదకుడు కులదీప్‌నయ్యర్ జైలుపాలైన పాత్రికేయుల్లో అత్యంత సుప్రసిద్ధులు. కానీ మిగతావారు అంత ప్రముఖులు కాకపోవడం వల్లనే ఎక్కువగా బాధలను అనుభవిం చారు. అలాంటి వారిలో వీరేంద్ర కపూర్ ఒకరు. ఆయన భార్య కూమీ కపూర్ అప్పట్లో ఎక్స్‌ప్రెస్‌లో రిపోర్టర్‌గా పనిచేసేవారు. ఆ కాలానికి సంబంధించిన చరిత్రపై తాజాగా ఆమె ఓ పుస్తకాన్ని రచించారు. తన స్వీయాను భవాలతో రాసిన ఆ పుస్తకానికి ఆమె సాదాసీదాగా ’ది ఎమర్జెన్సీ’ అని పేరుపెట్టారు. నేనింకా చదవలేదు. కానీ చదివిన వారు అది సర్వోతృష్టమైన రచన అంటున్నారు. గత 30, 40 ఏళ్లకు పైగా కాంగ్రెస్ దేశాన్ని ప్రత్యక్షం గానో లేక కూటమి రూపంలోనో పాలిస్తోంది. ఆ అధ్యా యాన్ని ప్రజా జ్ఞాపకం నుంచి చెరిపేయడానికి అది అధికారాన్ని ప్రయోగించింది. అదా ప్రయత్నంలో కొంత వరకు విజయవంతం అయ్యింది కూడా. అది చరిత్రను సెన్సార్‌షిప్‌కు గురిచేయడమే. అందుకే కూమీ పుస్తకాన్ని మన చరిత్ర సిలబస్‌లో చేర్చాలి. మొదట హఠాత్తుగా విరుచుకుపడి, ఆ మీదట విస్తరించే విషాదపు వలయా లుగా వ్యాపించిన ఆనాటి అణచివేత భీతి బరువును, ఆందోళనను అనుభవంలోకి తెచ్చేలా వర్ణించడం చాలా కష్టం. అపరిమితంగా, ఇష్టానుసారంగా సాగిన ఆరెస్టు లూ, వాటితోపాటు తప్పనిసరి చిత్రహింసలూ దీనికి ఒక కారణం మాత్రమే. అదీ నా దృష్టిలో అత్యంత ముఖ్య కారణం కాదు. కొద్ది నెలలకే, ప్రత్యేకించి ఇందిరా గాంధీ దర్బారు నిరంకుశ పాలనకు సంజయ్‌గాంధీ కేంద్రంగా మారాక... మాకిక భవిష్యత్తు లేదనీ, చాలా వలసానం తర దేశాల బాటలోనే రాజకీయంగా ప్రతిష్టను కోల్పో యిన నిరంకుశ పాలకుని నియంతృత్వానికి శాశ్వతం గానే మన దేశం కూడా లొంగిపోతుందని అనిపించ సాగింది. అత్యవసర పరిస్థితి విధింపునకు బహిరంగ సమర్థనలన్నీ కపటంతో కూడినవి, స్వీయ ప్రయోజ నాలను ఈడేర్చుకోడానికి ఉద్దేశించినవే. అలా అని అవి వారినేమీ తక్కువ శక్తివంతులను చేయలేదు. అభివృద్ధికి ఆటంకమంటూ ప్రజాస్వామ్యాన్ని కొట్టిపారేశారు. ప్రజా స్వామ్యాన్ని ప్రజలకు శత్రువని, వారి ఆర్థిక ఉన్నతికి అడ్డంకని నమ్మశక్యంకాని రీతిలో దూషించారు. ఆనాటి దర్బారులోని కొందరు సభ్యులు నేడు రూఢి చేస్తున్నట్టు సంజయ్‌గాంధీ కనీసం 20 ఏళ్లపాటైనా ఆ అత్యవసర పరిస్థితి కొనసాగాలని భావించారు. ఇలా ఫాసిజాన్ని రుద్దడాన్ని మన దేశం సహిం చేదేనా? ‘‘కాదు’’ అనేదే సమాధానమని విశ్వసిం చాలనే మనమంతా కోరుకుంటాం. కానీ పూర్తి నిజాయితీగా చెప్పాలంటే అలా అని కచ్చితంగా చెప్పలేం. రాజకీయ వేత్తలలోనూ, ప్రజలలోనూ కూడా నేడు స్పష్టత ఏర్ప డింది. అలాంటి మూర్ఖత్వాన్ని సూచించడం సైతం మాల్టోవ్ కాక్టెయిల్స్ (పెట్రోలు బాంబులు) అవసరం పడటానికి చాలా ముందే అపహాస్యానికి గురై నామ రూపాల్లేకుండా పోతుంది. మన స్వాతంత్య్రం నేడు ప్రచండమైన ఆత్మసంకల్పంతోనూ, సాంకేతికతతో నూ సురక్షితంగా ఉంది. కంప్యూటర్లులేని 1975లో ప్రజా స్వామ్య పరిరక్షకులుగా నిలిచిన వారు నేడు మనం ఎగతాళి చేయడానికి ఇష్టపడే రాజకీయవేత్తలలోని వారే కావడం విశేషం. జయప్రకాష్ నారాయణ్, ఆచార్య కృపలానీ, మొరార్జీ దేశాయ్ వంటి స్వాతంత్య్ర పోరాట కాలపు సీనియర్లు, వారికి కొద్దిగా వెనుక అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానీ, నానాజీ దేశ్‌ముఖ్, జార్జి ఫెర్నాండెజ్లతరం, అగ్రశ్రేణిలో నిలిచి సాగడానికి సిద్ధం గా ఉన్న అనుచర సేన నాటి ప్రతిఘటనలో ప్రముఖులు. అత్యవసర పరిస్థితి కాలపు జైలు ఖైదీలోని నేటి ప్రముఖు లలో ఒకరు మన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ‘ఇందిరే ఇండియా’ అని ప్రకటించిన ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు దేవ్‌కాంత్ బారువా, అత్యవసర పరిస్థితి ఆదేశాలపై ఆలోచించడానికిగానీ లేదా న్యాయ పరిశీలనకు గానీ ఆగకుండా వెంటనే సంతకం పెట్టేసిన రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ వంటి భజనపరులు సైతం ఉండేవారు నిజమే. అద్భుతమైన వ్యంగ్యచిత్ర కారుడు, రచయిత అబూ అబ్రహ ం... అహ్మద్‌కు సరిగ్గా సరిపోయే కార్టూన్ గీశారు. ఫక్రుద్దీన్ స్నానపు తొట్టె లోంచే అత్యవసర పరిస్థితి ప్రకటనపై సంతకం చేస్తున్న ట్టు చూపుతూ సంక్షిప్త మరణసందేశాన్ని లిఖించారు. దేశ రాష్ట్రపతి నైతికంగా నగ్నంగా నిలిచిన సమయమది. అయితే నేను అలాంటి భజనపరులను గట్టిగా శభాష్ అని మెచ్చుకుంటూ దీన్ని ముగిస్తాను. వారేగనుక లేకపోతే, మనం బహుశా ఎప్పటికీ స్వేచ్ఛను పొంది ఉండేవారమే 1977లోని అంతుబట్టని పెద్ద రహస్యం ఇదే. చట్టపరమైన నిర్బంధమేదీ లేకున్నా ఇందిరాగాంధీ సార్వత్రిక ఎన్నికలకు ఎందుకు పిలుపునిచ్చినట్టు? ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధిస్తారని నమ్మారు కాబట్టి. అలా ఆమెకు నమ్మిక కలిగించిందెవరు? ఇంటెలిజెన్స్ బ్యూరోలోని అత్యంత విధేయులైన పోలీసు అధికా రులు. లోక్‌సభలో ఆమె 250కి పైగా స్థానాలను సాధించి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారని వారు చెప్పారు. ఇందిర వారి మాటలు నమ్మింది. బతికించావురా భగవంతుడా! - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు